• ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ నీళ్లు తేనె కలిపి పెదాలను రాసుకుని గంట తర్వాత దూదితో తుడిచేస్తూ ఉంటే ఈ పగుళ్లు పోతాయి . రాత్రి వేళ పడుకునే ముందర తేనె రాసుకున్న ప్రయోజనం ఉంటుంది. పొడి బారిన పెదవులకు ఇది మంచి మందు. అలాగే నెయ్యి రాసుకున్న ఫలితం ఉంటుంది. వేడి నీళ్లల్లో గ్రీన్ టీ బ్యాగ్ పడేసి తీసి దానితో పగుళ్లు వచ్చిన పెదవుల పైన రాసుకున్న నొక్కిపెట్టి ఆ రసం పగుళ్ళకు తగిలేలా చేసినా మంచిది. ఈ టీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ పగిలిన పెదవులకు మేలు చేస్తాయి. కీరా దోస ముక్కల్ని గుజ్జుగా చేసి రసం తీసి అందులో దూది ముంచి పెదాలపై వుంచినా మంచి ఫలితం ఉంటుంది. పెదవుల పై చర్మ పొలుసులుగా ఎండిపోతే బేబీ బ్రెష్ తో సున్నితంగా రుద్దేసి ఆలివ్ నూనె తో చక్కెర కలిపి ఐదు నిమిషాల పాటు పెదవులపై మర్దనా చేసి తర్వాత లిప్ బామ్ రాసుకుంటే పెదవులు చక్కగా ఉంటాయి. గులాబీ రేకుల్ని పాలల్లో నానబెట్టి మెత్తగా నూరి పెదవులకు రాసుకున్న పెట్రోలియం జెల్లీ రాసిన పగుళ్లు చాలా వేగంగా తగ్గిపోతాయి.

    ఇలా చేస్తే పెదవులు గులాబీ రేకుల్లావుంటాయి

    ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ…

  • ఎంగేజ్మెంట్ పెళ్లి లేదా గ్రాండ్ అకేషన్లకు అన్నింటికీ ఇప్పుడు అమ్మయిలు సెలెక్ట్ చేసుకునేది లెహెంగానే. చివరకు పెళ్లికూతుళ్ల డ్రెస్ లో మెహేందీ ఫంక్షన్స్ లో కూడా ఏ డిజైనర్ లెహెంగాలే ఫ్యాషన్ అయిపోయాయి. నెటెడ్ సిల్క్ లెహెంగా అయితే ఫ్యాబ్రిక్ దుపట్టా మ్యాచ్ అవుతాయి. లంగా కంటే విశాలమైన కుచ్చిళ్ళతో పాదాల కింద దాకా వచ్చే లెహెంగా డబుల్ కల్చర్ తో అంచు పూర్తిగా కాంట్రాస్ట్ గా కానీ లేదా మల్టీ కలర్ తో గానీ ఉంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఇక పూర్తి ఎంబ్రాయిడరీ తో గాఢమైన రంగులతో లెహెంగా ఉంటె అందమే అందం. నెట్ ఫంక్షన్స్ లో చందమామ కనిపించాలంటే తెల్లని లెహెంగా కు వెండి రంగు అంచు అదే కలర్ బ్లౌజ్ దుపట్టా అయితే రిచ్ లుక్ లో మెరిసిపోవటం ఖాయం. ఏదైనా ప్రత్యేకంగా కనిపించాలంటే డిజైనర్లు కూడా లెహెంగా వైపే చూపిస్తున్నారు.

    గ్రాండ్ ఫంక్షన్లకు లెహెంగా అందం

    ఎంగేజ్మెంట్ పెళ్లి లేదా గ్రాండ్ అకేషన్లకు అన్నింటికీ ఇప్పుడు అమ్మయిలు సెలెక్ట్ చేసుకునేది లెహెంగానే. చివరకు పెళ్లికూతుళ్ల డ్రెస్ లో మెహేందీ  ఫంక్షన్స్ లో కూడా ఏ…

  • ఇప్పుడు సిల్క్ దారాలతో వస్తున్నా గాజులు చెవి రింగులు హారాలు పెద్ద ఫ్యాషన్. అసలివి ఇళ్లల్లో చేసుకునే విధంగా పెరల్స్ తో చేసిన చెయిన్లు స్టోన్ చెయిన్లు మీటర్ల లెక్కన దొరుకుతాయి. అలాగే ఫ్లవర్ బీడ్స్ మల్టీ కలర్ పట్టు దారాలు దొరుకుతున్నాయి. సంప్రదాయ వస్త్రాలంకరణ లో భాగంగా ఇప్పుడు సిల్క్ గాజులు ఫ్యాషన్. అందమైన గాజులు కర్ణాభరణాలు హారాలు పూర్తి మ్యాచింగ్ కిట్స్ లో కూడా దొరుకుతున్నాయి. ప్లాస్టిక్ మెటల్ వెడల్పాటి గాజుకు సిల్క్ దారాన్ని నైపుణ్యంతో చుట్టేసి ఆ దారం చుట్టిన గాజుకు అందమైన పూసలు స్టోన్ పీసెస్ అంటించటం అయితే ఇవి నైపుణ్యం వున్న చేతుల్లోనే తయారైతేనే బావుంటాయి. సంప్రదాయ ఫంక్షన్లు కోలాటం లాంటి ఆటలు సంక్రాంతి బతుకమ్మ పండుగల సందర్భంలో ఆడపిల్లలు రంగుల దుస్తులు ధరించి ఈ పట్టు గాజులు నగలు వేసుకుంటే వేసుకున్న దుస్తులకు సరైన మ్యాచింగ్ గా ఉంటాయి. ముత్యాలు మెరిసే పూసలు పట్టు దారాల అల్లికతో సిల్క్ గాజులు కొన్ని వాండ్ల రకాలు ఆన్ లైన్ లో కనువిందుగా చూడచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలు కూడా వున్నాయి. ముత్యాల వరసలు స్టోన్ టెయిన్లు తెచ్చుకుని మనమే గాజులకు అతికించుకోవచ్చు.

    పట్టు దారాలతో ఆభరణాలు

    ఇప్పుడు సిల్క్ దారాలతో వస్తున్నా గాజులు చెవి రింగులు హారాలు పెద్ద ఫ్యాషన్. అసలివి ఇళ్లల్లో చేసుకునే విధంగా పెరల్స్ తో చేసిన చెయిన్లు స్టోన్ చెయిన్లు…

  • షరార డ్రెస్ పాత సినిమాల ట్రెండ్. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే డ్రెస్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. పెళ్లి కూతుళ్ళు, యువతులు ఈ ఫ్యాషన్ అవుట్ ఫిట్ వైపు ఇష్టంగా చూస్తున్నారు. స్పెషల్ గా, ట్రెండీగా ఈవెంట్స్ లో ధరిస్తే స్పెషల్ ఎట్రాక్షన్ గా వుండటంలో ఇది పాతకాలపు డ్రెస్ అన్న పదం పక్కన పెట్టి ఇందులో వస్త్ర శ్రేణిని మాత్రం మార్చిపారేసి కొత్త లుక్ తీసుకొస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. చూసేందుకు ట్రౌజర్ ల కనిపిస్తుంది బాటమ్ డిఫరెంట్ గా పరికిణీలా లూజుగా బావుంటుంది. ప్రెట్టీ లుక్ తో స్లిమ్ గా కనిపించటం ఖాయం. ఇవి చోళీ, కుర్తాలతో కలపీ బావుంటాయి. బ్లవుజ్, బాటమ్ కలిపినా ఫ్యాషన్. ఎక్కువ ఎంబ్రాయిడరీ పనితనం లేకుండా, లేత రంగుల్లో చక్కని గ్రాండ్ లుక్ తో పెళ్లి వేడుకలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో అమ్మాయిలు ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. అందుకే ఏనాడో పాత కాలపు ఫ్యాషన్ మళ్ళీ ఇవాల్టి యూత్ ఫ్యాషన్ అయింది.

    మళ్ళీ ఫ్యాషన్ ట్రెండ్ షరారే !

    షరార డ్రెస్ పాత సినిమాల ట్రెండ్. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే డ్రెస్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. పెళ్లి కూతుళ్ళు, యువతులు ఈ ఫ్యాషన్ అవుట్…

  • ఇవ్వాళ చీర అందం మొత్తం బ్లవుజ్ డిజైన్ పై ఆధారపడి వుందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ డిజైనర్స్ అది ఎంత అందమైన బ్లవుజ్ అయినా మెడ ఆకృతిని బట్టి డిజైన్ ఎంపిక చేసుకోవాలంటున్నారు. మెడ సన్నగా పొడవుగా ఉంటే రౌండ్ నెక్. మెడ పొట్టిగా, లావుగా ఉంటే డీప్ నెక్, బ్రాడ్ నెక్, ఫాట్ నెక్, బ్యాక్ ఓపన్ డోరీ డిజైన్స్, భుజాలు వెడల్పుగా వుంటే కాలర్, హై, రౌండ్, బోట్ నెక్ ఆకారాల్లో బావుంటాయని సూచిస్తున్నారు. కానీ మనo వెళ్ళే వేడుకను బట్టి కూడా బ్లవుజ్ డిజైన్స్ ఎంపిక చేసుకోవలంటారు. సంగీత్ వంటి వేడుకల కయితే హై నెక్, ఇన్ లైన్ కబ్ బ్లవుజులు బావుంటాయని చెపుతున్నారు. గెట్ టు గెదర్ కార్యక్రమాలకయితే రౌండ్ నెక్ లేదా అధికారిక కార్యక్రమాలు, ఆఫీస్ ప్రోగ్రామ్స్ కు కాలర్ నెక్ లు, ఇక పెళ్ళిళ్ళు, సంప్రదాయ వేడుకలకయితే క్లోజ్డ్ నెక్, రౌండ్ నెక్ ఎంచుకోమంటున్నారు. ఇక లేహంగాల పైకి చైనీస్ కాలర్ నెక్, పాట్లీ బటన్, కీ హాల్ డిజైన్స్ తో అతుకినట్లు కుట్టించుకొంటే ఇక లెహంగా అందమంతా కనిపిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.

    మెడ ఆకృతిని బట్టే డిజైన్స్

    ఇవ్వాళ చీర అందం మొత్తం బ్లవుజ్ డిజైన్ పై ఆధారపడి వుందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ డిజైనర్స్ అది ఎంత అందమైన బ్లవుజ్ అయినా మెడ…

  • పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా చేతులు, మొహం, కాళ్ళు కడుక్కొంటాం. నిపుణులు ఏం చెబుతున్నారంటే ముందస్తుగా చేతులు కడుక్కోండి. చేతులు శుభ్రంగా లేకపోతే ఆ చేతులకున్న బాక్టీరియా, ఇతర క్రిములు చర్మం లోకి వెళ్ళిపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. మేకప్ వేసుకొని వుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోన్నకే ముఖం కడుక్కోవాలి. మేకప్ ను క్లెన్సర్ తో తొలగించుకొని ఫేస్ వాష్ తో కడగాలి. ముఖం కడుక్కోనేందుకు వేడి నీళ్ళు వాడకూడదు. చర్మం పొడిబారిపోతుంది. ముఖానికి చన్నీళ్ళు వాడాలి. చలికాలంలో చర్మం అతిగా రుద్ది కడిగేయోద్దు. పొడిబారిన చర్మాన్ని స్క్రబ్ లు ఇబ్బంది పెడతాయి. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ వాడవచ్చు. పొడిచర్మం ఉన్నవాళ్ళు మొహానికి కడుక్కున్న వెంటనే మాయిశ్చరైజర్ కాస్త కొబ్బరినూనె అప్లయ్ చేయాలి లేదంటే మొహం ఇంకా పొడిగా అయిపొయింది.

    మొహం అస్తమానం కడిగినా నష్టమే

    పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా…

  • జుట్టు వుంటే ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ వుండాలే కానీ సంప్రదాయ పద్ధతుల్లో ఇంట్లోనే కురుల అందాలకు మెరుగులు దిద్దుకోవచ్చు. ఒకవంతు నిమ్మరసం రెండు వంతుల కొబ్బరినూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు తెగిపోవటం రాలిపోవడం తగ్గిపోతాయి. మెంతులు నానబెట్టి తెల్లరాక మెత్తగా రుబ్బి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు దురద సమస్యలు కూడా పోయి జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది. గుడ్డు తెల్ల సొనలు తగినంత పెరుగు కలిపి కుదుళ్లకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది. వేపాకులు నీళ్లలో మరిగించి ఆ నీళ్లతో స్నానం చేయటం మంచిదే. వారంలో మూడు రోజులు కొబ్బరి ఆలివ్ నూనెలతో తలకు మస్సాజ్ చేసుకుని తలస్నానం చేస్తే పట్టులాంటి జుట్టు సొంతం చేసుకోవచ్చు .

    కురుల అందం కోసం

    జుట్టు వుంటే  ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ  వుండాలే కానీ సంప్రదాయ…

  • పెళ్లి ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తే డ్రెస్ లు డిజైన్ చేయించుకోవటం దానికి జ్యూవెలరీ ఏం బావుంటుందో చూసుకోవటం ఇవన్నీ అమ్మాయిలు ఒక్కటీ వదలరు . ప్రత్యేకంగా అన్నీ ఉండాలి. ప్రత్యేకంగా కనిపించాలి. మరిన్ని స్పెషల్ గా ఉంటె చెప్పులు మాత్రం ప్రత్యేకంగా ఉండద్దా !! అందుకే ఈ వెడ్డింగ్ షూస్ ఐడియాస్ యాప్. ఇందులో ఎన్నో చెప్పుల వరసలు డిసప్లే వుంది. కానీ ఇందులో ఓ ప్రత్యేకత వుంది. ఏ ముచ్చటైన డిజైన్లతో రౌండ్ టో వెడ్డింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్ బాలే పంప్స్ ఇలా బోలెడన్ని రకాలున్నాయి కదా. అయితే వీటిలో ఎదో ఒకటి ఎంచుకునే పనిలేదు. అందమైన రంగుల్లో అందుమీద మెరిసే రాళ్లు జర్దోసీలు లేస్ లు ఇవన్నింటిలో డిజైన్ చేసిన చెప్పుల్ని హీల్ ఇంకాస్త పెద్దదిగా ఉండాలంటే ఫలానా డిజైనర్ చెప్పులు ఫ్లాట్ గా వుండాలనో లేదా ఫలానా రకం రాళ్ళుఉంటే చీరకు మ్యాచవుతుందనో మన ఇష్టాలు చెపితే అలా తయారై వస్తాయి. వున్నవాటి గురించిన సమాచారం ఇచ్చారు.ఏవీ నచ్చకపోతే మన సొంత డిజైన్ చెప్పేస్తే సరి!!

    వాళ్ళ ఫ్యాషన్ కు అణా ఐడియా జోడిస్తారు

    పెళ్లి ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తే డ్రెస్ లు డిజైన్ చేయించుకోవటం దానికి జ్యూవెలరీ ఏం బావుంటుందో చూసుకోవటం ఇవన్నీ  అమ్మాయిలు ఒక్కటీ వదలరు . ప్రత్యేకంగా…

  • రంగు అంగులా రాళ్లను బంగారంతో కలిపి నగలు చేస్తే మెరుస్తూ అందంగా ఉంటాయి. కానీ రాళ్లకు బంగారు నగల్లో పొదిగినట్లు కాకుండా లేదా బంగారంతో చేసిన నగరంగా కాకుండా ఒకదాని పక్కన ఒకటి పేర్చి అతికించినట్లు కనిపించేలా చేస్తే ఇంకెంత మెరుపులతో ప్రకాశిస్తాయి. నగలకోసం వాడిన లోహం అంటే బంగారం లేదా ప్లాటినం అస్సలు కనిపించకుండా రాయిపక్కన రాయిచేర్చినట్లుగా ఒక్క వజ్రాల నగల్లో కనిపిస్తుంది. అవి ఖరీదు ఎక్కువ అందరికీ అందుబాటులో ఉండవు. అందుకే వజ్రాలను పోలివుండే చౌక రకం రాక్ క్రిస్టల్స్ గాజు రాళ్లతో దొరికే సిట్రాన్ ఏజెడ్ బ్లడ్ స్టోన్ జన్ఫర్ లాంటివి పెరిడాట్ అపిటైట్ టూపాజ్ వంటి రత్నాలు కలిపి ఏ లోహం కనిపించకుండా రాయి పక్కన రాయి కనిపించేలా చక్కని అందమైన నగలు రూపొందిస్తున్నారు. వీటిని పేస్ట్ జ్యూవెలరీ అంటారు. అలా ఒక్క రాయిని అతికించి చేసేందుకు చాలా సమయం పడుతుంది. మొత్తం మీద అడుగున ఉన్న లోహం పెద్దగా కనిపించకుండా మూడు వైపులా రాయి మొత్తం కనిపించేలా చేయటం ఈ పేస్ట్ జ్యూవెలరీ గొప్పతనం బంగారు నగలకు బదులు వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ ఎలాగో ఖరీదైన వజ్రాలూ రత్నాల నగలకు ఇవి నా కళ్ళన్నమాట.

    వజ్రాలు రత్నాలకు ఇవి నా కళ్ళు

    రంగు అంగులా రాళ్లను బంగారంతో కలిపి నగలు చేస్తే మెరుస్తూ అందంగా ఉంటాయి. కానీ రాళ్లకు బంగారు నగల్లో పొదిగినట్లు  కాకుండా లేదా బంగారంతో చేసిన నగరంగా…

  • మేకప్ చేసుకోవటం అంటే ఉన్న అందాన్ని రెట్టింపు చేసే పద్దతి. కొన్ని విషయాల్లో ఇది అనవసరంగా చేశారనిపిస్తుంది. ఉదాహరణకు పెదవులకు స్కిన్ షేప్ కు సరిగ్గా పనికొచ్చే లిప్ స్టిక్ వల్ల ఇంకా నష్టం జరిగినదనిపిస్తుంది. చలికే కావచ్చు. వాతావరణానికి పగిలి పెదవుల్లో మృతకణాలు పేరుకుపోతాయి. దాంతో లిప్ స్టిక్ వేసుకున్నా పెదవులు పొడిబారి ఎండిపోయి కనిపిస్తాయి. ఈ సమస్య ఎదురైతే టూత్ పేస్ట్ లో చక్కెర కలిపి పెదవుల పై రుద్దుకుని కాస్సేపయ్యాక కడిగేస్తే పోతాయి. లిప్ గ్లాస్ ను రాసుకున్న వెంటనే లిప్ స్టిక్ వేసుకుంటే పెదవులు మెరుస్తునట్లుంటాయి, ఒక్క సందర్భంలో అది కొంచెం సేపయ్యాక మెరుపు ఆరిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే అలంకరణకు ముందే లిప్ గ్లాస్ రాసుకుంటే మేకప్ పూర్తయ్యేసరికి లిప్ గ్లాస్ పెదవులకు తేమగా , మాత్రం వుంచి అదనంగా ఉన్నది ఆరిపోయింది. అప్పుడు లిప్ స్టిక్ వేసుకుంటే చాలా సేపు బావుంటుంది. వేసుకున్న లిప్ స్టిక్ ఎక్కువ గంటలు అలాగే కనిపించాలంటే పెదవుల పై టిస్యూ పేపర్ ఉంచి దానిపై కొద్దిగా పౌడర్ చల్లితే అదనంగా ఉన్న రంగు టిస్యూ పేపర్ కి అంటుతుంది. ఇలా చేస్తే పెదవులు చాలా సేపు తాజాగా కనిపిస్తాయి. పెదవులు చిన్నవిగా ఉంటె ముదురు రంగులు నిండుగా లావుగా ఉంటె లేత భయాలూ వాడితే బావుంటుంది.

    లిప్ స్టిక్ వేసే ముందర ఇలా చేస్తే

    మేకప్ చేసుకోవటం అంటే ఉన్న అందాన్ని రెట్టింపు చేసే పద్దతి. కొన్ని విషయాల్లో ఇది అనవసరంగా చేశారనిపిస్తుంది. ఉదాహరణకు పెదవులకు స్కిన్ షేప్ కు సరిగ్గా పనికొచ్చే…

  • మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే చెంచా తేనె అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే సహజమైన మాయిశ్చరైజర్. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల [ఆటు మృదువుగా రుద్దుతూ ఉండాలి. కాస్సేపటికి కడిగేసుకోవచ్చు. రాత్రిపూట పడుకునే ముందర అప్లయ్ చేసి రాత్రంతా ఉంచుకున్నా పర్లేదు. ఆలాగే పాలు నిమ్మరసం ఆలివ్ ఆయిల్ మిశ్రమం కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. పాలల్లో వుండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఆలివ్ నూనె చర్మాన్ని మెరిపిస్తుంది . నిమ్మరసం మృతకణాలను తొలగించటం తో పాటు మొటిమలు రాకుండా కాపాడుతుంది.చర్మం మెత్తగా తాజాగా ఉంటుంది. అలాగే ఒక కప్పుడు గులాబీ రెక్కల్ని కప్పు వేడి నీళ్ళల్లో మరిగించాలి. అందులో కొంత రోజ్ వాటర్ చేర్చాలి. ఈ నీళ్లు చల్లారాక నాడులో చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు . ఈ నీటిని ముఖానికి రాస్తుంటే తేమగా కనిపిస్తుంది. ఇవన్నీ మాయిశ్చరైజర్ లాగే పనిచేస్తాయి.

    సహజమైన మాయిశ్చరైజర్ ఇదే

    మాయిశ్చరైజర్ ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదేంపెద్ద కష్టం కాదు ఇంట్లో ఉండే వస్తువుల తోనే  చెంచా తేనె  అంతే కొబ్బరి నూనె నిమ్మరసం కలిపితే అదే…

  • వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్ కేర్ కోసం పరుగెత్తాలి. ఇప్పడూ ఇంట్లో చేసుకున్న వస్తువులతో ఆ ప్రయత్నాలు ఏవో చేస్తే సగం సమయం కలిసొస్తుంది. ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నా చర్మం చక్కగా కనిపించటం కోసం కొంత పోషణ అవసరం. రసాయనాల కంటే సహజ మైన వస్తువులు నయం కదా. ముఖ చర్మం ఎండిపోయి పగుళ్లు వచ్చినట్లు అయితే బనానా ఫేస్ మాస్క్ ట్రై చేయచ్చు. అరటిపండు పేస్ట్ గా చేసి కొత్త వెన్న కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. వెన్న లేకపోయినా మీగడ అయినా సరే. ఇవే ముఖానికి కావలిసినంత తేమను ఇస్తాయి. అరటిపండు గుజ్జు ఆ తేమను ఇంకొంత సేపు నిలబెడుతుంది. అలాగే అరటిపండు గుజ్జుకు తేనె ఒక టీస్పూన్ రోజ్ వాటర్ జతచేసి ఆ మిశ్రమాన్ని అప్లయ్ చేసినా ఇది ఫలితం ఉంటుంది. తేనె సహజమైన మాయిశ్చరైజర్ గా రోజ్ వాటర్ టోనర్ గా పనిచేస్తాయి. చలికాలంలో చర్మకాంతి కోసం ఈ కాంబినేషన్ ట్రై చేయండి.

    ఇంట్లోనే వింటర్ కేర్ ఫేస్ మాస్క్

    వింటర్ కేర్ ప్రాడక్ట్స్ ఎన్నో కనిపిస్తాయి మార్కెట్ లో. ఒక్కటి తెచ్చి నాలుగు రోజులు వాడి చూసుకునే సరికి చలికాలం కాస్తా వెళ్లిపోతుంటుంది. ఇక మళ్ళీ సమ్మర్…

  • అమ్మాయిలకు కుర్తీలెప్పుడూ బావుంటాయి. చీరలు వెస్ట్రన్ టైప్ దుస్తులకంటే కుర్తీలు సౌకర్యంగా చూసేందుకు చాలా బావుంటాయి . అయితే కుర్తీలు సింథటిక్ కంటే నూలు లినెన్ తరహావి అయితే తేలికగా చెమటలు అతుక్కుపోకుండా ఉంటాయి. పొదుపుగా సన్నగా కనిపించాలనుకుంటే మోకాళ్ళు దాటినా పొడవాటి కుర్తీలు ఎంచుకోవాలి. నేలకు జారాడుతూ వుండే అనార్కలీ ఫ్యాషన్ ఇప్పటి ట్రెండ్. ఈ డ్రెస్ లో పొడుగ్గా కనిపంచాలంటే సరైన ఎతైన హీల్స్ వేసుకోవాలి . లైనింగ్ ఉన్న కుర్టీలయితే పల్చగా కనిపించకుండా లోపలి దుస్తులు పైకి తెలియకుండా ఉంటాయి. చుడీదార్ లో కుర్తీలు విషయంలో చేతుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్లీవ్ లెస్ మెగా స్లీవ్స్ నిండు చేతులు త్రీ ఫోర్త్ లు శరీర ఆకృతిని బట్టి ఎంచుకోవాలి. కొందరికి చేతులు లావుగా ఉంటే అప్పుడు స్లీవ్ లెస్ బావుండవు. పొడవాటి చేతులు ఉండాలంటే నెట్ షిఫాన్ జార్జెట్ వస్త్రశ్రేణి ఎంచుకుంటే కుర్తీలకు అందం వస్తుంది.

    పొడుగ్గా కనిపించాలంటే హీల్స్ తప్పదు

    అమ్మాయిలకు కుర్తీలెప్పుడూ బావుంటాయి. చీరలు వెస్ట్రన్ టైప్ దుస్తులకంటే కుర్తీలు సౌకర్యంగా చూసేందుకు చాలా బావుంటాయి . అయితే కుర్తీలు సింథటిక్ కంటే నూలు లినెన్ తరహావి…

  • ముత్యాల నగలు అన్ని రకాల డ్రెస్ లకు మంచి ఆప్షన్. ముందర సహజమైన ముత్యాల్ని కల్చర్ ముత్యాల్ని తేడా ఎలా తెలుసుకోవాలి అంటే జెమ్ ల్యాబోరేటరీ లోనో లేదా మైక్రోస్కోప్ కిందో పరీక్ష చేయాలి. సహజమైన ముత్యాలు చాలా అరుదైన ఆభరణాలు. సైజ్ షేప్ కలర్ ఉపరితలం మెరుపులపై ఆధారపడి ముత్యాలు వెలికడతారు. అత్యంత విలువైన ,ముత్యాలు బాగా వెలుగ్గా ఉండి మృదువుగా ఉంటాయి. మంచి ముత్యాలు అత్యంత ముఖ్యమైన ప్రమాణం వాటిమెరుపు. దాని వైట్ రిఫ్లెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉపరితలం ఉచ్చులు పట్టి గీతలు ఎటువంటి లోపం లేకుండా వుంటాయి. సహజమైన ముత్యాన్ని గుర్తించాలంటే పంటిపై రబ్ చేస్తే సహజ ముత్యం గట్టిగా తగిలితే ఆర్టిఫీషియల్ ముత్యం స్మూత్ గా ఉంటుంది. సర్టిఫైడ్ నాణ్యమైన ముత్యాల దండ ఇరవై వేల రూపాయలుంటే కల్చర్ రకాలు రెండున్నర వేల రూపాయలు నుంచి దొరుకుతాయి. ఎలాంటి దుస్తులు వేసుకున్న ఒక్క వరస మంచి ముత్యాల దండ వేసుకున్న క్లాసిక్ లుక్ వస్తుంది.

    సహజ ముత్యాల జెమ్స్ అంత విలువైనవే

    ముత్యాల నగలు అన్ని రకాల డ్రెస్ లకు మంచి ఆప్షన్. ముందర సహజమైన ముత్యాల్ని కల్చర్ ముత్యాల్ని తేడా ఎలా తెలుసుకోవాలి అంటే జెమ్ ల్యాబోరేటరీ లోనో…

  • ఫ్యాషన్ ప్రపంచంలో పది హలచల్ చేస్తుందో దాన్ని ఫాలో అవటం సెలబ్రెటీల రహస్యం . ఈ సంవత్సరం బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు ఏ సినిమా వేడుకల్లో అయినా త్రిష తమన్నా సమంతా కాజల్ రెజీనా అందరూ హై నెక్ బ్లౌజ్ డిజైన్లతో చాలా సార్లు కనిపించారు. బ్రొకేడ్ హై నెక్ డిజైన్ తో క్లాసీ లుక్ తో నలుచదరపు బాక్స్ కట్ తో కొన్ని బ్లౌజ్ లు మల్టీ కలర్స్ తో నెట్ ఫ్యాబ్రిక్ తో చక్కని ఎంబ్రాయిడరీ పూల డిజైన్ లతో కొన్న ఫ్యాషన్ ప్రపంచంలో ఓ సంవత్సరంగా ఈ బ్లౌజ్ లు రాజ్యంపలుతున్నట్లే సాదా చీరపైకి హెవీ డిజైన్లు వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన జార్దోసీ వర్క్ లు ఫుల్ హ్యాండ్స్ పైన కూడా అదే అల్లిక డిజైన్స్. లేస్ డిజైన్స్ తో హై నెక్ బ్లౌజ్ లు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. నెట్ తో వెతికితే చౌక ధర నుంచి ఖరీదైన ధరకు క్లాత్ డిజైన్ ను బట్టి అందుబాటులో ఉన్నాయి. ఈ హై నెక్ డిజైన్స్ అన్ని ఇమేజెస్ చూసేయండి.

    బ్లౌజ్ కో ధీమ్ లుక్ హై నెక్

    ఫ్యాషన్ ప్రపంచంలో పది హలచల్  చేస్తుందో దాన్ని ఫాలో అవటం సెలబ్రెటీల రహస్యం . ఈ సంవత్సరం బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు ఏ సినిమా వేడుకల్లో…

  • మనకి కొన్ని రోల్స్ వుంటాయి. కొన్ని పదార్ధాలు వంటకీ కొన్ని శిరోజాలకు కొన్ని ఆహారం తో తీసుకుంటేనో అని విడివిడిగా ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి వంటింట్లో వాడే బేకింగ్ సోడా చర్మ సౌందర్యానికి మెరుగులు దిద్దుతుంది. అంటున్నారు. సౌందర్యాన్ని నిపుణులు. బేకింగ్ సోడా నీళ్లతో కలిసి పేస్ట్ లా చేసి ముఖం పై రాసుకుని ఆరనిచ్చి కడిగేస్తే చర్మం మురికిపోయి కాంతులీనుతుంది. అంటున్నారు. ఇదే పేస్ట్ ను వంటికి రాసుకుంటే మంచి డియోడ్రెంట్ గా పనిచేస్తుంది. ఒక బేసిన్ లో వేడి నీళ్లలో కొద్దిగా ఈ వంట సోడా ఉప్పు వేసి రెండు కళ్ళు అందులో ఉంచి పదినిముషాలు విశ్రాంతిగా కూర్చుని తర్వాత పొడి టవల్ తుడిస్తే పాదాల పగుళ్ల సమస్య పోతుంది. చలికాలంలో చర్మం పగిలి దురదలు రాకూండా గోరువెచ్చని నీళ్లలో వంటసోడా వేసి స్నానం చేస్తే రిలీఫ్ గా ఉంటుందంటున్నారు. ఎక్సపెర్ట్స్ వంటల్లో వాడేవి తినేవి ప్రమాదం లేనివి సైడ్ ఎఫెక్ట్స్ రానివి గనుక ఓసారి వాడి చూసినా పెద్ద నష్టం ఏమీ లేదు.

    ఇది సౌందర్య నిపుణుల సలహానే

    మనకి కొన్ని రోల్స్ వుంటాయి. కొన్ని పదార్ధాలు వంటకీ కొన్ని శిరోజాలకు కొన్ని ఆహారం తో తీసుకుంటేనో  అని విడివిడిగా ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి  వంటింట్లో వాడే…

  • ఫ్యాషన్ ట్రెండ్స్ లో తెలుపు కు ఎంతో ప్రాధాన్యం వుంది. సరైన యాటిట్యూడ్ లో సరైన కలర్ స్క్రీమ్ తో స్టయిల్ గా ధరిస్తే గ్లామర్ పవర్ కూడా సొంతం అవుతుంది. సృజనాత్మకమైన రూపానికి తెలుపు కాన్వాస్. తెల్లని డ్రెస్ లేదా చీర ఉద్యోగ ప్రదేశంలో క్లీన్ ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. తెల్లని వస్త్రధారణ కు యాక్సిసరీస్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. భారీగా ఉండాలనుకుంటే ఎరుపు నేవీబ్లూ మేజెంటా వంటి బెల్టుల హీల్స్ క్లచెప్ నెక్పీస్ ల రూపంలో జత చేసుకోవాలి. సింపుల్ గా కనిపించాలంటే సిల్వర్ గ్రే బ్రౌన్ గోల్డ్ చీజ్ క్యామెజ్ వంటి రంగులు జోడించాలి. గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ వంటి మెటాలిక్ కలర్స్ తెల్లని దుస్తులకు బాగా నప్పుతాయి. సిల్వర్ ముత్యాల నగలు బావుంటయి . తెల్లని వస్త్రశ్రేణి ఎంపికలో ట్రాన్సఫరెన్సీ కి ప్రాధాన్యత ఇవ్వాలి. క్లాత్ వెనక చేయిపెట్టి చుస్తే ఫ్యాబ్రిక్ ట్రాన్స్ ఫరెన్సీ అర్ధంఅవుతుంది. లోదుస్తులు ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. సరైన రంగు ఎంచితీసుకోవాలి . ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తెల్లని ఏ సమయంలో నైనా అందంగా ఉంటాయి.

    వెన్నెలంటి అందం కోసం

    ఫ్యాషన్ ట్రెండ్స్ లో తెలుపు కు ఎంతో ప్రాధాన్యం వుంది. సరైన యాటిట్యూడ్ లో సరైన కలర్ స్క్రీమ్ తో స్టయిల్ గా ధరిస్తే గ్లామర్ పవర్…

  • ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్ తో మస్సాజ్ చేస్తే మృదువుగా వుంటుంది. సబ్బుకుబదులు సోప్ ప్రీ క్లీన్సర్ వాడాలి స్నానం చేయగానే క్రీమ్ మాయిశ్చరైజర్ లేదా బాడీ బటర్ ను అప్లయ్ చేయాలి . పాలు అవిసెగింజల పొడి బ్రౌన్ షుగర్ కలిపి వారానికి ఒక్కసారి స్క్రబ్ చేయాలి. బ్రౌన్ షుగర్ లేకపోయినా మాములు పంచదార కలిపినా అదే ఫలితం ఉంటుంది. తేనె నిమ్మరసం అలోవెరా జెల్ బాదం నూనె లేదా నిమ్మరసం కలిపినా అవకాడో రాయటం వల్ల కూడా చర్మానికి తేమ లభిస్తుంది. రోజుకు 8 నుంచి పది గ్లాసుల మంచి నీళ్లు దాహం వేయకపోయినా తాగాలి సోయా టోఫు డైరీ ఉత్పత్తులు చికెన్ చేపలు ఆహారంలో భాగంగా ఉండాలి. క్యారెట్లు టమాటో బీట్ రూట్ బొప్పాయి కమలా నారింజ ఆకుకూరలు పుచ్చ వంటి ఆక్సిడెంట్స్ అధికంగా లభించే వివిధరంగుల పండ్లు కూరగాయలు తినాలి.

    పొడిబారి చర్మానికి ఈ జాగ్రత్తలు

    ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన  నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్…

  • జుట్టు పల్చబడి పోకుండా ఎన్నో చికిత్సలున్నాయి. ఎంతో ఖరీదైనవి కూడా. ప్రకటనల్లో కూడా ఎన్నో మందులు ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా రాలకుండా ఈ చికిత్సలు ఉపయోగపడతాయా అంటే ఈ మందులో ఎండార్ఫిన్లు బ్లాక్ చేయటం లేదా హార్మోన్లకు బ్లాక్ చేయటం పై ఆధారపడి ఉంటుంది. విటమిన్ బి 6 జంక్ సప్లీమెంట్స్ ఈవెనింగ్ ఫ్రమ్ రోజ్ ఆయిల్ లు S- అల్ఫాను అడ్డుకోవటానికి సహకరించేవీలుంది. ఇB హేయిర్ లాస్ కు సంబంధం గల శరీరం లోని ఎంజైమ్ విటమిన్ ఇ తో తయారైన నూనెలో ఫిరాడికల్స్ నుంచి హాని నుంచి శిరోజాల్ని కాపాడుతుంది. అసలు అతిగా కెమికల్స్ వాడటం వల్లనే హేయిర్ లాస్ ప్రాబ్లమ్. కాబట్టి స్టయిలింగ్ పేరిట రీబాండింగ్ చేయకూడదు. అతిగా కెమికల్స్ మానేయాలి/ గురు వెచ్చని నీళ్లతో రసాయనాలు తొలగించుకోవాలి. గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్ మాడు నుంచి కొనల దాకా రాస్తూ ఉండాలి. గుడ్డుసొన తేనే ను కండీషనింగ్ కు వాడచ్చు. జుట్టు పూర్తిగా ఫ్రెష్ అయ్యేలా ఈ కార్యక్రమం కొనసాగించాలి. నెమ్మదిగా జుట్టు కుదుళ్ళు గట్టిపడి వెంట్రుకలు పెరుగుతాయి.

    జుట్టు చికిత్సలు పనిచేస్తాయా ?

    జుట్టు పల్చబడి పోకుండా ఎన్నో చికిత్సలున్నాయి. ఎంతో ఖరీదైనవి కూడా. ప్రకటనల్లో కూడా ఎన్నో మందులు ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా ఆయిల్స్ కనిపిస్తూ…

  • మధ్యలో ఆపేస్తే ప్రయత్నం వృధా

    ఎంతోమంది ఆడవాళ్ళ ప్రాబ్లమ్ ఇది. బహుశా ఇందులో స్త్రీ పురుష బేధం ఉండకపోవచ్చు. వర్కవుట్స్ ఆహారం విషయంలో చాలా బోర్ కొట్టేస్తూ వుంటుంది. ఈ ప్రోగ్రామ్స్ కోస్టిక్…