Top News
గుండె నొప్పి జ్ఞానోత్సవాలు-3
గుండె నొప్పి వచ్చినపుడు హాస్పిటల్ కి వెళ్ళే కంటే ముందు రెండు రకాల మందులు ఉంటాయి. ఒకటి హాస్పిటల్ వెళ్ళేంత వరకూ నొప్పిని తగ్గించే మందులు…రెండు హాస్పిటల్ వెళ్ళేలోపు గుండె రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించే మందులు. మొదటి రకాన్ని “నైట్రేట్స్” అనీ రెండో రకాన్ని “యాంటీ ప్లేట్ లెట్స్” అనీ అంటారు. ఐతే ఈ రెండు రకాల్లో చాలా మందికి మొదటి రకం మందు గురించే తెలుసు. అదే నాలుక కింద పెట్టుకోమని చెప్పే సార్బిట్రేట్ […]
“శ్రీమంతలక్ష్మి ప్రసాదం”
“ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహీమల దేవకీ సుతుడూ…” చెన్నై లో ఉన్న శ్రీమంతలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి.కొత్తగా వివాహం చేసుకున్న వారు,సంతానం లేని వారు ఈ తల్లి దగ్గర ముడుపులు కడితే కొంగు బంగారమే సుమండీ!! ఈ క్షేత్రంలో లక్ష్మి దేవికి రోజు శ్రీమంత వేడుకే.ముతైదువులు చక్కగా అలంకరించుకుని,ఎంతో భక్తితో అమ్మవారి కటాక్షం కొరకు పూజించి తరిస్తారు.శుక్రవారం ఉదయం,సాయంత్రం ఆలయం ఎంతో కళ కళ లాడుతూ ఉంటుంది.ముడుపులు చెల్లించే వారు అమ్మవారి సన్నిధిలోనే […]
గుండెనొప్పి జ్ఞానోత్సవాలు-2
గుండెలో నొప్పి వచ్చినపుడు ఆ వ్యక్తి చేయవలసిన మొదటి పనులు. వెంటనే పక్కనున్న వారికి ఆ విషయాన్ని తెలియజేయటం. వారి సహాయంతో దగ్గరున్న ఆసుపత్రికి వెళ్ళటం. నొప్పి కొద్దిగానే ఉందని ఎవరికీ చెప్పకుండా వాళ్ళంతకు వాళ్ళే డ్రైవ్ చేస్తూ వెళ్ళటం లేదా నడుస్తూ వెళ్ళటం మంచిది కాదు…. “నాకేమీ కాదు” అని కాన్ఫిడెన్స్ తో ఉండటం ఎప్పటికీ మంచిదే…కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. మీకు మీరే ఒంటరిగా హీరోయిక్ నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు పక్కనున్న వారి […]
ప్రొఫెసర్ కర్వాలొ
జ్ఞానపీఠ్ ఆవార్డ్ గ్రహీత కు వెంపు గా ప్రసిద్ధి చెందిన కుప్పలి వెంకటప్ప పుట్టప్ప కుమారుడు పూర్ణ చంద్ర తేజస్వీ రాసిన గొప్ప నవల ప్రొఫెసర్ కర్వాలో నిజానికి ఈ నవల పరిచయం కోసం కు వెంపు ప్రస్తావన అవసరం లేదు. పూర్ణ చంద్ర తేజస్వీ నిస్సదేహంగా గొప్ప రచయిత. అయన తండ్రి గారైన వెంకటప్ప ను అయన గొప్పతనాన్ని ప్రచారం చేసుకోకుండానే పుట్టి పెరిగిన ఊరికి దూరంగా అడవి దగ్గరలో వ్యవసాయం చేసుకొంటూ తనకు ఎదురైన […]
గుండెనొప్పి జ్ఞానోత్సవాలు
ఛాతి నొప్పి అంటే ఛాతి భాగంలో వచ్చే నొప్పి. ఇలా రావటానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. వీటిల్లో గుండెలోని రక్తనాళాలు మూసుకుపోవడం వలన వొచ్చే నొప్పినే గుండె నొప్పి లేదా గుండె పోటు అంటాం. ఒక వ్యక్తి ఛాతిలో నొప్పి అనే కంప్లయింట్ తో వచ్చినపుడు డాక్టర్ చేసే మొదటి పని ఏమంటే…. ఈ నొప్పికి కారణం గుండె రక్తనాళాలు మూసుకుపోవడం వలనేనా కాదా అని తెలుసుకోవటం. ఎందుకంటే ఛాతినొప్పి కి గల కారణాల్లో ప్రాణాంతకమైనది ఇదే. […]
“దిల్‌షుక్‌నగర్ సాయిబాబా ప్రసాదం”
“అనంతకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ,యోగిరాజ,పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కీ జై”. హైదరాబాద్ దిల్షుక్నగర్ సాయిబాబా ప్రత్యక్ష దైవం.బాబా విగ్రహం దర్శించిన సర్వ రోగ,పాప నివారణం.బాబా భక్తులు తమ మనసులో ఉన్న కోరికలు తీర్చే స్వరూపుడుగా ప్రతి గురువారం సాయంత్రం సాయిబాబా భజనలు చేసి స్వామి వారి సన్నిధిలో పల్లకి సేవతో తరిస్తారు. సాయిబాబా వారి సన్నిధిలో అన్నదానం, వస్త్రదానం,పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది.సాయి మందిరం లో పారాయణం చేసి స్వామి ఆశీస్సులు పొందుతారు.బాబావారికి […]
“శ్రీ లక్ష్మి గణపతి ప్రసాదం”
“వక్రతుండ మహా కాయ…కోటి సూర్య సమప్రభ!!నిర్విఘ్నం కురుమే దేవ..సర్వ కార్యేషు సర్వదా”!! తూర్పు గోదావరి జిల్ల సమీపంలోని బిక్కవోలులో మనకు శ్రీ లక్ష్మి గణపతి ఆలయం దర్శన భాగ్యం కలుగుతుంది.ఈ క్షేత్రం చాళుక్య కాలంనాటి చరిత్ర కలది. భూ గర్భంలో ఉండిపోయిన గణపయ్య ఒక భక్తుని కలలో కనిపించి తన గురించి చెప్పాడు.వెంటనే ఆ ప్రదేశాన్ని తవ్విన అక్కడ గణపయ్య కనిపించాడు. విగ్రహం రోజు రోజుకు పెరుగుతున్నట్టు భక్తులు గమనించి స్వామి వారికి అంగరంగ వైభవంగా పూజలు […]
జానపద గేయాలు-పడవ
-డి. సుజాతాదేవి ఏటి వాలువ పడవ వాటుగ పోవాలి పాట పాడవే మల్లి పడవ సాగేను !! నీ పాట యిని గాలి నాతోటి నాగా ఏటి ఒడ్డున పూలు నీటితో రావాలి !! ఎ య్యేల పూలన్ని ఎన్నెల్ల కరగాలి పరిమళించే గాలి పడవ నడిపించాలి !! మెత్తనీ ఎన్నెల్లో మత్తుగా నీ గొంతు కొత్త కొత్తగ !!
మన ప్రసాదాలు-“సౌభాగ్య లక్ష్మి ప్రసాదం”
” శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు తోబుట్టువుల మనసు కష్ట పెట్టొద్దు. తొలి సంధ్య మలి సంధ్య నిదుర పోవద్దు……” శుక్రవారం వచ్చిందంటే సువాసినులకు మరి తీరిక వుండని మాట పరమ సత్యం. తెల్లవారు ఝాము నుండి గడపలు కడిగి,పసుపు రాసి కుంకుమ పెట్టి అందంగా వాకిలి కళ్ళాపి చల్లి రంగవల్లితో అందంగా తీర్చిదిద్దుతారు.అమ్మవారి నామాలు స్మరిస్తూ పూజకి పువ్వులు కోయటం పుణ్యం-పురుషార్ధం.ఆ రోజు ఇంటికి వచ్చిన అతిధికి భోజనం పెట్టిన వారి ఆశీస్సులతో […]
జానపద గేయాలు-రారాజు
– డి.సుజాతా దేవి రాజో అంటాదిరా నన్ను రారాజు మంటాదిరా మల్లి మా రాజు వంటాదిరా!! నేల చేరడైన లేదు కూలికెల్లి బతికెటోణ్ణి నేనేమి రాజునే అంటే నా రాజు నువ్వంటదీ మల్లి నవ్వుల్ల నానౌతది పువ్వుల్ల చెండౌతది!! జోడెద్దులు కొనలేక కాడి మూలవెట్టినోణ్ణి నే నేడ రాజేడ అంటే జోడెద్దు తానంటది మల్లి కాడి మోయ రమ్మంటది ఓడిపోను లెమ్మంటది!! ఆలికి కూడెట్టలేక కూలికి పంపేటోణ్ణి నేనా మారాజు వంటే నా నీడ తానంటది మల్లి […]
మన ప్రసాదాలు-“దత్త ప్రసాదం”
జై గురు దత్త దత్తాత్రేయ స్వామి వారి రుపం పరబ్రహ్మ స్వరూపం.ఆయన వద్ద సేవ చేసే శునకాలే చతుర్వేదాలుగా,గోమాత పవిత్రతను,మెడలో ధరించే రుద్రాక్షలు శాంతికి,త్రిశూలానికి రౌద్రం సంకేతాలు. గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్రం 16సార్లు పఠనం ఎంతో మంచిది.దత్తాత్రేయ స్మరణం పరమ పవిత్రం.భక్తుల మనసులో భావాన్ని,కోరికని ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా తీరుస్తానని అభయం ఇచ్చే దేవుడు.నిర్మలమైన ప్రేమతో అందరి కోరికలను మనస్పర్తిగా మన్నిస్తాడు. ఇష్టమైన రంగు:తెలుపు, కాషాయం ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన […]
జానపద గేయాలు- దిట్టి
– డి.సుజాతా దేవి గాలి దిట్టే కొట్టెనో ఊరి కళ్ళెర్రబడెనో వాలిపోతా వుంది సోలిపోతా ఉంది వొడిలినా పువ్వల్లె వొరిగిపడి వున్నాది!! కలలోకి రమ్మనీ కవ్వించి పోయేది మెలుకు వొచ్చింది నువ్వెవ్వరని అడిగేది!! ఎగిరివచ్చేది నా ఎదట నిలిసేది మాట సెప్పేతలికి మాయమై పోయేది!! మల్లెపూవులు సూసి మొకము సిట్లిత్తాది మామిడాకులు దూసి మనసుగా తింటాది!! మట్టి పై మనసేటో మాటాడ యిసుగేటొ పొద్దుమొక మెరగక పద్దాక నిదరేటో!!
మన ప్రసాదాలు -“రంజాన్ రంగుల సోయగం”
సలాం- వాలే కుం-సలాం భాయ్ ఔర్ బెహనో మరి రంజాన్ ముబారక్ చెప్పేసుకుని వంట షురూ…. ముస్లిం సోదరీ-సోదరులు పెద్ద ఎత్తున జరుపుకునే ఈద్.అందరు కలిసి- మెలిసి విందు-వినోదాల లో ఉత్సాహంగా పంచుకునే రంజాన్ పండుగ. పేద- గొప్ప అని భావించి మనమంతా ఒక్కటే అని గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు. 40 రోజులు ఎంతో నిష్ఠ గా ఉపవాసం ఉండి,క్రమం తప్పకుండా నమాజ్ చేస్తూ,ఎవరిని దూషించటం,దుర్భాషలాడటం లేకుండా సంతోషం గా గడుపుతూ ఇష్టమైన వంటకాలు అందరూ […]
మన ప్రసాదాలు- “దుర్గాదేవి ప్రసాదం”
మంగళవారం హనుమంతుడు తో పాటు దుర్గా దేవిని కూడా పూజించవచ్చు.సకల సౌభాగ్యాలకు మూలం దుర్గా దేవి అనుగ్రహం కలగడం.మంగళవారం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి పూజ మొదలు పెట్టుకోవాలి. ముందుగా కాళ్ళకి పసుపు రాసుకుని,జుట్టు ముడిచి,పూజించాలి.దుర్గ దేవి ని శ్రద్ధగా,నిష్ఠగా,నిశ్చలమైనమనసుతో ఆరాధించాలి.ముఖ్యంగా ముత్తైదువతనానికి పవిత్రమైన పూజ.ఇంటికి వచ్చిన వారికి పసుపు-కుంకుమ,రవిక,పూలు,పండ్లు,ఎరుపు/ ఆకు పచ్చ గాజులు,ఆకు- వక్క ఇచ్చి నమస్కరించిన అమ్మవారి కటాక్షం తథ్యం!! ఇష్టమైన రంగు:ఎరుపు ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందంతో […]
జానపద గేయాలు- ఉళ్లొళ్ళో హాయీ
– డి.సుజాతా దేవి చిచ్చొళో హాయీ చిచ్చొళో హాయీ చిట్టి పాపాయీ బూచి వస్తాను బుట్ట తెస్తాను బజ్జో వేమోయి !! వద్దన్న వచ్చింది పొద్దెక్కి ఎండ సద్దుసేయక తొంగిచూసి పాలబుగ్గలమీద వాలింది వచ్చి చుర చుర చుర !! మళ్ళి వచ్చిందమ్మ అల్లరి గాలి ఉయ్యాలలో చేరి ఊగి మోగించి పోయింది మువ్వల్ల గిలక గల గల గల గల గల గల గల గల !!
మన ప్రసాదాలు-శివ ప్రసాదం
బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదా శివ లింగం!! శివుడాగ్న లేనిదే చీమైన కుట్టదు..మనందరికీ తెలిసిన విషయమే!! శివుడికి ఆర్భాటాలు అవసరం లేదు. విభూతి పెట్టుకుని శివ-శివ అని స్మరిస్తే చాలు…భోళాశంకరుడు ప్రత్యక్ష మవుతాడు. శివుడికి శిరస్సున చందమామ, గంగమ్మను,మెడలో హారములుగా సర్పాలు,నడుముకు పులి చర్మాలే అలంకారం.నీలకంఠుడు అభిషేక ప్రియుడు. పుష్పాలతో పూజకన్నా విభూతి పూజ ఇష్టం. ముందుగా నందీశ్వరుని అఙ్ఞ లేనిదే శివయ్య దర్శనం […]
జానపద గేయాలు- అమ్మో !- – డి.సుజాతా దేవి
బయమేత్తందో అమ్మో బతకడానికి అమ్మో ! బయమేత్తందో రన్నో బతకడానికి మనసులేని మనుషుల మద్దిన మసలడానికి కలిసి బతకడానికి !! నవుతానే నామం బెడతరు ఏడుత్తా దణ్ణం బెడతరు కడుపునిండా కళ్లు యిసము మాటల్లో తేనెలు బోత్తరు !! నీతికి నిలబడినోడంటే శాతగాని యదవంటారు కోతలతో కాలం గడిపే పోతులకే కురిసి లేత్తరు !! గుప్పెడు మెతుకులు ఇదిలిస్తే ఎప్పుడూ పడివుంటది కుక్క అన్నమెట్టినోడి నేతినే ఆరగింప జూత్తడు మణిసి !! పాము అంటే పక్కకు బోతము […]
మన ప్రసాదాలు- “బాలాజీ ప్రసాదం”
గోవిందాశ్రిత..గోకులబృంద….పావన జయ జయ పరమానంద!! బాలాజీ అంటేనే గుర్తు వచ్చేది తిరుపతి కదా!! ఆ స్వామిని….ఏడు కొండల వెంకన్న,ఆపదలు కాసేవాడు,పన్నగశయన,నాగభూషణ..ఎలా పిలిచినా పలుకుతాడు.ప్రత్యక్షంగా కనిపించడు కానీ పరోక్షంగా ఆపదలు కాస్తాడు.శ్రీవారికి శనివారం, మంగళవారం ప్రీతి కరం.శనివారం అత్యంత ఇష్టం.శేషతల్పశాయికి తలనీలాలు సమర్పించిన ఎంతో పుణ్యం.ప్రతి శనివారం పదకొండు రుపాయలు,కర్పూరం స్వామి వారి హుండీలో వేస్తే కోరికలు ఇట్టే తీరుస్తాడు. వేంకటేశ్వర స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మంచిది. కోరిక తీరిన తరువాత నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం […]
జానపద గేయాలు- ‘బతుకు’
సివ్వుమనే సీకటిలో సిక్కడె ఒంటరి మనసు ఏ దారి లేకపోయేరా ఓరన్నా మిగిలింది గోదారిరా ! కాళ్ళ కింద నిప్పులోసి నెత్తిన సన్నీళ్లు… కక్కలేని మింగలేని గొంతుక గుక్కిళ్ళు బతుకే నాటకమాయెరా ఓరన్నా తుదీ మొదలు లేకపోయెరా ! తెల్లని నురగల అలలు తిమింగలాలు లోన తేలెను రంగుల నావలు ఆగాధాల పైన బతుకే సుందరమాయెరా ఓరన్నా – డి.సుజాతా దేవి
మన ప్రసాదాలు-మహా లక్ష్మి ప్రసాదం
పూజ సేతము రారమ్మ….ఈ వేళ లక్ష్మి కి శ్రీ మహా లక్ష్మి కి..పూజ సేతము రారమ్మా!! శుక్రవారం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి, కాళ్ళకి పసుపు రాసుకుని,సింహద్వార గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి మహా లక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆహ్వానించాలి.మనం చక్కగా అలంకరించుకుని దేవిని పూజిస్తే అంతే ఆనందంతో వరాలను ప్రసాదిస్తుంది. సాయం సంధ్య వేళ వాకిలి తప్పకుండా తీసి పెట్టుకోవాలి, మహా లక్ష్మి దేవి పరిశుభ్రత, సత్ప్రవర్తన కలిగిన వారి ఇంట్లో సకల […]
