• అనన్య జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్. జర్నీ, అఆ వంటి సినిమాల్లో నటించిన అనన్య రెండు సార్లు కేరళ ఆర్చరీ ఛాంపియన్ గా బంగారు పతకాలు అందుకుంది. ఓ సారి బండి పైనుంచి పడి, ఇంకో ప్రమాదంలో మోచేతికి గాయమై ఈ విలు విద్య క్రీడకు దూరమైంది. కానీ ఇప్పుడు సినీ రంగoలో బిజీ అయ్యాక కుదన్ అనన్య కు విలువిద్య పైనున్న ఇష్టం తగ్గలేదు. ఎర్నాకులం జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో బరిలోకి దిగింది. మహిళల రిజర్వ్ విభాగంలో మరో బంగారు పతకం సాధించి నేషనల్ ఛాంపియన్ షిప్ కు అర్హత పొందింది. దీపికా కుమారి వంటి ఒలింపిక్ ఛాంపియన్స్ తో పోటీ పడటం విశేషం. ఫోటో షూట్స్ లో కనిపించే ఈ అమ్మాయి స్పోర్ట్స్ పేజీలో కనిపించడం విశేషం. అనన్య అసలు పేరు అయిల్య గోపాలకృష్ణన్ నాయర్.

    క్రీడాకారిణి ఈ హీరోయిన్

    అనన్య జాతీయ స్థాయి ఆర్చరీ ఛాంపియన్. జర్నీ, అఆ వంటి సినిమాల్లో నటించిన అనన్య రెండు సార్లు కేరళ ఆర్చరీ ఛాంపియన్ గా బంగారు పతకాలు అందుకుంది.…

  • బిల్, హిల్లరీ క్లింటన్ ల కుమార్తె చెల్సియా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. న్యూయార్క్ లోని 17వ నియోజకవర్గం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నిటా లోవీ రాజకీయాల నుంచి విరమించాలని భావించడంతో ఆ స్థానం భర్తీ చేయడానికి జరగనున్న ఎన్నికల్లో 36 సంవత్సరాల చెల్సియా పోటీ చేయనున్నారు. 79సంవత్సరాల లోవీ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా 30 ఏళ్ల పాటు పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చెల్సియా తన తల్లి హిల్లరీకి మద్దతుగా ప్రచారం చేశారు.

    పాలిటిక్స్ లోకి క్లింటన్ కుమార్తె

    బిల్, హిల్లరీ క్లింటన్ ల కుమార్తె చెల్సియా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. న్యూయార్క్ లోని 17వ నియోజకవర్గం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నిటా లోవీ రాజకీయాల నుంచి…

  • డిగ్రీ చదువుకుని పద్మజ ఉద్యోగం కోసం కొల్వాపూర్ నుంచి ధార్వాడ్ కు బయలుదేరి వచ్చింది. కార్లు అమ్మే షోరూమ్ లో ఉద్యోగం దొరికింది నెమ్మదిగా సర్విసింగ్, డ్రైవింగ్, కార్ మెకానిజం అన్ని నేర్చుకుంది. సొంతంగా కారు షెడ్ పెట్టుకుంది. పురుషులు చేసే పని నీకెందుకు అన్నారందరూ. కానీ పద్మజ మహిళలకు శిక్షణ ఇచ్చి వారినే పనిలో పెట్టుకుంది. ధార్వాడ్ లో ఈ కారు మెకానిక్ షెడ్ లో అందరూ మహిళలే పని చేస్తారు. పద్మజా పాటిల్ ధ్యేయం నెరవేరింది. చెక్కగా యునీఫాం వేసుకుని తన తోటి మహిళల తో కలిసి పని చేస్తుంది చెక్కని సేవలందిస్తుంది. వచ్చిన కారును సకలంలో బాగు చేసి ఇస్తుంటే ఇప్పుడు ఆమెకు గొప్ప పేరు కోట్ల రూపాయిల ఆదాయం వచ్చి పడ్డాయి.

    ఈ మెకానిక్ షెడ్లో అందరూ మహిళలే

    డిగ్రీ చదువుకుని పద్మజ ఉద్యోగం కోసం కొల్వాపూర్ నుంచి ధార్వాడ్ కు బయలుదేరి వచ్చింది. కార్లు అమ్మే షోరూమ్ లో ఉద్యోగం దొరికింది నెమ్మదిగా సర్విసింగ్, డ్రైవింగ్,…

  • పాతికేళ్ళ విరామం తరువాత అక్కినేని అమల సినిమాల్లో నాటించ బోతున్నారు. లిఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ పైన రీ- ఎంట్రి ఇచ్చిన అమల ఇప్పుడు మలయాళంలో నటిస్తున్నారు. ఆంటోని సోని డైరెక్టర్ గా నిర్మిస్తున్న లేడి ఓరియెంటెడ్ సినిమా 'కేరాఫ్ సైరా భాను' లో పోస్ట్ ఉమెన్ గా మంజు వారియర్, లాయర్ గా అమల నిస్తున్నారు గతంలో సురేష్ గోపి, మోహన్ లాల్ పక్కన హీరోయిన్ గా నటించిన అమలకు ఇది మూడో మలయాళ సినిమా.

    మలయాళ సినిమాలో అమల

    పాతికేళ్ళ విరామం తరువాత అక్కినేని అమల సినిమాల్లో నాటించ బోతున్నారు. లిఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో సిల్వర్ స్క్రీన్ పైన రీ- ఎంట్రి ఇచ్చిన అమల ఇప్పుడు…

  • హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎంపికైన తోలి భారతీయ అమెరికన్ గా ప్రమీల రికార్డు సృష్టించారు. సియాటెల్ నుంచి 51 సంవత్సరాల ప్రమీల జయ్ పాల్ ప్రతినిధుల సభకు ఎంపికైనవారు. తొలి ప్రయత్నంలో ఈమె కాంగ్రెస్ కు ఎంపికయ్యారు. చెన్నయ్ లో జన్మించిన ప్రమీల కుటుంభం ఆమె ఐదేళ్ల వయసులో ఇండోనేషియా సింగపూర్ అక్కడనుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఈమె రాసిన ఫిలిగ్రిమేజ్ టు ఇండియా - ఏ ఉమెన్ రీ విజిట్స్ హోమ్ లాండ్ అన్న పుస్తకం 2000 లో ప్రచురితమైంది. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ప్రమీల అభిర్దితావన్ని బలపరిచారు.

    ప్రమీలా జయ పాల్ విజయం

    హౌస్ అఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఎంపికైన తోలి భారతీయ అమెరికన్ గా ప్రమీల రికార్డు సృష్టించారు. సియాటెల్ నుంచి 51 సంవత్సరాల ప్రమీల జయ్ పాల్ ప్రతినిధుల…

  • అమెరికాసాధారణ స్థాయి ఎన్నికల్లో నలుగురు భారతీయ సంతతి అమెరికన్లు విజయం సాధించారు. అందులో ఇద్దరు మహిళలు. 51 సంవత్సరాల భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అమెరికా సెనేట్ కు ఎంపికైన రికార్డు సృష్టించారు. కాలిఫోర్నియాలో ని ఓక్ ల్యాండ్లో పుట్టిన హ్యారిస్ తల్లి చెన్నై నుంచి 1960 లో అమెరికా కు వలస వెళ్లారు. ఈమె తండ్రి జమైకన్. అమెరికా అధ్యక్షుడు ఒబామా కమలా హారిస్ ఆధ్వర్యంలోని బలపరిచారు.

    అమెరికా సెనేట్ కు కమలా హ్యారిస్

    అమెరికాసాధారణ స్థాయి ఎన్నికల్లో నలుగురు భారతీయ సంతతి అమెరికన్లు విజయం సాధించారు. అందులో ఇద్దరు మహిళలు. 51 సంవత్సరాల భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అమెరికా…

  • కొన్ని మంచి పనులకు అన్నీ కలిసొస్తాయి. వివాహిత స్త్రీలు ముసుగు ధరించి సంప్రదాయం వుంది. అయితే మీర్జాపూర్ గ్రామానికి చెందినా అంజూ యాదవ్ ఈ సంప్రదాయం ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తున్నాయని ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని స్వానుభవం తో తెలుసుకుంది. ముసుగు ధరించనని పెద్దవాళ్ళ అనుమతి కోసం ఇంట్లోనే మూడేళ్లు పోరాడాల్సి వచ్చింది. ఆమె చెల్లి మంజూ యాదవ్ కూడా అక్కతో చేయి కలిపింది. వీళ్లకు పొరుగు గ్రామ సర్పంచ్ సజ్మా ఖాన్ తోడైంది. ధీజ్ గ్రామా సర్పంచ్ గా ఈ ముసుగు ఆమెకి ప్రాబ్లమే. ఈ ముగ్గురు కలిసి డిప్యుటీ కమిషనర్ ని కలిశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ముసుగుకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టి అవగాహనా కార్యక్రమాలు చేపట్టి దాదాపు 116 గ్రామాల మహిళలను చైతన్యవంతం చేసారు. ఈ మీర్జాపూర్ యువతులు ముసుగు పద్ధతికి శాశ్వతంగా చెక్ పెట్టేసారు.

    ముసుగుకు వ్యతిరేకంగా పోరాటం

    కొన్ని మంచి పనులకు అన్నీ కలిసొస్తాయి. వివాహిత స్త్రీలు ముసుగు ధరించి సంప్రదాయం వుంది. అయితే మీర్జాపూర్ గ్రామానికి చెందినా అంజూ యాదవ్ ఈ సంప్రదాయం  ఉద్యోగ…

  • అలీసా మాంక్స్ పెయింటింగ్స్ కోసం ఆమె గ్యాలరీ లో వెతకండి. ఎన్ని సోలో ఎగ్జిబిషన్స్ ,ఎన్ని గ్రూప్ ఎగ్జిబిషన్స్ లెక్కలేనన్ని. ఆమె బయోగ్రఫీ చుస్తే లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. ఆమె పెయింటింగ్స్ అన్ని ఫొటోల్లా ఉంటాయి. కానీ అవన్నీ అలీసా మాంక్స్ కుంచె తో వేసిన పెయింటింగ్స్ న్యూయార్క్ లో వుండే మాంక్స్ కు అత్యంత సహజమైన చిత్రాలు వేసే పెయింటర్ గా ఎంతో పేరుంది. మేని ఛాయా ను కంటి మెరుపును కూడా అత్యంత సహజంగా చిత్రించగలిగారమే. నీళ్లలో ఓ అందమైన అమ్మాయి స్నానం చేస్తున్న పెయింటింగ్ అనుకోండి నీళ్లు సహజమైన రంగులోనే స్నానం చేసే అమ్మాయి సహజంగానే. మొహం నిండా నీటి బిందువులున్నాయి. ఒక అందమైన అమ్మాయి చిత్రంలో అవి నిజంగానే నీళ్లు రాలుతున్నట్లే వున్నాయి. ఇంకెన్నో చిత్రాలు మాంక్స్ గొప్పతనం చాటేందుకు !!

    అద్భుతమైన పెయింటింగ్స్ అలీసా మాంక్స్

    అలీసా మాంక్స్ పెయింటింగ్స్ కోసం ఆమె గ్యాలరీ లో వెతకండి. ఎన్ని సోలో ఎగ్జిబిషన్స్ ,ఎన్ని గ్రూప్ ఎగ్జిబిషన్స్ లెక్కలేనన్ని. ఆమె బయోగ్రఫీ చుస్తే లిస్ట్  మొత్తం…

  • ఇండియా లో మొట్టమొదటి మహిళా ట్రక్ మెకానిక్ శాంతి దేవి శారీరిక మైన కష్టంతో కూడిన ఈ వృత్తిలో భర్త తో పాటు పాలుపంచు కుంటే శాంతి దేవిని ఎంతో ఆశ్చర్యంగా చూసారు. ఢిల్లీ లో ఉన్న సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో టైర్లకు పంచ్ కు వేస్తూ కనిపిస్తుంది. 75 ఎకరాల్లో ఉన్న ఈ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో సుమారు 70,000 ట్రక్కులు పార్క్ చేయచ్చు. 20,000 ట్రక్కులు తిరుగుతుంటాయి. టైర్లకు పంచర్లు వేసేందుకు స్థిరపడిన శాంతి దేవి అన్ని వాహనాల టైర్లకు పంచర్లు వేయగలరు. చాలా మంది మగవాళ్ల కంటే నేను బెటర్ మెకానిక్ ని కాకపోతే నేనా పనిచేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తారు. అంటుందామె. ఆటో మొబైల్ రంగంలోకి ముఖ్యంగా ఇప్పటివరకు స్త్రీలు అడుగుపెట్టని రంగంలోకి ఆడవాళ్ళూ ప్రవేశించి ఆ హద్దులు చెరిపేయాలి. ఇదిగో కళ్ళ ముందే స్ఫూర్తి దాత శాంతి దేవి.

    మహిళా మెకానిక్ శాంతి దేవి ఒక్కరే

    ఇండియా లో మొట్టమొదటి మహిళా ట్రక్ మెకానిక్ శాంతి దేవి శారీరిక మైన కష్టంతో కూడిన ఈ వృత్తిలో భర్త తో పాటు పాలుపంచు కుంటే శాంతి…

  • బాల నటిగానే వెండి తెరకొచ్చిన రెజీనా కసాండ్రా కృష్ణ వంశీ నక్షత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. చిన్నప్పుడు సైకాలజీ చదవాలి అనుకునేదట. చెన్నయ్ లోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో బి. ఏ సైకాలజీ తీసుకొందిట. కానీ ఇటు సినిమాల్లో బిజీ అయిపోయింది. కానీ ఎప్పుడు ఎదుటివాళ్ళ కష్టాలు పంచుకోవాలనే అనుకుంటుందిట. ఇప్పటికీ రెజీనా మూడు స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేస్తోందిట. హైద్రాబాద్ లోని పాఠశాలల్లో పిల్లలకు క్రీడా నైపుణ్యాలు నేర్పే లైఫ్ ఈజ్ ఎ బాల్ సంస్థ పాఠశాలల్లో పిల్లలకు ఇంగ్లీషు విలువలతో కూడిన విద్య నేర్పించే లైఫ్ ఫర్ ఎ చేంజ్ సంస్థ మూడోది ఆదిత్య మెహతా ఫౌండేషన్ కోరుకున్న దాని కోసం ఎంతైనా కష్టపడతానని చెప్పే రెజీనా తన బిజీ షెడ్యూల్స్ తో కూడిన జీవితాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుని సమయం మిగుల్చుకుని ఈ సేవ సంస్థలతో కలిసి పనిచేస్తానని చెపుతోంది. ఇప్పుడు తెలుగు చక్కగా నేర్చేసుకుందిట కూడా.

    సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్న రెజీనా

    బాల నటిగానే వెండి తెరకొచ్చిన రెజీనా కసాండ్రా  కృష్ణ వంశీ నక్షత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. చిన్నప్పుడు సైకాలజీ చదవాలి అనుకునేదట. చెన్నయ్ లోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో…

  • వేలకు వేలు కర్చు పెట్టి కార్పోరేట్ కాలేజీలోచదివిస్తున్న ఉన్నత విద్య కోసం సీటు తెచ్చుకోలేని విద్యార్ధుల కోసంశివాంగి స్టొరీ. కాన్పూర్కి అరవై కిలో మీటర్ల దూరంలోని దేహా గ్రామంలో పుట్టిన శివాంగి తండ్రి తో పాటు దిన పత్రికలు, మాగజైన్లు అమ్ముతుండేది. ఆనంద కుమార్ నడుపుతున్న సూపర్ ౩౦ విద్యా కార్యక్రమం గురించి తలుసుకుని ఆయన్ను కలిసింది. పేద కుటుంబాల పిల్లల్ని ఐఐటి ఇంజనీర్లుగా తీర్చి దిద్దే కార్యక్రమం అది. శివాంగి ఆ కార్యక్రమానికి ఎంపికైనది. కోచింగ్ పూర్తి చేసుకుని ఐఐటి లో సీటు సంపాదించింది. మంచి కార్పోరేట్ ఉద్యోగం సంపదిన్చేసింది కూడా. ఈ అమ్మాయి విజయగాధను ఆనంద్ కుమార్ ఆమె ఫోటోలు, ఆమె ఇంట్లో వాళ్ళ ఆనందోత్సాహాలు పోస్ట్ చేస్తే వేలకొద్ది లైక్లు షేర్లు వచ్చాయి.

    ఆ శివాంగి ఇప్పుడు ఐఐటి గ్రాడ్యుయేట్

    వేలకు వేలు కర్చు పెట్టి కార్పోరేట్ కాలేజీలోచదివిస్తున్న ఉన్నత విద్య కోసం సీటు తెచ్చుకోలేని విద్యార్ధుల కోసంశివాంగి స్టొరీ. కాన్పూర్కి అరవై కిలో మీటర్ల దూరంలోని దేహా…

  • జీవితం లో తగిలిన ఒక్కో గాయం స్వర్ణలతకు బలమే ఇచ్చాయి. ప్రతి నైపుణ్యాన్ని ఒడిగ పెట్టింది. నాట్యం, పాట, ఈత లాంటి ఎన్నో కళాకారులతో పాటు పన్నెండు భాషలు నేర్చుకుంది. ఇంత నేర్చిన స్వర్ణలత ముల్టిపుల్ స్కిర్లోసిన్ బాధితురాలు. చక్రాల కుర్చికే పరిమితం మైన స్వర్ణలత జేవితం మాత్రం విశాలం. వికలాంగుల కోసం స్వర్ణ ఫౌండేషన్ స్థాపించింది. కాలం కూడ పట్టుకోలేని పక్షవాత బాధితులు బెంగుళూరు, పూణే, చెన్నై లోని విద్యార్ధులు కార్పోరేట్ సంస్థల ఉద్యోగుల కోసం వందల ప్రసంగాలు చేసింది. ఇద్దరు పిల్లల తల్లి స్వర్ణలత దివ్వాంగుల కోసం సారధి క్యాబ్ డిజైన్ చేసింది. తాగునీరు, మరుగుదొడ్డి వసతులున్న క్యాబ్లు ఇవి. దివ్వంగులకు వైద్యం, చదువు కోసం, ప్రభుత్వ ప్రేవైట్ సంస్థల్లో ప్రత్యేక వసతుల కోసం పోరాటం చేస్తూనే వుంది స్వర్ణలత.

    ఎంత విశాలం ఈమె జీవితం

    జీవితం లో తగిలిన ఒక్కో గాయం స్వర్ణలతకు బలమే ఇచ్చాయి. ప్రతి నైపుణ్యాన్ని ఒడిగ పెట్టింది. నాట్యం, పాట, ఈత లాంటి ఎన్నో కళాకారులతో పాటు పన్నెండు…

  • మైన్స్ యాక్ట్ ప్రకారం గనుల్లో పని చేసేందుకు ఆడవాళ్ళకు అనుమతి లేదు. శారీరక శ్రమతో కూడిన కెరీర్ అది. కానీ డాక్టర్ చంద్రాణీ ప్రసాద్ వర్మ మాత్రం గనుల్లో పని చేయాలనే నిర్ణయించుకొన్నారు. మైనింగ్ బ్యాచిలర్ డిగ్రీ కోసం దరఖాస్తు చేస్తే ఒక్క కాలేజీ కూడా ఈమెకు సీటు ఇవ్వలేదు. చదువు విషయంలో లింగ వివక్షకు తావుండకోడదని వాదిస్తూ ఆమె హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. 1996 లో ఆమెకు అడ్మిషన్ దొరికింది. నాగపూర్ లోని రామ్ దేవ్ బాబా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మైనింగ్ ఇంజనీర్ గా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. అదే కాలేజీ లో లెక్చరర్ గా కొనసాగుతున్నారు డాక్టర్ చంద్రణీ ప్రసాద్ వర్మ. మొట్ట మొదటి మహిళా మైనింగ్ ఇంజనీర్. అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఇప్పటికీ మహిళలకు అనుమతి ఇవ్వడం లేదనే చంద్రణీ వర్మ ఆవేదన. మైనింగ్ రంగంలోకి చంద్రణీ వర్మని స్పూర్తిగా తీసుకొని మరింత మంది మహిళలు వస్తే బావుంటుంది.

    మొదటి మహిళా మైనింగ్ ఇంజనీర్

    మైన్స్ యాక్ట్ ప్రకారం గనుల్లో పని చేసేందుకు ఆడవాళ్ళకు అనుమతి లేదు. శారీరక శ్రమతో కూడిన కెరీర్ అది. కానీ డాక్టర్ చంద్రాణీ ప్రసాద్ వర్మ మాత్రం…

  • కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో 44 సంవత్సరాల ముక్తార్ మాయీ పాల్గొన్నాది. ఆమె సెలెబ్రెటీలకే సెలబ్రెటీ. 14 సంవత్సరాల క్రితం ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది. 2002 సంవత్సరంలో మాయీ సోదరుడు తన ప్రత్యర్థి కుటుంబాన్ని అవమానించాడు. దానికి బదులు గ్రామా గిరిజన పెద్దలు ముక్తార్ మాయీ పై సామూహిక అత్యాచారం జరపాలని ఆమెను బహిరంగంగా నగ్నంగా వీధుల్లో తిప్పాలని కఠిన శిక్ష విధించారు. శిక్ష అనుభవించిన ముక్తార్ తనకు జరిగిన అన్యాయం పై న్యాయ పోరాటం చేసింది. సుప్రీమ్ కోర్టు కు ఎక్కింది. తన అనుభవాలతో ముక్తార్ మహిళల హక్కుల కోసం ఉద్యమించింది. తాను మీర్ వారా గ్రామంలో ఒక ఆడపిల్లల స్కూల్ అనాధ మహిళల కోసం కేంద్రాన్ని స్థాపించింది. ఈ సెలబ్రెటీ రాంప్ వాక్ లో అందరు ఆమెను అభినందించారు.

    ఎన్ని నోళ్లతో పొగడాలి ఈమెను

    కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో 44 సంవత్సరాల ముక్తార్ మాయీ పాల్గొన్నాది. ఆమె సెలెబ్రెటీలకే సెలబ్రెటీ. 14 సంవత్సరాల క్రితం ఆమె గ్యాంగ్ రేప్ కు…

  • బెంగుళూరుకు చెందిన మోడల్ టి.వి నటి ఐశ్వర్య పేమ్సే, అంతర్జాతీయ మోటార్ ర్యాలీలో పాల్గొన్న తోలి మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే భారత్ తరపున పాల్గొన్న తోలి మహిళ గా రికార్డుల కెక్కిన ఐశ్వర్య తైవాన్ లో జరిగిన అంతర్జాతీయ మోటార్ ర్యాలీ లో పాల్గొంది. గతంలో ఈమె జాతీయ స్థాయి పురుషుల విభాగంలో కూడా ఆమె పాల్గొంది. ఆ పోటిలలో తొమ్మిది మంది మహిళలు పాల్గొంటే ఐశ్వర్య వారిలో తోలి స్థానం సాదించింది. ఆసియా కప్ రోర్ రేస్ లో పాల్గొన్న ఐశ్వర్య 125 సి.సి స్కూటర్ ను చెన్నైకి చెందిన శృతి నాగా రాజన్ తో కలిపి నడిపింది. టి.వి సిరియల్స్ తో పాటు కొన్ని ఉత్పత్తులకు ఐశ్వర్య పిస్తే మోడల్ గా కొనసాగుతుంది.

    బైక్ రేసింగ్ లో బెంగుళూరు మోడల్

    బెంగుళూరుకు చెందిన మోడల్ టి.వి నటి ఐశ్వర్య పేమ్సే, అంతర్జాతీయ మోటార్ ర్యాలీలో పాల్గొన్న తోలి మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే భారత్ తరపున పాల్గొన్న తోలి…

  • రాజస్థాన్ లోని బికనీర్ లో పుట్టింది మాల్వికా అయ్యర్ 13సంవత్సరాల వయసులో తన ఇంటి సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో రెండు చేతులు పోగొట్టుకుంది. కాళ్ళు ముక్కలయ్యాయి. ఎన్నో సర్జరీల తర్వాత కాళ్ళు కాపాడగలిగారు డాక్టర్లు. రెండు చేతులు కృత్రిమ ప్రొస్థెటిక్ హాండ్స్ పెట్టుకుని కాలేజీలో చదివి పి.జి చేసింది. అలా మొదలైన ఆమె జీవిత ప్రస్థానం ఆమెను దేశవిదేశాల్లో ప్రధాన మోటివేషన్ స్పీకర్ దాకా సాగింది. సోషల్ వర్క్ లో పి. జి చేసి యాక్సిడెంట్ సర్వైవర్ గా మొదలైన మాల్వికా యాక్టివిస్ట్ గా మారింది. వికలాంగుల కోసం ఆమె సాగిస్తున్న కృషికి గానూ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఎమర్జింగ్ లీడర్ అవార్డు ఇచ్చారు. జీవితం మొత్తం మోటివేషన్ స్పీకర్ గానే కొనసాగాలంటోంది మాల్వికా. ఈమె పూర్తి కథను your story. com లో చదవచ్చు.

    చైతన్య దీపిక మాల్వికా అయ్యర్

    రాజస్థాన్ లోని బికనీర్ లో పుట్టింది మాల్వికా అయ్యర్ 13సంవత్సరాల వయసులో తన ఇంటి సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో రెండు చేతులు పోగొట్టుకుంది. కాళ్ళు…

  • ఛత్తీస్గఢ్ కు చెందిన స్మిత తందిని ఫేస్ బుక్ లు పది లక్షల కంటే ఎక్కువ మంది అనుకరిస్తున్నారు. వృత్తి రిత్యా కాని స్టేబుల్ వైద్యం చేఇంచుకోలేని పేద వాళ్ళ కోసం స్మిత చాలా కష్టపడుతుంది. ఫేస్ బుక్ ద్వారా వివరాలు తెలుసుకుని తనను ఫాలో అయ్యే వారి దగ్గర విరాళాలు సేకరించి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది స్మిత. ఇలా నిత్యం ఆసుపత్రుల్లో వివరాలు సేకరించి ఆడుకునే స్మిత కర్యదిక్షకు ఉన్నతాధి కారులు ఎంతగానో మెచ్చుకుని విమెన్స్ హెల్ప్ ప్రారంబించి ఆ బాధ్యత స్మితకు అప్పగించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అతి సాదరణమైన ఉద్యోగంలో వున్న ఇంత మందికి స్పూర్తిగా నిలబడినందుకు స్మిత సల్యుట్ చేయాల్సిందే.

    ఆమె ఏడు లక్షల మంది ఫాలోవర్స్

    ఛత్తీస్గఢ్ కు చెందిన స్మిత తందిని ఫేస్ బుక్ లు పది లక్షల కంటే ఎక్కువ మంది అనుకరిస్తున్నారు. వృత్తి రిత్యా కాని స్టేబుల్ వైద్యం చేఇంచుకోలేని…

  • ధనుష్ భార్య,రజనీకాంత్ కూతురు అన్న ట్యాగ్స్ కంటే ఐశ్వర్య కు మంచి రచయత్రి అన్న ట్యాగ్ బాగా నప్పుతుంది. ఈమె ఐక్యరాజ్య సమితి మహిళ సమాఖ్య సలహాదారు. లింగ సమస్య సాధికారత పై సలహలిచ్చే భాద్యత ఈమెది. ఈ మద్య జరిగిన్ ఐక్యరాజ్యసమితి మహిళ సమావేశంలో ఐశ్వర్య ఐక్యరాజ్యసమితి మహిళా కార్యచరణ నిర్దేశకురాలు పూంజిల్ ,ఉపకార్యచరణ నిర్దేశకురాలు......కలిసి పాల్గొంది.మనం కోత్త సమాజాన్ని నెలకోల్పలని ఆ సమాజం రేపటి తరానికి ఇవ్వాలని ఐశ్వర్య తన ప్రసంగం లో చెప్పింది. పూర్తి పాఠం విశేషాలు వెబ్ సైట్ లో చూడొచ్చు. మన గురించి ఏం చెప్పుకొవాలో ఏం తెలుసుకోవాలో ఇలాంటి సమావేశాల్లో అర్ధం అవుతుంది.

    ఐరాస మహిళ ఐశ్వర్య

    ధనుష్ భార్య,రజనీకాంత్ కూతురు అన్న ట్యాగ్స్ కంటే ఐశ్వర్య కు మంచి రచయత్రి అన్న ట్యాగ్ బాగా నప్పుతుంది. ఈమె ఐక్యరాజ్య సమితి మహిళ సమాఖ్య సలహాదారు.…

  • నైనిటాల్ లోని కుమావూన్ రాజ ప్రసాదం అబాట్స్ ఫోర్ట్ లో పుట్టిన జహ్నవీ ప్రసాద్ కు వార్సా బత్రాలు నిర్మించడం ఇష్టం. గాంధీ సత్య శాధన పుస్తకాన్ని చదివాక ఆయన గురించి ఎంతో స్టడీ చేసింది. గాంధీ తిరిగిన దక్షిణాఫ్రిక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ తిరిగి ఆయన్ను ప్రభావితం చేసిన వ్యక్తులను, ఆయన వాల్ల ప్రభావితులైన వ్యక్తులను కలుసుకుంది. గాంధీ సత్యశోధనలోని విషయాలు ఇతర చిత్రకారులతో కలిసి బొమ్మలు వేసి టేల్స్ ఆఫ్ యంగ్ గాంధీ పేరు తో ఆధునిక గ్రాఫిక్స్ నవలగా తీసుకొస్తుంది. రాజ ప్రసాదంలో ఆడంబరంగా జీవించాల్సిన ఈ అమ్మాయి నిరాడంబరమైన గాంధేయ మార్గం అంటే ఎంతో ఇష్టం.

    ఈ జమిందారు కూతురికి గాంధేయ మార్గం ఇష్టం

    నైనిటాల్ లోని కుమావూన్ రాజ ప్రసాదం అబాట్స్ ఫోర్ట్ లో పుట్టిన జహ్నవీ ప్రసాద్ కు వార్సా బత్రాలు నిర్మించడం ఇష్టం. గాంధీ సత్య శాధన పుస్తకాన్ని…

  • ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆలా లండన్ లో పని చేస్తున్న గీతాంజలి రాజమణి భారత్ వచ్చి బెంగుళూరు లోని గ్రీన్ మై లైఫ్ సంస్థను డిజైన్ చేసే ముందర గార్డెనింగ్ పైన పట్టు సాధించాలి. ఇక వ్యాపారంలో దిగి హోటళ్లు రిసార్ట్ లు ,ఇళ్లలో మొక్కల్ని ఏర్పాటు చేస్తారు. ల్యాండ్ స్కేపింగ్ ,కిటన్ గార్డెన్ ల తో సరి పెట్టుకోకుండా రైతుల కోసం విత్తనాలు మొక్కలు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. కూరగాయలు పండ్లు ఉద్యానవన పంటలు అంతర పంటలకు సంబంధించి 400 రకాల విత్తనాలు రైతుల కోసం పంపిణీ చేస్తారు. ప్రత్యక్షంగా రైతులను కలిసి మంచి విత్తనాలు సేకరించి గిట్టు బాటు ధర చెల్లిస్తారు. ఇలాంటి వాళ్ళను తలుచుకుంటే ఏదైనా కొత్త పని చేయాలనిపిస్తుందేమో కదా !

    మొక్కల వ్యాపారం చేస్తుంది గీతాంజలి

    ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆలా లండన్ లో పని చేస్తున్న గీతాంజలి రాజమణి భారత్  వచ్చి బెంగుళూరు లోని గ్రీన్ మై లైఫ్…