Top News
మన ప్రసాదాలు “సాయి ప్రసాదం”
ఓం సాయి..శ్రీ సాయి….జయ జయ సాయి.. గురువారం లేదా లక్ష్మి వారం వచ్చిందంటే సాయి నామముతో తెల్లవారుతుంది కదా!! సాయి బాబా ప్రత్యక్ష దైవం.మనసులో మాట తలచుకుంటే చాలు ఏదో రూపంలో ప్రత్యక్షమవుతాడు.సాయి దివ్య రూపం, దర్శనం ఒక పుణ్యధామం.సాయి బాబాకి హరతులు,భజనలు అంటే ఎంతో ఇష్టం.మనసులో కోరిక తీరాలంటే ఒక భజన వినిపించిన చాలు ఆ ఆనందమయుడికి. గురువారం రోజు తప్పకుండా సాయి బాబా చాలీసా పారాయణం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.సాయికి అలంకారం, పల్లకి […]
అనేక రామాయణాలు
భారతదేశ చరిత్రలో ఎన్నో రామకథలున్నాయి కానీ రచయత్రి పి.సత్యవతి సంకలనంలో వ్యాస రచయతలు వాల్మీకి రామయణం ఒక్కటే కాదని ప్రాంతీయ సాహిత్య సంప్రదాయాలు,మాతాచారాలు,అభిరుచులు,నృత్యప్రక్రియలో ఎన్నో రకాల రామాయణాలు పురుడు పోసుకున్నాయని విశ్లేషించి చెబుతారు.ఇందులో ఏడు వ్యాసాలున్నాయి. రిచ్మన్,ఏకే రామనుజన్,వేల్చేరు నారాయణ రావు,పెరియార్ నారాయణ స్వామి వంటి గొప్ప రచయతలు వీటిని పునర్ రచించారు.వాల్మీకి రాసిన రామాయణంలో తరువాతి తరంలో కొత్త రచయతలు అందులో ఎలాంటి మార్పులు చేశారు.ఆ మార్పులన్ని రామున్ని మానవరూపంలో ఉన్న భగవంతున్ని నిరూపించేందుకే జరిగాయి […]
రెండో అద్యాయానానికి ముందు మాట -విరించి విరివింట
కవి విరించి కవితామైదానంలో కొత్త వెలుతురు లాగా వచ్చాడు అంటారు దర్భశయనం శ్రీనివాసాచార్య.ఆయన మాటలో చెప్పాలంటే ఈ కవి మాట పైన ధ్యాస ఉన్న కవి.ఫ్యాషన్ తో కవిత్వాన్ని హత్తుకుంటూనే విరివింటి విరివిగానే కవితలు రాస్తున్నారని చమత్కరించారు.స్త్రీల దృక్కోణంలో వారి వేదనల రూపంలో విరించి రాసిన కవితల్లో స్త్రీలపట్ల సమాజంలో చూపిస్తున్న వివక్ష ఎంతో తీవ్రంగా వినిపిస్తుంది.కవిత్వం అంటే రూపెత్తిన అక్షరమాల కాదు కవి దృష్టిలో…ఒక మంచి కవితను రాయగలగడం ఒక కలే అయితే తెల్లవారు జామునే […]
మన ప్రసాదాలు
ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః “వందనం వందనం గిరి నందిని ప్రియ నందన వందనం వందనం ముని బృంద హృదయస్యందన వందనం కరివదన కరుణ సదన నీ పదకమలముల కడ వందనం.” విఘ్నాలు కలుగకుండా అవిఘ్నమస్తూ అని అభయమివ్వమని ముందు పూజించేది విఘ్నేశ్వరుడిని.మనం తలచిన పనులు శుభదాయకంగా,మంచి మార్గం లో నడిపే నేత అని పూజించేవాడు వక్రతుండ మహాకాయుడు,గౌరీపుత్రుడు. జనకుడు శివుని వద్ద ఐశ్వర్యములను,జననీ పార్వతి వద్ద సౌభాగ్యములను మనకు ఎల్లప్పుడూ ఉండేటట్లు చేస్తాడు గజముఖుడు,హరసుతుడు. […]
ఎలిజెబెత్ ఏకాదశి
కొన్ని సినిమాలు వెంటాడుతాయ్. ఉత్తమ బాలల చిత్రంగా (2014) అవార్డు పొందిన ఈ మరాఠీ సినిమా, ‘ఎలిజెబెత్ ఏకాదశి’ నిజానికి ఇద్దరి ఒంటరి తల్లుల జీవన పోరాటం. ఒక తల్లి, చనిపోయిన భర్తను తలుచుకొనే వ్యవధి కూడా లేకుండా, ఇద్దరు పిల్లలూ అత్తతో నిత్యం కష్టపడుతూ ఉంటుంది. ఇంకో తల్లి (ఈమె పాత్రను తక్కువగా చూపించారు. కానీ మనసులో మిగిలిపోతుంది) సెక్స్ వర్కర్ గా పని చేస్తూ పిల్లాడిని చదివిస్తూ ఉంటుంది.తల్లి వృత్తి కారకంగా ఆ పిల్లాడు […]
ఆరాధన (యుద్దనపూడి సులోచన రాణి గారు)
సెక్రటరీతో సహా అనేక నవలలు రాసి రచయితలు నడిచే దారిని మరింత సుగమం చేశారు.అభిమన ధనం ఉన్న హీరోయిన్లను అందగాళ్ళయిన రాజశేఖరాలను సృష్టించి అమ్మాయిల కలలకు ఆసరా ఇచ్చారు.రచయిత్రుల యుగాన్ని ముందుండి నడిపించారు.ఆమె రాసిన నవలల్లో ఒకటీ ఆరాధన. రెండో పెళ్ళివాడైన అనంత్ ను చేసుకున్న మూగపిల్ల అన్నపూర్ణ కథ ఇది.మొదటి భార్య కోరుకున్న ఐశ్వర్యాలతో కూడిన జీవితాన్ని ఇవ్వలేకపోయాననే ఆవేదనతో తన చుట్టు రతి గోడను కట్టుకుంటాడు అనంత్.అన్నపూర్ణని భార్యగా గుర్తించేందుకు మనసు అంగీకరించదు.కానీ ఆమె […]
గుర్రం జాషువా
ఎన్నోఏళ్ళు గతించిపోయినవి గానీ యీ శ్మశాన స్థలిన్ గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడోకడైనన్ లేచిరా డక్కాటా కవి జాషువా రాసిన ఖండకావ్యం శ్మశాన వాటికలోనిదీ పద్యం. చావును తప్పించుకొన్న వాడెవడూ లేడని అర్థం. ఆధునిక కవుల్లో ప్రముఖ స్థానం పొందారు జాషువా. కవిత్వాన్ని ఆయుధంగా తీసుకొని మూఢా చారాలపై తిరగబడ్డాడు. ఈ యనను నవయుగ కవి చక్రవర్తి దళిత వర్గ జ్వాల స్ఫూర్తి అంటారు.గబ్బిలం ఈయన రచనల్లో చాలా గొప్పది. ఫిరదౌసి ఇంకొక గొప్ప రచన.1970లో భారత ప్రభుత్వం […]
కథాకళి
సామాజిక జీవితాన్ని కళాత్మకంగా చిత్రించింది తెలుగు కథానిక .వందేళ్ళ పైబడి సుదీర్ఘ ప్రయాణం చేసిన సాహిత్య రూపాల్లో నాలుగు తరాల రచయితలు తమ అనుభావాలు ఆశయాలు పాఠకులకు పంచారు. వాస్తవిక జీవితాన్ని పునాదిగా తీసుకొని క్లుప్తంగా ,ఒక జీవభాషలో కథాసాహిత్యం అత్యంత ప్రభావ వంతంగా పాఠకుల మనసు దోచుకొంది. తెలంగాణ జన జీవితాన్ని వేదికగా తీసుకొని బెల్లంకొండ చంద్ర మేళా శాస్త్రి గారు 1946-61 మధ్యకాలంలో అలనాటి స్వాతంత్ర్యోద్యమాన్ని మధ్య తరగతి జీవితాలను వాళ్ళలోని భేషజాలను ,అహంకారాలను,భిన్న […]
సిగ్నల్
ప్రపంచ భాషలో ప్రసిద్దకథలు అను సృజన: రంగనాధ రామచంద్రరావు ప్రపంచదేశాల్లోని గొప్ప రచయితలు సృష్టించిన అద్భుతమైన సాహిత్యం అనువాదాలు ద్వారానే పుస్తక ప్రియులకు చేరింది.అనువాద సాహిత్యానికి చక్కని స్థానం దక్కింది.ప్రపంచ సాహిత్యాన్ని చదివితినే అక్కడి సంస్క్రతి చరిత్రను సాహిత్య రూపాన్ని వివిధప్రాంత ప్రజల అంతరంగాలను అలవాట్లను అర్ధం చేసుకోగలుగుతాం. సాహిత్యం చేసిన గొప్పపని భూమి పైన ఉండే మనుష్యులు స్వభావల్లో ఆలోచనల్లో ఒక్కలాంటి వాళ్ళేనని రుజువు చేసింది.రంగనాథ్ రామచంద్రరావు తెలియజేసిన సిగ్నల్ కథా సంపుటి నిరూపించిన సత్యం […]
నీలి గోరింట- మందరపు హైమవతి
తెలుగు స్త్రీవాద కవిత్వంలో మందరపు హైమవతి తన ప్రత్యేక స్వరంతో స్త్రీల ఆర్తిని,ఆవేశాన్ని ,ఆగ్రహాన్ని ప్రేమను ప్రేమ రాహిత్యా జీవన వేదననూ ఆర్థిక సంబంధాల ప్రభావంతో చిద్రమవుతున్న స్త్రీ పురుష సంబంధాలను అపురూపంగా చిత్రించింది ఈ నీలి గోరింట కవిత సంకలనంలో 57 కవితలున్నాయి.బాధలు పాతవే కానీ గాయాలు కొత్తవి అంటూ హైమవతి మారుతున్న కాలంలో మారే అణచివేతల రూపాలను ,హింసా రూపాలను ఒకొక్కటిగా పరిచయం చేసింది ఈ నీలి గోరింట సంకలనంలో స్త్రీలు అనుభవిస్తున్న సమస్య […]
గీతోపదేశం కథలు
సీనియర్ రచయిత్రి దూర్వాసుల కామేశ్వరీ గారి కథల సంకలనం ఈ గీతోపదేశం పుస్తకం.ఇందులో 17కథలు ఉన్నాయి. ఇవన్నీ స్త్రీల జీవితాలకు సంబంధించిన కథలు.అధిక శాతం మధ్యతరగతి జీవితాలకు ,దిగువ మధ్యతరగతి బతుకులకు సంబంధించినవి. మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పుల, అమెరికాతో ముడిపడుతున్న సంబంధాలు అమ్మాయిల జీవన విధానంలో ఆలోచనల్లో ప్రవర్తనల్లోని వైవిద్యాలు,వైరుద్యాలు వయోధికులైన తల్లిదండ్రుల పట్ల కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రేమ పేరిట మోసపోయినా స్త్రీల అగచాట్లు, మారని మగబుద్ధితో ఇప్పటికీ స్త్రీలపై సాగుతున్న అత్యాచారాలు […]
ప్రకృతి పిలుస్తుంది
జాక్ లండన్ అనువాదం:కొడవటిగంటి కుటుంబరావు జాక్ లండన్ ,దికాల్ ఆఫ్ ది వైల్డ్ కు తెలుగు అనువాదం ప్రకృతి పిలుపు. ఇది బక్ అన్న ఒక జాతి కుక్కకథ. ఒక భూస్వామి ఇంట్లో ఉన్నా బక్ అన్న కుక్క బంగారం తవ్వకం కోసం మంచు ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళ చేతులో పడి ఎన్నో ఇబ్బందులకు గురవుతుంది. సుఖంగా ఉన్న ఇంటి వాతావరణంలోంచి ఎన్నో చేతులు మారుతూ ఎన్నో అనుభవాలు పొందుతూ బక్ మనుషులకుండే జిత్తులన్ని నేర్చుకొంటుంది. బక్ […]
వివాదంలో ‘అమీ’.
అమీ అనే ఒక మలయాళ సినిమా వస్తోంది. ఇస్లాం మతం తీసుకొన్న కేరళ రచయిత్రి కమల దాస్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు.ఇందులో కమల దాస్ గా మంజు వారియర్ నటించారు.కేరళ లో లవ్ జిహాద్ మొదలైంది కమల దాస్ వల్లే కాబట్టి ఆమె జీవిత చరిత్ర పై వస్తున్న సినిమాను విడుదల కాకుండా బ్యాన్ చేయాలని కేరళ లో సంప్రదాయ వాదులు కోరుతున్నారు.కమల్ దాస్ బయోగ్రఫీ ఇప్పటికే లవ్ క్వీన్ ఆఫ్ మాలబర్ అనే […]
ఉద్యోగినులకు రక్షణ.
ఉద్యోగం చేస్తున్న మహిళల భద్రత కోసం భారత ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ శాఖ షీ బాక్స్ సదుపాయాన్ని విస్తృతం చేతియబోతుంది. గత సంవత్సరం జులై లో ప్రారంభం అయిన షీ బాక్స్ ఫిర్యాదు చేయాలంటే ఈ మెయిల్ ఐడీ లో రిజిస్టర్ చేసి ఆఫీసు లో ఏ సందర్భంలో వేధింపులకు గురవ్వుతున్నారో మెసేజ్ చేయాలి. అందుకున్నట్లు కాంఫర్మేషన్ మెస్సేజ్ వస్తుంది. సంబంధిత అధికారులు బాధితురాలు పనిచేస్తున్న కార్యాలయం లో సంస్ధ యజమానులతో మాట్లాడి తగిన చర్యలు […]
భోపాల్ లో హ్యాపీ నారీ.
నెలసరి ఆడవాళ్ళందరికీ సమస్యే ఇప్పటికి సమస్య ఒక పరిస్కారం దొరికింది. భోపాల్ రైల్వేస్ స్టేషన్లో నాప్కీన్ వెడ్డింగ్ మెషిన్ కి హ్యాపీ నూరి అని పేరు పెట్టారు. ఈ సదుపాయం జనవరి 1 2018 నుంచి అందుబాటు లోకి వచ్చాయి. ఈ మెషిన్ ను స్టెషన్ లో పని చేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగిని అంజలి ధాంకూ ప్రారంభించింది. ఈ మెషిన్ తయారీకి సిబ్బందికి అయిన ఖర్చు కేవలం 20 వెలు మాత్రమే. భోపాల్ రైల్వే డివిజన్ […]
మే మోస్తున్నాం.
నటులు, రచయిత్రులు మహిళా డైరక్టర్లు ఇతర రంగాల్లోని ప్రాముఖ మహిళలందరిలో మొత్తం 300 మంది తో టైమ్ ఈజ్ అప్ అనే కొత్త ఉద్యమం హాలీవుడ్ లో మొదలైంది మీటూ ఉద్యమానికి ఇది కొనసాగింపు. టైమ్స్ అప్ యు.ఎస్ లోని అన్ని రంగాల్లో వున్నా లైంగిక బాధితుల కోసం న్యాయ పోరాటం చేయబోతుంది. ఏ రంగంలో ఉన్నా, వాళ్ళు సామాన్యులైనా, సుప్రసిద్దులైనా, వాళ్ళ కంప్లయింట్ తీసుకుని, దోషులకు వీలైనంత త్వరగా శిక్ష వేయించటం టైమ్స్ అప్ లక్ష్యం. […]
నేను దీపికా వైపే.
మై సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ దీపికా అంటూనే కంగనా షబ్నా ఆజ్మీ తయారు చేసిన పిటీషన్ పైన సంతకం చేయను పొమ్మంది. దీపికా పాడుకొనే పద్మావతి సినిమా గురించి వచ్చిన బెదిరింపులకు నిరసనగా ‘దీపికా బచావ్’ అన్న పిటిషన్ షబ్నా ఆజ్మీ తయ్యారు చేస్తే దాని పైన అనుష్క, విధ్యాబాలన్, కత్రీనా కైఫ్ తో సహా అందరు సంతకాలు చేసారు. కంగనా మటుకు షబ్నా ఆజ్మీ గతంలో ఓ సారి మగాళ్ళంతా విరుచుకు పడితే నాకారక్టర్ కరక్ట్ కాదనేసింది. […]
బీహార్ లో తోలి మహిళా బ్యాండ్.
బీహార్ లోని దీబ్రా గ్రామానికి చెందిన నారీ గుంజన్ సంఘం మహిళా బ్యాండ్ ఇప్పుడొక ప్రత్యేక ఆకర్షణ ఈ బ్యాండ్ లో మొత్తం 10 మంది స్త్రీలున్నారు. వీళ్ళు దళితులూ. కులాధిపత్యం ఎక్కువగా వుండే బీహార్ రాష్ట్రంలో ఎన్నో సామాజిక అవరోధాలు ఎదుర్కొని తమకు వచ్చిన కళను ఆదాయా మార్గంగా మలుచుకున్నారు వీళ్ళు ఈ క్రెడిట్ నతా పద్మశ్రీ గ్రహిత, సామాజిక సేవకురాలు సుధా వర్గీస్ కు చెందుతుంది. మహిళా చైతన్యం కోసం వర్గీస్ బీహార్ లో […]
నానాటికి పెరుగుతున్న హింస.
జాతీయ నెర పరిశోధనా విభాగం 2౦16 గు గానూ వువరాలు విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై పెరుగుతున్న నేరాలు కలవార పరిచే దిశగా వున్నాయి. మహిళలను అగౌరవ పరచడంలో మహిళల అక్రమ రవాణాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో మొత్తం అధికనేరాల్లోకేసులు పెరుగుతూనే వున్నాయి దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2016 కు సంబంధించి వివరాలను కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ గురువారం విడుదల చేసారు. ఈ నివేదిక […]
బలికలను రేప్ చేస్తే ఉరి.
మధ్యప్రదేశ్ కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల పై అత్యాచారాలు లైంగిక వేధింపులు పెరిగి పోతున్న నేపధ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయానికి ఉపక్రమించింది. 12 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు వున్నా బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు మరణ శిక్ష విధించాలన్న తీర్మానానికి ఆ రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. మహిళల పై సాముహిక అత్యాచారం చేసే నిందితులకు కుడా మరణ శిక్ష విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. . ఇందుకు సంబందించి ఈ శీతాకాల సమావేసాల్లో […]
