• మనం ఆత్మ పరిశీలనలో పడవలిసిన సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది. కుటుంబ సభ్యులు మిస్ కాకుండా కలిసి భోజనం చేయటం హ్యాపీ ఫ్యామిలీ ప్రధాన లక్షణమని నివేదిక వెల్లడించింది.కుటుంబ వాతావరణం హ్యాపీగా ఉండేందుకు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పటిష్టంగా ఉండేందుకు వారు ఎలా వ్యవహరించాలనే విషయంపై రెండువేల కుటుంబాల తల్లితండ్రులను ప్రశ్నించి ఈ నివేదిక రూపొందించారు. భోజనం టేబుల్ కుటుంబానికి క్యమునికేషన్ కేంద్రంగా అభిప్రాయాలు తెలుసుకునే వేదికగా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని 82 శాతం మంది తల్లితండ్రులు చెప్పారట. వారంలో ఒక రోజు సెలవును ఫ్యామిలీ మిస్ చేసుకోకూడదనీ ఎంత బిజీ ఉన్నా వారంలో కనీసం ఆరుగంటలు కలిసి వుండే ప్రయత్నం చేయాలనీ కలిసి కూర్చుని టీవీ లు చూడాలని కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదని పిల్లల ఎదురుగా వారించుకోకూడదని సర్వే అభిప్రాయాల్లో తేలింది. మొత్తానికి అనుభందాహాలు బతికించుకోవటానికి ప్రత్యేకం ఏవీ చేయనక్కర లేదనీ నిజాయితీగా సంతోషంగా కలిసి అన్నీ షేర్ చేసుకోవాలని తేలింది కదా. మరి మనిల్లు హ్యాపీ ఫ్యామిలీ యేనా ?

    హ్యాపీ ఫ్యామిలీ రహస్యం ఇదే

    మనం ఆత్మ పరిశీలనలో పడవలిసిన సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చింది. కుటుంబ సభ్యులు మిస్ కాకుండా కలిసి భోజనం చేయటం హ్యాపీ ఫ్యామిలీ ప్రధాన లక్షణమని నివేదిక…

  • పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా బిస్కట్లు కేకులు తింటారు. కానీ ఈ కేకులు బిస్కెట్లు మంచి ఫ్లేవర్ తో ఉండేందుకు గానూ వాడే ట్రాన్స్ ఫాట్ అనే కొన్ని రకాల కొవ్వు పదార్ధాలు మెదడు పనితీరు పైన తీవ్ర ప్రభావాన్ని చుపిస్తాయంటున్నారు పరిశోధకులు. క్రమేపీ జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదం ఉందంటున్నారు. బిస్కట్లు కేకుల్లో పంచదార రంగులు రకరకాల నూనెలు ఇవన్నింటిలో వచ్చే ప్రమాదం కంటే ట్రాన్స్ ఫాట్ వల్లనే సమస్య అంటున్నారు. ఊబకాయం గుండెకి సంబంధించిన సమస్యలు తప్పని సరిగా వస్తాయంటున్నారు. పేరున్న కంపెనీలు తాము తయారు చేసే తినే వస్తువుల్లో ఏవేం వాడతారో తప్పనిసరిగా ప్యాకింగ్ రేపర్ పైన ముద్రిస్తారు. ఈ ట్రాన్స్ ఫాట్ ఎక్కువగా కనిపించదు. కాకపోతే పళ్ళు పాడైపోతాయని జలుబు వస్తుందని తల్లితండ్రులు మొత్తుకున్నా బిస్కట్లు కేకులు మానేసే పిల్లలుండరు. కనక వాళ్ళకి ఇచ్చే మోతాదు మాత్రం తగ్గించండి. ఇంట్లో వండినవి పళ్ళు తినేలా ఎలాగోలా కష్టపడండి అంటున్నారు అధ్యయనాలు.

    బిస్కట్లు కేకులు సమస్యే

    పిల్లల నుంచి పెద్దల దాకా  ఎంతో  ఇష్టంగా బిస్కట్లు కేకులు  తింటారు. కానీ ఈ కేకులు  బిస్కెట్లు మంచి ఫ్లేవర్ తో ఉండేందుకు గానూ  వాడే ట్రాన్స్…

  • బంగారు కాంతి తో మెరిసిపోతూ వుంటుంది గుమ్మడి కాయ. ఎనెన్నో రకాల వంటకాలు చేసుకో గల ఈ గుమ్మడి కాయలో పోశకాలు మనవ దేహానికి ఎన్నో మినరల్స్ వున్నాయి. పులుసు కూర, హల్వా, ప్రపంచ వ్యాప్తంగా సూప్ ల తయారీ, ఫూడ్డింగ్స్, పాన్ కేక్స్, కురలు, జ్యూసెస్ ల్లో ఇవి వడేస్తున్నారు. దోస, కిర దోస, సార్ కర్జూర్ గుమ్మడి జాతికి చెందినవే. గుమ్మడి గింజలలో గుండె ఆరోగ్యాన్ని పెంచే మోనో అన్ సాట్యూరేటెడ్ ఫ్యాటి ఆసిడ్స్ పుష్కలంగా వున్నాయి. విటమిన్-ఎ బీటా కెరటినాయిడ్స్ లాంటి ఫ్లావనాయిడ్స్ వున్నాయి. వీటి వల్ల వాపులు నొప్పులు తగ్గుతాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బయటకు ఊడ్చి పారేసే ఈ ఫ్లావనాయిడ్స్ వయస్సు తో పాటు వచ్చే కంటి , జలుబులను రాకుండా ఆపుతాయి. చర్మం ముడతలు పదనియదు. కండరాల్ల బలం కోసం, అలసి పొతే శక్తి సమకూర్చేందుకు, మెదడు పని తీరు మెరుగు పరచేందుకు గుమ్మడి బంగారం వంటి ఆహారం. దీన్ని ఏ రకంగా వండి తిన్నా ఇందులో పషకాలు ఎక్కడికి పోవు.

    బంగారం వంటి ఆహారం గుమ్మడి

    బంగారు కాంతి తో మెరిసిపోతూ వుంటుంది గుమ్మడి కాయ. ఎనెన్నో రకాల వంటకాలు చేసుకో గల ఈ గుమ్మడి కాయలో పోశకాలు మనవ దేహానికి ఎన్నో మినరల్స్…

  • నిరంతరం ఏవో ఫంక్షన్లు వస్తూనే ఉంటాయి. తప్పనిసరిగా వెళ్తాము. గిఫ్ట్ కొనాలనిపిస్తుంది. కానీ ఎలాంటి గిఫ్ట్ . ఈ గిఫ్ట్ కొనే విశదయంలో మొదటి సూచన ఏవిటంటే ఎప్పుడూ ఎవరో ఒకర్ని వెంటబెట్టుకుని వెళ్లి వాళ్ళ అభిప్రాయాలూ సూచనలు అడగొద్దు. ఇలా అభిప్రాయం తీసుకుంటేనే కన్ఫ్యూజన్. మనం ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలనుకొన్నామో ఆ వ్యక్తి ఎవరో, ఎలా వుంటారో, అలవాట్లేమిటో మనకి తెలిసినట్లు మనతో స్నేహంగా వచ్చిన వాళ్ళకి తెలియదు. కనుక ఆ సలహా వినటం వదిలేసి వ్యక్తిగతంగా ఆలోచించుకుని చక్కని బహుమతి ఇవ్వాలి. బడ్జెట్ ప్రాబ్లమ్ లేకపోతే జీవిత కలం గుర్తుండిపోయే వస్తువుకొనచ్చు. ఆభరణాలు యాంటిక్ అలంకరణ వస్తువులు ఖరీదైన బహుమతులు ఇవ్వచ్చు. బహుమతి సర్ప్రైసింగ్ గా ఉండాలి. ఎదుటివాళ్ళ టేస్ట్ కు నచ్చే బ్రాండ్ సువాసనలు కలర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొన్ని వస్తువులు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్న వస్తువు ఇన్నోవేటివ్ గా ర్యాప్ చేసి ఇవ్వాలి. ప్యాకింగ్ సరదాగా ఎగ్సయిటింగ్ గా ఉండాలి. రిబ్బన్లు , స్టిక్కర్లు ,గ్లిట్టర్లను ఏదైనా ఉపయోగించి చక్కని సందేశంతో వున్న వ్యక్తిగత కార్డును జతచేసి ఇచ్చేస్తే బావుంటుంది.

    గిఫ్ట్ జీవిత కాలం గుర్తుండాలి

    నిరంతరం ఏవో ఫంక్షన్లు వస్తూనే ఉంటాయి. తప్పనిసరిగా వెళ్తాము. గిఫ్ట్ కొనాలనిపిస్తుంది. కానీ ఎలాంటి గిఫ్ట్ . ఈ గిఫ్ట్ కొనే విశదయంలో మొదటి సూచన ఏవిటంటే …

  • నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు. నీరు శక్తిని పెంచుతుంది. అలసట దూరం చేస్తుంది. మెదడులో ఎక్కువ శాతం నీరే కనుక నీరు తాగితే ఆలోచన పెరుగుతుంది. బరువు తగ్గిస్తుంది. భోజనం ముందు నీరు తాగాలి. శరీరంలోని వ్యర్ధాలు బయటకి పంపుతుంది. చర్మపు రంగును మెరుగు పరుస్తుంది. అరుగుదల, జీర్ణ ప్రక్రియకు నీరే అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సహజసిద్దమైన తలనొప్పి నివారిణి. బెనుకులు రాకుండా ఆపుతుంది. మంచి మూడ్ లో ఉంచుతుంది. ఇన్ని మంచి లక్షణాలు వున్న నీటిని ప్రతి రోజు ఒకటి రెండు గ్లాసుల నీటిని తాగడం మొదలు పెట్టాలి. కావలసినంత నీరు వుంది. జీవనానికి నీరే మూలం. మన శరీర కండరాలలో 75 శాతం నీరే. పోషకాలను శరీరం అంతటికీ సరఫరా చేసే రక్తంలో 82 శాతం నీరే. నీటిని అపురుపంగా వినియోగించుకొండి.

    అపురూపమైన పానీయం నీరు

    నీరు ఒక అద్భుతమైన పానీయం ఉచితం అమూల్యం పానీ లీటర్ బాటిల్ కొన్నామానుకున్నా సరే అది చాలా చౌకే కదా. ఈ నీటితో పది లాభాలు చెప్పుకోవచ్చు.…

  • బరువు తగ్గించుకోవాలని వుంటుంది. బాగా భోజనం చేయాలనీ వుంటుంది. ఇలా తాపత్రేయ పడే వారికోసం రకరకాల పరిశోధనలు అధ్యయనాలు జరుగుతూనే వుంటాయి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధనలు ఈ దిశలో పరిశోదన చేసి ఇష్టమైనవి తింటూ బరువు తగ్గే ఉపాయాలు కొనుకున్నారు. ఎలాగంటే నీటి వాళ్ళు ఎక్కువగా వుండే కూరగాయలు ఆరు కూరలు తినడం వల్ల బరువు పెరగదని గుర్తించారు. ఈ నిపుణులు చెపుతున్న దాని ప్రకారం కూరగాయలు, ఆరు కూరల్లో క్యాబేజీ, కలిఫ్లవర్, డబ్బపండు, లెట్యుస్, ముల్లంగి, పాలకూర వీటిల్లో నీటి పళ్ళు ఎక్కువ ఇవి తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గలనుకునే ఈ కూరలను ఆహారంలో చేర్చుకుంటున్నారు.

    తింటూనే బరువు తగ్గండి

    బరువు తగ్గించుకోవాలని వుంటుంది. బాగా భోజనం చేయాలనీ వుంటుంది. ఇలా తాపత్రేయ పడే వారికోసం రకరకాల పరిశోధనలు అధ్యయనాలు జరుగుతూనే వుంటాయి. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్  టోక్యో…

  • సినిమా జంటల్లో చాలా మంది వయసు అంతరం ఉన్న వాళ్లే శ్రీదేవి బోనీ కపూర్ ,జెనీలియా రితేష్ దేశముఖ్ దిలీప్ కుమార్ సైరా భాను ఇలా చాలా మంది కనిపిస్తారు. కానీ భార్యా భర్తల మధ్య వయసు అంతరం ఎక్కువగా ఉంటె అది ఆర్ధికంగా మానసికంగా చాలా సమస్యలకు కారణం అవుతుందనుటన్నారు ఎక్సపర్ట్స్. భర్త భార్య కన్నా పేదవాడైతే త్వరగా అనారోగ్యం పాలయ్యే అవకాశం వుందని భార్య అభద్రతకు గురవుతుందని చెపుతున్నారు. సమ వయస్కులు కొద్దిపాటి అంతరం ఉన్నా భార్య భర్తలు ఆలోచనా విధానం ఒకే రకంగా ఉంటుందనీ పెద్దగా అభిప్రాయ బేధాలు రావనీ సఖ్యతతో పాటు ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు అధ్యయనాలు. శృంగార పరమైన అసంతృప్తుల కారణంగా ఐ=ఒక్కసారి భార్యా భర్తలు విడిపోయే అవకాశాలే ఎక్కువని చెపుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం భార్యా భర్తల మధ్య ఇరవై సంవత్సరాల వ్యత్యాసం ఉంటె వాళ్ళు విడిపోయేందుకు 95 శాతం పది సంవత్సరాల తేడా ఉంటే 15 శాతం మాత్రమే విడిపోయే అవకాశాలున్నాయిట. ఐదు శాతం తేడా ఉంటే 15 శాతం మాత్రమే విడిపోయే అవకాశాలున్నాయిట. సమవయస్కులైతే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందిట.

    సమవయస్కులైతే జంట బావుంటుంది

    సినిమా జంటల్లో చాలా మంది వయసు అంతరం ఉన్న వాళ్లే శ్రీదేవి బోనీ కపూర్ ,జెనీలియా రితేష్ దేశముఖ్ దిలీప్ కుమార్ సైరా భాను ఇలా చాలా…

  • వయసు 40 దాటేసరికి జాయింట్ల ఫ్లెక్సిబిలిటీ సాధారణంగా తగ్గుతుంది. వీటికి తోలి లక్షణం బ్యాక్ పెయిన్. ఇందుకు ప్రధాన కారణం పూర్ పోశ్చర్. జీవన విధానం సరిగా లేకపోవటం డెస్క్ దగ్గర కూర్చునే తీరు వీటితో పాటు యవ్వనంలో ఉన్నప్పుడు ఉత్పత్తి అయినా ఎలాస్టిక్ తర్వాత ఉండక పోవటం అప్పుడు టిష్యులు పూర్తి ప్రోటీన్ తో ఉంటాయి. అయితే నలభైల్లోనూ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోగల మార్గాలు అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. వాకింగ్ స్విమ్మింగ్ లేదా నూరే ఇతర క్రీడా అయినా ఫ్లెక్సిబిలిటీ ని మెరుగు పరుస్తుంది. వార్మప్ లు స్టెచింగ్ ల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. యోగ పిల్లెట్స్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకునే మంచి మార్గాలు, సౌకర్యంగా ఉండే సమయంలో రెగ్యులర్ రొటీన్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి రోజు మూసు నిముషాలు చేసే వ్యాయామం వెన్నుముక్క బ్యాలెన్స్ ను మెరుగు పరుస్తుంది. ఏ స్ట్రెచ్ చేసినా 20 ,40 సెకెండ్ల అదే పొజిషన్ లో హాల్ట్ చేసి ఉంచాలి.

    నలభై 40 దాటేసరికి అయితే చదవండి

    వయసు 40 దాటేసరికి జాయింట్ల ఫ్లెక్సిబిలిటీ సాధారణంగా తగ్గుతుంది. వీటికి తోలి లక్షణం బ్యాక్ పెయిన్. ఇందుకు ప్రధాన కారణం పూర్ పోశ్చర్. జీవన విధానం సరిగా…

  • ఇప్పుడు కొత్త ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఇంట్లోంచి పని చేయటం ఇలాంటి సౌకర్యవంతమైన జాబ్ చేయాలంటే కొని ఏర్పాట్లు చేసుకుంటే పని ఒత్తిడి తెలియకుండా ఉంటుంది. ఆఫీస్ పని అయితే సహాయకులు కావలిసినవి వేళకు అందిస్తారు. ఇంట్లో ఆ వెసులు బాటు ఉండదు కనుక తినేందుకు తాగేందుకు అన్ని ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఒకేసారి పని పూర్తి చేసేసి మిగతా పనులు చూ ద్దామనుకుంటే అలసి పోవటం తప్పదు.నియమితమైన వేళలో పనిచేయటం భోజనం ,అల్పాహారం సరైన వేళకి తీసుకోవటం మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి అంటే ఫోన్ మాట్లాడటం సామజిక మాధ్యమాలు చూడటం కాదు ఏదైనా చదువుకోవటం చుట్టూ మనుషులతో మాట్లాడటం ఇవి ఉత్సాహం ఇచ్చే విశ్రాంతి లాంటివి. పనిచేసే గదిలో చక్కని సంగీతం వినివచ్చే ఏర్పాటు మంచి సువాసనలు రావటం పచ్చని చెట్లు పువ్వులు ఎదురుగ కనపడే ఏర్పాట్లు ఇవన్నీ మనసుని ఉత్తేజితం చేస్తాయి. ఉత్పాదకత పెరుగుతుంది.

    ఇంటి నుంచి జాబ్ చేస్తున్నారా ?

    ఇప్పుడు కొత్త ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఇంట్లోంచి పని చేయటం ఇలాంటి సౌకర్యవంతమైన  జాబ్ చేయాలంటే కొని ఏర్పాట్లు చేసుకుంటే పని ఒత్తిడి తెలియకుండా ఉంటుంది. ఆఫీస్ పని…

  • ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. కండరాలు నరాల వ్యవస్థ పని తీరు బావుండాలన్నా శరీరానికి కాల్షియం కావాలి. సాధారణంగా కాల్షియం టాబ్లెట్స్ వాడుతుంటారు. కానీ డైట్ తో పాటు ఆరెంజ్ ,సొయా మిల్క్ లాంటివి చేర్చుకుంటే ఈ టాబ్లెట్స్ అవసరం రాదు. కప్పు పాలల్లో 280 మి. గ్రా కాల్షియం ఉంటుంది. ఒక్క ఆరెంజ్ లోకాల్షియం తో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. సొయా పాలలో కూడా కాల్షియం విటమిన్ డి ఉంటాయి. కప్పు బాదం పాలు 457 మి. గ్రా కాల్షియం దొరుకుతుంది. అలాగే ప్రోటీన్స్ కూడా. అలాగే పెరుగులో ఎంతో కాల్షియం ఉంటుంది. పాలకు బదులు పెరుగు తీసుకున్నా కాల్షియం నిల్వల్లో ఇది టాప్ లిస్ట్ లోనే ఉంటుంది. జున్ను లో కూడా కాల్షియం ప్రోటీన్ నిల్వలుంటాయి. ఇక ఆకు కూరల్లో పాల కూర , తోట కూర ,బ్రొకోలీ వంటివి తిని తీరాలి. ఇవన్నీ అనుదినం తీసుకునే ఆహారంలో ఉంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

    కాల్షియం కోసం ఇవన్నీ తినాలి

    ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. కండరాలు నరాల వ్యవస్థ పని తీరు బావుండాలన్నా శరీరానికి కాల్షియం కావాలి. సాధారణంగా కాల్షియం టాబ్లెట్స్ వాడుతుంటారు. కానీ…

  • ఈ సీజన్స్ లో వచ్చే ఉసిరి నిజంగా ఆరోగ్యానికి దివ్యౌషధం అనే చెప్పాలి. ఇందులో C విటమిన్ తో పాటు ఐరన్ ,కాల్షియం , ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. పచ్చడి మురబ్బా క్యాండీ జ్యూస్ ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. ఇది సహజ సిద్దమైన కండీషనర్. ఉసిరి నూనె, వాడకం జుట్టు తెల్లబడటాన్ని తగ్గించటంతో పాటు ఆరోగ్యవంతమైన కేశ సంపదను ఇస్తుంది. ఉసిరి రోజు ఆహారంతో టీయూస్కుంటే చర్మానికి మంచి మెరుపొస్తుంది. కంటి చూపును మెరుగు పరిచి బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులకు ఔషధం పరగడుపున ఉసిరి రసం పుక్కిటపడితే నోటి పుండ్లు తగ్గుతాయి. ఉసిరిపొడి తేనే కలిపి తీసుకుంటే గొంతుమంట , జలుబు పోతాయి.

    ఉసిరి ఎంతో మంచిది

    ఈ సీజన్స్ లో వచ్చే ఉసిరి నిజంగా ఆరోగ్యానికి దివ్యౌషధం అనే చెప్పాలి. ఇందులో C విటమిన్ తో పాటు ఐరన్ ,కాల్షియం , ఫాస్ఫరస్ వంటి…

  • ఒక వయసు దాటాక గర్భం ధరిస్తే ఎన్నో సమయస్యలుంటాయని ఎంతో మంది అభిప్రాయం. కానీ తాజా పరిశోధనలు 35 దాటినా తర్వాత కలిగిన చివరి సంతానానికి మెరుగైన మేధాశక్తి ఉంటుందంటున్నారు. ఏడేళ్ల పాటు హార్మోనల్ గర్భ నిరోధక మాత్రలు వాడిన తర్వాత తల్లయిన వారి పిల్లలు ఎంతో తెలివిగా ఉంటారని తేల్చాయి పరిశోధనలు. 24 ఏళ్ళు ఇంకా ఎక్కువ వయసులో తొలిసారి గర్భవతులైతే వారిలో నిర్వహణా పటిమ ఏకాగ్రత వృత్తి పరమైన జ్ఞాపక శక్తి హేతు బద్ధత సమస్య పరిష్కారం సామర్ధ్యం మెరుగ్గా ఉంటుందని తేల్చింది. ఈ దశలో ఈస్ట్రోజెన్ ,ప్రొజెస్టెరాన్ హార్మోన్లు చైతన్యవంతంగా ఉన్నాయని ఇవి మెదడు రసాయన శక్తిని పనితనాన్ని అస్థిత్వాన్ని ప్రభావితం చేస్తాయని చెపుతున్నారు. వయసు ముదిరాక గర్భం దాల్చితే స్త్రీలలో ఈ హార్మోన్లు ఎక్కువ చైతన్యవంతంగా ఉన్నాయిట. అందుకే సంతానం కలగటంలో ఆలస్యమైనా నష్టం లేదని ఈ పరిశోధనలు స్పష్టం చేసాయి.

    ఈ వయసులో సంతానం మేలే

    ఒక వయసు దాటాక గర్భం ధరిస్తే ఎన్నో సమయస్యలుంటాయని ఎంతో మంది అభిప్రాయం. కానీ తాజా పరిశోధనలు 35 దాటినా తర్వాత కలిగిన చివరి సంతానానికి మెరుగైన…

  • వాషింగ్ మిషన్స్ వచ్చాక గృహిణి కి సగం శ్రమ తగ్గిపోయింది. ఇంతగా ఉపయోగ పడే వాషింగ్ మిషన్లు అన్ని రకాల దుస్తులు వేసేస్తే రంగులు అన్నింటికీ అంటుకోవడం కాకుండా జీన్స్ వంటివి వేస్తే ముందు పోగులు పాడై వస్త్రం రంగు మారిపోతుంది. గంటల తరబడి నానపెట్టి ఉతుకుతుంటే కూడా రంగు వెలుస్తుంది. ఉతికే నీటిలో ఓ చెంచా ఉప్పు వేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే సాక్సులున్ని మిషన్ లో వేస్తే సాగి గట్టి తనం పొందుతుంది. జిప్పులు వున్న ఏ దుస్తులైనా మిషన్ లో వేస్తే డ్రయర్ లో కి వచ్చే సరికి అవి పాడవుతాయి. టుర్కి టవల్స్ కూడా అంతే ఎక్కువ సేపు నానబెట్టినా పాడవుతాయి మిషన్ లో వేసినా పోగులు వూడి వచ్చి చాలా తొందరగా పాతవిగా అయిపోతాయి. మిషన్ లో వేసే ముందే బట్టల్ని విడదీసి బరువైనవి పొడవైనవి, రంగు అన్తుకోనివిగా చూసి పెట్టుకోవాలి.

    మెషిన్ లో వేస్తే పాడయిపోతాయి

    వాషింగ్ మిషన్స్ వచ్చాక గృహిణి కి సగం శ్రమ తగ్గిపోయింది. ఇంతగా ఉపయోగ పడే వాషింగ్ మిషన్లు అన్ని రకాల దుస్తులు వేసేస్తే రంగులు అన్నింటికీ అంటుకోవడం…

  • వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు అమలుచేస్తున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 125 దేశాల చట్టాలు అమలు చేస్తున్నాయి. కానీ ఈ చట్టాలు మహిళలలకు సత్వర న్యాయం కల్పిస్తున్నాయనే దాఖలాలు మాత్రం ఏవీ లేవు. చట్టాలున్నా బాధ్యత మహిళలు ఫిర్యాదు చేసేందుకుఅనుకూలమైన పరిస్థితులు లేవు. మూడేళ్ళలో గృహ హింసకు సంబంధించి దేశవ్యాప్తంగా 3. లక్షల కేసులు నమోదయ్యాయి. కాలం గడుస్తుంటే హింస రూపం మార్చుకుంటుంది. ఇప్పుడైతే ఇల్లు, బడి, గుడి, ఆఫీస్ ,బస్స్టాండ్ ,సినిమా హాల్ ,షాపింగ్ మాల్ , జన నమ్మకం ఉన్న ప్రదేశాలు ఏవీ మహిళలలకు వంద శాతం సురక్షితమైన ప్రదేశాలు కానేకావు. రేపు నవంబర్ 25వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆన్ వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్. కానీ హింసధ్వని అసలు ఎప్పటికైనా ఆగుతుందా?

    ఈ హింసధ్వని అసలు ఆగుతుందా ?

    వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు…

  • కాలీఫ్లవర్స్ ఒక్క తెలుపు రంగులోనే వచ్చేవి. ఇప్పుడైతే మొత్తం రెయిన్బో కలర్స్. నారింజ, ఆకుపచ్చ, వంకాయ, గులాబీ ఒకలాంటి ఎరుపు ఇవన్నీ ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఆహార ప్రియుల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. రంగుల కాలీఫ్లవర్ల లో ఆంఠో నైనిమ్లా బీటా కెరోటిన్లు ఎక్కువగా లభిస్తాయి కనుక అనేక వ్యాధుల్ని అరికడతాయి. పోషకాలు ఎక్కువగా పిండి పదార్ధాలు తక్కువ కనుక అన్నం బంగాళా దుంపలకు బదులు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఈ రంగుల కాలీఫ్లవర్ల కొవ్వులు ప్రోటీన్లు విటమిన్ C, E, K కాల్షియం ,ఇరన్ ఇంకా ఎన్నెనో ఉన్నాయి కనుక ఈ రంగుల కాలీఫ్లవర్స్ అన్నీ కలిపి తీసుకోవాలనీ అలాగే నూనెలో వేయించటం ఉడికించటం వద్దని కేవలం ఆవిరిపైన ఉడికించి సలాడ్ల రూపంలో తీసుకుంటూ ఇందులోని పోషకాలన్నీ శరీరానికి చక్కగా అందుతాయంటున్నారు పోషక నిపుణులు.

    రంగుల కాలీఫ్లవర్స్ తో పోషకాలు జాస్తి

    కాలీఫ్లవర్స్ ఒక్క తెలుపు రంగులోనే వచ్చేవి. ఇప్పుడైతే మొత్తం రెయిన్బో కలర్స్. నారింజ, ఆకుపచ్చ, వంకాయ, గులాబీ ఒకలాంటి ఎరుపు ఇవన్నీ ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఆహార…

  • ఈ కాలం అమ్మాయిలు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్స్ ఇంటి పనులు పిల్లల పనులు ఉద్యోగాలు ఇలా ఎన్నో పనులు చేయాలంటే మానసికంగా శారీరికంగా చాలా శక్తిగా ఉండాలి. అంచేత తీసుకునే ఆహారంలో పాల కూర అవిసెలూ టమాటాలు ఓట్స్ ఉండేలా చూసుకోండి. అంటున్నారు. న్యూట్రిషనిస్టులు. పాల కూరలో మేగ్నేషియం పుష్కలంగా ఉంటుంది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అవిసెల్లో వుండే యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు జీర్ణక్రియను సవ్యంగా ఉంచుతాయి. టొమాటోలు కొలెస్ట్రాల్ ను తగ్గించటం తో పాటు గుండె జబ్బులు దాడి చేయకుండా కాపాడతాయి. ఇక ఓట్స్ జీర్ణశక్తిని పెంచి బి.పి ని కంట్రోల్ లో ఉంచుతాయి. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. మనిషిలో ఉత్సాహం పెంచుతాయి. ఈ నాలుగు ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఆరోగ్యం గా ఉంటారు.

    అమ్మాయిలూ… ఇవి ఆరోగ్యం

    ఈ కాలం అమ్మాయిలు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. చదువుకుంటూ పార్ట్ టైమ్  జాబ్స్ ఇంటి పనులు పిల్లల పనులు ఉద్యోగాలు ఇలా ఎన్నో పనులు చేయాలంటే మానసికంగా…

  • తరచుగా తలనొప్పి బాధిస్తున్నా వర్కవుట్స్ కు ఇబ్బవండిగా ఉన్నా ఒక్కసారి శరీరానికి పై భాగం లో వుండే లో దుస్తులపై ఓ కన్నేసి చూడండి. అంటున్నారు లండన్ నిపుణులు. సరిగా ఫిట్ గానీ బ్రా స్ట్రాప్స్ ఇరిటేట్ చేసి ట్రాప్ జయిస్ కండరం పై వత్తిడి తెస్తాయి. ఈ కండరం మెడకు అక్కడ నుంచి భుజాలకు అనుసంధానం అవుతుంది. ఈ కండరం స్ట్రాప్స్ వత్తిడికి బిగుతైపోతూ మెడలు తలలో టెన్షన్ కు దారి తీస్తుంది. కణతలు వద్ద నొప్పి కళ్ళ వెనుక లేదా పుర్రె కిందుగా నొప్పి వంటి లక్షణాలుంటాయి. కాబట్టి మహిళల దీర్ఘ కాలిక నొప్పులతో బాధపడుతుంటే ఈ విషయం పరిగణలోకి తీసుకోమంటున్నారు నిపుణులు. విశాలమైన ప్యాడెడ్ స్ట్రాప్స్ వేసుకుంటే కారణం తెలియని తలనొప్పులు మాయం అవుతాయి. బిగుతైన లో దుస్తులు వేసుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లమే.

    బహుశా ఈ సమస్య కావచ్చు

    తరచుగా తలనొప్పి బాధిస్తున్నా  వర్కవుట్స్ కు ఇబ్బవండిగా ఉన్నా  ఒక్కసారి శరీరానికి పై భాగం లో వుండే లో దుస్తులపై ఓ కన్నేసి చూడండి. అంటున్నారు లండన్…

  • అందాల తార మార్లిన్ మన్రో 1962 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే మిస్టర్ ప్రెసిడెంట్ అనే చక్కని పాట పాడిందట. ఆ పాట పాడినప్పుడు మన్రో వేసుకున్న గౌను లాస్ ఏంజెల్స్ లో వేలం వేస్తే 4.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 32 కోట్ల చెల్లించి ది రిప్లిస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే మ్యూజియం కొనుక్కొందిట. మన్రో తల వెంట్రుకలు 8 వేల డాలర్లకు వేలం వేశారు. మన్రో ఆనాడు పాడిన పాట ఎంత మంది ఆనందించారో తెలియదు కాని ఒక్క గౌను ఖరీదు ఇన్ని కోట్లు పలికి ఇది రికార్డు సృష్టించింది.

    ఆమె గౌను విలువ 32 కోట్లు

    అందాల తార మార్లిన్ మన్రో 1962 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే మిస్టర్ ప్రెసిడెంట్ అనే…

  • సాఫ్ట్ డ్రింక్స్ దగ్గరనుంచి డిజర్ట్ లదాకా అనేక పదార్ధాలతో వాడే రైజన్లు అంటే ఎండు ద్రాక్ష పండ్లు ముఖ్యంగా శక్తి నిల్వలని చెపోచ్చు. ఎక్కువ క్యాలరీలు గల ఆహారం తినాల్సిన వాళ్ళు గుప్పెడు ఎండు ద్రాక్ష పండ్లు తింటే చాలు. వీటిల్లో వుండే సింపుల్ కర్బ్స్ ప్రధానంగా గ్లూకోజ్, ప్రక్టోజ్ శక్తి కి ముఖ్య అధరాలు. వీటి వల్ల ఎంత లాభం వుందంటే ఆకలి హార్మోన్ లైన లెప్టిన్ గ్రెలిన్లపై రైజన్లు నియంత్రణ కలిగి వుండి అతిగా తినటాన్ని అరికతట్టగలుగుతాయి. ఫలితంగా బరువు తగ్గిపోతారు. మానోపాజ్ దశ లో వున్న మహిళల్లో కొద్దిపాటి ఎండుద్రాక్ష తిన్న కాల్షియం లభించి ఎముకల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో రక్తాన్ని సుద్ధి చేసే గుణాలు వున్నాయి కనుక చర్మ కాంతి ఎక్కువై వృద్దాప్యభయాలు దగ్గరికి రావు. ప్రతి రోజు తీసుకొనే ఆహారంలో ఓ టీస్పూన్ నానబెట్టిన ఎండు ద్రాక్ష తీసుకుంటే చాలు.

    రైజన్లు బెస్ట్ హెల్త్ జెమ్స్

    సాఫ్ట్ డ్రింక్స్ దగ్గరనుంచి డిజర్ట్ లదాకా అనేక పదార్ధాలతో వాడే రైజన్లు అంటే ఎండు ద్రాక్ష పండ్లు ముఖ్యంగా శక్తి నిల్వలని చెపోచ్చు. ఎక్కువ క్యాలరీలు గల…

  • ఈ ఎనిమిదేళ్ల పాప కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతం బందీ పోదకు చెందిన తజముల్ వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్ -8 టైటిల్ గెలుచుకుంది. ఏ రంగంలో అడుగుపెట్టిన మొదటి కాశ్మీర్ అమ్మాయిగానే ఈ టైటిల్ గెల్చుకున్న మొదటి భారతీయ చిన్నారిగా కూడా తజముల్ తన గొప్ప తనాన్ని చాటుకుంది. ఇటలీలో జరిగిన ఈ పోటారీ చైనా అమెరికా కెనడా దేశాలకు చెందిన పిలల్లు పాల్గొన్నారు. తజముల్ తండ్రి టాక్సీ డ్రైవర్. సరైన మీఅదనం కూడా లేని స్కూల్లో చదివే తజముల్ ఆమె కోచ్ ఫైజల్ అలా కష్టపడి ట్రైనింగ్ ఇస్తున్నాడు. సరైన శిక్షణ దొరికితే ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా సాధించే శక్తి వుంది తజముల్ కు.

    కిక్ బాక్సింగ్ ఛాంపియన్ ఈ పాపాయి

    ఈ ఎనిమిదేళ్ల పాప కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతం బందీ పోదకు చెందిన తజముల్  వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్ -8 టైటిల్ గెలుచుకుంది. ఏ రంగంలో…