• నాలుగైదు సర్వింగ్స్ ఆరోగ్యం.

    కడుపు నిండా తినడం అన్న కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. ప్రతి ఫుడ్ గ్రూప్ నుంచి కొన్ని సర్వింగ్స్ తీసుకుంటే ఆరోగ్యం అని చెప్పుతున్నారు డైటీషియన్లు. ఆహార సమతుల్యంగా…

  • పడుకునేందుకు పద్దతి ఒక్కటి వుంటుంది.

    పాడుకొనే సమయంలో కూడా పద్దతిగా పడుకొవాలంటారు నిపుణులు. గట్టిగా వుండే దిండు కాకుండా తలకింద మెత్తని దిండు వుండాలి. ఒక్కోసారి మెడ నొప్పి బుజాల నొప్పి వస్తాయి.…

  • జీవన విధానాన్ని నిర్ణయించే అలవాట్లు

    మన జీవన విధానంపైన మనం తీసుకునే ఆహరం ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆహరం అంటే రోజువారీ భోజనంతో పాటు ఆరోగ్యవంతమైన స్నాక్స్ తినడం, పూర్తిస్థాయి ధాన్యం,…

  • ఆనందాన్నిట్టే ఐదు పదార్ధాలు ఉన్నాయంటున్నారు పరిసోధకులు. ఈ ఐదు రకాలు తింటే ఆందోళన వుండదు, అసలు విచారమే మాయం అయిపోతుందిట. ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పోష్కలంగా వుండే చేపలు, అవకాడో, అరటిపండ్ల పాలకూర, ముడి బియ్యంలో వుండే అన్నం తినడం వల్ల మనసు ప్రశాంతంగా హాయిగా వుంటుంది అంటున్నారు. ఆ పదార్ధాలలోని పోషకాలతో మెదడులో నెరటోసిన్, డాపమైన అనేక రసాయినం ఫలితంగా ఉత్సాహంగా సంతోషం వుంటుంది. కనుక ఈ ఐదింటిలో ముడిబియ్యపు అన్నం పూర్తిగా తీసుకుంటే మిగతావి రోజుకొకటి అయినా భిజనంలో ఉండేలా చూసుకుంటే సంతోషం మన దగ్గర, మనతోనే ఉంటుందన్నారు పరిశోధకులు. చుట్టూ పచ్చని ప్రక్రుతి కళ్ళకు సంతోషం ఇస్తే, ప్రక్రుతి సహజంగా దొరికే పదార్ధాల తోనే ఆనందపు రహస్యం వుంది తెలుసుకోండి అని చెప్పుతున్నారు పరిశోధకులు.

    ఇవి ఆనంద పెట్టే పదార్ధాలు.

    ఆనందాన్నిట్టే ఐదు పదార్ధాలు ఉన్నాయంటున్నారు పరిసోధకులు. ఈ ఐదు రకాలు తింటే ఆందోళన వుండదు, అసలు విచారమే మాయం అయిపోతుందిట. ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పోష్కలంగా వుండే చేపలు,…

  • ఒక్కోసారి ఏం చేయాలన్నా ఉత్సాహం వుండదు. ఆటోమాటిక్ గా ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువగా వున్నాయని పిస్తోంది. లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతాం. మరలాటి సమయంలో కొత్త ఉత్సాహం నిమ్పుకోవాలంటే ప్రచీన ఆధ్యాత్మిక హీలింగ్ ప్రక్రియా విధానం అనుసరించాలి. అంటే హాయిగా స్నానం చేయడం, నీళ్ళు తాగడం. నీటి వల్ల శరీరం కొత్త ఉత్సాహం పుంజుకొంటుంది. అలాగే తాజా సుగంధ పరిమళాన్ని ఆశ్రయించాలి. లేమెన్ గ్రీన్ ఆరంజ్ సెంట్ వంటివి వాడితే, ఈ పరిమళాలు మనస్సుకి ఆహ్లాదం ఇస్తాయి. తర్వాత మనస్సు స్వాంతన కోసం, ఉత్సాహం, శక్తి కోసం అరటి పండు తినాలి. ఇది తక్షణ శక్తి ఇస్తుంది. రుతుస్రావ సమయంలో వుండే చిరాకులను, తిమ్మిర్లను పోగొడుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గి ఎలక్ట్రోలైట్ల సమతుల్యం దెబ్బతిన్నప్పుడు అరటి పండే ఆదుకుంటుంది. మనసు డల్ గా వుంటే నూనె తో చేసిన ఏ వస్తువు జోలికి పోకుండా ఒక అరటి పండు తిని కాసిన్ని మంచి నీళ్ళు తాగితే సరి.

    మూడ్ సరి చేసేవి ఇవే.

    ఒక్కోసారి ఏం చేయాలన్నా ఉత్సాహం వుండదు. ఆటోమాటిక్ గా ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువగా వున్నాయని పిస్తోంది. లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతాం. మరలాటి సమయంలో కొత్త ఉత్సాహం…

  • ఎక్కువ సార్లు తింటుంటేనే ఆరోగ్యం

    చాలా మంది మూడు పూటలా భోజనం చేసే వాళ్ళు ఉన్నారు. కొందరు ఒక సారే తిని సరిపెట్టుకొంటారు. కొంత మంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు.అయితే…

  • వీటిని వెంట వుంచుకోవాలి

    వేసవిలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. పగటి వేళల్లో మైల్డ్ క్లెన్సర్ తో రోజుకో నలుగు సార్లు అయిన ముఖం శుబ్రం…

  • అన్నం తినడం ఎగ్గొడితే చాలు లావు తగ్గిపోతామనుకొంటారు. కానీ ఇది చాలా తప్పు. కొద్ది మోతాదులో రోజుకు నాలుగైదు సార్లు డైట్ తీసుకొంటే శరీరానికి మంచిదంటున్నారు పోషక నిపుణులు. ఇలా చేస్తేనే సరైన సమయంలో జీర్ణక్రియ రేటు మెరుగు పడుతుంది అంటారు. కొద్ది పరిమాణంలో ఫుడ్ తీసుకోవడంలో శరీరంలోని గ్లూకోజ్ స్దిరంగా వుంటుంది. వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ మంచిదనుకుంటారు. ఇది కూడా అపూహానే. అన్ని రకాల బ్రేడ్స్ లోను కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటాయి. రెండు రకాలు రిఫైన్డ పిండి తో చేసినవే. అలాగే తక్కువ ఫ్యాట్ అంటే మంచిది అనుకొంటారు. శరీరంలోని 80 శాతం హార్మోన్స్ ఫ్యాటీ కొలెస్ట్రోల్ తో రూపొందించినదే. తక్కువ పోషకాల వల్ల బయో కెమిస్ట్రి దెబ్బతింటుంది. క్యాలరీలు ఏమాత్రం తగ్గకూడదు. తక్కువ క్యాలరీలు వున్న ఫుడ్ వున్న ఫుడ్ తీసుకుంటే శరీరానికి పోషకాలు అందవు. అంచేత పోషకాలు సమం గా వుండే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి.

    ఇలాంటి అపోహల వల్ల నష్టం

    అన్నం తినడం ఎగ్గొడితే చాలు లావు తగ్గిపోతామనుకొంటారు. కానీ ఇది చాలా తప్పు. కొద్ది మోతాదులో రోజుకు నాలుగైదు సార్లు డైట్ తీసుకొంటే శరీరానికి మంచిదంటున్నారు పోషక…

  • ఎన్నో ఆహార పదార్దాలు నిల్వ చేసే టప్పుడు, వాటిని వండేటప్పుడు చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగాళా దుంపలు బాగా పెద్దవిగా వస్తు వున్నాయి మార్కెట్ లో కానీ చిన్న దుంపల్ని తీసుకుంటే వాటిని చెక్కు తీసె పని ఉండదు. ఆ చెక్కులో వుండే పిచులో మనకు 50 శాతం ఫాలి ఫినాల్స్ అందుతాయి. పాలకూర సలాడ్ లో వేసే ముందర కొన్ని నిమిషాలు పెనం పైన వేడి చేస్తే అందులోని విటమిన్-ఎ శాతం మూడు రెట్లు పెరుగుతుంది. ద్రాక్ష పండ్లు ఫ్రిజ్ లో పెట్టక పోవడం మంచిదే. బయట టేబుల్ పైన గాలి లో ఉంచితే వాటి పైన పేరుకున్న రాసాయినాలు పోతాయి. బజార్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు దొరుకుతాయి. వీటిని ఎప్పటి కప్పుడు వంటల్లో వదేయాలి. నిల్వ ఉంచితే పొట్టు ఉంటేనే మంచిది. గాలికి వెలుతురికి వాటిల్లో వుండే వాసన రుచి పోతుంది. టొమాటో ఫ్రిజ్ లో ఉంచితే వాటిల్లో వుండే పోశాకాలైన లికోపిన్ ఫైటో న్యూట్రియంట్లు యంటి ఆక్సిడెంట్ గుణాలు తగ్గిపోతాయి.

    అన్ని ఒకేలా వుండవు

    ఎన్నో ఆహార పదార్దాలు నిల్వ చేసే టప్పుడు, వాటిని వండేటప్పుడు చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగాళా దుంపలు బాగా పెద్దవిగా వస్తు వున్నాయి మార్కెట్ లో…

  • కొన్ని రుచికి బావుండవు అయినా తింటే బరువు తగ్గుతారు. కొన్ని పనులు చేయాలంటే ఎంతో బద్ధకంగా వుంటుంది. కానీ కాస్త హుషారు తెచ్చుకుంటే ఆరోగ్యం, శరీర సౌందర్యం రెండూ మెరుగవ్వుతాయి. కాఫీ, టీ లకు బదులు గ్రీన్ టీ, వైట్ బ్లాక్ టీ తాగితే మంచిదంటారు బ్రిటిష్ డైటింగ్ అసోసియేషన్ కు చెందిన నిపుణులు. ఓపికగా వాళ్ళు సూచించిన పనులు చేయాలి. ఆలస్యంగా నిద్రపోవడం, తినడం ఏదీ మంచిది కాదు. ఇలాంటి జీవన శైలి ఊబకయానికి దరి తీస్తుంది. ఆహారం మానేస్తే బరువు తగ్గడం ఎమీ వుండదు. శరీరానికి సరిపడా శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. రాత్రి సమయంలో లేవాల్సి వస్తుందని నీళ్ళు తాగారు. కానీ మధ్యమధ్యలోనీళ్ళు తాగాలి. ఆ నీళ్ళల్లో కీరదోస ముక్కలు, పుదీన, నిమ్మకాయ పడేసి ఆ నీళ్ళు తాగితే శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోతాయి. అదనపు కొవ్వును కరిగించేందుకు ఈ నీళ్ళు ఉపకరిస్తాయి. జిమ్ యోగా చేయక పోయినా ఉదయం వేళ నడక, ఈత, టెన్నిస్ ఆడటం వంటివి చేస్తేనే ఏ కాలంలోనైనా బద్ధకం వుండదు. రాత్రి పూట తక్కువ తినడం మంచిదే కానీ నీరసం రాకుండా పళ్ళు, మజ్జిగా తప్పనిసరిగా తినాలి.

    ఆహారం కాదు జీవన శైలి మార్చాలి

    కొన్ని రుచికి బావుండవు అయినా తింటే బరువు తగ్గుతారు. కొన్ని పనులు చేయాలంటే ఎంతో బద్ధకంగా వుంటుంది. కానీ కాస్త హుషారు తెచ్చుకుంటే ఆరోగ్యం, శరీర సౌందర్యం…

  • ఆమె గురించి నిమిషం ఆలోచిస్తున్నారా?

    ఇంట్లో అందరికీ తెల్లారేసరికి, అమ్మకి తెల్లారి మూడు గంటలు దాటిపోయి ఉంటాయి. ఆమె అంత ముందరగా లేస్తేనే అందరికి సకల సదుపాయాలు. ఆమె ఒక్క రోజు అనారోగ్యంతో…

  • ఇప్పుడీ ఎండల్లో చల్లదనం కోసం, అలాగే బరువు తగ్గిపోవటం కోసం ఈ పళ్ళ రసాల వైపే చూడాలి. దీర్ఘకాలం ప్రయోజనం పొందాలంటే ఈ జ్యూస్ లు తాగాలి. పుచ్చకాయలో 80 శాతం వరకు నీరు వుంటుంది. ఇందులో ప్రోటిన్లు కొలెస్ట్రోల్ కొవ్వు తక్కువగా ఉంటాయి. డైట్ ప్లాన్ కోసం అయితే రోజుకి మూడు గ్లాసుల జ్యూస్ తాగొచ్చు. పైనాపిల్ జ్యూస్ శక్తినిచ్చేందుకు మంచి జ్యూస్. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేసి బరువు తగ్గిస్తుంది. అవకాడో జ్యూస్ కొంచం తేనె కలిపి తీసుకోవడం ద్వారా పొట్ట తగ్గించుకోవచ్చు. ఇక టొమాటో జ్యూస్ అయితే టమాటాలు ఉడికించి గ్రైడ్ చేసి చిటికెడు పంచదార కలిపి తాగొచ్చు. వంటి రంగుతో పాటు లావణ్యం మెరుగుపడుతుంది. నేచురల్ యాంటి సెప్టిక్ ఇందులో వుండే లైకోపిన్ సమర్ధవంతమైన యంటి ఆక్సిడెంట్ . ద్రాక్ష జ్యూస్ క్రమం తప్పకుండా తాగి తీరాలి. ఇక నారింజ పండులో కన్నా నలుగు రెట్లు విటమిన్-సి దోసకాయ జ్యూస్ ద్వారా లభిస్తుంది. ఇందులోని పోషకాలు అధిక బరువు అదుపు చేసేందుకు సహకరిస్తాయి.

    ఒంటి రంగు, లావణ్యం మెరుగు పరిచే జ్యూస్ లు

    ఇప్పుడీ ఎండల్లో చల్లదనం కోసం, అలాగే బరువు తగ్గిపోవటం కోసం ఈ పళ్ళ రసాల వైపే చూడాలి. దీర్ఘకాలం ప్రయోజనం పొందాలంటే ఈ జ్యూస్ లు తాగాలి.…

  • శారీరక సౌష్టవం యవ్వనంతో ఉండాలంటే ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్, రున్నింగ్ చేయాల్సిందే. అప్పుడే శరీరంలో చక్కని తీరులో వుంటుంది. ఎక్కువ దూరం రన్నింగ్ వల్ల మోకాళ్ళకు హాని జరిగి ఆస్టియో ఆర్దరైటిస్ రోగాల భయం చాలా మందిలో వుంటుంది. కానీ పరుగెత్తడం వల్లనే కర్డిలేజ్ ఆరోగ్యంగా వుంటుంది. దీని వల్ల మోకాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దృఢమైన కండరాళ్ళు లిగ్మెంట్లకు పరుగె అవసరం. ఇవి మోకాళ్ళ పై వత్తిడి తగ్గించి ఆస్టియో ఆర్ధరైటీస్ రాకుండా కాపాడతాయి. సరైన పడరక్షకులువేసుకోకుండా పరుగేడితేనే హాని జరుగుతుంది. పరుగెత్తే సమయంలో వత్తిడి తట్టుకోగల సహజగుణం మోకాళ్ళకు వుంటుంది. ఆర్ధరైటీస్ వచ్చే అవకాశమే లేదు. మనస్పూర్తిగా ఇష్టపడుతూరోజుకు ఒక అరగంట రన్నింగ్ చేసిన మంచి ఫలితం వుంటుంది. శరీరం చక్కని సౌష్టవం యవ్వన రూపంలో వుంటుంది.

    చక్కని రూపం సౌష్టవం కోసం

    శారీరక సౌష్టవం యవ్వనంతో ఉండాలంటే ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్, రున్నింగ్ చేయాల్సిందే. అప్పుడే శరీరంలో చక్కని తీరులో వుంటుంది. ఎక్కువ దూరం రన్నింగ్ వల్ల మోకాళ్ళకు…

  • ఇటలీలో ప్రజలు సన్నగా నాజూగ్గా ఉంటారట. దానికి కారణం వాళ్ళు ఆహారం తీసుకునే పద్దతి అంటారు ఎక్స్ పర్ట్స్. మనం తినే ఆహారంలో రకరకాల కూరలు, అన్నం, పప్పు, పులుసు ఇలా ఉంటాయి. వీటిని అన్నంతోనో, ఇంకో రావ్వతోనో కలుపుకు తినటాం. నంజుకోవడం అనేది మన అలవాటు. కానీ ఇటలీ వాళ్ళు అలా కాదు. ఆకు ఐటమ్స్ వుంటే అన్నింటినీ విడివిడిగానే తింటారట. అలా ఒకసారి ఒక ఐటెం తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. పరిమితంగా తిని ఆపేస్తారు. మన దేశంలో రకరకాల రుచులు కలిపి అవసరానికి మించి తినటం కనుక పొట్ట పెరుగుతుంది. అలాగే వాళ్ళకున్న మంచి అలవాటు కండరాల్లను చెక్కని రూపంలో ఉంచుకునేందుకు కండరాల్ల నొప్పులు రానివ్వరు. ఆలివ్ నూనె, కర్పూరం కలిపి శరీరం పై మర్దనా చేసుకోవడం . ఈ మర్దనా వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యం, కండరాల్ల రూపం బావుంటాయి. అలసట లేని వ్యాయామం ఇది.

    ఇటలీ వాళ్ళ నాజుకు రహస్యం ఇదే

    ఇటలీలో ప్రజలు సన్నగా నాజూగ్గా ఉంటారట. దానికి కారణం వాళ్ళు ఆహారం తీసుకునే పద్దతి అంటారు ఎక్స్ పర్ట్స్. మనం తినే ఆహారంలో రకరకాల కూరలు, అన్నం,…

  • ఏదైనా ఒక వ్యాసనం ప్రభావం మెదడు పైన ఎలా వుంటుందో చేసిన పరిశోధనలో మత్తు పదార్ధాలకు బానిసైన వారి మెదడులో ప్రీఫ్రంటల్ కార్టేక్స్ భాగం మార్పుకు గురైనట్లు, ఇంటర్నెట్ వ్యాసనానికి గురైన వారిలోనూ అదే మార్పులు గమనించారు. మెదడులో మాటలు జ్ఞాపక శక్తి కండరాళ్ళ కదలిక భావోద్వేగాల కేంద్రాలతో 10 నుంచి 20 శాతం కుచించుపోవడం ఇంటర్నెట్ వ్యసన పరుల్లో గమనించారు. మత్తుపనీయాలు తీసుకునే వారిలో శారీరక వ్యాయామం లేకపోవడం నిద్ర లేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. వాటివల్ల శరీరంలో, మెదడులో మార్పులు వస్తాయి. అటువంటి పరిస్థితులే నెట్ అడిక్షన్ లో కూడా కనిపించాయి. వీడియో గేమ్లు, కంప్యుటర్, ఇంటర్నెట్ వాడకం పెరిగితే మరింత డిప్రేషన్ పెరుగుతుంది. ఒత్తిడికి గురవ్వుతారు. గర్భిణీ స్త్రీలలో పిల్లలకు పాలిచ్చే స్త్రీలు సెల్ ఫోన్ ఇంటర్నెట్ వ్యసనానికి లోనై వుంటే దాని ప్రభావం గర్భస్థ శిశువు, పసి పిల్లల పైన వుండటం గమనించారు. పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు సెల్ ఫోన్ మేసేజ్లు ఇవ్వొద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.

    ఇంటర్నెట్ వ్యసనం మత్తుపానీయం లాంటిదే

    ఏదైనా ఒక వ్యాసనం ప్రభావం మెదడు పైన ఎలా వుంటుందో చేసిన పరిశోధనలో మత్తు పదార్ధాలకు బానిసైన వారి మెదడులో ప్రీఫ్రంటల్ కార్టేక్స్ భాగం మార్పుకు గురైనట్లు,…

  • మనిషి పుట్టుకతో వరంగా తెచుకున్న నవ్వుని సక్రమంగా ఉపయోగించుకోలేక ఎన్నో అనారొగ్యాలకు గురవ్వుతున్నారని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. శారీరక ఆరోగ్యానికి మానవ స్థితికీ సంబంధం ఉందన్న విషయం వైద్య శాస్త్రం అంగికరించినదే ఒత్తిడికి గురవ్వుతున్న అనవసరపు బెంగ ప్రదర్శించే వారికి రోగాలు త్వరగా సోకుతాయంటున్నారు. మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరంలో ఏర్పడే ప్రీరాడికల్స్ ప్రభావాన్ని నియంత్రించేహార్మోన్ లు ఉత్పత్తి అవ్వుతాయి. అందుకే మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరానికి బాహ్యంగా అంతర్గతంగానే కాదు మనస్సుకి ఎంతో మేలు కలుగుతుంది. మనసారా నవ్వే నవ్వు ప్రభావం మొత్తం 16 శరీర అంగ్ల పైన ప్రత్యక్ష ప్రభావం చుపుతుంది. ముఖ కండరాళ్ళు మొదలుకుని, ఊపిరి తిత్తులు, గుండె రక్త ప్రసరణ, ఇతర శరీర భాగాల కండరాళ్ళు , జీర్ణ వ్యవస్థ వంటివి నవ్వుతోనే మేలు పొందుతాయి. పదినిమిషాలు నవ్వితే శరీరంలో కండరాళ్ళ శక్తి వినియోగామవ్వుతుంది. అలా ఏడాది పాటు ప్రతి రోజు నవ్వితే ఐదు పండ్ల బరువు తగ్గుతారట. నవ్వటం అంటే అంతర్గత అవయువాల చేత జాగింగ్ చేయించటమని ఒక నిపుణుడి అభిప్రాయం. రోగ నిరోధక వ్యవస్థలో భాగంగా అనారోగ్యంతో ఆస్పత్రుల్లో వున్న వారి చికిత్స్య లో భాగంగా నవ్వు ఉపయోగిస్తున్నారు. మనస్పూర్తిగా నవ్వితే మనుషుల మూడ్ మార్చేసే, భాదను తొలగించే ఎండార్ఫన్ విడుదలవ్వుతాయి.

    ఆరోగ్యం కోసం హాస్యం

    మనిషి పుట్టుకతో వరంగా తెచుకున్న నవ్వుని సక్రమంగా ఉపయోగించుకోలేక ఎన్నో అనారొగ్యాలకు గురవ్వుతున్నారని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. శారీరక ఆరోగ్యానికి మానవ స్థితికీ సంబంధం ఉందన్న విషయం…

  • చక్కగా తయ్యారవ్వాలి తక్కువే తినాలి

    పనిచేస్తూ తినకండి. వేగంగా తినడం వల్ల సరిగా అరగదు ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్న ధ్యాసలేకపోవడం వల్ల ఎక్కువ కేలరీలు చేరతాయి. అందుకే ఎంత తొందర…

  • డైటీషియన్లు మన కోసం ఇచ్చే చార్ట్ చుస్తే గుండె జారి పోతుంది. అవన్నీ తయారు చేసుకోవడం కోసం రోజంతా కష్టపడ్డా సరిపోదు. అప్పుడిక రెండో పని లేక ఎలాగో సన్నగానో, ఇంకాస్త బరువుగానో అయిపోతాం. ఈ టిప్స్ పనికొస్తాయేమో చూడండి. భోజనం చేసే ముందర ఆర లీటర్ నీళ్ళు తాగి చూడండి చూడండి. తక్కువ క్యాలరీలే తినగాలుగుతాం. ఎగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే కొవ్వు కలుగుతుంది. చక్కెర కలపని కాఫ, లేదా బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాఫీలోని కెఫెన్ జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు తోడ్పడుతుంది. ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. కాఫీలో చెక్కర కలపొద్దు. కొద్ది శాతంగా కెఫెన్, యాంటీ ఆక్సిడెంట్స్ వుండే గ్రీన్ టీ తాగితే ఖచ్చితంగా బరువు పెరిగే ప్రసక్తే లేదు. వంటకాల్లో కొబ్బరి నూనె ఉపయోగించ గలిగితే ఇందులో స్పెషల్ ఫ్యాట్స్ తో జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. పిచు పదార్ధమైన గ్లూకోమనవ సప్లిమెంట్ వల్ల కుడా బరువు తగ్గించేందుకు ఇంతకంటే టిప్స్ ఇంకేం లేవు.

    ఈ కొంచెం చేయగలిగితే చాలు

    డైటీషియన్లు మన కోసం ఇచ్చే చార్ట్ చుస్తే గుండె జారి పోతుంది. అవన్నీ తయారు చేసుకోవడం కోసం రోజంతా కష్టపడ్డా సరిపోదు. అప్పుడిక రెండో పని లేక…

  • తెలిసో తెలియకో చాల అపార్ధాలు చేస్తాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతాయి. జాతీయ మానసిక ఆరోగ్య అధ్యాయినం ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి. మగవారిలో కంటే ఆడవాళ్ళలో కుంగుబాటు లక్షణాలు ఎక్కువని అధ్యాయినం చెపుతుంది. పిల్లలు పుట్టిన వెంటనే తల్లుల్లో ఏర్పడే ప్రసవానంతర కుంగుబాటు, పోస్ట్ పార్టిమ్ డిప్రషెన్ ఎక్కువగా వున్న ఇళ్ళల్లో దాని పై ద్రుష్టి సాదించారంటున్నారు. మాతృత్వం, దైవత్వంతో సమానం అంటారు కానీ బిడ్డ పై చూపించిన శ్రద్ధ తల్లిపై చూపించ మంటున్నారు. తల్లి దనమంటే ఎంతో గొప్పదని ఆడపిల్లలకునూరి పోయడం తో వాళ్ళు కూడా ప్రసవానంతరం వచ్చే ప్రతి ఇబ్బందిని భర్తీ చేస్తారని తమ ఆరోగ్యం పరోపకారంగా క్షీణిస్తోందని గ్రహించరని, చికిత్స గురించి ఆలోచించారు కనుక సమస్య ఎక్కువైపోతోందంటున్నాయి అధ్యాయినాలు. కుటుంబ సభ్యులు, వైద్యులు కూడా ఈ సమస్య పై ద్రుష్టిసారించాలని అద్యాయినాలు హెచ్చరిస్తున్నాయి.

    తల్లి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తున్నాం

    తెలిసో తెలియకో చాల అపార్ధాలు చేస్తాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతాయి. జాతీయ మానసిక ఆరోగ్య అధ్యాయినం ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి.…

  • మంచి కూరలు, సంబార్లు, పులిహోరలు, దేన్లో అయినా ఉప్పు వేయకుండా ఊహించండి. అస్సలు తిండే వద్దు బాబు ఏవో కంద మూలాలు తిని బతికేయచ్చు అనిపిస్తుంది. మరి డాక్టర్లేమో ఉప్పు అనారోగ్యం, బీ.పి పెరుగుతుంది, పక్షవాతం గుండె పోటు వగైరాలు పరుగెత్తుకుంటూ వచ్చేస్తాయి అంటారు కదా. ఒక అద్భుతమైన రిపోర్టు వచ్చింది. ఉప్పు ఎక్కువ తినడం వల్ల రక్తపోటు లో నమోదయ్యే తగ్గుదల చాలా నామ మాత్రం. ఉప్పు వల్ల రక్త పోటు స్వల్పంగా పెరుగుతుందని మాత్రమే శాస్త్రీయమైన ఆధారాలున్నాయి. కనుక డాక్టర్లు బీ.పి ఎక్కువైతే ఉప్పు తగ్గించమంటారు. అంతే కానీ ఉప్పుతో గుండెపోటు పక్షవాతం ఇలాంటి వేమీ వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఒక రిపోర్టు తేల్చింది. అంచేత మరీ హడలి పోయి చప్పిడి తిండి తో జిహ్వను చంపేసుకోవలసిన పనిలేదు. హాయిగా రుచిగా ఉప్పేసుకొండి అనేసాయి అధ్యాయినాలు. ఇప్పటికిది బెస్ట్ అధ్యాయినం.

    ఉప్పేసుకొండి పర్లేదు

    మంచి కూరలు, సంబార్లు, పులిహోరలు, దేన్లో అయినా ఉప్పు వేయకుండా ఊహించండి. అస్సలు తిండే వద్దు బాబు ఏవో కంద మూలాలు తిని బతికేయచ్చు అనిపిస్తుంది. మరి…