Thursday, 06 Aug, 2026

ఇబ్బంది పెట్టే గాసిప్స్ వినొద్దు.

నీహారికా, ఈ గాసిప్స్ ఏమిటీ? వీటిని కేర్ చేయాలా అన్నావు, మనుష్యులు ఎక్కడుంటే అక్కడ గాసిప్స్ తప్పవు. కమ్యూనికేషన్ కు ఇదొక పాత పద్ధతి లాంటిది. కొద్ది మోతాదు దాకా గాసిప్స్ సహజం హానికరం కావు. కానీ కొన్ని మనసుని నొప్పించే గాసిప్స్ హింస లాంటివి. వీటిని విజయవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం కావాలి. ఆఫీస్ గాసిప్ లనయితే వర్క్ ప్లేస్ రియాలిటీ గా భావించాలి. ఇవి విశ్వమానవ ప్రవర్తనలో భాగం. స్త్రీ పురుషులిద్దరూ ఈ గాసిప్స్ ను […]

మనల్ని మనం ప్రేమించుకోవడం కరక్టే.

నీహారికా, మనల్ని మనం ప్రేమించుకోవాలా? మన ఆలోచనలు ఇష్టాలు అన్నీ సరైనవే. మనం ప్రత్యేకమైన వాళ్ళం అనుకోవాటం అవసరం. మన పట్ల మనకు ప్రేమ గౌరవం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ప్రేమ అన్నది ఫీలింగ్ కాదు ఒక శక్తి. ఎటువంటి షరతులు లేకుండా ఎవర్ని వారు ప్రేమించుకుంటే మన లో ఇగో తో మనం ఫైట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇగో విడదీయరానివి. అటువంటి ప్రేమ లేనప్పుడు మనకు మనం ఫైట్ చేయాల్సిన పని లేదు. ఇది […]

ఈ కష్టం తల్లిదండ్రులదే

నీహారికా, పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా సున్నితంగా వ్యవహరించాలని ఎక్స్పర్ట్స్ చెపుతూనే ఉంటారు. కానీ అన్నింటి కంటే ముఖ్యమైనది తల్లిదండ్రులు తమ భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. వాళ్ళు తెలియకనే ఖరీదైన వస్తువులెన్నో పాడు చేస్తారు. అలాంటప్పుడు కోపం వస్తుంది. కానీ ఆ కోపంతో పిల్లల్ని కొట్టడం, తీవ్రంగా మందలించడం తప్పంటారు. కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. స్వరాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. పిల్లలు తెలియకనే తప్పులు చేస్తున్నారని మనసుకు అందేలా చెప్పుకోవాలి. వెంటనే పిల్లల స్థాయికి దిగిరావాలి. వాళ్ళను ఎదురుగా […]

ఉద్యోగ వాతావరణంలో ఇమిడి పోవాలి.

నీహారికా, చదువు ముగించి కొత్తగా జాబ్ లో జాయిన్ అయితే అప్పటి వరకు ఉండే ఆహార్యం తో పాటు అలవాట్లు, పద్ధతులు మార్చుకోవలసి వస్తుంది. చాలా కాజువల్ గా వుండే అమ్మాయిలు హుందాగా, అఫీషియల్ గా కనిపించవలసి వస్తుంది. కొన్ని ఆఫీసులకయితే ఎలాగు డ్రెస్ కోడ్ ఉందనే వుంటుంది. ముందుగ కొలీగ్స్ తో చిరు నవ్వుతో వ్యవహరించాలి. అది ఎంతో ఉపయోగపడుతుంది. ఎలా మాట్లాడుతున్నారు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారన్న దానిపై మన వ్యక్తిత్వాన్ని అవతల వాళ్ళు బేరీజు […]

స్త్రీలకు పిల్లలే ముఖ్యం.

నీహారికా, చాలా కోపమేచ్చె రిపోర్ట్ ఒక్కటి వచ్చింది. ఈ అధ్యాయినం ఇరవై రెండు దేశాలకు చెందిన 18 వేలమందితో నిర్వహించారు. ఇందులో తమ అభిప్రాయం చెప్పిన వారిలో స్త్రీలు, పురుషులు కుడా సమానంగానే వున్నారట. మొత్తంగా తేల్చేది ఏమిటంటే స్త్రీలు ఎంత పెద్ద హోదాలో వున్నా సరే, ముందుగా ముందుగా పిల్లల్ని కనడం పెంచడం మాత్రమే ప్రధాన భాద్యత అని చెప్పారట. మిగతావన్నీ తర్వాత మాటే. మేనేజర్ కావచ్చు. చిరుద్యోగి కావచ్చు. వీటన్నింటి కన్నా పిల్లలు కనడానికే […]

పర్ఫెక్షన్ విషయంలో పట్టుదల వద్దు.

నీహారికా, అన్ని పనులు పర్ఫెక్ట్ గా చేసే అలవాటు మంచిదే అయినా పర్ఫెక్షన్ కోసం అంతా గందరగోళం చేసుకోవడం మాత్రం తప్పే, ఏ పని చేసినా కరెక్ట్ గా ఉండాలనుకోవడం మంచి ధృక్పదమే. అయితే ఏమాత్రం తేడా వున్నా అంగీకరించలేని ధోరణి మాత్రం సబబు కాదు.అందుకే వీలయినంతవరకు పనిని సక్రమంగా ఎంత మాత్రం రాజీ లేకుండా చేయడానికే ప్రయత్నం చేయాలి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఎన్నో అనుభవాలు, తప్పులు, విజయాలు వికాసంలో సంభవించే చర్యలుగా తీసుకోవాలి. అభివృద్ధి […]

ఇచ్చుటలో ఉన్న హాయీ…

నీహారికా, మనం నిముష నిముషం గుర్తు తెచ్చుకోవలసిన విషయం ఒకటుంది. జీవితాన్ని ఆనందంగా గడపాలంటే, మనిషి జీవితం సంతోషమయం కావాలంటే ఏం చేయాలి. మనిషి ముందర సంతృప్తిగా జీవించాలి. ఆ సంతృప్తి ఎక్కడ దొరుకుతుందీ అని అన్వేషిస్తే ఇవ్వడంలో అని తేలిందట. అవును ఎవరో సినిమా కవి చెప్పినట్లు “ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని” మనకున్నదానిలో ఎదుటి మనిషికి ఏదైనా ఇవ్వడం, సాయం చేయడంలో కలిగే తృప్తి వర్ణించతరం కాదని తేలింది. నిజమే మనకి సంతృప్తి […]

నిజాయితీ అన్నది ఒక పరిమళం

నీహారికా, ఎవరిరైనా సరే చిన్నపాటి తప్పు చేయకుండా రోజు గడవదు. కానీ అలాంటి చిన్న తప్పు చేశామని తెలిసీ ఎవరికైనా ఎలా తెలుస్తుందిలే అని సరిపెట్టుకుంటాం. కానీ ఇదే అలవాటైపోతే ఇదే ఒక ఆఫీస్ అయితే, ఆ ఆఫీస్ జీవితం మన కెరీర్ అయితే, ఒక తప్పు జరిగితే దాన్ని పై అధికారికి వెంటనే చెప్పటం వల్ల పెద్ద నష్టం ఏమి ఉండదు. మనం మన బాస్ కంటే తెలివైన వాళ్ళం అనుకుంటాం. కానీ బాస్ స్థానంలో […]

మనస్పూర్తిగా నిజాయితీగా వుండాలి.

నీహారికా, ఈ పదం విన్నావా, ఎమోషనల్ హానెస్టి. ఈ ఎమోషనల్ హానెస్టి ఉంటేనే మనకు మన చుట్టూ వున్న వారితో బంధువులు, స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు సజావుగా ఉంటాయి. అంటే మనం మన పట్ల, ఇతరుల పట్ల నిజాయితీగా వ్యవహరించాలన్నమాట, అందులో స్నేహంగా ప్రేమా గా వ్యావహారిస్తూ వారీ వెనక మూడో వ్యక్తి సమపక్షంలో విమర్శలు, వ్యాఖ్యానాలు చేయకూడదు. ఎదురుగా వున్నారు. కదా అని ఒక రకంగానూ వెళ్ళిపోయారు కదాని ప్రతికులంగా మాట్లాడితే  ఎమోషనల్ హానెస్టి మనలో […]

భావోద్వేగాలకు లోనై కర్చు పెడతాం.

నీహారికా, ఒక రిపోర్టు చాలా ఆలోచించదగిన విషయాలు చెప్పుతుంది. మన భావొద్వేగాలు మనం పెట్టే కర్చులను ప్రభావితం చేస్తాయిట. దీన్ని బిహేవియిరేల్ ఎకనామిక్స్ అంటున్నారు నిపుణులు. మన ఉద్యోగాలను అదుపులో పెట్టుకోగలిగితే కర్చులు అదుపులోకి వస్తాయన్నమాట. సాధారణంగా మనస్సు’ బాగోకపోతే షాపింగ్ చేస్తాం. అవసరం కంటే ఎక్కువగానే ఖర్చు చేస్తాం. మనం కొనే వస్తువుల వల్ల మనకి సంతోషం వస్తుందనే ఆలోచన వల్లనే కావొచ్చు. న్యాయానికి మన సంతోషం మన మనసులోనుంచి వస్తుందని కానీ మనం డబ్బు […]

అసాధ్యాలన్నీ సాధ్యం చేస్తేనే జీవితం.

నీహారికా, కొన్ని విషయాలు చెప్పినంత తేలికగా సాధ్యపడతాయి అనిపిస్తుంది. కానీ తప్పని సరిగా చేయాలిగా…. జీవితంలో ఒడిదుడుకులు సహజం. కష్టం వస్తే దాన్నే పట్టుకుని వేలాడటం, సంతోషం వస్తే అదే జీవితం అనుకోవడం తప్పే. ప్రతి విషయాన్నీ పాజిటివ్ గా తీసుకోవాలి. మంచి వైపుకు తొంగి చూడాలి. విశ్వం అందించే ఎన్నెన్నో అవకాశాలు ఆశ్చర్య పెడతాయి. ఏ అంశం ఏ పరిస్తితి, ఏ అవకాశం కూడా ఇదే చివరిదిగా భావించ కుడదు. చేతులు సాచి జీవితపు అనుభూతులను […]

అమ్మకు ప్రేమతో ఏమిస్తారు?

నీహారికా, నీకు వింతగా అనిపించిన విషయం ఒకటి షేర్ చేస్తున్నాను. ఫారిన్ నుంచి మా పిల్లలు ఎన్నో నా కోసం తెస్తారు కానీ అన్ని నేను వంటింట్లో వాడుకోగాలిగేవే లేదా వంట తేలికగా చేసుకో గలిగేవే. కానీ నాకోసం ఇంకేం ఉండవా అని విచార పాడింది ఓ అమ్మ. నిజమే చాలా మంది ఊరినుంచి ఇంటికొచ్చేటప్పుడు ఇంట్లో అందరికి ఎన్నో వస్తువులు తెస్తారు. అమ్మకి వంట గిన్నెలు తెప్పించి ఇంకేం వుండవా? ఆమెకు ఉపయోగ పడే ఫిట్నెస్ […]

మనమేమిటో మన చూపు, మాట చెప్పేస్తాయి.

నీహారికా, కొన్ని సందర్భాలలో పర్ ఫెక్ట్ గా కనిపించాలన్నది రూల్ అనుకోవాలన్పిస్తుంది. ఇంట్లో నువ్వు క్యాజువల్ గా కనిపిస్తావనుకో, అదే స్నేహితులను కలిసేందుకు వెళితే పర్లేదు. కానీ కొత్త వాళ్ళ ముందుకు మాత్రం పద్దతిగా వెళ్ళాలని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. కొత్త వాళ్ళను కలుసుకునేందుకు మనం శ్రద్దగా తయ్యారయ్యామని అవతలి వాళ్ళకు కలగాలిట. అలాగే తెచ్చి పెట్టుకున్నట్లుగా నవ్వమంటే నవ్వామన్నట్లు ఉండకుడదు. నవ్వు హాయిగా వినిపించాలి. పెదవులు చివరి వరకు సాగదీసి చంప కండరాళ్ళు కదిలేలా నవ్వితేనే […]

ఇలాంటి ప్రశ్నలు కష్టమే.

నీహారికా, పిల్లల మాటలు,చేష్టలు ఎప్పుడూముద్దొస్తాయి.ఒక్కసారి వాళ్ళ అమాయికమైన ప్రశ్నలు కూడా చాలా ఇబ్బందిలో పడేస్తాయి. టీవి లో ఏ సానిటరీ నాప్ కిన్ యాడో, ఏ కుటుంబ నియంత్రణ యాడ్ గానీ వస్తుంటే, నలుగురి ముందు అదేమిటి అంటారు. ఇంటికి ఎవరన్నాచుట్టాలోస్తే, ఆవిడెందుకు ఇంత లావుగా ఉంది అంటారు? లేదా నేనెలా పుట్టాను, ఎక్కడ నుంచి వచ్చాను? తమ్ముడు నీ పొట్ట లో ఎల్లా వచ్చాడు లాంటి భయంకరమైన ప్రశ్నలు అడిగి ఇరుకున పెడతారు సాధారణంగా నోర్ముసుకో […]

మాటలు మల్లెపువ్వుల పరిమళంలా వుండాలి.

నీహారికా, అక్షరాలు పెర్చుకొంటు, అచ్చం మల్లె బెండు లాంటి పరిమళం వచ్చేలాగ మాట్లాడటం ఒక ఆర్ట్. మధురంగా మాట్లాడటం ఒక కళ. చక్కగా నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్న వేళ, అప్రియులు మాట్లాడకూడదు. ఎలాగంటే “ఎన్ని ప్రమాదాలు ప్రపంచంలో ఇప్పుడు మనం కూర్చున్న ఎ.సి గదిలో మంటలోచ్చాయినుకో, ఒక్కళ్ళం మిగలం”. అన్నారనుకో, ఇక అక్కడ కబుర్లు సాగుతాయి. ఇవి వస్తావాలు కావొచ్చు. కానీ ఆ సందర్భ ప్రేలాపన. మాటలు రాళ్ళ వాసన కురిసినట్లు వుండటం అంటే ఇదే. […]

ఇతరుల ప్రాణాలు కూడా విలువైనవే

నీహారికా, నిన్నటి రోజు నువ్వు ట్రాఫిక్ లో అతివేగంగా కార్లు, ఇతర వాహనాలు తప్పిస్తూ బైక్ పైన రావడం చూశాను. ఇంత రద్దీలో నువ్వు నీ ప్రాణం, ఇతరుల ప్రాణం గురించి ఏమాత్రం లక్ష్యం లేకుండా ఎలా రెడ్ సిగ్నల్ దగ్గర జంప్ చేస్తూ వస్తున్నావో కూడా చూశాను. రహదారి పైన కాస్తయినా సంయమనంతో వ్యవహరించవా? నీలాంటి యువతే కార్లో వెళుతూ సీట్ బెల్ట్ పెట్టుకోరు, ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నా లక్ష్య పెట్టరు. ట్రాఫిక్ ఎక్కువగా వుంటే […]

నిబ్బరంతో బయట పడాలి.

నీహారికా, నీ అనుభవం నీ వయసులో ఉండే ఎంతో మందికి ఎదురయ్యిందే. ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుని కష్టపడి పనిచేస్తావు గుర్తింపు రాదు. ఆఫీసులో ఒక సెక్షన్ హెడ్ గా అవుతావు, మిగతా వాళ్ళు సరిగ్గా మాట వినరు. ఇలా ఒక్క కెరీర్ లోనే కాదు వ్యక్తిగత జీవితంలోను ఎన్నో ఓటములు ఉంటాయి. వాటి నుంచి బయట పడాలంటే చాలా నిబ్బరం కావాలి. అలా ఎప్పుడైనా ఓటమి ఎదురయితే ఉద్వేగంతో స్పందించకూడదు, నియంత్రణలో ఉండాలి. వీలైతే అలాంటి […]

అతి ముఖ్యమైన పనేదో ఎంచుకొంటే చాలు

నీహారికా, కరెక్ట్ గా చెప్పావు. నిముషానికో వాట్సప్ మెసేజ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ కదా న్యూస్ అలర్ట్ లు వస్తాయి. మెసేజులు, ఫోనులు, చదువు, పార్ట్ టైం జాబ్… అసలు ఏకాగ్రత ఒక్క పని మీద కూడా వుండటం లేదు అన్నావు. నిజమే ఇన్ని విషయాల మధ్య పని పై తదేక ధ్యాస నిలపటం కష్టం. కానీ అలవాటు చేసుకోవాలి. ప్రాధాన్యం లేని విషయాలు మనసు నుంచి, పరిసరాల నుంచి దూరం చేస్తేనే అసలైన వాటి పైన […]

సహజమైన అభారం శాంతం!

నీహారికా, సంతోషాన్ని నవ్వులతోనూ, పువ్వులతోనూ పోలుస్తారు. అలాగే కోపం, పగ, ప్రతీకారం వంటివి చీకటి తోనో, వడగాల్పు తోనో పోలిక తెస్తారు. ఎందుకంటే ఒక ఆనందం తో పాటు, మంచి ఆలోచన తో పాటు మనిషి ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్ చెక్కారు కొడతాయో, కోపంతో పగ, ప్రతీకారం వంటి పదాలు మనస్సులో మెదులుతూ, వున్న కోపాన్ని రెచ్చగొడుతూ మనిషిని తల కిన్డులు చేస్తాయి. మన మనస్సులో ఎవరి పైన అయినా ద్వేషభావం పగ ఉన్నయనుకో అవి ముందు […]

పిల్లలకు వంటిళ్ళు పరిచయం చేయడం అవసరం

నీహారికా, పిల్లలు పెద్దయ్యాక వాళ్ళెంతటి వాల్లె అన్ని నేర్చుకుంటారు అనుకొంటారు కానీ వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే కొన్ని నైపుణ్యాలు పరిచయం చేయడం చాలా మంచిది. ఉదాహరణకు పిల్లలు వంట గదిలోకి వస్తే చాలు ఏం కావాలి, ఎందుకొచ్చావు పోయి చదువుకోమంటూ తల్లులు తరిమేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్లనే అటు ఏ పై చదువులకు వేరే ఊరులో వుంది చాడుకోవాల్సి వచ్చినా , లేదా పెళ్లి అయ్యిపోయినా, ఇటు అబ్బాయికీ, అమ్మాయికీ వంటే రాదు. అదేదో పెద్ద […]