• వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్ కేర్ కోసం పరుగెత్తాలి. ఇప్పడూ ఇంట్లో చేసుకున్న వస్తువులతో ఆ ప్రయత్నాలు ఏవో చేస్తే సగం సమయం కలిసొస్తుంది. ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నా చర్మం చక్కగా కనిపించటం కోసం కొంత పోషణ అవసరం. రసాయనాల కంటే సహజ మైన వస్తువులు నయం కదా. ముఖ చర్మం ఎండిపోయి పగుళ్లు వచ్చినట్లు అయితే బనానా ఫేస్ మాస్క్ ట్రై చేయచ్చు. అరటిపండు పేస్ట్ గా చేసి కొత్త వెన్న కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. వెన్న లేకపోయినా మీగడ అయినా సరే. ఇవే ముఖానికి కావలిసినంత తేమను ఇస్తాయి. అరటిపండు గుజ్జు ఆ తేమను ఇంకొంత సేపు నిలబెడుతుంది. అలాగే అరటిపండు గుజ్జుకు తేనె ఒక టీస్పూన్ రోజ్ వాటర్ జతచేసి ఆ మిశ్రమాన్ని అప్లయ్ చేసినా ఇది ఫలితం ఉంటుంది. తేనె సహజమైన మాయిశ్చరైజర్ గా రోజ్ వాటర్ టోనర్ గా పనిచేస్తాయి. చలికాలంలో చర్మకాంతి కోసం ఈ కాంబినేషన్ ట్రై చేయండి.

    ఇంట్లోనే వింటర్ కేర్ ఫేస్ మాస్క్

    వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్…

  • మనకి కొన్ని రోల్స్ వుంటాయి. కొన్ని పదార్ధాలు వంటకీ కొన్ని శిరోజాలకు కొన్ని ఆహారం తో తీసుకుంటేనో అని విడివిడిగా ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి వంటింట్లో వాడే బేకింగ్ సోడా చర్మ సౌందర్యానికి మెరుగులు దిద్దుతుంది. అంటున్నారు. సౌందర్యాన్ని నిపుణులు. బేకింగ్ సోడా నీళ్లతో కలిసి పేస్ట్ లా చేసి ముఖం పై రాసుకుని ఆరనిచ్చి కడిగేస్తే చర్మం మురికిపోయి కాంతులీనుతుంది. అంటున్నారు. ఇదే పేస్ట్ ను వంటికి రాసుకుంటే మంచి డియోడ్రెంట్ గా పనిచేస్తుంది. ఒక బేసిన్ లో వేడి నీళ్లలో కొద్దిగా ఈ వంట సోడా ఉప్పు వేసి రెండు కళ్ళు అందులో ఉంచి పదినిముషాలు విశ్రాంతిగా కూర్చుని తర్వాత పొడి టవల్ తుడిస్తే పాదాల పగుళ్ల సమస్య పోతుంది. చలికాలంలో చర్మం పగిలి దురదలు రాకూండా గోరువెచ్చని నీళ్లలో వంటసోడా వేసి స్నానం చేస్తే రిలీఫ్ గా ఉంటుందంటున్నారు. ఎక్సపెర్ట్స్ వంటల్లో వాడేవి తినేవి ప్రమాదం లేనివి సైడ్ ఎఫెక్ట్స్ రానివి గనుక ఓసారి వాడి చూసినా పెద్ద నష్టం ఏమీ లేదు.

    ఇది సౌందర్య నిపుణుల సలహానే

    మనకి కొన్ని రోల్స్ వుంటాయి. కొన్ని పదార్ధాలు వంటకీ కొన్ని శిరోజాలకు కొన్ని ఆహారం తో తీసుకుంటేనో  అని విడివిడిగా ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి  వంటింట్లో వాడే…

  • ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్ తో మస్సాజ్ చేస్తే మృదువుగా వుంటుంది. సబ్బుకుబదులు సోప్ ప్రీ క్లీన్సర్ వాడాలి స్నానం చేయగానే క్రీమ్ మాయిశ్చరైజర్ లేదా బాడీ బటర్ ను అప్లయ్ చేయాలి . పాలు అవిసెగింజల పొడి బ్రౌన్ షుగర్ కలిపి వారానికి ఒక్కసారి స్క్రబ్ చేయాలి. బ్రౌన్ షుగర్ లేకపోయినా మాములు పంచదార కలిపినా అదే ఫలితం ఉంటుంది. తేనె నిమ్మరసం అలోవెరా జెల్ బాదం నూనె లేదా నిమ్మరసం కలిపినా అవకాడో రాయటం వల్ల కూడా చర్మానికి తేమ లభిస్తుంది. రోజుకు 8 నుంచి పది గ్లాసుల మంచి నీళ్లు దాహం వేయకపోయినా తాగాలి సోయా టోఫు డైరీ ఉత్పత్తులు చికెన్ చేపలు ఆహారంలో భాగంగా ఉండాలి. క్యారెట్లు టమాటో బీట్ రూట్ బొప్పాయి కమలా నారింజ ఆకుకూరలు పుచ్చ వంటి ఆక్సిడెంట్స్ అధికంగా లభించే వివిధరంగుల పండ్లు కూరగాయలు తినాలి.

    పొడిబారి చర్మానికి ఈ జాగ్రత్తలు

    ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన  నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్…

  • ఇటు ముఖ సౌందర్యం శిరోజాల రక్షణ కోసం చర్మం ఆరోగ్యంగా ఉండటంకోసం ఎప్పుడూ తేనె నిమ్మ కాంబినేషన్ ప్రస్తావన వస్తుంది తేనే నిమ్మలతో ఉన్నటువంటి యాంటీ బ్యాక్తీరియాల్ యాన్తి ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇవి ప్రకృతి సిద్ధంగా చర్మ రక్షణ కు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి . శరీరం బరువు పై అదుపు విషయంలో తేనెలో ఫ్రక్టోజ్ వుంటుంది. యాడ్ ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్ల చక్కెర నిమ్మరసం కడుపు నిండేట్లుగా చేస్తుంది. ఉదరం లోపల ఆల్కలైన్ వాతావరణాన్ని నిమ్మ ఎక్కువ జెసి బరువు తగ్గేందుకు సాయపడుతుంది. నిమ్మరసం తేనె సమాన భాగాలుగా చేసి ఆ మిశ్రమ మొహం పై రాసుకుంటే చర్మం రంగొస్తుంది. తేనె నిమ్మ పైనాపిల్ తో ముఖం పై ఉండే మొటిమలు మచ్చలు తొలిగిపోతాయి. నిమ్మ చెక్క పైన తేనె వేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రుద్దితే అవిపోతాయి. నిమ్మ తేనెల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ వయసుతో పాటు శరీరంలో మార్పులను ఆలస్యం చేస్తాయి. తేనె లో అధికంగా ఉండే చెక్కర వల్ల మైక్రోబ్స్ పోతాయి. నిమ్మలో ఉన్న ఆమ్లాల వల్ల బ్యాక్తీరియా వృద్ధి చెందదు.

    ఇవి ప్రకృతి ప్రసాదాలు

    ఇటు ముఖ సౌందర్యం శిరోజాల రక్షణ కోసం చర్మం ఆరోగ్యంగా ఉండటంకోసం ఎప్పుడూ తేనె  నిమ్మ కాంబినేషన్ ప్రస్తావన వస్తుంది తేనే నిమ్మలతో ఉన్నటువంటి యాంటీ బ్యాక్తీరియాల్…

  • టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన చిట్కాలతో ఈ మొటిమలు తగ్గించవచ్చు. సమపాళ్లలో తేనే నిమ్మరసం మొటిమల పైన రాస్తే ఫలితం ఉంటుంది. నువ్వులు నీళ్లలో నాననిచ్చి నూరిముద్దగా చేసి మొటిమల పై రాసి కడిగేస్తే చాలు. ముఖానికి బంగాళా దుంప రాస్తే ఇవి మొటిమలు తగ్గించటం కాక మెరిసేలా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్న చోట లవంగాలు నీళ్లు లేదా పాలతో కలిపి మెత్తగా నూరి అప్లయ్ చేసి పదినిమిషాలు పాటు ఆరనిచ్చి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. పూదీనా ఆకులు నూరి ఆ పేస్ట్ ను మొటిమల పై రాసినా మార్పు కనిపిస్తుంది. పుదీనా తో చర్మానికి చల్లదనాన్ని పాక్ లాగా అప్లయ్ చేసినా మంచిదే. ఎండా బెట్టిన తులసి ఆకులు షాపుల్లో దొరుకుతాయి. దాన్ని నీళ్లలో కలిపి పేస్ట్ లాగ చేసిన రాసినా మొటిమలు తగ్గుతాయి. బజార్లో దొరికే ఖరీదైన మందుల కంటే ఈ సహజమైన పద్ధతులే ఫలితాలు ఇస్తాయి.

    మొటిమలు ఈ పూతలతో తగ్గుతాయి

    టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన…

  • చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి . నేరుగా సూర్యకిరణాలు తగలకుండా శ్రద్ద తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మేకప్ తొలగించుకోకుండా నిద్రపోకూడదు. కనీసం రెండు సార్లు ముఖం అతిచల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. చర్మం ఊపిరితలం ఎప్పుడూ జిడ్డు లేకుండా వుండాలి. క్లార్ ఫోక్స్ ఇన్ఫలమేటరీ ప్రక్రియల లేకుండా చూసుకోవటం అవసరం. వారంలో రెండు సార్లు స్క్రబ్ చేస్తే మృత కణాలు పోతాయి. టేబుల్ స్పూన్ పంచదార లేదా ఓట్ మీల్ తో స్క్రబ్ చేయచ్చు. క్లే మాస్క్ తో మృత కణాలు పోతాయి. మొటిమలు డ్రై అవుతాయి. బ్లాక్ హెడ్స్ సులువుగా తీసేయచ్చు. చర్మంలోని అదనపు నూనెను జిడ్డును ఈ మాస్క్ లు పీల్చేస్తాయి. పోర్స్ ష్రింక్ అయి చర్మం టెక్చర్ మెరుగుపడుతుంది. పెరుగు అవకాడో విటమిన్ సి వంటివి చర్మం కొలెజాన్ రూపొందించటానికి సహకరించి చర్మం టెక్చర్ ను మెరుగుపరుస్తాయి . తేలికైన బేబీ ఆయిల్ ను చేతిలోకి తీసుకుని మెల్లగా మసాజ్ చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.

    చర్మం కాంతి మెరుగుపరిచేందుకు ఇవన్నీ

    చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు…

  • శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్ ఆప్రికాట్స్ లో ఫ్యాట్ మిల్క్ విటమిన్ ఎ కు మంచి ఆధారం. ఇవి చర్మ కణాల పునరుత్తేజానికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్ విటమిన్లు స్కిన్ ఫుడ్స్ ఈ విటమిన్ లోపిస్తే పెదవుల చివరలు మిగిలిపోతాయి. బి .కె లోపిస్తే చర్మం కమిలిపోతుంది. బి 6 లోపిస్తే చర్మం పైన ర్యాష్ వస్తుంది. రైస్ పాలు గుడ్లు పెరుగు లో బి 6 పుష్కలం. విటమిన్ C తో చర్మ మృదువుగా ఉంటుంది. బ్రోకలీ కొత్తిమీర మొలకలు కాలీఫ్లవర్ నిమ్మరసం కమలా ద్రాక్ష పైనాపిల్ అన్నింటిలో సి విటమిన్ దొరుకుతుంది. విటమిన్ ఇ బాదం పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు పాలకూర ఆలివ్స్ ఆలివ్ ఆయిల్ బొప్పాయిలో లభిస్తుంది. విటమిన్ కె కళ్లకింద వలయాల తో పోరాడుతుంది. పాలకూర తోట కూర ద్రాక్ష కివి పండ్లు ఈ విటమిన్ లభిస్తుంది.

    విటమిన్స్ మంచి ఫ్రెండ్

    శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం  కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్…

  • మొహమంతా తెల్లగా లేదా ఉన్న ఛాయతో చక్కగా వుంటూ నుదుటి పైన చెంపల పక్కన ట్యాన్ అనిపిస్తూ వుంటుంది. ఈ నలుపు పోగొట్టుకోవటం కోసం వేపాకు పూత చాలా బాగా ఉపయోగపడుతుంది. లేత వేపాకులు మెత్తగా నూరి కొద్దిగా పసుపు కలిపి దాన్ని మొహానికి రాసి ఆరిపోయాక కడిగేస్తే చర్మం మృదువుగా మారటమే కాక మచ్చలాంటివీ పోతాయి . చెంచా వేపాకు పొడి కొద్దిగా గులాబీ పొడి పెరుగు పాలు కలిపి పూతలా వేసినా ఎండ వేడికి కమిలిన నల్ల దనం పోతుంది. వేపాకుల్లో యాంటీ బ్యాక్తీరియల్ గుణాలుంటాయి. కనుక ఆ ఆకులు వేసి మరిగించి చల్లనైన నీళ్లలో తరుచు మొహం కడుక్కోవచ్చు. నిమ్మరసం పెరుగు కలిపి వేపాకుపొడి చేర్చి వేపాకుపొడి వేసుకున్నా మచ్చలు పోతాయి. అమ్మవారు వస్తే ఆగాయాల తో గుంతలు ఏర్పడితేనే పసుపు వేపాకు ముద్ద మంచి నూనె కలిపి రాస్తే అంతగాయాలు మాయం అవుతాయి. అలాంటివి ఎండా వేడిమికి కమిలిన మొహం మెరుస్తూ వుండదా ? ఈ చిట్కా అద్భుతంగ పనిచేస్తుందని చెప్పటంతో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    నుదుటి పై ట్యానింగ్ పోతుంది

    మొహమంతా తెల్లగా లేదా ఉన్న  ఛాయతో చక్కగా వుంటూ నుదుటి పైన చెంపల పక్కన ట్యాన్ అనిపిస్తూ వుంటుంది. ఈ నలుపు పోగొట్టుకోవటం కోసం వేపాకు పూత…

  • అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్ లో వాడతారు. పెద్ద పెద్ద ఒబెరాయ్ బాలినీస్ స్పా ముంబై లోని నారిమన్ పాయింట్ స్పా ల్లో ఈ ట్రీట్మెంట్ ను అతిధుల కోసం ఇస్తారంటే బియ్యంలో శరీర లావణ్యలను పెంచే పోషకాలు ఉండటమే కారణం. మస్సాజ్ తర్వాత స్క్రబ్బింగ్ చేయటం వల్ల మృత కణాలు పూర్తిగా పోయి శరీరం శుభ్రపరుస్తుంది. మంచి మెరుపు నిగారింపు పటుత్వం వస్తుంది. ఇదే బియ్యపిండి పాలు మిశ్రమానికి అలొవెరాని కలిపి పెదవులు ఎండిపోకుండా తేమతో మెరిసిపోయేందుకు వాడతారు. తాజాగా ఉన్న బియ్యపిండి రైస్ బ్రాన్ నూనె లో రకరకాల పదార్ధాలు కలిపి రకరకాల ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఆర్గానిక్ కొబ్బరి షియా బటర్ లతో కలిపి డ్రై స్కిన్ కు అధిక తేమను ఇచ్చేందుకు వాడతారు. బియ్యం పిండి శరీరానికి రుద్దుకొనే సబ్బు లాంటిది. బియ్యం పిండి తేనె పాలు మిశ్రమం ఫేస్ ప్యాక్ గా చక్కగా ఉంటుంది. ఈ మిశ్రమాన్నే బాడీ స్క్రబ్బర్ లాగా ఉపయోగిస్తారు.అయితే శరీరానికి దీన్ని మృదువుగా అప్లయ్ చేయాలి. బియ్యం వండి తినేందుకే కాదు మంచి బ్యూటీ ట్రీట్ మెంట్ కూడా.

    బియ్యంతో అద్భుత సౌందర్యం

    అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్…

  • మొహం కళ్ళు పెదవులు జుట్టు గురించి ఆలోచిస్తాం గానీ సాధారణంగా నిరాదరణకు గురయ్యేది మెడ మెడ పై చర్మం ముఖ్యంగా వెనక వైపు చాలా త్వరగా పిగ్మెంటేషన్ కు గురవుతుంది. డార్క్ లైన్స్ ఇన్ గ్రోన్ హెయిర్ మడతలు ఎక్కువగా పడతాయి. ఇక్కడ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం రోజుకు రెండు సార్లైనా క్లీన్స్ చేస్తుండాలి. మైల్డ్ స్క్రబ్ తో రుద్దటం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. పగటివేళ సన్ స్క్రీన్ రాత్రి వేళ మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లయ్ చేయాలి. పైవైపుకు మస్సాజ్ చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా అయ్యి లైన్స్ మడతలు తగ్గి పోతాయి. ఆయిల్ మస్సాజ్ చేస్తే వార్ధక్య లక్షణాలు కనపడవు. రెండు టేబుల్ స్పూన్ల సెనగపిండి పసుపు నిమ్మ రసం పాల మీగడ కలిపి మెడకు అప్లయ్ చేసి కడిగేస్తే మృత కణాలు పోతాయి. నలుపు తగ్గిపోతుంది.ఓట్ మీల్ పెరుగు బాదం పొడి టొమాటో రసం కలిపి రాసినా ఫలితం ఉంటుంది.

    మెడ సౌందర్యం పెంచుకోవచ్చు

    మొహం కళ్ళు పెదవులు జుట్టు గురించి ఆలోచిస్తాం గానీ సాధారణంగా నిరాదరణకు గురయ్యేది మెడ మెడ పై  చర్మం  ముఖ్యంగా వెనక వైపు చాలా త్వరగా పిగ్మెంటేషన్…

  • ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఘూస్ బెర్రీ ని సహజ సిద్దమైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఎక్కువగా వాడతారు. శరీరంలోని మలినాలను తొలగించడంలో రక్త సుద్ధి చేయడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఎంజైమ్స్ పుష్కలంగా వుండే బొప్పాయి చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది వృద్దాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అవకాడో చలికాలం సమస్యలు చర్మం దెబ్బతినకుండా కాపాడుటుంది. దీన్ని ఒక్క సహజమైన మాయిశ్చురైజర్ గా కూడా వాడుతారు. ఇక దానిమ్మ పండు చెర్మంలో తేజస్సు నింపుతుంది. చర్మ రంద్రాల్ని శుబ్రం చేయడంతో పాటు ముడతలను పోగొడుతుంది. పైనాపిల్ ఇది విటమిన్-సి పుష్కలంగా వున్నా పండు. మొటిమలు మచ్చలు తగ్గిస్తుంది. ఇక అరటిపండు లో వున్న పొటాషియం చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. ఋతువులతోనే సంబంధం లేకుండా కూడా సహజంగా దొరికే ఏ పండైనా వదలకుండా తినేయడం మంచిది అంటున్నారు నిపుణులు.

    చర్మ సంరక్షణ కోసం ఈ పండ్లు

    ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార…

  • అడ్వార్టైజ్మెంట్స్ చూసో అలవాటుగానో సౌందర్య ఉత్పత్తులను కొంటారు. వాటిని ఎంత మోతాదు లో వాడాలో రాసివుండదు కనుక తోచినంత రాస్తూ వుంటారు. ఈ ఉత్పత్తి ఈ మోతాదులో రాసుకుంటే ఫలితం ఉంటుందో ఎలా ఉపయోగించాలి. అప్పుడే సరైన ఫలితమ్ కనిపిస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసే క్లీన్సర్ ని రెండు బఠాణీ గింజల పరిమాణంలో తీసుకోవాలి. అందులో దూది ముంచి రాస్తే ముఖం పైన తేలికగా పరుచుకునేంతగా సరిపోతుంది. మిలిగిలినది మీద భాఫానికి సరిపోతుంది. సీరమ్ లేదా చర్మ చికిత్స కు వాడే క్రీములు వేలిపైకి తీసుకుని ముఖానికి ఎక్కడ అవసరమో అక్కడే రాయాలి. తక్కువే రాస్తే మంచిది. మొహం మొత్తం పరుచుకోకుండా చూడాలి. మృతకణాలను తొలగించే పూతైతే అందులో రసాయనాలు ఉంటాయి కనుక వేలితో చాలా తక్కువ పరిమాణంలో తీసుకుని వారానికి ఒక్కసారి మాత్రమే రాయాలి. అదే సహజమైన పదార్ధాలతో చేసిన దైతే వారానికి మూడు సార్లు రాసినా నష్టం లేదు. దేనినెంత వాడాలో తెలుసుకుంటే ఉపయోగం.

    అవసరాన్ని మించి వాడితే నష్టం

    అడ్వార్టైజ్మెంట్స్ చూసో  అలవాటుగానో సౌందర్య ఉత్పత్తులను కొంటారు. వాటిని ఎంత మోతాదు లో వాడాలో రాసివుండదు కనుక తోచినంత రాస్తూ వుంటారు. ఈ ఉత్పత్తి ఈ మోతాదులో…

  • సౌందర్యం విషయంలో బుల్లి బుల్లి డౌట్స్ వస్తాయి. వాటికీ నిజంగానే చిన్ని చిన్ని సమాధానాలుంటాయి. ఈ టిప్స్ ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ ఇవ్వకుండా పనికొస్తాయి కూడా. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి ముఖం ఎన్నాళ్ళ నుంచో నిద్ర లేనట్లు అనిపిస్తూవుంటుంది. ఇప్పుడు చల్లని గ్రీన్ టీ బ్యాగ్ లు కళ్ళ పైన పెట్టుకుని పది నిముషాలు రిలాక్స్ అయితే ఆ డార్క్ సర్కిల్స్ పోతాయి. డిటాక్సిఫికేషన్ కోసం ఈ టీ ఎంత బాగా పనిచేస్తుందో చర్మ సౌందర్యానికి అంతే పనిచేస్తుంది. లిప్ స్టిక్ తొలగించేందుకు స్పీడ్ ఆల్మండ్ ఆయిల్ తో దూది ముంచి రాస్తే లిప్ స్టిక్ పోతుంది. పెదవులు పొడిబారకుండా ఉంటాయి. షాంపూలో స్నానానికి వెళ్లే ముందర కొబ్బరినూనెలో జుట్టు కుదుళ్ళు తాకేవరకు మస్సాజ్ చేసుకుంటే శిరోజాలు నిగారింపుగా ఉంటాయి. ముఖం ఫ్రెష్ గా నిగారింపుతో ఉండాలంటే ఫ్రిజ్ వాటర్ తో రోజుకి నాలుగైదు సార్లు మొహం కడుక్కుంటే సరిపోతుంది.

    బుల్లి డౌట్స్ కు చిన్ని సమాధానం

    సౌందర్యం  విషయంలో బుల్లి బుల్లి డౌట్స్ వస్తాయి. వాటికీ నిజంగానే చిన్ని చిన్ని సమాధానాలుంటాయి. ఈ టిప్స్ ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ ఇవ్వకుండా పనికొస్తాయి కూడా. కళ్ళ…

  • ఉదయం చక్కగా తయారై పగలంతా ఒకే ఉత్సాహంతో ఆఫీస్ లో పని చేసి ఇంటికొచ్చాక నీరసం అనిపిస్తుంది. ఈ సాకుతో సాయంత్రం స్నానం మానేసి రెస్ట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఉదయపు మేకప్ మొహం నుంచి పూర్తిగా తొలగించాలి. ముఖం పైన ఉండే చర్మ రంద్రాలన్నీ తెరుచుకునేలా హాయిగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. విటమిన్లు అధికంగా వుండే క్రీములు అప్ప్లయ్ చేస్తే రాత్రివేళ ముఖచర్మం సహజమైన మరమ్మతులు చేసుకుంటుంది. మేకప్ వేసుకునే రసాయనాల వల్ల చర్మానికి నష్టమే కదా. నూనె అధికంగా వుండే పదార్ధాలు వేపుళ్ళు , జంక్ ఫుడ్ రాత్రివేళ అస్సలు వద్దు. యాంటీ ఆక్సిడెంట్ కలిగిన కూరగాయలు ముదురు రంగు కలిగిన పండ్లు తినటం ద్వారా చర్మానికి వార్ధక్య లక్షణాలు రాకుండా కాపాడుకోవచ్చు. చలికి చర్మం పొడిబారి పోకుండా స్నానాయికి ముందు ఆలివ్ ఆయిల్ ను చర్మానికి మస్సాజ్ చేసుకుంటే మృదువుగా ఉంటుంది. సోప్ ఫ్రీ క్లీన్సర్ వాడాలి. తేనె నిమ్మరసం అలోవెరా జెల్ బాదం నూనె నిమ్మరసం కలిపిన అవకాడో ఎదో ఒకటి చర్మానికి తగిన సహజ పోషకాలు లభించాలని మరచిపోవద్దు.

    ఈ సీజన్ లో చర్మానికి పోషణ అవసరం

    ఉదయం చక్కగా తయారై పగలంతా ఒకే ఉత్సాహంతో ఆఫీస్ లో పని చేసి ఇంటికొచ్చాక నీరసం అనిపిస్తుంది. ఈ సాకుతో సాయంత్రం స్నానం మానేసి రెస్ట్ తీసుకోవద్దు.…

  • మార్కెట్ లో ఏవ్ బ్రైటనింగ్ క్రీములు పరంపరాలుగా వస్తున్నాయి. చర్మ సౌందర్యం పట్ల మేకప్ విషయంలో శ్రద్ధ ఎక్కువైపోతోంది కనుక ఈ క్రీమ్స్ అనేకం లభిస్తున్నాయి. ఇవన్నీ లోపాల్ని సరిచేయటమే కాకుండా వాటిని సరిచేస్తున్నాయి కూడా. చాలా బ్రైటనింగ్ క్రీమ్స్ మాయిశ్చరైజర్స్ ను భర్తీ చేస్తుంటాయి. అర్చుటెన్ ,ఎంబ్లిక్, లికోరిస్ ఎక్సట్రాక్ట్స్ తో తయారు చేసే ఈ క్రీముల్ని విటమిన్ A, C, E వంటి యాంటీ ఆక్సిడెంట్స్ నుంచి ప్రీ రాడికల్స్ కు దైనందిన ఎక్సపోజర్ నుంచి కాపాడే దాకా లక్షణాలుంటాయి. చర్మానికి కాంతిని ఇస్తాయి. కొన్నింటిలో అదనంగా హైడ్రేటింగ్ కారకాలు కూడా ఉంటాయి. సన్ క్రీమ్స్ కలర్ కరెక్షన్లకు ఉద్దేశించినవి కనుక సమమైన టాన్డ్ కాంప్లెక్షన్ వస్తుంది. మచ్చలు ఇతర సమస్యల్ని మాయం చేస్తాయి. ఈ క్రీమ్స్ ఒక్కొక బ్రాండ్ లో మూడు అంతకంటే ఎక్కువ షేడ్స్ ఉంటాయి. చర్మ తత్త్వం టోన్ ను అనుసరించి ఈ క్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి.

    ఇవన్ని లోపాల్ని సరిచేసే క్రీమ్స్

    మార్కెట్ లో అనే  బ్రైటనింగ్ క్రీములు పరంపరాలుగా వస్తున్నాయి. చర్మ సౌందర్యం పట్ల మేకప్ విషయంలో శ్రద్ధ  ఎక్కువైపోతోంది కనుక ఈ క్రీమ్స్ అనేకం లభిస్తున్నాయి. ఇవన్నీ …

  • వేపాకు ఉపయోగాలు చెప్పాలంటే ఓ పుస్తకం రాయాలి. అందం కోసమైతే వేపాకును మించిన ప్రకృతి ప్రసాదం ఇంకోటి లేదు. వేప మంచి మాయిశ్చురైజర్. చెంచా లేత వేపాకు గుజ్జు, పసుపు కలిపి మొహానికి రాస్తే ఎంతో మృదువుగా అయిపోతుంది. వేపాకు మాస్క్ వేస్తే మచ్చలు పోతాయి. వేప గుజ్జు, నారింజ తొక్కల పొడి, తేనె, పెరుగు కలిపి ఫేస్ మాస్క్ వేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రెండూ పోతాయి. గుప్పెడు వేపాకుల్ని నీళ్ళల్లో ఉడికించి ఆ పేస్టులో తేనె కలిపి జుట్టుకు పట్టించి, ఓ పావు గంట ఆరాక తల స్నానం చేస్తే అంత మంచి కండిషనర్ ను ఎప్పుడూ చూసి ఉండరు.

    అందం కోసం వేపాకు

    వేపాకు ఉపయోగాలు చెప్పాలంటే ఓ పుస్తకం రాయాలి. అందం కోసమైతే వేపాకును మించిన ప్రకృతి ప్రసాదం ఇంకోటి లేదు. వేప మంచి మాయిశ్చురైజర్. చెంచా లేత వేపాకు…

  • ముఖం కాంతిగా తాజాగా అనిపించాలంటే వంటింటి టిప్స్ వందల కొద్దీ ఉంటాయి. తవ్వితే ఊరే చాల మల్లాగా. ఇవి తరాల నుంచి వస్తున్నా సౌందర్య సాధనాలు. పాల మీగడ నారింజ రసం సెనగపిండి కలిపి మంచి ఫేస్ ప్యాక్. యాపిల్ ముక్కలు గుజ్జు పాల పొడి ఇంకో నాలుగు చెంచాల పాలు ఇంకో మంచి కాంబినేషన్. మూడు చెంచాల పెసర పిండి పసుపు పాలు కలిపితే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను కూడా పోగొట్టే మంచిపూత అవుతుంది. నిమ్మరసం తేనె కలిపి మొహానికి రాసి కీరా ముక్కలు మృదువుగా మసాజ్ లాగా రుద్దితే చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది. ఇప్పుడంటే ఖరీదైన కాస్మెటిక్స్ వచ్చాయి. మరి పురాతన కాలంలో అందంకోసం ఇవే పద్ధతులు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లీని చక్కని ప్యాక్ లు.

    ఒకప్పటి సౌందర్య సాధనాలు ఇవే

    ముఖం కాంతిగా తాజాగా అనిపించాలంటే వంటింటి టిప్స్ వందల కొద్దీ ఉంటాయి. తవ్వితే ఊరే  చాల మల్లాగా. ఇవి తరాల నుంచి వస్తున్నా సౌందర్య సాధనాలు. పాల…

  • మన పనులు అవ్వాలంటే పరిగెడుతూనే ఉండాలి. అయినా బయటికి వెళ్ళాలంటే కాస్తయినా అలంకరణ కావల్సిందేగా! తొందరగా తయారయ్యే చిట్కాలివి. నుదుటి భాగంలో జుట్టు ఊడిపోయి పచ్చిగా కనబడుతుంటే పాపిట మార్చి చూడాలి. జుట్టు వత్తుగా అనిపిస్తుంది. మసాజ్ బ్రష్ పైన హెయిర్ స్ప్రే చల్లి కనుబోమ్మల్ని దువ్వుకొంటే అందంగా కనిపిస్తారు. కళ్ళు ఫ్రెష్ గా అనిపించాలి అనుకొంటే చిన్న ఐస్ ముక్కతో కళ్ళ చుట్టూ మసాజ్ చేయాలి. పెదవులు సహజంగా ఎర్రగా కనిపించాలి అనుకొంటే పంచదార, బాదం నూనె కలిపి మృదువుగా రుద్దేస్తే పెదవుల పైన పగుళ్లు మాయమైపోతాయి. చాలా తేలికైన లిప్ స్టిక్ వేసుకొంటే ఇంకా బావుంటుంది.

    ఇలా చేసి చూడండి

    మన పనులు అవ్వాలంటే పరిగెడుతూనే ఉండాలి. అయినా బయటికి వెళ్ళాలంటే కాస్తయినా అలంకరణ కావల్సిందేగా! తొందరగా తయారయ్యే చిట్కాలివి. నుదుటి భాగంలో జుట్టు ఊడిపోయి పచ్చిగా కనబడుతుంటే…

  • జుట్టు పొడిబారిపోయి ఎండు గడ్డిలా కనిపిస్తూ ఉంటే కొబ్బరిపాలు ఈ సమస్యకి పరిష్కారం. కొబ్బరిపాలంటే తాజా కొబ్బరి నూనె కదా. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి ఆ పలు తలకు రాసుకుని మర్దన చేస్తే జుట్టు చివర్లో చిట్లిపోకుండా ఉంటాయి. కొబ్బరిపాలలోవుండే పోషకాలు జుట్టు ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి. ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించాలన్నా కొబ్బరి పాలలో ఆలివ్ నూనె కలిపి దూది లో నెమ్మదిగా క్లీన్ చేస్తే మేకప్ పోవటమే కాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. జిడ్డు చర్మ తత్త్వం ఉన్నవాళ్లు మొటిమల సమస్య ఉంటే కొబ్బరిపాలను క్లీన్సర్ గా ఉపయోగించవచ్చు. కొబ్బరిపాలలో సాగే గుణం ముడతలు నివారిస్తుంది. ఈ పాలను నాలుగైదు బాదాం గింజల్ని నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి మాస్క్ వేసుకుంటూ ఉంటే వయసు రీత్యా వచ్చే మడతలు పోగొడుతుంది.

    కొబ్బరి పాలతో ఎన్నో పోషకాలు

    జుట్టు పొడిబారిపోయి ఎండు గడ్డిలా కనిపిస్తూ ఉంటే కొబ్బరిపాలు ఈ సమస్యకి పరిష్కారం. కొబ్బరిపాలంటే తాజా కొబ్బరి నూనె కదా. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి ఆ…

  • రోజంతా కొన్ని అత్యవసరాలు పాటిస్తే ఏ వయసులో అయినా అందంగా ఉంటారని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు క్లీన్సింగ్ మిల్క్ లేదా బేబీ ఆయిల్ ఉపయోగించి మురికి మేకప్ లను తొలగించుకోవాలి. ముఖం పైన పడే మచ్చలు ఫ్యాబీ గా మారటం పిగ్మెంటేషన్ వంటివి ప్రభావవంతంగా తొలగించుకోవటానికి విటమిన్ A ,C,E లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ క్రీమ్స్ వాడాలి. నిస్సారంగా మారటం ,నల్లబడటం, సూర్యరశ్మికి ఫోకస్ వాటం వంటివి నిరంతరం సన్ స్క్రీన్ తో అధిగమించవచ్చు. శిరోజాల తీరుకు సరిపోయే షాంపూను ఎంచుకుని కనీసం వారానికి మూడు సార్లైనా తలా స్నానం చేయాలి. మీరు హెయిర్ ఆయిల్ కండిషనర్లు వాడటం వల్ల జుట్టుకు చిక్కులు పడకుండా ఉంటుంది. ఊడే జుట్టు డెడ్ హెయిర్ గా గమనించుకోవాలి. వ్యాయామంతో శరీరాన్ని ఫిట్ నెస్ గా వుంచుకుంటేనే శరీరానికి చర్మానికి గ్లో వస్తుంది. ఇక హీల్తీ డైట్ టోన్ కాంతివంతమైన చర్మం శిరోజాలు సొంతమవుతాయి.

    ఏ వయసులోనైనా అందంగా……. !

    రోజంతా కొన్ని అత్యవసరాలు పాటిస్తే ఏ వయసులో అయినా అందంగా ఉంటారని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు క్లీన్సింగ్ మిల్క్ లేదా బేబీ ఆయిల్…