• నీహారికా, పొదుపు అన్న పదం విన్నా, దాని గురించి ఉపన్యాసాలు విన్నా బోర్ కొట్టేస్తుంది అంటావు నిజమే. మరి చేతికి అందిన ఆదాయం నిమిషాల్లో ఖర్చు చేయడం ఈజీనే నిహారికా. మరి పొదుపు గురించి తెలిసి వుండాలిగా. ఆర్ధిక ఇబ్బందులు ఎదురయితే పొదుపే కదా కాపాడేది. చిన్నప్పటి నుండి పొదుపు పాఠాలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే పెద్దయ్యాక సంపాదించే మొత్తంలో ఇంత పొదుపు కోసం అని పక్కన పెట్టడం చేతనవుతుంది. నెల జీతం అందుకోగానే ఖర్చుల వివరాలు పక్కన రాసుకోవాలి. వాడిన ప్రతి రూపాయి ఎందుకోసం ఉపయోగిస్తున్నామో o చోట రాసుకొంటే నెల తిరిగే సరికి ఖర్చుల పైన, వృధా పైన ఒక అవగాహన వస్తుంది. అప్పుడే ఎక్కడ పొదుపు చేయాలో అర్ధం అవుతుంది. తీరికుంటే, చేతిలో డబ్బుంటే స్నేహితులతో కలిసి షాపింగ్ కోసం వెళ్లేముందే అసలు బడ్జెట్ ఎంతో ముందే అనుకోవాలి. సరైన వస్తువు కొనుక్కోవాలంటే క్రెడిట్ కార్డు వాయిదా పద్ధతి బాగానే ఉంటుంది. కానీ దానికి ముందే ఆ వస్తువు కొనే డబ్బు పొదుపు చేసి అప్పుడు కొనాలి. అప్పుడే అదనపు భారం, వడ్డీ రేట్ల బాధ తప్పుతాయి. ఖర్చు అదుపు తప్పకుండా వుంటుంది. అందుకే జీవితంలో మొదటి అడుగులు వేసేప్పుడే అంటే చిన్నప్పుడే పిల్లలకు పొదుపుగా అంటే దుబారా లేకుండా ఎలా జీవించాలో నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అనుకొంటాను. కష్టపడి తెలివితేటలతో సంపాదించే డబ్బుని అప్పుడే ఎంజాయ్ చేయడం చేతనవుతుంది లేకపోతే డబ్బు దుబారా కావడం ఖాయం.

    పొదుపు నేర్చుకుంటేనే దుబారాకు కళ్ళెం

    నీహారికా, పొదుపు అన్న పదం విన్నా, దాని గురించి ఉపన్యాసాలు విన్నా బోర్ కొట్టేస్తుంది అంటావు నిజమే. మరి చేతికి అందిన ఆదాయం నిమిషాల్లో ఖర్చు చేయడం…

  • నీహారికా, నీ సమస్య అందరి సమస్యే తెలుసా. పనిలో ఎప్పుడూ పర్ఫెక్ట్ గా వుందామని, ఇంకెవ్వరూ మనలా వుండరనీ నిర్ణయించుకోవడమే అసలు సమస్య. ప్రతిపని మనమే చేయాలని పెట్టుకొంటే ఇంక సమయం ఏమి మిగులుతుంది. కొన్ని పనులు మొదలు పెడతాం ఒక్కోసారి పర్ఫెక్ట్ గా వుంటుంది ఒక్కోసారి ఫెయిల్ అవుతాం. అది సహజం. సాంకేతిక విజ్ఞానం మన పని త్వరగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. చాలా వేగంగా ఫోన్లు, లాప్ టాప్ లు, పి.సి లు చూస్తాం. కానీ సైడ్ ఎఫెక్ట్ గా, గంటల తరబదిఫోనే సంభాషణలూ, ఈ మెయిళ్ళు, ఫేస్ బుక్ లు సమయం తినేస్తాయి. క్షణం తీరిక లేకుండా పని చేస్తేనే పూర్తవుతుంది అనుకొని అస్తమానం రెస్ట్ లేకుండా పని చేస్తూనే వున్దతమింకో తప్పు. అంచేత కెరీర్ లో గానీ, చదువు లో గానీ కొన్ని రూల్స్ వుండాలి. ఏ పని పర్ఫెక్ట్ గా, కాస్తయినా తేడా లేకుండా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. ఓసారి ఫెయిల్ అయితే ఇక మన వల్ల కాదు అని చేతులు ఎత్తేయకూడదు. సాంకేతిక విజ్ఞానాన్ని తెలివిగా వాడుకోవాలి. ఉన్న సమయం వృధా చేయకుండా బాగా వాడుకోవాలి. చదువు లేక ఉద్యోగం మాత్రమే జీవితం కాదు. ఇంకా ఎన్నో యాక్టివిటీస్ కోసం సమయాన్ని ఫ్రేమ్ చేసుకొని ప్రతి క్షణాన్ని ఆస్వాదించుకోవాలి. రోజూ చేసే పని అయినా సరే దాన్ని మనం ప్రతిసారి శ్రద్దగానే చూసి మంచి ఫలితం సాధించేలా వుండాలి. మొత్తానికి పనిభారంతో కుంగిపోయేపరిస్థితి తెచ్చుకోవద్దు.

    పనులకీ ప్రణాళిక కావాలి

    నీహారికా, నీ సమస్య అందరి సమస్యే తెలుసా. పనిలో ఎప్పుడూ పర్ఫెక్ట్ గా వుందామని, ఇంకెవ్వరూ మనలా వుండరనీ నిర్ణయించుకోవడమే అసలు సమస్య. ప్రతిపని మనమే చేయాలని…

  • నీహారికా, మనం శరీరానికి పనికి వచ్చే ఎన్నో విటమిన్స్ గురించి తెలుసుకొన్నాం. మరి విటమిన్ M గురించి తెలుసా. ఇది లేకపోతే జీవితo ఒక్క అడుగు కూడా కదలదు. ఆరోగ్యం, ఆనందం, అందం ఏదైనా సరే M వుంటేనే. చదువుకోవాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే, మంచి జీవితం కావాలంటే విటమిన్ M. ఇది కొంతమంది దగ్గరే పదిలంగా ఉంది. వాళ్ళని కోటీశ్వరులు అంటారు. మిగతా వాళ్ళు వాళ్ళని చూసి అసూయ పడతారు. కానీ నువ్వు ఈ విటమిన్ విలువ తెలుసుకో చాలు. దుబారా అన్న పదం దగ్గరగా ఈ విటమిన్ M వుండదు. డబ్బు సంపాదించాలి. కూడబెట్టి తర్వాత తరాలకు ఇవ్వడం కోసం కాదు. తర్వాత తరాలకు ఎలా సంపాదించుకోవాలో, జీవితం ఎలా వుంటుందో చెప్పాలి. అంటే పిల్లలకు డబ్బు విలువ నేర్పి, వాళ్ళు దాన్ని సక్రమంగా వాడుకొనేలా దారి చూపాలి. 15 సంవత్సరాలు నిండకుండానే సెల్ ఫోన్స్, టూవీలర్స్ వీలయితే కార్లు, పర్సు నిండా డబ్బు ఇచ్చి వాళ్ళను పనికిమాలిన వాళ్ళుగా తయారు చేయకూడదు. డబ్బు చాలా ముఖ్యం, అవసరం కానీ అదే జీవితం ఎప్పుడూ కాదు. ఒక పిల్లవాడు కష్టపడి ఒక క్లిష్టమైన లెక్కను రెండు గంటలు బుర్రకు పదును పెట్టి సాల్వ్ చేయగలిగితే కలిగే సంతోషం వంటిది వాడి చేతికి కష్టం లేకుండా వచ్చిపడిన పాకెట్ మనీ ఇవ్వరు. వాడు పెరిగి పెద్దవాడై, వాడి కాళ్ళపైన వాడు నిలబడి వాడి ఉపాధి వాడు సంపాదించుకోవాలి. వాడికి విటమిన్ M అలా అందాలి. అప్పుడే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

    ఆ విటమిన్ గురించి తెలుసా!

    నీహారికా, మనం శరీరానికి పనికి వచ్చే ఎన్నో విటమిన్స్ గురించి తెలుసుకొన్నాం. మరి విటమిన్ M గురించి తెలుసా. ఇది లేకపోతే జీవితo ఒక్క అడుగు కూడా…

  • నిహారిక, సమస్య అర్ధం అయింది. ఈ పరీక్షల్లో అంత రిజల్ట్స్ చూపెడితేనే రేపు బెటర్ ఫ్యూచర్ వుంటుంది లాంటి మాటలతో పిల్లలను ఎమోషనల్ గా ఒత్తిడి పెడుతున్న మాట నిజమే. ఇంటా బయటా పోటీ ప్రపంచంలో నెగ్గుకు వచ్చేందుకు పిల్లలు ఎన్నో సవాళ్ళు, భయాలు ఎదుర్కొంటున్నారు. తెలిసో తలియకో పిల్లల బావోద్వేగాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఈ సమస్య పూర్తి చేయక పొతే నీకు సినిమా లేదునే చెప్పిన డ్రెస్ వేసుకోక పొతే నీకింక ద్రేస్సులే కొనను, ఇలా ఎమోషనల్ గా మాట్లాడితే పాపం పిల్లలు వింటారు కానీ ఈ ప్రభావం వాళ్ళు పెద్ద అయ్యాక ఇబ్బందులు తెస్తాయంటున్నారుపరిశోధకులు. చీటికి మాటికి బెదిరించడం, పదే పదే సతాయించడం తో పిలల్లో ఒక విధమైన మొండితనం వస్తుంది. ఎవ్వరిని ఖాతరు చెయ్యకపోవడం అలవర్చుకోవాలి. చిన్నతనం లో పెద్దవాల్ల బెదిరింపులకు జడిసి,ప్రతి ఇష్టం లేని పని చచ్చినట్లు చేసిన పిల్లలు మనస్సులో వ్యతిరేకతనే పెంచుకుంటారు. ఇందులో మొదటిగా నష్టపోయేది తల్లి దండ్రులే. పిల్లల్ని మనం ఎలా ప్రోత్సహిస్తమో వాళ్ళు అలాగే స్పందిస్తారు. మన ప్రోత్సాహం వాళ్ళకు మార్గదర్శకత్వం అవుతుంది. మన సతాయింపు ధోరణి వాళ్ళల్లో లోపించే లా చేస్తుంది. పిల్లలకు ప్రేమే ఇవ్వాలి. వాళ్ళని పెంచే క్రమం లో మనం ఇచ్చే విలువైన వస్తువులు కూడా మనం ఇచ్చే ప్రేమా నమ్మకం పిల్లలకు సంతోషం ఇస్తాయి. వాళ్ళకి దగ్గర అవ్వాలి. దారి చూపాలి.

    బెదిరించడం సతాయించడం మానండి

    నిహారిక, సమస్య అర్ధం అయింది. ఈ పరీక్షల్లో అంత రిజల్ట్స్ చూపెడితేనే రేపు బెటర్ ఫ్యూచర్ వుంటుంది లాంటి మాటలతో పిల్లలను ఎమోషనల్ గా ఒత్తిడి పెడుతున్న…

  • నీహారికా, ఈ మధ్య వచ్చిన కొన్ని సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో పెత్తనం విషయంలో పురుషులదే పై చేయిగా ఉందని వచ్చింది. సరే పెత్తనం వాళ్ళనే ఉంచుకోమనండి అందామంటే ఈ పెత్తనం అర్ధం వింటే గుండె జారిపోవాలి. ఆస్పత్రికి వెళ్ళాలన్నా 88 శాతం మంది మహిళలు ఇంట్లో పెద్దలకు చెప్పే వెళ్ళాలంటారు. ఏది వండాలో పురుషులే నిర్ణయిస్తారని 62శాతం మంది స్త్రీలు చెప్పారట. దేశం మొత్తం మీద 65శాతం మహిళలు చదువుకొంటే అందులో 5 శాతం మంది మహిళలకు మాత్రమే భర్తను ఎంచుకొనే స్వేచ్చ ఉందట. మేరీలాండ్ విశ్వవిద్యాలయం, జాతీయ అనువర్తిత ఆధిక పరిశోధన మండలి సంయుక్తంగా జరిపిన జాతీయ మానవ వనరుల సర్వేలో 34 వేల మందిని ప్రశ్నించి ఈ సర్వే చేశారట. 15 నుంచి 80 ఏళ్ళ మధ్య ఉన్న మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. పక్కన వున్న కిరాణా కొట్టుకు వెళ్ళాలన్నా పర్మిషన్ ఉండాల్సిందే అని 80శాతం మంది మహిళలు చెబితే ఇంకా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలా అర్ధం ఏమిటా అనిపిస్తుంది. కానీ ఒక్కటే ఊరట. ఇంత వివక్ష ఎదుర్కొంటున్నా ముందుకే కదులుతున్నారు నేటి మహిళలు. తనకంటూ గుర్తింపు కోసం అహర్నిశలు కృషి చేస్తూనే వున్నారు. ఎన్నో రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. కానీ వెలుగు వెంట చీకటిలా వాళ్ళని కష్టపెడుతుందీ అసమానత్వం. సంపాదిస్తున్నా నిరాధారంగా ఉన్న మహిళా మహిళగానే వుంటుంది. మరి ఏ వెలుగులు ఈ చీకటిని చీలుస్తాయో భవిష్యత్ చెప్పాలి.

    ఈ రిపోర్టును ఏమని పిలుద్దాం

    నీహారికా, ఈ మధ్య వచ్చిన కొన్ని సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో పెత్తనం విషయంలో పురుషులదే పై చేయిగా ఉందని వచ్చింది. సరే పెత్తనం వాళ్ళనే ఉంచుకోమనండి…

  • నీహారికా, ఎల్లవేళలా చెదరని చిరునవ్వుతో వుండాలంటే ఏం చేయాలి అన్నావు. సరిగ్గా చెప్పాలంటే నవ్వు అనేది కేవలం ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ మాత్రమే.ఇది హృదయానికి కిటికీ లాంటిది. మనం నవ్వినప్పుడు ఎండార్ఫిన్లుగా పిలవబడే న్యురోట్రాన్స్ మీటర్స్ విడుదలై సంతోషాన్ని ఇస్తాయి. ఒత్తిడి స్థాయిల్ని తగ్గిస్తాయి. సరదాగా వుండే అన్నింటి వైపు దృష్టి సారించడమే. మనం చుసేవే మన మనసు-ని ప్రభావితం చేస్తాయి. కామెడీ షోలు,ఫన్నీ వీడియోలు, కామిక్ స్ట్రిప్స్ వంటి తక్షణ సరదాలు జీవితం లోకి తెచ్చుకోవాలి. ఇష్టపడే వారితో కలిసి గడపటం వల్ల పూర్తి స్థాయి ఆరోగ్యం, సంతోషం దక్కుతాయని అనేక పరిశోధనలు పేర్కొంటున్నాయి. అలాగే పెంపుడు జంతువులు కూడా సంతోషాన్ని అందిస్తాయి. వీటివల్ల ఆటోమేటిక్ గా మంచి మూడ్ వస్తుంది. అలాగే ఒక మంచి పని చేయడం వల్ల కూడా తక్షణ ఆనందం దక్కుతుంది. ఇతరుల కోసం చేసే ప్రతి పనిలోనూ మన సహాయం అందుకొన్న వారి మొహంలో కనిపించే ఒక మంచి చిరునవ్వు మన మూడ్ ని సంతోషంగా మార్చేస్తాయి. మనం సంతోషంగా వుండటం అంటే చుట్టూ సంతోషాన్ని సృష్టించుకోవడం అన్నమాట. సంతోషం చాక్లెట్ లాగా దొరకదు. మన మనసు చేసే అద్భుతం సంతోషం. దాన్ని ఎప్పుడూ ఇతరులకు అందిస్తూపోవడం మనం పొందే సంతోషం. అప్పుడే మనం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాం.

    సంతోషం మనం సృష్టించే అద్భుతమే

    నీహారికా, ఎల్లవేళలా చెదరని చిరునవ్వుతో వుండాలంటే ఏం చేయాలి అన్నావు. సరిగ్గా చెప్పాలంటే నవ్వు అనేది కేవలం ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ మాత్రమే.ఇది హృదయానికి కిటికీ లాంటిది.…

  • నీహారికా, మహిళా దినోత్సవం రోజున నాకేం చెప్తావు. ఏదో కొత్తదై వుండాలి. నీ జీవితం గుర్తు పెట్టుకొనేదై వుండాలి అన్నావు. సరే విను, ఇవాల్టి ఆధునిక మహిళ మూడు ప్రపంచాల పౌరురాలు. గడప దాటేదాక భర్త, ఇల్లు, పిల్లలు దాటాకా ఆఫీస్ కెరీర్ పోటీ ఇన్ని పాత్రలకు ఎంతో కష్టంతో న్యాయం చేస్తోంది. ఎక్కడ తేడా వచ్చినా అది వైఫల్యమే. ఇన్ని బాధ్యతల మధ్య చిరునవ్వుతో తనకు తాను నిరూపించుకోవాలంటే ముందస్తుగా ఆరోగ్యంగా ఉండాలి. అoదుకే వేళకు సరిగ్గా తినమని చెప్పాలనిపిస్తుంది. శరీరానికి వ్యాయామం, కంటినిండా నిద్ర, మెదడుకు విశ్రాంతి కావాలి.నువ్వు ప్రపంచం గెలవలే కానీ కెరీర్ మహిళవు కావచ్చు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళని తపించే మామూలు అమ్మవీ కావచ్చు. ఏం సాధించాలన్నా ఆరోగ్యంగా వుండాలి. ఆర్ధరైటీస్ తో నీ ఉద్యోగమూ చేయలేవు, నీరసంతో సేవలూ చేయలేవు, అనారోగ్యంతో ఏ సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించలేవు. పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే గ్రామాల్లో స్త్రీలు 80 శాతం రక్తహీనతతో వున్నారు. సగంమంది భారతీయ మహిళలకు ఎయిడ్స్ అంటేనే తెలియదు. లక్ష ప్రసవాలకు ఐదు వందల మరణాలున్నాయి. ఏటా లక్ష రొమ్ము కాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. సగానికి సగం మహిళలకు హైపర్ టెన్షన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఈ లెక్కలకు సమాధానం చెప్పమ్మా. పురుషాధిక్య సమాజానికి సమాంతరంగా స్త్రీల ప్రాధాన్యతా క్రమాలు మారాయి. నిజమే నువ్వెంతో సాధించాలి. ఇంకా సాధిస్తావు కనుక నీ ఆరోగ్యం గురించి కాస్త ప్రాధాన్యం ఇచ్చుకో. నీ స్వభావం మార్చుకో. సున్నితం గానే ఉండు. కానీ ఆరోగ్యంగా ఉండు. తమ ఆకలి పట్టించుకోని, ఆరోగ్యం పట్టించుకోని, ఎప్పుడూ కుటుంబ శ్రేయస్సే ఆలోచించే మహిళా లోకం అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. నీహారికా ఇది నువ్వు గుర్తుంచుకోదగిన కానుకే అనుకొంటాను.

    ఆరోగ్యo జాగ్రత్తమ్మా – నిన్ను నువ్వయినా పట్టించుకో

    నీహారికా, మహిళా దినోత్సవం రోజున నాకేం చెప్తావు. ఏదో కొత్తదై వుండాలి. నీ జీవితం గుర్తు పెట్టుకొనేదై వుండాలి అన్నావు. సరే విను, ఇవాల్టి ఆధునిక మహిళ…

  • నీహారికా , ఒక చక్కని రిపోర్ట్ వచ్చింది. సాయంచేస్తే ఆయుష్షు పదిలంగా ఉంటుందని ఒక అధ్యయనం రిపోర్ట్ వివరాలు ఇబ్బంది 5000 మంది పైన దీర్ఘ కలం ఈ ప్రయోగం చేశారట. ఇతరులకు సాయం చేయటానికి ఆయుర్ధాయం ఆరోగ్యం పెరగటానికి సంబంధించిన పరిశోధన ఇది. ఇందులో ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకున్నారు. వారి జీవన శైలి వారి కుటుంబ సభ్యులతో వారికున్న అనుబంధం ఇతరులతో చేదోడువాదోడుగా మెలగటం వంటివి సంవత్సరాల తరబడి రికార్డు చేసారు. వీళ్ళను రెండు గ్రూపులుగా వాళ్ళ ఆలోచనా స్థాయిని బట్టి విభజించారు. అందరు ఆరోగ్యం మంచి ఉద్యోగం సంఘం లో హోదా ఉన్నవాళ్లే . వాళ్ళు ఇతరులకు సాయపడే అంటే ఆర్ధికంగా మాత్రమే కాదు ఇతరుల అవసరాల్లో సంతోషాల్లో ఆపదల్లో పాలుపంచుకునే శైలిపై ఆలోచన సాగితే ఇతరులతో కలిసి మెలిసి ఉండేవాళ్ళు తమకి కలిగే చిన్న చిన్న అనారోగ్యాల నుంచి చాలా తేలికగా బయటపడగలరట. వాళ్ళ ఆయుర్ధాయం రెండు మూడేళ్లు ఎక్కువే రికార్డఅయ్యిందట. కేవలం జీవిత కలం పెరగటానికి ఒకే కారణం వాళ్ళు ఇతరులకు సహాయపడటం తో ఆనడం పొందటం లేదా పనిలో ఆనందం పొందటం కారణాలుగా ఉన్నాయి. బావుంది కదా ఈ రిపోర్ట్.

    ఇతరులకు సాయపడితే ఆరోగ్యం ఆయుష్షు

    నీహారికా , ఒక చక్కని రిపోర్ట్ వచ్చింది. సాయంచేస్తే ఆయుష్షు పదిలంగా ఉంటుందని ఒక అధ్యయనం రిపోర్ట్ వివరాలు ఇబ్బంది 5000 మంది పైన దీర్ఘ కలం…

  • నీహారికా , ఇప్పుడే ఒక చిల్డ్రన్ సైకాలజిస్ట్ ప్రసంగం విన్నారు . ఎంత బావుందంటే పిల్లలకు ప్రేమ భాష ఒక్కటే తెలుసట. ప్రేమించటాన్ని ప్రేమించబడటాన్ని వాళ్ళు ఎంతో ఇష్టపడతారు. తల్లి తండ్రుల నుండి అదే ఎక్స్ పెక్ట్ చేస్తారట. పిల్లల్ని పిలిచే ముందు స్వరంలో మార్దవం నిలుపుకోవాలట . మాటలు వినాలన్న ఆచరించాలన్నా ఈ మార్దవం స్వరంలో పలికే ప్రేమ పిల్లల్ని కట్టి పడేస్తాయట. ఆత్మీయ స్వరంతో చెపితే దేన్నైనా చేస్తారట పిల్లలు. వాళ్ళ పై అధికారం చెలాయించకూడదు . ముఖ్యంగా నలుగురి ముందు వాళ్లపై అసలు అరవకూడదు. పిల్లలకు అన్నీ నేర్పాలి . వాళ్ళ గది సర్దుకోవటం దగ్గర నుంచి మనం అనుకుంటున్నా మంచి లక్షణాలతో సహా అన్నీ లేకుంటే అసలివి పెద్దవాళ్ళు ఊహిస్తున్నారని పిల్లలకెలా తెలుసు అంటారు ఎక్స్ పెర్ట్స్. నిజమే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు నిద్ర చేష్టలు మనకి ఇవ్వాల్సిన గౌరవం పెద్దలను ప్రేమించవలిసిన విదంభం ఏదైనా సరే మనం నేర్పితేనే కదా . ఇలా ఉండటం గుడ్ బిహేవియర్ అని మనం వాళ్లకు మొదటి గోరు ముద్ద తినిపించినంత ప్రేమగా నేర్పాలిట. నిజంగా పేరెంట్స్ అంత పేషెన్సీ తో వున్నా అనిపిస్తోంది. బావుంది కదూ.. !

    పిల్లలకు తెలిసిన భాష ప్రేమే

    నీహారికా , ఇప్పుడే ఒక చిల్డ్రన్ సైకాలజిస్ట్ ప్రసంగం విన్నారు . ఎంత బావుందంటే పిల్లలకు ప్రేమ భాష  ఒక్కటే తెలుసట. ప్రేమించటాన్ని ప్రేమించబడటాన్ని వాళ్ళు ఎంతో…

  • నీహారికా , పుస్తకాలూ చదవాలనే ఉంటుంది కానీ చదివే టైం లేదు అంటుంటావు . ఇది కేవలం సాకు అనచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు అనుభవజ్ఞులు. రోజుకు ఒక పుస్తకం కేవలం 15, 20 నిముషాలు చదవలేమా ? సాధారణంగా మనం నిమిషానికి వంద పదాలు చదవగలం. అంటే 15 నిముషాలు 1500 పదాలు అంటే ఒక పుస్తకంలో నాలుగైదు పేజీలు ఈజీగా చదవచ్చు. అంటే ఎంత తీరిక లేకపోయినా ఎలాగోలా చదివినా నెలకు 15 0 పేజీలు చదవచ్చు . ఎంతో జ్ఞానం సంపాదించవచ్చు. రోజుకు పదో పదిహేనో నిముషాలు ఎంత మాత్రం చెప్పు. ఈ ప్రపంచంలో మన కళ్ళ ఎదురుగ కనిపించే దేవతలు పుస్తకాలూ అన్నాడో ప్రసిద్దుడు. ఒక సంస్కారం లేనివాడిని సంస్కారవంతుడిగా ఒక దుర్మార్గుడిని మంచివాడిగా మార్చగలిగే గొప్ప శక్తి పుస్తకానికి వుంది. చదవటం వల్ల మన గురించి మన చరిత్ర గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎన్నో తెలుసుకోవచ్చు చదువు కోవటం అదే ఆదిభితమైన విలువైన పుస్తకాలూ చదవటం వల్ల వచ్చే విజ్ఞానం గురించి తలుచుకుంటే తప్పకుండా చదివే సమయం దొరుకుతుంది. మనకు తెలియకుండా ఒక మంచి పుస్తకం మన పైన చూపించే ప్రభావం చాలా ఎక్కువ.

    ఆమాత్రం సేపు చదవలేమా ?

    నీహారికా , పుస్తకాలూ చదవాలనే ఉంటుంది కానీ చదివే టైం లేదు అంటుంటావు . ఇది కేవలం సాకు అనచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అంటుంటారు అనుభవజ్ఞులు.…

  • నీహారికా , వందలో ఒక్కరుగా ఉండాలని ఉంటుంది కానీ ఎంతో మందిలో కలిసిపోయి గూటింపు లేకుండా బతకటం నాకు ఇష్టం ఉండదు అన్నావు నిజమే. అసలు మూసలో కొట్టుకుపోవడం తో సగం వైఫల్యం వుందంటాడు న్యూటన్. సవాళ్లకు ఎదుర్కొనిలేని వాళ్ళ నలుగురు నడిచే బాటలో నడుస్తారు. ఇవాళ్టి పోటీ ప్రపంచంలో సవాళ్లు ఎదుర్కొంటు విజయం సాధించాలంటే కొత్త అవకాశాలు పసిగట్టగల నేర్పు ప్రణాళికా రూపకల్పన సామర్ధ్యం నిర్ణయాలు సత్వరం తీసుకోగలిగే చురుకుతనం మన ఆలోచనలు ఇతరులు పసిగట్టలేనంత తెలివి తేటలు కావాలి. వంద శాతం గురించి ఆలోచించే చోట వెయ్యి శాతం గురించి మాట్లాడే ధైర్యం కావాలి. విజ్జయం ఎప్పుడూ ప్రవహించే నది లాంటిది. ఇవ్వాళ తో కొంత పూర్తీ చేసాం ఇంకా రెస్ట్ తీసుకుందాం అనే తృప్తి ఇక్కడ చాలదు. తుదివరకు శ్రమిస్తూ ఆలోచనలకు పదును పెడుతూ కొత్త కొత్త రంగాల్లో అడుగుపెడుతూ సవాళ్ళను ఎదుర్కొంటు ఉండాలి. మన విజయం విస్తరించి పదిమందితో పోటీలో గుర్తింపు రావాలంటే ఎదో కొత్తదనం అన్వేషిస్తూనే ఉండాలి. అప్పుడిక వందలో ఒక్కరిగా కాదు ఒకే ఒక్కళ్లుగా కూడా ఉండొచ్చు. అలంటి శక్తి యుక్తులు సంపాదిస్తే ఎంతోమంది నీవెంటే ఉంటారు నీ ప్రత్యేకతను వప్పుకుంటారు.

    ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది నీ విజయమే

    నీహారికా , వందలో ఒక్కరుగా ఉండాలని ఉంటుంది కానీ ఎంతో మందిలో కలిసిపోయి గూటింపు లేకుండా బతకటం నాకు ఇష్టం ఉండదు అన్నావు నిజమే. అసలు మూసలో…

  • నీహారికా , ప్రతిదానికీ ఒక సమయం ఉంటుందా ? ఒకప్పుడు విజయవంతంగా చేసిన పని ఇంకోసారి ఎందుకు చేయలేము అని అడిగావు కరెక్టే. చిన్న లాజిక్ విను మనిషి జీవితంలో మూడు దశలుంటాయి. యవ్వనం కౌముదం వార్ధక్యం . యవ్వనంలో పుష్కాలమంతా శక్తీ సమయం ఉంటాయి. డబ్బు ఇంకా సంపాదించవలసిన సమయం ఇది. అంటే డబ్బు ఉండదు. ఇక రెండో కౌముదం 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు. డబ్బు సంపాదిస్తారు శక్తీ ఉంటుంది దాన్ని అనుభవించే సమయం ఉండదు. ఇక మూడోది వార్ధక్యం ఇప్పుడు డబ్బు సమయం ఉంటుంది ఓపిక ఉండదు. పై మూడు దశల్లో డబ్బు వయస్సు శక్తీ మూడు ముఖ్యాంశాలు. ఇప్పుడు వయసులో డబ్బు సంపాదించి కౌముద దశలో కాస్త సమయం మిగుల్చుకుని డబ్బు జీవితం కూడా అనుభవించాలి. వార్ధక్యంలో ఆ డబ్బుతో మిగిలిన జ్ఞాపకాలు అనుభవాలతో సుఖంగా బతకండి అంటాం. అంచేత ఒక్కో సమయంలో చేయవలిసిన పని అప్పుడే చేయాలి. 70 ఏళ్ళు వచ్చాక వ్యాపారం మొదలెడతాననటం కరెక్టా ?? ఇప్పుడు చెప్పు ప్రతిదానికీ సమయం సందర్భం ఉంటాయా ? ఉండవా ? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని సక్రమంగా ఆ పని ముగించాలి. ఏమంటావు ??

    ప్రతిదానికీ సమయం సందర్భం ఉంటాయి

    నీహారికా , ప్రతిదానికీ ఒక సమయం ఉంటుందా ? ఒకప్పుడు విజయవంతంగా చేసిన పని ఇంకోసారి ఎందుకు చేయలేము అని అడిగావు కరెక్టే. చిన్న లాజిక్ విను…

  • నీహారికా , ఇవ్వాళ నువ్వు చెప్పిన కబురు చాలా అవసరం అయినది ఆలోచించి జాగ్రత్తగా వుండవలిసిందీ నా ఫ్రెండ్ కాస్త బొద్దుగా ఉంటుంది తనను టీజ్ చేస్తే నవ్వేస్తోంది కానీ చాలా కుంగిపోతుంది. కానీ అలా అనద్దని మిగతా ఫ్రెండ్స్ తో ఎలా చెప్పాలి అన్నావు కరెక్టే. చాలా ఇబ్బంది. సన్నిహితులే కదా అని బొద్దుగా బరువుగా ఉండేవారని సరదాగా చనువుగా ఆటపట్టిస్తూ వుంటాను. వాళ్ళ గురించి ఏవో వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు కూడా సరదాగా తీసుకుంటారు అనుకుంటారు. కానీఇలాంటి నవ్వులాటలు ఎగతాళి వారిని శారీరికంగా మానసికంగా దెబ్బ తీస్తున్నట్లు కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అధికంగా బరువు ఉన్నామనే భావం ఒక్కసారి డిప్రెషన్ కు గురిచేస్తుందిట పదే పదే లావుగా ఉన్నావంటూ వ్యాఖ్యానిస్తుంటే సన్నబడే ప్రయత్నాలు చేసి చాలా అనారోగ్యాలపాలవుతుంటారని భావం. ఎందుకంటే బరువు పెరగటానికి బోలెడంత ఆహారం తినటం కారణం ఒక్కటే కాదు హార్మోన్స్ కారణం కూడా అవ్వచ్చు. జీన్స్ లో ఉండచ్చు . ఏదైనా కావచ్చు కానీ సరదాకైనా సాటి స్నేహితులను అలా వేధించి ఆనందించే ప్రయత్నం చేయటం అనాగరికం . అలంటి అలవాటున్న స్నేహితులతో కఠువుగానైనా సరే ఇతరులను అవమానించి బాధపెట్టవద్దని హెచ్చరిస్తేనీ మంచిదనిపిస్తోంది. తప్పులు ఎవరైనా చేస్తారు. అది తప్పని సక్రమంగా చెపితే అర్ధం చేసుకునే సంస్కారం వుంటుందనే ఆశిద్దాం .

    సరదాకైనా ఇది తప్పే

    నీహారికా , ఇవ్వాళ నువ్వు చెప్పిన కబురు చాలా అవసరం అయినది ఆలోచించి జాగ్రత్తగా వుండవలిసిందీ నా ఫ్రెండ్ కాస్త బొద్దుగా ఉంటుంది తనను టీజ్  చేస్తే…

  • నీహారికా , నాపైన ఎవరన్నా చిన్నగా విసుక్కున్నా కోపం తెచ్చుకున్నా నాకు చాలా కోపం వచ్చేస్తుంది . చదువుకోవటం కూడా చిరాగ్గా ఉంటోంది అన్నావు బావుంది. అప్పుడు నిన్ను గురించి నువ్వు నీవైపు తప్పువుందా అని ఆలోచించావా ? ఎదుటివాళ్ళ ఉద్వేగాన్ని మనం యధాతధంగా అర్ధం చేసుకోవాలనిపించలేదా .. ఇప్పుడు తప్పు నీదే . ఇంట్లో వాళ్ళనుకో వాళ్లకు నీ వల్ల కలిగిన చిరాకు ఏమిటి ? నా వైపు నుంచి ఎంత తప్పువుందో ఓ నిముషం ఆలోచిస్తే చేసిన తప్పుకు సారీ చెప్పేస్తే సరిపోతుంది . మధ్యలో నీకు కోపం రావటం ఏమిటి ? ఇప్పుడు నువ్వు సెన్సిటివ్ గా మనసుతో ఆలోచించకుండా తీక్షణంగా బుద్ధితో ఆలోచించాలన్నమాట. అంటే బుర్రతో ఆలోచించి అరె తప్పు నాదనే అనుకోవచ్చు లేదా అనవసరంగా నా పైన విసుక్కున్న వాళ్ళను నిలదీయచ్చు. ఇక బయటవాళ్ళనుకో అప్పుడు ఇదే ముందు ఆలోచన చేయి . వెంటనే కోపం తెచ్చేసుకుని నీ బలహీనత బయట పెట్టకుండా అసలు నేనింత బాధపడటం అవసరమా ? దీనివల్ల నాకొచ్చిన లాభమేమిటి ? ఈ చిరాకు కోపం వల్ల నేనెంత నష్టపోతున్నాను. అసలా ఉద్వేగానికి లోనైనప్పుడు నేనెలా ఉంటున్నాను ? ఇలా ఆలోచించు . ఇప్పుడు నీ ఆలోచనలు అలా సుడిగాలి లాగ నీ చుట్టూనే తిరిగి నిన్ను గందరగోళం లోకి నెట్టకుండా దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. అతి సున్నితత్వం అనే మానసిక స్థితి నుంచి ముందు బయటకు రా .. ప్రాక్టికల్ గా వుండు.

    అసలా ఆలోచనే పరమ దండగ

    నీహారికా , నాపైన ఎవరన్నా చిన్నగా విసుక్కున్నా కోపం తెచ్చుకున్నా నాకు చాలా కోపం వచ్చేస్తుంది . చదువుకోవటం కూడా చిరాగ్గా ఉంటోంది అన్నావు బావుంది. అప్పుడు…

  • నీహారికా , శనిదశలో శుక్ర మహాదశలో ఉన్నాయా అని అడిగావు. వేమన పద్యం ఒకటి చెపుతాను. బల్లి పలుకుల్ విని ప్రజలెల్ల తమ పనులు సఫలములగుననుచు సంతసించి కానీ పనులకు తామే ఖర్మమటందుకు విశ్వదాభిరామ వినురవేమ. ఎలావుందీ ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా బల్లి పలికితే ఏమవుతుంది అంటారు. ఒకవేళ పనికాకపోతే ఖర్మ అంటారు. ఇలా ఉంటుంది. నీ ప్రశ్నకు సమాధానం. మనం ఒక పని మొదలుపెట్టి సఫలం కాకపోతే అదెక్కడ ఎలా జరిగిందో ఎనాలిసిన్ చేసి ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని దిద్దుకుని మళ్ళీ పని మొదలు పెడతాం. ఆ ప్రయత్నంలో పదిసార్లు విఫలమైనా 11 వ సారయినా సక్సెస్ అవుతాం. ఇది శనిదస అనుకున్నామనుకో అసలు ప్రయత్నం మానేస్తాం . ఇక దశ తిరిగి రోజు కోసం ఎదురుచూస్తాం. అంటే ఇకెప్పటికీ పరాజయమే నన్నమాట. ఎవరో ముక్కు వంకరగా ఉందని అద్దాన్ని నిందించాడంటాడు ఇంకో పర్వంలో వేమన. అంచేత ఈ దశలు మహాదశలు పక్కనపెట్టి పనిచేయటం నేర్చుకో ఏమంటావు !!

    ఏ నమ్మకాలూ వద్దమ్మాయీ !

    నీహారికా , శనిదశలో  శుక్ర మహాదశలో ఉన్నాయా అని అడిగావు. వేమన పద్యం ఒకటి చెపుతాను. బల్లి పలుకుల్  విని ప్రజలెల్ల తమ పనులు సఫలములగుననుచు సంతసించి…

  • ఉదయపు వేళకు స్వాగతం పలుకు

    నీహారికా, నాకు కష్టాతి కష్టం అనిపించింది ప్రొద్దున్నే నిద్రలేవడం అంటే ఎంతో నవ్వొచ్చింది. నిద్ర వదులుకోవడం కష్టమే నన్న విషయం పక్కన పెట్టు కానీ ప్రకృతి ద్వారా…

  • నీహారికా , పిల్లలను ఎంతో పేమించటం మంచిదే కానీ అలా ప్రేమ పేరుతో అస్తమానం కనిపెట్టుకుని ఉండటం వల్ల ఆ పిల్లలకు ఆశించిన మేలు కలుగదంటున్నాయి పరిశోధనలు. పిల్లలను ఎంతవరకు ప్రేమించాలి అన్నావు . సాధారణ శ్రద్ధ తీసుకుని ప్రేమించాలన్నది నా సమాధానం. అతి శ్రద్ధ వద్దు. ప్రతి పనికీ ఇతరుల పైన ఆధారపడే అలవాటు చేయకూడదు. పిల్లలకు అవసరాలు సమకూర్చుతూ బాధ్యతలు తీసుకుంటూ వాళ్ళ ముందు స్పష్టమైన లక్ష్యం ఉంచాలి. వాళ్ళని స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఇస్తేనే అది సరైన పెంపకం అంటారు మానసిక నిపుణులు. తండ్రి పిల్లవాడి చేయి పట్టుకోవాలి. కరెక్టే. కానీ ఎప్పుడు వదాలలో కూడా తండ్రికి తెలియాలి. జీవితం కూడా పిల్లలు నడక నేర్చుకోవటం వంటిదే. ఆ అడుగులు సక్రమంగా వేస్తున్నాడా లేదా నాయి నేర్పే శిక్షకులుగా మార్గదర్శకులుగా ఉండాలి . తల్లితండ్రులు. అంతే కానీ ప్రతి అడుగు కలిసి వేయాలనుకోకూడదు. వారికీ మంచి భవిష్యత్తు అందే అవకాశాలు చూపించాలి. చక్కని పాటశాలలో చేర్చాలి. వారు శ్రద్ధగా చదువుకునే దిశగా ప్రోత్సహించాలి. చదువుతో పాటు ఎన్నో టాలెంట్స్ ప్రోత్సహించాలి . వారి జీవితాన్ని విజయంవైపుగా నడిపించాలి. తల్లితండ్రుల బాధ్యత అదే !

    అతి ప్రేమ వెగటే

    నీహారికా , పిల్లలను ఎంతో పేమించటం మంచిదే కానీ అలా ప్రేమ పేరుతో అస్తమానం కనిపెట్టుకుని ఉండటం వల్ల  ఆ పిల్లలకు ఆశించిన మేలు కలుగదంటున్నాయి పరిశోధనలు.…

  • నిహారిక, సంతోషం సగం బలం అన్న నానుడి కరక్టేనా అన్నావు. దాని చరిత్ర అనంతరం ఉత్సాహం, కృతజ్ఞత వంటి పాజిటివ్ అంశాలు, ఏమోషన్ లతో ఎప్పుడైతే ఉంటామో అదే సంతోషం. పరిపూర్ణమైన భావాలు వున్నప్పుడు కలిగేది సంతోషం. మంచి జాబ్, జీతం,జీవిత భాగస్వామి, సమృద్దిగా సంపద, చెక్కని సౌష్టవం, మంచి ఆరోగ్యం ఇవన్నీ వుంటే ఆరోగ్యంగా ఉండగలరా అనే, ఇవి సంతోషపు చిరునామా కాదు. జీవితం లోని ప్రతి అంశం పట్ల సానుకూల దృక్పదం వుంటే సంతోషం సాధ్య పడుతుంది. ప్రపంచలో గల రిలేషన్ షిప్స్ కు ప్రపంచాన్ని మనం చూసే ద్రుష్టి కోణానికి సంతోషం ఆత్మబంధువు. సంతోషం అన్నింటిని ఎంజాయ్ చేయమంటుంది. స్నేహంగా, దయగా, కరుణగా వుంటే వారి దగ్గర సంతోషం స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. వాళ్ళ పనిలో, బంధువులతో ఒత్తిడిని తేలికగా ఎదుర్కుంటారు. మనస్సులో ఎలాంటి బరువు, భారం వుండవు కనుక అనారోగ్యాలు కూడా దగ్గరకు రావు ఇప్పుడు అర్ధం చేసుకో సంతోషం పూర్తి స్థాయి బలం.

    సానుకూల దృక్పదం పేరే సంతోషం

    నిహారిక, సంతోషం సగం బలం అన్న నానుడి కరక్టేనా అన్నావు. దాని చరిత్ర అనంతరం ఉత్సాహం, కృతజ్ఞత వంటి పాజిటివ్ అంశాలు, ఏమోషన్ లతో ఎప్పుడైతే ఉంటామో…

  • నిహారికా , అందమైన రోల్స్ మోడల్స్ ఉంటారు. నాజూగ్గా అందంగా హుషారుగా ఉత్సాహంగా ....! అలా ఎప్పుడూ వాళ్ళని చూస్తూ వాళ్ళు మాత్రమే అలా ఉండాలి అనుకుంటే అన్యాయం. వీళ్ళు అలా ఎలా ఉండగలిగారు మనకు స్పష్టమైన అవగాహన ఉంటే మనకు అలాగే వున్నామని తెలుస్తుంది. ఎలాగంటే ఎవరికి వాళ్లకు ప్రత్యేకత ఉంటుంది. కొందరి కళ్ళు బావుంటాయి . కొందరు బాగా మాట్లాడతారు కొందరు బాగా చదువుతారు. ఇవన్నీ మనిషిలో అందం కంటే ఎక్కువైనవి . వీటికి ప్రాధాన్యత ఇచ్చి చుస్తే అసలు అసలైన అందం ఏమిటి ? ఎలా ఉంటే మనం పనులన్నీ పర్ ఫెక్ట్ గా పూర్తిచేసినట్లు. ఇతరులతో పోల్చుకోవటం మానేస్తే కొంత క్లారిటీ వస్తుంది. ఫలానా జయంతి చాలా సన్నగా ఉంది . సరే నువ్వు ఆరోగ్యంగా వున్నావు అనుకోవాలి. ఫలానా వసంత తెల్లగా వుంది అంటే నువ్వు టాప్ గ్రేడ్ చదువులో ఉన్నవని గుర్తు తెచ్చుకోవాలి. మనం ప్రత్యేక మని మనం నమ్మటం మనం బాడీ లాంగ్వేజ్ ని మార్చేస్తుంది. బోలెడంత ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. ప్రపంచంలో అందం చాలా ప్రత్యేకం.పువ్వులు జల పాతాలు నెమళ్ళు పచ్చని చెట్లు అందమైన అమ్మాయిలు బావుంటారు. మనం అందాన్ని ప్రశంసించవచ్చు. కానీ మనం కూడా అలాగే ఉండాలనుకుంటే ఎంత అమాయకత్వం . కాస్త పొడుగ్గా ఉంటే కాస్త తెల్లగా ఒత్తుగా ఉంటె ......... ఎందుకింత గందరగోళం ఏవీ ఇంకోలా అయిపోవు. పుట్టుకతో వచ్చిన రూపం తెలివి శక్తీ ఆరోగ్యం ఇవన్నీ ఇచ్చిన తల్లితండ్రులకు మొదటి నమస్కారం పెట్టేసి ఇప్పుడు వెలుగులో నిలబడి ఓకే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి అని ఆలోచిస్తే ఆడపిల్లలు ఇంకెంతో సాధిస్తారనిపిస్తుంది.

    ఎవ్వరితోనూ పోచుకోవద్దు

    నిహారికా , అందమైన రోల్స్ మోడల్స్ ఉంటారు. నాజూగ్గా అందంగా హుషారుగా ఉత్సాహంగా ….! అలా ఎప్పుడూ వాళ్ళని చూస్తూ వాళ్ళు మాత్రమే అలా ఉండాలి అనుకుంటే…

  • నీహారికా , సక్సెస్ కీ ఫెయిల్యూర్స్ కి ప్రత్యేకమైన కోణాలు ఉంటాయా ? అన్నావు. ఉంటుంది. అత్యంత ముఖ్యమైంది కార్యాచరణ. దాని ఫలితంగానే విజయమైన అపజయమైన మనం ఫలితం వైపే చూస్తాము కానీ అసలా పని ఎంత బాగా చేసాం దానికి విజయం సాధించే బలం వుందా లేదా అని ఆత్మ విమర్శ ముందే చేసుకొం. అసలు చేసే పని పట్ల శ్రద్ధ మొత్తం పెట్టేస్తే అప్పుడు ఫలితం విజయం వైపే ఉంటుంది. శరీరం ఒక టూల్ కిట్ లాంటిది. ఎన్నోపనులు చేయగలదు. కానీ మనస్సుని తెలివి తేటల్ని ఒక దగ్గరే ఉంచి శరీరం మనే ఆయుధాన్ని విజయం వైపుగా సిద్ధం చేయాలన్నమాట. మనకు భావాలు ఎమోషన్లు వీటితోపాటు మేధావితనం విచక్షణా శక్తి ఉంటుంది. విశ్లేషణ కోణాలు నిర్ణయాలు మేధస్సు నుంచే పుడతాయి . మనసు పరిపరివిధాల ఆలోచనలు చేస్తుంది. దాన్ని మేధావితనం గైడ్ చేయాలి. నదికి తీరం ఎలాంటిదో అలాంటిదన్నమాట. తీరం బలహీనంగా ఉంటే నది కట్టలు తెంచుకుంటుంది. మేధస్సు బలంగా ఉంటే మనసుని నియంత్రిస్తుంది . లేకుండా మనస్సు మేధావి తనాన్ని పక్కనపెట్టి వైఫల్యం వైపు అడుగులు వేయిస్తుంది.. ఆరోగ్యవంతమైన మనస్సు దాన్ని అదుపు చెప్పే మేధావి తనం ఉంటే చాలన్నమాట.

    మనస్సుకి కట్టలు వేస్తే విజయం తధ్యం

    నీహారికా , సక్సెస్ కీ ఫెయిల్యూర్స్ కి ప్రత్యేకమైన కోణాలు ఉంటాయా ? అన్నావు. ఉంటుంది. అత్యంత ముఖ్యమైంది కార్యాచరణ. దాని ఫలితంగానే విజయమైన అపజయమైన మనం…