• బాలీవుడ్ హీరోయిన్స్ దీవాలీ నగలలో వెలిగిపోతున్నారు.పండుగ పేరు చెప్పితే కొత్త నగలు వచ్చి వాలతాయి. పైన ధనత్రయోదసి దీపావళి కలసి వచ్చాయి. వరుసగా కూర్చున్న హారాలు, పెద్ద పాల్కో చోకర్ సెట్లు, బంగారు పూసల హారాలు, ఎప్పటికి ఎవ్వర్ గ్రీన్ అనిపించే డిజైన్స్ ధరించిన మన తారలు పండుగకు కొలువు తీరారు. ఖరీదైన నగల లోనే కాదు ఇమిటేషన్ జువెలరీ తో కూడా వాళ్ళు ఈ సాంప్రదాయ వేడుకలో, ఎన్నెన్నో కొత్త, పాత నగల తో మెరుపులు మెరిపించారు. ఒక్కసారి ఇమేజిన్ చేస్తే మీకే తెలుస్తోంది. కొత్త నగల్లో ఏ డిజైన్స్ వచ్చాయో.

    దీవాలీలో నగల వెలుగులు

    బాలీవుడ్ హీరోయిన్స్ దీవాలీ నగలలో వెలిగిపోతున్నారు.పండుగ పేరు చెప్పితే కొత్త నగలు వచ్చి వాలతాయి. పైన ధనత్రయోదసి దీపావళి కలసి వచ్చాయి. వరుసగా కూర్చున్న హారాలు, పెద్ద…

  • నైనిటాల్ లోని కుమావూన్ రాజ ప్రసాదం అబాట్స్ ఫోర్ట్ లో పుట్టిన జహ్నవీ ప్రసాద్ కు వార్సా బత్రాలు నిర్మించడం ఇష్టం. గాంధీ సత్య శాధన పుస్తకాన్ని చదివాక ఆయన గురించి ఎంతో స్టడీ చేసింది. గాంధీ తిరిగిన దక్షిణాఫ్రిక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ తిరిగి ఆయన్ను ప్రభావితం చేసిన వ్యక్తులను, ఆయన వాల్ల ప్రభావితులైన వ్యక్తులను కలుసుకుంది. గాంధీ సత్యశోధనలోని విషయాలు ఇతర చిత్రకారులతో కలిసి బొమ్మలు వేసి టేల్స్ ఆఫ్ యంగ్ గాంధీ పేరు తో ఆధునిక గ్రాఫిక్స్ నవలగా తీసుకొస్తుంది. రాజ ప్రసాదంలో ఆడంబరంగా జీవించాల్సిన ఈ అమ్మాయి నిరాడంబరమైన గాంధేయ మార్గం అంటే ఎంతో ఇష్టం.

    ఈ జమిందారు కూతురికి గాంధేయ మార్గం ఇష్టం

    నైనిటాల్ లోని కుమావూన్ రాజ ప్రసాదం అబాట్స్ ఫోర్ట్ లో పుట్టిన జహ్నవీ ప్రసాద్ కు వార్సా బత్రాలు నిర్మించడం ఇష్టం. గాంధీ సత్య శాధన పుస్తకాన్ని…

  • సీజన్ కోట భోజనం ఉంటుందా అంటే ఉంటుంది. ఉదయం టిఫీన్ గా రెగ్యులర్ టీఫిన్ స్థానంలో తయారయిన ఓట్ మిల్ ఆహార పదార్ధాలు తీసుకొవాలి. కాఫీ స్థానంలో జింజర్ టీ తాగాలి. ముడి బియ్యం తొ వండిన అన్నంతో రాకరకాల కూరగాయలు కలిపి చేసిన్ కూరలు తినాలి. చలి కాలంలో నిమ్మకాయ చేసే మేలు అంత ఇంత కాదు. సాయంత్రం వేళలో పల్లీలు,బాదం పప్పు తినాలి. ఇక రాత్రి వేళలొ తినే భొజనంలొకి వండేవి ఆలివ్ అయిల్ ఉండేలా చూసుకొవాలి. చివరగా డిన్నర్ ముగించే ముందు వెన్న తీసిన గోరు వెచ్చటి పాలు తీసుకోవాలి. ఈ కాలం వ్యయమానికి అనుకూలంగా ఉంటుంది. చలికాలంలో సమయం వృధా చేయకుండా వ్యయమానికి సమయం కేటాయించాలి.

    వింటర్ లో ఇలా తినాలి

    సీజన్ కో భోజనం ఉంటుందా అంటే ఉంటుంది. ఉదయం టిఫీన్ గా రెగ్యులర్ టీఫిన్ స్థానంలో తయారయిన ఓట్ మిల్ ఆహార పదార్ధాలు తీసుకొవాలి. కాఫీ స్థానంలో…

  • స్త్రీ పురుషుల మధ్య బేధ భావాలు తొలగి ఆర్ధిక అంశాల్లో లింగ వివక్ష లేని సమాజం సాధించాలంటే కనీసం 170 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక ఇటీవల ఒక నివేదిక వెలువరించింది. ఈ నివేదిక నేపథ్యంలో ఐస్ లాండ్ రాజధాని రేక్జావిక్ నగరంలో యధావిధిగా ఉదయం ఆఫీసులతో నిండిపోయాయి. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 38 నిమిషాలైంది. వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఒక్కసారిగా పని ముగించి రోడ్ల మెడకు వచ్చారు. ఎందుకంటే ఒకే పనిచేస్తున్న పురుషులు మహిళల మధ్య 14-18 శాతం వేతనాల అంతరం ఉంది. ఆ ప్రకారం మహిళలు జనరల్ షిఫ్ట్ లో 2 గంటల 38 నిమిషాల వరకు పని చేస్తే చాలు. అందుకే మహిళలు సరిగ్గా ఆ సమయానికి బయటకి వచ్చేస్తారు. వంట పిల్లల బాధ్యతలు కూడా ఆ రోజు అలాగే విముఖత వ్యక్తం చేసారు. ఇంతా చేస్తే ఏమైందో తెలుసా 2022 నాటికీ పురుషుల తో సమానంగా వేతనాలు ఇస్తామని ఐస్ లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. డబ్ల్యు ఈ ఎఫ్ నివేదిక లో లింగ సమానత్వం లో ఐస్ లాండ్ ప్రధమ స్థానంలో ఉంది. మనం మాత్రం 87 వ స్థానంలో ఉన్నాం. ఎవరెందుకు సిగ్గు పడాలో అలా సిగ్గుపడాలి. అంతే కదా.

    ఐస్ లాండ్ మహిళల అద్భుత పోరాటం

    స్త్రీ పురుషుల మధ్య బేధ భావాలు తొలగి ఆర్ధిక అంశాల్లో లింగ వివక్ష లేని సమాజం సాధించాలంటే కనీసం 170 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్ధిక వేదిక…

  • నయీ దిశ రిసార్ట్స్ సెంటర్ వ్యవస్థాపకురాలు ప్రాచిడియో . స్పెషల్ కిడ్స్ కు అండగా నిలబడాలన్నది ప్రాచీ కోరిక. స్పెషల్ కిడ్స్ ఉన్న తల్లి తండ్రులకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చేందుకే నయీ దిశ పోర్టల్. ఇంటలెక్చువల్ అండ్ డెవలెప్మెంటల్ డిజబిలిటీ తో బాధపడుతున్న కుటుంబాల పేరెంట్స్ వారి పిలల్లకు సాధికారులుగా నిలబడేందుకు తల్లులకు పిల్లల గురించి కేర్ గివింగ్ సామర్ధ్యం పెంచేందుకు ఇలాంటి పిల్లలున్న కుటుంబాలకు మధ్య కమ్యూనికేషన్ ఏర్పర్చేందుకు సాయపడుతుంది. ఈ వెబ్ సైట్ పేరు NAYIDESTHA .ORG ఇందులో రకరకాల ఈ డిసార్డర్ల కు సంబంధించిన సమాచారం తెలుగు ఇతర భాషల్లో వుంటుంది. ఇది హైద్రాబాద్ ,సికింద్రాబాద్ లో ప్రస్తుతం పనిచేస్తోంది.

    స్పెషల్ కిడ్స్ కోసం నయీ దిశ

    నయీ దిశ రిసార్ట్స్ సెంటర్ వ్యవస్థాపకురాలు ప్రాచిడియో . స్పెషల్ కిడ్స్ కు అండగా నిలబడాలన్నది ప్రాచీ కోరిక. స్పెషల్ కిడ్స్ ఉన్న తల్లి తండ్రులకు అవసరమైన…

  • న్యూయార్క్ లో ఉండే దేవినేని ఏరో మొయితా ఓహ్రా డాన గోల్డ్ మెన్ కలిసి యాసిడ్ ఎటాక్ భాదితుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష కు నిరసనగా ప్రియ అనే అమ్మయిని హీరోయిన్ గా లైంగిక, యాసిడ్ దాడులను ఎదుర్కోనే దిరోదత్త యువతిగా కామిక్ సీరిస్ సృష్టించారు.దినిలో భాగంగా విడుదలైన ప్రియశక్తి,ప్రియ మిర్రర్ పుస్తకాలు అన్ లైన్ లొ హల్ చల్ చేస్తున్నాయి. ప్రియశక్తిని జండర్ ఈక్వాలీటి చాంపియన్ గా ఐక్యరాజ్య సమితి మహిళ విభాగం అభివర్ణించింది. ఈ సీరీస్ లో భాగంగా మహిళల అక్రమ రవాణా కి సంభందించి ప్రియ అండ్ లాస్ట్ గర్ల్ కుడా రాబొతుంది.ఈ పుస్తకాలను ఆన్ లైన్ లొ కుడా చదువుకొవచ్చు.డిజిటల్ కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

    జండర్ ఈక్వాలిటి చాంపియన్ ప్రియ

    న్యూయార్క్ లో ఉండే దేవినేని ఏరో మొయితా ఓహ్రా డాన గోల్డ్ మెన్ కలిసి యాసిడ్ ఎటాక్ భాదితుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష కు నిరసనగా…

  • మొహం గురించి శరీరం గురించి ఫిట్నెస్ గురించి చాలా సార్లు మాట్లాడుకుంటాం. శ్రద్ధ తీసుకుంటాం గానీ శంఖం లాంటి మెడకోసం ఎప్పుడూ ఆలోచించం. శరీరాన్ని మెదడునీ కనెక్ట్ చేసేది మెడ. చూసేందుకు చిన్నగా ఉన్నా విభిన్న గ్రూపులు కలిసిన పన్నెండు కండరాలుంటాయి మెడలో. సరైన పోశ్చర్ లేకపోయినా సరిగ్గా కూర్చోకపోయినా మెడ చాలా త్వరగా ప్రభావితం అవుతుంది. మెడను బలోపేతం చేయగలిగే స్ట్రెంగ్త్ నింగ్ ఎక్సర్ సైజులు అనేకం ఉన్నాయి. నెక్ ఎక్సర్ సైజులు సింపుల్ వే అయినా మెడను బలంగా ఉంచుతాయి. నిపుణుల పర్యవేక్షణలో సరిగ్గా నేర్చుకుని ప్రతి రోజూ పది నిమిషాలు నెక్ ఎక్సర్ సైజులు చేయమంటున్నారు డాక్టర్లు.

    శంఖం లాంటి మెడ కోసం

    మొహం గురించి శరీరం గురించి ఫిట్నెస్ గురించి చాలా సార్లు మాట్లాడుకుంటాం. శ్రద్ధ తీసుకుంటాం గానీ శంఖం లాంటి మెడకోసం ఎప్పుడూ ఆలోచించం. శరీరాన్ని మెదడునీ కనెక్ట్…

  • ఎలాంటి ఇన్ఫెక్షన్ల లేదా మచ్చలు పడకుండా బ్లాక్ హెడ్స్ సులువుగా తొలగించుకోవచ్చు. ముఖానికి ఆవిరి పట్టి చర్మరంధ్రాలు పెద్దవయ్యాక బ్లాక్ హెడ్స్ తేలిగ్గా బ్లాక్ హెడ్ రిమూవర్ తో తొలగించవచ్చు. ముల్లంగి గింజల్ని నీటి తో కలిపి గ్రైండ్ చేసి అప్లయ్ చేస్తే బ్లాక్ హెడ్స్ రాలిపోతాయి. ఓట్ మీల్ లేదా బాదం మాస్క్ వేసినా ముఖం క్లీన్ అవుతుంది. బాదం పొడిని లేదా ఓట్ మీల్ ని రోజ్ వాటర్ తో కలిపి ఈ మాస్క్ వేయాలి. వేళ్ళ కొనాలతో నెమ్మదిగా రబ్ చేస్తే ఈ బ్లాక్ హెడ్స్ రాలిపోతాయి. నిమ్మరసం రాస్తూ నెమ్మదిగా మసాజ్ చేసినా బ్లాక్ హెడ్స్ లూజ్ గా అయిపోతాయి. తర్వాత బ్లాక్ హెడ్స్ ని తేలికగా తొలగించవచ్చు.

    బ్లాక్ హెడ్స్ పోగొట్టటం ఈజీ

    ఎలాంటి ఇన్ఫెక్షన్ల లేదా మచ్చలు పడకుండా బ్లాక్ హెడ్స్ సులువుగా తొలగించుకోవచ్చు. ముఖానికి ఆవిరి పట్టి చర్మరంధ్రాలు పెద్దవయ్యాక బ్లాక్ హెడ్స్ తేలిగ్గా బ్లాక్ హెడ్ రిమూవర్…

  • చలి కొంచెం వణికిస్తే చాలు. పెదవులు పగిలి పోతూ వుంటాయి. ఎలాగోలా భరించి పెట్రోలియం జెల్లీ రాసినా కాసేపటికే పెదవులు పొడిబారుతాయి. పేరిన నెయ్యి ట్రై చేస్తే పెదవులు ఎంతసేపు తేమగా కనిపిస్తాయి. పెదవులు పొడిబారి పోయి ఒక్కోసారి రక్తం కూడా వస్తుంది. అలాంటప్పుడు షియా బటర్ రాస్తే పగిలిన గాయం మాన్పటమే కాకుండా పెదవులను తేమగా ఉంచుతుంది. అలాగే కలబంద తో చేసిన లిప్ బామ్ కూడా ఇన్ఫెక్షన్ల ని దూరం చేసి నొప్పిని తగ్గిస్తుంది. రాత్రి పడుకునేముందు మంచి కొబ్బరినూనె రాసినా సరే లేదా తేనె కూడా చక్కని ప్రత్యమ్నామే.

    పగిలిన పెదవుల కోసం

    చలి కొంచెం వణికిస్తే చాలు. పెదవులు పగిలి పోతూ వుంటాయి. ఎలాగోలా భరించి పెట్రోలియం జెల్లీ రాసినా కాసేపటికే పెదవులు పొడిబారుతాయి. పేరిన నెయ్యి ట్రై చేస్తే…

  • ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆలా లండన్ లో పని చేస్తున్న గీతాంజలి రాజమణి భారత్ వచ్చి బెంగుళూరు లోని గ్రీన్ మై లైఫ్ సంస్థను డిజైన్ చేసే ముందర గార్డెనింగ్ పైన పట్టు సాధించాలి. ఇక వ్యాపారంలో దిగి హోటళ్లు రిసార్ట్ లు ,ఇళ్లలో మొక్కల్ని ఏర్పాటు చేస్తారు. ల్యాండ్ స్కేపింగ్ ,కిటన్ గార్డెన్ ల తో సరి పెట్టుకోకుండా రైతుల కోసం విత్తనాలు మొక్కలు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. కూరగాయలు పండ్లు ఉద్యానవన పంటలు అంతర పంటలకు సంబంధించి 400 రకాల విత్తనాలు రైతుల కోసం పంపిణీ చేస్తారు. ప్రత్యక్షంగా రైతులను కలిసి మంచి విత్తనాలు సేకరించి గిట్టు బాటు ధర చెల్లిస్తారు. ఇలాంటి వాళ్ళను తలుచుకుంటే ఏదైనా కొత్త పని చేయాలనిపిస్తుందేమో కదా !

    మొక్కల వ్యాపారం చేస్తుంది గీతాంజలి

    ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆలా లండన్ లో పని చేస్తున్న గీతాంజలి రాజమణి భారత్  వచ్చి బెంగుళూరు లోని గ్రీన్ మై లైఫ్…