• సాధారణంగా గాజులు, గాజువి, రాళ్ళూ అంటించిన లక్కవి, వెండి, బంగారం ఏ లోహం తో అయినా గాజు చుట్టూ వజ్రాలు, రాళ్ళ డిజైనోవుండి అందంగా వుంటాయి. కానీ రాజ్ పుత్ కాడ గాజులు వెరైటిగా ఉంటాయి. మాములుగా వెడల్పుగా వుండే గాజుల పైన డిజైన్ నిలువు గా గొపురంలా ఎత్తుగా వుంటుంది. కుందన్ కారీ మీనాకారీ పనితనంలో బంగారం వజ్రాలు ఇమిడ్చి చాలా బాగుంటాయి కానీ అవి గాజు మీద గోదా కట్టినట్లు పైకి ఎత్తుగా డిజైన్ వుంటుంది. మెళ్ళో నెక్లేస్ కు గాజు పైన నిలబెట్టినట్లు అన్నమాట. గాజు పైన గుండ్రని చిన్నగా వుండే బంగాడి అని ఇంకా రకరకాల ఆకారాల్లో వుండే గ్రోఖ్రా అని, ముత్యాలు పొడిగితే గాజ్రా అని ఎనెన్నో వెరైటీస్. ఇదివరకు రాజస్థాన్ కే పరిమితం. ఇప్పుడీ అందాల్ని మోడ్రన్ డిజైన్లతో పరిచయం చేస్తున్నారు డిజైనర్లు. యాంటిక్ నగలు ఇష్టపడే వారికి ఎన్నో వెరైటిస్ కనిపిస్తాయి. సాధారణంగా గాజులు, గాజువి, రాళ్ళూ అంటించిన లక్కవి, వెండి, బంగారం ఏ లోహం తో అయినా గాజు చుట్టూ వజ్రాలు, రాళ్ళ డిజైనోవుండి అందంగా వుంటాయి. కానీ రాజ్ పుత్ కాడ గాజులు వెరైటిగా ఉంటాయి. మాములుగా వెడల్పుగా వుండే గాజుల పైన డిజైన్ నిలువు గా గొపురంలా ఎత్తుగా వుంటుంది. కుందన్ కారీ మీనాకారీ పనితనంలో బంగారం వజ్రాలు ఇమిడ్చి చాలా బాగుంటాయి కానీ అవి గాజు మీద గోదా కట్టినట్లు పైకి ఎత్తుగా డిజైన్ వుంటుంది. మెళ్ళో నెక్లేస్ కు గాజు పైన నిలబెట్టినట్లు అన్నమాట. గాజు పైన గుండ్రని చిన్నగా వుండే బంగాడి అని ఇంకా రకరకాల ఆకారాల్లో వుండే గ్రోఖ్రా అని, ముత్యాలు పొడిగితే గాజ్రా అని ఎనెన్నో వెరైటీస్. ఇదివరకు రాజస్థాన్ కే పరిమితం. ఇప్పుడీ అందాల్ని మోడ్రన్ డిజైన్లతో పరిచయం చేస్తున్నారు డిజైనర్లు. యాంటిక్ నగలు ఇష్టపడే వారికి ఎన్నో వెరైటిస్ కనిపిస్తాయి.

    రాజస్థానీ కూడా అందమే అందం

    సాధారణంగా గాజులు, గాజువి, రాళ్ళూ అంటించిన లక్కవి, వెండి, బంగారం ఏ లోహం తో అయినా గాజు చుట్టూ వజ్రాలు, రాళ్ళ డిజైనోవుండి అందంగా వుంటాయి. కానీ…

  • శారీరక కొలతలు పిడికెడు పెరిగినా, కాస్త బరువు తగ్గినా, పెరిగినా, ఇంక ఈ విషయం గురించి ఆలోచిస్తూ మనస్సు పడు చేసుకునే అమ్మాయిలు అనేక మంది. ఇక బరువు తగ్గాలనుకునే వాళ్ళ విషయం మరీ అధ్వాన్నం గా వుంటుంది. ఇంక ఇదే చింత అయితే ఒక చిన్న వ్యూహం పాటించ మంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు బరువు చూసుకుంటూ వుంటే కొన్నాళ్ళకు ఫలితం అర్ధం అయిపోతూ వుంటుంది.ప్రతి రోజు బరువు చూసుకుంటూ చార్ట్ పైన ఫలితాలు చెక్ చేసుకుంటూ వుంటే బరువు తగ్గే క్రమం లో ఫలితం బాగుంటుంది అంటున్నారు. ఇలా ప్రతి రోజు చెక్ చేసుకునే వాళ్ళు బరువు పెరగకుండా మెయిన్ టైన్ చేసుకో గలుగుతారు. అదే భోజనం విషయం లోను పరిపూర్ణ ఆరోగ్యం చూసుకోవాలని, ఆహార పానీయాలు సక్రమంగా అనుసరించ మంటున్నారు. తినే వాటిని సరిగ్గా ఎంచుకుని స్థిమితంగా భోజనం చేయాలని నిపుణులు చెప్పుతున్నారు.

    రోజు బరువు చెక్ చేసుకోవడం కరెక్ట్ పద్దతి

    శారీరక కొలతలు పిడికెడు పెరిగినా, కాస్త బరువు తగ్గినా, పెరిగినా, ఇంక ఈ విషయం గురించి ఆలోచిస్తూ మనస్సు పడు చేసుకునే అమ్మాయిలు అనేక మంది. ఇక…

  • చింతపండంటే పళ్ళు జివ్వుమనేంతగా చూడకుండానే అనిపిస్తుంది కదా, కనీ ధాయ్ లాండ్ చింతకాయలు ప్యాక్ చేసి చేసి వస్తున్నాయి. అవి తియ్యగా ఉన్నాయి. వీటితో అక్కడ క్యాండిలు, మిటాయిలు తయ్యారు చేస్తారట. మనకైతే చింతపండు లేని వంటకం అసాధ్యం సాంబారు, చారు, పులిహోర, నిల్వ పచ్చళ్ళు అన్ని చింతపండు మయం. చింత చిగురు పప్పు, పచ్చడి నోరురిపోయెంత రుచి. సైనస్ వున్న వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ వున్న వాళ్ళకి చింతపండు బదులు టొమాటో, నిమ్మ, వాడమంటారు కానీ పరిశోధనలు అంత అవసరం లేదనే చెపుతున్నాయి. ఇందులో టార్టారిక్ ఆమ్లం, లియోనిన్ జెరానియోల్, శాప్రోల్, సినామిక్ ఆమ్లం, మిధైల్ శాలిసిలైట్ వంటి ఫ్లైటో కెమికల్స్ ఓషధాల్లా పని చేస్తాయి. ఇందులో ఎన్నెన్నో పోషకాలున్నాయి. కొన్ని మందుల్లోనూ చింతపండు నుంచి తీసిన పదార్ధాలు వాడతారు. కాలేయం పని తీరుని, జీర్ణ క్రియ పెంచుతుంది. ఉగాది పచ్చడి తో సహా చింతపండు ఆరోగ్య ప్రదాయకం నిష్యంతగా వాడదగ్గది.

    నిశ్చింత గా తినేయొచ్చు

    చింతపండంటే పళ్ళు జివ్వుమనేంతగా చూడకుండానే అనిపిస్తుంది కదా, కనీ ధాయ్ లాండ్ చింతకాయలు ప్యాక్ చేసి చేసి వస్తున్నాయి. అవి తియ్యగా ఉన్నాయి. వీటితో అక్కడ క్యాండిలు,…

  • నిహారికా , అందమైన రోల్స్ మోడల్స్ ఉంటారు. నాజూగ్గా అందంగా హుషారుగా ఉత్సాహంగా ....! అలా ఎప్పుడూ వాళ్ళని చూస్తూ వాళ్ళు మాత్రమే అలా ఉండాలి అనుకుంటే అన్యాయం. వీళ్ళు అలా ఎలా ఉండగలిగారు మనకు స్పష్టమైన అవగాహన ఉంటే మనకు అలాగే వున్నామని తెలుస్తుంది. ఎలాగంటే ఎవరికి వాళ్లకు ప్రత్యేకత ఉంటుంది. కొందరి కళ్ళు బావుంటాయి . కొందరు బాగా మాట్లాడతారు కొందరు బాగా చదువుతారు. ఇవన్నీ మనిషిలో అందం కంటే ఎక్కువైనవి . వీటికి ప్రాధాన్యత ఇచ్చి చుస్తే అసలు అసలైన అందం ఏమిటి ? ఎలా ఉంటే మనం పనులన్నీ పర్ ఫెక్ట్ గా పూర్తిచేసినట్లు. ఇతరులతో పోల్చుకోవటం మానేస్తే కొంత క్లారిటీ వస్తుంది. ఫలానా జయంతి చాలా సన్నగా ఉంది . సరే నువ్వు ఆరోగ్యంగా వున్నావు అనుకోవాలి. ఫలానా వసంత తెల్లగా వుంది అంటే నువ్వు టాప్ గ్రేడ్ చదువులో ఉన్నవని గుర్తు తెచ్చుకోవాలి. మనం ప్రత్యేక మని మనం నమ్మటం మనం బాడీ లాంగ్వేజ్ ని మార్చేస్తుంది. బోలెడంత ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. ప్రపంచంలో అందం చాలా ప్రత్యేకం.పువ్వులు జల పాతాలు నెమళ్ళు పచ్చని చెట్లు అందమైన అమ్మాయిలు బావుంటారు. మనం అందాన్ని ప్రశంసించవచ్చు. కానీ మనం కూడా అలాగే ఉండాలనుకుంటే ఎంత అమాయకత్వం . కాస్త పొడుగ్గా ఉంటే కాస్త తెల్లగా ఒత్తుగా ఉంటె ......... ఎందుకింత గందరగోళం ఏవీ ఇంకోలా అయిపోవు. పుట్టుకతో వచ్చిన రూపం తెలివి శక్తీ ఆరోగ్యం ఇవన్నీ ఇచ్చిన తల్లితండ్రులకు మొదటి నమస్కారం పెట్టేసి ఇప్పుడు వెలుగులో నిలబడి ఓకే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి అని ఆలోచిస్తే ఆడపిల్లలు ఇంకెంతో సాధిస్తారనిపిస్తుంది.

    ఎవ్వరితోనూ పోచుకోవద్దు

    నిహారికా , అందమైన రోల్స్ మోడల్స్ ఉంటారు. నాజూగ్గా అందంగా హుషారుగా ఉత్సాహంగా ….! అలా ఎప్పుడూ వాళ్ళని చూస్తూ వాళ్ళు మాత్రమే అలా ఉండాలి అనుకుంటే…

  • ప్రతిక్షణం కొత్తగా ప్రతి నిమిషం ఉత్తేజంగా ప్రతిరోజు నిన్నటికంటే మిన్నగా ఉండాలని కోరుకుంటోంది యువతరం అందుకు తగ్గట్టే పూటకు కొత్త ఫ్యాషన్ ప్రత్యక్షం అవుతోంది. గోళ్ళ అలంకరణకు రంగులు పెయింట్ డిజైన్లు ముత్యాలు వజ్రాల నగలు పోయి ఇప్పుడు వైర్ నెయిల్ ట్రెండ్ ఒకటి ముందుకొచ్చింది. అతి పల్చని బంగారు తీగను గోళ్లపై అలంకరించుకోవటం అన్నమాట . ఈ నెయిల్ ట్రెండ్ ను దక్షజీనా కొరియాలోని యూత్ క్రియేట్ చేసింది . ఈమె సెలూన్ లో పనిచేస్తుంది. అతి సన్నని బంగారు తీగలో గోటిపైన మన పేరు మనకి ఇష్టమైన వారి పేరు లేదా ఏవో అంకెలో ఆ దారం వంటి తీగలో అలా అంటించే యటం. ఈ ట్రెండ్ కి విదేశాల్లో డిమాండ్ వచ్చింది. గోరుపైన చాలా అందమైన పెయింట్ లాంటి నెయిల్ పాలిష్ చేసి ఆపైన వైర్ నెయిల్ ట్రెండ్ మరింత క్రియేటివిటీ లో అభివృద్ధి చేస్తున్నారట ఫ్యాషన్ డిజైనర్లు. ఇప్పుడు ఉన్నన్ని ఇమేజెస్ చూసేయండి.

    గోళ్లపై బంగారు తీగల పేర్లు

    https://scamquestra.com/24-bekapy-sohranenie-informacii-dlya-sledstviya-45.html

  • సి విటమిన్ శరీరానికి అందితే చాలు చర్మం యవ్వన కాంతితో మెరిసిపోతుంది చాలా సార్లు చదివేం. కానీ ఈ విటమిన్ కోసం సిట్రస్ పండ్లు వెతకాల్సిన పనిలేదు . మనం రోజు తినే ఎన్నో పదర్ధాలతో ఉండే ఆ విలువైన విటమిన్ మన శరీరానికి కందేలా చూసుకోవాలి. పదిముక్కల కాప్సికం నుంచి వంద గ్రాముల సి విటమిన్ అందితే జామకాయ ముదురాకు పచ్చ రంగులో ఉండే కట్ట పాలకూర కప్పు చొప్పున టమాటో బొప్పాయి స్ట్రాబెర్రీ ముక్కలు నుంచి అన్నే గ్రాముల సి విటమిన్ అందుతుంది. ఇవి ఎన్ని తింటే మేలు ఆనంది క్వశ్చను . మహిళలకు ప్రతిరోజు 75 గ్రాముల సి విటమిన్ అవసరం అయితేతొమ్మిది నుంచి 13 సంవత్సరాల పిల్లలు 45 గ్రాముల వరకు తీసుకోవాలి . ఇక రోజు ఏ పోషకాల కోసం కాప్సికం బొప్పాయి స్ట్రా బెర్రీ కాలీఫ్లవర్ అనాస కమలా ఫలం వంటివి తప్పనిసరిగా లెక్కలేసుకుని మరీ తినాలి. శరీరానికి ఆరోగ్యం ఇచ్చే కీలకమైన విటమిన్ కాబట్టి వయసుని బట్టి ఎంత తినాలో తేల్చుకుని తినాలి.

    వయసుని బట్టి అంచనా వేసుకోండి

    సి విటమిన్ శరీరానికి అందితే చాలు చర్మం యవ్వన కాంతితో మెరిసిపోతుంది చాలా సార్లు చదివేం. కానీ ఈ విటమిన్ కోసం సిట్రస్ పండ్లు వెతకాల్సిన పనిలేదు…

  • సెంట్లు పెర్ ఫ్యూమ్స్ వాడటం కామనే. ఏదైనా వేడుక కోసం బయటకు వెళ్ళేటప్పుడు అలంకరణ తర్వాత ఎదో మంచి పరిమళం రావాలనే ఉద్ద్యేశంతో రకరకాల సెంట్లు ట్రై చేస్తాం. ఇప్పుడు ఎక్స్ పెర్ట్లు ఇలా పార్టీలకు పెళ్లిళ్లకు వెళ్ళేటప్పుడు నిమ్మ గుణాలున్న సెంట్ ఎంచుకోమంటున్నారు. ఈ సిట్రస్ పరిమళంతో నిమ్మ నారింజ ద్రాక్ష ను గుణాలు ఉంటాయి. ఏ షాపింగ్ కు వెళుతుంటే కూడా ఎక్కువసేపు తిరిగినా ఈ పరిమళం చుట్టుముట్టే ఉంటుంది. అలాగే గంధపు చెక్కతో కూడిన పరిమళం కూడా ఎక్కువసేపు ఉంటోంది. అమ్మాయిలు సాధారణంగా పువ్వుల సుగుణాలున్న పరిమళం కూడా ఎక్కువ ఇష్టపడతారు. లిల్లీ గులాబీ లావెండర్ లాంటివి ప్రత్యేకంగా తెలుస్తాయి. ఇప్పుడు యాపిల్ మామిడి పండ్ల సువాసనతో కూడా పెర్ఫ్యూమ్స్ వస్తున్నాయి. ఈ పువ్వుల పండ్ల కలయిక తో కూడిన సువాసన చాలా మందికి ఇష్టం. వీటికి తోడు స్పైసీ సెంట్స్ కూడా వస్తున్నాయి. లవంగాలు దాల్చిన చెక్క మిరియాల వాసన లున్న సువాసన కూడా మార్కెట్ లో ఉన్నాయి. ఏ సెంట్ అయినా మణికట్టు పైన కొడితేనే వాసన ఎక్కువసేపు ఉంటుంది.

    ఈ పరిమళాలు బావుంటాయి

    సెంట్లు పెర్ ఫ్యూమ్స్ వాడటం కామనే. ఏదైనా వేడుక కోసం బయటకు వెళ్ళేటప్పుడు అలంకరణ తర్వాత ఎదో మంచి పరిమళం రావాలనే ఉద్ద్యేశంతో రకరకాల సెంట్లు ట్రై…

  • చాలామందికి మష్రూమ్స్ నచ్చవు గానీ ఇవి అపారమైన పోషక విలువలకు ఆధారం. వీటిల్లో హెపటో ప్రొటెక్టివ్ కార్డియో యాంటీవైరల్ యాంటీ డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ కాన్సర్ యాంటీ వైరల్ యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలున్నాయి. కార్బోహైడ్రేట్స్ క్యాలరీలు తక్కువగా ఫైబర్ పాళ్ళు ఎక్కువగా ప్రోటీన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి . రోగనిరోధక వ్యవస్థను పెంపొందించటానికి ఈ పోషకాలు ఎంతో ఉపకరిస్తాయి. అర కప్పు ఉడికించిన మష్రూమ్స్ 20 గ్రాముల క్యాలరీలు 1. 7 గ్రాముల ప్రోటీన్స్ 17 గ్రాముల కార్బో హైడ్రేట్స్ 278 మి. గ్రా పొటాషియం 3.5 మి గ్రా నియాసిన్ లభిస్తాయి. మష్రూమ్స్ లో టానిక్స్ ఉంటాయి కానీ ఇవి ఉడికిస్తే పోతాయి. కాబట్టి ఎలాంటి భయం లేకుండా తినచ్చు. ఇది అన్ని రకాల కూరల్లోనూ వేసి వండుకోవచ్చు . చపాతీల్లోకి చేసుకునే మిక్సడ్ వెజిటబుల్స్ లో మష్రూమ్స్ కూడా చేర్చుకుంటే ఇవి కూరలో కలిసిపోయి కనబడకుండా పోతాయి. అంచేత అయిష్టాన్ని పక్కన పెట్టి ఇవి తప్పకుండా తినాలి.

    పోషకాల నిలయం మష్రూమ్స్

    చాలామందికి మష్రూమ్స్ నచ్చవు గానీ ఇవి అపారమైన పోషక విలువలకు ఆధారం. వీటిల్లో హెపటో ప్రొటెక్టివ్ కార్డియో యాంటీవైరల్ యాంటీ డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ కాన్సర్…

  • ఎలాంటి విపత్కరమైన సమయంలో నైనా మహిళలు చాలా మంది డెసిషన్స్ అతివేగంగా తీసుకోగలుగుతారు. సమస్యని పరిష్కరించుకోవటంలో చురుగ్గా వుంటారు . ఏ నిర్ణయాన్నైనా తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేయగలిగే శక్తీ గలవాళ్ళు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకిలా జరిగిందీ మైండ్ బ్లాంక్ గా అయిపోతుంది అని కన్ఫ్యూజ్ అవుతారు , ఎక్సపర్స్ ఎంచెపుతున్నారంటే రుతుక్రమ సమయాల్లో వారిలో వచ్చే మార్పులే ఇందుకు కారణం అంటారు . సమస్యలు పరిష్కరించుకోవటంలో వాళ్ళ దృక్పధాన్ని ఈ మార్పులు ప్రభావితం చేస్తాయి. రుతు క్రమంలో వారే దశ లో ఉన్నారని దాన్ని బట్టి వాళ్ళ జ్ఞాపకశక్తి ఆలోచనా స్థాయిలు విభిన్నంగా వుంటుంటాయి. ఈస్ట్రోజెన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు మెదడు లోని విభిన్న భాగాలను ప్రభావితం చేయబట్టే సమస్యలు పరిష్కారంలో అవసరమయ్యే అనేక మెమొరీ వ్యవస్థల్లో తేడాలుంటాయి. అందుకే నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త వ్యత్యసాలు ఉండొచ్చని అధ్యయనకారులు చెపుతున్నారు. హార్మోన్స్ తేడాలే ఈ కన్ఫ్యూజన్ కారణమని తేల్చారు.

    హార్మోన్ల స్థాయిల్ని బట్టే ఈ ప్రాబ్లమ్

    ఎలాంటి విపత్కరమైన సమయంలో నైనా మహిళలు చాలా మంది డెసిషన్స్ అతివేగంగా తీసుకోగలుగుతారు. సమస్యని పరిష్కరించుకోవటంలో చురుగ్గా వుంటారు . ఏ నిర్ణయాన్నైనా తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా…

  • అడవి ఎంతో బావుంటుంది. ఎతైన వృక్షాలు అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు పేరు తెలియని అద్భుతమైన పువ్వులు. ఎగిరేవందలాది తుమ్మెదలు పక్షుల అరుపులు గుంపులుగా అడవి జంతువులు. ఈ అద్భుతమైన ప్రకృతి ఎప్పుడూ వంటరిగా ఎడారిలో మొలిచే జిల్లేడు మొక్కలా వంటరిగా ఉండదు. అలాగే చుక్క నీళ్లు పడని ఎడారిలో కూడా అందుకు తట్టుకు బతికే చెట్లుంటాయి. ఇంత పచ్చ దనం ఇంతటి అందం మానవసమూహాల్లో ఉంటుంది. చాలా మంది కలిసిన చోట ఎంతో సందడి స్నేహం మాట ఆడో పండగ. అందుకే ఒంటరిగా ఎవ్వరితోను కలవకుండా ఉండద్దు. నలుగురిలో కలివిడిగా వుండండి అంటుంటాయి. అధ్యయనాలు సామాజికంగా చురుగ్గా బిజీగా ఎప్పుడూ ఎదో ఒక పనిలో మునిగితేలాలి. లేకపోతే గుండె జబ్బులు వస్తాయంటారు. స్వచ్చందంగా ఎదో ఒక కార్యక్రమం చేప్పట్టటం లేదా స్నేహతులు ఇరుగు పొరుగులతో మంచి స్నేహం సంబంధాలు ఉంచుకోవటం చేయాలి. ఒంటరితనం నైరాశ్యం లోకి దారి తీసి అనేక దిగుళ్ళ వత్తిడి లతో ఆరోగ్యం చెడిపోయి అతి చిన్న వయస్సు లోనే తీవ్రమైన జబ్బులొస్తాయి. అంటున్నాయి అధ్యయనాలు. ఏ రూపం లో ఎలా గడిపినా సామజిక కలివిడితనం అనివార్యం.

    సామాజికంగా చురుగ్గా ఉంటేనే ఆరోగ్యం

    అడవి ఎంతో బావుంటుంది. ఎతైన వృక్షాలు అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు పేరు తెలియని అద్భుతమైన పువ్వులు. ఎగిరేవందలాది తుమ్మెదలు పక్షుల అరుపులు గుంపులుగా అడవి జంతువులు. ఈ…

  • తెలిసినా పట్టించుకోని తెలుసుకుని తీరవలసిన చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద చర్యలు చేపట్టే వీలుంటుంది. బాగా అలసిపోతే శరీరం శక్తీ సన్నగిల్లి పోతే ఓ కప్పు ఎనర్జీ డ్రింక్ తాగాలని అనుకుంటారు కానీ ఒక్క అరటిపండు చక్కని వర్కవుట్ ఇంధనం ,ఎనర్జీ డ్రింక్ తాగినా పదిహేను నిమిషాలోకసారి మంచి నీళ్లు తాగినా అదే ఫలితం. గ్లూకోజ్ స్థాయిలు అంటే ఎనర్జీ స్టోర్స్ రెండింటికీ ఒకే మాదిరి ఉంటాయి . ఒక్క అరటిపండులా కార్బోహైడ్రేట్స్ పొటాషియం విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు కలగలిసి ఉంటాయి. ఇందులోనే సహజ శక్తీ ఉంటుంది . అలాగే గాసిప్ లు మాట్లాడుకోవటం పాపం అనుకుంటాం. ఈ మాటలకూ ప్రాణాల్ని కాపాడే శక్తీ వుంటుందంటున్నారు ఎక్స్ పెర్ట్స్ . ఎవ్వరితోను సంబంధం లేని జాబ్స్ చేసే వాళ్ళు 2.4 రేట్లు ముందుగా చనిపోతారట. వాళ్లకు ఎవ్వళ్లతో కబుర్లకి మనసు విప్పి మాట్లాడు కొనేందుకు అవకాశం లేదు అదే సహారోగ్యాలు ఓ పదిమంది వుంది వాళ్ళతో గాసిప్ లు మాట్లాడుతూ రిలాక్స్ పొందుతూ ఉంటే ఒత్తిడి తగ్గించే హార్మోన్లు విడుదల అవుతుంటాయట. వీళ్ళలో జబ్బుల రిస్క్ తక్కువ. కానీ ఒక ముఖ్య విషయం గాసిప్ లు ఏ రిస్క్ నయినా తగ్గించవచ్చు కానీ మనం మాత్రం ఎదుటి వాళ్ళకి హాని చేయని నొప్పించని గాసిప్ లే ఎంజాయ్ చేయాలి. లేకపోతే నిజంగానే పాపం.

    తెలుసుకోవాల్సిన విషయాలెన్నో

    తెలిసినా పట్టించుకోని తెలుసుకుని తీరవలసిన చిన్న చిన్న విషయాల వల్ల  పెద్ద చర్యలు చేపట్టే వీలుంటుంది. బాగా అలసిపోతే శరీరం శక్తీ సన్నగిల్లి పోతే ఓ కప్పు…

  • పార్శ్యపు నొప్పి చాలా మందిని వేదించే సమస్య చిరాగ్గా అసహనంగా ఏ పని చేయనీక వికారపెట్టి విసిగిస్తూ ఉంటుంది. ఎంతో ఖరీదైన నెప్పి ఉపశమన మాత్రలు వాడుతూ వుంటారు. ఈ నొప్పి నివారణ మాత్రలు కూడా ఒక్కసారి అలవాటై పనిచేయకుండా పోతాయి కూడా. కొన్ని ఇంటి వడియాలు కూడా వాడితే కొంత ఉపశమనం పొందే అవకాశం వుంది. రాళ్ళుప్పు నిప్పచెక్క నిమ్మరసం తీసుకోవాలి. నాణ్యమైన ఉప్పు కావాలి. దీనిలోనే ఖనిజాలు రోగనిరోధక శక్తి ని దృఢం చేస్తాయి. సెరటానిన్ స్థాయిలు పెరుగుతాయి. రెండు నిమ్మకాయల పిండి ఉప్పు కొన్ని నిమ్మ తొక్కలు కలపాలి. ఈ మిశ్రమం ఒక పాత్రలో పోసి రెండొందల ఎంఎల్ నీరు పోసి బాగా కలిపి తాగేయాలి. రక్తపోటు ఉంటే మటుకు ఒక్కసారి ఏ మిశ్రమం గురించి డాక్టర్ ను అడగాలి. వేధించే తలనొప్పి నుంచి ఇదొక ఉపశమనం.

    వంటిల్లే ఒక మందుల పెట్టె

    పార్శ్యపు నొప్పి చాలా మందిని వేదించే సమస్య చిరాగ్గా అసహనంగా ఏ పని చేయనీక వికారపెట్టి విసిగిస్తూ ఉంటుంది. ఎంతో ఖరీదైన నెప్పి ఉపశమన మాత్రలు వాడుతూ…

  • నలభై ఏళ్ళు దాటుతుంటే చాలా మంది కొద్దిగా ఎత్తు తగ్గుతారు అంటే ఆశ్చర్యంగా వుంటుంది కదూ. నిజంగానే తగ్గుతుంటారు టిస్యూల మాస్ ఎముకల సాంత్రత పోవటంలో ఆ లాస్ ఎక్కువగా వెన్నుముక్కలో కనిపిస్తుంది. అందుకే వ్యాయామాలు చేయండి. వెన్ను ను బలంగా ఉంచుకోండి పోశ్చర్ ను కుదురుగా నిటారుగా ఉండేట్లు కూర్చోవడం నడవటం చేయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే వెన్నుకు కుషన్ గా వుండే డిస్క్ లు ఎత్తు తగ్గుతాయి. అంటే కొన్నాళ్ళు తలగడలు వాడితే అవి మెత్తగా అయిపోయి కుంగి పోయినట్లున్న మాట.నలభై దాటాక అక్కడి నుంచి ప్రతి ఏడేళ్లకు అర అంగుళం చొప్పున ఎత్తు తగ్గుతూనే ఉంటారు. ఈ ప్రక్రియ 70 ఏళ్ళు తర్వాత ఇంకా పెరుగుతుంది. మొత్తం మ్మీద రెండంగుళాల కంటే ఇంకా ఎక్కువే ఎత్తు తగ్గిపోతారు . అందుకే మనం చాలా మంది పెద్దవాళ్ళని చూసినప్పుడు వెన్ను వంపు తిరిగి ఎముకల్లో సాంత్రత తగ్గిపోయి వంగిపోయి కనిపిస్తారు. పెద్దతనం వల్ల అలా కుంగిపోయారంటాం కానీ వెన్నుకు బలోపేతం చేసే వ్యాయామాన్లు వాకింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఎప్పటికీ కుంగి పోవటం ఉండదు.

    40 దాటితే ఎత్తు తగ్గిపోతారు

    నలభై ఏళ్ళు దాటుతుంటే చాలా మంది కొద్దిగా ఎత్తు తగ్గుతారు అంటే ఆశ్చర్యంగా వుంటుంది కదూ. నిజంగానే తగ్గుతుంటారు టిస్యూల మాస్  ఎముకల సాంత్రత  పోవటంలో ఆ…

  • నీహారికా , సక్సెస్ కీ ఫెయిల్యూర్స్ కి ప్రత్యేకమైన కోణాలు ఉంటాయా ? అన్నావు. ఉంటుంది. అత్యంత ముఖ్యమైంది కార్యాచరణ. దాని ఫలితంగానే విజయమైన అపజయమైన మనం ఫలితం వైపే చూస్తాము కానీ అసలా పని ఎంత బాగా చేసాం దానికి విజయం సాధించే బలం వుందా లేదా అని ఆత్మ విమర్శ ముందే చేసుకొం. అసలు చేసే పని పట్ల శ్రద్ధ మొత్తం పెట్టేస్తే అప్పుడు ఫలితం విజయం వైపే ఉంటుంది. శరీరం ఒక టూల్ కిట్ లాంటిది. ఎన్నోపనులు చేయగలదు. కానీ మనస్సుని తెలివి తేటల్ని ఒక దగ్గరే ఉంచి శరీరం మనే ఆయుధాన్ని విజయం వైపుగా సిద్ధం చేయాలన్నమాట. మనకు భావాలు ఎమోషన్లు వీటితోపాటు మేధావితనం విచక్షణా శక్తి ఉంటుంది. విశ్లేషణ కోణాలు నిర్ణయాలు మేధస్సు నుంచే పుడతాయి . మనసు పరిపరివిధాల ఆలోచనలు చేస్తుంది. దాన్ని మేధావితనం గైడ్ చేయాలి. నదికి తీరం ఎలాంటిదో అలాంటిదన్నమాట. తీరం బలహీనంగా ఉంటే నది కట్టలు తెంచుకుంటుంది. మేధస్సు బలంగా ఉంటే మనసుని నియంత్రిస్తుంది . లేకుండా మనస్సు మేధావి తనాన్ని పక్కనపెట్టి వైఫల్యం వైపు అడుగులు వేయిస్తుంది.. ఆరోగ్యవంతమైన మనస్సు దాన్ని అదుపు చెప్పే మేధావి తనం ఉంటే చాలన్నమాట.

    మనస్సుకి కట్టలు వేస్తే విజయం తధ్యం

    నీహారికా , సక్సెస్ కీ ఫెయిల్యూర్స్ కి ప్రత్యేకమైన కోణాలు ఉంటాయా ? అన్నావు. ఉంటుంది. అత్యంత ముఖ్యమైంది కార్యాచరణ. దాని ఫలితంగానే విజయమైన అపజయమైన మనం…

  • ఇజ్రాయిల్ కు చెందిన డోరీ సీసెరా అన్నావిడ సీటెచ్ బ్రెయిడ్ దారంతో ఎంబ్రాయిడరీ నగలు సృష్టించి మ్యూజియంలో గ్యాలరీలో డిస్ప్లేచేసిందిట. అలా అవన్నీ ఆన్ లైన్ లోంచి అందరి దగ్గరకు చేరాయి. చెవిపోగులు నెక్లెస్ లు పెండెంట్లు ఇలా ఎన్నోరకాల సీటెచ్ దారంతో ఎంబ్రాయిడరీ పద్దతి తో రకరకాల పూసలు రాళ్ళూ గుచ్చి రత్నాభరణాలంత భారీగా రూపం దిద్దుకుని వస్తున్నాయి . ఇది సాధారణంగా దుస్తుల ఎంబ్రాయిడరీ పద్ధతి. రెండుమూడు రంగుల దారాల్ని పక్కపక్కన పేర్చి కావాల్సిన డిజైన్ లో దాన్ని వంపులు తిప్పుతూ దుస్తులపైన ఎంబ్రాయిడరీ చేసేవారు. ఇప్పుడు వీటిని అంతే అందంగా వేసుకున్న దుస్తులకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా చేస్తున్నారు. ఈ దారాల్లో అన్నీ వర్ణాలు దొరుకుతాయి. కనుక ఏ వర్ణపు దుస్తులకైనా కరెక్ట్ గా సరిపోయేలా ఎంచుకోవచ్చు. ఇవి రంగురాళ్ల ఖరీదైన ముత్యాలు రత్నాలు కలబోసుకుని అద్భుతంగా కనిపిస్తూ కాలేజీలో కార్పొరేట్ ల ట్రెండ్ అయిపోతున్నాయి.

    అపూర్వమైన వర్ణాలతో దారపు నగలు

    ఇజ్రాయిల్ కు చెందిన డోరీ సీసెరా అన్నావిడ సీటెచ్  బ్రెయిడ్ దారంతో ఎంబ్రాయిడరీ నగలు సృష్టించి మ్యూజియంలో గ్యాలరీలో డిస్ప్లేచేసిందిట. అలా అవన్నీ ఆన్ లైన్ లోంచి…

  • చేతులతో అస్తమానం ఎదో పని చేస్తూనే ఉంటాం. సాధారణంగా గోళ్లు పెళుసుగా అయిపోవటమో లేదా విరిగిపోవటమో జరుగుతూ ఉంటుంది. రాత్రివేళ నిద్రపోయే ముందర ఆలివ్ ఆయిల్ తో గోళ్లకు మర్దనా చేసి చేతులకు గ్లౌజ్ లు వేసుకుని నిద్రపోతే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరినూనె తేనే సమపాళ్లలో తీసుకుని సన్నటి సెగ పైన ఉంచితే ఈ మిశ్రమం చక్కగా అవుతుంది. ఇది ఓ కప్పులోకి తీసుకుని గోళ్ళను అందులో ముంచి ఓ పావు గంట పాటు అలాగే ఆ మిశ్రమంలో వుంచగలిగితే మంచి ప్రయోజనం ఉంటుంది. వారానికి రెండు సార్లు ఇలా చేసినా గోళ్లు బలంగా ఉంటాయి. గోళ్లకు నారింజ రసం కూడా మంచిదే. రసం ముంచి గోళ్లను కాస్సేపు ఆలా వదిలేసి కడిగేస్తే చాలు. పొడిగా అనిపిస్తే మాయిశ్చరైజర్ రాయాలి. ఆలివ్ నూనె నిమ్మరసం మిశ్రమంలో గోళ్లు ముంచి పదినిముషాలు తర్వాత కడిగేస్తే గోళ్లు పెళుసు బారిపోకుండా ఉంటాయి. గుడ్డులోని తెల్లసొన లో ఆలివ్ ఆయిల్ నిమ్మరసం కలిపి వేళ్ళను అందులోవుంచి మేనిక్యూర్ చేసుకుంటే గోళ్లు శుభ్రంగా ఉంటాయి. గోళ్ళ చుట్టూ ఉన్న చర్మం సాగిపోకుండా టైట్ గా ఉంటుంది.

    గోళ్ళ ఆరోగ్యం కోసం వంటింటి చిట్కాలు

    చేతులతో అస్తమానం ఎదో పని చేస్తూనే ఉంటాం. సాధారణంగా గోళ్లు పెళుసుగా అయిపోవటమో లేదా విరిగిపోవటమో జరుగుతూ ఉంటుంది. రాత్రివేళ నిద్రపోయే ముందర ఆలివ్ ఆయిల్ తో…

  • మనకి చాలామంది పైన ఇష్టం ఉంటుంది గౌరవం ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎక్సప్రెస్ చేసే పద్ధతులు చాలా వచ్చాయి. పర్సనలైజ్ గిఫ్టులు చూడండి. ఒక త్రీడీ క్రిస్టల్ క్యూబ్ లో మనం ఇష్టపడే వ్యక్తి బొమ్మ చేస్తారు. ఇలాంటి కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ బహుమతుల నమూనాలని ఎన్నో సైట్స్ లో ఇమేజ్లను చూడచ్చు. మనం ఇవ్వాలనుకున్న బహుమతులు నచ్చిన డిజైన్ అందులో రాయవలిసిన కొటేషన్ ఫోటోని ఇస్తే చాలు. దాన్ని అలాగే ముద్రించి ఇచ్చేస్తారు . ఒక ఈవెంట్ కూడా ప్లాన్ చేయచ్చు. మనింట్లో బాబుంటే వారి ప్రతి పుట్టిన రోజున ఒక ఫోటోని కష్టమైజ్ చేయించి ఇంకో పన్నెండు నెలల తర్వాత ప్రతి నేలలోను అద్భుతంగ తీయించిన ఫొటోలతో ఒక క్యాలెండర్ ప్రింట్ చేయించవచ్చు. పిల్లవాడి మొదటి సంవత్సరపు పుట్టిన రోజున వచ్చిన మనకు ఆప్తులైన వారికీ మాత్రమే ఈ క్యాలెండర్ ఇవ్వాలి. సుమా .. ఎందుకంటే మనం ఆప్యాయంగా దాచుకున్న అనుభూతుల్ని అంత ఆప్యాయంగా ఇష్టపడేవాళ్ళకే కదా ఇవ్వాల్సింది. ఇప్పుడు ఫోన్ లు ట్యాబ్ లాప్ టాప్ వెనక కూడా అంటించే స్టికర్లు ఇప్పుడన్నీ పర్సనలైజ్డ్ బహుమతులే.

    మనసు దోచే బహుమతులు

    మనకి చాలామంది పైన ఇష్టం ఉంటుంది గౌరవం ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎక్సప్రెస్ చేసే పద్ధతులు చాలా వచ్చాయి. పర్సనలైజ్ గిఫ్టులు  చూడండి. ఒక త్రీడీ క్రిస్టల్…

  • కీరాదోస కు ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయల్లో నాలుగో స్థానం వుంది. సహజంగా లభించే పౌష్టికాహారం ఇది. సేంద్రియ పద్దతిలో కీరా దోస శరీరానికి అంతులేని ఉపయోగాలిస్తుంది. బి విటమిన్ మెండుగా వుండే కీరా దోస తక్షణ శక్తీ కరకం. 95 శాతం నీరే. చర్మం శిరోజాల రక్షణకు ఇది ఔషధం. కళ్ళ కింద నల్లని వలయాలు ముడతలు కీరా దోస గుజ్జు అప్లయ్ చేస్తే పోతాయి. ఇందులో వుండే సిలికాన్ సల్ఫర్ లు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. ఎన్నో రకాల కాన్సర్ లను తగ్గించేందుకు కీరా సహాయపడుతుందని వాడియా పరిశోధనలు చెపుతున్నాయి. కీరా దోస పల్చని ముక్కను నాలుకతో మొటిలోని అంగిలికి తగిలేట్టు 30 సెకన్లు నొక్కిపెడితే చాలు అందులోని ఫైటో కెమికల్స్ నోటి దుర్వాసనను కారణం అయ్యే బ్యాక్తీరియా ను చంపేస్తాయి. ఎక్కువ నీరు తక్కువ క్యాలరీలు వుండే కీరా దోస బరువు తగ్గించేందుకు చాలా సహాయపడతాయి, ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మధుమేహం నియంత్రిస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం రెండు తమాషా ఉపయోగాలున్నాయి. స్నానాల గదిలో అద్దని కీరముక్కలతో రుద్దితే వేడి నీటి వల్ల అడ్డం పై ఆవిరి ఏర్పడదు. అదే తలుపులు శబ్దం చేస్తుంటే కీరా ముక్క రుద్దితే శబ్దం పోతుంది.

    కూరగాయల్లో కీరాది నాలుగో స్థానం

    కీరాదోస కు ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయల్లో నాలుగో స్థానం వుంది. సహజంగా లభించే పౌష్టికాహారం ఇది. సేంద్రియ పద్దతిలో కీరా దోస శరీరానికి అంతులేని ఉపయోగాలిస్తుంది.…

  • బీట్ రూట్ రసం మేలు చేస్తుందని విన్నాం. కానీ అందానికి కూడా బీట్ రూట్ ఉపయోగపడుతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు. వాళ్లు ఏం చెపుతున్నారంటే బీట్ రూట్ ముక్కని గుజ్జుగా చేసి అందులో నాలుగు చుక్కల బాదం నూనె చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట సేపు ఆరనిచ్చి కడిగేస్తే చర్మం నిగారింపుగా ఉంటుంది. బీట్ రూట్ గుజ్జులో రెండు స్పూన్ల ముల్తానీ నత్తి చెంచా నిమ్మ రసం కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవచ్చు, అరకప్పి పెరుగులో చిటికెడు పసుపు కొద్దిగా బీట్ రూట్ గుజ్జు కలిపి పదినిమిషాలు ఆగి శుభ్రం చేయూస్కుంటే చర్మం టైట్ గా కనిపిస్తుంది. బీట్ రూట్ రసం కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూది ముంచి మొహం శుభ్రం చేసుకోవచ్చు. ఇదే రసంలో నిమ్మరసం కూడా కలుపుకుంటే పిగ్మెంటేషన్ దూరం అవుతుంది. సెనగపిండి బీట్ రూట్ రసం మెత్తగా చేసిన గులాబీ రేకుల మిశ్రమం కలిపి రాసుకుంటే ముఖం తాజాగా మారుతుంది.

    బీట్ రూట్ పూతతో గులాబీ రేకుల అందం

    బీట్ రూట్ రసం మేలు చేస్తుందని విన్నాం. కానీ అందానికి కూడా బీట్ రూట్ ఉపయోగపడుతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు. వాళ్లు ఏం చెపుతున్నారంటే బీట్ రూట్ ముక్కని…

  • గంటల కొద్దీ చదువుకునే వేళలు విశ్రాంతి లేని రోజులు కాస్సేపైనా ఆట లాడే అవకాశాలు లేకపోవటం వల్ల పిల్లలో ఫిట్ నెస్ లేకపోవటమే చిరాగ్గా విసుగ్గా అసహనంగా ప్రవర్తించటానికి కారణాలంటారు. హైస్కూల్ చదువుల సమయానికి పిల్లలపై అంతులేని చదువు బాధ్యత ఉంటోంది. మిగిలిన కాస్తో కూస్తో టైం సహజంగా ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. నిద్ర వేళలు తగ్గిపోతున్నాయి. విశ్రాంతి సమయం కూడా తగ్గుతోంది. పిల్లల్ని శారీరిక ఫిట్ నెస్ వైపుగా ప్రోత్సహించమంటున్నాయి. అధ్యయనాలు. అప్పుడే వారి ఆలోచన ధోరణి జ్ఞాపకశక్తి పెరుగుతూ వున్నాయి. పిల్లలు అభ్యాస ప్రక్రియలోని వుంటారు . చూసి చదివి నేర్చుకుని గుర్తుపెట్టుకుంటారు. ఫిట్ నెస్ లేని వాళ్లలో ఈ జ్ఞాపక శక్తి చురుకుదనం నశిస్తున్నాయి. పిల్లల్ని ఇండోర్ గేమ్స్ కో కంప్యూటర్ గేమ్స్ కో పరిమితంచేయకుండా బయట ఆటలాడేందుకు లేదా ఇతర వ్యాయమాలకు ప్రోత్సహించండి చదువుకు ఫిట్ నెస్ చాలా ముఖ్యం అంటున్నారు.

    జ్ఞాపక శక్తి పెంచే ఫిట్ నెస్

    గంటల కొద్దీ చదువుకునే వేళలు విశ్రాంతి లేని రోజులు కాస్సేపైనా ఆట లాడే అవకాశాలు లేకపోవటం వల్ల  పిల్లలో ఫిట్ నెస్ లేకపోవటమే చిరాగ్గా విసుగ్గా అసహనంగా…