Nemalika
హద్దులు దాటితే అంతా నష్టమే.
నీహారికా, ఏ బంధవ్యంలో అయినా మొట్ట మొదట గుర్తు పెట్టుకోవలసింది. ఒకరి రహస్యాలు ఇంకోళ్ళకి చెప్పకూడదు అని. అప్పుడే ఒక్కళ్ళపైన ఒక్కళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. అలా లేకపోతె అదసలు నమ్మకమేకాదు. ఒక్కసారి ఇద్దరి మధ్య ఏదైనా చిన్నపాటి గొడవ ఎదురైతే కుడాస్నేహంగా సభ్యతగా వున్నప్పుడు చెప్పుకున్న విషయాలు ఇంకొందరి ముందుకు తెచ్చి మాట్లాడకూడదు. సమస్య పరిష్కరించుకోవాలి లేదా సంబందం తెంచుకొందామనుకొన్నాసరే అంత వరకు ఆ స్నేహాన్ని డిలీట్ చేయాలి గానీ దాన్ని పెంచి రచ్చ చేసుకోగుడదు. స్నేహితుల […]
ఎందుకింత భారం ?
నీహారిక, నాకు అన్నట్లు కొన్ని అనాలోచితంగా మనం చేసే పనుల వల్లనే సమస్యలు వస్తాయి. మనలో చాలామంది ఆడవాళ్ళు ప్రతి పని మనం చేస్తేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఇంట్లో పిల్లలు, భర్త వల్ల పని సరిగ్గా కాదని అనుకొని అన్ని పనులు వాళ్ళ నెత్తిన వేసుకుంటారు. ఇక అంతులేని పనులతో అనారోగ్యం, మానసిక ఒత్తిడి మిగులుతాయి. అందుకే ఇంట్లో ఎవరు చేయదగిన పని వాళ్లకు అప్పగిస్తే పనిభారం తగ్గుతాయి. ఇది ఆఫీస్ లో కూడా వర్తిస్తుంది. […]
మొహమాటానికి ఎప్పుడూ పోవద్దు
నీహారికా, ఈ రోజుల్లో అమ్మాయిలు చదువు కోసం, జాబ్ కోసం హాస్టల్లో లేదా నలుగురైదుగురు స్నేహితులతో కలిసి వుండటం చాలా సహజం. కొన్ని మర్యాదలు పాటిస్తే జీవితం చాలా సాఫీగా గడిచే మాట వాస్తవం. సహజంగా స్నేహితుల షేరింగ్ చాలా అవసరం. ఆహరం, ఆర్ధికం, చదువు, తోడుగా వుండటం ఇలా ఎన్నో విషయాల్లో ఒకళ్ళతో ఒకళ్ళు అండదండలుగా ఉండచ్చు. కానీ ఇది మొహమాటం కోసం ఖచ్చితంగా చేయకూడదు. ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారని అడిగిన వస్తువులు […]
అప్పులతో ఎప్పుడైనా తిప్పలే
నీహారికా, ఇప్పుడొక సర్వే గురించి చెప్పాలనుకున్నాను, శ్రద్ధగా వినాలి నువ్వు. అందరి దగ్గరా ఇప్పుడు క్రెడిట్ కార్డులుంటున్నాయి. ఎన్ని కార్డులు వుంటే అంత గొప్ప మామూలుగా. సాధారణంగా ఏ వస్తువు అప్పటికప్పుడు కంటికి ఇంపుగా కనిపించినా వెంటనే కొనేయడానికి పర్సులు వెతుక్కోనక్కరలేదు. చేతిలో క్రెడిట్ కార్డు వుంటుంది. వెంటనే కొనేస్తారు. కానీ ఆ అప్పు మన బ్యాగ్ లోంచి రాదుగా. అది క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు 30, 40 శాతం ఎక్కువగా చెల్లిస్తున్నారనుకోవాలి. తాత్కాలికంగా ఈ అవకాశం […]
నలుగురిని కలుపుకు పోగలిగితే చాలు
నిహారిక, లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎవరికీ పుట్టుకతోనే వచ్చి తీరాలని రులెంలేదు లీదెర్ గా ఎదగాలంటే సామర్థ్యం, ప్రతిభ అలవర్చుకునేవి కూడా. అలాగే నేను కోరిక ముఖ్యం. ఎన్నో సవాళ్ళని స్వీకరించి తమకు తామే నిరూపించుకోవాలి. అలాగే మనలో ఎంత నైపుణ్యం ఉన్న సరే మన చుట్టూ ఉన్న బృందం లోని నైపుణ్యాలను గుర్తించి వాళ్ళ దగ్గర ఏ సాయం తీసుకోవచో తెలుకోగల తెలివితేటలూ ఉండాలి. ఒక బృందంలో నాయకురాలిగా ఎదగాలంటే ముందర అందరిని కలుపుకుపోగల చానచక్యం […]
స్నేహమేరా జీవితం
నిహారికా, నువ్వు ఎక్కువగా ఎవరితో టచ్ లో వుంటావంటే ఫేస్ బుక్ అన్నావు. ఫేస్ బుక్ అంటే అందరికీ ఇష్టం. అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్ లోనే స్నేహం మొదలవుతుంది. ముక్కు, మొహం తెలియని వాళ్ళు కూడా ప్రతి రోజూ పలకరించుకుంటూ ఆత్మీయులైపోతారు. అసలా కాన్సెప్ట్ క్లిక్ అవటానికి ముఖ్య కారణం స్నేహం అనే రెండక్షరాలు. అలాటి స్నేహాన్ని నిర్వచించడం కష్టం. మన జీవితం చుట్టూ ఎన్నెన్నో స్నేహ పరిమళాలు. ఎన్నెన్నో భావాలు, ఎన్నెన్నో మాటలు ఎప్పుడూ స్నేహితుల […]
వత్తిడి తగ్గించుకొనే పద్ధతులివే
నీహారికా, పరీక్షల ముందుగానీ, ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా, ఇంట్లో పని ఎక్కువైనా, ఒకేసారి ఎన్నో పనులు చేయవలసి వచ్చినా ఒత్తిడి ఎక్కువై పని మీద ఏకాగ్రత తగ్గిపోయి కంగారుగా వుంటుంది. అయితే ఏ మందులు లేకుండా ఇందులోంచి బయట పడే మార్గాలున్నాయి. ముందర ఒత్తిడి గా అనిపిస్తే నలుగురి మధ్య కూర్చుని కబుర్లు చెపితే ఆ సందడికి ఒత్తిడి మాయం అవుతుంది. అలాగే ఒకేసారి పనుల ఒత్తిడి అనుకుంటే ఇందుకు కారణం సరైన ప్రణాళిక లేకపోవడం […]
అన్నీ తెలుసుకోవడం కుదరదు
నీహారికా, చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చేస్తుంది. చదువులోంచి జాబ్ లోకి అడుగుపెడితే ఆ కొత్త వాతావరణంలో, హుందాగా, పద్ధతిగా క్రమశిక్షణలోకి రావాలంటే కష్టమే. మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుంటే అక్కడ ఇమిడిపోవడం సులభమే. ముందుగా సమయపాలన అలవర్చుకోవాలి. ఆఫీస్ టైమ్ కంటే పది నిముషాలు ముందే అక్కడ వుండేలా చూసుకోవాలి. అలాగే కొత్త వాతావరణంలో ఇమడటం సమయo తీసుకునే వ్యవహారం కాబట్టి ముందుగా చేయవలసిన పనులు నేర్చుకొంటూ ఆఫీసుకు అలవాటు పడాలి. ప్రతి పని నెమ్మదిగానే […]
మరీ డీప్ గా వెళ్ళకపోతే చాలు.
నీహారికా, ఒక కొత్త ప్రదేశాలోకి వెళితే నలుగురితో కలిసి పోవడం ఎలా అన్నావు. ఏముందీ మొట్ట మొదట కాలేజీలో అడుగు పెట్టినప్పుడు ఎలా వుంటుంది. చుట్టూ ఎంత మంది వాళ్ళతో బెరుకు బిడియం వదిలి పెట్టి స్నేహంగా మాట్లాడి కలిసిపోము అలాగే. మన లాగే మిగతా వాళ్ళకి కొత్త చూటు ఇబ్బందిగానే వుంటుంది. అమనం మాత్రం కాస్త ఓ అడుగు ముందుకు వేయకూడదు? మీరు ఎక్కడ నుంచి పేరేమిటి? వంటి చిన్ని చిన్ని ప్రశ్నలతోనే మొదటి అడుగు […]
ఈ అలవాటు ఇబ్బందులు తెచ్చేదే.
నీహారికా, మీ వదిన సమస్య చెప్పావు. ప్రతి వాతావరణంలోనూ షాపింగ్ కు వెళ్ళడం ఎదో ఒకటి కొనడం అలమరలో నింపేస్తుంది. ఇదేమైనా జబ్బా, మనసిక వైద్యుడి సలహా తీసుకోవాలా? ఈ షాపింగ్ వీక్నెస్ ఏమిటి అని అడిగావు. నిజమే ఇది షాప్ హాలిక్. తప్పనిసరిగా వదిలించుకోవలసిన జాడ్యం కాకపోయినా కొంత నియంత్రణ కావాలి. ఆమె షాపింగ్ కు అడిక్ట్ అయిపోయివుంటుంది. సాధారణంగా షాపింగ్ అందరికీ ఇష్టం ఇందులో ఆనందం ఉంది. అలాగే ఒక సమస్య ఏమిటంటే ముఖ్యంగా […]
డబ్బు విలువ నేర్పించడం ముఖ్యం.
నీహారికా, నీ ప్రశ్న అలోచింపజేసేదే. ఎంతో మంది దంపతులు ఒక్క బిడ్డ వుంటే చలనుకోంటున్నారు. అలా ఒక్కడే వుంటే ఇక ఆ ఇంటి అతి గరబామే. సింగిల్ చెయిల్డ్ అయితే స్పాయిల్ అవుతారు. స్వార్ధంతో ఒంటరి తనంతో మొండిగా ఉంటున్నారని సాధారణంగా వినబడే కామెంట్. ఇలాంటి వ్యాఖ్యానాలను ఖండించడానికి ఎన్ని ఉదాహరణలు వున్నాయో సపోర్టు చేయడానికి అన్నే ఉదాహరణలున్నాయి. ఇంట్లో ఒక్క బిడ్డే వుండటం తో సాధారనంగా తల్లిదండ్రుల ఫోకస్ ఎటేన్షన్ ఎక్కువే ఉంటాయి. తల్లి బిడ్డలకు […]
నిర్ణయం తీసుకుంటే కట్టుబడాలి.
నీహారికా, ఈ ప్రపంచం లో మను ష్యులం ఒక లాంటి వాళ్ళమే అందరకీ మంచిగా జీవించాలని వుంటుంది. కొత్త సంవత్సరం రాగానే మనలో చాలా మంది చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేలా కృషి చేయాలనో, సిగరెట్లు మనాలనో లేదా ఎదో మాన్ల్ని ఇబ్బంది పెట్టే దురలవాట్లు మనుకోవాలనో అనుకుంటారు. నిర్ణయాలు ఎంతో తొందరగా మరచిపోతారు. ఒక నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడం ఎంత కష్టం. మధ్యాహ్నం నిద్రమానేస్తాం అనుకుంటామనుకో అలవాటైతే […]
తెలవారే చీకట్లో……….
నీహారికా, ఏం చేస్తే ప్రతి ఉషోదయం ఆహ్లాదకరంగా మొదలవ్వుతుంది అన్నావు మంచి ప్రశ్నే, సాధారణంగా అందరూ లేచీ లేవగానే ఎవరికీ రోటీన్ లో వారు పడిపోతారు. కొందరు పేపర్ తీస్తారు, కొందరు వార్తలకోసం టీ.వి ఆన్ చేస్తారు. ఇప్పుడైతే ఎక్కువ మంది లేస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకుని సందేశాలు ఈమెయిల్స్ చెక్ చేసుకుంటారు. కానీ రోజును అందంగా ఆహ్లాదంగా అభినందించేందుకు ఇవేమీ సరైనవి కావు. అసలు ఉదయం అంటే నువ్వు అన్నట్లు ఉషోదయం మొదటి వెలుగు కిరణం […]
అదృష్టం గురించి ఆలోచించాలా?
నీహారికా, నువ్వు అడిగిన ప్రశ్న ఒక్కో సందర్భంలో అందరికీ అనిపిస్తుంది. కొందరినే అదృష్టం ఎందుకు వరిస్తుంది? అని కరక్టే అలాగే దీని పక్కనే ఇంకో ప్రశ్న పెట్టేద్దాం కొందరినే ఎందుకు కష్టాలు వరిస్తాయి? ఇప్పుడు విషయం సరిగ్గా అర్ధం అవుతుందనుకోంటాను. మహారాజైనా, సామాన్యుడైనా జీవితంలోని అనుభవాలు ఒక్కలాంటివే ఏ ఒక్క రోజు ఒకేలా గడిచిపోదు. చెడు అనుభవాలు లేని మనిషంటూ వుండదు. అలాగే అదృష్టం విషయంలోనూ ఎలాంటి లాజిక్ కుడా లేదు. వెళుతూ వెళుతూ జారిపడటం ఎలా […]
ఈ వయసే కీలకం.
నీహారికా, టీనెజ్ అన్నది జీవితంలో అతి ముఖ్యమైన ఒక ఆమంచి మలుపు. ఈ వయస్సులో వచ్చే అనుభవాలే పెద్దయ్యాక అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. అప్పుడు నేర్చుకొన్న మంచి విషయాలు ఎదిగాక మంచి జీవితం గడపడానికి సహకరిస్తాయి. అందుకే యుక్త వయస్సులో అడుగు పెడుతున్న వాళ్ళతో దృఢమైన బంధాలు, అనుకూలమైన అనుసంధానంతో వుండాలి. అదే సమయంలో ఎదుటి వాళ్ళ ప్రలోభాలకు గురి కాకుండా తమ స్వతంత్ర ప్రతి వత్తిడిని కాపాడుకోవాలి. ఈ అంశాన్ని సమర్ధవంతంగా జీవితానికి అన్వయించుకోకపోతే […]
సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి.
నీహారికా, భోజనానికి, ఆరోగ్యానికి, జీవనశైలికి, ఆరోగ్యానికి సంబందం ఏమిటన్నావు. జీవన శైలి లోనే టాక్సిక్ పదార్ధాలు తినడం వత్తిడి తో పని చేయడం, సరైన వేళలు ఏ విషయంలోనూ పాటించకపోవడం మొదటి అనర్ధం. అలాగే టాక్సిక్ పదార్ధాలు లేని ఆహారాన్ని తింటామా? కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ లీన్ ప్రోటీన్లు అత్యవసరమైన ఫ్యట్స్ విటమిన్లు నీరు వంటి పోషకాలు సక్రమంగా అందే ఆహారం తినాలి. పరిసుద్దమైన గాలి స్వచ్చమైన నీరు సూర్యకిరణాలు కూడా కావాలి. వ్యాయామం చేయాలి. విశ్రాంతి కావాలి. […]
కఠోర శ్రమ పట్టుదలే మూలం.
నీహారికా, ఎప్పుడూ విజయపు దారినే నేను నడవాలి, అందుకు నాకు తోడుగా వచ్చేదేమిటి అన్నావు కదా. సోమర్ సెట్ మామ్ ఏమంటాడో చూడు. ‘గొప్ప ఫలితాలు ఆశించే వాళ్ళు, సాధారణమైన వాటిని తిరస్కరించాలి. ఎంతో ఆత్మ విశ్వాసం తో విజయం వైపు ప్రయాణం చేస్తేనే అద్భుతమైన ఫలితాలు ఎదురొస్తాయి’ అని. అలాగే నీ అంతరంగం విశ్వం కంటే విశాలమైంది. ఎంతో శక్తివంతమైంది కూడా. నీ విశ్వాసానికి మూలాలు నీ అంతరంగంలోనే ఉన్నాయంటాడు స్టీవ్ ఫోర్బ్స్. మన ఆలోచన […]
ఓ అరగంటని మీకోసం కేటాయించండి.
నీహారికా, ఇంటా బయటా పని వత్తిడితో నలిగిపోయే మహిళలు ఎప్పుడూ చేసే పొరపాటు ఏమిటంటే ఆ పనుల్ని కుటుంబ సభ్యులతో షేర్ చేయకపోవడం. అన్ని పనులు మనమే చేద్దామని పూనుకోవడం వల్లనే ఎంతో వత్తిడీ, శ్రమ. ఏ పనీ సమయానికి పూర్తి కాకపోవడమే రిజల్ట్. కొన్ని పనులు పక్కవాళ్ళకి అప్పగిస్తే, పిల్లలు, పెద్దలు అలవాటుగా కొన్ని పనులు చేసేటట్లు చేస్తే అప్పుడు కాస్త పని వత్తిడి తగ్గే అవకాశం వుంటుంది. సరిగ్గా ఏ పని ఎప్పుడు చేయాలో, […]
ఈ మాత్రం సంతోష పెట్టలేమా?
నీహారికా, ఇతరులకు సంతోషం పంచి ఇవ్వడంలో మనకు సంపూర్ణమైన ఆనందం లభిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో కూడా మనకి నవ్వులు, పలకరింపులు కావాలి. ఒక్కోసారి మనలో ఉత్సాహం నశించి పోతూవుంటే దాన్ని ఇవ్వగల స్నేహితులు కావాలి. సందేహం వచ్చినప్పుడు ఆత్మ విశ్వాసం కలగాలి. మనకు సత్యం స్వీకరించగల హృదయం ఉండాలి. జీవితం పరిపూర్ణంగా వుండాలంటే మనకు నిజమైన ప్రేమ లభించాలి. ఇలా వేయి విధాల ఆనందం వుందనుకో, మనం అప్పుడా సంతోషాన్ని ఇతరులకు రెండు చేతులా పంచగలం, […]
స్థిత ప్రజ్ఞతకు మరోరూపం ఆత్మవిశ్వాసం.
నీహారికా, తరచుగా ఆత్మవిశ్వాసం అన్న పదం వాడుతూ వుంటారు. దీనితో దేన్నయినా జయించవచ్చు అని. నిజమే అంటే మనపైన మనకు ఎంత విలువ, ఇష్టం గౌరవం వుంటే అంత ఆత్మవిశ్వాసం ఉంటుందని. ఈ విశ్వాసం పెంచుకోగలం కూడా. ఎలా అంటే మన అభిప్రాయాలు, విశ్వాసాల పట్ల మనకు నమ్మకం ఉండాలి. మనల్ని మనం విమర్శించుకోవడం తగ్గించుకోవాలి. లక్ష్యాలు ఉండాలి కానీ మరీ అందుకోలేనంత ఎత్తున పెట్టుకోకూడదు. సౌందర్య పోషణ చాలా అవసరం. మన రూపం, వస్త్రధారణ మనపైన […]
