Wahrevaa
పోషకాలతో నిండిన చిలకడ దుంప
కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ దుంపలో ఎన్నో రకాలున్నాయి. మన దగ్గర తెలుపు లేదా లేత పసుపు రంగు గుజ్జు వున్న చిలకడ దుంపలుంటాయి. కానీ పసుపు, నారింజ, ఎరుపు, గోధుమ, వంకాయ రంగు ఇలా ఎన్నో విభిన్నమైన రంగుల దుమ్పలున్నాయి. ఈ రంగుల దుంపలు మరింత తియ్యగా ఉంటాయి.చైనా, కొరియా వంటి దేశాల్లో […]
చర్మ సంరక్షణ కోసం ఈ పండ్లు
ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఘూస్ బెర్రీ ని సహజ సిద్దమైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఎక్కువగా వాడతారు. శరీరంలోని మలినాలను తొలగించడంలో రక్త సుద్ధి చేయడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఎంజైమ్స్ పుష్కలంగా వుండే బొప్పాయి చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది వృద్దాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అవకాడో చలికాలం […]
అమ్మ చేతి బొమ్మలు
ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని చెప్పుతుంటారు తల్లులు ఇది వరకోసారి సమంతా లి అనే మలేషియా కు చెందిన పిల్లల తల్లికి ఇదే ప్రాబ్లం వాళ్ళతో వేగ లేక వాళ్ళ బోజనాల ప్లేట్ లో అన్నం క్యారెట్, టొమాటో, ఆపిల్, వంటివి ఉపయోగించి ఎన్నో రకాల బొమ్మలు చేసి ఆ బొమ్మల గురించి కధలు […]
టీ లేనిదే వెరైటీ నే లేదు
టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు గణాంకాలు. ప్రపంచంలో నానారకాల టీ లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో అస్సాం టీ , డార్జిలింగ్ టీ , నీలగిరి టీ లకు అద్భుతమైన గిరాకీ వుంది. ఇన్ని చెప్పుకున్నాక చక్కని టీ తాగాలి అనుకుంటే అన్ని సందర్భాలకు ఒక టీ పనికి రాదు అంటారు ఎక్సపర్ట్స్. […]
ప్రకృతి సహజమైన ఉపశమనం ఇవి
వంటింట్లో వుండే మందుల నిక్షేపాలను మనం పట్టించుకోము కానీ ఎన్నో ఖరీదైన మందులు ఇవ్వలేని ఉపసమానాలు ఇస్తాయివి. పూర్వం ఇన్ని మందులు లేవు ఖరేడీనా కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు. మరీ మంచాన పడితేనే డాక్టర్ మొహం చూసేది. చాలా చిన్ని చిట్కాలకు బోలెడన్ని అనారోగ్యాలు తలవంచేవి. బెల్లం అల్లంరసం కలిపితాగితే జాండీస్ తగ్గిపోతుంది. శొంఠి పొడి నీళ్లలో కలిపి నుదిటిపై పెడితే తలా నొప్పి తగ్గుతుంది. అల్లం నిమ్మరసం అజీర్తి కి మందు. అల్లం రసం తేనె […]
బరువు తగ్గించి శక్తి నిచ్చే అల్పాహారం
ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు కలిపి ఎండుఫలాలు వాల్నట్స్ బాదం పలుకులు కలిపి తింటే రోజంతా ఉత్సాహమే. ఓట్స్ ఎంతో మంచివి. బరువు తగ్గటమే కాదు ఆరోగ్యానికీ మంచివే. వెన్న లేని పాలతో తింటే కేలరీలు తగ్గుతాయి. అరటి పండ్లు ముక్కలు. ఎండు ద్రాక్ష పండ్లు నానబెట్టి పొట్టు తీసిన బాదం గింజలు తింటే […]
రేగి పండులో నిండగా పోషకాలు
రేగి వడియాలు తిన్నారా? రేగి పండ్లు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఒత్తిడిగా, ఆదుద్దాగా అనిపించినప్పుడు రెండు రేగి పండ్లు తింటే ఎంతో ఫలితం వుంటుంది. రేగి పండ్లలో వత్తిడి తగ్గించే గుణాలున్నాయి. రేగి పండ్లలో విటమిన్-సి, ఏ పొటాషియం అధికం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయానికి చాలా మంచిది. చర్మానికి చాలా మేలు చేస్తాయి. వృద్దాప్యా ఛాయల్ని దూరం చేస్తాయి. జీర్న వ్యవస్థ తిరును ఎంతగానో మెరుగు పరుద్తుంది. […]
కళ్లకింపుగా ప్లాస్టిక్ ఆహారం
బట్టలు చెప్పులు లాంటివి అమ్మే షోరూం లలో తమ దగ్గరుండే అన్నిరకాల వస్తువులు షోకేస్ లో ప్రదర్శనకు పెడుతూవుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికీ అదే పద్దతి. మనవాళ్ళు కూడా విండో షాపింగ్ చేస్తూ వుంటారు . అలాగే హోటల్లో దొరికే అన్ని రకాల పదార్ధాలను ప్రదర్శనకు పెడితే బావుంటుందననుకున్నాడు జపాన్ కు చెందిన రెస్టారెంట్ యజమాని. రంగులద్దిన మైనంతో ఎన్నో రకాల ఆహార పదార్ధాలను నోరూరించేలా దృష్టిని ఆకర్షించేలా తయారుచేయించాడు. అప్పటినుంచి రెస్టారెంట్ లో పదార్ధాల ప్రదర్శన […]
విటమిన్లు ఖనిజాల నిండుగా వుండే సెనగలు
నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో బోలెడన్ని ప్రోటీన్స్ పొటాషియం మాంగనీస్ జింక్ విటమిన్ కె వంటి నిల్వలు పుష్కలంగా వున్నాయి. కనుక ప్రతి రోజు ఆహారంలో తినండి అంటున్నారు. పీచు విటమిన్ సి విటమిన్ బి6 ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పండ్లు కూరగాయల్లో సెలెనియం ఖనిజం అంతగా దొరకదు. సెనగల్లో పుష్కలంగా దొరికే […]
పచ్చి కురలకంటే వండినవే బెస్ట్
శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్ చేస్తాయని అనుకోవడం దండగే పలు పరిశోధనలు చెప్పుతున్నాయి. పచ్చి కూరలు ఎంత కడిగినా వాటి పైన సుక్ష్మ జీవులు నసించవు. అంచేత వాటిని ఆరోగ్యకరమైన పద్దతిలో వండితే పచ్చి వాటికంటే మేలు చేస్తాయి. కూరగాయలు అతిగా నూనెలో వేయించడం,మసాలాలు దట్టించి మైళ్ళ కొద్ది సువాసనలు వచ్చేలా వండటం చేయకుండా […]
తెల్లనివి తింటేనే ఆరోగ్యం
ఒక చిన్న తమాషా. మనకి ఆరోగ్యం అందించేవన్నీ తెల్లని రంగులోనే ఉంటాయి. గమనించారా ? నెయ్యి తెల్లగా ఉంటుంది. మెదడు పనితీరు కీళ్లు మెరుగ్గా ఉండటం కీలకమైన విటమిన్లను గ్రహించటం తో నెయ్యిదే కీలకపాత్ర. కొబ్బరి ఇది చర్మానికి శిరోజాలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. జీడిపప్పు కాల్షియం మెగ్నీషియం అధికంగా వుండే జీడిపప్పు కండరాలకు ఎముకలకు బలం. డయాబెటిక్ ఉంటే దాని కనిష్ట గ్లైనమిక్ ఇండెక్స్ ఎంతోమంచి చేస్తుంది. అరటి పండులో కొవ్వులు వుండవు. […]
తెల్లని గుజ్జు వలిస్తే నల్లని రంగు
పల్లెటూర్లలో పొలాల గట్ల వెంబడి స్వేచ్ఛగా పెరిగే చెట్లలో సీమ చింత కూడా ఒకటి. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చగా గట్టిగా వగరు రుచితో వుండే సీమచింత పక్వానికి వస్తున్న కొద్దీ బంగారు రంగు గులాబీ ,ఊదీ, ఎరుపు రెంగుల్లోనే మారిపోతుంది. పండిందంటే పై తొక్క ఊడి వచ్చేస్తూ ఉంటుంది లోపల ఒక్కొక కణాలపు తో తెల్లని గుజ్జు మధ్యలో నల్లని గింజ ఉంటాయి. దాన్ని సీమ తమ్మ అని కూడా పిలుస్తారు. తమిళనాడు కేరళ మహారాష్ట్ర […]
గ్రీన్ టీ తో మొటిమలు తగ్గుతాయి
గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి చేరింది. గ్రీన్ టీ తాగితే మొటిమలు మాయం అయిపోయాయంటున్నాయి ఈ సరికొత్త అధ్యయనాలు. మరీ ముఖ్యంగా ,ముక్కు గదమ ప్రాంతాల్లోకి మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. గ్రీన్ టీ వల్ల కేసంలోని అంకుర ప్రాంతంలో నూనె స్రవించే గ్రంధుల వద్ద బాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలో సైతం మొటిమలకు […]
సీతా ఫలం ఎంతో మధురం
సీతా ఫలం రామా ఫలం హనుమాన్ ఫలం ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారు గానీ ఈ సీతా ఫలం హనుమాన్ ఫలాన్ని కలిపి అత్మోయా అనే హైట్రాడ్ పండు సృష్టించారు. తైవాన్ లో దొరికే ఈ పండు పేరు పైనాపిల్ షుగర్ ఆపిల్. మళ్ళీ తొక్కలు వుండే లక్ష్మణ ఫలాన్ని దక్షిణ అమెరికా లో బిరిబా అని పిలుస్తారు. సీతా ఫలం తో పోలిస్తే మిగిలిన వాటిల్లో గింజలు తక్కువ. దీన్ని షుగర్ ఆపిల్ అంటారు. మహబూబ్ […]
అరకిలో ఖరీదు సుమారు రెండు లక్షలు
చాక్లేట్లు తయారుచేసే కోకోవా గింజలు అనడాన్ని పెంచే సెరటోనిక్ విడుదలకు ఎంతగానో తోడ్పడతాయట. అందుకేనేమో శుభాకాంక్షలు చెప్పేందుకు చాక్లేట్స్ పంచుతుంటారు. అన్నట్లు లక్షల విలువ చేసే చాక్లేట్లు ఉంటాయి. నిప్ షీల్డ్ ఫ్రిట్జ్ కంపెనీ తయారుచేసిన చాకోపాలజీ ప్రపంచంలో కెల్లా ఖరీదైంది. అత్యుత్తమ ట్రిఫిల్ కరోవా బీన్స్ తో తయారు చేసే అరకిలో విలువ రెండు లక్షలు దాని తర్వాత స్థానం నోకా వింటేజ్ కలెక్షన్ ది. దీనికోసం ట్రిన్డాప్ ఈక్వెడార్ వెనిజులా కోట్ డీవార్ నుంచి […]
ఐస్ క్రీమ్ హాయిగా తినండి ఏం పర్లేదు
ఐస్ క్రీమ్ తినటం వల్ల పళ్ళు పాడైపోతాయని జలుబు చేస్తుందని సాధారణంగా పిలల్లకు తల్లులు చెప్పే అపోహలు. నిజమే ఐస్ క్రీమ్ వల్ల జలుబు చేస్తుందని చెప్పటం కేవలం అపోహ. ఐస్ క్రీమ్ లో వాడే పాలు అందులోని చక్కర కారణంగా గొంతు బొంగురుపోతుందని చాలా మంది చెప్పే మాటలు పూర్తిగా నిరాధవం అంటున్నారు. మాయో క్లినిక్ వైద్య నిపుణులు. పడిసెమ్ పడితే చల్లని ఐస్ క్రీమ్ తినటం మేలనీ దాని వల్ల బొంగురు పోయిన గొంతుకు […]
కాఫీ మేకింగ్ నాట్ ఈజీ
కాఫీ ఇష్టం లేనిదెవరికి? ఫిల్టర్ కాఫీ తాగినా లేదా ఇన్స్టెంట్ రుచి అయినా అన్నీ బానేవున్నాయనిపిస్తోంది. వేడిగా కాఫీ వాసనొస్తే చాలనిపిస్తుంది. కానీ కాఫీ మేకింగ్ గొప్ప ఆర్ట్ అనీ దీన్ని ఒక పద్దతి లో కలిపి తేనె అసలైన రుచి అంటారు నిపుణులు. ముందు నాణ్యమైన గింజల్ని రోస్ట్ చేసిన డేట్ చూసి మరీ కొనాలి. గాలి చొరబడని డబ్బాలు నిల్వచేయాలి. ఫ్రీజర్ లో ఉంచకూడదు. వాడే ముందర గింజల్ని గ్రైండ్ చేయాలి. మాములు మంచి […]
గాజుల్లా తొడుక్కునే డంబెల్స్
రొటీన్ కి భిన్నంగా చేసే ఏదైనా ఎక్సర్ సైజ్ చేయాలనుకుంటే magenetic dumb bell ట్రై చేయొచ్చు. చేతి కండరాళ్ళు ధృడంగా వుండేందుకు బరువైన డంబెల్స్ వాడతారు కదా. అవి బరువుగా వుంటాయి పైగా వాటిని మోస్తూ వుండాలి. ఈ మాగ్నెటిక్ డంబెల్స్ చూసేందుకు గాజుల్లా వున్నాయి. వాటిని బుజానికి ఒకటి మణికట్టు దాటి మరొకటి తగిలించుకుంటే చాలు. ఎంత బరువు ఎత్తాలనుకుంటున్నారు సెట్ చేసుకుంటే చాలు. వాటిల్లోని అయిస్కాంత శక్తి కారణంగా ఒక దాన్ని ఒకటి […]
మంచి నిద్రకు మంచి భోజనం వాతావరణం
మంచి నిద్రకు ఆహారానికీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా ప్రభావం చూపించక పోయినా పరోక్షంగా ఆరోగ్యాన్ని దాని ద్వారా నిద్రనూ దెబ్బ తీస్తాయి. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం మాత్రం సంపూర్ణాహారం అని మనం పిలిచే పాలు ఒకటే. ఇందులో అన్ని పోషకాలతో పాటు ట్రెప్టోఫాన్ ,అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. […]
స్వీట్ బదులు ఇవి ట్రై చేస్తే బెటర్
నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న స్వీట్ రుచి గొప్పదనం ఇదే. మాములుగా డాక్టర్లు ఎం చేపుతరంటే ఒత్తిడి, అలసట శరీరానికి తినాలనిపించడానికి కారణాలు శక్తి తగ్గితే తీపి ద్వారా శరీరానికి తక్షణ సాయం అందుతుంది. ఈ కబుర్లు అలా వుంచి స్వీట్లు జోలికి వెళ్ళకుండా వుండాలంటే ముందస్తుగా వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు, అలాగే శరీరంలోని […]
