Nemalika
తెలవారే చీకట్లో……….
నీహారికా, ఏం చేస్తే ప్రతి ఉషోదయం ఆహ్లాదకరంగా మొదలవ్వుతుంది అన్నావు మంచి ప్రశ్నే, సాధారణంగా అందరూ లేచీ లేవగానే ఎవరికీ రోటీన్ లో వారు పడిపోతారు. కొందరు పేపర్ తీస్తారు, కొందరు వార్తలకోసం టీ.వి ఆన్ చేస్తారు. ఇప్పుడైతే ఎక్కువ మంది లేస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకుని సందేశాలు ఈమెయిల్స్ చెక్ చేసుకుంటారు. కానీ రోజును అందంగా ఆహ్లాదంగా అభినందించేందుకు ఇవేమీ సరైనవి కావు. అసలు ఉదయం అంటే నువ్వు అన్నట్లు ఉషోదయం మొదటి వెలుగు కిరణం […]
అదృష్టం గురించి ఆలోచించాలా?
నీహారికా, నువ్వు అడిగిన ప్రశ్న ఒక్కో సందర్భంలో అందరికీ అనిపిస్తుంది. కొందరినే అదృష్టం ఎందుకు వరిస్తుంది? అని కరక్టే అలాగే దీని పక్కనే ఇంకో ప్రశ్న పెట్టేద్దాం కొందరినే ఎందుకు కష్టాలు వరిస్తాయి? ఇప్పుడు విషయం సరిగ్గా అర్ధం అవుతుందనుకోంటాను. మహారాజైనా, సామాన్యుడైనా జీవితంలోని అనుభవాలు ఒక్కలాంటివే ఏ ఒక్క రోజు ఒకేలా గడిచిపోదు. చెడు అనుభవాలు లేని మనిషంటూ వుండదు. అలాగే అదృష్టం విషయంలోనూ ఎలాంటి లాజిక్ కుడా లేదు. వెళుతూ వెళుతూ జారిపడటం ఎలా […]
ఈ వయసే కీలకం.
నీహారికా, టీనెజ్ అన్నది జీవితంలో అతి ముఖ్యమైన ఒక ఆమంచి మలుపు. ఈ వయస్సులో వచ్చే అనుభవాలే పెద్దయ్యాక అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. అప్పుడు నేర్చుకొన్న మంచి విషయాలు ఎదిగాక మంచి జీవితం గడపడానికి సహకరిస్తాయి. అందుకే యుక్త వయస్సులో అడుగు పెడుతున్న వాళ్ళతో దృఢమైన బంధాలు, అనుకూలమైన అనుసంధానంతో వుండాలి. అదే సమయంలో ఎదుటి వాళ్ళ ప్రలోభాలకు గురి కాకుండా తమ స్వతంత్ర ప్రతి వత్తిడిని కాపాడుకోవాలి. ఈ అంశాన్ని సమర్ధవంతంగా జీవితానికి అన్వయించుకోకపోతే […]
సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి.
నీహారికా, భోజనానికి, ఆరోగ్యానికి, జీవనశైలికి, ఆరోగ్యానికి సంబందం ఏమిటన్నావు. జీవన శైలి లోనే టాక్సిక్ పదార్ధాలు తినడం వత్తిడి తో పని చేయడం, సరైన వేళలు ఏ విషయంలోనూ పాటించకపోవడం మొదటి అనర్ధం. అలాగే టాక్సిక్ పదార్ధాలు లేని ఆహారాన్ని తింటామా? కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ లీన్ ప్రోటీన్లు అత్యవసరమైన ఫ్యట్స్ విటమిన్లు నీరు వంటి పోషకాలు సక్రమంగా అందే ఆహారం తినాలి. పరిసుద్దమైన గాలి స్వచ్చమైన నీరు సూర్యకిరణాలు కూడా కావాలి. వ్యాయామం చేయాలి. విశ్రాంతి కావాలి. […]
కఠోర శ్రమ పట్టుదలే మూలం.
నీహారికా, ఎప్పుడూ విజయపు దారినే నేను నడవాలి, అందుకు నాకు తోడుగా వచ్చేదేమిటి అన్నావు కదా. సోమర్ సెట్ మామ్ ఏమంటాడో చూడు. ‘గొప్ప ఫలితాలు ఆశించే వాళ్ళు, సాధారణమైన వాటిని తిరస్కరించాలి. ఎంతో ఆత్మ విశ్వాసం తో విజయం వైపు ప్రయాణం చేస్తేనే అద్భుతమైన ఫలితాలు ఎదురొస్తాయి’ అని. అలాగే నీ అంతరంగం విశ్వం కంటే విశాలమైంది. ఎంతో శక్తివంతమైంది కూడా. నీ విశ్వాసానికి మూలాలు నీ అంతరంగంలోనే ఉన్నాయంటాడు స్టీవ్ ఫోర్బ్స్. మన ఆలోచన […]
భయాలన్నీ పక్కన పెట్టాల్సిందే.
నీహారికా, జీవితoలో ఎప్పుడూ దేనికోదానికి భయపడుతూ వుంటాం. కానీ ఆ భయం జాగ్రత్తకు మేలుకొలుపులా వుండాలి కానీ అదే మనల్ని వెంటాడి వేధించకూడదు. జీవితం ఎప్పుడూ ఒక పద్దతిగా వుండదు. హెచ్చుతగ్గులు, మార్పులు, కష్టనష్టాలు, ఆనందాలు ఎన్నో ఉంటాయి. ఈ రోజు రేపు ఇంకోలా అయిపోతూవుంటుంది అందుకే మనం ఎప్పుడూ మనస్పూర్తిగా రేపును ఆహ్వానిస్తూవుండాలి. మార్పు అంటే భయం లేకుండా ఆ మార్పుని స్వాగతించాలి. నిర్భయంగా జరగవలసిన విషయాన్ని అంగీకరిస్తూ పోతే జీవితానికో ధైర్యం ఉంటుంది. చేస్తే ఏమయిపోతుందో […]
ఓ అరగంటని మీకోసం కేటాయించండి.
నీహారికా, ఇంటా బయటా పని వత్తిడితో నలిగిపోయే మహిళలు ఎప్పుడూ చేసే పొరపాటు ఏమిటంటే ఆ పనుల్ని కుటుంబ సభ్యులతో షేర్ చేయకపోవడం. అన్ని పనులు మనమే చేద్దామని పూనుకోవడం వల్లనే ఎంతో వత్తిడీ, శ్రమ. ఏ పనీ సమయానికి పూర్తి కాకపోవడమే రిజల్ట్. కొన్ని పనులు పక్కవాళ్ళకి అప్పగిస్తే, పిల్లలు, పెద్దలు అలవాటుగా కొన్ని పనులు చేసేటట్లు చేస్తే అప్పుడు కాస్త పని వత్తిడి తగ్గే అవకాశం వుంటుంది. సరిగ్గా ఏ పని ఎప్పుడు చేయాలో, […]
ఈ మాత్రం సంతోష పెట్టలేమా?
నీహారికా, ఇతరులకు సంతోషం పంచి ఇవ్వడంలో మనకు సంపూర్ణమైన ఆనందం లభిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో కూడా మనకి నవ్వులు, పలకరింపులు కావాలి. ఒక్కోసారి మనలో ఉత్సాహం నశించి పోతూవుంటే దాన్ని ఇవ్వగల స్నేహితులు కావాలి. సందేహం వచ్చినప్పుడు ఆత్మ విశ్వాసం కలగాలి. మనకు సత్యం స్వీకరించగల హృదయం ఉండాలి. జీవితం పరిపూర్ణంగా వుండాలంటే మనకు నిజమైన ప్రేమ లభించాలి. ఇలా వేయి విధాల ఆనందం వుందనుకో, మనం అప్పుడా సంతోషాన్ని ఇతరులకు రెండు చేతులా పంచగలం, […]
స్థిత ప్రజ్ఞతకు మరోరూపం ఆత్మవిశ్వాసం.
నీహారికా, తరచుగా ఆత్మవిశ్వాసం అన్న పదం వాడుతూ వుంటారు. దీనితో దేన్నయినా జయించవచ్చు అని. నిజమే అంటే మనపైన మనకు ఎంత విలువ, ఇష్టం గౌరవం వుంటే అంత ఆత్మవిశ్వాసం ఉంటుందని. ఈ విశ్వాసం పెంచుకోగలం కూడా. ఎలా అంటే మన అభిప్రాయాలు, విశ్వాసాల పట్ల మనకు నమ్మకం ఉండాలి. మనల్ని మనం విమర్శించుకోవడం తగ్గించుకోవాలి. లక్ష్యాలు ఉండాలి కానీ మరీ అందుకోలేనంత ఎత్తున పెట్టుకోకూడదు. సౌందర్య పోషణ చాలా అవసరం. మన రూపం, వస్త్రధారణ మనపైన […]
జీవితాన్ని మార్చేసే నవ్వు.
నీహారికా, ఆలోచనలో పడేసే రిపోర్టు ఒక్కటి వచ్చింది. ఒకే ప్రశ్న ఉదయం నుంచి మీరు ఎంత సేపు నవ్వారు అంటే ఏం చెప్తాం. నవ్వెందుకు సమయం లేదు. ఒక సహజమైన సంతోష భావనకు జీవితంలో చోటివ్వకుండా గడిపేస్తున్నామన్నమాట. చక్కగా నవ్వితే చాలు, మెదడులో ఎండార్ఫిన్స్ అనే రాసాయినాల స్ధాయి పెరుగుతోంది. అవి పెరిగితే చురుకుదనం వస్తుంది. చక్కెర స్ధాయిలు నియింత్రించే కొన్ని హార్మోన్లు విడుదల అవ్వుతాయి. ప్రశ్న చాలా ఇబ్బంది పెట్టింది. మనం నవ్వాలనుకొంటే ఈ లోకంలో […]
ఇది అంతులేనంత సీరియస్ సమస్య.
నీహారికా, రెండు చిత్రమైన ఒకదానికొకటి పొంతనలేని రిపోర్ట్స్ వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అంచనా ప్రకారం భారతీయులలో 17 శాతం మందికి పోషకాహార లోపం ఉంది. ప్రపంచంలోని పోషకాహార లోప జనాభాలో మూడో వంతు భారతీయులే. అలాగే మనదేశంలో జరుగుతున్న ఆహార పదార్ధాల వృధా ఇంకెక్కడా లేదు. ఇంగ్లాండ్ దేశ ప్రజలంతా తినే ఆహారంలో సమానంగా ఉందీ వృధా. ఆరు కోట్ల మంది ఆహరం దొరక్క అలమటించి పోతుంటే పదార్ధాల వృధా పైన నియంత్రణే లేదు. […]
జీవితం ఓ ఉత్సవ సౌరభం.
నీహారికా, బాల్యం మనకు జీవితాంతం పదిలంగా మిగిలే అమాయకపు రోజుల జ్ఞాపకం. అప్పుడు ఏ క్షణంలో ఏది దొరికితే దాన్ని ఆ నిమిషంలో ఎంజాయ్ చేస్తాం. కానీ ఎదిగే కొద్దీ ఈ నడుస్తున్న క్షణాల్లో దొరికే ఆనందం మాయమైపోతుంది. చేతిలో ఉన్న ఈ క్షణాన్ని వదిలేసి భవిష్యత్ గురించిన బెంగల తోనే గడిపేస్తూ పోతాం. కానీ మనం పోగొట్టుకున్న బాల్యంలో మనం ఆనందపడ్డ క్షణాలు ఎప్పటికీ వెనక్కి తెచ్చుకోలేం. కానీ ఆలోచిస్తే అలా ఆనందించటం ఒక వరం […]
మనపై మనకు పట్టు కావాలి.
నీహారికా, లైఫ్ గోల్స్ సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్న పక్షంలో ముందు మనపై మనం పట్టు సాధించక పొతే జీవన గమనాన్ని సుతి మెత్తగా సాధించలేక, ఎదుర్కోలేక తీవ్రమైన వత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. మనస్సు శరీరం, అన్నీ రకాల మననుంచే ఆదేశాలు తీసుకుని నచ్చిన మేరకు పని చేస్తాయి. కనుక నియంత్రణ కావాలి. లైఫ్ లో చాలెంజింగ్ పరిస్తుతుల్ని ఎదుర్కొనే సందర్భంలో ఏ విధంగా వ్యవహరిమ్చాలన్నాపట్టు అవసరం. కొన్ని పరిస్థితుల్లో మనకు ఏ మాత్రం హెచ్చరిక లేకుండా వచ్చి […]
మన జీవితమే మనకు బహుమతి.
నీహారికా, ఎన్నో విషయాలు మనం భూతద్దంలో పెట్టి చూస్తాం. కాబట్టి చిన్న విషయాలు పెద్దవైపోయి అందాలకు కారం అవుతాయి. చిన్న విషయాలు పెద్దవైపోయి ఆందోళనకు కారణం అవుతాయి. జీవితం ఎమేర్జెంసీ కానే కాదు. ఎంతో సింపుల్ గా వుండే ప్రాధాన్యాలను మాన సంతోషం కోసం కండిషన్స్ గా మార్చుకొంటూ వుంటాం. మనం పెట్టుకునే డెడ్ లైన్స్ అనుడులో లేకపోతే నోచ్చుకుంటాం. మనమే ఎనర్జీలను సృస్తిమ్చుకొన్నామన్న విషయం మరచిపోతాం. ఇవి ప్రశాంతతను దూరం చేస్తాయి. జీవితంలో ఫ్లేక్సిబులిటి కావాలి. […]
జీవితం ఒక వరం అనుకుంటే చాలు.
నీహారికా, మన కోసం మనం చేయవలసిన మంత్ర జపం ఏమిటో చెప్పనా ఐయామ్ బ్లెస్ట్ అని మనకి మనం చెప్పుకోవడం. వట్టినే మాట కాదు సుమా నమ్మాలి కూడా, నాకే జీవితం ఓ వరం అనుకుంటే ఇక ఎలాంటి నిరాశలు మనకి దగ్గరగా రావు. ఇక ఈ మాటే మంత్రం అనుకుని దైనందన కార్యకలాపాలలో మునిగిపోవాలి. మనలో నిండిన సంతోషం మన పరిసరాలని, చుట్టు పక్కలవారికి సంతోషంగా ఉంచుతుంది. సంతోషంగా నిద్రపోవచ్చు. చక్కని కళలు కనొచ్చు. సంతోషంగా […]
ఆ నవ్వులు వద్దే వద్దా?
నీహారికా, ఎవర్నయినా పలకరిస్తే ఎప్పుడూ బిజీ అనే అంటారు. ఎంత బిజీగా అంటే మన గురించి మనం ఆలోచించుకోలేనంతగా. కానీ ఇలా వుంటే నష్టం కదా. ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొంటే ఈ బిజీ అన్న పదం ఎన్ని సార్లు, ఏవిధంగా ఉపయోగించి ఆత్మానందం పోగొట్టుకున్నామో అర్ధం అవుతుంది. స్నేహితుల్ని కలవడం, ఒక ఫంక్షన్ కు పోవడం, మంచి సినిమా చూడటం, ఇంట్లో నలుగురితో కలిసి భోజనం చేయడం, ఓ అరగంట కబుర్లు చెప్పటం ఇవన్నీ బిజీ […]
ఎమోషనల్ ని క్లియర్ చేయాలి
నీహారికా, మనసు నిండా పేరుకున్న అనవసరపు చెత్తను తీసేస్తేనే జీవితం సంతోషంగా, సుఖంగా సాగుతుందిట. అంటే ఇల్లంతా చిరాగ్గా వుంటే, ఇరుగ్గా అనిపిస్తే ఎలా తోచుబడి కాదో అలాగే ఎమోషనల్ బ్యాగేజ్ వల్ల కూడా అంతే దిగులు డిప్రెషన్ ఆవరిస్తాయి. వీటిని తొలగించుకొనేందుకు కొన్ని సూత్రాలు పాటించాలి. కొందరి పట్ల వ్యక్తిగత కోపాలు ద్వేషాలు మానవ సహజం. అలాగే మనపట్ల కూడా కొందరు కోపం ద్వేషంతో వుండొచ్చు. ఈ వ్యతిరేక భావన వల్ల ముందు మన ప్రశాంతత […]
కబుర్లు నడవడం చాలా అవసరం.
నీహారికా, ఎన్నో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొంటాం. వేడుకల్లో, ఆఫీసుల్లో, ఇరుగుపొరుగుతో ఎన్నో కబుర్లు నడుస్తాయి. అవన్నీ గాసిప్స్ అని కొట్టి పడేస్తే అసలు కబుర్లు ఎలా తెలుస్తాయి. ఇప్పుడు ఆఫీసులో కబుర్లు చెప్పుకొన్నామనుకో అవి మంచి వాతావరణం సృష్టిస్తాయి. పని చేసే వాతావరణం సీరియస్ గా లేకుండా, పని వత్తిడి లేకుండా వుంటుంది కదా. సమాజంలో వివిధ వృత్తులతో పోల్చి చూసుకొనేందుకు సరదా కబుర్లే దోహదం చేస్తాయి. ఈ కబుర్ల వల్ల వ్యక్తిగతమైన నడవడిక పట్ల అప్రమత్తంగా […]
సమయ పాలన చాలా అవసరం.
నీహారికా, కరక్టే ఈ ప్రాబ్లం కేవలం ఉద్యోగం చేసే ఆడవాళ్ళకే, ఇంటికీ, ఆఫీస్ కీ సరైన న్యాయం చేయలేక పోతున్నామని బాధపడేది స్త్రీలే. ఎందుకంటే వాళ్ళకే ఇంటి బాధ్యత, ఆఫీస్ బాధ్యత సమానంగా వుండేది. మారాల్సింది వీళ్ళే ఆఫీసులో పూర్తి కాని పనుల, మరునాడు చేయవలసిన పనుల గురించి ఇంటికొచ్చి ఆలోచించడం వల్ల ఎలా ప్రయోజనం ఉండదో, ఆఫీసులో వుండి, పిల్లలకు ఇంటికి న్యాయం చేయలేకపోతున్నానని గిల్టీగా ఫీల్ అవ్వడం వల్ల లాభం అంతే, అనవసరమైన ఆలోచనలతో […]
సంతోషాన్ని వెతికి గుప్పెట్లో పెట్టాలి.
నీహారికా, నడిచే మార్గంలో ఎత్తుపల్లాలు ఎంత సహజమో జీవితంలో వాడిదుడుకులు అంటే సహజం. ఏదయినా జీవితంలో చిన్నపాటి కష్టం ఎదురైనా కంగారుపడి పోవడం మనవ నైజం. కానీ సమస్యను సమస్యలా చూడకుండా, ఇలాంటివి ఎదురుకోవడం మానవనైజం. కానీ అనుకుని ప్రశాంతంగా ఆ సమస్యకు పరిష్కారం వెదకకుండా వట్టినే దిగులుపడటం ఆన్ లైన్ ఫెయిల్యూర్. ఎలాంటి కస్టాలున్నా ధైర్యంగా ఎదుర్కోవడం మనస్ధరైర్యాన్ని మనోనిబ్బరాన్ని ఇస్తుంది. మారధనలో సమస్యతో పాటు పరుగులు పెడితే పరిస్థితి మరింత చిక్కుముళ్ళు పడిపోతుంది. దీన్ని […]
