• కూరలకు చెక్కని రంగు ఇవ్వగలదీ, యంటి బయోటిక్ గా పని చేసేది, అన్ని అనారోగ్యాలను మాయం చేసేది, ముఖ్యంగా పూజల్లో అగ్ర స్థానం లో వున్నది. ఏమిటీ అంటే పసుపు. మూడు అక్షరాల పసుపులో వుండే కర్కుమిన్ అనే పదార్దంలో ఎన్నో ఔషదాల్లో కీలకం. క్యాలరీలు పుష్కలంగా వుండేది. పీచు కలిగి వుండేది, పసుపులో వుండే గుణాల తో పుస్తకం రాయొచ్చు. అన్నింటికంటే ముఖ్యం ఇది సౌందర్య రక్షణ లో పసుపు పాత్ర అంతా ఇంతా కాదు. ఇనుము, పోటాషియం, మాంగనీస్, విటమిన్స్ ఇందులో వున్నాయి. విటమిన్-ఇ కంటే 8 రెట్లు శక్తివంతమైనది. శరీరంలో వుండే అధిక కొవ్వును కరిగించే బైల్ రసం ఉత్పత్తిని మెరుగు పరిచే గుణం పసుపుకుంది. ఇది బరువుని నియంత్రించడం తో పాటు ఓబిసిటీ సంబందిత వ్యాధులను నియంత్రణలో ఉంచుతుంది. ప్రతి రోజు పసుపు టీ తాగడం వల్ల జీవిత కాలం పెరుగుటుంది. ప్రతి రోజు పసుపు టీ తాగడం వల్ల జీవిత కాలం పెరుగుతుంది.నాలుగు కప్పుల నీళ్ళల్లో టీ స్పూన్ పసుపు వేసి మరగనిచ్చితేనె తో కలిపి తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ స్థాయిల్ని క్రమబద్దికరించి మధుమేహ వ్యాధి నివారణలో మందుల ప్రభావం అధికం చేస్తుంది. శరీరంలో వ్యాధి కారకాలను నాశనం చేస్తుంది. బెణుకు, వాపు సమస్యలు చిటికెడు పసుపు, సున్నం, ఉప్పు ల మిశ్రమం చిటికెలో మాయం చేస్తుంది.

    మేలైన సుగుణాలున్న పసుపు

    కూరలకు చెక్కని రంగు ఇవ్వగలదీ, యంటి బయోటిక్ గా పని చేసేది, అన్ని అనారోగ్యాలను మాయం చేసేది, ముఖ్యంగా పూజల్లో అగ్ర స్థానం లో వున్నది. ఏమిటీ…

  • రకరకాల టీలు తాగి వుంటాం. కానీ చక్కని మల్లె పూల చాయ్ కూడా వుందంటే, పైగా ఆ సువాసన టీ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఓ కప్పు తాగితే పోదా అనిపిస్తుంది. రోజు ఉదయాన్నే ఒక కప్పు మల్లె టీ తాగితే అధిక రక్త పోటు అదుపులో వుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో చెడు కోలెస్ట్రోల్ తగ్గిపోతుంది. మల్లెపువ్వుల టీ సుగుణాల గురించి ఇప్పటికే పలు అధ్యాయనాలు ఎన్నో విషయాలు నిరోపించాయి. అన్నింటికంటే వార్ధక్వచ్చయిలు తగ్గిపోతాయి. చర్మం మెరిసిపోతుంది. జలుబు జ్వరం ఇలాంటివి వస్తే అప్పుడు ఓ కప్పు మల్లెటీ తాగితే ఇందులోని యూంబీ వైరల్, యాంటీ బాక్టిరియల్ గుణాలుఅనారోగ్యాలని అదుపులో ఉంచుతుంది. నిద్ర లేమి సమస్యను ఇది మంచి ఔషదం లాంటిదే. ఒక కప్పు టీ తోకలత లేని నిద్ర పడుతుంది. అలాగే తిన్న ఆహారం కుడా నలుపుగా జీర్ణమైపోతుంది. ఈ మల్లెపూల టీ తో పాటు ఎన్నో రకాల పూల తేనీటికీ ప్రాధాన్యత పెరిగి పోతుంది. బంతి పూల టీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందిట.

    మల్లెల టీ తో మంచి ఆరోగ్యం

    రకరకాల టీలు తాగి వుంటాం. కానీ చక్కని మల్లె పూల చాయ్ కూడా వుందంటే, పైగా ఆ సువాసన టీ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంటే…

  • దానిమ్మ గింజలు బావుంటాయి. కానీ దానిమ్మ గింజల రసంలో ఇంకెన్నో పోషకాలు ఉంటాయంటారు న్యుట్రీషనిస్టులు. ప్రతి వంద గ్రాముల దానిమ్మ గింజల్లో 78 శాతం నీరు 1.7 శాతం మంశాకృతులు, 0.1 శాతం కొవ్వు, 14.5 శాతం పిండి పదార్ధాలు, 0.01 శాతం కాల్షియం. 0.07 శాతం ఫాస్పరస్, ఇనుము, విటమిన్ బి-2, విటమిన్-c వుంటాయి. దానిమ్మలో సుక్రోజు మాత్రం వుంటుంది. దానిమ్మ మూడు రకాలు. తియ్యనివి, పులుపు తీపి తో కలిసి, తిపితో కూడిన వగరు. తీపి దానిమ్మ ఎంతో అదుపులో ఉంచేందుకు దానిమ్మ శరీరానికిఎంతో ఉపయోగ పడుతుంది. రక్త స్రావాన్ని అరికడుతుంది. శరీరానికి శక్తి ఇచ్చి ఆకలిని పోగొడుతుంది. కడుపులో మంట తగ్గించడంలో, దాహం తీర్చడంలో, జ్వరం తగ్గించడం లో, గుండె, నోరు, గొంతు ఇబ్బందులు దూరం చేయడం లో ఉపయోగ పడుతుంది. వేసవి లో వీరివిరిగా దొరికే దానిమ్మ వంటి పండ్లు, కూరగాయలు ఔషదాల్లాంటివి. ముందు లాగా కనిఇంచవు. డాక్టర్ల ప్రిస్ క్రిప్షన్ లో కనిపించవి గానీ చాలా మేలు చేస్తాయి.

    మేలు చేసే అద్భుత పానీయం దానిమ్మ

    దానిమ్మ గింజలు బావుంటాయి. కానీ దానిమ్మ గింజల రసంలో ఇంకెన్నో పోషకాలు ఉంటాయంటారు న్యుట్రీషనిస్టులు. ప్రతి వంద గ్రాముల దానిమ్మ గింజల్లో 78 శాతం నీరు 1.7…

  • రోజుకో గుప్పెడు నట్స్ తినండిఅని చెపుతూనే వుంటారు డాక్టర్లు. జీడిపప్పు, కిస్ మిస్, బాదాం మనం తీసుకునే గుప్పెట్లో చేరుస్తాం కానీ మరచి పోయే ముఖ్యమైన పోషకాలతో కూడిన వాల్ నట్స్ వైపుకి కళ్ళు పోనియము. చదువుకునే వయస్సు పిల్లలకు ఇవెంతోమంచివి. చూసేందుకే ఇవి మెదడు పనితీరు చురుకుగా ఉంచుతాయి. వీటిలోని ఎసెన్షియల్ ఫ్యాటి ఆమ్లాల వల్లనే పిల్లల్లో ఏకాగ్రత మెరుగు పడుతుంది. మతి మరుపు సమస్య కూడా దగ్గరికి రాదు. మంశాకృతులు, పిండి పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు, అధిక మోతాదులో లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల ఆ పోషకాలన్ని శరీరంలో జీవక్రియ పని తీరుని మెరుగు పరుస్తాయి. శరీరం లోనికి చెడు కోలెస్ట్రోల్ శాతం కూడా తగ్గుతుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు. మోనో సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మేలు చేసే కొలెస్ట్రోల్ అందిస్తాయి. హృదయానికి రక్త సరఫరా సక్రమంగా జరిగే లా చూస్తాయి. వాల్ నట్స్ లోని పోషకాలు ఎముకలు ద్రుధంగా ఉండేందుకు తోడ్పడతాయి. జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇవి రోజుకు ఐదు తీసుకున్నా చాలు. వీటిలోని పాలీ సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల ఆకలి వేయదు.

    మెదడును చురుగ్గా ఉంచే వాల్ నట్స్

    రోజుకో గుప్పెడు నట్స్ తినండిఅని చెపుతూనే వుంటారు డాక్టర్లు. జీడిపప్పు, కిస్ మిస్, బాదాం మనం తీసుకునే గుప్పెట్లో చేరుస్తాం కానీ మరచి పోయే ముఖ్యమైన పోషకాలతో…

  • ఎప్పుడు తియ్యని బొప్పాయి పండు గురించే ఆలోచిస్తాము కానీ పచ్చని బొప్పాయి ఆకుల గురించి మనస్సు పెట్టమని బొప్పాయి ఆకుల జ్యూస్ తో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. అందకే డెంగ్యు జ్వరం వచ్చిన వారిని ఈ జ్యుస్ తాగమంటారు. బొప్పాయి ఆకుల్లో యాంటి మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజెనిస్ విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. కాలేయం శుబ్రం చేయడం లో బొప్పాయి ఆకులూ క్లీనింగ్ ఏజెంట్ల లాగా పనిచేస్తాయి. ఈ జ్యూస్ వల్ల జీర్ణ క్రియ బాగా జరగడమే కాక, లివర్ సిరోసిన్, కాలేయ జబ్బుల్ని నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పేగులల లోని, పొట్ట లోని మంటను తగ్గిస్తాయి. ఈ జ్యూస్ సెప్టిక్ అలర్జీలను తగ్గిస్తుంది. బొప్పాయి ఆకుల్లో విటమిన్-సి,ఎ లు పుష్కలంగా వున్నాయి. ఈ జ్యూస్ తో చర్మం ఆరోగ్యంగా వుంటుంది. అలాగే బొప్పాయి ఆకుల గుజ్జు తలకు ప్యాక్ లా వేసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. నేచురల్ కండిషనర్ లాగా పని చేస్తుంది. శిరోజాలు కాంతిగా మెరుస్తూ వుంటాయి.

    బొప్పాయి ఆకులూ ఉపయోగమే

    ఎప్పుడు తియ్యని బొప్పాయి పండు గురించే ఆలోచిస్తాము కానీ పచ్చని బొప్పాయి ఆకుల గురించి మనస్సు పెట్టమని బొప్పాయి ఆకుల జ్యూస్ తో ప్లేట్ లెట్స్ సంఖ్య…

  • మామిడి కాయలోస్తున్నాయ్. ఎన్నో వెరైటీస్ వండుకుంటాం. పచ్చడి, పప్పు, పులిహోర, ఇలా ఎన్నెన్నో స్పెషల్స్. ఇంత తరచుగా వండే మామిడికాయలో ఎన్నెన్నో పోశాకలుంటాయి. మామిడి కాయ ముక్కాలా పై కాస్త ఉప్పు చల్లుకుని తింటే శరీరంలో నీటి శాతం పోగొట్టుకోకుండా వుంటుంది. డిహైడ్రేషన్ ప్రాబ్లం వుండదు. వేటిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని కణాలు పునరుద్దరించడంలో ఇందులోని పోషకాలు ఉపయోగ పడతాయి. రక్త హీనత అదుపులో వుంటుంది. వడదెబ్బ తగిలితే పచ్చి మామిడిరసాన్ని మరిగించితీసుకుంటే ఫలితం వుంటుంది. నీరసం అలసట ను తగ్గించుకోవడంలో మామిడినిమించిన పండు ఇంకోటి లేదు. గర్బిణి స్త్రి లు మామిడి కాయ వాసన చూసినా, తిన్నా, ఉదయం వేళ భాదించే వికారం తగ్గుతుంది. వంతులు తగ్గుతాయి. పచ్చి మామిడిలో విటమిన్-సి యంటి ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. ఇవి పండ్ల కన్నా పచ్చి దాని లో ఎక్కువ మామిడి ముక్కలకు అజీర్తి, మలబద్దకం పోగొట్టే శక్తి వుంది. ఈ సీజనల్ ఫ్రూట్ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.

    దీనితో ఎన్ని లాభాలో తెలుసా

    మామిడి కాయలోస్తున్నాయ్. ఎన్నో వెరైటీస్ వండుకుంటాం. పచ్చడి, పప్పు, పులిహోర, ఇలా ఎన్నెన్నో స్పెషల్స్. ఇంత తరచుగా వండే మామిడికాయలో ఎన్నెన్నో పోశాకలుంటాయి. మామిడి కాయ ముక్కాలా…

  • వేసవి లో వచ్చిందంటే ఎంత ఎసీల్లో ఉన్న ప్రభావం ఇటు శరీరం పైన అటు ముఖ చర్మం పైన పడక తప్పదు. చర్మం తాజాగా ఉంటుందంటే ఎక్కువ మంచి నీళ్ళు తగాల్సిందే. అలాగే శారీరక వ్యవస్థ డీ హైడ్రేడ్ అవ్వడం వల్ల అనేక రుగ్మతులు చుట్టు ముట్టే పరిస్థితి వుంటుంది. శారీరక ఉష్ణోగ్రత మెయిన్ టెయిన్ చేయాలంటే మంచి నీళ్ళు తాగడమే ఉత్తమం. ఇది సహజమైన డిటాక్సి ఫయర్. ఉదయం వేళల్లో నీరు తాగడం వల్లరోజంతా అలసట, బద్ధకం డిహైడ్రేషన్ వుండదు. స్వేదం వల్ల శరీర ఖనిజాలనీ కోల్పోతుంది. దీని వల్ల నీరసం అనిపిస్తుంది. ద్రవ పదార్ధాలు ఫిట్ గా వుండేందుకు సహకరించడం కాకుండా శరీరానికి పోషకాలు ఫిట్ గా వుండేందుకు సహకరించడం కాకుండా శరీరానికి పోషకాలు అందిస్తాయి. శారీరక వ్యవస్థలో అరవై శాతం నీరే వుండటం వల్ల జీర్ణ వ్యవస్థ, ముత్ర పిండాల పని తీరుకు మంచి నీటి అవసరం వుంటుంది. శరీరం నుంచి విషతుల్యతలు బయటకు పోయేందుకు నీరె కావాలి. అనారోగ్య కరమైన చిరుతిండ్లు తిన్నప్పుడు ఎక్కువ నీరు తాగితే రాష్ట్ర భావాల గురించి భయం అక్కర్లేదు. అనేక వేసవి పండ్ల వల్ల కూడా నీటిని భర్తీ చేయొచ్చు. పుచ్చ, కమలా, నారింజ ఈ సీజన్ కు మంచి ప్రత్యామ్నాయాలు.

    వేసవి పానీయం నీరే

    వేసవి లో వచ్చిందంటే ఎంత ఎసీల్లో ఉన్న ప్రభావం ఇటు శరీరం పైన అటు ముఖ చర్మం పైన పడక తప్పదు. చర్మం తాజాగా ఉంటుందంటే ఎక్కువ…

  • నిమిషానికొ మూడ్ లో వుంటావు. నీ చిరాకు పరాకులకు అంతులేకుండా ఉంటోంది. కాసేపు శాంతంగా వుంటావు. మమల్ని వుండనీయవు ఇవిగో ఈ కంప్లయిట్స్ అన్ని ఒక పేజ్ లో వుండే ఆడవాళ్ళ పైన ఇంట్లో వాళ్ళు ఇచ్చేవి. ఆడవాళ్ళలో ఉండేవి ఈ ఇన్ బాలన్స్ అంతా హార్మోన్స్ అసమతుల్యత వల్లె. ఇందుకు ఒక్క పద్దతిగా ఆహారం తీసుకుంటే కొంత వరకు సమస్య తగ్గుతుంది అంటున్నాయి అద్యాయినాలు. ఎర్రని కండి పప్పు, సోయాబీన్స్, భటానీలు, ఎస్ట్రోజిన్ వుంటుంది. అలాగే ముదురు రంగు చాక్లేట్లు, వేరు సెనగలు, మాంసం, పీతలు వంటి వాటిలో జంక్ సమృద్దిగా వుంటుంది. ఆలివ్ నూనె, ఒమేగా-3 ఫ్యాటి ఆసిడ్స్ అందె చేపలు, పాల ఉత్పత్తులు, ఆకు పచ్చని కూరగాయలు, పాలకూర, మెంతి , క్యాబెజీ వంటివి ఆహారంలో ఎదో రూపంలో ఎదో రూపంలో తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యతకు అడ్డు కట్ట వేయిచ్చు. తృణ ధన్యాలన్ని కలిసిన పిండి తో సాయంత్రపు ఆహారాన్ని సిద్దం చేసుకో వచ్చు. ఇది తేలికగా అరుగుతుందివీటి తో పాటు ఉదయపు వేళ నడక కూడా చాలా ఉపయోగ పడుతుంది.మందుల తో కాకుండా ఆహారం తో నెమ్మదిగా స్వాంతనతో వుండండి అని చెపుతున్నాయి అధ్యాయినాలు.

    ఆకు పచ్చని కాయగూరలతో ఒకింత స్వాంతన

    నిమిషానికొ మూడ్ లో వుంటావు. నీ చిరాకు పరాకులకు అంతులేకుండా ఉంటోంది. కాసేపు శాంతంగా వుంటావు. మమల్ని వుండనీయవు ఇవిగో ఈ కంప్లయిట్స్ అన్ని ఒక పేజ్…

  • వేప పువ్వు వాసన చాలా బావుంటుంది. మంచి వాసన వేసే వేప పువ్వులో ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో సుగుణాలున్నాయి. అందుకే ఈ కాలంలో వచ్చీ వేప పువ్వు సేకరించి ఎండబెట్టి పొడి చేసి ఏడాది పొడువునా వాడుకుంటారు. ఈ పువ్వును పారిశ్రామికంగా అనెక ఔషధాలు గాయాల నివారణకు వాడే ఆయిట్ మెంట్స్ లో సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు. కొన్ని రకాల ఆహార పదార్ధాలు వ్యాదుల నివారణ్ కోసం వాడుకో వచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. జీలకర్ర, వేప పూల పొడి కలిపిన పానీయం తాగితే ఆకలి పెరుగుతుందింట. ఈ పొడి ఆహార పదార్ధాల్లో చల్లుకుని తింటే కంటి చూపు మెరుగు అవ్వుతుంది. ఆకులూ పువ్వులు కలిపి మెత్తగా రుబ్బి, మొహం పైన రస్తే మొటిమలు పోతాయి. ఈ పువ్వుల్లో వుండే సువాసనను పరిమళ చికిత్సలో కూడా ఇతర పువ్వులతో కలిపి వాడతారు. ఎదో ఒక రూపంలో ఈ పువ్వుల్ని తీసుకుంటే జీవక్రియ బాగుంటుంది. రక్త నాళాలు చెక్కగా పనిచేస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రక్తలో చెక్కర శాతం నియంత్రణ లో వుంటుంది. బరువు టో పాటు పొట్ట తగ్గాలనుకొంటె మంచి ఔషదం ఇంకొకటి లేదు.

    పరిమళ చికిత్స లో వేప పువ్వు

    వేప పువ్వు వాసన చాలా బావుంటుంది. మంచి వాసన వేసే వేప పువ్వులో ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో సుగుణాలున్నాయి. అందుకే ఈ కాలంలో వచ్చీ వేప…

  • మనకు తెలిసింది తియ్యని మామిడి తాండ్రి. ఏ పోర పొరగా వుఉడు వస్తూ ఎంతో బాగుంటుంది. ఇక ఆ రోజులు పోయాయినట్లే. అన్ని రకాల పండ్ల తోనూ ఫ్రూట్ లేదర్స్ వచ్చేస్తున్నాయి.చాపలా చుట్టి నట్లు వచ్చే ఈ తాండ్రని పండ్ల చాపలు అని పిలవచ్చు. అంజీర్, ఆపిల్, అరటి, పనస, నిమ్మ, కమలా, దానిమ్మ, పైనాపిల్, సపోటా అన్నీరకాల ఫ్రూట్ లెదర్స్ వచ్చాయి. ఇంకా కొత్త ఫ్లేవర్స్ కోసం పండ్ల గుజ్జు తో , వెనిలా, అల్లం, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలా అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి సలాడ్ డ్రయిర్ల పైన ఆరబెట్టి ఇలాంటి దుమ్ము, ధూళి పదనివ్వకుండా ఇందులో ఉండే ఖనిజాలు విటమిన్లు పోకుండా పండ్లలోని అన్ని సుగుణాలు ఉండేలా ఈ పండ్ల తాండ్రను సృష్టిస్తున్నారు. కొన్ని పండ్ల, ఉదాహరణకు మామిడి, వంటి అన్ని కాలాల లోను పాండవు కనుక ఆయా ఋతువుల్లో కాసే పండ్ల తో ఈ పండ్ల చాపలు తాయారు చేయడం మంచి ఆలోచన కదా. స్వదేశి పండ్లతో పాటు విదేశీ పండ్లు చప్పరించడమే.

    ఇవిగో ఫ్రూట్స్ లెదర్స్ అనగా పండ్ల చాపలు

    మనకు తెలిసింది తియ్యని మామిడి తాండ్రి. ఏ పోర పొరగా వుఉడు వస్తూ ఎంతో బాగుంటుంది. ఇక ఆ రోజులు పోయినట్లే. అన్ని రకాల పండ్ల తోనూ…

  • ఈ రెండు నెలల వేసవి సెలవుల్లోనే పిల్లల ఇంటి పట్టున వుంటారు కనుక వాళ్ళకు మంచి భోజనం, మంచి తినుబండారాలు వాళ్ళు శక్తిని పెంచే ఆహారం ఇవ్వాలనిపిస్తుంది తల్లులకి. పిల్లలకు తక్షణ శక్తి నివ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఓట్స్, పీచు, పిండి పదార్ధాలు ఎక్కువగా వుంది వాళ్ళకి పోషకాలు అందిస్తాయి ఓట్స్. రోజు అల్పాహారంగా పాలతో మజ్జిక తో వాళ్ళకు ఇవ్వొచ్చు. పిల్లలుకదా ఇస్తాపదరేమో అనుకుంటే బాదాం, చాక్లేట్, చెర్రి పండ్లు, డ్రై ఫ్రూట్స్ ,యాలుకల పొడి మొదలైనవి కలిపి రుచిగా ఉండేలా చేసి ఇవ్వొచ్చు. ఆటల్లో చురుకుదనం కోసం వాళ్ళకు శక్తిని ఇవ్వడం కోసం గుడ్లు ఎదో ఒక రూపంలో ఇవ్వాలి. అలాగే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుదల కోసం పొటాషియం అందాలి. అరటి పండ్లు సరైన ఎంపిక. దీన్ని తిననని మారం చేస్తే ఫ్రూట్ సలాడ్ గా, మిల్క్ షేక్ లా వివిధ రూపాల్లో ఇస్తే ఇష్ట పడతారు. మాంసాహారం తినే పిల్లలకు చేపలు తినేలా చూడాలి. అలాగే ముందు ముఖ్యంగా ఆటల్లో అది అలిసే పిల్లలకు, ఈ వేసవిలో మొదటి ఆహారం మంచినీళ్ళు ఎన్ని తాగితే అంత మంచిది. లెమన్ కలిపి ఇస్తే సి-విటమిన్ కూడా అంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ ఆహారాన్ని అయినా కళ్ళకింపుగా, నోటికి రుచిగా వాళ్ళు మెచ్చేదిలా తీర్చి దిద్ది రకారకాల రూపాల్లో ఇవ్వాలి.

    పోషకాలున్న ఫుడ్ ని వాళ్ళకి నచ్చేలా ఇవ్వండి

    ఈ రెండు నెలల వేసవి సెలవుల్లోనే పిల్లల ఇంటి పట్టున వుంటారు కనుక వాళ్ళకు మంచి భోజనం, మంచి తినుబండారాలు వాళ్ళు శక్తిని పెంచే ఆహారం ఇవ్వాలనిపిస్తుంది…

  • ఈ వేసవిలో కొబ్బరి నీళ్ళతో పాటు ఫ్రెష్ చెరుకురసం కోసం కూడా చాలా సంతోష పెడుతుంది. ఇది తియ్యగా తాగేందుకు, వేసవి లోపాన్ని సంతోష పెడుతుంది.ఇది తియ్యగా తాగేందుకు వేసవి లోపాన్ని తగ్గించేందుకే కాదు. ఇంకెన్నో లాభాలున్నాయి అంటారు ఎక్స్ పర్ట్స్ మహిళల్లో వచ్చే మూత్రనాళ ఇన్ఫె క్షన్ ల నుంచి కాపాడుతుంది చెరుకురసం. ఈ రసంలో మేలు చేసే పిండి పదార్ధాలు, మాంసాకృతులు, ఇనుము, పొటాషియం, ఇతర ఖనిజ లవణాలు వుంటాయి. నీరసంగా ఉన్నప్పుడు తాగితే తక్షణ శక్తి వస్తుంది. వడదెబ్బ తగిలిన వాళ్ళు తొందరగా కోలుకోగలుగుతారు. అలసిపోతే కూడా ఈ రసంతో ఎంతో శక్తి వస్తుంది. ఇందులో వుండే ఆల్కలైన్ గుణాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. మసాలా పదార్ధాలు తింటేనో, పొట్టలో అసౌకర్యంగా వున్న ఒక్క గ్లాసు చెరుకురసం తో ఈ ఇబ్బందులు పోతాయి. గుండె సమస్యలున్న ఈ రసం తీసుకోవచ్చు ఇందులోని పోషకాలు కొలెస్ట్రోల్, ట్రైగ్లిజరాయిడ్ల శాతాన్ని తగ్గించి గుండెను అనారోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకొన్న వారికి ఇది మంచిది. చెడు కొలెస్ట్రోల్ ను దూరం చేసి చెక్కర పీచునుని శరీరానికి అందిస్తుంది.

    తక్షణ శక్తి, పుష్కలమైన పోషకాలు

    ఈ వేసవిలో కొబ్బరి నీళ్ళతో పాటు ఫ్రెష్ చెరుకురసం కోసం కూడా చాలా సంతోష పెడుతుంది. ఇది తియ్యగా తాగేందుకు, వేసవి లోపాన్ని సంతోష పెడుతుంది.ఇది తియ్యగా…

  • కొన్ని పరిశోధనలు మనకి చాలా సంతోషం ఇస్తాయి. మనకి ఇష్టమైనవి ఏవైనా మేలు చేస్తాయి తినండి, తాగండి భయం లేదు ఏ రిపోర్ట్స్ అయినా చెప్పితే ఎంత సంతోషం. ఇదిగో ఇలాంటి ఆనందం ప్రసాదించారు. ఇండియా విశ్వవిధ్యాలయ నిపుణులు. కాఫీలో కెఫిన్ తో పాటు వుండే ఇతరాత్రా ములకణాలన్ని కూడా మెదడులో వుండే హానికర ప్రొటీన్లు శాతం తగ్గించడం ద్వారా మతిమరుపు రాకుండా అడ్డుకుంటాయట. ముఖ్యంగా అందులోని 24 రసాయినాలు MMNAT2 అనే ఎంజైమ్ ను విడుదల చేయడం వల్ల మతిమరుపు అల్జిమర్స్ లాంటి నడి సంబందమైన వ్యాదుల్ని దివ్యంగా అడ్డుకొంటాయట. దీని ఆధారంగానే, మెదడు లో ఈ ఎంజైమ్ స్రావాన్ని పెంపొందించే మందుల్ని రుపొందించ వచ్చునని శాస్త్రజ్గూల అభిప్రాయం. అంచేత కాఫి సంతోషంగా నిర్భయంగా తాగొచ్చు. ఉదయం కప్పు కాఫీ కోసం మనస్సు కొట్టుకు పోతుంటే, ఆ కాఫీని మరుపున దూరం చేసే ఔషదం సుమా అని నిపుణులు హెచ్చరిస్తూ ఆహా ఏమి ఆనందం. కాఫీ గత ప్రాణులకూ ఇంకెంతటి శుభవార్త.

    ఒక్కో సారి ఇలాంటి శుభవార్తలుంటాయి

    కొన్ని పరిశోధనలు మనకి చాలా సంతోషం ఇస్తాయి. మనకి ఇష్టమైనవి ఏవైనా మేలు చేస్తాయి తినండి, తాగండి భయం లేదు ఏ రిపోర్ట్స్ అయినా చెప్పితే ఎంత…

  • గోలా కోసం పిల్లలు గోల పెడతారంటే ఆశ్చర్యం ఏముంది పిల్లల ఫేవరెట్ అది. ఆరంజ్, రోజ్, పైనాపిల్, వంటి రకాలు ఇంకెన్నో కోత్త రాకాల కలపోత తో ఊరిస్తోంది. గోలా ఐస్ ను సన్నగా తురిమి చేత్తో ముద్దగా చేసి పుల్ల కు గుచ్చి దాని పైన మనకు కావాల్సిన ఫ్లేవర్ సిరప్ పోసి ఇచ్చే గోలా ఎప్పటిదో. ఇప్పుడు ఆ గోలా ను కప్పులో తినొచ్చు. డ్రై ఫ్రూట్ గోలా, కండెన్సేడ్ మిల్క్ తో పాటు చాకొలెట్ సిరప్ చాకొ చిప్స్ కలిపి తాయారు చేసే చాక్లెట్ ఫలూదా గోలా, పన్నీర్ గోలా, పాన్ గోలా, స్ట్రాబెర్రీ గోలా, ఎగ్జోటిక్ ఫ్రూట్ గోలా,సందడి చేస్తుంటే పిల్లలు ఊరుకుంటారా. ఇవి కాస్త ఓపికగా చేస్తే ఇంట్లోనూ తయారవ్వుతాయి. ఇంట్లో ఐస్ తాయారు చేసి మిక్సిలో వేసి ముక్కలు చేసి అందులో పండ్ల జ్యూసుల్ని రెడీమేడ్ సిరప్ ని పోస్తే గోలా రెడీ. ఇక పిల్లల గోల తగ్గిపోతుంది.

    ఇది ఇంట్లోనూ తాయారు చేయొచ్చు

    గోలా కోసం పిల్లలు గోల పెడతారంటే ఆశ్చర్యం ఏముంది పిల్లల ఫేవరెట్ అది. ఆరంజ్, రోజ్, పైనాపిల్, వంటి రకాలు ఇంకెన్నో కోత్త రాకాల కలపోత తో…

  • పాలకూర, లెట్యూన్, బ్రోకలీ, కాలీప్లవర్, క్యాబేజీ వంటి వాటిలో కె విటమిన్ సమృద్ధిగా వుంటుంది. అలాగే గుడ్లు, కోడి కాలేయం, చేప, ఆకుకూరలు వంటి వాటిల్లో కూడా ఇది దొరుకుతుంది. రక్తం గడ్డకట్టేందుకు అవసరమైన కె విటమిన్ గురించి తప్పకుండా పట్టించుకోవాలి. ఎముకల వ్రుద్దిలొనూ ఇది కీలక పాత్ర పోషిస్తోంది. కె విటమిన్ అనేది కె 1 ఫిల్లో క్వినోన్, కె 2 మోనో క్వినోన్ అనే రెండు పదార్ధాల సమ్మేళనం. కె విటమిన్ లోపిస్తే కొవ్వుల పోషణ లోపాలు, కాలేయ వ్రుద్దాల పేగుల్లో సమస్యలు తలెత్తుతాయి. ఈ కె విటమిన్ ను నిరోధిస్తుంది. కాల్షియంతో పాటు ఇతర ఖనిజాలన్నీ ఒకదానిలో ఒక్కటి అతుక్కుని వుండేందుకు జిగురు మాదిరిగా పనిచేస్తాయి. అల్జీమర్స్ రాకుండా అడ్డుకుంటుంది. ఇన్సులిన్ స్రావాల్ని పెంచుతుంది. కె విటమిన్ వున్న ఆహారం తీసుకునే వాళ్ళలో మధుమేహ లోపం వచ్చే అవకాసం మిగిలిన వల్లత్ పోలిస్తే 20 శాతం తక్కువ.

    కె విటమిన్ తింటున్నారా? లేదా?

    పాలకూర, లెట్యూన్, బ్రోకలీ, కాలీప్లవర్, క్యాబేజీ వంటి వాటిలో కె విటమిన్ సమృద్ధిగా వుంటుంది. అలాగే గుడ్లు, కోడి కాలేయం, చేప, ఆకుకూరలు వంటి వాటిల్లో కూడా…

  • కరివేపాకు పొడి నచ్చుతుందా? పోనీ కూరల్లో, ఉప్మాలో, కనిపించే కరివేపాకును ఇష్టంగా తింటారా, తీసి పక్కన పెడతార? ఈ ప్రశ్నలు పిల్లలకు వేస్తె ఖచ్చితంగా, మాకు నచ్చదు, పారేస్తాం అంటారు. కానీ ఐరన్, ఫోలిక్ ఆసిడ్, సమృద్ధిగా వుండే కరివేపాకు ఆరోగ్యానికి నతో మేలు చేస్తుంది అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పిల్లల ఆహారంలో దీన్ని చేర్చితే జీర్ణ క్రియ సక్రమంగా పిల్లల ఆహారంలో దీన్ని చేర్చితే జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుందిట. ఇందులో వుండే పిచు కారణం గా చెక్కర నిల్వలు తగ్గుతాయి. మంచి కోలెస్ట్రోల్ ను పెంచే చెడు కోలెస్త్రోల్ ను తగ్గిస్తుంది. క్యాన్సెర్ చికిత్సలో కీమో తెరఫి కారణంగా ఎదురయ్యే దుష్ఫలితాలు తగ్గాలంటే కరివేపాకులోని హానికర సూక్ష్మజీవుల్ని నివారించే గుణం వల్ల మొటిమలు ఫంగల్ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇందులో వుండే అనేక పోషకాలు జుట్టుకు మేలు చేస్తాయి.

    అనవసరంగా ఏరి పారేస్తారు

    కరివేపాకు పొడి నచ్చుతుందా? పోనీ కూరల్లో, ఉప్మాలో, కనిపించే కరివేపాకును ఇష్టంగా తింటారా, తీసి పక్కన పెడతార? ఈ ప్రశ్నలు పిల్లలకు వేస్తె ఖచ్చితంగా, మాకు నచ్చదు,…

  • ప్రపంచ వ్యాప్తంగా పండించే ధాన్యాల్లో బార్లీది నాలుగో స్థానం. దంపుడు బియ్యం లాగే పై పొట్టు తీసిన బార్లీ, తెల్లని బియ్యంలా పాలిష్ చేసిన పెరల్ బార్లీ, ఈ రెండింటి మధ్య రకమైన పాట్ బార్లీ, అని మూడు రంగుల్లో లభిస్తాయి. పాట్ బార్లీ వాడకం సూప్ తయ్యారీ లో ఎక్కువ. దంపుడు రకం బార్లీ గంటన్నర ఉడికించాలి. పెరల్ బార్లీ సిం లో గంట ఉడికిస్తే సరిపోతుంది. ఈ ఉడికించిన బార్లీ ఫ్రిజ్ లో పెట్టి అందులో కూర ముక్కలు పండ్ల ముక్కలు సలాడ్ లాగా తినొచ్చు. కిచిడి, పలావ్ చేసుకో వచ్చు. ఇప్పుడు బార్లీ ప్లేక్స్ కుడా వస్తున్నాయి. పండ్లు ఇతర ధాన్యాల కంటే బార్లీ లి పిచు ఎక్కువ. పీచు తో పాటు నియాసిన్ వుండటం వల్ల కోలెస్ట్రోల్ తగ్గుతుంది. గోధుమ గడ్డి లాగా బార్లీ గడ్డి జ్యూస్ తాగుతారు. ఈ లేత గడ్డిలో ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు చాలా ఎక్కువ. ఎదో ఔషదంలాగా జ్వరం వచ్చినప్పుడో, పాదాలకు నీరు చేరినప్పుడో తాగే చల్లని, ఆహారంలో భాగంగా చేసుకుంటే పోషకాలతో పాటు, ఎన్నో అనారోగ్యాలు తగ్గించ వచ్చు.

    బలవర్ధకం బార్లీ

    ప్రపంచ వ్యాప్తంగా పండించే ధాన్యాల్లో బార్లీది నాలుగో స్థానం. దంపుడు బియ్యం లాగే పై పొట్టు తీసిన బార్లీ, తెల్లని బియ్యంలా పాలిష్ చేసిన పెరల్ బార్లీ,…

  • ఎండలు అప్పుడే ప్రతాపం చూపెడుతున్నాయి. మారిన వాతావరణంలో ముందుగా మన జీవన శైలి మార్చుకోకపొతే చాలా కష్టం. వాతావరణం వేడిగా వుంటే నీరు చమట రూపంలో బయటకు పోతుంది. అదే డిహైడ్రేషన్ కు కారణం అందుకే బార్లీ, సబ్జా నీళ్ళు తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, చెక్కర కలపని పండ్ల రసాలు, మజ్జిగా తాగాలి. వీలైనంత వరకు మసాలాలు, బయటి ఆహారం వద్దు. ఉదయము, సాయంత్రము అరగంట పాటు నాననిచ్చి తీరాలి. యోగా కూడా మంచిదే. అప్పుడే జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. అధిక బరువు అదుపులో వుంటుంది. ఇంట్లో వున్న బయటకి వెళ్ళినా తెలుపు తో పాటు రంగు దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. చేనేత రకాలైన నులు, భారీ లెనిన్ వస్త్రాలే చాలా మంచివి. చెప్పులు కూడా పాదాలకు గాలి తగిలే విధంగా వుండాలి. సూర్య కాంతి నేరుగా కళ్ళకు తగలకుండా కళ్ళద్దాలు వేసుకోవాలి.

    బార్లీ, సబ్జా నీళ్ళు మరువకండి

    ఎండలు అప్పుడే ప్రతాపం చూపెడుతున్నాయి. మారిన వాతావరణంలో ముందుగా మన జీవన శైలి మార్చుకోకపొతే చాలా కష్టం. వాతావరణం  వేడిగా వుంటే నీరు చమట రూపంలో బయటకు…

  • అల్లం టీ ఎంతో బాగుంటుంది. తలుచుకుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. ప్రతి వంటకానికి తనదైన ప్రత్యేక రుచిని అందించే ఆహార పదార్దమే గాక, ఒక అద్భుతమైన ఔషదం కూడా. ఎన్నో రుగ్మతులు నయం చేసేందుకు వైద్యులు అల్లాన్ని వాడుతున్నారు. అల్లం వేళ్ళలో బాగా పెద్ద స్థాయి లో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి కాన్సర్ కరకమైన ప్రీరాడికల్స్ తో పోరాడతాయి. కొన్ని రకాల పోషకాల ఉత్పత్తి జరగకుండా గట్టిగా ఆపుతాయి. స్త్రీలు గర్భం ధరించిన సమయంలో వంతులు వికారం రెండింటి తోనూ బాధపడుతుంటారు. కడుపులో వాయుప్రకోపాన్ని ఆపడంలో అల్లం ఉపయోగ పడుతుంది. కనుక వేవిళ్ళు దీని వల్ల ఆగుతాయి. ప్రతి రోజు తాజా అల్లం రసం నాలుగైదు చుక్కలు తాగితే మంచిది. జీర్ణ రసాలని ఊరేట్టు చేస్తుంది. నెల సారి కడుపు నొప్పి తగ్గిస్తుంది. మైగ్రేన్, తలనొప్పికి మంచి ఉపసమనం. కీళ్ళ నొప్పుల నుండి ఉపసమనం . ఈ ఘాటైన మసాలా దినుసు ఎన్నో వ్యర్ధాలను తగ్గించే మంచి మందు. అల్లం రసం, తేనె, నిమ్మరసం మంచి కాంబినేషన్.

    ఈ మసాలా దినుసు మహిమ అద్భుతం

    అల్లం టీ ఎంతో బాగుంటుంది. తలుచుకుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. ప్రతి వంటకానికి తనదైన ప్రత్యేక రుచిని అందించే ఆహార పదార్దమే గాక, ఒక అద్భుతమైన ఔషదం కూడా.…

  • కొబ్బరి నీళ్ళు తాగి బొంద ఇచ్చేసి, అడ్డంగా కొట్టేసి లేత కొబ్బరి ఇస్తారు దుకాణ దారులు. ఆ లేలేత కొబ్బరి ఎంతో ఆరోగ్యం. కప్పు లేత కొబ్బరి లో ఏడు గ్రాముల డైటరీ పిచు వుంటుంది. అలాగే 283 క్యాలరీలు, పిండి పదార్ధాలు, చెక్కర, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీన్ని గర్భినిలు హ్యాప్పీ గా సందేహం లేకుండా తినొచ్చు. నీళ్ళు లాగే ఈ కొబ్బరి డి-హైడ్రేషన్ దూరం చేస్తుంది. పాలు కారే కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్లు కరిగే కొవ్వు ఉంటాయి. ఇవి త్వరగా శరీరంలో కలిసి మంచి పోషకాలు విడుదల చేస్తాయి. అవసరమైన శక్తిని అందజేస్తాయి. పోటాషియం, సోడియం కుడా లేత కొబ్బరి తో లభిస్తాయి. ఇవి శరీరానికి అందటం వల్ల రక్త పోతూ అదుపులో వుంటుంది. రక్తంలో పోటాషియం శాతం కూడా సమంగా వుంటుంది. ఇందులో విటమిన్-బి, ఫోలెట్లు తక్కువ. నీరసంగా వుంటే ఈ లేలేత కొబ్బరి తింటే వెంటనే ఉత్సాహం వస్తుంది. ప్రతి రోజు తిన్నా సమస్య వుండదు. సరిపడా పిచు కుడా లభిస్తుంది.

    లేత కొబ్బరితో పుష్కలంగా ఖనిజాలు

    కొబ్బరి నీళ్ళు తాగి బొంద ఇచ్చేసి, అడ్డంగా కొట్టేసి లేత కొబ్బరి ఇస్తారు దుకాణ దారులు. ఆ లేలేత కొబ్బరి ఎంతో ఆరోగ్యం. కప్పు లేత కొబ్బరి…