• పెదవులు గులాబీ రంగులో లేదా చక్కని ఎరుపు తో వుండాలనుకునేవాళ్లు కొత్తిమీర రసం ట్రై చేయమంటున్నారు. సౌందర్య నిపుణులు. పెదవులు నల్లగా ఉంటే ఈ రసం తో ఆ నలుపు పోతుంది. అలాగే పెదవులు పొడిబారి పోకుండా ఆర్గానిక్ లిప్ బామ్ ఎప్పుడూ రాస్తూనే ఉండాలి. ఉల్లిపాయల్లో వుండే సల్ఫర్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. వారానికి ఒకసారి ఉల్లిపాయ రసం కొబ్బరి నూనెతో కలిఫై మాడుకు రాసి మెల్లగా మస్సాజ్ చేయాలి . అరగంట తర్వాత షాంపూతో స్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఒక్కసారి ఎండకో లేదా పని చేస్తూ తడిగా ఉంచుకోవటం వల్లనో చేతులపై చర్మం రంగు తగ్గి ముడతలు తేలినట్లు ఉంటుంది. ఎండిన చేమంతుల పొడి కోకో బటర్ ఒక స్పున్ వెన్న రెండు టేబుల్ స్పూన్ల ఆప్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలిపి ఈ మిశ్రమం పాన్ పై ఉడికించి చల్లారాక దాన్ని సీసాలో భద్రం చేయాలి . ప్రతి రాత్రి పడుకునే ముందర దీన్ని చేతులకు అప్లయ్ చేస్తే చేతుల చర్మం రంగు తేలి మృదువుగా అయిపోతుంది. ముడతలు మాయమైపోయి చర్మం యవ్వనవంతంగా ఉంటుంది .

    ఉల్లిపాయ రసం చేసే అద్భుతం

    పెదవులు గులాబీ రంగులో లేదా చక్కని ఎరుపు తో వుండాలనుకునేవాళ్లు కొత్తిమీర రసం ట్రై చేయమంటున్నారు. సౌందర్య నిపుణులు. పెదవులు నల్లగా ఉంటే ఈ రసం తో…

  • మొదటిసారిగా జుట్టుకు రంగు వేసుకుంటున్నప్పుడో లేదా ఇక ఇంట్లోనే ట్రై చేద్దామని సదుద్దేశం కలిగినప్పుడో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రంగుతో వచ్చే సమస్యలు ఏవీ రాకుండా ఉంటాయి . లేకపోతే రంగు సరిగా అంటకపోవటం వారం లోపునే వేసిన రంగు పోవటం జరుగుతోంది. రంగు వేయాలనుకుంటే శిరోజాలు నూనె పట్టకుండా ఉండాలి. తలస్నానం చేసి పొడిగా ఉండాలి. మంచి కండిషనర్ వాడి తలస్నానం చేస్తే మృదువుగా సాఫీగా ఉంటుంది. అప్పుడే రంగు జుట్టుకు బాగా అంటుకుంటుంది. రంగు వేసాక ప్రతి రోజు తలస్నానం చేయద్దు . తలకి రంగు వేసుకున్న తర్వాత వేడి నీటి స్నానం వద్దు . వేడి నీరు కుదుళ్లను తెరచి వుంచుతుంది. అంచేత గోరు వెచ్చని నీళ్లు చల్లని నీళ్ళో వాడాలి . వాడే షాంపూల్లో సల్పెట్లు లేనివి కలర్ సేఫ్ రకాలు ఎంచుకోవాలి . పదే పదే రంగు వేసే బదులు అప్పుడప్పుడే రసాయనాలు లేని హెర్బల్ డై కూడా ప్రయత్నించవద్దు . ఇవి జుట్టుకు చర్మానికి హాని చేయకుండా ఉంటాయి. మొదటిసారిగా జుట్టుకు రంగు వేసుకుంటున్నప్పుడో లేదా ఇక ఇంట్లోనే ట్రై చేద్దామని సదుద్దేశం కలిగినప్పుడో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రంగుతో వచ్చే సమస్యలు ఏవీ రాకుండా ఉంటాయి . లేకపోతే రంగు సరిగా అంటకపోవటం వారం లోపునే వేసిన రంగు పోవటం జరుగుతోంది. రంగు వేయాలనుకుంటే శిరోజాలు నూనె పట్టకుండా ఉండాలి. తలస్నానం చేసి పొడిగా ఉండాలి. మంచి కండిషనర్ వాడి తలస్నానం చేస్తే మృదువుగా సాఫీగా ఉంటుంది. అప్పుడే రంగు జుట్టుకు బాగా అంటుకుంటుంది. రంగు వేసాక ప్రతి రోజు తలస్నానం చేయద్దు . తలకి రంగు వేసుకున్న తర్వాత వేడి నీటి స్నానం వద్దు . వేడి నీరు కుదుళ్లను తెరచి వుంచుతుంది. అంచేత గోరు వెచ్చని నీళ్లు చల్లని నీళ్ళో వాడాలి . వాడే షాంపూల్లో సల్పెట్లు లేనివి కలర్ సేఫ్ రకాలు ఎంచుకోవాలి . పదే పదే రంగు వేసే బదులు అప్పుడప్పుడే రసాయనాలు లేని హెర్బల్ డై కూడా ప్రయత్నించవద్దు . ఇవి జుట్టుకు చర్మానికి హాని చేయకుండా ఉంటాయి.

    మొదటి సారి డై ట్రై చేస్తా

    మొదటిసారిగా జుట్టుకు రంగు వేసుకుంటున్నప్పుడో లేదా ఇక ఇంట్లోనే ట్రై చేద్దామని సదుద్దేశం కలిగినప్పుడో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రంగుతో వచ్చే సమస్యలు ఏవీ రాకుండా ఉంటాయి…

  • ఇదివరలో ఆడపిల్లలకు సంవత్సరం లోపే చెవులు కుట్టించేవాళ్లు. ఒంటి ముత్యం ఎర్ర పూసలు గుచ్చిన బంగారపు కాడతో చెవులు కుట్టేసి కాడ మెలిక వేసేవాళ్ళు. మూడేళ్లు దాటాక ఆ కాదా తీసేసి రింగులు బుట్టలతో అలంకరించేవాళ్ళు. పాత కాలంలో నగల పేర్లు చాలా తమాషాగా ఉంటాయి. తమ్మే కు కాస్త పై భాగంలో తాలూకా అనే ఆభరణం. వీటికి పైన రాళ్లతో పొదిగిన పచ్చ రాళ్లు అనే వాటిని పెట్టుకొనే వారట . ఇంకాస్త పైన మత్స్య బావిలీలు చెవి పై భాగంలో కాశీ పుట్లు. వీటి కింద బూగడలు చెవి పక్కన గుబ బావిలీలు చెవికి ఎన్నో పోగులుండేవి. అలనాటి ఆభరణాలు మళ్ళీ వచ్చాయి. చెవీబీ తమ్మే నుంచి పై భాగం వరకు స్టడ్స్ రకరకాల ఆభరణాలు తగిలించటం ఇప్పటి ఫ్యాషన్ ఇన్ని ఆభరణాల్లో మొహానికి అత్యంత అందం ఇచ్చే వేలాడే బుట్టలే. బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఈ బుట్టల్ని వదిలిపెట్టరు. ఎక్కువ బంగారం తో చూడ చక్కని డిజైన్ ల తో ఎప్పటికీ మారదీ బుట్టల అందం.

    ఊగాడే అందాల బుట్టలే అందం

    ఇదివరలో ఆడపిల్లలకు సంవత్సరం లోపే చెవులు కుట్టించేవాళ్లు. ఒంటి ముత్యం ఎర్ర పూసలు గుచ్చిన బంగారపు కాడతో చెవులు కుట్టేసి  కాడ మెలిక వేసేవాళ్ళు. మూడేళ్లు దాటాక…

  • సీజన్ తో సంభంధం లేకుండా ఈ వాతావరణం లోని కాలుష్యానికి జుట్టు ఎండినట్లయి పోతుంది. ఇలాంటప్పుడు కలబంద సహజ కండిషనర్ గా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది . తల స్నానం చేసాక జుట్టు తడిగా ఉన్నప్పుడే తలకు ఈ గుజ్జు కొంచెం రాసేస్తే పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే జుట్టు చాలా మెరుపు ఉంటుంది. అదే పనిగా రసాయనాలు వాడటం కాలుష్యం వాతావరణంలో మార్పులు సైక్లింగ్ ఉత్పత్తుల వలన జుట్టు ఎక్కువగా చిట్లిపొతూ ఉంటుంది. కలబంద గుజ్జుతో అల్లల్లా తేలినట్లు ఉండాలనుకుంటే తల స్నానం చేసి జుట్టు ఆరాక కలబంద గుజ్జులు కాస్త చుక్కల నిమ్మరసం కలిపి రాసుకుని పది నిమిషాలు కడిగేసి చుస్తే జుట్టు ఎంత అందంగా కనిపిస్తుంది. జుట్టుకు జీవం వస్తుంది. అరకప్పు కలబంద గుజ్జు రెండు మూడు చుక్కల కొబ్బరినూనె నీళ్లు కలిపి తలంతా రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే కలబంద జుట్టుకు తేమ అందించి తాజాగా పట్టులా మార్చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కలబంద అద్భుతంగా పనిచేస్తుంది.

    జుట్టు మెరుపునిచ్చే కలబంద

    సీజన్ తో సంభంధం లేకుండా ఈ వాతావరణం లోని కాలుష్యానికి జుట్టు ఎండినట్లయి  పోతుంది. ఇలాంటప్పుడు కలబంద సహజ కండిషనర్ గా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది…

  • ఫ్యాషన్ డిజైనర్ల చేతిలో దండం ఏదైనా ఉందేమో నని వెతికి చూడాలనిపిస్తుంది ఒక్కసారి. ఇప్పుడీ ఫ్యాషన్ ప్రపంచపు ట్రెండ్ గా ఉన్న కొన్ని రకాల డ్రెస్ లకు అచ్ఛం ఆభరణాల్లాంటి ఎంబ్రాయిడరీలు జత చేసారు డిజైనర్లు. అందమైన చీర ఉందనుకోండి దానికి తగిన ఆభరణాలుంటేనే ఏదైనా పార్టీలు ప్రత్యేకం. కానీ అదే ఎంబ్రాయిడరీ జరీ మెరుపులు బ్లౌజ్ తోడైతే . అందులోనూ మంచి ముత్యాలు కుందన్ వెండి బంగారు దారాలతో ఎంబ్రాయిడరీ ఉందనుకోండి ఇక నగల అవసరం ఏముందీ . అలాగే నెక్ కాలర్ పార్టీకి హ్యాండ్ కప్స్ కి ఎంబ్రాయిడరీ జత చేస్తే వేరే నగలే అక్కరట్లేదు. హైనెక్ స్టయిల్ బ్లౌజ్ కు పాజరీ ఎంబ్రాయిడరీ చేసి సాదా సీదా చీర కట్టుకున్న వజ్రాభరణాలు పెట్టుకున్నంత అందం. ఏదైనా వేడుక కు లెహెంగా ఓణీ కావాలనుకుంటే మొత్తంగా డిజైనర్ క్లాత్ తోనే ఆ లెహెమ్ టేస్ట్. ఇవన్నీ ఇప్పటి ట్రెండ్ చేతికొక్క గాజు కూడా వేసుకోవాలిసిన పనిలేదు. అన్నీ డిజైనర్ పనితనమే . నిలువెత్తు బంగారు బొమ్మలా నిలబెట్టాలన్న ఆభారణాలు పోలిన ఎంబ్రాయిడరీ తో మొత్తం డ్రెస్ అంతా నింపేస్తున్నారు. ఇప్పుడిక బంగారు నగలు వజ్రాలు ఈ డ్రెస్ ల ముందు దిగదిడుపే.

    అచ్ఛం నగల్లాంటి డ్రెస్ లు

    ఫ్యాషన్ డిజైనర్ల చేతిలో దండం ఏదైనా ఉందేమో నని వెతికి చూడాలనిపిస్తుంది ఒక్కసారి. ఇప్పుడీ ఫ్యాషన్ ప్రపంచపు ట్రెండ్ గా ఉన్న కొన్ని రకాల డ్రెస్ లకు…

  • చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి చికిత్సలున్నాయి. అనాస పండు యాంటీ ఏజింగ్ ఏజెంట్ రెండు ముక్కలు అనాస పండు మెత్తగా చేసి ఆ రసం ముఖానికి రాస్కుంటే ఫలితం ఉంటుంది. ఆముదంలో ప్లాటీ ఆమ్లాలుంటాయి. ఇవి సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. ఏదైనా నూనెలో ఆముదం కలిపి మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. బాదం నూనె తోకూడా ఇదే ఫలితం. రెండు పూటలా బాదం నూనె తో మర్దనా చేయాలి. చక్కెర మెత్తగా పొడిగా చేసి అందులో తేనె కలిపి పూతలా వేసుకుంటే చర్మానికి తేమ అంది సాగిపోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన తో పూతలాగా వేసినా మంచిదే. కలబంద గుజ్జయితే ప్రతిరోజు వాడవచ్చు. ఫ్రెష్ గా ఉన్న కలబంద నుంచి గుజ్జు తీసి పూతలా వేసి మర్దనా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

    కలబంద తో చర్మం బిగుతవుతుంది

    చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి  చికిత్సలున్నాయి.…

  • ఎన్ని షాంపూలు వాడుతున్నా డామేజీ అయిపోతున్న జుట్టుని కాపాడు కోలేక పోతుంటే కొన్నబీ హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే బావుంటుంది. వేడి నీళ్లతో స్నానం అస్సలు చేయకూడదు. జుట్టును సంరక్షించే నూనె డ్రై గా మారిపోతుంది. ఫలితంగా జుట్టు పొడిబారిపోతుంది. సొరకాయ రసం జుట్టుకు పట్టించేసి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. యాపిల్ సిడార్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో కలిపి జుట్టుకు పట్టించి ఐదు నిముషాలు ఆగి స్నానం చేయాలి. ఎగ్ వైట్ వల్ల కూడా ఎంతో మంచి ఫలితం వుంటుంది. జుట్టు రాలేందుకు చుండ్రు ముఖ్య కారణం కావచ్చు. కనుక తల శుభ్రంగా ఉంచుకోవాలి. బాదం నూనె ను కొంచెం వేడి చేసి తలకు పట్టించి అరగంట ఆగి స్నానం చేసేయచ్చు. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టటం వల్ల హానికరమైన కెమికల్స్ తో జుట్టు పాడైపోతుంది . స్విమ్మింగ్ చేసే ముందర జుట్టుకు కండీషనర్ అప్లయ్ చేయాలి. అరకప్పు తేనె లో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఒక కోడిగుడ్డు పచ్చి సోనా కలిపి జుట్టుకు అప్లయ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే సరి. జుట్టు బాగా ఆరాకే దువ్వుకోవాలి. పండ్లు కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. హెల్త్ డైట్ తోనే జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది.

    శిరోజాల సమస్య ఉంటే ఇలా చేస్తే సరి

    ఎన్ని షాంపూలు వాడుతున్నా డామేజీ అయిపోతున్న జుట్టుని కాపాడు కోలేక పోతుంటే కొన్ని హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే బావుంటుంది. వేడి నీళ్లతో స్నానం అస్సలు చేయకూడదు.…

  • పెళ్లి జీవితంలో ఒకే ఒకసారి వచ్చే ప్రత్యేకమైన పండగ లాంటిది. ఆ రోజు ఎలా ఉండాలో ఇన్విటేషన్ ప్రింటింగ్ నుంచి పెళ్లి కాన్సెప్ట్ ఎవ్వరికీ లేనంత గొప్పగా ఉండాలనుకుంటున్నారు ఆలా అవకాశం సముద్ర గర్భంలో ఏకంగా గాలిలో ఎగిరే బెలూన్ లో కూడా పెళ్లిలవుతున్నాయి . ఇక పెళ్లికూతురు ఎలా ఉండాలి. ప్రధానం రోజు మెహేందీ పండగ రోజు ఏకంగా పెళ్లి రోజు ఆమె అలంకరణ ఆహార్యం ఎంత గొప్పగా ప్రత్యేకంగా ఉండాలి. సంప్రదాయం ఆధునికత కలిసిన డిజైనర్ లుక్ తో అమ్మాయి మెరిసిపోవాలి. ఒక సోయగాల చీర అయి ఉండచ్చు. చీరని అనార్కలీ ఫ్యాషన్ నేలను జారాడే లెహెంగా మోడల్ లో కావచ్చు. లంగా వోణీ కలిపి కొట్టేసి మొత్తంగా బంగారు జరి పనితనం ఉట్టిపడేలా ఎంబ్రాయిడరీ చేసి పెళ్లి దుస్తుల్ని కూడా ఫ్యాషన్ డిజైనర్స్ చేతిలో మంత్రదండం అనే క్రియేటివిటీ తో అద్భుతాల సృష్టిస్తున్నారు. అలాంటి లేత రంగుల ఉషోదయాలు చీకటి వెలుగులు మెరుపులు పట్టు చీరలపై పూర్తీ ఖరీదైన ముత్యాలు రాళ్ల ఎంబ్రాయిడరీ లు ఆన్ లైన్ లో సందడి చేస్తున్నాయి. పెళ్లి స్పెషల్ చీరల పై వీలుంటే ఓ లుక్ వేయండి.

    స్పెషల్లీ డిజైన్డ్

    పెళ్లి జీవితంలో ఒకే ఒకసారి వచ్చే ప్రత్యేకమైన పండగ లాంటిది. ఆ రోజు ఎలా ఉండాలో ఇన్విటేషన్ ప్రింటింగ్ నుంచి పెళ్లి కాన్సెప్ట్ ఎవ్వరికీ  లేనంత గొప్పగా…

  • మందార పూలు ఎంతందంగా వుంటాయో అవి జుట్టుజు అంత మేలు చేస్తాయి. మందార పూలు ఎండబెట్టి దానిని మెంతిపిండి కలిపి కొబ్బరి ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకుని అందులో కలిపేసి మరగనిచ్చి సీసాలో భద్రపరుచుకుని ప్రతిరోజు తలకి రాసుకుని తలస్నానం చేయచ్చు . కుదుళ్ళు ఆరోగ్యాంగా జుట్టు ఒత్తుగా మారుతుంది. అలాగే పొడిబారిన నిర్జీవమైన జుట్టుకు పచ్చి మందార పూలను మెత్తగా పేస్ట్ గా చేసి ప్యాక్ వేసుకుని అరగంట పోయాక స్నానం చేయచ్చు. మందార పూవుల్లోనే కాదు ఆకుల్లోను సౌందర్య కరమైన ఔషధ గుణాలున్నాయి. శాకాయ కుంకుడు కాయ వంటి వాటిలో స్నానం చేస్తుంటే జుట్టు డ్రై గా ఆయిపోకుండా అందులో మందారాకులు కలిపి స్నానం చేయచ్చు. నేరుగా గోరింటాకు పొడిని పట్టించటం వల్ల జుట్టు పొడిగా అయిపోతుంది. ఈ సమస్య పోవాలంటే దానికి రెండు చెంచాల మందారాకు పొడి కలుపుకుని నాననిచ్చి తలకు పెట్టకుంటే జుట్టు మృదువుగా ఉంటోంది.

    మేలు చేసే మందార పూలు

    మందార పూలు ఎంతందంగా  వుంటాయో అవి జుట్టుజు అంత మేలు చేస్తాయి. మందార పూలు ఎండబెట్టి  దానిని మెంతిపిండి కలిపి కొబ్బరి ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకుని…

  • కేశాలంకారణలో కొన్ని టిప్స్ నేర్చుకుంటే అవే కొన్ని సందర్భాల్లో పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయ్. కాస్త పొట్టిగా చిన్న జుట్టే ఉంటే దానికో పోనీ వేయచ్చు. రెండు చేతులతో సమానంగా జుట్టుని పైకెత్తి నడినెత్తికి కిందగా తెచ్చి బననా క్లిప్ పెడితే జుట్టు ఒత్తుగా కన్పిస్తుంది. అలాగే ఎప్పుడూ పాపిడి తీసుకోవటమో లేక వెనక్కి దువ్వు కోవటం కాకుండా పఫ్ ట్రై చేస్తే బావుంటుంది ఇవాళ్టి ట్రెండ్ కూడా . జుట్టు ముందర భాగాన ఎత్తుగా కనిపిస్తూ కొత్త లుక్ వస్తుంది . ఇక పొడవైన జుట్టయితే జుట్టంతా వెనక్కి దువ్వేసి రబ్బరు బ్యాండ్ పెట్టుకుని ఇక కాస్త దూరం జుట్టు వదిలి ఒక రబ్బరు బ్యాండ్ ఆలా కొంచెం కొంచెం ఎడంగా జడలా మొత్తం జుట్టుతో పువ్వులు చేసినంత బావుంటుంది. అసలు ఇలాంటి ట్రిక్స్ వందలాది వేలాది వున్నాయి డిఫరెంట్ హేయిర్ స్టయిల్స్ పైన.

    మార్పులు చిన్నవే కానీ భలే ట్రెండీ

    కేశాలంకారణలో కొన్ని టిప్స్ నేర్చుకుంటే అవే  కొన్ని సందర్భాల్లో పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయ్. కాస్త పొట్టిగా చిన్న జుట్టే ఉంటే దానికో పోనీ వేయచ్చు. రెండు…

  • అలంకరణ అంటే దుస్తులు నగలే. కానీ బోలెడన్ని అందమైన చెప్పులు కూడా. అలంకరణ కు అందం తెస్తాయి. పంజాబీ జూత్ లు వేసుకునేందుకు సౌకర్యంగా ఫ్యాషన్ గా ఉంటాయి. సల్వార్ సూట్లు జీన్స్ కుర్తీలకు బావుంటాయి. బెల్లీస్ నీ బ్యాలే ప్లాట్స్ అంటారు. ఆఫీస్ లకు బావుంటాయి. ఎత్తు మడమలు కూడా ఉన్నాయి ఇవి చీరలు కట్టుకున్నప్పుడు బావుంటాయి. ఓపెన్ తో పంప్స్ అన్ని రకాల దుస్తులకు నప్పే రకం . అన్ని రకాల డిజైన్లు అందుబాటులో వున్నాయి. ముందు భాగం ముసేసినట్లు ఉండదు కనుక ఎక్కువసేపు వేసుకున్నా అసౌకర్యంగా ఉండదు. లెస్ట్ యాంకిల్ బలాట్స్ ఇవి కేవలం మోడ్రన్ దుస్తులకే పరిమితం చలికాలపు స్పెషల్స్. బూట్లు అయితే ఇప్పుడు మోకాసిన్స్ అని వస్తున్నాయి. ఫ్యాషన్ ట్రెండ్ ఇవే . వెస్ట్రన్ పాశ్చాత్య వస్త్ర శ్రేణికే నప్పుతాయి. చీరలకు అస్సలు బావుండదు. టీ స్ట్రాప్ సాండల్స్ కీ ఇప్పుడు ఆదరణ. ఎలాంటి దుస్తులకైనా బాగా సరిపోతాయి. అలంకరణ అంటే దుస్తులు నగలే. కానీ బోలెడన్ని అందమైన చెప్పులు కూడా. అలంకరణ కు అందం తెస్తాయి. పంజాబీ జూత్ లు వేసుకునేందుకు సౌకర్యంగా ఫ్యాషన్ గా ఉంటాయి. సల్వార్ సూట్లు జీన్స్ కుర్తీలకు బావుంటాయి. బెల్లీస్ నీ బ్యాలే ప్లాట్స్ అంటారు. ఆఫీస్ లకు బావుంటాయి. ఎత్తు మడమలు కూడా ఉన్నాయి ఇవి చీరలు కట్టుకున్నప్పుడు బావుంటాయి. ఓపెన్ తో పంప్స్ అన్ని రకాల దుస్తులకు నప్పే రకం . అన్ని రకాల డిజైన్లు అందుబాటులో వున్నాయి. ముందు భాగం ముసేసినట్లు ఉండదు కనుక ఎక్కువసేపు వేసుకున్నా అసౌకర్యంగా ఉండదు. లెస్ట్ యాంకిల్ బలాట్స్ ఇవి కేవలం మోడ్రన్ దుస్తులకే పరిమితం చలికాలపు స్పెషల్స్. బూట్లు అయితే ఇప్పుడు మోకాసిన్స్ అని వస్తున్నాయి. ఫ్యాషన్ ట్రెండ్ ఇవే . వెస్ట్రన్ పాశ్చాత్య వస్త్ర శ్రేణికే నప్పుతాయి. చీరలకు అస్సలు బావుండదు. టీ స్ట్రాప్ సాండల్స్ కీ ఇప్పుడు ఆదరణ. ఎలాంటి దుస్తులకైనా బాగా సరిపోతాయి.

    ఇవి కూడా ఫ్యాషన్ ట్రెండ్స్

    అలంకరణ అంటే దుస్తులు నగలే. కానీ బోలెడన్ని అందమైన చెప్పులు కూడా. అలంకరణ కు అందం తెస్తాయి. పంజాబీ జూత్ లు వేసుకునేందుకు సౌకర్యంగా ఫ్యాషన్ గా…

  • పర్ ఫెక్ట్ గా వుండే హీల్స్ ఎంచుకుంటేనే శరీర ఆకృతి సరిగ్గా ఉంటుందనీ ఎముకల ఆరోగ్యం బావుంటుందనీ చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. కొంచెం ఎత్తు తక్కువ గా ఉన్నవాళ్లు ఇంకొంత ఎత్తు ఇవ్వగలిగే షూ ఎంచుకోవాలి. ఫ్లాట్ ఫారమ్స్ వెడ్జెస్ స్టిలెటోన్ గ్లాడిమీటర్స్ హీల్స్ గలవి బావుంటాయి. పొట్టిగా కొంచెం బొద్దుగా ఉంటే హీల్స్ గల ఓపెన్ టూ షూ బాగా నప్పుతాయి. బొద్దుగా ఉన్నకాళ్లకు ఇవి సరైన షేప్ ఇస్తాయి. పొడుగ్గా సన్నగా ఉంటే హీల్స్ బావుండనుకుంటారు కానీ హీల్స్ గల స్ట్రాప్ సాండల్స్ స్టిల్లేటోస్ మరింత స్లిమ్ గా చూపెడతాయి. ఫ్లాట్ ఫామ్ షూస్ కాలిమడమల్ని భారీగా చూపెడతాయి. పొడవుగా మాస్క్యులార్ గా ఉన్నవారికి సూపర్ హై హీల్స్ బావుంటాయి. పాయింట్ ఓపెన్ టూ లేదా స్టిలే టోస్ ఏమైనా ఎంచుకోవచ్చు. పంప్స్ లేదా స్క్వేర్స్ హీల్స్ హెవీ గా కనిపిస్తాయి .

    సరైన హీల్స్ తో ఆరోగ్యం ఆకృతీ

    పర్ ఫెక్ట్ గా వుండే హీల్స్ ఎంచుకుంటేనే శరీర ఆకృతి సరిగ్గా ఉంటుందనీ ఎముకల ఆరోగ్యం బావుంటుందనీ చెపుతున్నారు ఎక్స్ పెర్ట్స్. కొంచెం ఎత్తు తక్కువ గా…

  • అవసరమైన పరికరాలు ఉండాలే కానీ శిరోజాల స్టయిలింగ్ చాలా ఈజీ. స్మూత్ గా పొడవుగా ఉంగరాలు తిరిగే జుట్టు కావాలనుకుంటే కర్లింగ్ టాంగ్స్ ఉపయోగపడతాయి. ఉంగరాల జుట్టున్న వాళ్ళు స్ట్రెయిట్ ప్రయోగాలు ఇష్టం అంటారు. సెలూన్ల లో ప్రొఫెషనల్స్ తో చేయించుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది. శాశ్వత పద్దతి కాకుండా ఇంట్లోనే పోకర్ - స్ట్రెయిట్ లాక్స్ తో పూర్తి చేయచ్చు. ఈ పరికరం ఉపయోగించే ముందు హీట్ ప్రొటెక్టివ్ స్ప్రే వాడుకోవాలి. శిరోజాలు నిస్తేజంగా అనిపించినప్పుడు మెరుపులతో కూడిన హేయిర్ స్ప్రే జల్లుకుంటే మార్పులు ఇట్టే కనిపిస్తాయి. ఇక పొడుగ్గా ఒత్తుగా జుట్టుంటే బ్లో డ్రయర్ అందరి ఇళ్లల్లోనూ కనిపించేదే. జుట్టు ఆరబెట్టుకునేందుకే కాదు సింపుల్ స్టయిలింగ్ కు బ్లో డ్రయర్ కావాలి. ఇక వీటన్నింటితో పాటు హేయిర్ కలరింగ్ . ఒకప్పుడు ఇది తెల్ల వెంట్రుకలను కప్పేసేది. ఇప్పడూ స్టయిల్ స్టేట్ మెంట్. కోరుకున్న షేడ్స్ లో కలర్స్ నాణ్యత డ్యూరాబిలిటీ పెరిగాయి, మంచి కండీషనర్ లు షాంపూలు ఉండనే ఉన్నాయి.

    శిరోజాల స్టయిలింగ్ చాలా ఈజీ

    అవసరమైన పరికరాలు ఉండాలే కానీ శిరోజాల స్టయిలింగ్  చాలా ఈజీ. స్మూత్ గా పొడవుగా ఉంగరాలు తిరిగే జుట్టు కావాలనుకుంటే కర్లింగ్ టాంగ్స్  ఉపయోగపడతాయి. ఉంగరాల జుట్టున్న…

  • అందమైన ఫ్యాబ్రిక్స్ తో మొదటి వరసలో కనిపిస్తుంది వెల్వెట్. పట్టులోని మెరుపు ఊలులో మెత్తదనం రెండు కలిసి ఉంటాయి కనుక పూర్వం చలికాలంలో ఏదైనా ఫ్యాషన్ దుస్తులు ధరించాలి అనుకుంటే దీన్నే ముందు తలుచుకునేవాళ్ళు . మనీష్ మల్హోత్రా తరుణ్ తహలియాని వంటి టాప్ ఫ్యాషన్ డిజైనర్లు ఈ అందమైన ఫ్యాబ్రిక్ తోనే చీరలు బ్లౌజులు లెహెంగాలు లంగా ఓణీలు అనార్కలీ బంద్గాలాలు డిజైన్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ లకు సరికొత్త అందాన్ని ఇస్తున్నారు. ఖరీదు ఎక్కువైనా బరువుగా అనిపించినా నెట్ జార్జెట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో కలిపి ఏ వేడుక కైనా సరిపోయేలా డిజైనర్ దుస్తుల్ని రూపొందిస్తున్నారు. మెరిసే జరీ జర్దోసీ వర్కులు. పట్టు దారాల ఎంబ్రాయిడరీ లు వెండి రంగులు మెరిసే గోటా బోర్డార్లు ఇలా ఏవేన్నా ముదురు రంగు వెల్వెట్ పైన మరింత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సుతిమెత్తని వెల్వెట్ తో బ్రొకేడ్ డిజైన్ తో వచ్చే సిల్క్ వెల్వెట్ తేలికగా వుండే షిఫాన్ రకము క్రష్ డ్ హోమ్మేడ్ లయోన్ నాక్రే ఇలా చాలా రకాలున్నాయి. రాత్రివేళ ఈ మఖముల్ డిజైనర్ దుస్తుల అందమే స్పెషల్.

    అందంగా మెరవాలనుకుంటే వెల్వెట్ ఎంచుకోండి

    అందమైన ఫ్యాబ్రిక్స్ తో మొదటి వరసలో కనిపిస్తుంది వెల్వెట్. పట్టులోని మెరుపు ఊలులో  మెత్తదనం రెండు కలిసి ఉంటాయి కనుక పూర్వం చలికాలంలో ఏదైనా ఫ్యాషన్ దుస్తులు…

  • తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే ఇలా చేసి చుస్తే ఫలితం ఉండచ్చు. పుష్కలంగా యాంటీ ఫంగల్ గుణాలున్న పెరుగులో నల్ల మిరియాల పొడి కలిపి అప్లయ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. ఆయిలీ హేయిర్ ఉన్నవాళ్లు పండిన టమాటో గుజ్జుతో ముల్తానీ మట్టి చేర్చి తలకు పట్టించి ఆరాక స్నానం చేసేసినా ఫలితం ఉంటుంది . నానబెట్టిన మెంతులు ఉదయాన్నే పేస్ట్ లాగా రుబ్బి తలకు పెట్టేస్తే ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జులో ఉండే యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు కూడా ఫంగస్ ను తొలగిస్తాయి. నిమ్మరసం తేనె కలిపి పట్టించినా మంచిదే. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ చుండ్రు తొలగిస్తుంది. తేనె జుట్టుకు కావలిసిన మాయిశ్చరైజర్ అందిస్తుంది. రెండు స్పూన్ల సెనగపిండి పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట ఆగాక కడిగేసినా సమస్య తీరిపోయినట్లే. వీటిల్లో కొన్నయినా ట్రై చేయండి. ఇవి ఇంటి చిట్కాలు గనుక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు.

    ఈ చిట్కాలతో చుండ్రు మాయం

    తలకి చుండ్రు పట్టుకుంటే ఎన్ని మందులు వాడుతున్నా వదలకుండా విసిగిస్తూ ఉంటుంది. ఖరీదైన మందులు వాడి ఇంకా తగ్గటం లేదు అనుకుంటే  ఇలా చేసి చుస్తే ఫలితం…

  • మేకప్ తొలగించటంలో జొజోబా ఆయిల్ వాడటం చాలా మంచిది. అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఇది మేకప్ రిమూవర్ గానే కాదు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయానికి మొహం సాఫ్ట్ గా అయిపోతుంది. అలాగే వట్టి పెరుగు కాటన్ ప్యాడ్ నెమ్మదిగా గుండ్రముగా రుద్దుతూ మేకప్ తొలగిస్తే చర్మం క్లీన్ అవటమే కాదు. తాజాగా మెరుపుగా ఉంటుంది. ఇక పాలు నాచురల్ క్లీన్సర్ గా పనిచేస్తాయి. ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి మేకప్ రిమూవర్ గా ఉపయోగిస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దోసకాయ ను జ్యూస్ లాగా తీసి అందులో బేబీ ఆయిల్ కలుపుకుని మొహం తుడుచుకుంటే చర్మం చక్కగా అయిపోతుంది. ఈ కాంబినేషన్ మేకప్ రిమూవర్. గ్రేప్ నీడ్ ఆయిల్ దూది ముంచి మేకప్ తుడిచేస్తే ఈ నూనె చర్మానికి నిగారింపు ఇవ్వటంతో పాటు మొటిమలు మడతలు నివారిస్తుంది. ఇదే విధంగా కొబ్బరినూనె కూడా మేకప్ తొలగించే రిమూవర్ గా పనికివస్తుంది.

    ఇవి మేకప్ తొలగించే సొల్యూషన్స్

    మేకప్ తొలగించటంలో జొజోబా ఆయిల్ వాడటం చాలా మంచిది. అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఇది మేకప్ రిమూవర్ గానే కాదు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయానికి…

  • ఉదయపు వేళ శ్రద్ధ తీసుకుంటేనే

    మొహం కడుక్కునే విధానం మార్చుకుంటే ముఖం ఇంకెంతో కాంతి వంతంగా మారుతుంది. అంటున్నారు ఎక్స్పెర్ట్స్. రాత్రివేళ మేకప్ తీసివేసేందుకు ఉదయం నుంచి మొహానికి తగ్గితే కాలుష్యం వదుల్చుకునేందుకు…

  • ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్ వేసుకున్నట్లుగా ఉండాలంటే ప్రైమర్ వాడాలి. ప్రైమర్ అంటే ప్రాధమిక అలంకరణ వస్తువు. ఐలైనర్ వేయాలంటే ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేయాలన్నా ప్రైమర్ వాడాల్సిందే. ప్రైమర్ వేసి ఆపై అలంకరణ చేస్తే సాయంత్రం వరకు బెదరకుండా ఉంటాయి. కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా పౌడర్ వేసినా ప్రయోజనం ఉండదు. కాస్సేపటికి పౌడర్ పోయి నలుపు కనిపిస్తుంది. ముందుగా కన్సీలర్ వేసుకుని పౌడర్ వేసుకోవాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలంటే ముందుగా పెదవులు పైన మృత కణాలు తొలగించి లిప్ బామ్ వేసుకుని లిప్ లైనర్ వేసుకుని మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలి. హేయిర్ స్ప్రే ని టూల్ బ్రష్ పై తీసుకుని కనుబొమ్మల్ని దువ్వుకుంటే రోజంతా చెదరకుండా ఉంటాయి. ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్ వేసుకున్నట్లుగా ఉండాలంటే ప్రైమర్ వాడాలి. ప్రైమర్ అంటే ప్రాధమిక అలంకరణ వస్తువు. ఐలైనర్ వేయాలంటే ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేయాలన్నా ప్రైమర్ వాడాల్సిందే. ప్రైమర్ వేసి ఆపై అలంకరణ చేస్తే సాయంత్రం వరకు బెదరకుండా ఉంటాయి. కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా పౌడర్ వేసినా ప్రయోజనం ఉండదు. కాస్సేపటికి పౌడర్ పోయి నలుపు కనిపిస్తుంది. ముందుగా కన్సీలర్ వేసుకుని పౌడర్ వేసుకోవాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలంటే ముందుగా పెదవులు పైన మృత కణాలు తొలగించి లిప్ బామ్ వేసుకుని లిప్ లైనర్ వేసుకుని మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలి. హేయిర్ స్ప్రే ని టూల్ బ్రష్ పై తీసుకుని కనుబొమ్మల్ని దువ్వుకుంటే రోజంతా చెదరకుండా ఉంటాయి.

    ప్రైమర్ ఉంటేనే మేకప్ చెదరదు

    ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ  లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్…

  • టులిప్ తోటల్ని చూస్తుంటే విశాలమైన ప్రపంచం మీద అందమైన కార్పెట్ పరిచినట్లు కనిపిస్తుంది కప్పల్లాగా స్టార్ షేప్స్ లో ఇప్పటికే 75 రకాల రంగుల్లో వున్నాయి/ పెద్ద సైజు లిల్లీలాంటి ఈ పువ్వులే ఇంత అందంగా ఉంటే ఇంకా అలంటి సల్వార్ డిజైన్స్ ఇంకెంత బావుండాలి. వీటి పేరే టులిప్ సల్వార్ ప్యాంట్స్. బ్యాగ్స్ పటియాలా స్టయిల్ లు ఉన్నట్లు ఉంటాయి కానీ ఇదో ప్రత్యేకమైన స్టయిల్. నడుము దగ్గర వెడల్పుగా కాలి మడమ దగ్గరకు వచ్చే సరికి సన్నగా వుండేలా కటింగ్ ఉంటుంది. ఈ అందమైన తులపై సల్వార్ పైకి కుర్తీ కుర్తా లాంగ్ కమీజ్ లు వేసుకోవచ్చు. హాజరయ్యే సందర్భాన్ని బట్టి ఇది డిజైనర్ మెరుపులా లేదా ఎంబ్రాయిడరీనా సాదా డ్రెస్ నా ఎంచుకోవచ్చు. ఇక ఈ డ్రెస్ లో ఎంత మందితో వున్నా టులిప్ పువ్వంత అందంగా ప్రత్యేకంగా కనిపించటం ఖాయం.

    ఈ డ్రెస్ లో పువ్వంత అందం

    టులిప్ తోటల్ని  చూస్తుంటే విశాలమైన ప్రపంచం మీద అందమైన కార్పెట్ పరిచినట్లు కనిపిస్తుంది కప్పల్లాగా స్టార్ షేప్స్  లో ఇప్పటికే 75 రకాల రంగుల్లో వున్నాయి/ పెద్ద…

  • ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే అందం రహస్యం ఉందంటున్నారు. ఎక్స్పెర్ట్స్. సింపుల్ గానే వుంది చిట్కా మంచి డికాషన్ కాఫీ ని ఐస్ క్యూబ్స్ ట్రే లో పోసి ఫ్రిజ్ లో పెడితే అవి ఉదయానికి కాఫీ క్యూబ్స్ గ చేతికొస్తాయి. ప్రతి రోజు ఉదయం ఈ క్యూబ్ తో మొహం పై మర్దనా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి చర్మం నిగారింపు కు వస్తుంది. కండీషనర్ లో రెండు టీ స్పూన్ల గ్రౌండ్ కాఫీ ని కలిపి జుట్టుకు పట్టేస్తే ఐదు నిమిషాల పాటు ఉంచి కడిగేసినా చాలు మెత్తని పచ్చు కుచ్చు లాగా తయారవుతాయి శిరోజాలు. అలాగే నిద్రలేకపోవటం వల్ల కంటి పై వత్తిడి పడటం వల్ల మరే ఇతర కారణాల వల్ల కళ్ళ చుట్టూ డార్క్ సిర్కిల్స్ ఏర్పడితే అప్పుడు ఒక అర కప్పు కాఫీ దగ్గర పెట్టుకుని దాన్ని కళ్ళ కింద అప్లయ్ చేస్తే చాలు. కా కాస్సేపయ్యాక చల్లని నీళ్లతో కడిగిస్తే సరి. చర్మకణాల పునరుత్పత్తికి కాఫీ గ్రౌండ్స్ బాగా పని కొస్తాయి. దాన్ని స్క్రబ్ మాదిరిగా ఉపయోగించవచ్చు. ఈ పొడితో చర్మం పైన నిదానంగా గుండ్రంగా మర్దనా చేస్తే ఇందులో వుండే కెఫిన్ కొల్లాజైన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పద్దతిలో చర్మం ఎంతో సున్నితంగా అందంగా తయారవుతోంది.

    కాఫీ లో అందం

    ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా  మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే  అందం రహస్యం…