• పువ్వుల తోటలో పూసిన, దుస్తులపైన చెక్కగా అమిరిన, వాటిని సెలబ్రెటీలు వేసుకుంటే చాలు ఎక్కడ లేని అందం తో కనిపిస్తారు. అలాంటప్పుడే ఆ డ్రెస్ పైన అమ్మాయిల కళ్ళు వాలిపోతాయి. అందమైన శ్రీదేవి సాదా స్కర్టులు వేసుకుని పువ్వుల ప్రింట్ల ప్యాంటు వేసుకున్న, ప్రాక్ మొత్తం పువ్వులతో నింపివేసి పువ్వు కంటే అందమైన చిరునవ్వుతో తమన్నా మెరిసినా, టాప్ టు బాటమ్ పువ్వుల డ్రేస్ లు ఐశ్వర్యారాయ్ చిరునవ్వులు చిందించినా, ఇంకా ఆ డ్రెస్సు అమ్మాయిల లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోతుంది. పువ్వుల లతలు ఎప్పుడు అందంగానే వుంటాయి. అవి పట్టు చీరపై అల్లుకున్న, షిఫాన్ చీర పై విరిసినా, చక్కని కాటన్ చీర నిండా పరుచుకున్నా అందమే అందం. ఇప్పుడు విసిగించే వేసవిలో రిలాక్స్ గా కనిపించడం కోసం లేత వర్ణాల దుస్తుల పై పువ్వుల ప్రింట్స్ కోసం షాపింగ్ చేయడం బెస్ట్.

    ఇది పువ్వుల దుస్తుల కాలం

    పువ్వుల తోటలో పూసిన, దుస్తులపైన చెక్కగా అమిరిన, వాటిని సెలబ్రెటీలు వేసుకుంటే చాలు ఎక్కడ లేని అందం తో కనిపిస్తారు. అలాంటప్పుడే ఆ డ్రెస్ పైన అమ్మాయిల…

  • ఎప్పుడూ పువ్వులూ, ఎంబ్రాయిడరీలు, కట్ వర్క్ డిజైన్స్ వైపే చూస్తారు కానీ పూర్తిగా ప్లెయిన్ డ్రెస్సుల్లో ఎంత అందంగా వుండోచ్చో కొంత మంది హీరోయిన్స్ ని చుస్తే అర్ధం అవుతుంది. కాకపొతే అంచులలో చిన్న డిజైన్లు, కనిపించని బుటీలు, బ్లాక్ ప్రింట్ కలిపి సాదా చీరలకు గొప్ప అందం వస్తుంది. దానికి జతగా మెడ ప్రేత్యేకంగా కుట్టించుకున్న బ్లవుజు కూడా చీర అందానికి మాచ్ అవుతుంది. అలాగే చీరకు తగ్గట్టు ఇతర వస్తువులు డిజైనర్ తరహగా వుండాలి. ఎంబ్రాయిడరీ చేసిన అందమైన బ్యాగులు, క్లచ్ పర్సులు, మెటాలిక్ యాక్ససరీలు, తేలికైన నగలు వేసుకోవాలి. ఇలాగె సాదా చీరలు సాంప్రదాయ వర్ణాలతో వుండే లాగా చూసుకోవాలి. పౌడర్ బ్లూ, పసుపు, ఐస్ బ్లూ, పీచ్, సముద్ర నీలం వంటి లేలేత ఛాయలు ఎంచుకుని, సిల్క్, శాటిన్, కాటన్, సిల్క్,జార్జెట్, వంటి వస్త్ర శ్రేణిలో చీరలుంటే సంప్రదాయకంగా, అటు మోడ్రెన్ గా వుంటాయి. ఇలాంటి హంగులు లేకుండా కేవలం ఒక్క రంగుతో నే ఎంతో అందంగా కనిపిస్తారు. అయితే దుస్తుల ఎంపిక, దానికి జతగా బ్లవుజ్ నగల మేళవింపు వుంటే చాలు. ఏ పార్టి, అకేషన్ లో అయినా మెరిసిపోవచ్చు. ఇమేజస్ చుస్తే కొంత మంది హీరోయిన్ ఎంచుకున్న కాంబినేషన్స్ నగల పద్దతి అర్ధం అవుతుంది. పైగా వేసవికి లేత రంగుల సాదా చీరలు ఎంతో అందం.

    సాదా చేరాల్లోనే అంద అంతా

    ఎప్పుడూ పువ్వులూ, ఎంబ్రాయిడరీలు, కట్ వర్క్ డిజైన్స్ వైపే చూస్తారు కానీ పూర్తిగా ప్లెయిన్ డ్రెస్సుల్లో ఎంత అందంగా వుండోచ్చో కొంత మంది హీరోయిన్స్ ని చుస్తే…

  • వేసవి ఎండకు ముందుగా ఎఫెక్ట్ అయ్యేది జుట్టే ఎండలో పిచు లాగా అయిపోతుంది. లేదా చెమటకి తడిసి తలస్నానం చేసినా సరే కాసేపటికే జిడ్డుగా అత్తుక్కుపోతుంది. రెండు చిరాకే ఇలాంటప్పుడు రసాయినాల జోలికి పోవడం కంటే హోం మేడ్ చిట్కాల వైపు వెళ్ళడం బెటర్ ఒక పెద్ద చెంచా ఆపిల్ సైడర్ వేనిగర్ తీసుకుని దానికి తగినన్ని నీళ్ళు కలిపి, తలకు రాసి పావుగంట ఆగి కడిగేస్తే చాలు. ఇంక తలస్నానం ఏ షాంపూ తో చేయనక్కరలేదు. గుడ్డులో తెల్ల సోన కుదుళ్ళ నుంచి పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేసినా జుట్టు చెక్కగా వుంటుంది. బాగా పండిన అరటి పండు గుజ్జు లాగా చేసి దానికి కాస్త ఓట్స్ పొడి కలిపి తలకు రాసుకుని అరగంట పాటు ఆరనిచ్చి తలస్నానం చేస్తే జుట్టు పట్టు లాగా మెరుస్తుంది. ఒక విటమిన్-ఇ మాత్రను బాదాం నూనెలో కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కాసేపాగి కడిగేస్తే పొడిపొడిగా సిల్క్ లాగా మెరుస్తుంది. మైల్డ్ షాంపూ ఎంచుకుంటే మేలు. ఘాడత వున్న షాంపూలు జుట్టును పొడి చేస్తాయి.

    వేసవికి ఈ జాగ్రత్తలు తప్పని సరి

    వేసవి ఎండకు ముందుగా ఎఫెక్ట్ అయ్యేది జుట్టే ఎండలో పిచు లాగా అయిపోతుంది. లేదా చెమటకి తడిసి  తలస్నానం చేసినా సరే కాసేపటికే జిడ్డుగా అత్తుక్కుపోతుంది. రెండు…

  • చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని పదార్ధాల వాడకంతో చర్మం ఎప్పుడు తాజాగా కాంతి వంతంగా వుంటుంది. పిండి, తేనె, పెరుగు వంటి మిశ్రమం వంటికి పట్టించి నలుగు పెట్టుకుంటే చాలు చర్మం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే జుట్టు నిర్జీవంగా అనిపిస్తే కోడి గుడ్డు తెల్ల సోన, పుల్లటి పెరుగు, మందారకుల గుజ్జు కలిపి తలకు పట్టించి తల స్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులా అయిపోతుంది. అలాగే చేతులు కాళ్ళు మెత్తగా మెరిసిపోవాలంటే ముందుగా ఆర బకేట్ నీళ్ళల్లో రెండు చెంచాల షాంపూ వేసి పదాలు అందులో వుంచాలి. ఆ తర్వాత ఫ్యుమిక్ రాయి తో రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు పోతాయి. అదయ్యాక చెక్కర, సెనగ పిండి, పాలు, తేనె మిశ్రమాన్ని పాదాలకు పట్టించి ఆరాక కడిగేస్తే పదాలు మృదువుగా మెరిసిపోతూ కనిపిస్తాయి. చేతులకు కూడా ఇదే పూత పుయచ్చు.

    జీవిత కాలపు శ్రద్ధ కావాలి

    చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని…

  • స్క్రీన్ పైన దేవకన్యల్లా వుండే హీరోయిన్సే అంత అందంగా వుండేందుకు ఏం తింటారు? అందం కోసం ఏ జ్యగ్రత్తలు తీసుకుంటారో అందరికి కుతూహలమే. ఇవన్నీ మాములు అమ్మాయిలు కూడా చేయొచ్చు ఓపిక ఉంటే. బాలీవుడ్ స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ ప్రతి రోజు ఫేషి యల్, అలాగే ప్రతి రాత్రి క్లెంసింగ్, టోనింగ్, మాయిశ్చురైజింగ్ వంటికి తప్పకుండా చేయించుకుంటుంది. నెలకో సారి జుట్టుకు స్విట్ ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె, షికాయా కలిపి పట్టించి శిరోజాలు ఆరోగ్యంగా వుండేలా చూసుకుంటుంది. సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్ళదు. కెమికల్స్ కలిసిన ఉత్పత్తులు, ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కు దూరంగా వుంటుంది. పాలను యాస్ట్రీంజెంట్ గా వాడుతుంది. సున్ని పిండి పెరుగు ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. ప్రతి రోజు రెండు గంటలకొ సారి కొబ్బరి నీళ్ళు తాగుతుంది. ఐడు సార్లు లైట్ మీల్స్, బ్రేక్ ఫాస్ట్ లో మూడు ఎగ్గ్ వైట్స్, తృణ ధాన్యాలతో చేసే ఫారిద్జ్ లంచ్ లో బ్రౌన్ రైస్, కూరగాయాలు, పప్పు, పెరుగు తో భోజనం చేస్తుంది. చికెన్,ఎగ్స్ చేపలు, వెజిటేబుల్స్, చపాతీ భోజనం లో ఉండేలా చూస్తుంది. ఎప్పడు వీలైతే అప్పుడు నట్స్ తింటుంది.

    అందాల రహస్యం వీటి తోనే

    స్క్రీన్ పైన దేవకన్యల్లా వుండే హీరోయిన్సే అంత అందంగా వుండేందుకు ఏం తింటారు? అందం కోసం ఏ జ్యగ్రత్తలు తీసుకుంటారో అందరికి కుతూహలమే. ఇవన్నీ మాములు అమ్మాయిలు…

  • పచ్చడి, మురబ్బా, క్యాండీ పలు రూపాల్లో తీసుకున్నా ఉసిరి చేసే మేలు ఇంకే పండు చేయదు అనుకోవచ్చు. విటమిన్-సి నిల్వలు పుష్కలంగా వున్న ఉసిరి కాయ నేరుగా తినేసినా మంచిదే. డై ఆమ్లా క్యాండీలు వున్నాయి. గొంతు మంట జలుబు వుంటే రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి, 2 టీ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది. పరగడుపున ఉసిరి రసం పుక్కిలి పడితే నోట్లోనుంచి వచ్చే పండ్ల నుంచి ఉపసమనం. ఆర్రైటిస్ వంటి కీళ్ళనొప్పుల నివారణకు ఉసిరి మంచిదే. బరువు తగ్గడం, జీర్ణ శక్తి పెంచడం ఉసిరి వల్ల సాధ్యం. దీని లో వుండే ఔషద గుణాల వల్ల ఇది సహజ స్థిరమైన కండీషనర్. ఉసిరి నూనె రెగ్యులర్ గా వాడితే జుట్టు తెల్ల బడటం తగ్గిస్తుంది. ఆరోగ్యవంతమైన కేశ సంపదను అందిస్తుంది. జుట్టు కుదుళ్ళకు బలాన్ని ఇస్తుంది. ఉసిరిని ఆహారంలో తీసుకుంటే చర్మానికి మంచి రంగోస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. బ్లడ్ షుగర్ అదుపులో వుంటుంది.

    కేశ రక్షణకు ఉసిరి

    పచ్చడి, మురబ్బా, క్యాండీ పలు రూపాల్లో తీసుకున్నా ఉసిరి చేసే మేలు ఇంకే పండు చేయదు అనుకోవచ్చు. విటమిన్-సి నిల్వలు పుష్కలంగా వున్న ఉసిరి కాయ నేరుగా…

  • వేసవి వచ్చిందంటే కాటన్స్ కోసం చుస్తారందరూ. శరీరానికి సౌఖ్యం గా వుండాలి. ఫ్యాషన్ గా వుండాలి. వర్క్ ప్లేస్ కు అనుకూలం గావుండాలి. ఈ విషయంలో ఫ్యాషన్ డిజైనర్లు ఏమంటారంటే వట్టి నూలురకాలే అక్కర్లేదు, లెనిన్, ఖాది, మల్ మల్ వంటి రకాలు ఎంచుకొవచ్చు అంటారు. వస్త్రం ఏదైనా డిజైన్స్ కూడా అందం తేవాలి. క్రాప్ టాప్ లు టీ షర్టులు, పలాజో, అనార్కలి మంచి పూల డిజైన్ ల తో వేసవి అనుకూలంగానే వుంటాయి. టాప్స్ అయిన, లేయర్స్ తరహ అయిన పలుచగా పొదలు పొదలు కుట్టేసినవె తీసుకోవాలి. అలాగే క్రేప్ టాప్, అనార్కలి, లాంగ్ గౌన్ ఎలాంటిదైన ఒక ఆర్గేంజా క్రేప్ టప్ను ఎంచుకొండి. ఆఫీస్ కు లేదా ఏదైనా ప్రోఫెషనల్ లుక్ కోసం బ్లేజరే వేసుకోవాలి. ఈ కాలంలో లెదర్ కష్టం కనుక కాలం కూడా ఇకత్ వంటి చేనేత రకాల తో రూపొందించిన జాకెట్లు, బ్లిజర్లు ప్రత్యామ్నాయంగా ఎంచుకోండి. ముదురు రంగులు కాస్త పక్కన పెట్టి తెలుపు, గులబీ, పసుపు, ఉదా, లేత నిలం లేదా నీలి రంగు వస్త్ర శ్రేణి ఎండ వేళల చెక్కగా అనిపిస్తాయి.

    వేసవి కి ఇలా ఎంచుకోవచ్చు

    వేసవి వచ్చిందంటే కాటన్స్ కోసం చుస్తారందరూ. శరీరానికి సౌఖ్యం గా వుండాలి. ఫ్యాషన్ గా వుండాలి. వర్క్ ప్లేస్ కు అనుకూలం గావుండాలి. ఈ విషయంలో ఫ్యాషన్…

  • చుండ్రు బాధ పెడుతుంటే తులసి నూనె లోకి లావెండర్, రోజ్ మేరి ఆయిల్ కలుపుకుని మాడుకు మసాజ్ చేయాలి. అప్పుడు తలపైన రక్త ప్రసరణ సరిగా జరిగి చుండ్రు తగ్గిపోతుంది. టీ ట్రీ ఆయిల్ ను రాత్రి పడుకునే ముందర మాడుకు రాస్తే చుండ్రు సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ నూనెలో జోజోబా ఆయిల్ కలిపి రాసుకున్న చెక్కని ఫలితం వుంటుంది. కొబ్బరి నూనెను కాస్త వెచ్చ చేసి అందులో నిమ్మరసం కలిపి తలకు పట్టించుకోవాలి. ఇలా వారంలో మూడు రోజులు చేస్తే చుండ్రు బెడద పోతుంది. మెంతుల్లో ప్రోటీన్లు, ఎమినో ఆసిడ్స్ అధికంగా వుంటాయి. కానీ మెంతులు నానానిచ్చి మెత్తగా రుబ్బి తలకు పెట్టుకున్న ఫలితం వుంటుంది. నిమ్మ ఆకులు, నీళ్ళు లో నాన నిచ్చి ఆ నీళ్ళతో సహా మెత్తగా గ్రఇండ్ చేసి, ఆ పేస్టు తలకు పట్టించిన చుండ్రు పోయింది. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కాసేపు ఎండలో నిలబడితే ఆ సూర్య కిరణాల వేడి కూడా జుట్టుకు మేలు చేస్తుంది. తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటూ వుంటే ఈ పోషకాలు కూడా జుట్టుకు మేలు చేస్తాయి.

    ఇలా చుండ్రు వదిలించుకోవచ్చు

    చుండ్రు బాధ పెడుతుంటే తులసి నూనె లోకి లావెండర్, రోజ్ మేరి ఆయిల్ కలుపుకుని మాడుకు మసాజ్ చేయాలి. అప్పుడు తలపైన రక్త ప్రసరణ సరిగా జరిగి…

  • ఎన్ని నగలున్నా అరవంకి అందమే వేరు. ఉత్తరాదిన అవి పట్టిలు మాదిరిగా కనిపిస్తే ఇటు దక్షిణాదిన కాస్త వంపు తిరుగి అర్ధ చంద్రాకారంలోకి మారి అరవంకి పేరు సార్ధకం చేసుకోంది. లంగా పరికిణీ లో నిండుగా కైపించే అమ్మాయిల చేతికి కెంపులు, పచ్చలు, వజ్రాలు, అన్కట్ వజ్రాలు, రత్నాలు పొదిగిన కుందన్, ఖాదీ మీనాకారి, పోల్కి టెంపుల్, యాంటిక్ పని తనం తో బాబుబంద్ డిజైన్లు ఎంతో బాగుంటాయి. నెమలి పూరి విప్పినట్లుబుజాలకు చుట్టేస్తున్నారు. వీటినే యుర్ధ ఆభరణాలుగా పూర్వం మోగల్లు పెట్టుకునే వాళ్ళు. అది కాస్త స్త్రీల నాగగా మారిపోయింది. పాత తరం వాంకి కాస్త కొత్త తరం బాజుబంద్ డిజైన్ గా మరి పోయింది.

    పేరు మార్చుకున్న అరవంకి

    ఎన్ని నగలున్నా అరవంకి అందమే వేరు. ఉత్తరాదిన అవి పట్టిలు మాదిరిగా కనిపిస్తే ఇటు దక్షిణాదిన కాస్త వంపు తిరుగి అర్ధ చంద్రాకారంలోకి మారి అరవంకి పేరు…

  • ముత్యాల హారాల నగనే తెల్లని గుండ్రని మంచి ముత్యాలు అనుకుంటాము కానీ అక్కడక్కడా నొక్కుకుపోయిన ముత్యాలను పూల గుత్తిగా గుచ్చుతు వాటిని యాంటిక్ టెంపుల్ డిజైన్ లాగా తాయారు చేస్తున్నారు. టెంపుల్ జ్యువలరీ డిజైన్స్ విత్ పెరల్స్ చుస్తే అస్సలు ముత్యాల తో ఇన్ని రకాల నగలున్నాయా అనిపిస్తుంది. రత్నాలు కెంపులు కలిపేసి పెద్ద పెద్ద పెండెంట్లతో గుత్తులకొద్ది ముత్యాల తో హారాలు నెక్లెస్లు వున్నాయి. పచ్చలు కెంపులు, ముత్యాల రత్నాలు నొక్కుకునట్లు చిన్న సైజులో గుత్తుల్లా వుంది దానికి టెంపుల్ డిజైన్ పెండెంట్లు తగిలిస్తే ఇంకో కొత్త పరంపర మొదలైనట్ట్ల్ వుంది. పెళ్లి వేడుకల కోసం ఇలాంటిహారాలు ఒక్కసారి చూడండి. గుత్తు పూసల ముత్యాల హారాలు భలే వున్నాయి.

    టెంపుల్ డిజైన్ల ముత్యాల హారం

    ముత్యాల హారాల నగనే తెల్లని గుండ్రని మంచి ముత్యాలు అనుకుంటాము కానీ అక్కడక్కడా నొక్కుకుపోయిన ముత్యాలను పూల గుత్తిగా గుచ్చుతు వాటిని యాంటిక్ టెంపుల్ డిజైన్ లాగా…

  • మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ మొటిమలు రాకుండా కాపాడుతాయి అంటున్నారు. బాగా పండిన బొప్పాయిలో చెక్కెర, పెరుగు కలిపి ముఖానికి రాసి మర్దనా చేస్తే మొటిమలు తగ్గుతాయి. నారింజ తొక్కల పొడి లో పలు కలిపి ముద్దలా చేసి ముఖానికి రాసి ఆరె దాకా వుంచి కడిగేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొహం కొత్త మెరుపు తో వుంటుంది. రెండు చెంచాల తేనె, ససిన్ని పాలు, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి దీన్నీ ఫేస్ మాస్క్ లా వేసి ఆరాక కడిగేయాలి. ఈ మాస్క్ రోజు మర్చి రోజు వేసుకుంటే మొటిమలు తగ్గడమే కాదు మచ్చలు పోతాయి. అరటి పండు పై తొక్కలలో ల్యుటిన్ అనే ఎంజైమ్ వుంటుంది. ఇది కొత్త కణాల అభివృద్ధి కి సహాయపడుతుంది. ముఖం పైన వలయాకారంలో అరటి తొక్కతో రుద్దితే ఫలితం వుంటుంది. చర్మం కూడా తాజాగా వుంటుంది.

    ఇంటి చిట్కాల తో ఈ సమస్యలు మాయం

    మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ…

  • ఐలైనర్ ను కళ్ళ ఇన్నర్ రిమ్స్ లో అప్లై చేస్తేనే కళ్ళు అందంగా వుంటాయి. ఈ ప్రోడక్ట్ ను ప్రోమోట్ చేసే సినీ తారలు ఇదే మాదిరి అప్లై చేస్తారు. ఇలా ఐ లైనర్ ను వాడటం కరక్టేనా, కళ్ళకేం ప్రాబ్లం కాదు కదా అని చాల మంది సందేహంలో పడుతుంటారు. ఎక్స్ పర్ట్స్ ఏం చెపుతారంటే పేరు పొందిన కంపెనీలు కళ్ళ పరిసర ప్రాంతాలకు సురక్షితమైన పరిక్షలు జరిపాకే, ఆ పదార్ధాల నాణ్యమైన బ్రాండ్ ఎంచుకోవాలి. ఆ ప్రోడక్ట్స్ కళ్ళ ఇన్నర్ రిమ్ వాడకానికి అనుమతించి వుందో లేదో చెక్ చేసుకోవాలి. కంటి ప్రాంతం చాలా సున్నితంగా వుండి ఇరిటేషన్ కు ఎర్రబాడటానికి లేదా ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు. ముఖ్యంగా ప్రొడక్ట్స్ లో ఉపయోగించిన పదార్ధం సూట్ అవ్వక పోయినా ఇలా జరుగుతుంది. వాడటానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. తేదీ దాటిన వాటిని పొరపాటున కూడా వదవద్దు.

    నాణ్యమైన బ్రాండ్ ఎంచుకోవాలి

    ఐలైనర్ ను కళ్ళ ఇన్నర్ రిమ్స్ లో అప్లై చేస్తేనే కళ్ళు అందంగా వుంటాయి. ఈ ప్రోడక్ట్ ను ప్రోమోట్ చేసే సినీ తారలు ఇదే మాదిరి…

  • బ్యూటీ విషయం లో యూత్ ఎప్పుడు రాజి పాడారు. చివరికి హెయిర్ కట్టింగ్ విషయం లోను కొత్త ట్రెండ్ వుండాల్సిందే. బాబ్ కటింగ్ నచ్చాలే కానీ స్టైల్ , సౌకర్యం, అందం, అన్ని దక్కుతాయి. లాంగ్ గా అయితే పొడవ్వైన కురులని కట్ చేసి అలా దువ్వి వదిలేయడం ఇవాల్టి ట్రెండ్. లాంగ్ అంటే లగ్జరి కొంచం వంపు తిప్పి ఎలాగైనా వదిలేసే వీలుంది. పొడవాటి జుట్టు ఫేవ్ కట్ స్టైల్ స్టేట్మెంట్. అలాగే ప్రింజెన్ చెక్కగా ఒత్తుగా బోల్డ్ గా కనిపించే కట్. నుదుటి పైన షార్ట్ గా కనిపిస్తూ ఈ రకం తక్షణ మేకప్ కు అనువైన స్టైల్. ఇక షార్ట్ అయితే చిట్టి పొట్టి కట్ వెరైటీ గా అందంగా వుంటుంది. ఈ స్కర్ట్స్ షార్ట్ కట్ చెక్కని రూపాన్ని ఇస్తుంది. మిడికట్ అయితే పొడవుగా పెంచుకోకుండా ఒత్తుగా వంకీలు తిప్పి మెడ చుట్టు పరుచుకునే వీలున్న మిడి కట్ చటుక్కున కళ్ళల్లో పడే అందాల కట్ ఇది. లేయర్స్ అయితే పొడవైన జుట్టు పొరలు పొరలుగా పరుచుకుంటే ముచ్చటగా ముంగురులు కురులు వుంటాయి. ఈ కటింగ్ కు లేయర్లు జత చేస్తే సిరోజాలంకరణకు తిరుగే లేదు.బ్యూటీ విషయం లో యూత్ ఎప్పుడు రాజి పాడారు. చివరికి హెయిర్ కట్టింగ్ విషయం లోను కొత్త ట్రెండ్ వుండాల్సిందే. బాబ్ కటింగ్ నచ్చాలే కానీ స్టైల్ , సౌకర్యం, అందం, అన్ని దక్కుతాయి. లాంగ్ గా అయితే పొడవ్వైన కురులని కట్ చేసి అలా దువ్వి వదిలేయడం ఇవాల్టి ట్రెండ్. లాంగ్ అంటే లగ్జరి కొంచం వంపు తిప్పి ఎలాగైనా వదిలేసే వీలుంది. పొడవాటి జుట్టు ఫేవ్ కట్ స్టైల్ స్టేట్మెంట్. అలాగే ప్రింజెన్ చెక్కగా ఒత్తుగా బోల్డ్ గా కనిపించే కట్. నుదుటి పైన షార్ట్ గా కనిపిస్తూ ఈ రకం తక్షణ మేకప్ కు అనువైన స్టైల్. ఇక షార్ట్ అయితే చిట్టి పొట్టి కట్ వెరైటీ గా అందంగా వుంటుంది. ఈ స్కర్ట్స్ షార్ట్ కట్ చెక్కని రూపాన్ని ఇస్తుంది. మిడికట్ అయితే పొడవుగా పెంచుకోకుండా ఒత్తుగా వంకీలు తిప్పి మెడ చుట్టు పరుచుకునే వీలున్న మిడి కట్ చటుక్కున కళ్ళల్లో పడే అందాల కట్ ఇది. లేయర్స్ అయితే పొడవైన జుట్టు పొరలు పొరలుగా పరుచుకుంటే ముచ్చటగా ముంగురులు కురులు వుంటాయి. ఈ కటింగ్ కు లేయర్లు జత చేస్తే సిరోజాలంకరణకు తిరుగే లేదు.

    రూపాన్ని మార్చేసే హెయిర్ కట్స్

    బ్యూటీ విషయం లో యూత్ ఎప్పుడు రాజి పాడారు. చివరికి హెయిర్ కట్టింగ్ విషయం లోను కొత్త ట్రెండ్ వుండాల్సిందే. బాబ్ కటింగ్ నచ్చాలే కానీ స్టైల్…

  • జీన్స్ ఎప్పుడు బాగుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు కాస్త సన్నగా వుండే జీన్స్ కంటే బెస్ట్ డ్రెస్ ఇంకొకటి లేదు. స్కిన్ని జీన్స్ బాగుంటాయి. బ్రైట్ కలర్స్ ఏవైనా సరే. అయితే నలుపు, డార్క్ ఇండిగో వేసుకుంటే కళ్ళు మరీ సన్నగా కనిపిస్తాయి. లైటర్ టోన్స్ చెక్కగా నప్పుతాయి. మోకాళ్ళ వద్ద ఫేడెడ్ గా, కాళ్ళ దగ్గర క్లావర్ గా వుండే జీన్స్ రకాలు అదనపు కర్వలు ఇవ్వడం తో ట్రెండో ఎఫెక్ట్ ఇస్తాయి. ప్లాప్ పాకెట్స్ ఏమ్బలిష్మేంట్ వాల్యూం పెంచుతుంది. కాంట్రాస్ట్ బెల్త్స్ నాజూకు హిప్స్ ను చూపెడతాయి. జీన్స్ పాప్యులర్ ఫ్యశిఒన్ ఐటెం, స్లిమ్ స్ట్రెయిట్ బూట్ కట్, యాంటి ఫిట్ బోలెడన్ని రకాలున్నాయి. ఈ అమెరికన్ కల్చర్ మన దగ్గరకు వచ్చేసి , పూర్తిగా క్యాజువల్ వేర్ అయ్యీ కూర్చుంది. జీన్స్ అన్ని రంగులు వుంటే వాటి పైన టీ షర్ట్స్ దగ్గర నుంచి అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ గా వేసుకో వచ్చు.

    జీన్స్ కి తిరుగే లేదు

    జీన్స్ ఎప్పుడు బాగుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు కాస్త సన్నగా వుండే జీన్స్ కంటే బెస్ట్ డ్రెస్ ఇంకొకటి లేదు. స్కిన్ని  జీన్స్ బాగుంటాయి. బ్రైట్ కలర్స్ ఏవైనా…

  • ఆకులు , పువ్వులు , మొగ్గలు ,తీగలు గాఢమైన రంగులతో కనిపించే కలంకారీ వస్త్రాలకు ఎప్పుడూ తిరుగులేదు. వేసవికి మళ్ళీ నేత చీరలు వాటిపైన కల్మాకారి ముద్రణలు కొలువు తీరతాయి. కానీ ఈ వస్త్రాలు దారాలు సహజ రంగులతోనే తయారవుతాయి. తెల్లని నూలును వివిధ పరిమాణాల్లో కత్తిరించి బాగా ఉతికి బ్లీచింగ్ చేస్తారు. దాన్ని ఆవు పేడలో నానపెడతారు. వస్త్రంలో ఉన్న జిగురు పోయాక దీనికి కరక్కాయ ద్రావణం అద్దుతారు. దాన్ని పాలలో కలిపినా నీళ్లతో ముంచితే ఆ వస్త్రం లేత పసుపు రంగులోకి మారి కలంకారీ అద్దడానికి తయారవుతుంది. రసాయనాలు ఉపయోగించకుండా చెట్ల వేర్లు ఆకులు పువ్వులతో సహజమైన రంగులు తయారుచేస్తారు. ఈ రంగులతో అద్దకం పనిచేస్తారు. కర్ర అచ్చులతో కావలిసిన డిజైన్ అద్ది దాన్ని అత్యంత వేడితో ఉడకనిస్తారు. చీరలు దుప్పట్లు సంచులు చేతి రుమాళ్ళు లుంగీలు టవల్స్ ఏవైన ఇలా తయారుచేసేవే . ఈ కలంకారీ వస్త్రాలకు విదేశాల్లో గొప్ప ఆదరణ వుంది. పచ్చని చిలుకలు అందమైన అమ్మయిలు హంసలు నెమళ్ళు రాజుగారి ఊరేగింపులు ఈ కలంకారీ కళకు ఎప్పటికీ మార్కెట్ వుంది .

    సహజ వర్ణాల కలంకారీ

    ఆకులు , పువ్వులు , మొగ్గలు ,తీగలు గాఢమైన రంగులతో కనిపించే కలంకారీ వస్త్రాలకు ఎప్పుడూ తిరుగులేదు. వేసవికి మళ్ళీ నేత చీరలు వాటిపైన కల్మాకారి ముద్రణలు…

  • వయసుకి తగ్గ దుస్తుల్లోనే ఎవరైనా అందంగా వుంటారు అంటుంటారు కానీ ఈ వయసుకి తగ్గ అన్న విషయం పక్కనపెట్టి ఎలాంటి దుస్తులైన హుందాగా వుండే విధంగా ఉంటే చక్కగా వుంటారు. చీరలు సల్వార్లు ప్యాంట్లు షర్టులు ఏవైనా కానీండి అభిరుచిని పట్టి ఎంచుకోవాలి. అవి ఎలాంటి వైనా బాడీ షేప్ ని గాక వ్యక్తిగత స్టయిల్ ను ప్రతిబింబించాలి . వాడే హ్యాండ్ బ్యాగ్స్ వంటి యాక్సిసరీస్ కూడా సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. వార్డ్ రోబ్ కు ఏ దుస్తుల్ని జత చేస్తున్నా విభిన్నతకు ప్రాధాన్యం ఇస్తూ సులువుగా మిక్స్ అండ్ మ్యాచ్ గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. పైగా వేసుకునే దుస్తులు ముందు సీజన్ కు మ్యాచ్ అవ్వాలి. మారే ఋతువుల్లో కొన్ని దుస్తులు కొన్ని వాతావరణాలు సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు మారిన ఎండ వేళ లో నల్లని డ్రెస్ అందంగా వుంది కదా అని వేసుకుంటే వేడికి మూడ్ ఆఫ్ అయిపోతుంది .

    ఏదైనా హుందాగా ఉండాలి

    వయసుకి తగ్గ దుస్తుల్లోనే ఎవరైనా అందంగా వుంటారు అంటుంటారు కానీ ఈ వయసుకి తగ్గ అన్న విషయం పక్కనపెట్టి ఎలాంటి దుస్తులైన హుందాగా వుండే విధంగా ఉంటే…

  • ఇంట్లో ఎక్కడ చూసినా రాలే వెంట్రుకలు కనబడి మనకు కష్టం కలిగిస్తే ముందు ఈ గృహా చికిత్సలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ వంటి గోరు వెచ్చని సహజ నూనెతో మాడు మసాజ్ చేసుకుని హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. మందార ఉసిరి మల్లె పువ్వులు కొబారినూనెలో వేసి కాచి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అప్లయ్ చేయటం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. రాత్రంతా మెంతులు నానబెట్టి రుబ్బు కొబ్బరి పాలతో కలిపి శిరోజాలకు అప్లయ్ చేయాలి. పెరుగులో ఎగ్ వైట్ కలిపి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. గోరువెచ్చని నూనెలో నిమ్మరసం వెనిగర్ కలిపి చివరి వాష్ గా వాడాలి. హెయిర్ వాష్ కు ముందు కొబ్బరి నూనె అప్లయ్ చేయాలి. హెయిర్ కేర్ స్టైలింగ్ ఉత్పత్తుల్ని హేతుబద్దంగా వాడాలి. హెయిర్ డ్రై లు రంగులు శిరోజాల స్క్రబ్బర్స్ కు హాని కలిగిస్తాయి. బ్లో డ్రయింగ్ రీ బాండింగ్ వంటి హీటింగ్ పద్ధతుల క్యూటికల్స్ ఓపెన్ అవటానికి జుట్టు చిట్లి పోవటానికి ప్రధాన కారణం అవుతాయి.

    ఈ గృహ చికిత్సల వల్ల మేలే

    ఇంట్లో ఎక్కడ చూసినా రాలే వెంట్రుకలు కనబడి మనకు కష్టం కలిగిస్తే ముందు ఈ గృహా చికిత్సలు  జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినూనె ఆలివ్ ఆయిల్ వంటి గోరు…

  • వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల ష్రిమ్కింగ్ మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్ వల్లనే పెదవులు తేమతో నిగనిగలాడతాయి. సూర్య కిరణాలు కూడా కొలాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంచేత ఎండలోకి వెళ్లేప్పుడు సన్ స్క్రీన్ లోషన్ పెదవులకు కూడా రాసుకోవాలి. పాతిక సంవత్సరాల వయస్సులో మూత్రాశయంలో ద్రవాన్ని ఎంతసేపైనా ఆపి ఉంచుకునే శక్తి ఉంటుంది. 65 సంవత్సరాలు వస్తే మూత్రాశయం ఆ శక్తి పోగొట్టుకుంటుంది . అంచేత బ్లాడర్ నియంత్రణను మెరుగు పరుచుకునేందుకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్ సైజులు సహకరిస్తాయి కనుక ముందునుంచే ఏ ఎక్సర్ సైజులు ప్రారంభించాలి . అలాగే వయసు తో పాటే సాగిపోయే చర్మం విషయంలో దెబ్బతినే పలువరస విషయంలో శ్రద్ధ తీసుకుని తీరాలి . రాబోయే వార్ధక్యాన్ని ఆపలేకపోవచ్చు . కానీ ఆరోగ్యంగా ఉంచుకునే పద్ధతులను విస్మరించవద్దు.

    వయస్సు తెచ్చే మార్పులు

    వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి . 30 ఏళ్ళు వచ్చేసరికి పెదాల  ష్రిమ్కింగ్  మొదలవుతుంది. ఎదిగే కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి తక్కువవుతుంది. కొలాజెన్…

  • రుతువులు మారిపోతూవుంటాయి. మారే కాలానికి శరీరం కూడా స్పందిస్తుంది. చర్మం పొడిగా అయిపోవటం, పగిలిపోవడం వేడి వాతావరణంలో పొక్కులు రావటం చెమటలు ఒకటేమిటి విసిగించే ప్రతి సమస్యకు సమాధానంగా ఎదో క్రీము ఎంచుకోవటం రాసుకోవటం. ఇలా చేస్తే సమస్య పోదంటున్నారు ఎక్స్ పెర్ట్స్. చల్లగా వుందని వేడినీళ్ళ స్నానం అస్సలు వద్దు. వేడి చర్మం లోని తేమను లాగేస్తుంది. గోరువెచ్చని నీరు ఎంచుకోవాలి. చర్మం పొడిగా అయి చేత్తో గీస్తే తెల్లని గీతాలు కనిపిస్తూ చిరాకేస్తే మాయిశ్చరైజర్ పులిమేస్తే ప్రయోజనం ఉండదు.స్నానం చేసిన వెంటనే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయాలి. పొడిబారే సమస్య అప్పుడు అదుపులో ఉంటుంది. అవసరానికి మించి స్క్రబ్ వాడకూడదు . రెండు స్పూన్ల చక్కర లో కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకుని పది నిముషాల తర్వాత కడిగేయాలి. సబ్బులోని రసాయనాలు చర్మం దెబ్బతినేందుకు కారణం కావచ్చు. చర్మ తత్వానికి సరిపోయే ఫెస్ వాష్ ఎంచుకుని వాడుకోవాలి. సమస్యను అసలైన కారణం తెలుసుకుని పరిష్కారం కోసం చుస్తే ప్రయోజనం ఉంటుంది.

    ఎదో ఒకటి వాడితే ఎలా ?

    రుతువులు మారిపోతూవుంటాయి. మారే కాలానికి శరీరం కూడా స్పందిస్తుంది. చర్మం పొడిగా అయిపోవటం, పగిలిపోవడం వేడి వాతావరణంలో పొక్కులు రావటం చెమటలు ఒకటేమిటి విసిగించే ప్రతి సమస్యకు…

  • అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే వస్తుంది విటమిన్ ఇ. దీన్ని ఆహారంగానూ తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ ఋతువులోనైనా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటివారు విటమిన్ ఇ అండ్ పదార్ధాలు రోజూ తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలు చర్మానికి అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇది మాత్రలు రూపంలోనూ దొరుకుతుంది. ఏ విటమిన్ తో చర్మంలో సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే కాస్త విటమిన్ ఇ నూనె వంటివి పెటిట్ఞ్చి మర్దనా చేయాలి. ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మం పొడిబారే సమస్య తగ్గి మృదువుగా మారుతుంది. ముఖ్యంగా కళ్ళ అడుగున మడతలు నలుపుదనం కూడా తగ్గుతుంది. మొటిమలు తగ్గినా వాటితాలూకు మచ్చలు మిగిలుంటే విటమిన్ ఇ నూనె చక్కగా పనిచేస్తుంది. రాత్రిళ్ళు పడుకునేముందర ఆ నూనె రాసుకుని మర్నాడు కడిగేస్తే మురికిపోయి మొహం చక్కగా ఉంటుంది. ఎండ ప్రభావం పడకుండా ఉండేందుకు కూడా ఈ నూనె బాగా పనిచేస్తుంది.

    విటమిన్ ఇ తో యవ్వనవంతమైన చర్మం

    అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే  వస్తుంది విటమిన్ ఇ. దీన్ని  ఆహారంగానూ  తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ…