2019 లో భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా నియమితులయ్యారు వ్యోమికా సింగ్. హిమాచల్ ప్రదేశ్ లో 21650 అడుగుల ఎత్తున్న పర్వతం పై 2021 లో జరిగిన మహిళల యాత్రలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ ఈశాన్య ప్రాంతాల్లో అత్యంత కఠినమైన భూభాగాల్లో చేతక్, చీతా వంటి హెలికాప్టర్ లో 2500 గంటలకు పైన నడిపిన అనుభవం ఉంది. 2020లో అరుణాచల్ ప్రదేశ్ లో కీలక రెస్క్యూ ఆపరేషన్ కు నేతృత్వం వహించిన అనుభవం వ్యోమికా కు ఉంది. ఇన్ని అనుభవాల నేపథ్యంలో ఆమె ఆపరేషన్ సింధూర్ లో భాగస్వామి అయ్యారు.













