• నీహారికా, ఒక్క కొత్త నివేదిక వచ్చింది చూడు. భారత్ లో ఏటా 67 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని అంచనా. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో అసలు మొత్తం వార్షిక ఉత్పత్తులు 40 శాతం అంటే 8.3 బిలియన్ డాలర్ల మేర ఆహారం వృధా అవ్వుతుంది. ఇప్పుడు ఆ ఆహారం వృధా చేస్తున్న వారి లిస్టులో మనము ఉన్నామా అని చెక్ చేసుకోవాలి. ఎలాగంటే కూరలు, పండ్లు, పచారీ సరుకులు కావలసినంత వరకే కొని ఇంట్లో శ్రద్దగా వాడుకుంటున్నాము. ఆఫర్లు, డిస్కౌంట్లు చూసి అవసరం లేనివన్నీ కొంటున్నామా? అప్పుడు ఆహారం, డబ్బు రెండూ వృధానే కదా ఇంకా నీహారికా, మనం అల్పాహారమైనా, భోజనమైనా ఎంత కావాలో అంతే ప్లేట్ లో పెట్టుకోవాలి. హోటళ్ళు రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కావలసినంతే ఆర్డర్ ఇవ్వాలి. ఒక వేళ మిగిలితే మోహమాట పడకుండా పార్సిల్ చేసి ఇవ్వమని అడగాలి కూడా ఎవరికైనా ఇవ్వొచ్చు. లేదా మనమే తినొచ్చు తప్పేముంది. అనవసరమైన భేషజాలు దండగ. అలాగే ఇప్పుడు పార్టీలు, పెళ్ళిళ్ళలో వృధా అయ్యే ఆహారం లెక్కేలేదు. మెనూ జాబితా చుస్తేనే అస్సలు ఇందులో సగం పదార్ధాలైనా టేస్ట్ చేయగలమా అనుకుంటాము. ఇలాంటివాన్ని కాస్త చుసుకోగాలమేమో. 2013లో వచ్చిన ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం 78 ఆకలి దేశాల జాబితా లో భారత్ రాంక్ 63 గా వుంది. ఇప్పటి నివేదిక అందరికీ తిండి చేరడమే లేదంటోంది. మనకి ఎందుకు బాధ్యత లేకుండా పోయింది?

    44 వేల కోట్ల రూపాయిల ఆహారం వృధా

    నీహారికా, ఒక్క కొత్త నివేదిక వచ్చింది చూడు. భారత్ లో ఏటా 67 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని అంచనా. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న…

  • నీహారికా, ఇవ్వలొక కథ చెపుతాను. సమాజంలో పది మందితో కలిసి జీవించడం వల్ల కలిగే లాభం గురించిన కథ. ఒక ఇంజనీరు ఫ్యాక్టరీలో పనిచేస్తూ సమయం చూసుకోలేదు. ఏదో యంత్రం బాగుచేసే పనిలోవుండి. దాన్ని పూర్తిచేసి చూస్తే ఎవళ్ళూ లేరు. బయట తాళాలు వేయడం, లైట్లు తీయడం తెలుస్తూనే ఉన్నాయి. ఇక ఈ రాత్రికి ఈ వేడిలో మంచినీళ్ళు, భోజనం లేకుండా గడవాలి కాబోలు అనుకొంటూ వుంటే, కొన్ని గంటల తర్వాత ఎవరో తాళం తీసి లోపలకు వచ్చిన సవ్వడి వినిపించింది. తాళం తీశారెవరో టార్చి లైట్ ఇంజనీరు పైన పడింది. వచ్చింది సెక్యూరిటీ గార్డ్స్. నేనిక్కడ చిక్కుకుపోయానని ఎలా గ్రహించారు అన్నాడు ఇంజనీరు. సార్ ఇంతమంది ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తూనే ఉన్నా నాకెవ్వరూ డ్యూటికి వస్తూ గుడ్ మార్నింగ్, వెళుతూ గుడ్ నైట్ చెప్పేది మీరొక్కరే. ఈ రోజు గుడ్ మార్నింగ్ చెప్పారు, గుడ్ నైట్ కోసం ఎదురు చూశాను. మీరు వాపస్ వెళ్లలేదని నాకు ఖచ్చితంగా అనిపించింది. అందుకని వెతుక్కుంటూ వచ్చానన్నాడతను. ఇది కథే కానీ వాస్తవం. అందరితో సఖ్యతగా, ప్రేమగా, గౌరవoగా వ్యవహరించాలని ఎప్పుడూ ఏదైనా ఇస్తూ వుంటే తిరిగి ఏదో రూపంగా మనకు వస్తూ ఉంటుందని చెప్పే మంచి కథ. తప్పకుండా గుర్తుంచుకో.

    ఇవ్వండి! ఆ ఇచ్చింది తిరిగివస్తుంది

    నీహారికా, ఇవ్వలొక కథ చెపుతాను. సమాజంలో పది మందితో కలిసి జీవించడం వల్ల కలిగే లాభం గురించిన కథ. ఒక ఇంజనీరు ఫ్యాక్టరీలో పనిచేస్తూ సమయం చూసుకోలేదు.…

  • నీహరికా, చక్కని ప్రశ్న, మనల్ని మనం అర్ధం చేసుకోకుండా ఎదుటి వాళ్ళదే తప్పు అని నిర్ణయానికి నిమిషంలో వచ్చేస్తున్నారు. ఇదెంత వరకు సబబు అన్నావు. అస్సలు కానే కాదు. మాన్ దగ్గర, మన స్నేహంతో వుండేవాళ్ళని నీదే తప్పులే అని తేల్చేసే ముందర ఎవరికీ వాళ్ళు పరిశీలించుకోవాలి. ఇది కొంచం అసౌకర్యమే ఎవరి తప్పులు వాళ్ళు ఎంచుకోగలమా? మన ఆలోచనే తప్పనుకోగలమా అంటే స్వీయ విశ్లేషణ అన్నది కీలకమైనదే కదా? మనలోని ఫీలింగ్స్ ప్రతిసారి క్లియర్ కట్ గా వుండవు. వాటిని అవగాహనా లోపం చేసుకునేందుకు కొంత సమయం కావాలి. జాగ్రత్తగా ఆలోచిస్తుంటే నొప్పించే భావాలు ఇట్టే తగ్గిపోతాయి. జీవితంలో స్ట్రగుల్ అవ్వుతున్నప్పుడు కొన్ని సార్లు వాటి ప్రభావాన్ని ఇతరుపైకి తోసి వారి పై ఆరోపణలు చేస్తారు. అసంకల్పితంగా అనకు. మన వ్యక్తిగత వత్తిడిని ఇతరులపై నెట్టేందుకు ఇలా మనస్సును ప్రోత్సహిస్తుంది. తప్పు ఎదుటి వాళ్ళదే అని ఫోర్స్ చేస్తుంది. అందుకే ముందుగా ఎవరికి వాళ్ళు అర్ధం చేసుకోవాలి. అలా విశ్లేశిస్తేనే అసలు ఎవ్వరిది తప్పు? అనవసరంగా అపార్ధం చేసుకున్నానా? ఎదుటి వాళ్ళను ఎంతో బాధ పెట్టాం అన్న ఆలోచనలన్నీ వచ్చేస్తాయి.

    మన కంప్లయిట్స్ ఎదుటి వాళ్ళ పైనా?

    నీహరికా, చక్కని ప్రశ్న, మనల్ని మనం అర్ధం చేసుకోకుండా ఎదుటి వాళ్ళదే తప్పు అని నిర్ణయానికి నిమిషంలో వచ్చేస్తున్నారు. ఇదెంత వరకు సబబు అన్నావు. అస్సలు కానే…

  • నీహరికా, ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికోసం వచ్చిన అద్భుతమైన రిపోర్టు. మనల్ని మనం ప్రేమించుకోకుండా శ్రద్ధ తీసుకోకుండా ఉంటేనే అన్ని రకాల ఆందోళనలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రేమించుకోవడం అంటే ముందర సుఖంగా నిద్రపోవడం ఫస్ట్. అనవసరమైన ఆందోళన, పని వత్తిడి, రేపు ఉదయపు కార్యక్రమాలు మనస్సులో నింపుకుని మంచం పైన వాలినా నిద్రెలా పడుతుంది. అలాగే ఆనందంగా వుండటం కోసం కాకుండా మనపై మనకున్న ప్రేమకు గుర్తుగా చెక్కగా అలంకరించు కోవడం. ఏ స్పాకొ, సెలూన్ కొ వెళ్ళడం చెక్కగా తీర్చిదిద్దుకోవడం ఇవీ అవసరమే. ఎలాగోలా లెద్దూ, అబ్బా ఇంత పని పెట్టుకుని అనుకొనే నిర్లక్ష్యం చేసుకోకండి అంటున్నారు. ఇది మరి మంచి పాయింటే కదా. అలాగే ఇప్పటి వరకు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో వాటిని ప్రయత్నించి చూడటం అన్నింటికంటే ముఖ్యం . అది చిన్నదా పెద్దదా అని కాదు, మన వల్ల కాదులే అని వదిలేసేవి. కానీ ఒక్కసారి ట్రై చేస్తే ఆ పని చేయగలిగితే.... ఎందుకు కాదో ఏపనైనా అస్సలు మన వల్ల కాకపోతే అసలు ఇంకెవరి వల్లా కాదనుకోండి. ఇంక అవన్ని అయిపోయినట్లే అంటున్నారు. అనుభవంతో చెపుతున్న విషయాలు ఆచరిస్తే పోలేదూ! నీహరికా, ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికోసం వచ్చిన అద్భుతమైన రిపోర్టు. మనల్ని మనం ప్రేమించుకోకుండా శ్రద్ధ తీసుకోకుండా ఉంటేనే అన్ని రకాల ఆందోళనలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రేమించుకోవడం అంటే ముందర సుఖంగా నిద్రపోవడం ఫస్ట్. అనవసరమైన ఆందోళన, పని వత్తిడి, రేపు ఉదయపు కార్యక్రమాలు మనస్సులో నింపుకుని మంచం పైన వాలినా నిద్రెలా పడుతుంది. అలాగే ఆనందంగా వుండటం కోసం కాకుండా మనపై మనకున్న ప్రేమకు గుర్తుగా చెక్కగా అలంకరించు కోవడం. ఏ స్పాకొ, సెలూన్ కొ వెళ్ళడం చెక్కగా తీర్చిదిద్దుకోవడం ఇవీ అవసరమే. ఎలాగోలా లెద్దూ, అబ్బా ఇంత పని పెట్టుకుని అనుకొనే నిర్లక్ష్యం చేసుకోకండి అంటున్నారు. ఇది మరి మంచి పాయింటే కదా. అలాగే ఇప్పటి వరకు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో వాటిని ప్రయత్నించి చూడటం అన్నింటికంటే ముఖ్యం . అది చిన్నదా పెద్దదా అని కాదు, మన వల్ల కాదులే అని వదిలేసేవి. కానీ ఒక్కసారి ట్రై చేస్తే ఆ పని చేయగలిగితే.... ఎందుకు కాదో ఏపనైనా అస్సలు మన వల్ల కాకపోతే అసలు ఇంకెవరి వల్లా కాదనుకోండి. ఇంక అవన్ని అయిపోయినట్లే అంటున్నారు. అనుభవంతో చెపుతున్న విషయాలు ఆచరిస్తే పోలేదూ!

    నేనంటే నాకెంతో ఇష్టం

    నీహరికా, ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికోసం వచ్చిన అద్భుతమైన రిపోర్టు. మనల్ని మనం ప్రేమించుకోకుండా శ్రద్ధ తీసుకోకుండా ఉంటేనే అన్ని రకాల ఆందోళనలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.…

  • సేవలో కూడా సెలబ్రెటీలే

    నీహారికా, సాటివాళ్ళకు ఎంతో కొంత సేవ చెయ్యడం ముఖ్యమైన బాధ్యతేనంటావా అన్నావు. కొంతమంది అందరు ఎంతో కొంత చేయాలి. అందాల సామంత నీకు ఇష్టం అన్నావు కదా.…

  • నీహారికా, చిన్ని చిన్ని తప్పులకే ఇంట్లో వాళ్ళయినా, దగ్గరివాళ్ళు, అక్కాచెల్లెళ్ళు ఎదో ఒక సూటి పోటీ మాట అంటుంటారు. అవే చెవుల్లో మోగుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా మరచిపోలేక పోతున్నా అన్నావు. ఒక్కటే పరిష్కారం ముందు ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారు అంటే అది మనస్సులో ఏదైనా తప్పు ఉంటేనే అన్నారా అని ఎనలైజ్ చేసుకుంటే, ఒక వేళ తప్పు మనదే అయితే బాధ పడటం దండగ. పోయి సారీ చెప్పడమే లేదా పెద్ద వాళ్ళు కోపంతో అన్నారా అది మరచిపోయేందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడు హాయిగా పడుకునో, కూర్చునో, చల్లగా వర్షం పడుతున్నట్లు చుట్టూ వానల్లో విహరిస్తూ వున్నట్లు ఊహించకు. లేదా మంచి హాస్య కధ చదువుకోఇవన్నీ కాదంటావా? ఒక పేపర్ పైన నీ మనస్సులో కలిగే ప్రతికూలమైన బాధాకరమైన విషయాలు ఏముంటే అవి రాసి చించి అవతల పారేయి. సగం మనస్సులో శాంతి కలుగుతుంది. ఏదైనా వ్యాయామం, స్ట్రెచ్ యోగా చేయి. ఇలా కాదా.... నీ తప్పు ఏవీ లేదని, అనవసరంగా మాట అన్నారని, తట్టుకోలేకపోతున్నానని చెప్పేయి. ఇది ఆఖరు పరిష్కారం.

    మనస్సులో బాధ చెప్పేస్తే పోతుంది.

    నీహారికా, చిన్ని చిన్ని తప్పులకే ఇంట్లో వాళ్ళయినా, దగ్గరివాళ్ళు, అక్కాచెల్లెళ్ళు ఎదో ఒక సూటి పోటీ మాట అంటుంటారు. అవే చెవుల్లో మోగుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం…

  • పాపం వాళ్ళ తప్పు ఏముంది?

    నీహారికా, సినిమాల్లో ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఆరిందల్లా మాట్లాడుతూ వుంటే వినేందుకు చిరాకు గా ఉంటాయి కదా… పిల్లలకు అస్తమానం టీ.వినే కాలక్షేపం అయిపోయింది. ఎవరి పనుల్లో వాళ్ళు…

  • రెండూ అద్భుతమైన కళలే

    నీహారికా, మాట్లాడటమా? వినడమా? ఏది మంచి కళ అన్నావు. మాట్లాడటం సందేహం లేకుండా మంచిదే. కానీ వినడం కూడా మంచిదే తెలుసా ఎక్స్ పర్ట్స్ అంటారు, మనం…

  • నీహారికా, కొంచెం బద్ధకంతో ఇవ్వాల ఈ పని పోస్ట్ పోన్ చేసానన్నమాట నీ నోటి వెంట తరచూ వినబడుతుంది. నీకు తెలుసా ఎన్ని మంచి లక్ష్యాలున్నా విజయం సాధించాలి అని ఎంత బలమైన కోరిక వున్నా వాయిదా వేసే తత్వం వుంటే చాలు అవన్నీ నిష్ప్రయోజనం అవుతాయి. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తేనే ప్రయోజనం వుంటుంది. అలా కాకుండా చేద్దాంలే, చూద్దాంలే అని వాయిదా తత్వం వల్ల ఎలాంటి మంచి పని ఉపయోగ పాడేది, అవసరమైన పని అయినా సరే చివరి క్షణంలో హడావిడిగా ముగించేయవలసి వస్తుంది. అనుకున్న పనులేవీ కావు. న్యాయంగా ఒక పని వెంటనే పూర్తి చేయ గలిగితే ఆ ఏర్పడే సంతృప్తి తాయారు సంతోషం వల్ల మనసంతా తేలికగా అయిపోతుంది. అలా కాకుండా వాయిదాలతో మూల పడిన పని వల్ల మనదికమైన నిరాశ, చేతులారా పక్కన పదేసామనే అసంతృప్తి తెలియని అసహానానికి గురిచేస్తుంది. కనుక ఎప్పటి పని అప్పుడు వాయిదాలో లేకుండా, రేపు చూద్దాంలే అనుకోకుండా వెంటనే పూర్తి చేయాలిఇది జీవితంలో మొదటి ప్రయారిటి కావాలి. వాయిదాలు వేయోద్దు.

    వాయిదా తత్వంలో అంతా నిరాశే

    నీహారికా, కొంచెం బద్ధకంతో ఇవ్వాల ఈ పని పోస్ట్ పోన్ చేసానన్నమాట నీ నోటి వెంట తరచూ వినబడుతుంది. నీకు తెలుసా ఎన్ని మంచి లక్ష్యాలున్నా విజయం…

  • మనిషికి ఈ మాత్రం మనసుండాలి

    నీహారికా, నీకో మంచి వ్యక్తిని పరిచయం చేయాలి అనుకున్నాను. చాలా మంది చాలా మంచి పనులు చేస్తేనే ఈ ప్రపంచలో కొందరైనా సుఖంగా వున్నారు. ఇతని పేరు…

  • నీహారికా, ప్రతి నిమిషం విలువైనదే అంటారు, దాన్ని అపురూపంగా అనుభవించాలి అంటారు. ఎలా అన్నావు. సంతోషంగా ఆనందంగా అనాలి. అదెలాగా అంటావు. మనం ఎక్కువ సంతోషాన్ని పొందుతామో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అంతగా ఆనందం ఇవ్వని విషయాలకు చివరి ప్రాధాన్య ఇవ్వాలి. అంటే ప్రాధాన్యత ప్రాముఖ్యలను పాటిస్తే ఎప్పుడుసంతోషంగా వుండటం కష్టం కాదు. సంతృప్తి అన్నది సంతోషంలో సగం ఎప్పుడూ అసంతృప్తి తో వుంటే దేనిలోనూ సంతోషం అనుభవించ లేము. మన పైన మనం ఇష్టాన్ని పెంచుకోవడం ఒక పద్దతి. ఇది మాన పట్ల మనకి వున్న నమ్మకం ఎక్కువ చేస్తుంది. ప్రతి నిమిషం సంతోషంగా వుండటం లో ఇది చాలా ముఖ్యం. మనల్ని మనం సంతోష పెట్టుకునేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తాం. ఏది సంతోషం ఇవ్వగలదో కనిపెడదం. ఇతరుల తో ప్రేమగా వుండటం లో సంతోషం దొరికితే ప్రేమిస్తాం. కొత్త విషయాలు తెలుసుకోవడం బావుంటే తలుసుకుంటాం. ఆటలు ఇష్టమైతే ఆడతాం. బలహీనతలు వదులుకోవడం ఇష్టమైతే వైలేస్తాం. ఏదైనా చేస్తున్నాము అంటే ప్రతి నిమిషం ఆనందంగా గడపడం కోసం అవన్నీ చేస్తామని చేయగలమని తెలుసుకోవాలి. అంటే కానీ ప్రతి నిమిషం విలువైనది ఎలా సంతోషిస్తాం అంటే ఇలాగే చేసే పనుల్లో మన చర్యల్లో, మన భావాల్లో, ఆలోచనల్లో మార్పులు తెచ్చుకుంటూ ప్రతి నిమిషాన్ని ఆస్వాదించే దిశగా నడుస్తాం. ప్రతి నిమిషం విలువైనదే మరి దాన్ని అపురూపంగా అనుభవించాల్సిందే కదా!!

    నిమిషం విలువని తలుసుకుంటే అనుభవిస్తాం

    నీహారికా, ప్రతి నిమిషం విలువైనదే అంటారు, దాన్ని అపురూపంగా అనుభవించాలి అంటారు. ఎలా అన్నావు. సంతోషంగా ఆనందంగా అనాలి. అదెలాగా అంటావు. మనం ఎక్కువ సంతోషాన్ని పొందుతామో…

  • నీహారికా, పాజిటివ్ ధింకింగ్ సరే కానీ దేన్నెయినా పాజిటివ్ ఎలా తీసుకోవాలి అన్నావు చాలా కరెక్ట. ముందు మన చుట్టూ ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఎలా అంటే మన స్నేహితుల్లో కొందరు ఇప్పుడు ఇతరుల్లో లోపాలు ఎంచేవాళ్ళు ఉన్నారు అనుకుందాం, మొదటిగా వాళ్ళకు దూరంగా వుండాలి. చుట్టూ వుండే వాతావరణం మనసు పైన ప్రభావం చూపెడుతుంది. ఎక్కువ సేపు ప్రక్రుతిలో గడిపితే ఆ ఫీలింగ్ ఆత్మవిశ్వాసం తో పాటు పాజిటివ్ నెస్ ను పెంచుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. మరి అంత సమయం ప్రకృతి లో గడిపడం సాధ్యమా అనుకుంటే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నాం? ఏం చేయాలి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎలా మెలగాలి. ఒక చిన్న మాటతో అవతలి మనిషి మొహం లో చిరునవ్వు పోయిన విషయం మనకేం అనిపించింది. ఒక మనిషిని కాస్త సంతోష పెడితే ఆ ఆనందం మనకెంత సేపు సంతోషంతో వుంచింది ఇదే పాజిటివ్ ఫీలింగ్స్ ని అలవరచుకునే పద్దతి. ఒక సారి ఈ దిశగా ఆలోచించడం మొదలు పెడితే అలవాటుని ప్రతి అంశాన్ని పాజిటివ్ గా చూసే శక్తిని ఇస్తుంది. ఇష్టమైన పనులు చేస్తే మానస్సు ఆనందంగా వుంటుంది. పాజిటివ్ గా వుండటం జీవితంలో ఒక భాగం అయిపోతుంది.

    సంతోషం ఇస్తే వచ్చేస్తుంది

    నీహారికా, పాజిటివ్ ధింకింగ్ సరే కానీ దేన్నెయినా పాజిటివ్ ఎలా తీసుకోవాలి అన్నావు చాలా కరెక్ట. ముందు మన చుట్టూ ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. ఎలా…

  • నీహారికా, కొత్త సంవత్సరం తీర్మానాలుచేసుకున్నాను కానీ దానికి కట్టుబడి వుండటం చాలా కష్టం. అలా ఎవరైనా వుంటారా అన్నావు. నిజమే ప్రతి అరంభంలోనూ కొత్త నిర్ణయాలుతీసుకోవడం సాధారణంగా జరిగేదే. ఉదాహరణకు ఏడాది ముగిసేలోగా పది కిలోల బరువు తగ్గాలి అని తిర్మానించుకున్న మనకు దానికి తగ్గ కమిట్ మెంట్ వుండాలి. పెట్టుకునే లక్ష్యం వాస్తవానికి దగ్గరగా వుంటే ఫలితాలకి చిరుకుగలం. తీర్మానాలు సాధించగలమని ముందుగా మనస్సుకో నిర్ణయం వుండాలి. అలాగే వ్యక్తి గత డేడ్ లైన్స్ వుండాలి. వచ్చిన ఆలోచనను దృఢమైన ద్రుక్పడంలో అందుకోగలగాలి. ఇందుకోసం జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు కూడా. ఈ మార్పులకు ముందుగా మన మనస్సు సిద్దమై వుంటే తర్వాత శరీరం కూడా కొన్ని విషయాలలో పట్టుదలకు తలవంచుతుంది. సానుకూలమైన స్పందనతో మిగతా పనులు సజావుగా జరుగుతాయి. ఒక్కోసారి అనుకొన్న పనులు పూర్తి కాక పోవచ్చు. సాధించలేకపోవచ్చు. వైఫల్యాలు రావచ్చు. వాటన్నింటికీ షార్ట్ టంపర్ తో సమాధానం చెప్పుకోకూడదు. తీర్మానాల వెనక అనుకూల దృక్పదం వుండాలి. అప్పుడే అనుకొన్నవి సాధ్యపడతాయి.

    ఫెయిల్యూర్స్ కూడా మంచి అనుభవాలే

    నీహారికా, కొత్త సంవత్సరం తీర్మానాలుచేసుకున్నాను కానీ దానికి కట్టుబడి వుండటం చాలా కష్టం. అలా ఎవరైనా వుంటారా అన్నావు. నిజమే ప్రతి అరంభంలోనూ కొత్త నిర్ణయాలుతీసుకోవడం సాధారణంగా…

  • నీహారికా, తప్పు వప్పుకోవడం చాలా కష్టం కాదు అని అడిగావు. మరి కష్టమే కానీ అవసరం కదా. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు కదా. చేస్తారు వాస్తవాన్ని అంగీకరిస్తే తప్పులు ఒప్పుకోవచ్చు. క్షమాపన మరింత వేగంగా అడగగలరు. తప్పు అంగీకరించడం అంటే మానసిక ప్రశాంతతని పొందగలగడం. కొన్ని సందర్భాలలో ఎప్పుడో జరిగి పోయినవి మనస్సులో పెట్టుకుని అవతల వాళ్ళను దెబ్బతీస్తాం. అవతల వాళ్ళపై విజయం సాధించామని అనిపిస్తుంది కానీ అవతల వాళ్ళను బాధ పెట్టామన్న బాధ ముందు మన మనస్సుకే కలుగుతుంది. ఇలాంటి తొందర పాటు తో స్నేహాలను దూరం చేస్తుంది. అవతల వాళ్ళ తప్పను మనస్సులో క్షమించి వదిలేయగలిగితే వారంతట వారే తమ తప్పు తెలుసుకుని ముందకు రావొచ్చు. ఇది సహనం తో అవతలి వాళ్ళ తప్పు ఒప్పించే పద్దతి. కలుపుగోలు మనిషి అని గుర్తింపు తెచ్చేడి కేవలం కబుర్లు కాదు. సందర్భానుసారంగా తప్పోప్పులు సరిచేసుకుంటూ, ఒక వేళ మనదే తప్పు అయితే మనస్పోర్తిగా తప్పుని ఒప్పుకోవాలి కుడా. ఇది అందరికి అంత సులభంగా వంట పట్టదు. కాకపొతే తప్పు మనవైపు వుంటే అంగీకరించే విశాలమైన మనస్సులో వుంది. ఎలా చేసినా తప్పు వప్పుకోవడం ఎంతో లాభం.

    తప్పు వప్పుకోవడం ఎంతో గౌరవం

    నీహారికా, తప్పు వప్పుకోవడం చాలా కష్టం కాదు అని అడిగావు. మరి కష్టమే కానీ అవసరం కదా. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు కదా. చేస్తారు వాస్తవాన్ని…

  • నమ్మకం ఉంచితే మంచిదే కదా

    నీహారికా, భలే ప్రేశ్న అడిగావు. ఇతరుల్ని ఇప్పుడు పూర్తిగా నమ్మవచ్చు అని. ఇందుకు నేనెందుకు సమాధానం చెపుతాను. అప్పుడు నువ్వే ఎంచుకో. తెలివైన వారు పనులు ఒక…

  • నీహారికా, ఎంతోసేపు ఫేస్ బుక్ లోనే ఉంటున్నాను, వదలలేను, టైమ్ గడిచిపోతుంది అంటున్నావు. ఇవ్వాల్టి యువతకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదే. స్నేహితుల్ని కోరుకుంటారు యువత, సరే, ఫేస్ బుక్ మిత్రులు నిజమైన మిత్రులు కాదు అంటోంది ఒక అధ్యయనం. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా కలవలేదు, స్నేహంతో సన్నిహితంగా మెలగలేదు కనుక, ఎఫ్ బి కేవలం టైం కిల్లింగ్ కోసమే అంటారు పరిశోధకులు. జీవితంలో ఇంతగా మమేకమైన ఎఫ్.బి. వదిలేందుకు, ఆ అలవాటు తప్పించేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఫేస్ బుక్ అకౌంట్ క్లోజ్ చేయండి. ఖచ్చితంగా దాన్ని చూడను అని నిర్ణయం తీసుకోండి. ఫేస్ బుక్ కారణం గా కోల్పోతున్న గంటలన్నీ, సంతోషాన్ని, సరదాలని ఒక పేపర్ పైన నోట్ చేసుకోవాలి. ఫేస్ బుక్ చూడాలనిపించినప్పుడల్లా ఈ పేపర్ ఒకసారి చూడమంటున్నారు. వీలైతే ఇంటర్నెట్ కనెక్షన్ తొలగించండి అంటున్నారు. ఫేస్ బుక్ ద్వారా పంచుకొనే కబుర్లని ఇంట్లో సభ్యులతోనో, దగ్గరగా వుండే ఒకరిద్దరు స్నేహితులతోనో షేర్ చేయండి అంటున్నారు. ఇంటర్నెట్ అనేది ఒక అపురూపమైన నెట్ వర్క్. సరిగ్గా ఉపయోగించుకొంటే అదొక పెద్ద గ్రంధాలయం, డిక్షనరీ, ఇన్ఫర్మేషన్ సెంటర్. దాని దుర్వినియోగం చేసుకొంటే అదొక విష వలయం. విజ్ఞతతో మనకు అందుబాటులోకి వచ్చిన విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి/ ప్రతి చిన్న సందేహానికి సమాధానం ఇంటర్నెట్ తో అనుసంధానమైన సెర్చ్ ఇంజన్. దేన్నయినా తెలివిగా వాడుకోవాలి.

    తెలివిగా వాడుకొంటే అది అపురూపం

    నీహారికా, ఎంతోసేపు ఫేస్ బుక్ లోనే ఉంటున్నాను, వదలలేను, టైమ్ గడిచిపోతుంది అంటున్నావు. ఇవ్వాల్టి యువతకు ఫస్ట్ ప్రాబ్లమ్ ఇదే. స్నేహితుల్ని కోరుకుంటారు యువత, సరే, ఫేస్…

  • భయాన్ని ఎలా పక్కన పెట్టాలి

    నీహారికా, ఎప్పుడూ ఎదో ఒక కొత్త పని ఎదురవ్వుతోంది. చడుకోవడం,  వంటరిగా వెళ్ళడం, హాస్టల్ లో వుండటం, కొత్త కొర్సులకు పోవడం అవన్నీ రకరకాల అనుభవాలు. కొత్త…

  • నీహారికా, నీకిది బాగుంటుంది, ఫలానాది బావుండదు, నువ్విదే తిను, నీకిదే మంచిది అన్ని సూక్తులు విని విని బోరెత్తిపోయాను అన్నావు కరక్టే, పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళకి సూచనలు ఇవ్వాలి, కానీ అభిప్రాయాలు బలవంతాన రుద్దకూడదు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్చ, బద్రత, హుందాతనం పోకుండా ఎలా ఉండాలో చెపితే చాలు. అలాగే పిల్లల తో పదే పదే నీ శరీరం రంగు గురించి రూపం గురించి ప్రస్తావిస్తారు. అది ఇంకా తప్పు. పిల్లల తో వాళ్ళు ఆత్మన్యు నృత కుగురి కాకుండా పెద్దవాళ్ళు అలోచించి వ్యవహారించాలి. పిల్లల ఆకారం , రంగు, లోపాలు ఎత్తి చూపిస్తే ఇక అదే మనస్సులో నాటుకొని ఇక నిరంతరం సౌకర్యం గురించి శరీరపు రంగు, ఇదే ప్రయారిటీగా తీసుకుంటారు. వాళ్ళు ఎలా వున్న సరే ఎంతో సాధించి ఎంతో మందికి స్ఫూర్తి గా వుండగాలరనే చెప్పాలి. అందం అంటే ఖరీదైన దుస్తులు కాదు. హుందాగా వ్యవహారించడం ముందుగా వాళ్ళకు నేర్పవలసింది. మెరుగైన జీవితం కోసం ఎలా ప్రవర్తించాలి, ఏం నేర్చుకోవాలి. ఏ అలవ్ట్లు వుండాలి. ఎలాంటివి ఎంచుకోవాలి. ఎంత శుభ్రంగా, పొందాక, పొదుపుగా వుండాలి. ఇవన్నీ వాళ్ళ భావి జీవితానికి ఉపయోగ పడే విషయాలు. చిన్ని మొలక అయినా రెండాకులువేసి నెమ్మదిగా ఆకులూ కొమ్మలతో స్వాతంత్రంగా విస్తరిస్తుంది. ఇదే మన పిల్లలకు చూపించి అలా ఎదగమని నేర్పాలి. తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకులుగా వుండాలి కానీ చేయి పట్టి జీవితంలో నడిపించనక్కర్లేదు.

    హుందంగా వుండటం నేర్పిస్తే చాలు

    నీహారికా, నీకిది బాగుంటుంది, ఫలానాది బావుండదు, నువ్విదే తిను, నీకిదే మంచిది అన్ని సూక్తులు విని విని బోరెత్తిపోయాను అన్నావు కరక్టే, పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళకి…

  • అమ్మాయిలకు కావాల్సినదేమిటి?

    నీహారిక, ఒక సరదా న్యుస్ నీకు షేక్ చేస్తున్న. అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు అని ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ ఒక సర్వే చేసింది.…

  • నీహారికా, సంతోషకరమైన జీవనానికి ఐదు సూత్రాలు చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో విజయం సాధించడం అంటే ఆనందంగా వుండటమె అంటారు వివేకానంద. ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం మొదలు పెడితే ఎన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధించ గలుగుతాం అంటారు ఆయన. ఈ ప్రపంచంలో పెద్ద పావం ' నేను ఈ పని చేయ లేను' అనుకోవడమే కానీ ఏ పని అసాధ్యం కాదు. నిభద్ద తో, ఆత్మ విశ్వాసం తో, ఒక ప్రణాళిక తో ముందుకు వెళితే ఏదైనా సాధ్యమే అంటారాయన. ఎవరి నుంచి అయినా తీసుకోవడం లో వుండే ఆనందం కంటే ఇవ్వడంలోనే ఎక్కువ వుంటుంది అంటారు. మన దగ్గర వున్న దానిని ఇతరులకు పంచుకోవడం ఇవ్వడం అనెది జీవితంలో ఆనంద మర్గాలెన్నయినా... మనకు ఎం కావాలో మనకు చెపుతుంది. ఆ మనసు మాట విన్న వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే సక్సస్ కోసం ఎప్పుడు ప్రేమా మార్గం లొనే నడవాలి. మనిషి జీవితం లో అత్యంత శక్తి వంతమైనది ప్రేమ. ఈ భావన నిస్వార్ధం గా వుంటుంది. జీవితంలో విజయం సాధించిన వళ్ళంతా నిజమైన ప్రేమను మనసంతా నింపుకున్న వారే అంటారాయన. ఈ విజయానికి ఐడు సూత్రాలు ఎవరైనా అనుసరించ దగ్గవి. ఇవన్నీ ఆచరణ లో పెట్టేందుకు చిన్న తనం నుంచి తయ్యరు అవ్వాలి.

    ప్రపంచలో అసాధ్యం అంటూ ఏదీ లేదు

    నీహారికా, సంతోషకరమైన జీవనానికి ఐదు సూత్రాలు చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో విజయం సాధించడం అంటే ఆనందంగా వుండటమె అంటారు వివేకానంద. ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం…