• పురచ్చితలైవిగా తమిళ ప్రజలు ప్రేమగా పిలుచుకునే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా డి. ఎం. కె అధినేత్రి జయలలిత సోమవారం రాత్రి తుది శ్వాస వదిలారు. కర్ణాటకా లోని తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన జయలలిత తల్లి తల్లి సినీనటి. ఆమె ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగు పెట్టిన జయలలిత తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో నటించారు. ఆమెను తమిళనాడు ప్రభుత్వం కలై మామణిపురస్కారం తో సత్కరించారు. 1981 లో రాజకీయాల్లోకి వచ్చారు జయలలిత. 83 నుంచి 89 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పని చేసారు. 43 సంవత్సరాల వయస్సు లోని ఆమె తమిళనాడు సి.ఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించి రికార్డు నెలకొల్పారు. తమిళ సామ్రాజ్ఞి జయలలిత బీదబడుగు బలహీన వర్గాల ఆశాద్వీపం అయ్యారు. లెక్కలేనన్ని అమ్మాపధకాలకు శ్రీకారం చుట్టి ప్రజిత మనస్సుల్లో తిరుగులేని స్థానం సంపాదించారు. అనారోగ్యం రెండునెలలకు పైగా మృత్యువు తో పోరాడిన జయలలిత కన్నుముసరు. అనారోగ్యంతో రెండు నెలలకు పైగా పోరాడిన జయ లలితా కన్ను ముసరు. ఆమె మరణంతో దేశ రాజకీయాల్లో పెద్ద శూన్యం ఏర్పడిందన్నారు మోడీ. ప్రజలతో ఆమె మమేకమైన తీరు, అణగారిన వర్గాల పట్ల ఆమె తపన తనకు స్ఫూర్తి దాయకం అన్నారాయన. విప్లవ నాయికి జయలలిత మృతి తో దేశ రాజకీయాల్లో ఓకే సఖం ముగిసింది.

    విప్లవ నాయకి అస్తమయం

    పురచ్చితలైవిగా తమిళ ప్రజలు ప్రేమగా పిలుచుకునే తమిళనాడు ముఖ్యమంత్రి అన్నా డి. ఎం. కె అధినేత్రి జయలలిత సోమవారం రాత్రి తుది శ్వాస వదిలారు. కర్ణాటకా లోని…

  • అవనీ సింగ్ కు ఎప్పుడు దారిద్ర రేఖకి దిగువన వున్న మహిళలకు ఆర్ధికంగా నిలదొక్కుకునే సాయం చేయలి అని కోరిక. 17 సంవత్సరాల వయస్సులోనే ummed ke rickshaw రిక్షా ఆఫ్ గాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇ-రిక్షాల గురించి పేపర్ లో చదివింది అవని. సోలార్ పవర్ తో నడుస్తూ సులభంగా తొక్కేలా వుండే ఈ రిక్షాతో మురికి వాడలల్లో మహిళలు ఉపాది పొందోచ్చని భావించిదీ అమ్మాయి. ఈ ఆశయం మెచ్చుకుని గ్రీన్ వీల్స్ అనే సంస్థ ఎలక్ట్రిక్ రిక్షా స్పాన్సర్ చేసింది. జామియా ప్రాంతంలోని కోహినూర్ అనే ౩౩ సంవత్సరాల మహిళ రిక్షా నడిపేందుకు ముందుకు వచ్చింది. ఈ కుటుంబం ఆర్ధికంగా స్థిర పడే సరికి ఎంతోమంది ఆసక్తి చూపించారు. వాళ్ళందరికీ డ్రైవింగ్ నేర్పించి ఈ- రిక్షా, టాక్సీ డ్రైవర్లుగా తీర్చిదిద్దుతుంది అవని. ఉపాధి లేని మహిళలు ఈ దారిన నడించేందుకు సిద్ధం అవుతున్నారు. అవనీ సింగ్ శ్రమ ఫలించింది.

    వాళ్ళు కు ఆర్ధికంగా నిలబడాలి అనుకుంది అవని

    అవనీ సింగ్ కు ఎప్పుడు దారిద్ర రేఖకి దిగువన వున్న మహిళలకు ఆర్ధికంగా నిలదొక్కుకునే సాయం చేయలి అని కోరిక. 17 సంవత్సరాల వయస్సులోనే ummed ke…

  • మహిళలు ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాదు సామజిక బాధ్యత విషయంలో కూడా ఒక్కడుగు ముందే ఉన్నారు. టామ్ గిల్ట్ అనే స్వచ్చంద సంస్థ స్థాపించింది మీరా శర్మ. కేన్సర్ బాధిత మహిళల కోసం విగ్గులు తయారు చేసి ఇవ్వాలనుకుంది. చెన్నయ్ కు చెందిన మీరా శర్మ క్రిస్టియన్ కాలేజీ లోని రొటో రాక్ క్లబ్ చైర్ పర్సన్. క్లబ్ తరఫున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కేన్సర్ వచ్చిన మహిళలు వాడుతున్న సింథటిక్ విగ్గులు చూసింది. అవి ఒక్కోటి 30 వేల ఖరీదు చేస్తాయి. పైగా వాటివల్ల అలర్జీలు కూడా వస్తాయి. వాళ్ళ కోసం అసలైన శిరోజాలతో విగ్గులు తయారు చేసి ఇస్తే బావుందనుకుంది. ముందుగా తన జుట్టే ఒక విగ్గు కోసం కత్తిరించి ఇచ్చింది. ఆమె స్నేహితురాళ్ళు క్లబ్ సభ్యులు ముందుకొచ్చారు. ఒక విగ్గులు తయారుచేసే కంపెనీ తో కలిసి 4500 రూపాయలకే విగ్గు తయారీ చేసి ఇచేలా మాట్లాడుకున్నారు. వీటిని కేన్సర్ ఇన్స్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న మహిళలకు ఉచితంగా ఇస్తూ వస్తున్నారు. దాతల నుంచి విరాళాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ టామ్ గిల్ట్ ను విస్తరించి కేన్సర్ బాధితులకు విగ్గులు ఇవ్వాలనేది మీరా శర్మ ఆశయం.

    కేన్సర్ బాధితుల కోసం విగ్గులిస్తున్న మీరా శర్మ

    మహిళలు ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాదు సామజిక బాధ్యత విషయంలో కూడా ఒక్కడుగు ముందే ఉన్నారు. టామ్ గిల్ట్  అనే స్వచ్చంద సంస్థ స్థాపించింది మీరా…

  • సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసే ఎంతో మంచి చిన్నారుల కోసం 18 సంవత్సరాల వయసులోనే లక్ష్యం అనే స్వచ్చంద సంస్థను స్థాపించింది రాశీ ఆనంద్. ఢిల్లీ లో వుండే రాశి చదువుకునే వయసులో శ్రమ దోపిడీ కి గురవుతున్న పిల్లలకు టాయ్ లైబ్రరీ నిర్వహిస్తున్న చదువుకు సంబంధించిన బొమ్మలు బొమ్మల పుస్తకాల ఇస్తోంది. సంపన్న వర్గాల పిల్లలు చదివే స్కూళ్ల నుంచి బొమ్మలు పుస్తకాలు సేకరించి ఢిల్లీ తో సహా జార్ఖండ్ ఉత్తరాఖండ్ తమిళనాడు కర్ణాటక లాంటి నగరాల వీధుల్లోని 2 లక్షల మంది పిల్లలకు పుస్తకాలు పంచింది రాశి. వీధి బాలల కోసం సాక్ష్యం అనే పేరుతో స్కూలు ప్రారంభించింది. ఫ్లై ఓవర్ల కింద రైల్వే స్టేషన్లు రెడ్ వైట్ ఏరియాల పిల్లలకు చదువు చెప్పటంతో పాటు వారికి సత్ప్రవర్తన బోధిస్తూ మాదక ద్రవ్యాల సేవనం పిక్ పాకెటింగ్ లాంటి నేరాల పై అవగాహన పెంచుతూ వాటికి దూరంగా ఉండాలని ప్రచారం చేస్తోంది రాశి. రెండు చేతులా పనిచేసినా ఇంకెంతో చేయాల్సిన అవసరం ఉన్నచోట రాశి లాంటి యువతులు మేమున్నామంటూ ముందుకురావటం ఆనందించదగిన విషయం.

    2 లక్షల మందికి పుస్తకాల పంచింది రాశి

    సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసే ఎంతో మంచి చిన్నారుల కోసం 18 సంవత్సరాల వయసులోనే లక్ష్యం అనే స్వచ్చంద సంస్థను స్థాపించింది రాశీ ఆనంద్. ఢిల్లీ లో…

  • రెండు చేతులా ఏదైనా ఎవరికైనా ఏదీ ఆశించాకుండా పంచే రోజు ఇది. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈ స్వచ్చంధ సేవలో తరించారు. అతి సామాన్యులు కూడా తోటి వాళ్ళ కష్టానికి చాలించరు. సాయి పడ్డారు. వాళ్ళందరికీ, సాటి మనుష్యులను అందుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ, సాటి మన్యుషులను ఆదుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ అంజలి షుటిస్తూ ఈ రోజు మదర్ ధెరిసాను గుర్తుకు తెచ్చుకుందాం. మిషనరీస్ ఆఫ్ చారిటీ స్వచ్చంధ సేవా సంఘంలో మదర్ నెలకొల్పిన తిరుగులేని మెయిలు రాయి. అల్టేనియాలో పుట్టి డార్జిలింగ్ లో కొన్నాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పారు మదర్. తర్వాత నన్ గా మారారు. ఆకాలంలో బెంగాల్ కరువు, మతకల్లోలాలు కలకత్తాను కుదిపేసాయి. ప్రజలు రోగాలతో దుర్భర దరిద్రయంతో అల్లాడారు. ధెరీసా ఆ పనులకు అనాధలకు తల్లయ్యారు. ఆమె నిస్వార్ధమైన సేవకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి తో పాటు మరణానంతరం సెయింట్ హుడ్ కూడా లబించింది. సేవకు ఎన్నో మర్పులున్నాయి. అటుగా నడవటం, అలా నడవమని మన పిల్లలకు బోధించడం మన ధర్మం, కర్తవ్యం.

    సేవా సంకల్పం మనిషిలోని అద్భుత సౌందర్యం

    రెండు చేతులా ఏదైనా ఎవరికైనా ఏదీ ఆశించాకుండా పంచే రోజు ఇది. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈ స్వచ్చంధ సేవలో తరించారు. అతి సామాన్యులు కూడా…

  • ఇవాళ్టి తరం అమ్మాయిలకు కెరీర్ పైన ఉన్న శ్రద్ధ సమాజం పైన కూడా వుంది. అందుకు నిదర్శనం న్యూయార్క్ లో వుండే అంజలీ చంద్రశేఖర్. ఈమె సామజిక సేవకు భారత ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డు ఇచ్చింది. అంజలి స్వస్థలం చెన్నయ్. మంచి ఆర్టిస్ట్ చిన్నపటినుంచి బొమ్మలు గీస్తోంది. తన చిత్రాల ద్వారా బాల కార్మికులు ప్రక్రుతి వైపరీత్యాలు పునరావాస బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరిస్తోంది. భారత దేశంలో మధుమేహం తో బాధపడే పసివాళ్ల కోసం ఇన్సులిన్ ఇతర మందులు కొనేందుకు తన చిత్రాల ద్వారా ఇంటెర్నేషనల్ డయాబెటిస్ చారిటీ కి మూడు లక్షల విరాళం ఇచ్చింది. అంజలి చిత్రానికి యునైటెడ్ నేషన్స్ పోస్టర్ ఫర్ పీస్ కాంటెస్ట్ లో మూడో బహుమతి వచ్చింది. పిక్చర్ ఇట్ అన్న ప్రాజెక్ట్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది అంజలి. ఈమె గీసిన బొమ్మలు యూనిసెఫ్ యూనిస్కో లాంటి సంస్థలు కొనుగోలు చేసాయి. 22 ఏళ్ల వయసులో అంజలి చాలా సమయం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తోంది.

    తన ప్రతిభ తోనే ఇతరులకు చేయూత

    ఇవాళ్టి తరం అమ్మాయిలకు కెరీర్ పైన ఉన్న శ్రద్ధ  సమాజం పైన కూడా వుంది. అందుకు నిదర్శనం న్యూయార్క్ లో వుండే అంజలీ చంద్రశేఖర్. ఈమె సామజిక…

  • ఏన్నో రకాల అకేషన్స్ వస్తుంటాయి. ఏదైన గిఫ్ట్ పంపితే వెళ్ళాల,కోనాల ఫంక్షన్ కు హజరవ్వాలి. అక్కడ ఇవ్వాలి టైమేది..అక్కర్లేదు మేము ఆపని చేసి పెడతాం అంటున్నారు యువ స్టార్ట్ అప్ అమ్మాయి అను గుప్తా,స్వప్న చౌదరి. వీళ్ళిద్దరు మేక్ మై విషెష్.కమ్ పెట్టారు. అను ఐటీ అయ్యాక ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో పని చేశారు. అను బ్యాంకర్ ఐసిఐసిఐ ,స్టార్టప్ చార్టర్డ్ వంటి ప్రముఖ బ్యాంక్ లలో పని చేశారు. ఇద్దరి అభిరుచి ఒకటే వినియోగదారునుకి పనికొచ్చే చిన్న అవసరాన్ని బిజినెస్ గా మలచాలని ప్రతి వేడుకకు గిఫ్ట్ పంపి శుభాకాంక్షలు చెప్పే ఈనాటి యువతరం ఆలోచనను ఆ సంస్కృతిని పట్టుకుని స్టార్టప్ మొదలు పెట్టారు. వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని గిఫ్ట్ ను ఎంచుకుంటే పంపాల్సిన వాళ్ళకి సమాయానికి డెలివరి చేస్తుంది ఈ సంస్థ.ఈ కోత్త ఐడియా బాగానే వర్కవుట్ అవుతుందంటున్నారు పారిశ్రామిక వేత్తలు.

    బహుమతులు పంపేస్తారు వాళ్ళు

    ఏన్నో రకాల అకేషన్స్ వస్తుంటాయి. ఏదైన గిఫ్ట్ పంపితే వెళ్ళాల,కోనాల ఫంక్షన్ కు హజరవ్వాలి. అక్కడ ఇవ్వాలి టైమేది..అక్కర్లేదు మేము ఆపని చేసి పెడతాం అంటున్నారు యువ…

  • అస్సాంలో వుంది పల్ప్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఆలోచన చేసింది. స్పృహా చొఖాని. ఇక్కడ కుర్తీలు టేబుళ్లు కేవలం పేపర్ గుజ్జు ఉపయోగించి ఎంతో దృఢంగా ఎంతో సృజనాత్మకంగా తయారుచేస్తారు. కలప ఇనుమూ ప్లాస్టిక్ ఉండగా పేపర్ తో ఎందుకూ అంటే గతంలో ఎన్నెనో వస్తువులు పేపర్ గుజ్జుతో తయారుచేసారు. ఇవి కూడా దృఢంగా వుంటాయని నేను పరిశోధించి తెలుసుకున్నారు. ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే బావుంటుంది కదా అంటుందామె. వేస్ట్ పేపర్ తో తయారుచేసిన ఏ వస్తువులు విభిన్న ఆకృతులతో 200 కిలోల కంటే ఎక్కువ బరువు మోయగల సామర్ధ్యంతో ఉంటాయి. వీటిని తయారు చేయటం వెనక నాలుగేళ్ళ శ్రమ దాగుంది అంటోంది స్పృహా చొఖాని. ఒక్కసారి అస్సాం పల్ప్ ఫ్యాక్టరీ శోధించండి. మోడరన్ డిజైన్స్ ఎన్నెన్ని వస్తువులున్నాయో అందులో ఎంత కళాత్మకత వుందో ఇంటీరియర్స్ గా అవెంత బావున్నాయో చూడండి.

    కాగితపు కళా ఖండాలు

    అస్సాంలో వుంది పల్ప్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఆలోచన చేసింది. స్పృహా చొఖాని. ఇక్కడ కుర్చీలు టేబుళ్లు కేవలం పేపర్ గుజ్జు ఉపయోగించి ఎంతో దృఢంగా ఎంతో…

  • ఈమె ఎత్తు రెండడుగుల ఆరు అంగుళాలు. బరువు కేవలం ఐదు కిలోలు. ఈ మరగుజ్జు రూపాన్ని అత్యంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని జ్యోతి ఆడపిల్లల బ్రుణ హత్యల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ప్రచారం నిర్వహించింది. ఇప్పుడీమెకు 22 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డుకెక్కింది. టీవీల్లో కనపడుతూ వుంటుంది. అమెరికన్ హారర్ సిరీస్ లో ముఖ్య పాత్ర నటించింది. బిగ్ బాస్ కార్యక్రమంలో గెస్ట్ గా కనిపించింది. ఫ్యాషన్ అంటే చాలా క్రేజ్ ఎత్తు బరువుకు తగట్టు మందమైన దుస్తులు కుట్టించుకుంటుంది. చక్కగా తయ్యారు అవుతుంది. అంత పొట్టిగా కనిపిస్తే విచిత్రంగా చూస్తుంటే, తాకేందుకు ప్రయత్నిస్తుంటే ఇచ్చిందే కానీ నన్ను తక్కువగా అంచనా వేస్తే నాకు నచ్చదు అంటుంది జ్యోతి. అంత పసి దానిలా కనపడే ఈ యువతి మహిళా శక్తి ప్రధాన్యాత ను ప్రచారం చేయడం అంటే గొప్పే కదా జ్యోతికి కంగ్రాట్స్ చెప్పేద్దాం.

    రెండడుగుల సూపర్ స్టార్

    ఈమె ఎత్తు రెండడుగుల ఆరు అంగుళాలు. బరువు కేవలం ఐదు కిలోలు. ఈ మరగుజ్జు రూపాన్ని అత్యంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని జ్యోతి ఆడపిల్లల బ్రుణ…

  • ఆర్టిస్ట్ దీపానాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసి పూనే లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఊహా తెలిసినప్పటి నుంచి బొమ్మలేసే ఈమె పెన్సిల్ చర్కోల్, కలర్ పెన్సిల్ ఇలా అన్ని మాధ్యమాలలో బొమ్మలు వేస్తుంది. వాటర్ కలర్స్ ప్రాక్టిస్ చేసి హైదరాబాద్ కళామందిర్ లో మొదట గ్రూప్ షో, తర్వాత సోలో ఎగ్జిబిషన్స్ నిర్వహించింది. ఢిల్లీ లోని పిబిసి ఆర్ట్ గ్యలరీలో షో చేసాక, చైనాలో వర్క్ షాప్ లో లండన్ లోని స్లేర్ స్కల్ లో చిత్ర కళను అభివృద్ధి చేసుకుంది. లండన్ లో భరతీయ సాంస్కృతిక విభాగం నెహ్రు నెంటర్ చేసిన షో కు మంచి రెస్పాన్స్ వచ్చిందంటారామె. గతంలో ఈమె గర్ల్ చైల్డ్ ధీమ్ లో బొమ్మలు వేసేది ఇప్పుడు కామాసూత్ర పుస్తకం స్పూర్తి తో కపుల్ సిరీస్ స్టార్ట్ చేసింది. ఎలాంటి టార్గెట్ లేకుండా ఎప్పుడు బొమ్మలు వేస్తూనే వుండాలి అన్నది దీపానాథ్ ధ్యేయం.

    నిరంతరం బొమ్మలు వేయాలన్నదే దీపా ధ్యేయం

    ఆర్టిస్ట్ దీపానాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసి పూనే లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఊహా తెలిసినప్పటి నుంచి బొమ్మలేసే ఈమె పెన్సిల్…

  • ఇంగ్లీష్ నవలలు చదివేవాళ్లకి బార్బరా కార్ట్ లెండ్ తెలిసే ఉంటుంది. ఆమె రాసిన రొమాంటిక్ నావెల్స్ ఇరవైయవ శతాబ్దపు బెస్ట్ సెల్లర్స్. కమర్షియల్ నవలా రచయితగా ఆమెకు ప్రపంచవ్యాప్తమైన ప్రఖ్యాతి వుంది. ఆమె రాసిన 723 నవల్లో 38 భాషల్లోకి అనువాదమై ఆవిడ గిన్నిస్ బుక్ ఆఫహ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. పింక్ గౌను టోపీతో అలనాటి బ్రిటన్ మీడియా పర్సనాలిటీగా ఎంతో యాక్టీవ్ గా 98 ఏళ్ళు జీవించిన బార్బరా తన పుట్టిన రోజులు స్నేహితుల మధ్య జరుపుకునేదిట. ఆవిడ అడుగుజాడల్లో రొమాంటిక్ పుస్తకాలు రాసి మన తెలుగు రైటర్స్ కూడా ఎన్టీజో పేరు తెచుకున్నవాళ్లున్నారు. బార్బరా ప్రత్యేకత ఏమిటంటే జీవించినంత కాలం 90 ఏళ్ళు దాటాక కూడా ఆరోగ్యం పైన ఎన్టీజో శ్రద్ధ గా ఉండటం వయసు తక్కువగా కనిపించేలా మంచి మేకప్ విటమిన్లు వాడటం పోషకాహారం తీసుకోవటం వృధాప్య ఛాయల దగ్గరకి రాకుండా చాలా సరదాగా జీవించటం ఇవన్నీ 60 ఏళ్ళు వచ్చేసరికి చావు మొహం పెట్టేఎందరికో స్ఫూర్తి కావాలని ఈ పరిచయం 723 నవలలు కూడా రొమాంటిక్ గానే ఉండటం వీటితో పాటు ఎన్నో నాటకాలు పాటలు మ్యాగజిన్ ఆర్టికల్స్ రాస్తూ జీవితమంతా చైతన్యంగా జీవించారమే. ఏ బుక్ స్టాల్ లో నైనా దొరుకుతాయి ఇప్పటికీ ఈమె పుస్తకాలు.

    ఈమె రొమాంటిక్ సాహిత్య సృష్టికర్త

    ఇంగ్లీష్ నవలలు చదివేవాళ్లకి బార్బరా కార్ట్ లెండ్  తెలిసే ఉంటుంది. ఆమె రాసిన రొమాంటిక్ నావెల్స్ ఇరవైయవ శతాబ్దపు బెస్ట్ సెల్లర్స్. కమర్షియల్ నవలా రచయితగా ఆమెకు…

  • సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కై ఐరాస యంగ్ లీడర్ గా నామినేట్ అయిన యువ న్యాయవాది త్రిషాశెట్టి బహిష్ట సమయంలో స్త్రీలు వాడే సానిటరీ నాప్కీన్స్ పై టాక్స్ తీసేయాలంటూ పిటిషన్ వేసారు. షి సేవ్ అనే స్వచ్చంద సంస్థను గత ఏడాది ప్రారంభించిన త్రిష ఈ సంస్థ ద్వారా మన దేశంలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మహిళలు చైతన్యవంతం చేయడం, వారికి పునరావాసం కలిపించడం సాధికారంగా తాయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సానిటరీ నాప్ కీన్స్ పై పన్ను వేయడం వల్ల వాటిని కొనుక్కోలేకపోతున్నారు అని మన దేశంలో కండోమ్స్, కంట్రోసెప్టిక్స్ పై టాక్స్ లేదు అలాగే స్త్రీల ఆరోగ్యరిత్య నాప్ కీన్స్ పై పన్ను విధించడం అన్యాయం అంటున్నారు త్రిష షి నెస్ సంస్థ వివిధ స్థాయిల్లో స్త్రీల పై జరుగుతున్న లైంగిక వేదింపుల పై పోరాడేందుకు ఎడ్యుకేషనల్ వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది త్రిష.

    వీటి పైన పన్ను వేయడం న్యాయమా?

    సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కై ఐరాస యంగ్ లీడర్ గా నామినేట్ అయిన యువ న్యాయవాది త్రిషాశెట్టి బహిష్ట సమయంలో స్త్రీలు వాడే సానిటరీ నాప్కీన్స్…

  • 1960, 70 ల్లో స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి నటి కాంచన ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా మేకప్ వేసుకుంటున్నారు. పెళ్ళి చూపులు ఫేంమ్ దేవరకొండ విజయ్ హీరోగా నటిస్తున్న అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు సందీప్ వంగా కాంచన పాత్ర గురించి చెపుతూ మాములు సినిమా భామ్మ లాగా రొటీన్ గా ఉండరు. మొడ్రన్ భామ్మగా వుంటారు. మనుమలు ఏదైనా తప్పు చేస్తే సినిమాల్లో భామ్మ దానిని సరిగ్గా అర్ధం చేసుకుంటుంది. ఇది వరకు ఆత్మ గౌరవం, మంచి కుటుంబం, నవరాత్రి, వీరాభిమన్యు, అనేక తదితర చిత్రాల్లో నటించి తనదైన ముద్రని వేసుకున్న కాంచన ౩౦ సంవత్సరాల తర్వాత మళ్ళి తెలుగులో నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

    మళ్ళి సినిమాల్లోకి అలనాటి కాంచన

    1960, 70 ల్లో స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి నటి కాంచన ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా మేకప్ వేసుకుంటున్నారు. పెళ్ళి చూపులు…

  • పర్యావరణానికి మేలు చేసే వస్తువులు కనిపెడుతున్నారు చాలా మంది ఇప్పుడు కేరళ లోని ఎర్నాకుళానికి చెందిన లక్ష్మి మీనన్ మొలకెత్తే కలాల్ని కనిపెట్టారు. హోం సైన్స్ లో ఎట్లా తీసుకున్నా లక్ష్మి న్యూ యార్క్ ఫ్యాషన్ వీక్ మోడళ్ళకు నగలు డిజైన్ చేసే వారు. ఆమె అనాధ పిల్లల కోసం తరగతులు నిర్వహించే వారు. వాళ్ళకు కాగితాన్ని బట్టి తాయారు చేసే పెన్నుల తయారీ నేర్పించారు. వాటిని సాన్ఫ్రాన్సిస్కో గ్యలరీ లో ప్రదర్శిస్తే అమ్ముడు పోయాయి. లక్ష్మి నీటి లో విత్తనాలు వుంచి తాయారు చేస్తే అవి అవి పూర్తి స్థాయిలో పర్యావరణానికి మేలు చేస్తాయని ఆలోచించారు. అలా ప్యూర్ లివింగ్ సంస్థ స్థాపించి అందులో రోలాపేనా పేరు తో ఈ వాడి నేలలో పాతితే మొలకెత్తే పెన్స్ తాయారు చేసి వాటిని కళాశాలకు విక్రయించారు. ఈ పెన్ను ఆలోచన బిగ్బీ అమితాబ్ కి నచ్చి బిబిసి కార్యక్రమాల్లో ప్రసారం అయిందిట. ఈ మొలిచే కాగితం పెన్నుల గురించి ఓ సారి ఆలోచించండి. ఇంకా కొత్తగా ఎం చేయొచ్చు?

    ఈ కలాల్లోంచి మొక్కలోస్తాయి

    పర్యావరణానికి మేలు చేసే వస్తువులు కనిపెడుతున్నారు చాలా మంది ఇప్పుడు కేరళ లోని ఎర్నాకుళానికి చెందిన లక్ష్మి మీనన్ మొలకెత్తే కలాల్ని కనిపెట్టారు. హోం సైన్స్ లో…

  • ఒక స్వరం ఆగిపోతుంటే ఇంకో స్వరం నిద్ర లేస్తుంది. అది స్త్రీల ధర్మ రహస్యం. అలినీలు, అన్యాయం పెచ్చు మీరితే ఎక్కడో ఒక కదలిక పుట్టుకొస్తుంది. మలేషియాలో నడుస్తున్న ఉద్యమం పేరు బెర్సిహ్ 2.0 అంటే ప్రక్షాళన అని అర్ధం. ఈ సంస్థ అధ్యక్షురాలు మరియా చిన్ అబ్దుల్లా ప్రస్తుతం ఆమె కధనమైన ఏకాంత కారాగార వనంలో ఉన్నారు. మలేషియా ప్రభుత్వం ఆమె పై తీవ్రవాదం వ్యతిరేకచట్టంలో నిర్భందానికి గురైన తోలి మహిళ మరియానే. ఆర్ధిక రంగాల్లో మహిళల అభివృద్ధి కోసం ఎంవర్మెంట్ అనే స్వచ్చంద సంస్థని ఏర్పాటు చేసి అన్ని రంగాల మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది వరకు పురుషుల ఆధిపత్యంలో నడుస్తున్న బెర్సిహ్ కు అధ్యక్షురలైనారు. ఆమె నిర్వహించిన ఊరేగింపుకి వెలది మంది మహిళలు హాజరు అయ్యారు. ప్రభుత్వానికి ఆగ్రహం వచ్చింది. అరెస్ట్ చేసారు.

    సోస్మా కు గురైన తోలి మహిళ మరియానే

    ఒక స్వరం ఆగిపోతుంటే ఇంకో స్వరం నిద్ర లేస్తుంది. అది స్త్రీల ధర్మ రహస్యం. అలినీలు, అన్యాయం పెచ్చు మీరితే ఎక్కడో ఒక కదలిక పుట్టుకొస్తుంది. మలేషియాలో…

  • ఒక మంచి పుస్తకం వచ్చింది. పేరు 'డెర్త్ ఈజ్ నాట్ ది ఆన్సర్'. సైకియాట్రిస్ట్ డాక్టర్ అంజలి భాను ప్రియ రాసారు. నటి షబ్న ఆజ్మి ఈ పుస్తకం ఆవిష్కరించారు. బాలీవుడ్ దిగ్గజాలు చాలా మంది ఈ పుస్తకావిష్కరణకు హాజరు అయ్యారు. "మన దేశంలో యువత 15 నుంచి 25 ఏళ్ళ వయస్సు వాళ్ళలో ఆత్మ హత్య ఆలోచన పెరుగుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వళ్ళంతా నిజానికి చనిపోరు, వాళ్ళకు ఆ సమయంలో ధైర్యం, ఓదార్పు మానసిక చేయుత కావాలి. జీవితంలో అనారోగ్య సమస్యలు, ఆర్ధిక కష్టాలు, ఇంట్లో చికాకులు, ఇంకా ఊహించని కష్టాలు ఎమోచ్చినా సరే వాటికి ఆత్మ హత్య పరిష్కారం కాదు అంటారు రచయిత్రి డాక్టర్ అంజలి ఛబ్రియా.

    ఎన్నో ప్రశ్నలకు ఇది సమాధానం

    ఒక మంచి పుస్తకం వచ్చింది. పేరు ‘డెర్త్ ఈజ్ నాట్ ది ఆన్సర్’. సైకియాట్రిస్ట్ డాక్టర్ అంజలి భాను ప్రియ రాసారు. నటి షబ్న ఆజ్మి ఈ…

  • గుర్ గావ్ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు హరియానా లోని ఫిరోజ్ పూర్ మియె అన్న గ్రామం లోని నీటి కరువు తిర్చేసారు. తాహిర్ భల్లా ఇంటర్, సియా బిష్ణోయ్ తొమ్మిదో తలగతి చదువుతున్నారు స్నేహితులు మంచి పనికి స్పందిస్తారు. గ్లోబల్ అద్వాకేషన్ అండ్ లీడర్ షిప్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ప్రతి స్కూల్ కి ఒక ఆహ్వానం అందింది. యువత ఏదైన ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేయాలి. ఈ స్నేహితులు ఆ అవకాసం అందుకుని దర్ఖాత్ అనే పేరు తో కరువు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తగ్గిస్తామని ఒక ప్రాజెక్ట్ తాయారు చేసారు. ఫౌండేషన్ ఆమోదం తెలిపింది. మునగ విత్తనాలతో నీటిని శుభ్రం చేసే విధానం ఆఫ్రికా లో అమల్లో వుంది. దాన్ని ఫిరోజ్ పూర్ లో ప్రేవేశ పెట్టారు. ఇంటింటికీ మునగ చెట్టు నాటారు. ఒక మునగ గింజతో లీటర్ నీళ్ళు సుద్ధి అవుతాయి. ఏడున్నార లక్షలు కావాలి ప్రాజెక్ట్ కు విరాళాలు సేకరించి పెద్ద ట్యాంకు కట్టించి సోలార్ప్యానల్ ద్వారా మొటార్లు నిర్మించి ఇంటింటికి మంచి నీరు అందేలా చేసారు. ఆ వూరి మహిళలు నీళ్ళ కోసం మైళ్ళు నడవడం తప్పించారు.

    ఇద్దరు అమ్మాయిలు ఓ ఊరికి నిళ్ళిచ్చారు

    గుర్ గావ్ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు హరియానా లోని ఫిరోజ్ పూర్ మియె అన్న గ్రామం లోని నీటి కరువు తిర్చేసారు. తాహిర్ భల్లా ఇంటర్,…

  • తన వందో పుట్టిన రోజునాటికి వందమంది చిన్న పిల్లల్ని సంతోష పెడదాం అనుకుందిట అమెరికా కు చెందిన లిల్లియన్ వెబర్. ఈ వందేళ్ళ భామ్మ టీ.వి చూస్తుంటే లిటిల్ డ్రెస్సెస్ ఫర్ అమెరికా అనే స్వచ్చంద సంస్థ గౌన్లను సేకరించి ఆఫ్రికా దేశాల్లోని ఆడ పిల్లలకు అందిస్తున్నాదాని తెలిసింది. కొన్ని గౌన్లు కుట్టి ఆ సంస్థ కు పంపిందీ వెబర్. ఒక్క సారి ఈ మాత్రం పంచితే ఇంత సంతోషం వస్తే రోజు గౌన్లు కుట్టి ఇవ్వగలిగితే అలా తన వందో పుట్టిన రోజు నాటికీ వెయ్యి గౌన్లు ఇవ్వగలిగితే ఇంకెంత సంతోషం అనుకుంది వెబర్. రోజుకో గౌన్ కుడుతుంది. అదీ ఎదో మూసగా పని చేయడం కాదు. ప్రతీదీ అందంగా ఆకర్షనీయంగా వాటికీ అందమైన పూసలు, గుండిలు కుట్టి ప్రతి గౌను అందంగా తీర్చి దిద్ది తన లక్ష్యం పూర్తి చేసిందిట ఈ వందేళ్ళ భామ్మ. జీవితంలో ఎదో ఒక లక్ష్యం వుంటే, అదీ ఎదుట వాళ్ళకి ఉపయోగ పడి మనకు సంతోషం ఇస్తే ఆ సంతోషం మనకు ఆయుష్షు పోస్తుంది. సందేహమే లేదు. వందేళ్ళ వెబర్ మనస్సులో బీద పిల్లల పట్ల ఎంత ప్రేముందో????????

    వెయ్యి గౌన్లు కుట్టి పేద పిల్లల కిచ్చిన భామ్మ

    తన వందో పుట్టిన రోజునాటికి వందమంది చిన్న పిల్లల్ని సంతోష పెడదాం అనుకుందిట అమెరికా కు చెందిన లిల్లియన్ వెబర్. ఈ వందేళ్ళ భామ్మ టీ.వి చూస్తుంటే…

  • మిస్ ఎక్స్, ఫెమినా మిస్ ఇండియా, మిస్ స్టైలిష్ హెయిర్, మిస్ అడ్వెంచరస్, మిస్ ఫ్యాషన్ ఐకాన్ ఇలాంటి టైటిల్స్ సొంతం చేసుకున్నశాభిత ధూళపాళ్ ఇంకొక ట్యాగ్ ని సొంతం చేసుకుంది. కాస్మో పాలిటెన్ మేగజైన్ సహజమైన అందంతో వున్న 11 మంది అమ్మాయిల ఫోటోలు ప్రచురించింది. అందులో ఓ అమ్మాయి శాభిత ధూళపాళ్. సాధారణంగా మనం ఫ్యాషన్ వేటిని తిరగేసినా అన్ని రంగుల మాయమైన ఫోటోలు కనిపిస్తాయి. చెక్కని చాయ, చెక్కని శరీరాకృతి, మచ్చలు లేని ముఖాలతో ప్రతి పేజీలోను ఎందరో మోడళ్ళు కనిపిస్తారు. కానీ కాస్మో పాలిటన్ మాగజైన్ ఈ సారి లక్ష్యం కళ్ళు చెదిరే రంగు రూపుల కన్నా సహజంగా వున్న లావణ్యమే గొప్పది అని చెప్పాలనుకున్నారు. ఈ సహజ సౌందర్యమైన అందాలున్న అమ్మాయిల్లో శాభిత ధూళపాళ్ ఉన్నారు. ఈ తెలుగమ్మాయి, మోడల్ ఏమంటున్నారంటే అందం అంటే అర్ధం పాశ్యార్ద ద్రుక్పదానికి చెందినది. కానీ ఆత్మవిశ్వాసమె అసలైన అందం. ఈ భావన అందరిలో నింపాల్సిన సమయం వచ్చింది అంటుంది. నిజమే కదా సహజత్వం కంటే గొప్ప అందం ఏముంటుంది.

    సహజ సౌందర్య వతి శాభిత ధూళపాళ్

    మిస్ ఎక్స్, ఫెమినా మిస్ ఇండియా, మిస్ స్టైలిష్ హెయిర్, మిస్ అడ్వెంచరస్, మిస్ ఫ్యాషన్ ఐకాన్ ఇలాంటి టైటిల్స్ సొంతం చేసుకున్నశాభిత ధూళపాళ్ ఇంకొక ట్యాగ్…

  • వయో వృద్దులైన నానమ్మళ్ ప్రసిద్ద యోగా గురు. తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన నానమ్మళ్ తాజాగా గిన్నీస్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. 97 సంవత్సరాల వయస్సులో కూడా బిన్న అక్షరాలు కూడా ఈమె చదవగలరు. సంప్రదాయమైన చీరకట్టు లో వుండే నానమ్మళ్ యాభై కంటే ఎక్కువ ఆసనాలు వేస్తుంది. ఒకే సారి రెండు వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నానమ్మళ్ తన 14వ ఏట సిలం బత్రమ్ అన్న యుర్ధ క్రీడలో బహుమతులు గెలుచుకుంది. ఇప్పటికి ఇంటి దగ్గర వంద మందికి యోగా నేర్పుతుంది. ప్రతి రోజు తొందరగా నిద్ర పోయి తెల్లవారు జామునే నిద్రలేస్తుంది. రాగి జావ, ఆహారంలో సెరియల్స్, పప్పులు తింటుంది.వారి బియ్యం, మాంసం తినదు. రాత్రి ఒక పండు, పసుపు లేదా మిరియాలు వేసిన పాలు తాగుతుంది. స్వయంగా పండించుకున్న పల కూర కచ్చితంగా రోజు ఎదో రూపంలో తింటుంది. ఈమె అనుసరిస్తున్న పాలకూర ఖచ్చితంగా రోజుఎదో రూపంలో తింటుంది. ఈమె అనుసరిస్తున్న యోగ పద్దతులు యోగ గురువును ఆకర్షిస్తున్నాయి దీర్గకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటుంది నానమ్మళ్ గురించి చదువుకోండి.

    గిన్నీస్ బుక్ లో 97 ఏళ్ళ యోగా గురు

    వయో వృద్దులైన నానమ్మళ్ ప్రసిద్ద యోగా గురు. తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన నానమ్మళ్  తాజాగా గిన్నీస్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. 97 సంవత్సరాల వయస్సులో…