• ఆభరణాలు అందాన్ని పెంచాలి

    జ్యూయిలరీ డిజైనర్లు ఎంచెపుతారంటే ఆభరణాలు ధరించేవారి అందాన్ని ద్విగుణీకృతం చేయాలి. వ్యక్తిత్వంలో శరీరాకృతి కి సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే అవి నప్పుతాయి అని. ఉదాహరణకు సుస్మితాసేన్…

  • పండగ స్పెషల్ అనార్కలీలు

    సంక్రాంతి సంప్రదాయ వేడుక. అమ్మాయిలకు సౌకర్యం అందం ఈ పండగ విషయంలో అనార్కలీలు. గౌన్ ల తరహాలో బావుంటాయి.ఫ్యాన్సీ గా ఆధునికంగా అనుకుంటే చందేరీ మల్ బెంగాలీ…

  • రోజుకో స్టయిల్

    శిరోజాలు చక్కగా చిక్కగా వుండాలే  కానీ ఎలాంటి ప్రయోగాలైనా చక్కగా చేయచ్చు. పండగ వేళ కూడా మామూలు జడేనా అనుకుంటే నాలుగైదు స్టయిల్స్  మార్చి మార్చి వేసుకోవచ్చు.…

  • కాంతివంతమైన రంగులే వేడుకకు నిండుదనం

    పండగంటే గుర్తొచ్చేది పట్టే. ఇక పట్టంటే కాంచీవరం పట్టే. పట్టు పురుగుల నుంచి తీసిన సహజమైనపట్టుకు బంగారు జరీ కలిపి చేతులతో మగ్గం పై నేసారు. 800…

  • పోడవాటి కురులు అందంగా ఉంటాయి. జాడలు ముడులు వేసుకునే సౌకర్యం ఉంటుంది కానీ చిట్టిపొట్టి కట్స్ తోనే ఇవాళ్టి అమ్మాయిలు ఫ్యాషన్ గా వుంటామంటున్నారు. ఎన్నో రకాలతో ఎప్పుడు కూడా బాచ్ కట్ క్లాసిక్ ట్రెండ్ గా ఉంటుంది. ముందువైపుకు కొంచెం జాలువారుతూ షార్ప్ గా షార్ట్ గా వుండే బాచ్ ఇప్పటి ట్రెండ్. పిక్సీ కట్ యువతులకు ఫ్యాషన్ స్టేట్ మెంట్. అలాగే లేయర్ కట్ తో పొడుగ్గా వున్నా పోటీగా వున్నా శిరోజాలకు వ్యాల్యుమ్ ను సహజ టెక్చర్ ను ఇవ్వటానికి లేయర్లు పర్ ఫెక్ట్ గా ఉంటాయి. లేయర్డ్ బాచ్ లేదా పిక్సీ ప్రయత్నం ఉంటాయి. ఇక పేజ్ బాయ్ స్టయిల్ అయితే సరదాగా సోఫెస్టికేటెడ్ గా వుండే స్టయిల్. ర్యాంప్ లతో ఎక్కువగా కనిపించే స్టయిల్ ఇది. ఇలాంటి కట్స్ తో హేయిర్ స్ప్రే బ్లో డ్రయర్ వాడటం వల్ల శిరోజాలు వెనీ గా ఉంటాయి. అలాల్లాంటి జుట్టుకు యాక్ససరీస్ తో అదనపు అందం వస్తుంది. జ్యుయల్డ్ హేయిర్ క్లిప్స్ ఫెథర్స్ ఫ్లవర్స్ ఎక్సట్రా బాబీ పిన్స్ హేయిర్ ట్విస్టింగ్ కు జోడింపుగా ఉంటాయి. సాయంత్రాల్లో ప్రత్యేక సందర్భాల కోసం ఎక్కువ సేపు వుండే హేయిర్ స్ప్రే వాడితే మరింత పాలిష్డ్ వేవీ రూపం వస్తుంది. అలాగే రంగుల ప్రయోగాలు బావుంటాయి.

    స్టయిలింగ్ కు యాక్సెసరీస్ అందం

    పోడవాటి కురులు అందంగా ఉంటాయి. జాడలు ముడులు వేసుకునే సౌకర్యం ఉంటుంది కానీ చిట్టిపొట్టి కట్స్ తోనే ఇవాళ్టి అమ్మాయిలు ఫ్యాషన్ గా వుంటామంటున్నారు. ఎన్నో రకాలతో…

  • చీరకంటే అందమైన వస్త్ర ధారణ ఇంకొటిలేదు. చీరలో వయసు కనబడుతుందనుకుంటారు కానీ చీరకట్టులో కిటుకులు తెలిసి ఉంటే చీర అన్నిటికంటే బెస్ట్ డ్రెస్ అనిపిస్తుంది. అందంగా కనిపించాలంటే ముందుగా శరీరాకృతికి తగిన చీర ఎంచుకోగలగాలి. కొన్ని రకాల ప్రింట్లు కొన్ని డిజైన్లు శరీరాకృతిని ఒక్క తీరులో చూపెడతాయి. షిఫాన్ జార్జెట్ క్రేప్ చీరలైతే తక్కువ బరువు ఉంది వంటికి అతుక్కుపోయి నాజూకుగా కనపడేలా చేస్తాయి. చాలా పెద్దగా ఎక్కువ వెడల్పు అంచుల చీరల వల్ల ఎత్తు తక్కువగా కనిపిస్తాయి అంచేత అసలు అంచులు లేనివాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. చీరలో ఎలా కనిపించాలన్నది మన ఎంపికే. కొంగు కిందవరకూ జారాడేలా వేసుకోవాలి. ఇది నడుము భాగాన్ని దాచేస్తూ అందంగా ఉండేలా చేస్తుంది. సన్నని ప్రింట్లు కూడా నాజూకుగానే కనిపిస్తాయి. లేత రంగు చీరలు శరీర వర్ణానికి తగిపోయే చీరలు ఎంచుకుంటే సన్నగా కనిపిస్తారు. అలాగే చీర ఎప్పుడూ సన్నగా మడతలు లేకుండా శుభ్రంగా ఇస్త్రీ చేసి నీట్ గా ఉండాలి. అప్పుడే హెసెరా ఖరీదు తో నిమ్మితం లేకుండా మనిషికి హుందాతనాన్ని ఇస్తుంది. ఎలాంటి చీర అయినా. అలాగే వెళ్లే సందర్భాన్ని బట్టి కూడా చీరలు ఎంచుకుంటే బావుంటుంది .

    చీరకట్టు తోనే నాజూకుతనం

    చీరకంటే అందమైన వస్త్ర ధారణ ఇంకొటిలేదు. చీరలో వయసు కనబడుతుందనుకుంటారు కానీ చీరకట్టులో కిటుకులు తెలిసి ఉంటే చీర అన్నిటికంటే బెస్ట్ డ్రెస్ అనిపిస్తుంది. అందంగా కనిపించాలంటే…

  • టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన చిట్కాలతో ఈ మొటిమలు తగ్గించవచ్చు. సమపాళ్లలో తేనే నిమ్మరసం మొటిమల పైన రాస్తే ఫలితం ఉంటుంది. నువ్వులు నీళ్లలో నాననిచ్చి నూరిముద్దగా చేసి మొటిమల పై రాసి కడిగేస్తే చాలు. ముఖానికి బంగాళా దుంప రాస్తే ఇవి మొటిమలు తగ్గించటం కాక మెరిసేలా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్న చోట లవంగాలు నీళ్లు లేదా పాలతో కలిపి మెత్తగా నూరి అప్లయ్ చేసి పదినిమిషాలు పాటు ఆరనిచ్చి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. పూదీనా ఆకులు నూరి ఆ పేస్ట్ ను మొటిమల పై రాసినా మార్పు కనిపిస్తుంది. పుదీనా తో చర్మానికి చల్లదనాన్ని పాక్ లాగా అప్లయ్ చేసినా మంచిదే. ఎండా బెట్టిన తులసి ఆకులు షాపుల్లో దొరుకుతాయి. దాన్ని నీళ్లలో కలిపి పేస్ట్ లాగ చేసిన రాసినా మొటిమలు తగ్గుతాయి. బజార్లో దొరికే ఖరీదైన మందుల కంటే ఈ సహజమైన పద్ధతులే ఫలితాలు ఇస్తాయి.

    మొటిమలు ఈ పూతలతో తగ్గుతాయి

    టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన…

  • జుట్టు చివర్ల చిట్లిపోవటం చాలా మంది సమస్య. జుట్టు కుదుళ్ళు సహజమైన తేమ తగ్గిపోతే వెంట్రుక చివర చిట్లిపోతూ ఉంటుంది. తరచుగా హేయిర్ స్ప్రే లు జెల్స్ హేయిర్ కలర్ వాడటం వల్ల వచ్చే సమస్య ఇది. రెగ్యులర్ గా వాడే నూనెలో ఆముదం ఆలివ్ లేదా బాదం నూనె కలిపి మాడు నుంచి కోణాలకు అంటేలాగా రాయాలి. ఈ నూనెని వెచ్చ జేసి మస్సాజ్ చేసి హేయిర్ కాప్ పెట్టుకుని పడుకుని తెల్లరాక మైల్డ్ షాంపూ తో జుట్టు శుభ్రం చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ తేనె పెరుగు కలిపి కూడా హెయిర్ మాస్క్ వేసుకున్నా ఫలితం ఉంటుంది. పండిన బొప్పాయి గుజ్జుతో పెరుగు కలిపి జుట్టుకు వత్తుగా పట్టించి అరగంటాగి స్నానం చేసేయచ్చు.అరకప్పు మినపప్పు టేబుల్ స్పూన్ మెంతులు పొడి చేసి పెరుగు కలిపి తలకు పట్టించి ఆరనిచ్చి తలస్నానం చేయచ్చు. ప్రతిదానికి పెరుగు బేస్ గా ఉంచుకోవాలి. పెరుగుతో మిగతావి కలిపి హేయిర్ కి బాగా పట్టించి వాష్ చేయాలి . సాధారణంగా జుట్టు ఈ చిట్కాల తోనే చక్కగా పెరుగు తోంది. చివర్లు చిట్లటం పోతుంది. ఇవన్నీ ఇంట్లో దొరికే వస్తువులే కనుక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏదీ వుండదు.

    జుట్టు చివర్లు చిట్లుతున్నాయా

    జుట్టు చివర్ల చిట్లిపోవటం చాలా మంది సమస్య. జుట్టు కుదుళ్ళు సహజమైన తేమ తగ్గిపోతే వెంట్రుక చివర చిట్లిపోతూ ఉంటుంది. తరచుగా హేయిర్ స్ప్రే లు జెల్స్…

  • చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి . నేరుగా సూర్యకిరణాలు తగలకుండా శ్రద్ద తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మేకప్ తొలగించుకోకుండా నిద్రపోకూడదు. కనీసం రెండు సార్లు ముఖం అతిచల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. చర్మం ఊపిరితలం ఎప్పుడూ జిడ్డు లేకుండా వుండాలి. క్లార్ ఫోక్స్ ఇన్ఫలమేటరీ ప్రక్రియల లేకుండా చూసుకోవటం అవసరం. వారంలో రెండు సార్లు స్క్రబ్ చేస్తే మృత కణాలు పోతాయి. టేబుల్ స్పూన్ పంచదార లేదా ఓట్ మీల్ తో స్క్రబ్ చేయచ్చు. క్లే మాస్క్ తో మృత కణాలు పోతాయి. మొటిమలు డ్రై అవుతాయి. బ్లాక్ హెడ్స్ సులువుగా తీసేయచ్చు. చర్మంలోని అదనపు నూనెను జిడ్డును ఈ మాస్క్ లు పీల్చేస్తాయి. పోర్స్ ష్రింక్ అయి చర్మం టెక్చర్ మెరుగుపడుతుంది. పెరుగు అవకాడో విటమిన్ సి వంటివి చర్మం కొలెజాన్ రూపొందించటానికి సహకరించి చర్మం టెక్చర్ ను మెరుగుపరుస్తాయి . తేలికైన బేబీ ఆయిల్ ను చేతిలోకి తీసుకుని మెల్లగా మసాజ్ చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.

    చర్మం కాంతి మెరుగుపరిచేందుకు ఇవన్నీ

    చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు…

  • మ్యానిక్యూర్ చేయించుకున్నాక ఆ ప్రభావం ఎక్కువ రోజులు ఉండటం లేదని చాలా మంది అంటుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలతో వేళ్ళ గోళ్లు అందంగా ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ లో మించిన కాటన్ బాల్స్ తో గోళ్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. గోళ్లకు కలర్ లేకపోయినా ఇలాగె శుభ్రం చేయచ్చు. నెయిల్ పాలిష్ రెండు కోట్స్ వేయాలి. బేస్ కోట్ సాఫ్ట్ టెక్చర్ తో ఉంటే టాప్ కోట్ బాగా అమరుతుంది. టాప్ కోట్ షైనీ గా ఉండాలి. షిమ్మరీ ఫినిష్ గల పాలిష్ లు ఎక్కువ రోజులు ఉంటాయి. పియర్ లేసేంట్ ఫార్ములాలు నాణ్యమైన మైకా పార్టికల్స్ కలవి మ్యాటిష్ ఫినిష్ తో పోల్చితే వేర్ అండ్ టేర్ తక్కువగా ఉంటాయి. నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు ఉండాలంటే త్వరగా డ్రై అయ్యేవి తీసుకోకూడదు. ఇవి సౌకర్యంగా ఉంటాయి కానీ ఎక్కువ రోజులు వుండవు. గోళ్లకు రెగ్యులర్ ఆయిల్ చేస్తే నెయిల్ పాలిష్ పీలప్ కాకుండా వుంటుంది. తేలికైన బేబీ ఆయిల్ తో వేళ్ళ గోళ్లు చేతులు మస్సాజ్ చేస్తే అప్పటికే మ్యానిక్యూర్ తో ఫ్రెష్ గా కనిపించే చేతులు ఈ బేబీ ఆయిల్ తో మెరుస్తూ ఉంటాయి. జిడ్డు ఉండదు కనుక అసౌకర్యంగా ఉండదు.

    మ్యానిక్యూర్ ప్రభావం వుండాలంటే

    మ్యానిక్యూర్ చేయించుకున్నాక ఆ ప్రభావం ఎక్కువ రోజులు ఉండటం లేదని చాలా మంది అంటుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలతో వేళ్ళ గోళ్లు అందంగా ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్…

  • పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం నెయిల్ ప్లేట్ ను కొంత మోతాదులో ఫ్లెక్సిబిలిటీ తేమ అవసరం. కఠినమైన రసాయనాలతో నెయిల్ ప్లేట్స్ చిట్టి గోళ్లు విరిగిపోతాయి. కాలి గోళ్లు ఎపుడూ ఓంపుగా కాకుండా స్ట్రయిట్ లైన్ లో కట్ చేయాలి. సరిగ్గా కట్ చేయకపోతే గాయపడటం లేదా షూ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే కాలిగోళ్ళు మూలల్లో విరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల ఇన్ గ్రోన్ నెయిల్స్ వచ్చే అవకాశం వుంది గోళ్లు కొంచెం పెరగగానే కట్ చేసేస్తూ ఉండాలి.లేకపోతే దేనికోదాని తగిలి గాయపడతాయి. అలాగే చేతి గోళ్ళకైనా కాళీ గోళ్ళకైనా పెయింట్ వేసాక చిప్ అవుతుంటే పెయింట్ పొరపాటున కూడా స్క్రాప్ చేయద్దు. నెయిల్ పాలిష్ రిమూవర్ వాడాలి. డార్క్ నెయిల్ పాలిష్ ను పీల్ చేసినా చిప్ అయినా అసహ్యంగా కనపడతాయి. క్లియర్ టాప్ కోట్ పాలిష్ లేదా స్కిన్ కలర్ పాలిష్ వేసినా అందంగానే ఉంటాయి.

    స్ట్రెయిట్ లైన్ కట్ చేస్తేనే బావుంటాయి

    పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు  ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన…

  • చీరకట్టుతో వుండే హుందాతనమే వేరు. ఇవి ఇంట్లోనూ బావుంటాయి. ఆఫీస్ కు కంఫర్ట్ గా ఉంటాయి. సాధారణంగా పార్టీ వేర్ డిజైనర్ వేర్ ప్రత్యేక సందర్భాల కోసం వెతికి బీరువాలు నింపేస్తారు. కానీ ఆఫీస్ వేర్ మాత్రం ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిందే కాటన్ నేత వంటివి ఇప్పుడు ఆధునిక డిజైన్లలో వస్తున్నాయి. షిఫాన్ జార్జెట్ వుండనే వున్నాయి. కాకపోతే ఆఫీస్ విషయానికొస్తే చిన్న ప్రింట్లు లేత రంగులే బావుంటాయి. డిజైన్స్ ఎంత తక్కువ వుంటే అంత సింపుల్ గా ఉంటాయి. డిజైనర్ బ్లవుజులు పార్టీ వేర్ గానే తీసుకోవాలి కానీ ఆఫీస్ కు మాత్రం పొడవు పొట్టి చేతులు లేదా చీర తో పట్టే మ్యాచింగ్ లే ముద్దుగా ఉంటాయి. చీరలు మెయింటైన్ చేయటం కష్టం అనే అమ్మాయిలే ఎక్కువ. నెమ్మదిగా అలవాటయ్యే చుడీదార్లు అనార్కలీలు వేసుకున్న మెరిసే గాడీ రంగులు పూసలు జరీ వర్క్ లు ఎబెట్టుగానీ ఉంటాయి. భారీ పనితనంతో జిగేల్ మనే డ్రెస్ లు పార్టీలకు ఈవెంట్స్ కు పరిమితం చేసి మెత్తని కాటన్ ప్రింట్స్ భారీ సిల్క్ చిన్న ప్రింట్లు సెల్ఫ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఆఫీస్ వర్క్ తో సౌకర్యంగా బావుంటాయి.

    ఆఫీస్ కు స్పెషల్ అంటే ఇవే

    చీరకట్టుతో వుండే హుందాతనమే వేరు. ఇవి ఇంట్లోనూ బావుంటాయి. ఆఫీస్ కు కంఫర్ట్ గా ఉంటాయి. సాధారణంగా పార్టీ వేర్ డిజైనర్ వేర్ ప్రత్యేక సందర్భాల కోసం…

  • మొహమంతా తెల్లగా లేదా ఉన్న ఛాయతో చక్కగా వుంటూ నుదుటి పైన చెంపల పక్కన ట్యాన్ అనిపిస్తూ వుంటుంది. ఈ నలుపు పోగొట్టుకోవటం కోసం వేపాకు పూత చాలా బాగా ఉపయోగపడుతుంది. లేత వేపాకులు మెత్తగా నూరి కొద్దిగా పసుపు కలిపి దాన్ని మొహానికి రాసి ఆరిపోయాక కడిగేస్తే చర్మం మృదువుగా మారటమే కాక మచ్చలాంటివీ పోతాయి . చెంచా వేపాకు పొడి కొద్దిగా గులాబీ పొడి పెరుగు పాలు కలిపి పూతలా వేసినా ఎండ వేడికి కమిలిన నల్ల దనం పోతుంది. వేపాకుల్లో యాంటీ బ్యాక్తీరియల్ గుణాలుంటాయి. కనుక ఆ ఆకులు వేసి మరిగించి చల్లనైన నీళ్లలో తరుచు మొహం కడుక్కోవచ్చు. నిమ్మరసం పెరుగు కలిపి వేపాకుపొడి చేర్చి వేపాకుపొడి వేసుకున్నా మచ్చలు పోతాయి. అమ్మవారు వస్తే ఆగాయాల తో గుంతలు ఏర్పడితేనే పసుపు వేపాకు ముద్ద మంచి నూనె కలిపి రాస్తే అంతగాయాలు మాయం అవుతాయి. అలాంటివి ఎండా వేడిమికి కమిలిన మొహం మెరుస్తూ వుండదా ? ఈ చిట్కా అద్భుతంగ పనిచేస్తుందని చెప్పటంతో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    నుదుటి పై ట్యానింగ్ పోతుంది

    మొహమంతా తెల్లగా లేదా ఉన్న  ఛాయతో చక్కగా వుంటూ నుదుటి పైన చెంపల పక్కన ట్యాన్ అనిపిస్తూ వుంటుంది. ఈ నలుపు పోగొట్టుకోవటం కోసం వేపాకు పూత…

  • బ్లాక్ గ్రే కొంచెం దగ్గర దగ్గరే వుంటాయి కానీ బ్లాక్ కలర్ డ్రెస్ లు ఏ సందర్భానికైనా బాగానే ఉంటాయి. కానీ ఆఫీస్ వర్క్ కు ఫార్మల్ గా కట్టుకునే చీర డ్రెస్ సూట్ ఏదైనా గ్రే కలర్ సూటవుతుందంటారు. దాన్లో లెక్కలేనన్ని షేడ్స్. చార్కోల్ గన్ మెటల్ కలర్స్ నేవీ బ్ల్యూ దృఢత్వం ఆత్మ విశ్వాసం తెలిపే లాటిన్ బ్లూ క్లాసిక్ స్మార్ట్ నెస్ ను ప్రతిబింబిస్తాయి. వస్త్ర శ్రేణి ఎలాంటిదయినా సిల్క్ కాటన్ పట్టు ఏ కలర్ చీర అయినా డ్రెస్ అయినా హుందాగా ధరించే పూర్తి సీరియస్నెస్ ను చూపిస్తూ వుంటాయి. సెమీ ఫార్మల్ గా వెల్ డ్రెస్సింగ్ కోరుకుంటే లైట్ గ్రే సారీస్ సరైన ఎంపిక. సాధారణంగా వైట్ తప్ప మిగతా అన్ని రంగులు ఆఫీస్ వేర్ గా బావుంటాయి. సంప్రదాయంగా కనిపించే నేవీ బ్లూ లేని అందం గ్రే లో వుంటుంది. అయితే ఈ లేత రంగు ఐడెంటికల్ గా కొటొచ్చినట్లు కనబడే రంగు కాదు కానీ మంచి ఖరీదైనది మంచి లుక్ ఇచ్చేదిగా వుండాలి. ఎక్కువ ఫార్మల్ గానే కనిపించాలి. అనుకుంటే గ్రే కలర్ శారీ ఎంచుకోమంటున్నారు స్టయిలిస్ట్ లు. ఇందులో ప్యూరీ సిల్క్ లు సింపుల్ సెల్ఫ్ స్టెప్స్ కుడా క్లాసిక్ లుక్ ఇస్తాయి . గ్రే అందమైన హుందా నిచ్చే హాడావుడి కనిపించని సింపుల్ కలర్.

    సింపుల్ క్లాసిక్ లుక్ కోసం గ్రే కలర్

    బ్లాక్ గ్రే కొంచెం దగ్గర దగ్గరే వుంటాయి కానీ బ్లాక్ కలర్ డ్రెస్ లు ఏ  సందర్భానికైనా బాగానే ఉంటాయి. కానీ ఆఫీస్ వర్క్ కు ఫార్మల్…

  • కొన్ని రకాల డ్రెస్ లు పురుషులకే పరిమితం అనుకుంటారు అమ్మాయిలు మంచి సూట్లు ప్యాంట్లు షర్టులు ఇలాంటివి కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ శ్రీ పురుష బేధం లేకుండా ఆఫీస్ లకు వేసుకునే ఫార్మర్స్. కాకపోతే మరీ సీరియస్ గా కనిపించకుండా కొన్ని కొత్త ప్రయోగాలు చేయాలి. జీన్స్ కాటన్ ప్యాంట్లు స్ట్రెయిట్ పెన్సిల్ కట్ తో ఉండేలా చూసుకుని దానిపైన పొడవాటి కుర్తీ వేసుకుంటే బావుంటుంది. పొడవాటి కుర్తీలకు లూజ్ గా వుండే షర్టుల్లకు పలాజో లు వేసుకోవటం ఇప్పటి ఫ్యాషన్. రెండు మూడు రంగుల పలాజో లు ఉంటే కాంబినేషన్స్ చూసుకోవచ్చు. కాస్త సన్నగా ఉంటే చిన్న ప్రింట్లున్న పొడవాటి స్కర్టులు వేసుకోవచ్చు. స్కర్టులు ప్యాంట్లు రెగ్యులర్ గా వేసుకోవాలి అనుకుంటే వదులుగా అలాగని వంటికి అతుక్కుపోయేలా కాకుండా నడుము దగ్గర పట్టి వుంటే ఏ లైన్ తరహాకి ప్రాధాన్యత ఇవ్వచ్చు. జీన్స్ టీషర్ట్స్ పైకి కోటు కూడా చక్కగానే ఉంటుంది. కోట్లు సాధారణంగా సూటింగ్ క్లాత్ లో వుంటాయి.కానక నేతతో కూడా వస్తున్నాయి. అవి తేలిగ్గా బావుంటాయి. మోడ్రన్ కనబడాలి అనుకుంటే కొన్ని కొత్త కాంబినేషన్స్ జత చేస్తే ప్యాంట్లు షర్టులు అమ్మాయిల వార్డ్రోబ్ లో లక్షణంగా వుంచుకోవచ్చు.

    ఇవి అమ్మాయిల వార్డ్రోబ్ లో ఉండాల్సినవే

    కొన్ని రకాల డ్రెస్ లు పురుషులకే పరిమితం అనుకుంటారు అమ్మాయిలు మంచి సూట్లు ప్యాంట్లు షర్టులు ఇలాంటివి కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ శ్రీ పురుష బేధం లేకుండా…

  • అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్ లో వాడతారు. పెద్ద పెద్ద ఒబెరాయ్ బాలినీస్ స్పా ముంబై లోని నారిమన్ పాయింట్ స్పా ల్లో ఈ ట్రీట్మెంట్ ను అతిధుల కోసం ఇస్తారంటే బియ్యంలో శరీర లావణ్యలను పెంచే పోషకాలు ఉండటమే కారణం. మస్సాజ్ తర్వాత స్క్రబ్బింగ్ చేయటం వల్ల మృత కణాలు పూర్తిగా పోయి శరీరం శుభ్రపరుస్తుంది. మంచి మెరుపు నిగారింపు పటుత్వం వస్తుంది. ఇదే బియ్యపిండి పాలు మిశ్రమానికి అలొవెరాని కలిపి పెదవులు ఎండిపోకుండా తేమతో మెరిసిపోయేందుకు వాడతారు. తాజాగా ఉన్న బియ్యపిండి రైస్ బ్రాన్ నూనె లో రకరకాల పదార్ధాలు కలిపి రకరకాల ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఆర్గానిక్ కొబ్బరి షియా బటర్ లతో కలిపి డ్రై స్కిన్ కు అధిక తేమను ఇచ్చేందుకు వాడతారు. బియ్యం పిండి శరీరానికి రుద్దుకొనే సబ్బు లాంటిది. బియ్యం పిండి తేనె పాలు మిశ్రమం ఫేస్ ప్యాక్ గా చక్కగా ఉంటుంది. ఈ మిశ్రమాన్నే బాడీ స్క్రబ్బర్ లాగా ఉపయోగిస్తారు.అయితే శరీరానికి దీన్ని మృదువుగా అప్లయ్ చేయాలి. బియ్యం వండి తినేందుకే కాదు మంచి బ్యూటీ ట్రీట్ మెంట్ కూడా.

    బియ్యంతో అద్భుత సౌందర్యం

    అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్…

  • అన్నింటితో పాటు వస్త్రాల విషయంలో కూడా సర్వే జరుగుతాయి. అసలు ఎలాంటి వస్త్ర శ్రేణి ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి కదా. ఫ్యాషన్ లో చీరకే అగ్రస్థానం. అసలు చీరకట్టు లోనే బాలెయాన్ని వెరైటలుంటాయి . 16 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారితో చేసిన సర్వే లో 85 శాతం మంది పెళ్లిళ్లకు హాజరైతే చీరె ఎంచుకుంటామన్నారు. 46 శాతం మంది పండగలు ప్రత్యేక సందర్భాల్లో చీరలే అన్నారు. 17 శాతం మంది యువతులు కార్పొరేట్ ఈవెంట్స్ అప్పుడు చీరె కడతామన్నారు. ఈ సర్వే లో 52 మంది శాతం మంది అందమగా చీర కట్టుకోగలరు. 28 శాతం మంది సొంతంగా కట్టుకోవటం కాదు కానీ సాయం తీసోమంటున్నారు. 94 శాతం మంది చీర చాలా రోజులు కట్టకపోతే ఏదైనా వేరే డ్రెస్ లే వాడుతుంటే అబ్బా చీర మిస్ అయిపోతామనిపిస్తుంది. అన్నారు. సర్వే రిపోర్ట్స్ అందమైన చీరలకే డిమాండ్ ఉందని కన్ ఫర్మ్ చేసింది. ఈ సర్వే సంతృప్తి పడి ఫ్యాషన్ డిజైనర్లు సమరోత్సాహంతో అందాల చీరల డిజైన్స్ సృష్టించటంలో మునిగిపోతారన్నమాట.

    చీరె గొప్ప సింగారమన్న సర్వే

    అన్నింటితో పాటు వస్త్రాల విషయంలో కూడా సర్వే జరుగుతాయి. అసలు ఎలాంటి వస్త్ర శ్రేణి ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి కదా. ఫ్యాషన్ లో చీరకే  అగ్రస్థానం. అసలు చీరకట్టు…

  • అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఈ సంవత్సరపు ప్రత్యేకమైన రంగు ఆరోగ్యకరమైన జీవన విధానానికి దగ్గరగా వుండే ఆకుపచ్చే అంటున్నారు. ఆకుపచ్చ రంగులో ఎన్నో భయాలున్నా కొత్తదనాన్ని కోరుకునేవాళ్ళు లేతాకుపచ కోరుకుంటారని నిపుణుల గాఢమైన నమ్మకం. కలర్ థెరపిస్ట్లు ఈ రంగు ఆందళోనననీ డిప్రెషన్ నీ తగ్గిస్తుందంటారు. ఫ్యాషన్ డిజైనర్ సవ్య సాచి డిజైన్ చేసిన చీరలు ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ బోర్డర్ సారీస్ మింట్ క్రిస్టల్ చివరకు రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ శారీ క్రియేట్ చేసిన దానికి తప్పనిసరిగా ఎక్కడో గ్రీన్ కలర్ ఎట్టాచ్డ్ గా వుంటాయి. మొత్తం ఇమేజెస్ అన్నీ చూపిన ప్రతి చీరకు ఏదో రకంగా హరితవర్ణ సోయగం మిక్స్ అవ్వకుండా వుండదు. దీపికా పదుకునే విద్యా బాలన్ కంగనా రనౌత్ వంటి తారలు కట్టుకుని తళుక్కున మెరిసిన చీరల్లో కూడా ఈ ఆకుపచ్చని ఛాయలే ఎక్కువ సిరిసంపదలకు ప్రతీకగా నిలిచే ముదురాకు పచ్చ లేదా గడ్డి రంగు అర్థం విశ్వాసాన్ని పెంచచే రంగులే.

    ఫ్యాషన్ నిపుణుల మెచ్చిన ఆకుపచ్చ

    అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు ఈ సంవత్సరపు ప్రత్యేకమైన రంగు ఆరోగ్యకరమైన జీవన విధానానికి దగ్గరగా వుండే ఆకుపచ్చే అంటున్నారు. ఆకుపచ్చ రంగులో ఎన్నో భయాలున్నా కొత్తదనాన్ని కోరుకునేవాళ్ళు…

  • ఏ చీర కట్టినా రాణి అందం మైసూర్ సిల్క్ చీరలు వస్తుందంటారు. దక్షిణాది అమ్మాయిలు. ప్రత్యేక సందర్భాల్లో ఒక్క చీరైనా కొనుక్కుంటారు. కూడా. ఈ చీరలు హుందాగా కళ్ళు చెదిరేలా కట్టిన వారి వయసును బట్టి అందం మారిపోతూ ఉంటుంది. నూటికి నూరు శాతం స్వచ్ఛమైన పట్టు బంగారు జరీ తో తయారవుతుంది చీర. మైసూర్ లోని సిల్క్ ఫ్యాక్టరీలు తయారవుతోంది చీర. మైసూర్ మహారాజా తన సంతతి వారి కోసం 1912 లో స్విట్జర్లాండ్ నుంచి ప్రత్యేకంగా మగ్గాలు తెప్పించి దీన్ని ప్రారంభించారు. రాణులు మాత్రమే ధరించిన ఈ చీర తర్వాత అందరికీ చేరింది. అందుబాటులోకి వచ్చాకే పమిట కొంగు డిజైన్లు దానైకి ఎంబ్రాయిడరీలు వచ్చాయి. బాందినీ టిక్కర్ జత కలిపారు. గతంలో కొన్నే రంగులు వుండేవి. ఇప్పుడు రంగుల ప్రయోగాల్లో కూడా మైసూర్ సిల్క్ చీరల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగాయి. విదేశాల్లోనూ ఈ చీరలకు మంచి డిమాండే వుంది.

    అందాన్ని పెంచే మైసూర్ సిల్క్స్

    ఏ చీర కట్టినా రాణి అందం మైసూర్ సిల్క్ చీరలు వస్తుందంటారు. దక్షిణాది అమ్మాయిలు. ప్రత్యేక సందర్భాల్లో ఒక్క చీరైనా కొనుక్కుంటారు. కూడా. ఈ చీరలు  హుందాగా…

  • చీర కట్టులో వుండే అందం నాజూకుతనం ఇంకే డ్రెస్సుల్లోనూ వుండదు. ఫారినర్స్ సైతం మన చీర కట్టుకు వంద మార్కులు ఇచ్చేస్తారు. అయితే చీర కట్టే తీరులోనే వెరైటీ వుంటుంది. పమిటలు కుడిఎడమకు మార్చి కుచ్చిళ్ళు పోసి ఎన్నో రకాలు. ఇందులో మళయాళీల డ్రెస్ చాలా ప్రత్యేకం. ఇక్కడి చీరలను సెట్టుముండు లేదా ముండుమ్ నేరియా తుమ్ అంటారు. ఇది మామూలుగా టూపీస్ కాస్ట్యూమ్. కేరళీయుల ట్రెడిషనల్ కట్టుతీరు. నెరియత్తు అప్పర్ గార్మెంట్ ముండు లోయర్. అయితే చక్కని జరీ అంచులతో ముట్టుకుంటే మెత్తగా తగిలే ఈ అందమైన నేత చీర నూరు శాతం మగ్నం పైన నేసే ఈ చీర ఇప్పుడు ఆరు గజాల మామూలు చీరలు అన్ని ప్రాంతాల వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇక ఈ చీరపైన జరుగుతున్న ప్రయోగాలకు అంతులేదు. నెమలి వెన్నెల పింఛాలు దగ్గర నుంచి ప్రకృతి అందచందాల దాకా ఈ జరీ అంచునేత చీర పై చిత్ర కారులు లేసే అందమైన కళా ఖండాలై అన్ని ప్రాంతాల వారి మనసు దోచేస్తున్నాయి.

    కేరళ కాటన్ పైన వర్ణ సోయగాలు

    చీర కట్టులో వుండే అందం నాజూకుతనం ఇంకే డ్రెస్సుల్లోనూ వుండదు. ఫారినర్స్ సైతం మన చీర కట్టుకు వంద మార్కులు ఇచ్చేస్తారు. అయితే చీర కట్టే తీరులోనే…