• నెమ్మదిగా చలి తగ్గిపోతుంది. వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పుడు చూసేందుకు పచ్చగా కాస్త ఎర్రగా కళ్ళకు విందు చేసే పుచ్చకాయల సీజన్ మొదలైంది. పుచ్చకాయ తినేనేదుకు రుచికరమనే కాదు. ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా రోజుకో స్లైస్ తప్పకుండా తింటే కోలేస్త్రోల్ తగ్గడం మాత్రమే కాదు, బరువు పెరగకుడా అదుపులో ఉంచుతుంది. పుచ్చకయలో వుండే సిట్రలాయిన్ అనే కెమికల్ ఈ విధమైన పనితీరుకు సహకరిస్తుందని అమెరికాలోని పర్ద్యు యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అత్యధిక కొవ్వు పదార్ధాల తో పాటు పుచ్చకాయ ఇచ్చి పరిశోధనలు చేయగా రక్తనాళాల్లో కొవ్వు డిపాజిట్ లను అడ్డుకోవడం తో పుచ్చకాయ బ్రహ్మాండంగా పనిచేసిందని వారు వివరించారు. వేసవి సిజన్ అనే కాదు సంవత్సరం పొడుగునా పుచ్చకాయ దొరుకుతూనే వుంటుంది కనుక రోజుకో ముక్క తినడం పెద్ద సమస్యే కాదు. తప్పని సరిగా రోజులో ఎదో ఒక సమయంలో ఒక ముక్క తిని చూడండి.

    రోజుకో పుచ్చ ముక్క

    నెమ్మదిగా చలి తగ్గిపోతుంది. వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పుడు చూసేందుకు పచ్చగా కాస్త ఎర్రగా కళ్ళకు విందు చేసే పుచ్చకాయల సీజన్ మొదలైంది. పుచ్చకాయ తినేనేదుకు రుచికరమనే కాదు.…

  • శరీరానికి పోషకాలు విటమిన్ల అవసరం ఎంతో ఉంటుంది. ఆరోగ్యం అందం కోసం పోషకాలు శరీరానికి అందాలి. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. ఇది లోపిస్తే శారీరికంగా నొప్పులు ఎక్కువవుతాయి . కూర్చోవటం మెట్లెక్కటం కూడా చేయలేక పోతారు. పాలు జున్ను పుట్ట గొడుగులు ఆరెంజ్ జ్యూస్ పెరుగు గుడ్డు సోన వంటి వాటిలో డి విటమిన్ ఉంటుంది. అలాగే ఐరన్ లోపిస్తే రక్త హీనత వచ్చే ప్రమాదం వుంది . పాలకూర ఎర్ర కందిపప్పు ఓట్స్ చేపలు బీన్స్ నుంచి ఇనుమును అత్యధికంగా పొందవచ్చు. నిమ్మజాతి పండ్లు ఆకుకూరల తో విటమిన్ సి శరీరానికి లభిస్తుంది. మాంసకృతులు శరీరంలో కొత్త కణాల అభివృద్ధి కి తోడ్పడతాయి. గుడ్లు మాంసం నట్స్ డైరీ పదార్ధాల నుంచి మాంస కృతులు అందుతాయి. బరువు పెరుగుతామనే భయంతో కొవ్వుల్ని దగ్గరకు రానివ్వడు కానీ ప్రతిరోజు ఇరవై శాతం కేలరీలు కొవ్వుల నుంచే లభించాలి. విటమిన్ బి లోపిస్తే ఎన్నోరకాల అనారోగ్యాలు వస్తాయి. గుడ్లు పాలు బీన్స్ మాంసాహారం రోజు తీసుకోవాలి. ఇవన్నీ సరైన నిష్పత్తి లో అందితే శరీరంలో అందం ఆరోగ్యం రెండు భద్రంగా ఉంటాయి.

    వీటితో ఆరోగ్యం అందంరెండు భద్రం

    శరీరానికి పోషకాలు విటమిన్ల అవసరం ఎంతో ఉంటుంది. ఆరోగ్యం అందం కోసం పోషకాలు శరీరానికి అందాలి. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. ఇది లోపిస్తే శారీరికంగా…

  • మనకు టీ అంటే టీ నే. టీ పొడి, పంచదార, ఓ యలక్కాయో, అల్లమో ఇంతే కదా. కానీ ఆకులు, పువ్వులు, గింజలు, వేళ్ళతో కూడా రకరకాల టీలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలని పోగొడతాయి. నిద్ర సరిగా పట్టక పొతే రెండు స్పూన్ల ఎండిపోయిన చమేలి ఆకుల్ని నీళ్ళల్లో మరిగించి చమేలి టీ తాగితే మంచి నిద్ర పడుతుందిట. బ్లాక్ టీ లో వుండే కెఫిన్ వల్ల అలసట తగ్గిపోతుందిట. రోజు రెండు సార్లు తాగితే ఓత్తిడి తగ్గించే హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. జలుబు, దగ్గు వుంటే గ్రీన్ టీ లో తేనె నిమ్మకాయ కలిపి తాగితే బాగుంటుంది. కాఫి తాగే వాళ్ళతో పోలిస్తే టీ తాగే వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి ఐడు రెట్లు ఎక్కువని అధ్యాయినం రిపోర్టు. గ్రీన్ టీ లో వుండే టాక్సిన్లు, ఫ్లోరైడ్ వంటివి దంతక్షయం, వ్యర్ధల్ని తగ్గిస్తాయి. కదలకుండా 12 గంటలు పని చేసే వాళ్ళలో వుండే ఓత్తిడి, టీ ఆకుల తో పాటు వాము, అల్లం కలిపి టీ తాగితే ఆ సమస్య వుండదు. బలహీనమైన ఎముకులుంటే వైట్ టీ తాగాలి ఇందులోని ఫైటో కెమికల్స్ నొప్పిని తగ్గిస్తాయి ఎముకల్ని బలంగా ఉంచుతాయి.

    ఆరోగ్యానిచ్చే రకరకాల ‘టీ’ లు

    మనకు టీ అంటే టీ నే. టీ పొడి, పంచదార, ఓ యలక్కాయో, అల్లమో ఇంతే కదా. కానీ ఆకులు, పువ్వులు, గింజలు, వేళ్ళతో కూడా రకరకాల…

  • చింతపండంటే పళ్ళు జివ్వుమనేంతగా చూడకుండానే అనిపిస్తుంది కదా, కనీ ధాయ్ లాండ్ చింతకాయలు ప్యాక్ చేసి చేసి వస్తున్నాయి. అవి తియ్యగా ఉన్నాయి. వీటితో అక్కడ క్యాండిలు, మిటాయిలు తయ్యారు చేస్తారట. మనకైతే చింతపండు లేని వంటకం అసాధ్యం సాంబారు, చారు, పులిహోర, నిల్వ పచ్చళ్ళు అన్ని చింతపండు మయం. చింత చిగురు పప్పు, పచ్చడి నోరురిపోయెంత రుచి. సైనస్ వున్న వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ వున్న వాళ్ళకి చింతపండు బదులు టొమాటో, నిమ్మ, వాడమంటారు కానీ పరిశోధనలు అంత అవసరం లేదనే చెపుతున్నాయి. ఇందులో టార్టారిక్ ఆమ్లం, లియోనిన్ జెరానియోల్, శాప్రోల్, సినామిక్ ఆమ్లం, మిధైల్ శాలిసిలైట్ వంటి ఫ్లైటో కెమికల్స్ ఓషధాల్లా పని చేస్తాయి. ఇందులో ఎన్నెన్నో పోషకాలున్నాయి. కొన్ని మందుల్లోనూ చింతపండు నుంచి తీసిన పదార్ధాలు వాడతారు. కాలేయం పని తీరుని, జీర్ణ క్రియ పెంచుతుంది. ఉగాది పచ్చడి తో సహా చింతపండు ఆరోగ్య ప్రదాయకం నిష్యంతగా వాడదగ్గది.

    నిశ్చింత గా తినేయొచ్చు

    చింతపండంటే పళ్ళు జివ్వుమనేంతగా చూడకుండానే అనిపిస్తుంది కదా, కనీ ధాయ్ లాండ్ చింతకాయలు ప్యాక్ చేసి చేసి వస్తున్నాయి. అవి తియ్యగా ఉన్నాయి. వీటితో అక్కడ క్యాండిలు,…

  • సి విటమిన్ శరీరానికి అందితే చాలు చర్మం యవ్వన కాంతితో మెరిసిపోతుంది చాలా సార్లు చదివేం. కానీ ఈ విటమిన్ కోసం సిట్రస్ పండ్లు వెతకాల్సిన పనిలేదు . మనం రోజు తినే ఎన్నో పదర్ధాలతో ఉండే ఆ విలువైన విటమిన్ మన శరీరానికి కందేలా చూసుకోవాలి. పదిముక్కల కాప్సికం నుంచి వంద గ్రాముల సి విటమిన్ అందితే జామకాయ ముదురాకు పచ్చ రంగులో ఉండే కట్ట పాలకూర కప్పు చొప్పున టమాటో బొప్పాయి స్ట్రాబెర్రీ ముక్కలు నుంచి అన్నే గ్రాముల సి విటమిన్ అందుతుంది. ఇవి ఎన్ని తింటే మేలు ఆనంది క్వశ్చను . మహిళలకు ప్రతిరోజు 75 గ్రాముల సి విటమిన్ అవసరం అయితేతొమ్మిది నుంచి 13 సంవత్సరాల పిల్లలు 45 గ్రాముల వరకు తీసుకోవాలి . ఇక రోజు ఏ పోషకాల కోసం కాప్సికం బొప్పాయి స్ట్రా బెర్రీ కాలీఫ్లవర్ అనాస కమలా ఫలం వంటివి తప్పనిసరిగా లెక్కలేసుకుని మరీ తినాలి. శరీరానికి ఆరోగ్యం ఇచ్చే కీలకమైన విటమిన్ కాబట్టి వయసుని బట్టి ఎంత తినాలో తేల్చుకుని తినాలి.

    వయసుని బట్టి అంచనా వేసుకోండి

    సి విటమిన్ శరీరానికి అందితే చాలు చర్మం యవ్వన కాంతితో మెరిసిపోతుంది చాలా సార్లు చదివేం. కానీ ఈ విటమిన్ కోసం సిట్రస్ పండ్లు వెతకాల్సిన పనిలేదు…

  • చాలామందికి మష్రూమ్స్ నచ్చవు గానీ ఇవి అపారమైన పోషక విలువలకు ఆధారం. వీటిల్లో హెపటో ప్రొటెక్టివ్ కార్డియో యాంటీవైరల్ యాంటీ డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ కాన్సర్ యాంటీ వైరల్ యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలున్నాయి. కార్బోహైడ్రేట్స్ క్యాలరీలు తక్కువగా ఫైబర్ పాళ్ళు ఎక్కువగా ప్రోటీన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి . రోగనిరోధక వ్యవస్థను పెంపొందించటానికి ఈ పోషకాలు ఎంతో ఉపకరిస్తాయి. అర కప్పు ఉడికించిన మష్రూమ్స్ 20 గ్రాముల క్యాలరీలు 1. 7 గ్రాముల ప్రోటీన్స్ 17 గ్రాముల కార్బో హైడ్రేట్స్ 278 మి. గ్రా పొటాషియం 3.5 మి గ్రా నియాసిన్ లభిస్తాయి. మష్రూమ్స్ లో టానిక్స్ ఉంటాయి కానీ ఇవి ఉడికిస్తే పోతాయి. కాబట్టి ఎలాంటి భయం లేకుండా తినచ్చు. ఇది అన్ని రకాల కూరల్లోనూ వేసి వండుకోవచ్చు . చపాతీల్లోకి చేసుకునే మిక్సడ్ వెజిటబుల్స్ లో మష్రూమ్స్ కూడా చేర్చుకుంటే ఇవి కూరలో కలిసిపోయి కనబడకుండా పోతాయి. అంచేత అయిష్టాన్ని పక్కన పెట్టి ఇవి తప్పకుండా తినాలి.

    పోషకాల నిలయం మష్రూమ్స్

    చాలామందికి మష్రూమ్స్ నచ్చవు గానీ ఇవి అపారమైన పోషక విలువలకు ఆధారం. వీటిల్లో హెపటో ప్రొటెక్టివ్ కార్డియో యాంటీవైరల్ యాంటీ డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ కాన్సర్…

  • కీరాదోస కు ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయల్లో నాలుగో స్థానం వుంది. సహజంగా లభించే పౌష్టికాహారం ఇది. సేంద్రియ పద్దతిలో కీరా దోస శరీరానికి అంతులేని ఉపయోగాలిస్తుంది. బి విటమిన్ మెండుగా వుండే కీరా దోస తక్షణ శక్తీ కరకం. 95 శాతం నీరే. చర్మం శిరోజాల రక్షణకు ఇది ఔషధం. కళ్ళ కింద నల్లని వలయాలు ముడతలు కీరా దోస గుజ్జు అప్లయ్ చేస్తే పోతాయి. ఇందులో వుండే సిలికాన్ సల్ఫర్ లు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. ఎన్నో రకాల కాన్సర్ లను తగ్గించేందుకు కీరా సహాయపడుతుందని వాడియా పరిశోధనలు చెపుతున్నాయి. కీరా దోస పల్చని ముక్కను నాలుకతో మొటిలోని అంగిలికి తగిలేట్టు 30 సెకన్లు నొక్కిపెడితే చాలు అందులోని ఫైటో కెమికల్స్ నోటి దుర్వాసనను కారణం అయ్యే బ్యాక్తీరియా ను చంపేస్తాయి. ఎక్కువ నీరు తక్కువ క్యాలరీలు వుండే కీరా దోస బరువు తగ్గించేందుకు చాలా సహాయపడతాయి, ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మధుమేహం నియంత్రిస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం రెండు తమాషా ఉపయోగాలున్నాయి. స్నానాల గదిలో అద్దని కీరముక్కలతో రుద్దితే వేడి నీటి వల్ల అడ్డం పై ఆవిరి ఏర్పడదు. అదే తలుపులు శబ్దం చేస్తుంటే కీరా ముక్క రుద్దితే శబ్దం పోతుంది.

    కూరగాయల్లో కీరాది నాలుగో స్థానం

    కీరాదోస కు ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయల్లో నాలుగో స్థానం వుంది. సహజంగా లభించే పౌష్టికాహారం ఇది. సేంద్రియ పద్దతిలో కీరా దోస శరీరానికి అంతులేని ఉపయోగాలిస్తుంది.…

  • ఈ సీజన్ లో ఆ ఆకుపచ్చ పండు కన్నులపండుగ్గా నోటికీ కంటికీ విందు చేస్తూ ఉంటుంది. ఇళ్లలో కూడా సులువుగా పెంచుకునే సీతాఫలాల నిండా చెప్పలేనంత కాల్షియం నిల్వలుంటాయి. కానీ వీటిని కొనే సమయంలో మిగతా పండ్ల తో పోల్చితే అదనపు శ్రద్ధ కావాలి. కాయ పండి గట్టిగ ఉండాలి. నొక్కితే బ్రేక్ అవకూడదు. సీతా ఫలం కళ్ళ మధ్య తెల్లని బూజు వంటిది అంటుకునే ఉంటే వాటిని కొనగూడదు. ఇవి ఫంగస్ ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. పండు పైన నల్లని మచ్చలు చుక్కలు వున్నా కొనద్దు. ఎల్లోయిష్ గ్రీన్ గా వున్నాయంటే లోపల పాడయి పోయినట్లు లెక్క వీటిని ఒక్కసారిగా ఎక్కువగా కొనకూడదు. త్వరగా పాడై పోతాయి. ఒకటి రెండు రోజులకు మించి తాజా తనం ఉండదు. సీతాఫలాన్ని సాధారణ గది ఉష్ణోగ్రతలు ఫ్రూట్ నెట్ లో ఉంచుకోవాలి. ఇతర క్రిముల్ని బాగా ఆకర్షిస్తాయి. సీతాఫలాల్లో విటమిన్ ఏ మెగ్నీషియం పొటాషియం ఫైబర్ విటమిన్ బి 6 కాల్షియం విటమిన్ సి ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలున్నాయి. శీతాకాలపు పండు ఇది

    శీతాకాలపు పండు ఇది

    ఈ సీజన్ లో ఆ ఆకుపచ్చ పండు కన్నులపండుగ్గా నోటికీ కంటికీ విందు చేస్తూ ఉంటుంది. ఇళ్లలో కూడా సులువుగా పెంచుకునే సీతాఫలాల నిండా చెప్పలేనంత కాల్షియం…

  • మంచి పోషకాలతోనే శరీరారోగ్యం . కానీ కొన్ని పోషకాలు తినేందుకు శరీర లావణ్యం పెంచుకునే పూతలగానూ ఉపయోగపడతాయి. దాన్ని అటు ఆహారంలో తీసుకోవాలి చర్మానికీ రాసుకోవాలి. చర్మం కాంతిగా తేజస్సు తో కనిపించాలంటే విటమిన్ ఇ అండ్ పదార్ధాలు రోజు తినాలి. అప్పుడు అందులోని పోషకాలు శరీరానికి అంది చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ విటమిన్ ఇ మాత్రల రూపంలో దొరుకుతుంది. రోజు ఉదయాన్నే ఇ విటమిన్ నూనెను ఒంటికి పట్టించి మర్దనా చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసినా చర్మం చక్కగా మృదువుగా కాంతిగా అయిపోతుంది. మొహం పైన పట్టేస్తే కళ్ళ కింద నలుపు మడతలు తగ్గుతాయి. మొటిమల తాలూకు మచ్చలు సన్నటి గీతలు కూడా ఈ విటమిన్ ఇ నూనె రాస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోతాయి . రాత్రివేళ రోజు ఈ నూనె అప్లయ్ చేస్తే ఉదయం చల్లని నీళ్లతో కడిగేస్తే ముఖంలో మురికి పోయేందుకు కూడా ఈ నుయ్న్ చక్కగా పనిచేస్తుంది. విటమిన్ ఇ ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల చర్మం సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా అయిపోతుంది.

    అందాన్ని పెంచే విటమిన్ ఇ

    మంచి పోషకాలతోనే శరీరారోగ్యం . కానీ కొన్ని పోషకాలు తినేందుకు శరీర లావణ్యం పెంచుకునే పూతలగానూ  ఉపయోగపడతాయి. దాన్ని అటు ఆహారంలో తీసుకోవాలి చర్మానికీ  రాసుకోవాలి. చర్మం…

  • రెండు అరటిపండ్లు తింటే 90 నిముషాల సేపు సంపూర్ణమైన శక్తి లో శరీరానికి శ్రమ ఇచ్చే పనులు ఈజీగా చేయవచ్చునని పరిశోధనలు ఏనాడో రుజువు చేసాయి. క్రీడా కారులు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అరటిపండ్లు మంచి ఆహారం. శక్తి తో పాటు జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది . ప్రీ మేనుస్ట్రువల్ సిండ్రోమ్ తో బాధ పడుతుంటే అరటిపండు చక్కని ఆహారం. ఆందోళన ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా వుంది. ఎనిమీయా అరికడుతుంది. బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంచుటుంది. ఇందులోని పొటాషియం మెదడును అప్రమత్తంగా ఉంచుతుంది. కొన్ని వందల మంది విద్యార్థులకు అరటిపండు బ్రేక్ ఫాస్ట్ లో కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ అరటిపండు తినే అలవాటు చేసుకోమంటున్నారు పరిశోధకులు. చక్కెర సుక్రోజ్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ పీచు వంటివి ఇందులో సహజ రూపంలో ఉన్నాయి . రెండు అరటిపండ్లు తింటే 90 నిముషాల సేపు సంపూర్ణమైన శక్తి లో శరీరానికి శ్రమ ఇచ్చే పనులు ఈజీగా చేయవచ్చునని పరిశోధనలు ఏనాడో రుజువు చేసాయి. క్రీడా కారులు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అరటిపండ్లు మంచి ఆహారం. శక్తి తో పాటు జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది . ప్రీ మేనుస్ట్రువల్ సిండ్రోమ్ తో బాధ పడుతుంటే అరటిపండు చక్కని ఆహారం. ఆందోళన ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. ఇందులో ఐరన్ సమృద్ధిగా వుంది. ఎనిమీయా అరికడుతుంది. బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంచుటుంది. ఇందులోని పొటాషియం మెదడును అప్రమత్తంగా ఉంచుతుంది. కొన్ని వందల మంది విద్యార్థులకు అరటిపండు బ్రేక్ ఫాస్ట్ లో కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ అరటిపండు తినే అలవాటు చేసుకోమంటున్నారు పరిశోధకులు. చక్కెర సుక్రోజ్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ పీచు వంటివి ఇందులో సహజ రూపంలో ఉన్నాయి .

    మెదడు చురుకు అధిక శక్తి

    రెండు అరటిపండ్లు తింటే 90 నిముషాల సేపు సంపూర్ణమైన శక్తి లో శరీరానికి శ్రమ ఇచ్చే పనులు ఈజీగా చేయవచ్చునని పరిశోధనలు ఏనాడో రుజువు చేసాయి. క్రీడా…

  • జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ హెర్బల్ టీ వైట్ టీ ట్రై చేయమంటున్నారు. వైద్యులు. ఇవే సత్వర ఉపసమానాలు. ఈ టీ ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షల దూరం చేస్తాయి . అల్లం దంచి మిరియాలు దాల్చిన చెక్క పొడి చేసి టీ పొడితో పాటు కలిపి మరిగించి ఇందులో తేనె వేసి ఈ హెర్బల్ టీ తాగి చూడండి. ప్రాబ్లమ్ పరార్. వీలైతే తులసి ఆకులు మింట్ టీ కూడా ట్రై చేయచ్చు . ఇష్టమైతే చికెన్ సూప్ కూడా ట్రై చేయచ్చు. చికెన్ లో ఉండే సోడియం మంట ని తగ్గిస్తుంది. గొంతుకు స్వాంతన ఉంటుంది. సూప్ రూపంలో మితంగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఎక్కువగా ద్రవ పదార్ధాలు అదీ వేడిగానే తీసుకుంటే గొంతునొప్పి అంతగా విసిగించదు. గొంతు సంగతి అలా వుంచినా రోజుల్లో ఒకేసారి ఈ హెర్బల్ టీ తాగి ఎంతో ప్రయోజనం.

    ఇన్ని హెర్బ్స్ తో ఈ టీ సో టేస్టీ

    జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట  ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ,  హెర్బల్ టీ,  వైట్ టీ…

  • ఎదో ఒక స్వీట్ ఉంటేనే గానీ భోజనం సంపూర్ణం కాదంటారు. అంచేత చాక్లేట్ భోజనంలో తుది పదార్థంగా కేక్ ట్రిఫిల్ ఎక్లైర్స్ చీజ్ కేక్ టోఫీ ప్లాన్ పై మఫిన్లు ఐస్ క్రీమ్ లు చిపొడుగైనా లిస్ట్ గా పాప్యులర్ అయిపోయింది . అయినా చాక్లేట్ తింటే మొటిమలు వస్తాయని పళ్ళు పుచ్చిపోతాయని అన్నా సరే దాన్ని ఎదురుగా చూసాక మాత్రం ఇలాంటికంప్లెయింట్స్ గాలికి ఎగిరిపోతాయి. ఎర్రని పచ్చని కోకో పండ్ల గింజలను పులియ బెట్టి వేయించి పొడి కొడితే కోకో పొడి తయారవుతుంది. బీన్స్ నుంచి వెతికి తీసే కొవ్వు కోకో బటర్ . ఇది చాక్లేట్ కు క్లాసీ మృదువైన టెక్చర్ ఇస్తుంది. గ్రీన్ టీ మాదిరిగానే చాక్లేట్ లో సమాన స్థాయిలు ఫెనోలిక్ గుణాలు గాలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రయోజనం పొందాలంటే ఉదయాన్నే ఒక కప్పు హాట్ కోకో ,మధ్యాహ్నం గ్రీన్ టీ తాగాలని నిపుణుల సూచన. డార్క్ చాక్లేట్ల నుంచి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వాటి నుంచి లభించే క్యాలరీల మోతాదును సమంగా డైట్ లోని ఇతర పదార్ధాల క్యాలరీలను కట్ చేసుకోవాలి. పూర్తి ఆహారంలో చాక్లేట్ ను ఉంచేసుకుని మిగిలిన పదార్ధాల్లో క్యాలరీలు లేకుండా చూసుకోవాలి.

    కప్పు హాట్ కొకో తాగితే మంచిది

    ఎదో ఒక స్వీట్ ఉంటేనే గానీ భోజనం సంపూర్ణం కాదంటారు. అంచేత చాక్లేట్ భోజనంలో తుది పదార్థంగా కేక్ ట్రిఫిల్ ఎక్లైర్స్ చీజ్ కేక్ టోఫీ ప్లాన్…

  • పసుపు గడపకు రాస్తే శుభ సూచకం . పాదాలకు రాసుకంటే అందం అదే పసుపు పదార్ధాలకు చేర్చి వాడుకుంటే భారతీయుల వంటకాల్లో ఇతర వాడకల్లో పసుపు అంతర్గతంగా వుంది. ఆసియా లో విరివిగా వాడే పసుపు లోని కర్కుమిన్ కు ఇన్ఫలమేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచే శక్తి ఉన్నట్లు గుర్తించారు. పచ్చని రంగుకు ఈ పదార్థమే కారణం అవుతుంది. డయాబెటిస్ ను నియంత్రించే శక్తి గలది పసుపు. కర్కలిన్ లో యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉన్నట్లు లేబొరేటరీ పరీక్షలు పేర్కొన్నాయి. పసుపు లోని కర్కుమిన్ బయటకు తెచ్చి తయారు చేసిన కాప్సూల్స్ ను బ్రేక్ ఫాస్ట్ తర్వాత డిన్నర్ తర్వాత వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. పసుపు సురక్షిత పదార్థంగా పెద్దలు భావిస్తున్నప్పటికీ ఈ కాప్స్యూల్స్ వల్ల అజీర్ణం వికారం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు . పసుపు వల్ల మాత్రం రుతు స్రావ క్రమ బద్ధీకరణ జీర్ణ సహాయకారిగా లివర్ పనితీరు మెరుగుపరిచే ఔషధంగా ఎగ్జిమా కి చికిత్సగా ఎన్నో లాభాలున్నాయి. రోజువారీ గా ఆహార పదార్ధాల్లో పసుపు విరివిగా వాడితే టాక్సిన్లు శరీరం నుంచి వెళ్లి పోతాయి. నోటి ఆరోగ్యం బావుంటుంది.

    శుభ సూచకం అద్భుత ఔషధం

    పసుపు గడపకు రాస్తే శుభ సూచకం . పాదాలకు రాసుకంటే  అందం అదే పసుపు పదార్ధాలకు చేర్చి వాడుకుంటే భారతీయుల వంటకాల్లో ఇతర వాడకల్లో పసుపు అంతర్గతంగా…

  • ఈ మధ్య కాలంలో సోయా వినియోగం పెరిగింది. సొయా పాలు చీజ్ ఎన్నో ఉత్పత్తులు మార్కెట్ లోకి వస్తున్నాయి . న్యూట్రీషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని మహిళలకు ఎంతో ప్రయోజనాకరమని అందరు చెపుతున్నారు. దీన్నో అద్భుతమైన ఆహారం అంటున్నారు. సోయాను సహజ రూపాల్లో అంటే సోయాపిండి పాలు టోఫు ఇలా ఏ రూపంలో అయినా హాయిగా తినచ్చు. ఎలాంటి దుష్ప్రభావాల భయము లేదు. ప్రోటీన్ కు ఇది మంచి ఆధారం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇది గుండెకు మంచిదని ఎముకల్లో సాంద్రత పెంచుతుందని అలాగే ఆస్ట్రియో పోరోసిస్ రాకుండా ఏది రక్షిస్తుందని మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని గుర్తించారు. ఇది మహిళలకు నిస్సందేహంగా మంచి ఆహారం. బ్రేడ్స్ కుకీస్ వంటి బెకెడ్ ఫుడ్స్ సోయాలోని ఏ ఆహార విలువను పోకుండా తయారవుతున్నాయి. ఉదయపు ఆహారంగా సొయా తీసుకుంటే ప్రోటీన్స్ కావలిసినన్ని దక్కినట్టే . సోయాలో ఎన్నో రకాలు టెక్నీక్స్ ఎలా చేసుకోవాచ్చొ అంతర్జాలం లో వెతకచ్చు.

    సోయాచాలా మంచిది

    ఈ మధ్య కాలంలో సోయా వినియోగం పెరిగింది. సొయా పాలు చీజ్ ఎన్నో ఉత్పత్తులు మార్కెట్ లోకి వస్తున్నాయి . న్యూట్రీషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని మహిళలకు…

  • మంచి గుమ్మడి కాయ తో చేసే తియ్యని హాల్వా చాలా బావుంటుంది. అలాగే ఈ గుమ్మడి ముక్కాలా దప్పళం కూడా భోజనాల స్పెషల్. ఏడాది పొడవుగా దొరికే మంచి గుమ్మడి కాయను వింటర్ స్క్వాష్ అని పిలుస్తారు. కాయ పూర్తిగా ఆకు పచ్చ రంగు వదిలి బాగా ఎండి ఎర్రగా అయ్యాకే కోసి వాడతారు . కొంచెం తియ్యని రుచి తో వుండే ఈ గుమ్మడి లో ఎన్నో వెరైటీలు. రోగనిరోధిక వ్యవస్థను బలోపేతం చేసే అద్భుతమైన ఆధారం. ఈ తియ్య గుమ్మడి ప్రీ రాడికల్స్ ను అడ్డు కోగల విటమిన్ సి ఇందులో పుష్కలం క్యాలరీలు చాలా తక్కువ. డైటరీ పీచు చాలా ఎక్కువ. గుమ్మడి గింజల్లో 75 శాతం లినో లిక్. ఓలిక్ యాసిడ్స్ ఉండటం వల్ల తిరుగులేని చిరు తిండిగా పరిగణించబడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ ఇస్తుంది. కాన్సర్ డయాబెటిక్ గుండె జబ్బులపై పోరాడే శక్తి నిస్తుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉంటాయి. బీటా కెరోటిన్ ఉండటం వల్ల ఆస్తమా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ల నుంచి పరిరక్షించడంలో ముందుంటుంది. తియ్య గున్నదిలో చేసే కూడా చాలా బావుంటుంది.

    తిరుగు లేని చిరు తిండి గుమ్మడి

    మంచి గుమ్మడి కాయ తో చేసే తియ్యని హాల్వా చాలా బావుంటుంది. అలాగే ఈ గుమ్మడి ముక్కాలా దప్పళం కూడా భోజనాల స్పెషల్. ఏడాది పొడవుగా దొరికే…

  • కాస్త ఆసరా దొరికితే అల్లుకుపోయే పొట్ట తీగలకు కాసే పొడుగాటి పొట్లకాయల్లో పోషకాలనేకం ఉంటాయి. నీటి శాతం ఎంతో ఎక్కవవుండే ఈ కాయలు ఐదు అడుగుల పొడవు దాకా పెరుగుతాయి. క్యాలరీలు లేవు. సమృద్ధిగా ఉంటుంది. ప్రోటీన్లు విటమిన్ A ,B,C మాంగనీస్ కాల్షియం పొటాషియం ఐరన్ అయోడిన్ వంటి ఖనిజాలు పొట్లకాయలు ఉన్నాయి. శారీరక ద్రవాల ఉత్పత్తిని పెంచి శరీరాన్ని తేమగా ఉంచుతోంది . జుట్టు రాలిపోతున్నప్పుడు పొట్లకాయను ఔషధంలా ఆహారంలా చేర్చుకుంటే జుట్టుకుదుళ్లు బలపడి శిరోజాలు బాగా ఎదుగుతాయి. పొట్లకాయ రసం అప్లయ్ చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. పొట్లకాయ యాంటీ బయోటిక్ హెర్బ్. స్థూలకాయాన్ని తగ్గించటంలో శరీరంలో గ్లూకోజ్ స్థాయిల్ని మెయిన్ టెయిన్ చేయటంలో ఉపకరిస్తుంది. జ్వరం వచ్చి కోలుకుంటున్న వారికి పత్యంగా పొట్లకాయ పెడతారు. ఇది బలం వుంచుకునేట్లు ఉపయోగపడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవు. మనిషిని ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంచుతుంది.

    పోషకాల్లోనూ పొడుగ్గానే పొట్లకాయ

    కాస్త ఆసరా దొరికితే అల్లుకుపోయే పొట్ట తీగలకు  కాసే పొడుగాటి పొట్లకాయల్లో పోషకాలనేకం ఉంటాయి. నీటి శాతం ఎంతో ఎక్కవవుండే ఈ కాయలు ఐదు అడుగుల పొడవు…

  • ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన మెక్సికన్ మెడిటేరియన్ థాయ్ వంటకాల్లో కూడా మన వంటింట్లో వుండే కారం పసుపు ఆవాలతో పాటు ధనియాలు కారం వెల్లుల్లి జీలకర్ర వాడతారు . మెక్సికన్ వంటకాల్లో మనం కరివేపాకు వేసినట్లు బరిగానోని ప్రయోగిస్తారు. ఇవి చూసేందుకు మరువం ఆకుల్లా ఉంటాయి. మెడిటేరియన్ వంటకాల్లో బరిగానో తో పాటు థైమ్ మనం వాడే బిర్యానీ ఆకులు తులసి ఆకులు ఎక్కువగా వాడతారు. వీటితో పాటు యాలకులు దాల్చిన చెక్క అల్లం ధనియాలు ఎక్కువగా వాడతారు. ఫ్రాన్స్ లో అయితే మాత్రం బిర్యానీ లో వాడే చిన్న చిన్న జాజికాయల్ని ఎక్కువగా వాడతారు. వీటితో పాటు థైమ్ రోజ్ మేరీ ఒరేగానో ఆకుల్ని ఎక్కువగా వాడతారు. థాయ్ వంటకాల్లో తులసి పసుపు యలకుల్ని అరేబియన్ వంటకాల్లో ఆల్ స్పైస్ లేదా జమైకా మిరియాలు వాడతారు. అల్లం లవంగాలు దాల్చిన చెక్క వాళ్ళ వంటకాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

    అందరు వాడేవి ఇవే

    ప్రపంచ వ్యాప్తంగా  పేరు పొందిన మెక్సికన్ మెడిటేరియన్ థాయ్ వంటకాల్లో కూడా మన వంటింట్లో వుండే కారం పసుపు ఆవాలతో  పాటు ధనియాలు కారం వెల్లుల్లి జీలకర్ర…

  • ఇప్పుడు నారింజ పండ్లు బాగా దొరికే రోజులు. ఏ కాలానికి వచ్చే పండ్లు ఆ కాలంలో తప్పనిసరిగా తినాలి. సీజనల్ ఫ్రూట్స్ వదులుకుంటే ఇంకోసారి వెంటనే దొరకవు కదా . అలాగే చాలా త్వరలో మామిడిపండ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ తియ్యని నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఐరన్ మేగ్నేషియం సోడియం తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఈ పండ్ల లో నీటి శాతం ఎక్కువ. నోటి దుర్వాసన పోగొట్టే గుణం ఈ పండ్లకి వుంది. ఆకలి తక్కువగా ఉంటే ఆరెంజ్ తింటే ఆకలి బాగా పుడుతుంది. అధికంగా వుండే బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. గుండె వ్యాధులు వచ్చే అవకాశం సమస్యలు పోతాయి. కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం వుంది. ప్రతి రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే కిడ్నీ లో వుండే స్టోన్స్ కరిగిపోయే అవకాశాలున్నాయి. కొవ్వును తగ్గించటం తో పాటు వ్యాధి నిరోధిక శక్తిని పెంచుతాయి నారింజలు

    తియ్యని నారింజ లో ఉపయోగాలనేకం

    ఇప్పుడు నారింజ పండ్లు బాగా దొరికే రోజులు. ఏ కాలానికి వచ్చే పండ్లు ఆ కాలంలో తప్పనిసరిగా తినాలి. సీజనల్ ఫ్రూట్స్ వదులుకుంటే ఇంకోసారి వెంటనే దొరకవు…

  • నట్స్ ని హార్ట్ ఫ్రెండ్లీ అని డాక్టర్లు చెపుతారు . జీడీపప్పు బాదం మాత్రమే కాదు పిస్తాచియో పీనట్స్ వాల్ నట్స్ హాజల్ నట్స్ మొదలైనవన్నీ గుండెకు ఎంతో మేలు చేస్తాయి కనుకనే వీటిని హార్ట్ ఫ్రెండ్లీ అన్నారు. దాదాపు అన్నీ నట్స్ లోనూ గుండెకు మేలు చేసే రకాలున్నాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించటం కడుపు నిండినట్లు ఉంచటం. ఎదో ఒకటి తినాలనే ఆలోచన రానీయకుండా ఉండటం మొదటి మంచిలక్షణం. నట్స్ లో ఉండే మోనో అసాచ్యురేటెడ్ పాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించటంలో సహకరిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్ ఎటాక్స్ కు కారణం అయ్యే ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ ను అరికడతాయి. నట్స్ ఫ్యాటీ యాసిడ్స్ కు వృక్ష సంబంధిత ఆధారం. ఆర్టరీలలో ఫ్లేక్ ఛాతీ నొప్పికి హార్ట్ ఎటాక్ కు లేదా కొరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణం అవుతుంది. నట్స్ లోని ఎల్ ఆర్గానిక్ వాల్స్ పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వాటిని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది. ఆరోగ్య వంతమైన ప్రోటీన్లు ఫ్యాట్స్ విటమిన్లు ఖనిజాలు నట్స్ లు పుష్కలం.

    పేరు విని భయపెడతాం . అంతే !

    https://scamquestra.com/18-informaciya-ob-afere-iz-zagranicy-29.html

  • ఎరెర్రని పండు చేసే అద్భుతం ఉపయోగాలు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎన్నెన్నో ప్రయోజనాలు తెలుసు. ఇప్పుడు ఈ చక్కని ఎర్రని టమాటో లపై ఇంకో కొత్త అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. మెదడు ఆర్టరీ బ్యాక్తీరియా స్ట్రోక్ అవకాశాలు తగ్గించటంలో టమాటో ఎంతగానో సహకరిస్తుందని న్యూరాలజీ విభాగ పరిశోధనల్లో గుర్తించారు. టొమాటోలకు ఎర్ర రంగును ఇచ్చే లికోపేసే అనే కెరోటినాయిడ్ శక్తీవంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది హానికర ప్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఈ లికో పేసే ని క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. రక్తంలో లికో పేసే మోతాదు అత్యధికంగా ఉంటే 55 శాతం స్ట్రోక్ అవకాశాలు తగ్గుతాయని గుర్తించారు. ప్రీ రాడికల్స్ ను ఎదుర్కొంటుంది కాబట్టి ఇన్ఫలమేషన్ కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిపోయి రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. బ్లడ్ క్లాట్స్ తగ్గుతాయి.

    ఎర్రని ఏ పండుచేసే మేలు అంతా ఇంతా కాదు.

    ఎరెర్రని  పండు చేసే అద్భుతం ఉపయోగాలు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎన్నెన్నో ప్రయోజనాలు తెలుసు. ఇప్పుడు ఈ చక్కని ఎర్రని టమాటో లపై ఇంకో కొత్త అధ్యయనం…