• హాబీలకు సమయం కేటాయించాలి

    నీహారికా , రోజుకు 12 గంటలే మేలుకుని ఉంటాం . ఈ కాస్త సమయం చదువుకు మిగతా పనులకే చాలవు. ఇంకా హాబీలు సృజనాత్మకమైన పనులు ఎక్కడ…

  • నీహారికా , ఇవ్వాళ ఓ అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. ఒక ప్రముఖ హార్డ్ వేర్ సంస్థ చేసిన అధ్యయన రిపోర్ట్ లు సంస్థలు ఓ కొత్త ప్రాజెక్ట్ చెప్పటలంటే అమ్మాయిలు దానిపైన వాళ్లకు పూర్తీ అవగాహనఉంటేనే ముందుకొస్తున్నారట. అదీ అబ్బాయిలు దానిపై 40 శాతం అవగాహన వున్నా అవకాశం వదులుకోకూడదు అని దూకేస్తున్నారట. మరి అమ్మాయిలు అంత సహనంగా ఆ అవకాశం ఉపయోగించుకుందామని ఎందుకు అనుకోరు ? అంటే చాల విషయాల్లో వెనుకడుగు వేసి సిగ్గుపడి . మొహమాటపడి బావుందనుకుని వెనకే వుంటారు . కానీ అధ్యయనకారులు ఆలా వెనక్కి తగ్గద్దు మీరు పడ్డ శ్రమ మీకు తెలిసినదాన్ని మీ నైపుణ్యాలనీ జీతం పదోన్నతీ విషయంలో దాచుకోకండి. మీ శక్తి సామర్ధ్యాలని తప్పకుండా ప్రచారం చేసుకోండి అంటున్నారు. ఒక జాబ్ లో చేరాక ఎంతో పని చేస్తారు నేర్చుకుంటారు . చదువుకునే కళాశాల నుంచి ఆ విఙానం తో గొప్ప విజయాలు సాధించేందుకు ఉద్యోగంలో అడుగుపెడతారు. అక్కడ ఏ అవకాశమూ వదులుకోవద్దు. మీరు సాధించిన విజయాలు సొంత డబ్బా అనుకుంటారేమో అన్న భయంతో మనసులోనే ఉంచుకోవద్దు. తప్పకుండా ప్రతి అవకాశం అందిపుచ్చుకోమంటున్నారు. చక్కగా ప్రతి ఇంప్రూవ్మెంట్ ని బయోడేటా లో చేర్చుకోండి. అదే మిమ్మల్ని కోరుకున్న గమ్యానికి చేరుస్తుంది. అంటున్నారు. ఈ రిపోర్ట్ ని నోట్ చేసి పెట్టుకుజో. ఫ్యూచర్ లో పనికి వస్తుంది.

    మిమల్ని మీరు పొగుడుకుంటే తప్పేం కాదు

    నీహారికా , ఇవ్వాళ ఓ అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. ఒక ప్రముఖ హార్డ్ వేర్ సంస్థ చేసిన అధ్యయన రిపోర్ట్ లు సంస్థలు ఓ కొత్త ప్రాజెక్ట్…

  • నీహారికా , మనం ఎవర్నేనా కలుసుకున్నప్పుడు ఫోన్ లో పలకరించుకున్నప్పుడు అంతా హ్యాపీ యేనా అని అడుగుతాం కదా . మనల్ని అలాగే అడుగుతారు . ఆరోగ్యంగానే కంప్యార్టబుల్ గానీ అని చెప్పినంత సులువుగా సంతోషం గురించి చెప్పేందుకు ఏవీ వుండవు. సంతోషం ఎక్కడి నుంచి రవళి. సంతోషం కావాలంటే అది వుండే వైపుకు ఓ అడుగువేయాలి . స్విమ్మింగ్ ఫూల్ లో జంప్ చేయునప్పుడు జుట్టు నీళ్లు చిందినంతగా మన చుట్టూ ప్రేముంటుంది. కానీ మనలో ప్రతికూలత ఇదంతా నిజమేనా అని అనుమానం భయం కోపం సందేహం ఇవన్నీ తొలగిస్తే ప్రేమ సంతోషం అన్నీ ఉంటాయి. అసూయ తొలగిస్తే ఆప్లేసులోకి ఇతరుల క్షేమం పట్ల ఆసక్తి కలుగుతుంది. సందేహం వదిలేస్తే ప్రపంచం మొత్తం ప్రేమ తోనే నిండివున్నట్లు ఉంటుంది. కోపం కాస్త తగ్గించుకుంటే ఎదుటి మనిషికి సర్వం ఇచ్చేద్దామనిపిస్తుంది. ఇలా మనలో వుండే ప్రతి కుల స్వభావాన్ని తీసేస్తూ వస్తే ఇంకేముంది. చిన్న గాలికి ఒక గడ్డిపూవు సౌందర్యానికి ఒక పసి పాప నవ్వుకీ ఎవరో తెలియని మనిషికి కూడా మనం చిరునవ్వుతో ఇచ్చే పలకరింపుకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేస్తాం. మనం చూపిన రెండు చేతుల నిండా స్నేహం ప్రేమ వాత్సల్యం ఇష్టం నిండిపోయేన్ని దొరుకుతాయి. ఆ సమయంలో ఎవరైనా హ్యాపీ నా అన్నారనుకో హ్యాపీ గాక ఈ జీవితంలో ఏముంటుంది ఆఖరి నిమిషం దాక మన పెదవులు ఎదో ఒక సందర్భాన్ని ఇష్టపడుతూ నవ్వుతూనే ఉంటాయి. టెన్షన్లు స్ట్రెస్ లు అస్సలు అనారోగ్యాలు మటు మాయం అయిపోతాయి. ఏమంటావు హ్యాపీ యేనా ?

    మీరు హ్యాపీ యేనా ?

    నీహారికా , మనం ఎవర్నేనా  కలుసుకున్నప్పుడు  ఫోన్ లో పలకరించుకున్నప్పుడు అంతా హ్యాపీ యేనా అని అడుగుతాం కదా . మనల్ని అలాగే అడుగుతారు . ఆరోగ్యంగానే…

  • నీహారికా ,ఒక ప్రత్యేకమైన రోజు అది పుటిన రోజు కావచ్చు. స్కూల్ ఫంక్షన్ కావచ్చు. పరీక్ష పాసయిన రోజు కావచ్చు. ఆరోహు ప్రత్యేకంగా కొత్త దుస్తులు వేసుకుని శ్రద్ధగా అలంకరించుకొంటాం. అంటే ఆరోజుని సెలబ్రేట్ చేయటం ఇవ్వాళ నాకెంతో ముఖ్యం నేనేదో సాధించాననే పాజిటివ్ ఫీలింగ్ మనల్ని ఉత్సాహంలో నింపుతుంది. ఆరోజు చూడు చిన్న ఆకు గాలికి కదిలినా మనల్ని పలకరించినట్లు ఉంటుంది మనలో ఒక ఆత్మ స్థైర్యం ఉంటుంది. అదెలా వచ్చిందంటే సంతోషం లోంచి మనల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఆనందం లోంచి వచ్చింది . మనం ప్రతి రోజునే ప్రతి నిమిషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటాను . అప్పుడు మనలో నెగిటివ్ ధాట్స్ రావు. ఒత్తిడి ఉండదు. రిలాక్స్ గా ఉంటాం. సృజనాత్మకత పెరుగుతుంది. మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి రోజునీ పుట్టిన రోజు లాగే భావిస్తే మన పుట్టుక ఎదో సాధించటానికనే ఆలోచన నీలో కలిగితే దానికోసం నువ్వు కష్ట పడేందుకు కదిలితే ఇంకేముంది చెప్పు . కష్టపడేందుకు సిద్ధం అయితే ఏది అసాధ్యం . ఒక వ్యాపారం లాభం సాధించినవారిని ఒక ఐఏఎస్ పాసయినవాడిని అదే ఇదెలా అంటే ఏమంటారు. దానిపైనే దృష్టి పెట్టాం అంటారు. విజయానికి దగ్గర దార్లు ఎప్పుడు వుండవు. రాజ మార్గమే. అలసట అనుకోకుడన నడిచి తీరటమే ! గమ్యం చేరటమే !

    ప్రతి నిమిషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం

    నీహారికా , ఒక ప్రత్యేకమైన రోజు అది పుటిన రోజు కావచ్చు. స్కూల్ ఫంక్షన్ కావచ్చు. పరీక్ష పాసయిన రోజు కావచ్చు. ఆరోహు ప్రత్యేకంగా కొత్త దుస్తులు…

  • నీహారికా , ఇందాక మా ఫ్రెండ్ మాట్లాడిన ఫ్రిజ్ లకు స్టిక్కర్ల వ్యవహారం నీకు నవ్వొచ్చింది కానీ చాలా మంది కుటుంబాలు ఇలాగె ఉంటున్నాయి, మా ఇంట్లో ఉన్న నలుగురం తలోదారిన ఉదయాన్నే ఉద్యోగాలు కాలేజీలు అంటూ బయటకి పోతాం. ఏవైనా చెప్పుకోవాలిసి వస్తే ఓ స్లిప్ రాసి ఫ్రిజ్ కి అంటించుకుంటాం. ఆ స్లిప్ లీ మామధ్య కమ్యూనికేషన్ అందామె. చాలా స్కూళ్లల్లో ఇంతే . కలిసి కూర్చుని భోజనం చేయటం మాట్లాడుకోవటాలు చర్చలు అన్నీ బంద్. హడావుడిగా మొక్కుబడిగా పరుగులతో జీవితం .. ఎవరి చేతిలో వాళ్ళ ఫోన్లు లాప్ టాప్ లు. అసలు ఒకళ్ళ నొకళ్ళు అర్ధం చేసుకునే అవకాశం కూడా లేని బిజీ ఉద్యోగాల భార్య భర్తలు వాళ్ళ పిల్లల డే కేర్ సెంటర్లలో ఏం జరుగుతోంది. మానవ సంబంధాలు నశించి పోతున్నాయి. అసలు మాటలే కరువైతే సంబంధాలెక్కడ? కానీ ఒకటి మాత్రం బలంగా చెప్పాలని వుంది. పగలంతా ఎవళ్ళ జీవితం వాళ్ళదిగా గడిపినా కనీసం రాత్రివేళ కలిసి భోజనం చేయండి. ఆ కాస్త సమయం మీకోసం మిగుల్చుకోండి. ఇంటి గురించి పిల్లల గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడుకోండి. మనుషుల మధ్య మాటల వంతెనలు లేకపోతే మాటలే తెగిపోతే ఆప్యాయతలు ఎలా వస్తాయి. అప్పుడు సౌకర్యాలు సంపదలే ఉంటాయి. కానీ ప్రేమించే మనుషులే వుండరు. ఆ స్థితి తెచ్చుకోవద్దు అని . ఏమంటావ్ !

    మాటలే తెగిపోతే ప్రేమ లెక్కడ

    నీహారికా , ఇందాక మా ఫ్రెండ్ మాట్లాడిన ఫ్రిజ్ లకు స్టిక్కర్ల వ్యవహారం నీకు నవ్వొచ్చింది కానీ చాలా మంది కుటుంబాలు ఇలాగె ఉంటున్నాయి, మా ఇంట్లో…

  • నీహారికా , స్నేహానికి కూడా హద్దులుంటాయి అన్నావు. హద్దులంటే స్థలాలకు ళ్ళకు మధ్య ఉండేలాంటివే. కొంతవరకే స్నేహంలో అయినా ముందులేళ్ళగలం. ఎంతవరకు వెళ్ళాలి. ఎలా గుర్తించాలి. అంటే మరి దాన్ని సభ్యతగా ప్రవర్తించటం అనాలి. మనిషి అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతి మనిషి చుట్టూ ఒక హద్దు గీత కనిపించకుండా ఉంటుంది. అది ఎంత దూరం అనేది ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటోంది . కొందరి సరిహద్దు చాలా విశాలంగా ఉండి ఎదుటివారిని కొంత మనసుకి దగ్గరగా రానిస్తుంది. కానీ మనం గుర్తించవలిసింది ఎదుటి వాళ్ళ వ్యక్తిగత సమయం వ్యక్తిగత అభిప్రాయాలూ ఆలోచనల హద్దులు స్నేహితులు కదా అని పర్సనల్ విషయాల్లోకి దూసుకుపోవటం అడక్కపోయినా అభిప్రాయాలూ చెప్పేయటం ఒక విషయంలో చాలా త్వరగా ఒక నిరణయానికి వచ్చ్చేయటం స్నేహాలను పాడుచేస్తాయి. అందుకే హద్దులు కావాలన్నది. ఎంత స్నేహితులు ఆత్మ బంధువు లైనా సరే ఒక సున్నితమైన రేఖ ఉంటుంది. మనం దాన్ని దాటి ప్రయత్నం చేయకూడదు . అలాగే అన్నీ గబగబా చెప్పేసుకుని మళ్ళీ మన విషయాలు అవతలి వాళ్లకు తెలిసిపోయాయే అన్న న్యూన్యత మన లోనూ రాకూడదు. అందుకని కొంచెంగా మనకు ప్రైవసీ ఉంచుకోవాలి. అందులోకి ఎవర్ని తొంగిచూడనీయ వద్దు. అదే హద్దుల్లో వుండే స్నేహం అంటే. అలావుంటే స్నేహాలు ఎప్పటికీ శాశ్వతం. !!

    కనిపించని సరిహద్దులుంటాయి

    నీహారికా , స్నేహానికి కూడా హద్దులుంటాయి అన్నావు. హద్దులంటే స్థలాలకు ళ్ళకు మధ్య ఉండేలాంటివే. కొంతవరకే స్నేహంలో అయినా ముందులేళ్ళగలం. ఎంతవరకు వెళ్ళాలి. ఎలా గుర్తించాలి. అంటే…

  • నీహారికా , కొన్ని వార్తలు చదువుతుంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది . ఈ పదం విను వాల్స్ ఆఫ్ కైండ్ నెస్. తెలుగు లోచూస్తే మానవత్వపు గోడలు. ఇవి జైపూర్ అలహాబాద్ డెహ్రాడూన్ వంటి అనేక నగరాల్లో నెక్కీ కీ దీవార్ పేరుతో కనిపిస్తాయి. ఆ గోడలకు అందంగా పెయింట్ చేసి మీకు అవసరం లేనివి ఇవ్వండి. మీకు కావలిసినవి పట్టుకుపోండి. అని కొటేషన్స్ రాస్తారు. గోడల నిండా హంగులుంటాయి. దాతలు తమకు ఉపయోగపడని దుప్పట్లు టోపీలు బట్టలు ఇలా తమకు అక్కర్లేనివి ఇతరులకు ఉపయోగపడతాయి అనుకున్నవి ఇక్కడ తగిలిస్తారు. పుస్తకాలూ చెప్పులు కూడా . ఈ సేవాతత్పరణ దేశం అంతా పారుతుంది. రోడ్డు పక్కన నివసించేవారికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇరాక్ పాకిస్థాన్ లోకూడా ఏ కాన్సప్ట్ మంచి ఫలితం ఇచ్చింది. ఇప్పుడు భోపాల్ లో మొదలుపెట్టారు. ఊరు పేరు దగ్గర నుంచి కృతజ్ఞతలు దొరుకుతాయి. దీని కోసం అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. అందంగా పెయింట్ చేసిన చిన్న గోడ కొన్ని హ్యాంగర్లు దానం ఇచ్చేవాళ్ళు ఇస్తారు. తీసుకునేవాళ్ళు తీసుకుంటారు. ఎలా వుంది చెప్పు. పేరే బావుంది. వాల్స్ ఆఫ్ కైండ్ నెస్. మానవత్వపు పరిమళాలు.

    మానవత్వపు పరిమళాలు ఈ గోడలు

    నీహారికా , కొన్ని వార్తలు చదువుతుంటే చాలా ఇన్స్పైరింగ్  గా ఉంటుంది . ఈ పదం విను వాల్స్ ఆఫ్ కైండ్ నెస్. తెలుగు లోచూస్తే మానవత్వపు…

  • నీహారికా , గంటసేపు ఏం మాట్లాడవు ఫ్రెండ్ తో అంటే ఎదో ఫార్మాలిటీ అన్నావు. కానీ నీహారికా కబుర్లు చెప్పటం ఒక ఆర్ట్. మాట్లాడే కళను అభ్యాసం చేయాలి. మాట్లాడటం కంటే మాటలు వినటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి సంభాషణల మాధుర్యం ఓర్పు గల చెవిలో దాక్కుని ఉంటుందిట. మనం గ్రూపుగా ఉంటే ఒకళ్ళ తోనే కబుర్లు మొదలుపెట్టకూడదు. మన వంతు వచ్చే వరకు వేచి చూడాలి. మాటకు ముందు ఆలోచన ఉండాలి. నాకే బాగా తెలుసన్న దృక్పధం కబుర్లలో దొర్ల కూడదు. ముఖ్యంగా మాట్లాడుతూ సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నావా ఇక సంభాషణలు వద్దనుకొంటున్నావని మెసేజ్ ఇచ్చినట్లు. ఎదుటివాళ్ళ మౌనాన్ని అర్ధం చేసుకోవాలి. సంభాషణలో నైపుణ్యాన్ని అలవర్చుకోవటం లాంటిదే ఇది కూడా . ఇతరులతో మాట్లాడటం ద్వారా మనం అర్ధం చేసుకునే విషయాలు కాలక్రమేణా మన ఆలోచనలు భావాలకు ఓ కొత్త రూపం ఇస్తాయి. అన్నాడో ప్రొఫెసర్. అంటే ఇతరులతో మనం మాట్లాడే మాటలు మనల్ని మనం తెలుసుకోవటానికి ఉపయోగపడతాయన్నమాట. సంభాషణలంటే మనల్ని మనం టచ్ లో ఉంచుకోవటం . మన ఇంప్రూవ్మెంట్ మనకే తెలుస్తుంది. మాటలంటే బంగారం కంటే విలువైనవి అపురూపమైనవి నిహారికా!!

    కబుర్లు చెప్పటం ఒక ఆర్ట్

    నీహారికా , గంటసేపు ఏం  మాట్లాడవు ఫ్రెండ్ తో అంటే ఎదో ఫార్మాలిటీ అన్నావు. కానీ నీహారికా కబుర్లు చెప్పటం ఒక ఆర్ట్. మాట్లాడే కళను అభ్యాసం…

  • నీహారికా , ఈ మధ్య కాలంలో ప్రపంచం చాలా మారిందంటావు. ఎలా మారిందో ఒక్క ఉదాహరణ చెప్పు అన్నావు . సరే విను. ఫ్యాషన్ రంగం. వంటల రంగం ప్రముఖంగా వినిపంచేవి మగవాళ్ల పేర్లే. అద్భుతమైన జ్యూవెలరీ తయారీ మగవాళ్లదే. ఆడవారికి అవసరమైన వన్నీ సృష్టించేది మగవాళ్లే. అలాగే వాళ్ళ ఇష్టాయిష్టాలన్నీ బాగానే పసిగడుతున్నారా ? లేదా ? వంటలతో బెస్ట్ చెఫ్స్ గా మగవారే కదా. డాన్సింగ్ స్కూల్స్ మగవాళ్లవేనా ? ఫ్యాషన్ రంగాన్నీ వాళ్లే. షాపింగ్ ఎంత కంఫర్టబుల్ గా చెయ్యాలో ఎలా ఉంటే ఆడవాళ్లు షాపులకు పరుగెత్తుకొస్తారో డిజైన్ చేసేది ఎవరు ? ఆడవాళ్ళ సంపాదన ఎక్కువైతే ఇంటి పట్టున ఉంది హౌస్ హస్బెండ్స్ గా బాధ్యత తీసుకునేవాళ్ళు ఎక్కువవడం లేదా ? భార్య భర్తలకు సమాజం నిర్దేశించిన బాధ్యతలకు దాటి ముందుకెళుతున్నారా ? లేదా ? నా సంపాదన మీద పెత్తనం నాదేనన్న భావన పోతుంది . ఇద్దరు రాబడి తో బడ్జెట్ వేసుకుని ఇల్లు నిజమైన పొదరిల్లు గా మారిపోవటం లేదా ? కెరీర్ లో దూసుకుపోతున్న ఆడవాళ్ళ వెనక భర్తల సాయం ఉంటోంది. ఈ సామజిక సంసారిక సంస్కరణలు వచ్చాయి. జీవితం అనే దీపాన్ని భార్య భర్తా చెరో రెండు చేతులు అడ్డం పెట్టి కాపాడుకోవాలని చాలా మందికి అర్ధం అయ్యింది . చూద్దాం ఇంకా సమాజం మారిపోవచ్చు.

    ఎవరన్నారు మారలేదని

    నీహారికా , ఈ మధ్య కాలంలో ప్రపంచం చాలా మారిందంటావు. ఎలా మారిందో ఒక్క ఉదాహరణ చెప్పు అన్నావు . సరే విను. ఫ్యాషన్ రంగం. వంటల…

  • నీహారికా , లైఫ్ కూల్ గా సక్సెస్ ఫుల్ గా పదిమందిలో గుర్తింపు ఉండేలా సాగితే బావుంటుంది అన్నావు. అంటే వ్యక్తిగత పరిపూర్ణత కావాలి. సామజిక గౌరవమూ దక్కాలి. ఇవి రెండు కావాలంటే మనలోని శక్తినీ నైపుణ్యాన్ని గుర్తించి వాటిని సరైన తీరులో ధోరణిలో ఉపయోగించుకోగలగాలి. జీవితం సక్సెస్ ఫుల్ గా సాగాలంటే ఐపోతుందా. వ్యక్తిగత పరిపూర్ణత కు విజయం ఆరోగ్యం ప్రధాన పఠనాలు. వీటితో సంతోషం సంపదా రెండు దక్కుతాయి. చాలా మంది దృష్టి లో విజయం అంటే పొజిషన్ పవర్ దానం. కానీ వీటన్నింటినీ మించి మనకు మన పట్ల ఇతరుల పట్ల ఆరోగ్య సంబంధమైన సంబంధ భాంధవ్యాలు కలిగి ఉండటం శారీరికమైన భావోద్వేగ పూరితమైన ఆరోగ్యం కూడా అవసరం. హోదా ఆస్తులు విజయానికి అర్ధం అంటే సరిపోదు. ఇంకా ఎన్నెన్నో వున్నాయి. మానవ సంబంధాలు మనుషుల పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఇతరులను మన వైపు నుంచి చూడటం కాకుండా వాళ్ళ స్థానంలో నిలబడి వాళ్ళలాగా ఆలోచించి వాళ్ళ గురించి ఒక అంచనా కు రావటం ఇవీ ముఖ్యం. ఇదెంత కష్టమో అంత తేలిక. ఒకళ్లనుంచి తేలికగా ఒక నిర్ధారణ కు వస్తాం. కానీ వాళ్ళు మన స్థానంలో ఉంటే మన గురించి ఎలా ఆలోచించగలరు ? అని చుస్తే మనకు సరైన దృక్పధం ఉన్నట్లు. ఇదే వ్యక్తిగత పరిపూర్ణత అంటే. మనల్ని ప్రపంచం వీళ్ళు అన్ని అంచనాలకు నిలబడేవాళ్లు అని గుర్తిస్తుంది. ఇదీ విజయవంత మైన జీవితం అంటే . కొంచెం ఆలోచించు.

    పవర్ ధనం కంటే విలువైనవున్నాయి

    నీహారికా , లైఫ్ కూల్ గా సక్సెస్ ఫుల్ గా పదిమందిలో గుర్తింపు ఉండేలా సాగితే బావుంటుంది అన్నావు. అంటే వ్యక్తిగత పరిపూర్ణత కావాలి. సామజిక గౌరవమూ…

  • నీహారికా , నీలో వుండే వ్యతిరేక లక్షణాలు కొన్ని మార్చుకుంటాను అంటావు కదా. అయితే ముందుగా కోపం తగ్గించుకో అసలు కోపానికి మూలం మన మనస్తత్వం. ఎదుటివారి ఆలోచనలు అభిప్రాయాలు భరించలేక పోతేనే కోపం వస్తుంది. నాదే సరైన మార్గం నేనే రైట్ అనుకోవటం వదిలేస్తే కోపం సగం వదిలిపోయినట్లు . ఎప్పుడు ఒక్కరే విజేత అవరు. అన్న చిన్న సూత్రం వంటపట్టించుకుంటే కోప నియంత్రణ సాధ్యం అవుతుంది. మనిషిలో భావోద్వేగాలు అన్నీ ఉండాలి. కోపంతో సహా కానీ అవిఅదుపులో ఉండాలి. ఒక అన్యాయం పట్ల మనకు మనకు స్పందించకపోతే దాన్ని ఎదిరించకపోతే అప్పుడు ధర్మాగ్రహం రాకపోతే సమాజానికీ మన వ్యక్తిత్వానికీ నష్టం. అలాగే అతిగా ప్రదర్శించే ఏ భావోద్వేగం కూడా ఇతరుల మెప్పు పొందావు. కానీ ఒక్క కోపం విషయంలో నష్టాన్ని కన్నా సమస్యలు వస్తాయి . అది ఒక ఉన్మాద స్థితి లాంటిదనుకో . ఏం చేస్తున్నామో ఎవరితో ఏం మాట్లాడుతున్నామో ఆలోచన లేని స్థితిలో వుంటాం కనుక స్నేహాలు బంధుత్వాలు ఎన్నో దెబ్బతింటాయి. ఎందరికో మనసు బాధ కలుగుతుంది. మనం అలా నొప్పించే పని ఎందుకు చేయాలి. చెప్పు నీకు కాస్త కోపం ఎక్కువే. కోపం మనుషులని కలపదు, దగ్గర చేయదు. ఆఫిసుల్లో ఇంట్లో సంసారాల్లో వాతావరణం చెడిపోయేది కోపం వల్లనే నమ్ము. ఆలోచించుకోమరి .

    ఈ ఒక్క భావోద్వేగంతో కొండంత నష్టం

    నీహారికా , నీలో వుండే వ్యతిరేక లక్షణాలు కొన్ని మార్చుకుంటాను అంటావు కదా. అయితే ముందుగా కోపం తగ్గించుకో అసలు కోపానికి మూలం మన మనస్తత్వం. ఎదుటివారి…

  • నీహారికా , ఈ రోజంతా అన్నమాచార్య పాడిన ఒక పాట విన్నాను. ఆ కాలానికి ఆయనకు ఇవాళ్టి ప్రపంచం ఎలా అర్ధం అయిందీ అన్నావు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే విన్నానన్నావు. నిజంగా మనసుతో అన్నమాచార్యులు మారుతున్నా సమాజాన్ని మనసుతో జ్ణానంతో అర్ధం చేసుకున్నారు. మనుషులంతా సమానంగా లేని ఈ సమాజం సమస్యల సమాహారంగా ఉంటుందని అర్ధం చేసుకున్నారు. దారితప్పిన స్వార్ధపరులైన వ్యక్తుల్ని చూసారు. నువ్వు అడిగినట్లు ఈ సమాజాన్ని మనుషుల్ని అవధుల్లేని ప్రేమతో చుస్తే అన్నీ అర్ధం, అవుతాయి. సుఖంగా నిద్రించే రాజుకీ అక్కడే ఆయన సేవ కోసం పడివున్న సేవకుడిదీ నిద్ర ఒక్కటేనన్నారు. ప్రకృతిలో అందరికోసం వీచే గాలి దుర్గంధం పైనా పరిమళం పైనా ఒకే రకంగా తాకి పరుగుతీస్తుందన్నారు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికీ జీవించే హక్కుందన్నారు. ప్రకృతి దృష్టిలో అందరు ఒక్కటే. ఈ బేధాలన్నీ మనుషులు సృష్టించినవే నన్నారు. జీవితం మొత్తం ప్రచారం చేసారు. మనస్ఫూర్తిగా మనుషుల సుఖం కోరుకున్నారు కనుకనే ఆసాహిత్యం ఇవాళ్టికీ తరాల నుంచి తరాలకు అందుతోంది. ఇప్పుడు ఆ సాహిత్యపు సువాసన నిన్ను తాకింది. అంత గొప్ప రూపంలో ఉన్న ఏనుగుపైన భూమికి జానెడు లేని కుక్కపైన ప్రసరించే సూర్య కిరణం ఒక్కటేనన్నాడాయన. మరి నీకు నాకు అందరికీ నచ్చదా ? నచ్చాలి కూడా !!

    అర్ధం కావాలంటే అవధుల్లేని ప్రేమ కావాలి

    నీహారికా , ఈ రోజంతా అన్నమాచార్య పాడిన ఒక పాట  విన్నాను. ఆ కాలానికి ఆయనకు ఇవాళ్టి  ప్రపంచం ఎలా అర్ధం అయిందీ అన్నావు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే…

  • నీహారికా , నీ అనుమానం కన్ఫ్యూజన్ నీ వయసులో వాళ్లకు అందరికీ సహజంగా వచ్చేదే. ఎంతమందితో స్నేహం చేయాలి , మిగతా వాళ్ళతో ఎలా మెలగాలి. కాలేజీ దాటి పై చదువుకు వెళ్ళబోతూ ఒక కార్పొరేట్ ప్లేస్ లోకి వెళ్ళబోతూ ఎంతమందితో స్నేహం ఎవ్వళ్లని వదిలేయటం అని కరెక్టే. స్నేహం వేరు పరిచయం వేరు కదా నీ చిన్నప్పటి పాఠశాల స్నేహితులతో ఇప్పుడు ఎలా ఉంటావు నీ కాలేజీ మేట్స్ తో ఎలా ఉంటావు చూసుకో. నీ గురించి బాగా తెలిసిన వాళ్ళు నీకు నైతికంగా మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరు నీ మనసుకి తెలిసి పోతారు. నీతో ఆత్మీయంగా ఎవ్వళ్ళు ఎలా వుంటున్నారు చూసుకో. వాళ్ళు స్నేహితులు. మిగతా వాళ్ళు కేవలం పరిచయస్తులు గానే మిగిలిపోతారు. ఎవరికైనా అంటే మనకిష్టమైన వారితో మన అనుభవాలు అనుభూతులు పంచుకుంటాం. వాళ్ళ పుట్టిన రోజులు ముఖ్యమైన రోజులు గుర్తుంచుకుని వాలా కోసం ఆ రోజు కేటాయిస్తాం. ఆలా అని కాలేజీ లో అందరితో స్నేహంగా ప్రతి నిముషం మాట్లాడుతూ ఉండిపోము కదా. నువ్వు పెద్దయి ఉద్యోగం చేసినా ఇంతే నెన్నొక్కదాన్నే ఉంటా అని ఆలా ఉంది పోవు అలాగని ఆఫిస్ లో అందరితోనూ స్నేహం చేయలేవు. కానీ అందరితో స్నేహంగా మెలగగలం పలకరించగలం. ఆప్యాయత చూపించగలం. స్నేహం అంటే మనసుకి నచ్చిన ఒకళ్ళు ఇద్దరితోనే . వాళ్ళు సన్నిహితులు. మన కోసం ప్రేమించేవాళ్ళు. కానీ ప్రపంచంలో అందరితో మనం స్నేహపూర్వక దరహాసం తో మాత్రం ప్రవర్తిస్తాం . ఒక చిన్న గీత వఉంటుంది సుమా !!

    మానసికంగా దగ్గరయ్యేది ఒక్కళ్ళే

      నీహారికా , నీ అనుమానం కన్ఫ్యూజన్ నీ వయసులో వాళ్లకు అందరికీ సహజంగా వచ్చేదే. ఎంతమందితో స్నేహం చేయాలి , మిగతా వాళ్ళతో ఎలా మెలగాలి.…

  • నీహారికా , కొత్తగా ఇన్స్పిరేషన్ కలిగించేదిగా ఉన్నా కొత్త విషయం చెపుతున్నావు గా ... యూసెఫ్ ముకటీ అన్నాయన రోటీ బ్యాంక్ పెట్టాడట. ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయలేని పేదవాళ్ల కోసం ఈ రోటీ బ్యాంక్. పేదలకు సహాయం చేయాలనుకునేవాళ్ళు నగదు ఆహార పదార్ధాలు ఈ బ్యాంక్ లో డిపాజిట్ చేయచ్చు. నిర్వాహకులు వాటిని సాయంత్రం వరకు పేదలు నిరుద్యోగుల రోగులకు సరఫరా చేస్తారు. దాతల సహాయంలో ఈ రోటీ బ్యాంక్ నడుస్తుంది. ఎంతో మంది ఆహారం ఈ బ్యాంక్ కు డిపాజిట్ చేస్తారు. కల్యాణ మండపాల్లో మిగిలిన ఆహారం డిపాజిట్ చేస్తారు. దాదాపు 700 ప్యాకెట్లు ఆహారం నిల్వ చేసే కెపాసిటీ ఈ బ్యాంక్ కి ఉంది . బావుంది కదా .. 700 ప్యాకెట్ల ఆహారం నిల్వ వుంది అని గర్వంగా చెప్పటం అంటే ఇంత మంది కడుపు నింపుతారు రోజు. ఎంతోమంది రోగులు నిస్సహాయంతో ఈ బ్యాంక్ ద్వారానే పూటకోసారన్నా కడుపు నింపుకుంటారు. కానీ మన లాంటి వాళ్ళు చుట్టూ వున్న ఈ ప్రపంచంలో రెండు చేతులు దేహీ అంటూ ముందు కొచ్చి చేతులు చాపటం మన దౌర్భాగ్యమే అనుకో అయినా ఆ నిరుపేదల ఆకలి తీర్చటం మన కర్తవ్యమే కదా ! ఏమంటావు !!

    ఇంత కంటే గొప్ప సాయం ఇంకేముంది ?

    నీహారికా , కొత్తగా ఇన్స్పిరేషన్ కలిగించేదిగా ఉన్నా కొత్త విషయం చెపుతున్నావు గా … యూసెఫ్  ముకటీ అన్నాయన రోటీ బ్యాంక్ పెట్టాడట. ఒక్కపూట కడుపు నిండా…

  • నీహారికా , నీకు బుక్స్ చదివే అలవాటు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక పుస్తకం అంటే ఒక మనిషి జీవితకాలపు అనుభవం కదా. మన ఒకళ్ళు జీవితంలో మన అనుభవం మాత్రమే తెలుస్తుంది. ఒక అనుభవం ఉన్న రచయిత రాసిన పుస్తకం చదవటం అంటే అయినా జీవితంలో నేర్చుకున్నది అనుభవించినదీ మనకు తెలిసిరావటం. ఒక మంచి రచయిత ఒక యుద్దాన్ని గురించి ఏం చెప్తారో తెలుసా.. యుద్దమంటే ఇద్దరు శత్రువులు తలపడి బలా బలాలు చూసుకోవటం అనుకుంటాం కదా. రచయిత ఏం చెపుతున్నాడంటే , పోరంటే అనుక్షణ జీవితానుభవం నీ ప్రాణాన్ని నువ్వెంతగా ప్రేమిస్తావో ఎదుటివాడి ప్రాణాన్ని అంతే ప్రేమించటం పోరంటే నువ్వు పూర్తిగా మనిషిగా జీవించటం ... అంటే అర్ధం అయిందా .. పోరంటే యుద్ధం . మనం మనుషులుగా జీవించటం కూడా యుద్ధమే. అంటే ఎపుడు సాటి మనుషులతో పక్షులతో వృక్షాలతో కలిసికట్టుగా ప్రేమగా బతకటం నిర్విరామంగా కృషి చేసి అసలు తప్పులే చేయకపోవటం ఒక వేళ తెలియక చేస్తే ఆ తప్పుని ఖచ్చితంగా వప్పుకోవటం అహాన్ని ద్వేషాన్ని వదులుకోవడం ఎదుటి వాళ్ళ బరువు భుజాన మోయటం ఎప్పుడూ ఎదుటివాళ్ళ సంతోషాన్నే కోరుకోవటం. .. ఇది నిజంగా పోరాటమే.. ఇంత చేయాలంటే మనిషి ఎంత మంచి వాడై పోవాలి. అచ్ఛంగా దేవుడల్లే వుండాలన్నమాట బావుంది కదూ.. కాస్త స్వార్ధం వదులుకొంటే ఇందులో పది శాతం అయినా మనమూ చేయచ్చు. ఏమంటావమ్మా .. ఇలాంటివి చదవటం ఎంత సంతోషం ఎంత అవసరం !!

    ఒక పుస్తకం ఎంతో నేర్పుతుంద

    https://scamquestra.com/sozdateli/5-aleksandr-prochuhan-35.html

  • నీహారికా , నువ్వు అన్నది నూరుపాళ్లు నిజం. నన్ను స్వేచ్ఛగా పనిచేయిస్తే ఆ పని ఖచ్జితంగా చేస్తాను. నీ వల్ల అవుతుందా అని ఎవరైనా ఆన్నారనుకో ఇక నా పైన నాకే డౌట్ వస్తుంది అన్నావు నిజం స్వేచ్ఛ ఉన్న చోట సృజన ఉంటుంది. ఊగిసలాట కు ఆస్కారం వుండదు కాబట్టి లక్ష్యం పైన గురిపెడతాం. నువ్వు గమనించు పెద్ద పెద్ద సంస్థలన్నీ అద్దాల గనుల్లో పుట్టలేదు.వ్యవస్థాపకుల్లో మేనేజ్మెంట్ దిగ్గజాలు లేరు. వాళ్ళ పెయిన్ ఎవరికీ ఏ భారీ అంచనాలు లేవు. వాళ్లకు తోచిన ఆలోచనతో ఒక వ్యాపారమో సినేమానో ఎదో ఒక ప్రాజెక్టో మొదలుపెట్టి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇది అవార్డు కోసం తీసే సినిమా అంటూ ఎవళ్ళూ తీయలేదు.నిర్మాణం పైన శ్రద్ధ తో తన చేతిలో ఉన్న కధ పైన నమ్మకంతో నటించే వాళ్ళ పట్ల కూడా నమ్మకంతో సినిమా తీస్తే ఆ సినిమాకు అవార్డులు కలెక్షన్లు వచ్చి తీరతాయి. దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలు తలసరి ఉత్పత్తిలో భారత దేశాన్ని మించిపోతున్నారు. ఆ దేశాల్లోని పని సంస్కృతే అంటే వాళ్ళు పనిని ప్రేమించే జీవిత విధానమే పనిని దైవంగా భావించి దీక్షగా చేయటమే వాళ్లకు ఫలితం ఇస్తోంది/ ఆ స్వేచ్చ వాళ్ళకువుంది. నువ్వు పనిచేయాలగలవా అని ముందే సందేహ పడితే రిసల్ట్స్ ఎక్కడ నుంచి వస్తాయి? నువ్వు నీలాగే వుండు నీహారికా . నువ్వు చేస్తున్న పని నువ్వు చదువుతున్న చదువు పట్ల నీకున్న స్వేచ్ఛ నీ టార్గెట్ ని రీచ్ అయ్యేలా చేస్తుంది. నువ్వు కలెక్టర్ ని అవుతాననుకుంటావు. అయిపో. నువ్వు అవుతావా లేదా అని నిన్ను అనుమానించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వొద్దు. నువ్వు ముందు సందేహపడద్దు. కష్టపడి చదువు మహా నైపుణ్యంగా చదువు అదే ప్రపంచం అన్నట్లు చదువు. ఫలితం నీ చేతిలో పడుతుంది.

    నిన్ను నువ్వు సందేహించుకోకు

    నీహారికా , నువ్వు అన్నది నూరుపాళ్లు నిజం. నన్ను స్వేచ్ఛగా పనిచేయిస్తే ఆ పని ఖచ్జితంగా చేస్తాను. నీ వల్ల అవుతుందా అని ఎవరైనా ఆన్నారనుకో ఇక…

  • నీహారికా, నేనందరిలా పర్ఫెక్ట్ గా ఉన్నానా? నా ఆలోచనలు సరైనవా కాదా అనే సందేహం అన్నావు, అసలు నువ్వు ఇతరులతో ఎందుకు పోల్చుకొంటావు. ప్రతివారికీ ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ఇంకోళ్ళలా వుండటం ఎందుకు? మన చుట్టూ ఉన్న సక్సెస్ ఫుల్ పీపుల్స్ లో మనం కూడా ఖచ్చితంగా ఉంటాం. ఇప్పుడెలా ఉండాలి అప్ డేట్ గా, సమకాలీన పరిస్థితులు, తాజా ఆర్ధిక సాంఘిక రాజకీయ విషయాలు తెలుసుకోవడం కోసం న్యూస్ పేపర్లు, మేగజైన్లు ఎంచుకో. మన చుట్టూ వున్నా వాళ్ళతో కలిసిమెలిసి వుండాలి. అప్పుడు చుట్టూ స్నేహ సౌరభo వుంటుంది. ఒక లక్ష్యం ఉంచుకో, అది రోజు, వారం, నెల లేదా జీవిత కాలపు లక్ష్యం కూడా కావచ్చు. ఆ లక్ష్యం ఎదురుగా నడువు, ఏం సాధించావు, ఇంకా ఏం చేయాలి? ఈ ఆలోచనలతో బిజీ గా వుంటే నెగిటివ్ ఆలోచనలే వుండవు. కొత్తగా ఆలోచించు సమ్ థింగ్ న్యూ. అది అందరూ ఆదరించేది, మనసుని రంజిపజేసేది అయి వుండాలి. ఆ ఆత్మ సంతృప్తి , ధైర్యం జీవితంలో నువ్వు ఎక్కే ఎన్నో మెట్లకు పునాది అవుతుంది. మంచి ఆలోచనలతో, మంచి ఆరోగ్యంతో, మంచి అలవాట్లతో సంతోషంగా వుండు. ఎప్పుడు ఏ కొంచెం సాయం పొందినా దాన్ని మరచిపోకు, నువ్వు పర్ఫెక్ట్ గా ఉండటం అంటే ఇదే. ఒక చిన్న మొక్క రెండాకులతో గింజ నుంచి బయటపడి, చక్కని వెలుగుతో, గాలి, ప్రకృతితో సంతోషంగా ఎదిగి వృక్షం అవుతుంది. మనుషులు అంతే ఆరోగ్యవంతమైన ఆలోచనలతో ఎదగాతమే జీవిత విధానం.

    గింజ వృక్షం అయినట్లు ఎదగాలి

    నీహారికా, నేనందరిలా పర్ఫెక్ట్ గా ఉన్నానా? నా ఆలోచనలు సరైనవా కాదా అనే సందేహం అన్నావు, అసలు నువ్వు ఇతరులతో ఎందుకు పోల్చుకొంటావు. ప్రతివారికీ ఎవరి ప్రత్యేకత…

  • నీహారికా, ఏది సాధించాలన్నా ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేయాలి. కాస్త తేలిగ్గా ఏదైనా వుంటే అన్నావు. చెప్పు నీ ప్రశ్నలో సమాధానం వుందమ్మాయీ.. ‘ సాధించాలంటే .... కృషి’ అంతే కదా. ఇప్పుడు చూడు రెజ్లింగ్ ఛాంపియన్ గీతా ఫోగట్ ఎంత కృషి చేసి వుంటుందో, దంగల్ సినిమాలో ప్రత్యక్షంగా చూశావు. ఒక సముద్రం ఈదాలంటే ఎంత కష్టపడాలో, ఒక క్రికెట్ లో గెలవాలంటే ఎన్ని త్యాగాలు చేయాలో వాళ్ళ వాళ్ళ ఆత్మ కథలన్నీ పుస్తకాల రూపంలో వచ్చాయి. నీ దగ్గర ఉన్నాయి కూడా. బహుశా ఇవన్నీ చూసి ఇలా అన్నావు మనం పెద్ద టార్గెట్స్ కోసం ప్రయత్నించకపోతే పరిమితుల్లోనే బతకాల్సి వస్తుంది. పెద్ద కలలతో జీవితాన్ని ఆవిష్కరించుకోవాలి నీ దృష్టి కోణం మారాలి. బద్దకస్తులదే సులభ మార్గ అన్వేషణ. మనం ఎంత వరకూ ఆలోచిస్తామో అంత ఎత్తే ఉంటాం. మన లోలోపలి ఆలోచనలు మన ఎదుగుదలని నిరోధం చేస్తాయి. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి నీ ఆలోచనల్లో ఉన్న పరిమితి దాటితే, ఎన్నేళ్ళ పాటు... అన్న నిరాశను పక్కన పెడితే.... నువ్వు ఒక చక్కని భవిష్యత్తుని నిర్మిన్చుకోగలవు. ఒక్క రోజు సౌకర్యవంతంగా వుండకపోతేనే భరించలేవు నువ్వు జీవితం మొత్తం సుఖంగా ఉండాలంటే, దాన్ని ఎంత బాగా నిర్మించుకోవాలి. నువ్వు ఓభవనంలో నివసించాలంటే అది కట్టుకోవలసింది నువ్వే.

    నీ జీవితం నిర్మించుకొనేది నువ్వే

    నీహారికా, ఏది సాధించాలన్నా ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేయాలి. కాస్త తేలిగ్గా ఏదైనా వుంటే అన్నావు. చెప్పు నీ ప్రశ్నలో సమాధానం వుందమ్మాయీ.. ‘ సాధించాలంటే…

  • నీహారికా ,నీకు విసుగొచ్చిన ఈ శకునాలు నమ్మకాలూ చాలా మందికి ఉన్నాయనుకో. కానీ ఇవెలా అర్ధం చేసుకోవాలంటే వేమన పద్యం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ముక్కు వంక చూసి ముక్కురంబు రుదుట విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని నిందించటం సరైన పనేనా అని . ఏదైనా ఒక పని మొదలు పెట్టినపుడు మన ప్రయత్నలోపం లేకుండా ఉండాలి. ఫలితం సరిగ్గా లేకపోతే మనం చేసిన పొరపాటేక్కడో వెతకాలి. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఆలా ఎన్ని సార్లు ప్రయత్నం చేసి సక్సెస్ అందుకోకపోయినా పరాజయం పొందినట్లు కాదు . ఎప్పుడైతే ఆ పరాజయానికి ఇతరుల శకునాలనీ దురదృష్టాన్ని నిందిస్తారు అప్పుడు ఓడిపోయినట్లు శకునాలు ముహుర్తాలనీ నమ్మేవాళ్ళు తమ ప్రయత్న లోపాల్ని ఎలా గుర్తిస్తారు చెప్పు. శని దశ బాగోక కష్టాలొస్తాయని ఎవరైనా అంటే నవ్వొస్తుందా ? రాదా ? మన జీవితంలో కష్టాలకు కారణం మన గమ్యం సరిగ్గా నిర్ణయించుకోకపోవటం కావచ్చు. మన ఉద్యోగం పోవటానికి కారణం మనం ఆ పని సరిగ్గా చేయకపోవటం కావచ్చు. ఏదైనా మన నిర్లక్ష్యం కావచ్చు. మనం కష్టపడకపోవటం కావచ్చు . అంతేగానీ స్వప్నాలు ప్రశ్నలు శకునాలు ముహుర్తాలు కారణం అవుతాయా చెప్పు.

    ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని తిట్టినట్లు

    నీహారికా , నీకు విసుగొచ్చిన  ఈ శకునాలు నమ్మకాలూ చాలా మందికి ఉన్నాయనుకో. కానీ ఇవెలా అర్ధం చేసుకోవాలంటే వేమన పద్యం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ముక్కు…

  • నిహారికా , భవిష్యత్తులో నేనేం అవ్వాలో నాకేది మంచి ఫ్యూచరో ఎప్పుడూ కన్ఫ్యూజన్ అంటున్నావు, ఇందుకు నువ్వు నిన్ను బేరీజు వేసుకుంటేనే మంచి సమాధానం దొరుకుతుంది. నీ స్వభావం నీ ప్రత్యేకతలు నీ నైపుణ్యాలు అన్ని కోణాలను నిస్పక్షపాతంగా జడ్జ్ చేసుకుంటే నీకేం కావాలో తేలుతుంది. సినిమాలు రాజకీయాలు క్రీడలు టెక్నాలజీ ఏ రంగం విజేతల జీవితాలని పరిశీలించినా ఓ విషయం అర్ధం అవుతుంది. వీళ్లంతా తమకు ఆసక్తి వున్న రంగాన్ని ఎంచుకున్నారు. సత్య నాదెళ్ల అయినా ఏ ఆర్ రెహమాన్ అయినా వాళ్లకిష్టమైన రంగం లోనే ముందుకు వెళ్లి టార్గెట్ రీచ్ అయ్యారు. చాలా మందికి వాళ్ళ ఆసక్తి గురించి వాళ్ళకే స్పష్టమైన అభిప్రాయం లేదు. అసలు మన దేశంలో నిరుద్యోగానికి ఇది ప్రధాన కారణం తెలుసా.. చదువుకీ ఆసక్తికీ వృత్తికీ బలమైన సంభంధం ఉంది. ఈ మూడు ఒక్కటే కావాలి. నీలాంటి టీనేజర్ ఈ నిముషంలో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు నిన్ను శోధించుకుంటూ అసలు నీ ఇష్టం ఎటువైపుని వుందో తేల్చుకో. ఆ చదువు ద్వారా వచ్చే ఉద్యోగం నీ అభిరుచికి సరిపోతుందా ఆ కెహెచ్డీవువులో ఆ ఉద్యోగం తో చేసే పని నీకు సంతృప్తి ఇస్తుందా లేదా తేల్చుకుంటే ముందుగా నువ్వేం చదువుకోవాలో తెలుస్తుంది. ఇలాగే జీవితం కూడా. ఏమంటావు. ఇలా తేల్చుకోలేనని తేల్చేసుకుంటే అప్పుడిక సైకోమెట్రిక్ పరీక్షకు పోదాం !!

    చదువుకీ ఆసక్తికీ వృత్తికీ లింకుంది

    నిహారికా , భవిష్యత్తులో నేనేం అవ్వాలో నాకేది మంచి ఫ్యూచరో ఎప్పుడూ కన్ఫ్యూజన్ అంటున్నావు, ఇందుకు నువ్వు నిన్ను బేరీజు వేసుకుంటేనే మంచి సమాధానం దొరుకుతుంది. నీ…