కల్నల్ సోఫియా ఖురేషి గుజరాత్ లోని వడోదర లో పుట్టారు ఆమెది సైనిక నేపథ్యం తాత తండ్రి సైన్యంలో పనిచేశారు 1999 లో భారత సైన్యంలో చేరారు ఖురేషి భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ పరాక్రమ్ లో కీలక పాత్ర పోషించారు ఆపరేషన్ సింధూర్ సమరంలో ఆమె ముందున్నారు పూణే లో జరిగిన ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18 విశిష్ట కార్యక్రమంలో భారత సైన్యానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు ఖురేషి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ చర్యల్లో భాగంగా కాంగో లో ఆరేళ్లు పనిచేశారు. కుటుంబ నేపథ్యం సైన్యంలో పనిచేసే లక్ష్యాన్ని ఇస్తే విద్యా నేపథ్యం విమర్శనాత్మక ఆలోచన దృష్టి ఇచ్చింది. ఖురేషి మహారాజా సాయాజీరావు యూనివర్సిటీలో బయో కెమిస్ట్రీ లో పీజీ చేసింది.













