• ఆహార వేళలుంటాయి. అంటే మన శరీరానికి అవసరమయ్యే ప్రధాన మైన పోషకాలకు కాంతికీ చీకటితో సంబంధించి వుంది. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం సెరోటోనిన్ మెలటోనిన్ సమస్థితి పైన ఆధారపడి ఉంటుంది. పనులు నిద్ర కణ విభజన ఈ రెంటి సమస్థితి పైనే ఆధారపడి ఉంటాయి. సూర్య కాంతి మన శరీర లయను నియంత్రిస్తున్నాదని అర్ధం చేసుకుంటూ దాని ప్రకారం ఆహారం తీసుకోవాలని మోడ్రన్ అధ్యయనాలు చెపుతున్నాయి. వండిన ఆహారం మధ్యాన్న వేళ సూర్యాస్తమయ వేళ పూర్తిగా జీర్ణమవుతుంది. అంచేత ఎక్కువ అరుగుదలశక్తి అదనంగా అవసరమైన వండిన ఆహారం మధ్యాన్నం తీసుకుని మిగిలిన సమయంలో తేలికగా అరిగే తాజా పండ్లు మొలకలు గింజలు తినాలి. ప్రతి రోజూ ఉదయాన్నే ఆయా రకాల పండ్లతో మొదలుపెట్టాలంటారు. రాత్రి భోజనం మొలకెత్తిన ధాన్యాలు కూరగాయలతో వుంటే రాత్రి భోజనం మన శరీర నిర్మాణానికి పనికి వచ్చే కణాల పెరుగుదలకు పునరుత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. 15 నిముషాలు సూర్య కాంతి శరీరానికి తగలనివ్వటం ఇంకా మంచిది.

    సూర్య కాంతిని అర్ధం చేసుకుని తినాలి

    ఆహార వేళలుంటాయి. అంటే మన శరీరానికి అవసరమయ్యే ప్రధాన మైన పోషకాలకు కాంతికీ చీకటితో సంబంధించి వుంది. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం సెరోటోనిన్ మెలటోనిన్ సమస్థితి…

  • రష్యా కు చెందిన OLGANOSKOVA గాజులాంటి మెరుపుతో మార్బుల్ రాయి వుండే అందమైన వర్షం అద్దం లాగా ఉండటం ఇందులో రకరకాల గీతలూ కనపడేలాంటి అద్భుతమైన కేక్ ని తయారు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది విపరీతమైన స్పందన. ఆరు లక్షల మంది చూసేసిన ఈ మార్బుల్ మిర్రర్ కేక్ ఎలా తయారీ చేయాలో కూడా చెపేపరికి ప్రపంచవ్యాప్తంగా ఉండే పిల్లల అమ్మలు ఫిదా అయ్యారు. జిలాటిన్ నీళ్లు లిక్విడ్ గ్లూకోస్ పంచదార కండెన్సెడ్ మిల్క్ చాకొలేట్ ఆహారపు రంగులతో మార్బుల్ ఎఫెక్ట్ తేవటం అంటే వేర్వేరు రంగుల ఐసింగ్ కు ఒకేసారి కేక్ పైన పోయాలి. మెరిసే కేకు వెనక కథేమిటో చూడాలని అనుకుంటే యూట్యూబ్ లో తయారీ విధానం వుంది. ఇలాంటివి తయారు చేయాలంటే చేయి తిరిగిన షెఫ్ కు మాత్రమే కుదురుతుందని అనుకునే అక్కర్లేదు. ఈ ప్రపంచ వ్యాప్త ఫెమస్ కేక్ ను టై చేయచ్చు. చూడండోసారి.

    మార్బుల్ మిర్రర్ కేక్ సూపర్

    రష్యా కు చెందిన OLGANOSKOVA   గాజులాంటి మెరుపుతో మార్బుల్ రాయి వుండే అందమైన వర్షం అద్దం లాగా ఉండటం ఇందులో రకరకాల గీతలూ కనపడేలాంటి అద్భుతమైన కేక్…

  • హాట్ మిల్క్ తాగాలా వద్దా అని చాలా మంది సందేహ పడతారు. పాలకు వ్యతిరేకంగా రకరకాల థియరీలు వచ్చాయి. కనుక సందేహం నిజానికి కార్బోహైడ్రాట్స్ ,ఫ్యాట్స్ ,ప్రోటీన్స్, అసాధారణ కలయిక గల ఏకైక ద్రవ పదార్ధం పాలే. 100 ఎం. ఎజ్ ఆవు పాలలో 3. 2 గ్రాముల ప్రొటెం 4. 1 గ్రాముల ఫ్యాట్ 4. 4 గ్రాముల కార్బోహైడ్రాట్స్ 97 క్యాలరీలు ఉంటాయి. గేదె పాలు వీటికంటే హెవీ. పాలల్లోని ప్రోటీన్ అత్యధిక బయోలాజికల్ విలువలు కలిగి ఉంటుంది. అంటే పూర్తి ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. చక్కని గ్రహించే గుణంకలిగిన కాల్షియం ఉంటుంది.కానీ కొందరికి పాలు అరగకపోవచ్చు. దీనిలోని లాక్టోజ్ వల్ల ఈ అరుగుదల సమస్య వస్తుంది. ఒక కప్పు పాలు లేదా పెరుగు ఒకే నిస్పృత్తి లో అంటే 180 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. పెద్దలలో కొందరికి మాత్రమే పెరుగు పాలలో వుండే లాక్టోజ్ వల్ల పాలు సరిపడక పోవచ్చు. కానీ పిల్లలకు హాయిగా పాలు అరిగిపోతాయి. పాలను పెరుగు పనీర్ మజ్జిగ వంటి రూపాల్లో తీసుకున్న సమస్య లేదు. కానీ రోజూ పాలు తాగటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తుంచుకోమంటున్నారు డాక్టర్లు.

    అసాధారణ మిశ్రమాలున్న పాలు

    హాట్ మిల్క్ తాగాలా వద్దా అని చాలా మంది సందేహ పడతారు. పాలకు వ్యతిరేకంగా రకరకాల థియరీలు వచ్చాయి. కనుక సందేహం నిజానికి కార్బోహైడ్రాట్స్ ,ఫ్యాట్స్ ,ప్రోటీన్స్,…

  • కూరగాయలను ఉడికించటం వల్ల పోషక విలువలు ప్రభావితం అవుతాయి. కానీ అందరికీ ఇదే విధానం ఆరోగ్యాన్ని యెవ్వడంటారు నిపుణులు. ఉదాహరణకు కప్పు పచ్చి బఠాణీ లో 120 క్యాలరీలు ఉంటే అవి ఉడికిస్తే 230 క్యాలరీలు అవుతాయి. ఈ తేడాలను గుర్తించి వాడమంటున్నారు. పచ్చి కూరల్లో అధిక శాతం నీరుంటుంది. వాటని ఉడికిస్తే నీరు ఆవిరై క్షణాల్లో పోషకాలు విడుదల కావటం మూలంగా క్యాలరీల శాతం పెరుగుతుంది. టమాటో క్యారెట్ దుంపలు ఇవన్నీ ఈ కోవాకే వస్తాయి. క్యారెట్ లో బీటా కెరోటిన్ పచ్చిగా తింటే శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీన్ని ఉడికిస్తే పాలీ ఫెనాల్స్ సి విటమిన్ విచ్చిన్నం అవుతాయి. కనుక కొన్నిసార్లు ఉడికించి కొన్నిసార్లు పచ్చివీ తినాలి. అలాగే బ్రొకోలీ కాలీ ఫ్లవర్ లు మైరోసిసెస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఉడికిస్తే ఔషధ గుణాలు పోతాయి. అయితే ఇవి ఉడికిస్తే కాన్సర్ ను నిరోధించే ఇండోల్ అనే రసాయన పదార్ధం దొరుకుతుంది. ఇవి కొన్ని సార్లు ఉడికించకుండా సలాడ్స్ లాగా ఉడికించి కూరేలాగా తింటే మంచిది. వండే పద్ధతులు కూడా కూరగాయల్లో పోషకాలు స్థాయిని ప్రభావితం చేస్తాయి.

    కూరగాయలను ఉడికించటం వల్ల పోషక విలువలు ప్రభావితం

    కూరగాయలను ఉడికించటం వల్ల పోషక విలువలు ప్రభావితం అవుతాయి. కానీ అందరికీ ఇదే విధానం ఆరోగ్యాన్ని యెవ్వడంటారు నిపుణులు. ఉదాహరణకు కప్పు పచ్చి బఠాణీ లో 120…

  • సంతానోత్పత్తికి ఆహార పదార్ధాల లోని కొన్ని పోషకాలు ఎంతో సహకరిస్తాయి. హార్మోన్ల సక్రమ ప్రక్రియ కు అవసరమైన ప్రత్యేక పోషకాలు పిండం ఎదుగుదలఅండం ఆరోగ్యం వీర్య ఆరోగ్యం రక్త ఆరోగ్యం వంటివి శరీరానికి అందిస్తూ శరీరానికి మద్దత్తు ఇచ్చే ఆహారాన్ని సహజ ఫెర్టిలిటీ డైట్ అనచ్చు. ఈ డైట్ లో విటమిన్ సి వుండే తాజా పళ్ళు ఔషధ గుణాల వెల్లుల్లి ఫ్యాటీ యాసిడ్స్ వుండే చేపలు ఆకు కూరలు డైయిరీ ఉత్పత్తులు బాదం వాల్నట్స్ ఉడికించిన బంగాళా దుంపలు చిరు ధాన్యాలు సెరల్స్ బొప్పాయి చెర్రీలు పుట్ట గొడుగులు ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె వంటివి భాగంగా ఉంటాయి. మహిళలు ఆరోగ్యవంతంగా గర్భం ధరించేందుకు డాక్టర్లు ఇచ్చే మందులతో పాటు ఇచ్చే డైట్ చార్ట్ లు ఇవన్నీ ఉంటాయి. ఈ డైట్ ఫెర్టిలిటీ ఫుడ్ కాబోయే తల్లికీ కడుపులో పెరగబోయే శిశువుకు రక్ష వంటివి. ఆరోగ్యం ఆహారం పక్కపక్కనే ఉంటాయి మనం గ్రహించగలిగితే.

    ఇవన్నీ ఫెర్టిలిటీ డైట్ ఫుడ్ లో భాగం

    సంతానోత్పత్తికి ఆహార పదార్ధాల లోని కొన్ని పోషకాలు ఎంతో సహకరిస్తాయి. హార్మోన్ల సక్రమ ప్రక్రియ కు అవసరమైన ప్రత్యేక పోషకాలు పిండం ఎదుగుదలఅండం ఆరోగ్యం వీర్య ఆరోగ్యం…

  • పళ్ళు తినటం మంచిదే కానీ పళ్ళ రసాలు ఆరోగ్యం కావని చెపుతున్నారు శాస్త్రజ్ఞులు. గ్లాస్ జ్యూస్ కోసం నాలుగు పళ్ళు అవసరమైతే ఆ పళ్ళు జ్యూస్ తీయటం కన్నా తినటం బెటర్ అంటున్నారు. పెద్ద గ్లాస్ పళ్ళ రసంలో పోషకాల కన్నా క్యాలరీ లే ఎక్కువగా శరీరానికి అందుతాయి. అలాగే తేలికగా ఉంటుండీ కదా అని ప్యాక్ చేసిన జ్యూస్ టిన్ పైన లో ఫ్యాట్ అని రాసి ఉన్నప్పటికీ అది నిజం కాదని గ్రహించాలంటున్నారు. అంతే కాదు ప్యాక్ చేసి నిల్వ చేసిన జ్యూస్ లో ఏ ఏ ఫ్రూట్స్ ని కలిపారు నిల్వ ఉండేందుకు వాడిన రసాయనాలు రుచికోసం చేర్చిన చక్కర తక్కువ శాతంలో ఉప్పు ఇవన్నీ లెక్కలు చూడమంటున్నారు. ఒక గ్లాస్ తాజా ఆరెంజ్ జ్యూస్ ద్వారా 110 క్యాలరీలు లభిస్తే అదే తాజా ఆరెంజ్ ద్వారా 62.9 క్యాలరీలు లభిస్తాయి. తాజా ఆపిల్ ద్వారా 87. 9 క్యాలరీలు లభిస్తాయి. ఇదే సాఫ్ట్ డ్రింక్స్ ద్వారా 138 క్యాలరీలు లభిస్తాయట. మిగతా పండిన పండ్ల లో ఫైబర్ శాతం ఎంతో ఎక్కువగా ఉంటుందనీ ఆలా పండిన పండే రుచిగా ఆరోగ్యానికీ మేలు చేస్తుందనీ గ్రహించాలని సలహా ఇస్తున్నారు.

    పళ్ళా ? పళ్ళ రసాలా ?

    పళ్ళు తినటం మంచిదే కానీ పళ్ళ రసాలు ఆరోగ్యం కావని చెపుతున్నారు శాస్త్రజ్ఞులు. గ్లాస్ జ్యూస్ కోసం నాలుగు పళ్ళు అవసరమైతే ఆ పళ్ళు జ్యూస్ తీయటం…

  • ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా లో కార్బోహైడ్రాట్స్ ఉన్న ఆహారం తినటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది బరువు తగ్గిపోవటం ఖాయం. లో ఫ్యాట్ డైట్ వల్ల ఆరోగ్యానికి అపకారమే జరుగుతుందంటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా వుండాల్సిందే. అలాగే కార్బోహైడ్రాట్స్ తగ్గిస్తునామ్ము కదా అని మాంసాహారం ఎక్కువగా తీసుకోవటం కూడా కష్టమే. కార్బోహైడ్రాట్స్ లో కూడా 46 శాతం క్యాలరీలు ఉంటాయి అయినా కొవ్వు కరిగించే విషయంలో కార్బోహైడ్రాట్ వల్లనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నారు అధ్యయనాలు. ఎలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా కేవలం లో కార్బోహైడ్రాట్ తీసుకుంటే జీవన శైలిలో మార్పులు అంటే ఉదయాన్నే వాకింగ్ కొద్దిపాటి వ్యాయామం చేస్తే ఆరు నెలలు ఒక కిలో నుంచి నాలుగు కిలోలు బరువు తగ్గిపోతారు అంటూ చెపుతున్నారు పరిశోధకులు.

    బరువు తగ్గటం గ్యారెంటీ

    ఒక అధ్యయనం ప్రకారం కార్బోహైడ్రాట్స్ తక్కువగా ఉన్న ఆహారం ఆరు నెలల పాటు తీసుకోగలిగితే బరువు గ్యారెంటీ గా తగ్గిపోతారు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ కన్నా…

  • వాముని కిచెన్ కెమిస్ట్ అంటారు. ఘాటుగా వుండే వాసన కొంచెం కారంగా ..ఇంకొంచెం నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్గా వాము ఒక మంచి ఔషధం మందు,బోలెడన్ని ఉదర సంబంధమైన సమస్యలకు సరైన సమాధానం కూడా. కిచెన్ గార్డెన్ లో వాము మొక్క పెంచుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత నువ్వులు వాము నిమ్మరసం ఉప్పు కలిపి కాస్త వేడి చేస్తే వచ్చిన మిశ్రమాన్ని తింటే కడుపుకు సంబంధించి ఎన్టీజో ప్రయోజన కారి. జలుబు తలనొప్పి ఫ్లూ దగ్గు ఇతర సమస్యలు ఈ మిశ్రమంతోనే తగ్గించవచ్చు. ఆలా కారంగా వుంటుందనే రుచిగా లేదనో తినలేకపోతే ఏరోటీ లో రోటీల పిండిలోనో కలుపుకోవచ్చు. వాటికి రుచి వాసన పెరగటం తో పాటు ఆరోగ్యము దక్కుతుంది. బీన్స్ వంటి కూరల్లో కూడా వాముపొడి జలుబు సెనగపిండితో చేసిన ఏ వంటకం తో అయినా వాము చేరిస్తేనే మంచిది.

    వంటింట్లో డాక్టర్ ఈ వాము

    వాముని కిచెన్ కెమిస్ట్ అంటారు. ఘాటుగా వుండే వాసన కొంచెం కారంగా ..ఇంకొంచెం నోట్లో వేసుకుంటే మౌత్ ఫ్రెషనర్గా వాము ఒక మంచి ఔషధం మందు,బోలెడన్ని ఉదర…

  • హిందువుల శుభకార్యాలన్నింటిలోనూ తమలపాకు వక్క సున్నం తప్పనిసరిగా ఉంటుంది. మొఘల్ మహారాణి నూర్జహాన్ తాంబూల సేవనాన్ని స్త్రీలలో ప్రచారం చేసిందిట. ఆ కాలంలో స్త్రీలు అందంగా కన్పించేందుకు ప్రకృతి సిద్ధంగా లభించే రకరకాల లేపనాలు మూలికలు వాడేవారు. ఆ రోజుల్లో లిప్ స్టిక్ లేదు కనుక తాంబూలమే పెదవులకు అలంకారం నూర్జహాన్ తమల పాకులు రకరకాల సుగంధ ద్రవ్యాలు కలపటం వల్ల దాన్ని తింటే పెదవులు ఎర్రగా సహజసిద్ధంగా అందంగా ఉంటాయని గ్రహించింది పాత రోజుల్లో భోజనం అయ్యాక తాంబూలం వేసుకోవటం అలవాటుగా ఉండేది కానీ పళ్ళు పాడైపోతాయని మానేశారు. కానీ తాంబూలం లేదా తమలపాకు కిళ్ళీలో వేసే సుగంధ ద్రవ్యాలతో నూరు కడుపు బాగుపడతాయి . భారత దేశంలో కొన్ని లక్షల మంది కిళ్ళీల తయారీలో పొట్ట పోసుకునే వాళ్ళున్నారు. మిఠాయి కిళ్ళీల కొబ్బరి తురుము చక్కర ఖర్జురం ముక్కలు గుల్ కంద్ చెర్రీ ముక్కలు సోంపు వక్క పలుకులు ఉంటాయి. కాకపోతే అతి ఎప్పటికీ అనర్ధ దాయకమే కనుక ఈ పండగ పూటో తాంబూలం రుచి చుస్తే చాలు.

    ప్రకృతి సహజమైన లిప్ స్టిక్ ఇది

    హిందువుల శుభకార్యాలన్నింటిలోనూ తమలపాకు వక్క సున్నం తప్పనిసరిగా ఉంటుంది. మొఘల్ మహారాణి నూర్జహాన్ తాంబూల సేవనాన్ని స్త్రీలలో ప్రచారం చేసిందిట. ఆ కాలంలో స్త్రీలు అందంగా కన్పించేందుకు…

  • అమెరికా జీవితాన్ని అమెరికాను తల్చుకుని అదొక భూతాల స్వర్గం అన్న భావనతో ఎంతోమంది ఉంటారు. అక్కడ వస్తువులు రాళ్ళూ రత్నాలు చాక్లేట్లు తినటం తెచ్చుకోవటం గిఫ్ట్లుగా రావటం ఇంకెంతో గొప్ప అనుకునేవాళ్లు వున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా ఐరోపా వాసులు తినేదే బలవర్ధకమైన ఆహారం మనమైతే ఎదో కాస్త వేళకి వండుకు తింటాం. అనుకునే వాళ్ళకి గోల్డ్ న్యూస్ శాక్స్ అన్న సంస్థ వేడివేడిగా వండుకుని అప్పటికప్పుడు అరిటాకులో భోంచేస్తే భారతీయ భోజనమే పోషకాలకు నిలయం అని విశ్లేషించింది. నిల్వ చేసిన ఆహారం తినే అమెరికన్ల కంటే అన్నం పచ్చడి .పప్పు పాయసం సాంబారు పెరుగు ఊరగాయల్లో ఎన్నెనో క్యాలరీలు. అత్యంత రుచీ ఉన్నాయని పరిశోధన సారాంశం. పైగా మనం తినే భోజనం ఖర్చు తక్కువదీ పోషకాలు ఎక్కవదీ అనేసింది. ఊరగాయలు అప్పడాలు వడియాలు ఒరుగులూ తప్ప మనం అప్పటికప్పుడు ఫ్రెష్ గా కూరలు కోసి వండుకుని తింటాం కనుక ఈ అలవాటే ఎంతో మంచిదనీ పోషక విలువల తో కూడి వుంటుందని తేల్చింది.

    మన విస్తరి భోజనం బెస్ట్ అండ్ టేస్ట్

    అమెరికా జీవితాన్ని అమెరికాను తల్చుకుని అదొక భూతాల స్వర్గం అన్న భావనతో ఎంతోమంది ఉంటారు. అక్కడ వస్తువులు రాళ్ళూ రత్నాలు చాక్లేట్లు తినటం తెచ్చుకోవటం గిఫ్ట్లుగా రావటం…

  • క్యాబేజీని ప్రపంచం మొత్తం వాడతారు. మెడిటేర్నియన్ కోస్ట్ కు చెందిన క్యాబేజీ ఏడాది మొత్తం దొరికినా ఈ శీతాకాలంలో ఎక్కువగా ఎదిగే పంట ఇది. పచ్చిగా సలాడ్స్ తో దీన్ని తినచ్చు. విభిన్న ప్రాంతాల్లో విభిన్న రంగుల్లో లభిస్తుంది క్యాబేజీ. ఇందులో ఫిట్ న్యూట్రియాంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా దొరుకుతాయి. అన్ని రకాల థెరప్టిక్ డైట్స్ లో తప్పనిసరిగా ఉండాల్సినది. క్యాలరీలో చాలా తక్కువ. ఫ్యాట్ కూడా నామ మాత్రం . వంద గ్రాముల క్యాబేజీ లో 27 క్యాలరీల 0.1 గ్రాముల కొవ్వు ఉంటాయి. చైనీస్ క్యాబేజీని సలాడ్స్ లో వాడతారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది సరైన ఛాయిస్. వీటిలో ఉన్న పోషకాల దృష్ట్యా బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రిస్తుంది. పీచు చాలా ఎక్కువగా వుంటుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో లభించే విటమిన్ కె గర్భవతులకు పుట్టిన పసిబిడ్డలకు చాలా ముఖ్యమైనవి.

    తప్పనిసరి ఆహారం క్యాబేజీ

    క్యాబేజీని ప్రపంచం మొత్తం వాడతారు. మెడిటేర్నియన్  కోస్ట్ కు చెందిన క్యాబేజీ ఏడాది మొత్తం దొరికినా ఈ శీతాకాలంలో ఎక్కువగా ఎదిగే పంట ఇది. పచ్చిగా సలాడ్స్…

  • చిన్నతనంలో ప్రతి రోజూ పాలు తాగే పిల్లలకు వయసు ఎదిగేకొద్దీ ఆరోగ్యంగా వుంటారు. చిన్న వయసులో తాగిన పాలు తర్వాత సంవత్సరాల్లో అనేక లాభదాయకమైన ఫలితాలు ఇస్తుంటాయి. వయసు మీదపడినా వేగంగా నడవగలుగుతారు. ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోగలరు. ఫ్యాక్చర్ల అవకాశం తగ్గుతుంది. ఇవన్నీ బాగానే వుంటాయి మరి పాలు చూస్తేనే పరుగెత్తి పారిపోయే పిల్లల సంగతి ఏమిటి? పాలను ఏదైనా ఫ్లేవర్ లతో కలిపి అయినా తాగించగలగాలి. ఉదయం సాయంత్రం తాగితే చాలు. రోజుకు రెండు కప్పుల పాలు చాలంటారు డాక్టర్లు. ఆ మాత్రం పాలు పిలల్లకు కావలిసిన విటమిన్ డి ఐరన్ అందజేస్తాయి. ఈ రెండూ వారై ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఇరాన్ న్యూరాలజికల్;అభివృద్ధికి దోహదపడితే విటమిన్ డి శ్వాసకు సంబంధించిన అనారోగ్యాన్ని దగ్గరకు రానీయదు. కనుక పిలల్ల చేత ఒక రెండు కప్పుల పాలు తాగించగలిగితే చాలు. వాళ్ళ మేలుకల రక్షణకు ఎదుగుదలకు పాలు చాలా అవసరం .

    రెండు కప్పులు తాగిస్తే చాలు

    చిన్నతనంలో ప్రతి రోజూ పాలు తాగే పిల్లలకు వయసు ఎదిగేకొద్దీ ఆరోగ్యంగా వుంటారు. చిన్న వయసులో తాగిన  పాలు తర్వాత సంవత్సరాల్లో అనేక లాభదాయకమైన ఫలితాలు ఇస్తుంటాయి.…

  • ఇదివరకు ఇల్లు కట్టుకోవటం అంటే ఇంటి చుట్టూ చెట్ల కోసం జాగా వదిలేసి చుట్టూ అందమైన పూల తోట పండ్ల మొక్కలు పెంచేవాళ్ళు. ఇప్పుడు అంగుళం స్థలం ఊరికే వదలరు. కానీ పచ్చ దనం కోసం మనసు కొట్టుకుపోతూ ఉంటుంది. అప్పుడు ఇస్పాలియర్ పద్దతి కేసి చుడండి అంటున్నారు నిపుణులు. ఏదైనా మొక్కను గోడకు దగ్గరగా వేసి ఎప్పటికప్పుడు అది గోడను అతుక్కునేలా ఉంచేసి ఇవతలకు పెరిగే మొక్కలు కొట్టేయటం. పూలు పండ్లు అలంకరణకు ఉపయోగించే అన్ని రకాల మొక్కలు ఈ పద్దతి లో పెంచవచ్చు. ఇంటి గోడైనా ప్రహరీ గోడైనా మొక్కను నాటటం దాన్ని తీరుగా పెంచటం ఎస్పాలియర్ పద్దతి ముఖ్యమైన విషయం మొక్క పెరగక ముందే ఆ చివరా ఈ చివరా మేకులు కొట్టి తీగలు కట్టాలి. మొక్క పెరుగుతునప్పుడు కొమ్మల్ని ఈ తీగ లోకి దూర్చుతూ అదనంగా బయటకి వచ్చే కొమ్మల్ని కత్తిరించాలి. ఎంత పెద్దయినా గోడకి ఆనుకుని పెరుగుతాయి తప్ప విస్తరించవు. మందారం మల్లె గులాబీ గన్నేరు లతో పాటు నిమ్మ దానిమ్మ సీతాఫలం లాంటి పండ్ల మొక్కలను పెంచచ్చు. పెరటి గోడలు ఇంటి గోడలు కూడా అందమైన కాన్వాస్ లాగా మారిపోతాయి.

    గోడకు అతుక్కుని పెరిగే చెట్లు

    ఇదివరకు ఇల్లు కట్టుకోవటం అంటే ఇంటి చుట్టూ చెట్ల కోసం జాగా వదిలేసి చుట్టూ అందమైన పూల తోట పండ్ల మొక్కలు పెంచేవాళ్ళు. ఇప్పుడు అంగుళం స్థలం…

  • శుభ్రత విషయంలో నూటికి నూరు మార్కులూ మనకి మనం వేసుకుంటాం. తప్పులేదు. కానీ వంటింట్లో మనకి తరచూ వాడే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు కావాలి. పళ్ళ రసం తీస్తాం. బ్లయిండర్ లో నీళ్లు పోసి డిష్ సోప్ వేసి మళ్ళీ ఓసారి గిర్రున తిరిగేలా చేయాలి. మైక్రోవేవ్ వాసన పోవాలంటే ఒక కప్పు నీళ్లలో నిమ్మరసం ఓ అరకప్పు పోసి మైక్రో వేవ్ లో పెట్టి వేడి చేయాలి. ఆ పొగలు కక్కే నీటిని మైక్రో వేవ్ వాసనాలని దూరం చేస్తుంది. గ్లాస్ జార్ల పై కాఫీ లాంటివి పోస్తాం. బ్రౌన్ మచ్చలు పడతాయి. వాటిని పోగొట్టాలంటే ఐస్ ఉప్పు నిమ్మరసం టీయూస్కుని జార్ లో వేసి గిలకొడితే గ్లాస్ జార్ ఆ మిశ్రమం నీళ్లు తగిలి తెల్లగా తయారవుతోంది. కాఫీ కప్పుల లోపల ఎర్రని కాఫీ మరకలు ఏర్పడతాయి. ఉప్పు వెనిగర్ మిశ్రమం తో ఈ కప్పు తో తోమితే కొత్త వాటిలా అయిపోతాయి.

    గాఢమైన వాసన తో ఇలా పోతాయి

    శుభ్రత విషయంలో నూటికి నూరు మార్కులూ మనకి మనం వేసుకుంటాం. తప్పులేదు. కానీ వంటింట్లో మనకి తరచూ వాడే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు కావాలి. పళ్ళ…

  • నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అని ప్రతి నిమిషం ఎక్కడో చోట వినబడుతూ కనబడుతూ వుంటుంది. ఆరోగ్యనికి అవి మంచివే కానీ ఎన్ని తినాలి. మితి మీరి తింటే ఏమవుతుంది. ఈ సందేహాలకు డాక్టర్లు మంచి సమాధానం ఇచ్చారు. పిస్తా, వాల్ నట్, బాదాం, జీడి పప్పుల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. రకరాకాల సమస్యల్ని ఇవి దూరం చేస్తాయి. వాల్ నట్స్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పాతాయి. కాన్సర్ రానీయకుండా కాపాడతాయి. అయితే ఇవి రోజుకు పది గ్రాములు అంటే ఐదు వాల్ నట్లు తినాలి. వేరు సెనగ పది పన్నెండు పప్పులు, బాదం తొమ్మిది, జీడి పప్పులు గుప్పెట నిండుగా అన్నమాట. ఇలా రోజుతీసుకుంటే దాదాపు 23 అనారోగ్యాలకు శాశ్వతంగా దూరంగా వుండ వచ్చు. అతి గా తింటే బరువు పెరగడం ఖాయం.

    ఇలా కొన్ని తింటేనే ఆరోగ్యం

    నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అని ప్రతి నిమిషం ఎక్కడో చోట వినబడుతూ కనబడుతూ వుంటుంది. ఆరోగ్యనికి అవి మంచివే కానీ ఎన్ని తినాలి. మితి మీరి తింటే…

  • ఆరోగ్యం కోసం ప్రతి నిత్యం వ్యాయామాలు చేస్తూనే వుంటాం కదా అలసట దగ్గరకు రాకుండా షేర్ తింటున్నాం అన్నదాని పైన మన ఆరోగ్యం ఆధారపడి వుంది కొన్ని కాంబినేషన్స్ తినాలి. సాధారణంగా కండరాలు అలసిపోకుండా వుండాలంటే పనీర్ కాఫీ అరటిపండు సీమకోడి గుడ్లు ఖర్జురాలు ఓట్స్ చిలకడదుంపలు లాంటి శక్తి నిచ్చే పదార్ధాలు తినాలి. శరీరం లోని జీర్ణ క్రియలకు అవసరం అయ్యే పనీర్ మంచి ఫుడ్. అలాగే అరటిపండు పిండి పదార్ధం పుష్కలంగా పొటాషియం ఎక్కువగా ఉన్నాయి. ఇక కాఫీలో వుండే కెఫీన్ వ్యాయామం ముందు తీసుకుంటే కొవ్వు కరగటాన్ని వేగవంతం చేస్తుంది. సీమకోడిలో సోడియం తక్కువ కాబట్టి సంతృప్తి కొవ్వుల వల్ల అరుగుదల ఎక్కువగా ఉంటుంది. గుడ్లు ఇన్సులిన్ స్థాయిలకు సరైన స్థితిలో వుంచుతాయి కనుక ఉడికించి నేరుగా తినటం వల్ల కండరాల నిర్మాణం లో ఎంతో ఉపయోగపడుతుంది ఓట్స్ ఆకలిని ఆపగలుగుతాయి ఖర్జురాలు తేలికగా అరుగుతాయి. చిలకడ దుంపలు గొప్ప శక్తి నిస్తాయి. వ్యాయామానికి వెళ్లే ముందర ఇవే తినవలిసిన పదార్ధాలు.

    జిమ్ కు వెళ్లే ముందు ఇవే తినాలి

    ఆరోగ్యం కోసం ప్రతి నిత్యం వ్యాయామాలు చేస్తూనే వుంటాం కదా అలసట దగ్గరకు రాకుండా షేర్ తింటున్నాం అన్నదాని పైన మన ఆరోగ్యం ఆధారపడి వుంది కొన్ని…

  • అందం కోసం ఇంట్లో అలంకరించుకునే గాజు బొమ్మల్లాగే ఆహారం అందంగా కనిపించడం కోసం ప్రత్యేక బొమ్మలోస్తున్నాయి. షుగర్ షో పీసెస్. అచ్చంగా అందమైన కళాకృతులు ల్లాంటి పంచదార బొమ్మలు చూస్తుంటే అందమైన గాజు బొమ్మని టాబుల్ పైన పెట్టి నట్లు కనిపిస్తాయి. పంచదార నీరు పోసి బాగా వేడి చేసి సిలికాన్ రబ్బర్ మ్యాట్ పైన పోసి కావాలనుకున్న రంగు కలిపి గాజు వంటి పదార్ధం తాయారు అవుతుంది. దీన్ని వుల్డ్ షుగర్ అంటారు. బొమ్మలు చేసే క్లే లాంటిది ఇప్పుడు ఇది కాస్త వేడిగా ఉండగానే దేనితో నెమళ్ళు, పక్షులు, పువ్వులు, జలపాతాలు అందమైన ప్రక్రుతి మొత్తం ఈ సాగరాన్నే ఈ ముద్ద లో నుంచి రూపం పోసుకుంటాయి. ఈ బొమ్మలు చూసేందుకు కొన్ని అచ్చుల సాయం లేదా గాలి వూరే పరికరం ద్వారా బోలుగా ఉచ్చేట్టు చేస్తూ ఈ చూడ చెక్కని బొమ్మలు చేస్తారు. ఎండ తడి తగలక పొతే ఈ పంచదార బొమ్మలు ఏడాది దాకా చెక్కగా ఉంటాయి. ఈ షుగర్ శ్వ పిసెస్ కోసం ఇమేజస్ ఎన్నో వున్నాయి. చూస్తేనే కళ్ళు చేడురుతాయి.

    కళ్ళను కట్టేసే పంచదార బొమ్మలు

    అందం కోసం ఇంట్లో అలంకరించుకునే గాజు బొమ్మల్లాగే ఆహారం అందంగా కనిపించడం కోసం ప్రత్యేక బొమ్మలోస్తున్నాయి. షుగర్ షో పీసెస్. అచ్చంగా అందమైన కళాకృతులు ల్లాంటి పంచదార…

  • మైక్రో వేవ్ లో పదార్ధాల తయారీ మంచిదా కాదా అన్న సందేహాలు, చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. పోషకాలు పోతాయని, అంత వేడిలో సహజమైన రుచి పోతుందని చాలామంది అంటున్నారు కానీ ఇది నిజాం కాదు ఏ రకం వంట పద్దతిలో అయినా కొన్ని పోషకాలు, విటమిన్లు పోవడం సహజం. మిగతా వాటి తో పోలిస్తే మైక్రో వేవ్ లో తక్కువ పోషకాలు తక్కువ పోతాయి. పోషకాలు పోవడం అనేది ఉష్ణోగ్రత వంటి సమయం పై ఆధార పడి వుంటుంది. మైక్రో వేవ్ లో విటమిన్లు వేడి తక్కువ సమయంలో మాత్రమే ఎక్స్ పోజ్ ఆవుతాయి. ఎక్కువ భాగం హీట్ సెన్సిటివ్ న్యూట్రిషన్లే నీటిలో కరిగే విటమైన్లు ఫాలిక్ యాసిడ్, బి,సి విటమిన్లు వంటివే కనుక పాలకూర(ఫోలెట్), బెండకాయ(విటమిన్-సి), మాంసం(విటమిన్-బి) ఇవి అతిగా ఉడికిస్తే విటమిన్లు పోతాయి. అందుకే మైక్రో వేవ్ లో అతి తక్కువ సమయంలో కావాల్సినంత వేడెక్కుతాయి కనుక సందేహం లేకుండా ఉపయోగించ వచ్చు.

    మైక్రో వేవ్ మంచిదే

    మైక్రో వేవ్ లో పదార్ధాల తయారీ మంచిదా కాదా అన్న సందేహాలు, చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. పోషకాలు పోతాయని, అంత వేడిలో సహజమైన రుచి పోతుందని…

  • ఆరోగ్యం ఇవ్వటంలో సోయాగింజల పాత్ర ఎక్కువే ఉందంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సొయా దాని ఉత్పత్తులు మన దేశపు మార్కెట్ నీ ఆకట్టుకున్నాయి. సొయా నట్స్ సొయా బీన్స్ సొయా మిల్క్ సొయా యోగర్ట్ సొయా ఇసోలెన్స్ సొయా లెసిటిన్స్ మన మార్కెట్ నింపేస్తున్నాయి. శాఖాహారులకు అవసరం అయ్యే ప్రోటీన్లు అందేది సొయా ద్వారానే సొయా అనేది మాంసానికి ప్రత్యామ్నాయం అన్నది ప్రచార అంశం . సొయా ఎడమేమ్ అనేది ఉడికించి ఉప్పుతో కలిపి చిరుతిండిగా తినచ్చు. సోయాను సూప్ లు సలాడ్స్ లో కలుపుకుని తినచ్చు. సొయా సూప్ మంచిదే. ఆవుపాలు బదులు సొయా పాలు వాడటం మొదలు పెట్టచ్చు. సోయా ఉత్పత్తులు ఉదయపు అల్పాహారం మధ్యాహ్నం చిరుతిండిగా బేకింగ్ చేసిన వంటకాల్లో శాండ్ విచెస్ కాస్ రోల్స్ స్టెరిఫీడ్ ద్వారా సోయాకి ఎదో రకంగా తీసుకుంటే ఈ పోషక విలువల్ని సోయా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

    ప్రోటీన్ల మయం సోయా

    ఆరోగ్యం ఇవ్వటంలో సోయాగింజల పాత్ర ఎక్కువే ఉందంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సొయా దాని ఉత్పత్తులు మన దేశపు మార్కెట్ నీ ఆకట్టుకున్నాయి. సొయా నట్స్…

  • క్రిస్మాస్ కేక్స్ తాయారై పోతున్నాయి. ఇళ్ళల్లో కూడా మంచి రుచితో అందంగా తాయారు చేయడం చాలా మంది నేర్చుకున్నారు. మరి ఈ కేక్స్ అలంకరణ కోసం ఒక్క మంచి లేస్ దొరికితే అదే పంచదార లేస్. ఎలా చేయాలో చుదాలనుకుంటే sugar lace అని యుట్యూబ్ వీడియో లో చూడొచ్చు. ఇది ఆషా మాషీగా వుండదు అందమైన ముగ్గులాగా, లేస్ డిజైన్ లాగా పల్చని పొరలాగా పంచదార తో తాయారు చేసిన షుగర్ లేస్ తినే పదార్ధం అలా వండేసి వెండి గిన్నె లో పోస్తే సరిపోదు. దానికో అందమైన డిజైనర్ అలంకరణ ఉంటేనే ఇంట్లో పిల్లలు అతిధులు ఆనందిస్తారు. పంచదార ఎండబెట్టిన తెల్ల గుడ్డు సోన, మొక్క జొన్న పిండి, డేక్ట్రిన్ మొదలైనవి కలిపి తాయారు చేసిన ముద్ద తో మోల్డ్ పైన ఇలా రాస్తే చాలు, ఐదే నిమిషాల్లో లేస్ మన చేతుల్లో వుంటుంది. ఈ లేస్ కి పిండి తాయారు చేసే మౌల్ద్ డిజైన్లు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. ముగ్గులా ముద్దుగా వుండే వీటిని పువ్వుల ఆకారంలో మౌల్ద్ లో నుంచి తీసి వేడి కాఫీ లో వేసిచ్చినా అతిధులు ముగ్ధులైపోతారు.

    ముగ్గులా ముద్దుగా పంచదార లెస్ లు

    క్రిస్మాస్ కేక్స్ తాయారై పోతున్నాయి. ఇళ్ళల్లో కూడా మంచి రుచితో అందంగా తాయారు చేయడం చాలా మంది నేర్చుకున్నారు. మరి ఈ కేక్స్ అలంకరణ కోసం ఒక్క…