• విటమిన్ ఇ నూనె గొప్ప సౌందర్య పోషకం. చాలా మందికి చిన్న వయస్సులో ముఖం పై ముదతాలు వచ్చి చర్మం సాగినట్లు అనిపిస్తుంది. అలంటి వారు విటమిన్-ఇ నూనె తో చర్మం మసాజ్ చేసుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తేనే ముఖం పై ముడతలు వృద్ధాప్య ఛాయలు మాయం అవ్వుతాయి. పొడి చర్మం కలవారు రాత్రి పడుకునే ముందు మోయిశ్చురైజర్ లో ఈ విటమిన్-ఇ నూనె కలిపి రాసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. మేకప్ తుడిచేందుకు లేక, బయట ఎండ లోకి వెళ్లి వచ్చినప్పుడు ఈ నూనె లో దూది ముంచి ముఖం తుడుచుకోవాలి.మురికీ, ఇతర వ్యర్ధాలు బయటకు వచ్చేస్తాయి. ఇది మంచి లిప్ బామ్. సౌందర్య ఉత్పత్తులు వాడటం ఇష్టం లేకపోతె పగిలిన పెదవులకు ఈ నూనె పూత లా వేసుకుంటే పెదవులకు తేమ అందుతుంది సమస్య పోతుంది. ఎండ లోకి వెళితే చర్మం నల్లగా అయిపోతుంది. ఈ నూనె మొహానికి మర్దనా చేసుకుంటూ వుంటే, ఎండ వల్ల అతి నీలలోహిత కిరణాల వల్ల దెబ్బ తిన్న చర్మం తేటగా అయిపోతుంది. ఇది యాంటి ఆక్సిడెంట్ గా పని చేసి చర్మానికి మేలు చేస్తుంది.

    చర్మానికి ఎంతో మేలు చేసే ఈ విటమిన్

    విటమిన్ ఇ నూనె గొప్ప సౌందర్య పోషకం. చాలా మందికి చిన్న వయస్సులో ముఖం పై ముదతాలు వచ్చి చర్మం సాగినట్లు అనిపిస్తుంది. అలంటి వారు విటమిన్-ఇ…

  • చల్లగా ఏదైనా తగెందుకే ఐస్ముక్కల ఉపయోగంఅనుకుంటాం కానీ అవి సౌందర్య పోషణకు కూడా చాలా బాగా ఉపయోగ పడతాయి. ముఖం పై మొటిమలు వేడి వాతావరణానికి చిరాకు పెడతాయి. తక్షణ ఉపసమనం కోసం ఒక మెత్తని గుడ్డలో ఐస్ ముక్కల్ని వుంచి మంట పెడుతున్న భాగంలో అద్దాలి. ఓ పది నిముషాలుఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి. తరచూ దూర ప్రయాణాలు చేస్తున్న ముఖం అలసటగా వుంటుంది. తాజాగా అనిపించాలి అంటే ఐస్ క్యుబ్ తో ముఖం పై రుద్దుకుంటే అలసట పోతుంది. ఐబ్రోస్ చేయించుకుంటే ఆ ప్రాంతంలో నొప్పి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఐబ్రోస్ చేయించుకునే ముందర కనుబొమ్మలు ఐస్ ముక్కతో రుద్దితే నొప్పి అనిపించదు, చర్మం కందిపోదు. కొందరికి కళ్ళ కింద నిద్ర ఎక్కువ అయిపోయినా కళ్ళు ఉబ్బిపోయి ముడతలు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో ఐస్ ముక్కలతో కాపడం పెడితే రక్తప్రసరణ సక్రమంగా అంది చర్మం నిగారింపు తో చెక్కగా వుంటుంది. ఐస్ ముక్కాలా తో ఫేషియల్ చేసినట్టు మొహం పైన రుద్దితే మొహం ఫ్రెష్ గా వుంటుంది.

    అందం కోసం ఐస్

    చల్లగా ఏదైనా తగెందుకే ఐస్ముక్కల ఉపయోగంఅనుకుంటాం కానీ అవి సౌందర్య పోషణకు కూడా చాలా బాగా ఉపయోగ పడతాయి. ముఖం పై మొటిమలు వేడి వాతావరణానికి చిరాకు…

  • బ్లీచింగ్ చేస్తే మొహం పైన మరకలు, మురికి పోతుంది కానీ అసలు బ్లీచింగ్ ప్రాబ్లం మొహం పొడిబరుతుంది. మరి కళ్ళ కింద నల్లని వలయాలు ఎలా పోవాలి అంటే ఇంట్లో వుండే వస్తువుల తో తేలిక అని చెప్ప వచ్చు. టొమాటో లో బ్లీచింగ్ గుణం వుంది. ఒకటిన్నర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక టీ స్పూన్ టొమాటో రసాన్ని కలిపి కాళ్ళకింద నల్లని వలయాల పైన రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. బంగాళ దుంప తరిగి జ్యూస్ పిండి కాటన్ ప్యాడ్స్ తో ముంచి కళ్ళ పైన పెట్టుకుంటే కళ్ళకింద చరల తో పాటు కళ్ళ వాపు కూడా పోతుంది. రోజ్ వాటర్ లో కాటన్ ప్యాడ్స్ నాన నిచ్చి, వాటిని కనురెప్పల పైన 15 నిమిషాలుంచితే కళ్ళ కింద వలయాలు పోతాయి. ఇలా రోజు రెండు మూడు వారాల పాటు చేస్తే కళ్ళ కింద చారలు కళ్ళ అలసట మాయం అవ్వుతాయి.

    నల్లని వలయాలు మాయం

    బ్లీచింగ్ చేస్తే మొహం పైన మరకలు, మురికి పోతుంది కానీ అసలు బ్లీచింగ్ ప్రాబ్లం మొహం పొడిబరుతుంది. మరి కళ్ళ కింద నల్లని వలయాలు ఎలా పోవాలి…

  • ఫేషియల్ చేయించుకొంటేనే ముఖం మెరుస్తుంది అనుకోవచ్చు. ముల్తానీ మట్టి వాడినా మొహం మెరవడమే కాదు, కొన్ని రకాల చర్మ సమస్యలు పోతాయి. రెండు చెంచాల గులాబీ నీళ్ళు కలిపి మెత్తగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఈ పూత మొహం పై జిడ్డును తొలగించుతుంది. రెండు మూడు బాదాం గింజలు నానబెట్టి మెత్తగా చేసి అందులో పాలు కలిపి దీన్ని ముల్తానీ మట్టిలో మెత్తగా పేస్టులాగా అయ్యేలాగా కలిపేసి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం మృదువుగా మారుతుంది. టొమాటో గుజ్జు, ముల్తనీ మట్టి, గంధం,పసుపు సమపాళల్లో తీసుకుని ముఖానికి పట్టించి గోరువెచ్చని వేడి నీళ్ళతో కడిగేయాలి. రెండు రోజులకోసారి ఈ ప్యాక్ వేస్తె ముఖం పైన మచ్చలు, మరకలు అన్నీ పోతాయి. అలాగే ముల్తాని మట్,టి పుదినా పొడి, పెరుగు మిశ్రమం కూడా ముఖం మెరిసేలాగా చేస్తుంది. ఇవన్నీ సహజమైనవి. ఏ రసాయినాలు కలవవని ముఖానికి మంచి రంగు, కళ తెచ్చి పెడతాయి.

    చర్మం తేటగా మృదువుగా మెరవాలంటే

    ఫేషియల్ చేయించుకొంటేనే ముఖం మెరుస్తుంది అనుకోవచ్చు. ముల్తానీ మట్టి వాడినా మొహం మెరవడమే కాదు, కొన్ని రకాల చర్మ సమస్యలు పోతాయి. రెండు చెంచాల గులాబీ నీళ్ళు…

  • చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని పదార్ధాల వాడకంతో చర్మం ఎప్పుడు తాజాగా కాంతి వంతంగా వుంటుంది. పిండి, తేనె, పెరుగు వంటి మిశ్రమం వంటికి పట్టించి నలుగు పెట్టుకుంటే చాలు చర్మం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే జుట్టు నిర్జీవంగా అనిపిస్తే కోడి గుడ్డు తెల్ల సోన, పుల్లటి పెరుగు, మందారకుల గుజ్జు కలిపి తలకు పట్టించి తల స్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులా అయిపోతుంది. అలాగే చేతులు కాళ్ళు మెత్తగా మెరిసిపోవాలంటే ముందుగా ఆర బకేట్ నీళ్ళల్లో రెండు చెంచాల షాంపూ వేసి పదాలు అందులో వుంచాలి. ఆ తర్వాత ఫ్యుమిక్ రాయి తో రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు పోతాయి. అదయ్యాక చెక్కర, సెనగ పిండి, పాలు, తేనె మిశ్రమాన్ని పాదాలకు పట్టించి ఆరాక కడిగేస్తే పదాలు మృదువుగా మెరిసిపోతూ కనిపిస్తాయి. చేతులకు కూడా ఇదే పూత పుయచ్చు.

    జీవిత కాలపు శ్రద్ధ కావాలి

    చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని…

  • మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ మొటిమలు రాకుండా కాపాడుతాయి అంటున్నారు. బాగా పండిన బొప్పాయిలో చెక్కెర, పెరుగు కలిపి ముఖానికి రాసి మర్దనా చేస్తే మొటిమలు తగ్గుతాయి. నారింజ తొక్కల పొడి లో పలు కలిపి ముద్దలా చేసి ముఖానికి రాసి ఆరె దాకా వుంచి కడిగేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొహం కొత్త మెరుపు తో వుంటుంది. రెండు చెంచాల తేనె, ససిన్ని పాలు, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి దీన్నీ ఫేస్ మాస్క్ లా వేసి ఆరాక కడిగేయాలి. ఈ మాస్క్ రోజు మర్చి రోజు వేసుకుంటే మొటిమలు తగ్గడమే కాదు మచ్చలు పోతాయి. అరటి పండు పై తొక్కలలో ల్యుటిన్ అనే ఎంజైమ్ వుంటుంది. ఇది కొత్త కణాల అభివృద్ధి కి సహాయపడుతుంది. ముఖం పైన వలయాకారంలో అరటి తొక్కతో రుద్దితే ఫలితం వుంటుంది. చర్మం కూడా తాజాగా వుంటుంది.

    ఇంటి చిట్కాల తో ఈ సమస్యలు మాయం

    మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ…

  • వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల ష్రిమ్కింగ్ మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్ వల్లనే పెదవులు తేమతో నిగనిగలాడతాయి. సూర్య కిరణాలు కూడా కొలాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంచేత ఎండలోకి వెళ్లేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ పెదవులకు కూడా రాసుకోవాలి. పాతిక సంవత్సరాల వయస్సులో మూత్రాశయంలో ద్రవాన్ని ఎంతసేపైనా ఆపి ఉంచుకునే శక్తి ఉంటుంది. 65 సంవత్సరాలు వస్తే మూత్రాశయం ఆ శక్తి పోగొట్టుకుంటుంది . అంచేత బ్లాడర్ నియంత్రణను మెరుగు పరుచుకునేందుకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్ సైజులు సహకరిస్తాయి కనుక ముందునుంచే ఏ ఎక్సర్ సైజులు ప్రారంభించాలి . అలాగే వయసు తో పాటే సాగిపోయే చర్మం విషయంలో దెబ్బతినే పలువరస విషయంలో శ్రద్ధ తీసుకుని తీరాలి . రాబోయే వార్ధక్యాన్ని ఆపలేకపోవచ్చు . కానీ ఆరోగ్యంగా ఉంచుకునే పద్ధతులను విస్మరించవద్దు.

    వయస్సు తెచ్చే మార్పులు

    వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల  ష్రిమ్కింగ్  మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్…

  • రుతువులు మారిపోతూవుంటాయి. మారే కాలానికి శరీరం కూడా స్పందిస్తుంది. చర్మం పొడిగా అయిపోవటం, పగిలిపోవడం వేడి వాతావరణంలో పొక్కులు రావటం చెమటలు ఒకటేమిటి విసిగించే ప్రతి సమస్యకు సమాధానంగా ఎదో క్రీము ఎంచుకోవటం రాసుకోవటం. ఇలా చేస్తే సమస్య పోదంటున్నారు ఎక్స్ పెర్ట్స్. చల్లగా వుందని వేడినీళ్ళ స్నానం అస్సలు వద్దు. వేడి చర్మం లోని తేమను లాగేస్తుంది. గోరువెచ్చని నీరు ఎంచుకోవాలి. చర్మం పొడిగా అయి చేత్తో గీస్తే తెల్లని గీతాలు కనిపిస్తూ చిరాకేస్తే మాయిశ్చరైజర్ పులిమేస్తే ప్రయోజనం ఉండదు.స్నానం చేసిన వెంటనే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయాలి. పొడిబారే సమస్య అప్పుడు అదుపులో ఉంటుంది. అవసరానికి మించి స్క్రబ్ వాడకూడదు . రెండు స్పూన్ల చక్కర లో కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకుని పది నిముషాల తర్వాత కడిగేయాలి. సబ్బులోని రసాయనాలు చర్మం దెబ్బతినేందుకు కారణం కావచ్చు. చర్మ తత్వానికి సరిపోయే ఫెస్ వాష్ ఎంచుకుని వాడుకోవాలి. సమస్యను అసలైన కారణం తెలుసుకుని పరిష్కారం కోసం చుస్తే ప్రయోజనం ఉంటుంది.

    ఎదో ఒకటి వాడితే ఎలా ?

    రుతువులు మారిపోతూవుంటాయి. మారే కాలానికి శరీరం కూడా స్పందిస్తుంది. చర్మం పొడిగా అయిపోవటం, పగిలిపోవడం వేడి వాతావరణంలో పొక్కులు రావటం చెమటలు ఒకటేమిటి విసిగించే ప్రతి సమస్యకు…

  • బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్ వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది . సహజమైన ఏ రసాయనాలు కలపని కొన్ని వస్తువుల్లో బ్లీచ్ కంటే మొహాన్ని తేటగా చేసే మంచి గుణాలుంటాయి. రెండు స్పూన్ల బియ్యం పిండి లో కొద్దిగా తేనె పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని మొహానికి మెడకీ మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే మురికి పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. స్పున్ బియ్యంపిండి లో నాలుగైదు చుక్కల ఆముదం కలిపి కళ్ళ కింద పూతలా వేసి కడిగేసుకుంటే వలయాలు మడతలు క్రమంగా మాయం అవుతాయి. పాలు లేదా పాల మీగడలో కొద్దిగా బియ్యంపిండి కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవాలి. పది నిముషాల తర్వాత కడిగేస్తే మురికిపోయి చర్మం శుభ్రపడుతుంది. బియ్యం పిండిలో తేనె ఆలివ్ ఆయిల్ కలిపి స్నానానికి ముందు మర్దన చేస్తే మృతకణాలు పోయి ముఖం కళగా ఉంటుంది. బియ్యం పిండి మినపప్పు పిండి కలిపితే మంచి ఫేస్ ప్యాక్ అవుతుంది. ఇది తప్పకుండా ట్రై చేయచ్చు.

    ఇది అద్భుతమైన ఫేస్ ప్యాక్

    బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్  వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది…

  • నూనెతో మర్దనా చేస్తే సహజమైన మెరుపు

    ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణం లో వచ్చే ప్రతి మార్పుకు ప్రభావితం అయ్యేది ముఖ చర్మమే. చర్మానికి ఎప్పుడు సహజమైన నూనెలు అవసరం. కొబ్బరి…

  • ఎంత మేకప్ చేసుకున్న కళ్ళు అలసినట్లు ఉంటే అస్సలు బావుండవు. కళ్ళ గురించి ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. పచ్చి పాలలోముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని కళ్ళ చుట్టూ తుడిచేయాలి. దీనివల్ల కనురెప్పలపై మురికిపోయి కళ్ళు తేజోవంతంగా ఉంటాయి. గ్రీన్ టీ లో మెత్తని వస్త్రాన్ని ముంచి కళ్లపై కప్పాలి. పదినిముషాలు ఉంచి తీసేసి తుడిచేస్తే కళ్ళ అలసట పోయి మిలమిలా మెరుస్తాయి . రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వాళ్ళు మధ్యమధ్యలో చల్లని నీళ్లతో కళ్ళు కడుక్కుంటూ ఉండాలి. ఈ చల్లని నీళ్ల టోన్ కళ్ళు మొహం అలసట లేకుండా కనిపిస్తాయి. హాయిగా ఎనిమిది గంటల నిద్ర పోవాలి. ఎండలోకి వెళ్ళేటప్పుడు కళ్ళజోడు ధరించాలి . కళ్ళ చుట్టూ చర్మం వదులైనట్లు అనిపిస్తే తెల్ల సొన రాసి ఆరిపోయాక కడిగేస్తే చర్మం బిగుతుగా అయిపోతుంది. ఐస్ క్యూబ్స్ తో ముఖం మర్దనా చేస్తూ కళ్ళ చుట్టూ ఆ కళ్ళ దనం ఉండేలా చూసుకున్నా కళ్ళు చక్కగా తేటగా కనిపిస్తాయి. అలాగే చల్లని కీరా దోస రసంలో కాటన్ ముంచి కళ్లపై పెట్టుకున్నా ఆ చల్లదనానికి కళ్ళు తేటగా కనిపిస్తాయి.

    చల్లని కీరా దోస రసం ట్రై చేయండి

    ఎంత మేకప్ చేసుకున్న కళ్ళు అలసినట్లు ఉంటే అస్సలు బావుండవు. కళ్ళ గురించి ఎంతో శ్రద్ధ  తీసుకోవాలి. పచ్చి పాలలోముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని కళ్ళ చుట్టూ…

  • దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు కాఫీ డికాషన్ లో ఆలీవ్ నూనె కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం సహజమైన మెరుపుతో తేమతో ప్రకాశిస్తూ ఉంటుంది . చెంచా ఓట్ మీల్ పొడి కొంచెం కాఫీ పొడి తేనే కలిపి ముఖం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. కాఫీ పొడిలో తేనే పసుపు కలిపి రాసుకుని ఓ అరగంట తర్వాత కడిగేస్తే చర్మం శుభ్రంగా కనిపిస్తుంది. పాలు కాఫీ పొడి నెయ్యి కలిపి పూతలా వేసి కాస్సేపటికి కాటన్ తో ఆ పూతను తుడిచేస్తే ముఖం పైన మురికి మృతకణాలు పోయి బావుంటుంది . కాఫీ పొడి నిమ్మరసం కలిపి పూతలా వేసుకుంటే చర్మం ముడతలు లేకుండా ఉంటుంది . ఇది ప్రతి రోజు అన్ని చర్మ తత్వాలున్నవాళ్ళు ట్రై చేయచ్చు. ఇక కాఫీ పొడి మెత్తగా దంచిన దాల్చిన చెక్క పొడి పాలు తేనె కలిపి మెత్తని పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేస్తె చర్మం కళగా ఉంటుంది.

    సొగసైన చర్మానికి ఫెస్ ప్యాక్

    దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు  సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు…

  • వయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా డీహైడ్రేషన్ వల్ల రక్త నాళాలు వ్యాకోచం చెంది నీరు చేరుతుంది. నీరు బాగా తాగకపోతే మొహం ఉబ్బరిస్తుంది. అలాగే శరీరంలో అధిక శాతం ఉప్పుచేరినా ముఖం వస్తుంది. కార్బోనేటేడ్ కూల్ డ్రింక్స్ తాగినా ప్యాకేజీ ఫుడ్స్ తో సోడియం శరీరంలో చేరినా ఈ ప్రాబ్లమ్ కావచ్చు . ఇలా ముఖం ఉబ్బరించుకోకుండా ఉండాలంటే డైట్ లో ఎక్కువ పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి . బొప్పాయిపండు తింటే పొట్ట చిన్న ప్రేవుల ఆరోగ్యం సరిగా ఉంటుంది . ముఖంలో ఉబ్బరింపు ఉండదు విటమిన్ సి బీటాకెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పండ్లు తినాలి. ఇవి చర్మం లో నీళ్లు నిలిచిపోకుండా సహాయపడతాయి. చర్మం మెరిసిపోతుంది. మొహం తేజోవంతంగా ఉంటుంది.

    ముఖ కాంతి తగ్గినట్లుంటే

    ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా…

  • అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు మూసుకుపోతాయి. మొటిమలు వైట్ హెడ్స్ మచ్చలు మొదలవుతాయి. వాటిని నివారించాలంటే ఆవిరి పట్టటం తప్పనిసరి. దీనివల్ల చర్మం గ్రంధులు తెరుచుకుంటాయి. మురికి జిడ్డు మృతకణాలు పోతాయి. వేడి నేతిలో ముంచి పిండిన మెత్తని నూలు గుడ్డతో ముఖం తుడిచేసినా ఫలితం ఉంటుంది. చెంచా దాల్చిన చెక్క పొడి ఓట్స్ పిండి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో ముద్దగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి కొద్దిసేపు మర్దనా చేసి పావుగంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. మొటిమలు వాటి తా తాలూకు మచ్చలు పోతాయి. రెండు చెంచాల సెనగ పిండి లో సరిపోయేంత పెరుగు వేసి ముద్దగా చేసి ముఖానికి రాయాలి. పది నిముషాలు అయ్యాక కడిగేస్తే సరిపోతుంది. ఇందులో పసుపు కలిపితే ఏ సమస్యలు తగ్గటం తో పాటు ముఖం కళగా మారిపోతుంది. అలాగే నిమ్మరసం లోనే ఆల్ఫా హైడ్రాక్స్ ఆమ్లాలు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. నిమ్మరసంలో దూది ముంచి మొహం పైన రాసి పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

    మొటిమలు మచ్చలు నివారణ కోసం

    అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు…

  • కొన్ని అలంకరణ వస్తువులకు కొంత ఎక్సపైరి డేట్ లాంటిది వుంటుంది. అది ఆ ప్యాక్ మీది రాసి ఉండకపోయినా అవి అయిపోయేదాకా వాడాలనుకోకూడదు. ఉదాహరణకు మస్కారా ఫౌండషన్ కాటుక వంటి ఉత్పత్తులు జీవిత కాలం ఆరునెలలే. కనుక అంతకుమించి వాడకపోవడం బెస్ట్.అలాగే ఎంత రాత్రైనా మొహం పైన రాసుకునే ఫౌండేషన్ క్రీములు మేకప్ తొలగించే పడుకోవాలి. లేకపోతే ఆ రసాయనాలతో మొటిమలు మచ్చలు ఎదురవుతాయి . కాను బొమ్మల్ని తీర్చిదిద్దుకునే సమయం లేనప్పుడు చాలాసార్లు ఫ్లక్కర్ వంటి చిన్న పరికరం తో లాగేస్తూ వుంటారు. అలా లాగేసి కనుబొమ్మల వెంట్రుకలను తీసేస్తే పల్చగా అయిపోతాయి. దాంతో ,ముఖం పెద్దగా వయసు పైబడినట్లు అయిపోతుంది. వీటికోసం ప్రత్యేకంగా ఉండే జెల్ రాసుకుంటే కనుబొమ్మలు దట్టంగా కనిపిస్తాయి. అలాగే కళ్ళ అలంకరణకు ఉపయోగించే బ్రెష్ లు తరచూ మార్చాలి. వారానికి ఒకసారి షాంపూ తో శుభ్రం చేయాలి. లేకపోతే కళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తుంది . మనం చేతి వేళ్ళతో కీ బోర్డు ఉపయోగిస్తాం. అలాగే ఇంట్లో ఎన్నో శుభ్రం చేసే పనులు చేస్తాం. అదే చేతుల్ని మొహం పైన పెట్టేస్తే వేళ్ళపై క్రిములు ముఖం పై చేరి చర్మ రంధ్రాలు మూసేస్తాయి. మొటిమలు వస్తాయి. చేతులు శుభ్రం చేసుకోకుండా మొహం పై పెట్టుకోకూడదు.

    అయిపోయేదాకా వాడద్దు

    కొన్ని అలంకరణ వస్తువులకు కొంత ఎక్సపైరి డేట్ లాంటిది వుంటుంది. అది ఆ ప్యాక్ మీది రాసి ఉండకపోయినా అవి అయిపోయేదాకా వాడాలనుకోకూడదు. ఉదాహరణకు మస్కారా ఫౌండషన్…

  • ఎండ వేడికి మొహం కమిలితే

    ఎండా పెరిగితే చాలు ఆ ప్రభావం తో ముఖం నల్లగా అయిపోతుంది. ఇంట్లో దొరికే వస్తువులే రసాయన ఉత్పత్తుల కంటే బాగా పనిచేస్తాయి. ఎండలో తిరిగొచ్చాక ఒక…

  • చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి చికిత్సలున్నాయి. అనాస పండు యాంటీ ఏజింగ్ ఏజెంట్ రెండు ముక్కలు అనాస పండు మెత్తగా చేసి ఆ రసం ముఖానికి రాస్కుంటే ఫలితం ఉంటుంది. ఆముదంలో ప్లాటీ ఆమ్లాలుంటాయి. ఇవి సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. ఏదైనా నూనెలో ఆముదం కలిపి మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. బాదం నూనె తోకూడా ఇదే ఫలితం. రెండు పూటలా బాదం నూనె తో మర్దనా చేయాలి. చక్కెర మెత్తగా పొడిగా చేసి అందులో తేనె కలిపి పూతలా వేసుకుంటే చర్మానికి తేమ అంది సాగిపోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన తో పూతలాగా వేసినా మంచిదే. కలబంద గుజ్జయితే ప్రతిరోజు వాడవచ్చు. ఫ్రెష్ గా ఉన్న కలబంద నుంచి గుజ్జు తీసి పూతలా వేసి మర్దనా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

    కలబంద తో చర్మం బిగుతవుతుంది

    చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి  చికిత్సలున్నాయి.…

  • మేకప్ తొలగించటంలో జొజోబా ఆయిల్ వాడటం చాలా మంచిది. అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఇది మేకప్ రిమూవర్ గానే కాదు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయానికి మొహం సాఫ్ట్ గా అయిపోతుంది. అలాగే వట్టి పెరుగు కాటన్ ప్యాడ్ నెమ్మదిగా గుండ్రముగా రుద్దుతూ మేకప్ తొలగిస్తే చర్మం క్లీన్ అవటమే కాదు. తాజాగా మెరుపుగా ఉంటుంది. ఇక పాలు నాచురల్ క్లీన్సర్ గా పనిచేస్తాయి. ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి మేకప్ రిమూవర్ గా ఉపయోగిస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దోసకాయ ను జ్యూస్ లాగా తీసి అందులో బేబీ ఆయిల్ కలుపుకుని మొహం తుడుచుకుంటే చర్మం చక్కగా అయిపోతుంది. ఈ కాంబినేషన్ మేకప్ రిమూవర్. గ్రేప్ నీడ్ ఆయిల్ దూది ముంచి మేకప్ తుడిచేస్తే ఈ నూనె చర్మానికి నిగారింపు ఇవ్వటంతో పాటు మొటిమలు మడతలు నివారిస్తుంది. ఇదే విధంగా కొబ్బరినూనె కూడా మేకప్ తొలగించే రిమూవర్ గా పనికివస్తుంది.

    ఇవి మేకప్ తొలగించే సొల్యూషన్స్

    మేకప్ తొలగించటంలో జొజోబా ఆయిల్ వాడటం చాలా మంచిది. అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఇది మేకప్ రిమూవర్ గానే కాదు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయానికి…

  • ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్ వేసుకున్నట్లుగా ఉండాలంటే ప్రైమర్ వాడాలి. ప్రైమర్ అంటే ప్రాధమిక అలంకరణ వస్తువు. ఐలైనర్ వేయాలంటే ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేయాలన్నా ప్రైమర్ వాడాల్సిందే. ప్రైమర్ వేసి ఆపై అలంకరణ చేస్తే సాయంత్రం వరకు బెదరకుండా ఉంటాయి. కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా పౌడర్ వేసినా ప్రయోజనం ఉండదు. కాస్సేపటికి పౌడర్ పోయి నలుపు కనిపిస్తుంది. ముందుగా కన్సీలర్ వేసుకుని పౌడర్ వేసుకోవాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలంటే ముందుగా పెదవులు పైన మృత కణాలు తొలగించి లిప్ బామ్ వేసుకుని లిప్ లైనర్ వేసుకుని మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలి. హేయిర్ స్ప్రే ని టూల్ బ్రష్ పై తీసుకుని కనుబొమ్మల్ని దువ్వుకుంటే రోజంతా చెదరకుండా ఉంటాయి. ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్ వేసుకున్నట్లుగా ఉండాలంటే ప్రైమర్ వాడాలి. ప్రైమర్ అంటే ప్రాధమిక అలంకరణ వస్తువు. ఐలైనర్ వేయాలంటే ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేయాలన్నా ప్రైమర్ వాడాల్సిందే. ప్రైమర్ వేసి ఆపై అలంకరణ చేస్తే సాయంత్రం వరకు బెదరకుండా ఉంటాయి. కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా పౌడర్ వేసినా ప్రయోజనం ఉండదు. కాస్సేపటికి పౌడర్ పోయి నలుపు కనిపిస్తుంది. ముందుగా కన్సీలర్ వేసుకుని పౌడర్ వేసుకోవాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలంటే ముందుగా పెదవులు పైన మృత కణాలు తొలగించి లిప్ బామ్ వేసుకుని లిప్ లైనర్ వేసుకుని మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలి. హేయిర్ స్ప్రే ని టూల్ బ్రష్ పై తీసుకుని కనుబొమ్మల్ని దువ్వుకుంటే రోజంతా చెదరకుండా ఉంటాయి.

    ప్రైమర్ ఉంటేనే మేకప్ చెదరదు

    ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ  లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్…

  • మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే చెంచా తేనె అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే సహజమైన మాయిశ్చరైజర్. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల [ఆటు మృదువుగా రుద్దుతూ ఉండాలి. కాస్సేపటికి కడిగేసుకోవచ్చు. రాత్రిపూట పడుకునే ముందర అప్లయ్ చేసి రాత్రంతా ఉంచుకున్నా పర్లేదు. ఆలాగే పాలు నిమ్మరసం ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. పాలల్లో వుండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఆలివ్ నూనె చర్మాన్ని మెరిపిస్తుంది . నిమ్మరసం మృతకణాలను తొలగించటం తో పాటు మొటిమలు రాకుండా కాపాడుతుంది.చర్మం మెత్తగా తాజాగా ఉంటుంది. అలాగే ఒక కప్పుడు గులాబీ రెక్కల్ని కప్పు వేడి నీళ్ళల్లో మరిగించాలి. అందులో కొంత రోజ్ వాటర్ చేర్చాలి. ఈ నీళ్లు చల్లారాక నాడులో చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు . ఈ నీటిని ముఖానికి రాస్తుంటే తేమగా కనిపిస్తుంది. ఇవన్నీ మాయిశ్చరైజర్ లాగే పనిచేస్తాయి.

    సహజమైన మాయిశ్చరైజర్ ఇదే

    మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే  చెంచా తేనె  అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే…