• గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2017 పోటీలో టాప్ 50 లో ఒకరుగా ఇండియా నుంచి కవితా సంగ్వి ఒక్కరే పోటీలో నిలిచారు. ముంబై లోని MET రిషికుల్ విద్యాలయాలు ఫీజికల్ టీచర్ గా ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కవిత సంగ్వి భౌతిక శాస్త్రం బోధించటంలో అనేక ప్రయోగాలు చేసారు. ఏ ఈపోటీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 20 వేల నామినేషన్లు వస్తే ఇండియా నుంచి కవిత సంగ్వి ఒక్కరే పోటీలో ఉన్నారు. గ్లోబల్ టీచర్స్ అక్రిడేషన్ ప్రోగ్రాం లో పాల్గొనేందుకు బ్రిటిష్ కౌన్సిల్ కవితను ఎంపిక చేసారు. వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2016 లో నిర్వయించిన స్కూల్ ఇంటర్ప్రైజ్ ఛాలెంజ్ లో గ్లోబల్ విన్నర్ గా నిలిచారు. కవిత. ఉపాధ్యాయ వృత్తిలో అసాధారణ మైన సేవ అందించినవారికి ఈ ప్రైజ్ అందజేశారు. టాప్ 50 లో పదిమందిని ఎంపిక చేసి దుబాయ్ లో జరిగే కార్యక్రమానికి మార్చ్ 19 న అక్కడ కార్యక్రమంలో ఫైనల్ విజేతను ప్రకటిస్తారు. యూకే కు చెందిన వర్కే ఫౌండేషన్ ఈ ప్రైజ్ ప్రతి సంవత్సరం అందజేస్తోంది.

    భౌతిక శాస్త్ర బోధన లో ఆమె బెస్ట్

    గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2017 పోటీలో టాప్ 50 లో ఒకరుగా ఇండియా నుంచి కవితా సంగ్వి  ఒక్కరే పోటీలో నిలిచారు. ముంబై లోని MET   రిషికుల్…

  • కొన్ని మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రియులు వెంటనే పసి గట్టేస్తారు కూడా. మరి కొడాస్ ఈ సంవత్సరపు బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఆమె రాసిన 'ది లైఫ్ చేంజింగ్ మాజిక్ ఆఫ్ టైడింగ్ అఫ్' ఇప్పటికే 35 బాషలలో 30 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. బహుషా కొత్త సంవత్సరంలో కూడా ఈ అమ్మకాలు ఇలాగే కొనసాగ వచ్చు అని జీవితం మొత్తం ఒత్తిడి లేకుండా జీవించ గలిగే స్ట్రాటజీ ఈ పుస్తకం. పెర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలకు ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతుంది. మనం తెలుగు అనువాదాలు చదవాల్సిందే.

    ఈ ఏటి బెస్ట్ సెల్లర్ ‘ది లైఫ్ చేంజింగ్’

    కొన్ని మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రియులు వెంటనే పసి గట్టేస్తారు కూడా. మరి కొడాస్ ఈ సంవత్సరపు బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఆమె రాసిన…

  • గురుదేవోభవ అన్నారు పెద్దలు. దీన్ని ప్రపంచ సుందరి కూడా మనసారా తీసుకుంది. బచ్చన్ ల కోడలు ఐశ్వర్యా రాయి తన గురువు లతా సురేంద్ర కనిపించగానే కృతజ్ఞతతో చేతులు జోడించి పాదాలకు నమస్కారం చేసి తన వినయాన్ని చాటుకుంది. వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ డాన్స్ ముంబై లోని సహారా స్టార్ లో జరిగింది. లతా సురేంద్ర ప్రఖ్యాత నాట్యగురువు. ఆమె శిష్యులు ఎంతో మంది దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు పొందినవాళ్లు ఐశ్వర్య తాను రెండో తరగతి నుంచి ఏడో తరగతి చదివే వరకు లత దగ్గర డాన్స్ నేర్చుకుంది. వేదిక పైన గురువు లతా కనిపించగానే ఐశ్వర్య పట్టలేని సంతోషంతో పొంగిపోయింది. గురువు పాదాలకు నమస్కారం పెట్టగానే ఆహ్వానితులందరూ ఒక్కసారి లేచి నిలబడి తమ గౌరవం ప్రకటించారు. అందనంత ఎత్తులో వుండేది గురుస్థానం ఐశ్వర్య వంటి సెలబ్రెటీ గురువు కనిపించాగానే ఆమెను కౌగలించుకుని నమస్కరించటం అది ఐశ్వర్య సంస్కారం లతా అదృష్టం.

    ఇది కళాకారుల అపూర్వ సమ్మేళనం

    గురుదేవోభవ అన్నారు పెద్దలు. దీన్ని ప్రపంచ సుందరి కూడా మనసారా తీసుకుంది. బచ్చన్ ల కోడలు ఐశ్వర్యా రాయి తన గురువు లతా సురేంద్ర కనిపించగానే కృతజ్ఞతతో …

  • కోడి గుడ్డును డాక్టర్ల నడిగితే పోషకాల మాయం అంటున్నారు. అదే ఫరా సయిడ్స్ ని అడిగితే అందమైన కళారూపం అంటుంది. అమెరికాలోని స్థిరపడ్డ భరతీయిరాలు ఈమె. ప్రముఖ ఎగ్గ్ ఆర్టిస్ట్. ఆమె ఈ గుడ్డు తో కళాకృతులు తాయారు చేస్తుంది. ఆమెకు గుడ్డును చుస్తే చాలట మంచి ఐడియాలు వచ్చేస్తాయి. రకరకాల గుడ్లు సేకరించి వాటి లోపల భాగాన్ని తీసేసి డొల్ల గా మారిన గుడ్డు తో అందమైన కళాకృతులు చేసేస్తుంది. అతి సున్నితం గా వుండే గుడ్డు పెంకు పైన చిత్రాలు వేయడం, వాటికి అలంకరణ చేయడం చాలా కష్టమైన పని. కానీ ఫరా సయిద్ ఈ పనులన్నీ చాలా తేలికగా చేయగలదు. ఈ అందమైన గుడ్డు బొమ్మల డెకోరేషన్ పీసెస్ గా చాలా బాగుంటాయి. ఆమె ఎగ్గ్ కలక్షన్స్ అన్ని చూడాలంటే ఆమె పెర్స్ నల్ వెబ్ సైట్ www.eggdocs.com లో చూడోచ్చు. స్త్రీల కోసం ఆమె ఎన్నో చారిటి ఈవెంట్స్ క్రియేట్ చేస్తుంది.

    ఈ బొమ్మలన్నీ వెరీ ‘గుడ్డు’

    కోడి గుడ్డును డాక్టర్ల నడిగితే పోషకాల మాయం అంటున్నారు. అదే ఫరా  సయిడ్స్ ని అడిగితే అందమైన కళారూపం అంటుంది. అమెరికాలోని స్థిరపడ్డ భరతీయిరాలు ఈమె. ప్రముఖ…

  • Christian Dior కలక్షన్స్ లో ఒక తెల్లటి టీ షర్టుల పైన వేసిన నినాదం ఇవ్వాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. We should all be fiminists. ఈ నినాదం ఎంతో మంది స్త్రీలను ఆకట్టు కుని ట్రెండ్ సెట్టర్ అయింది. ఇవాల్టి ఫ్యాషన్ ప్రపంచపు బెస్ట్ టీ షర్టు ఇది. అమ్మాయిల మనస్సు దోచుకుంటుంది అని వేరే చెప్పాలా? ఇదే పేరు తో నైజీరియన్ రైటర్ Chimamanda Ngozi Adichie లో రాసిన నవల కూడా బెస్ట్ సెల్లర్స్ లో ఒకటి. సొసైటీలో మార్పు వస్తేనే సమానత్వం సాధ్యం అంటుంది రచయిత్రి Adichie.

    ఫ్యాషన్ ప్రపంచపు బెస్ట్ నినాదం

    Christian Dior కలక్షన్స్ లో ఒక తెల్లటి టీ షర్టుల పైన వేసిన నినాదం ఇవ్వాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. We should all be fiminists. ఈ…

  • ఆమె ఒక భారీ కామెడీ క్వీన్. పొట్టిగా లావుగా వుండే యూఈమె పేరు భార్తీ సింగ్. ఈమెతో సల్మాన్ ఖాన్ ,ప్రభు దేవా స్టెప్పు లేస్తారు. మాధురీ దీక్షిత్ ,కరీనా కపూర్ లు యూఆర్ గ్రేట్ అనేసారు. ఈమె మన దేశపు ఏకైక సెలబ్రెటీ మహిళా కమెడియన్. పంజాబ్ లోని అమృతసర్ కు చెందిన భార్తీ స్టార్ వన్ లో ప్రసారమైన 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షో ' తో వెలుగులోకి వచ్చింది. భార్తీ తన మిమిక్రీ తో జోకులతో యువత టీవీ ప్రేక్షకులను నవ్వించింది. ఇండియా (హౌస్ ) గాట్ టాలెంట్ భార్తీ సింగ్ కు పేరు తెస్తే కామెడీ సర్కస్ మరింత పాప్యులర్ చేసింది. 'ఝలక్ దిల్ లాఓ ' డాన్స్ షోలో సన్నగా మెరుపు. తీగల్లా ఉన్న అమ్మాయిలతో సమానంగా డాన్స్ చేసి అందరి దృష్టి ఆకర్షించింది. సినిమాల్లో కామెడీ కన్నా ఈమె చేసే లైవ్ కామెడీలు చాలా కష్టం. దీనికెంతో తెలివితేటలు స్పాంటేనియస్ గా మాట్లాడటం సమయానికి తగ్గట్లు మాట్లాడటం ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా జోకులు పేల్చటం. అదొక పెద్ద ఆర్ట్ ఇప్పుడు భార్తీ బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.

    సెలబ్రెటీ మహిళా కమెడియన్ భార్తీ

    ఆమె ఒక భారీ కామెడీ క్వీన్. పొట్టిగా లావుగా వుండే యూఈమె పేరు భార్తీ సింగ్. ఈమెతో సల్మాన్ ఖాన్ ,ప్రభు దేవా స్టెప్పు లేస్తారు. మాధురీ…

  • కన్నబిడ్డ పై అనురాగం చూపించే విషయంలో అమ్మస్థానంలో ఉన్న ఎవ్వరైనా ఒకటే. బాలీవుడ్ నటి రాణీముఖర్జీ తన ముద్దుల కూతురు అదిరా తొలిపుట్టినరోజున తన ప్రేమనంతా నింపిన ఒక ఉత్తరం రాసింది. అదిరా నువ్వంటే నాకెంతో ప్రేమ కాసేపు కనిపించక పోతే శ్వాస ఆగిపోతుందా అనిపిస్తుంది. ప్రతి నిమిషం నీ ధ్యాసే. అందరూ నాలాగే ఉంటారా? తమ పిలల్ల కోసం అనుక్షణం ఆందళోన చెందే అమ్మలందరికీ పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది. నువ్వు పుట్టాక నాలో సహనం క్షమా గుణం పెరిగాయి. అంతరంగంలోకి చూసుకుంటే నేనెంతో మారిపోయాననిపిస్తోంది. ఇందుకు కారణం నువ్వే అదిరా. క్రమశిక్షణ తో ధైర్యంగా పెరగాలి. నిన్ను చూసి నారహో పాటు ఈ ప్రపంచం గర్వించాలి. నీ మనసుకి నచ్చిందే నువ్వు చేయి. అనుక్షణం ఆనందంగా జీవించు. ప్రేమతో మీ అమ్మ రాణీ ముఖర్జీ చోప్రా. ఇదీ ఉత్తరం. ఈ పాపాయిని కన్నతల్లైనా ఇంతకంటే తన బిడ్డను కోరేదీ ఆశీర్వదించేదీ ఉండదు.

    అదిరా ….. నువ్వు నన్ను మార్చేసావు

    కన్నబిడ్డ పై అనురాగం చూపించే విషయంలో అమ్మస్థానంలో ఉన్న ఎవ్వరైనా ఒకటే. బాలీవుడ్ నటి రాణీముఖర్జీ తన ముద్దుల కూతురు అదిరా  తొలిపుట్టినరోజున తన ప్రేమనంతా  నింపిన…

  • ప్రముఖ బాలీవుడ్ నాటి ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. యూనిసెఫ్ 70 సంవత్సరాల వేడుకలో ఫుట్ బాల్ ఆటగాడు డేవిడ్ చెక్ హమ్, 12 సంవత్సరాల బ్రిటిష్ చాల నాటి మిల్లా బాబి బ్రౌన్ సంయుక్తంగా ప్రియాంక నియామకాన్ని ప్రకటించారు. వేదింపులకు, అణచివేతలకు గురవ్వుతున్న బాలికల రక్షణ కోసం ప్రపంచమంతా ముక్తకంఠంతో పోరాడాలి రాబోయే తారలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేద్దామని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపు ఇచ్చారు. ఎక్కడైతే పిల్లల హక్కులకు గౌరవం దక్కుతుందా, ఎక్కడ పిల్లలకు రక్షణ వుంటుందో అలంటి ప్రపంచాన్ని నిర్మించే పనిలో వున్నా యూనిసెఫ్ లో భాగమయినందుకు గర్వంగా వుందని చెప్తారు ప్రియాంక. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు జాకీఛాన్, ఓర్లాండో బూమ్ తదితరులు పాల్గొన్నారు.

    యూనిసెఫ్ అంబాసిడర్ గా ప్రియాంక

    ప్రముఖ బాలీవుడ్ నాటి ప్రియాంక చోప్రా యూనిసెఫ్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. యూనిసెఫ్ 70 సంవత్సరాల వేడుకలో ఫుట్ బాల్ ఆటగాడు డేవిడ్…

  • ఒక కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో యువతి పెళ్లి గురించి చాలా కొత్తగా ఆలోచించారు. తన స్తాయికి తగట్టు విందులు, వినోదాలు ఆడంబరాలు అన్ని అవతల పెట్టి తన పెళ్లి ఖర్చులతో నిరుపేదలకు నీడ నివ్వాలని కోరుకుంది. ఆమె మహారాష్ట్ర లోని ఓరంగాబాద్ జిల్లా కు చెందిన శ్రీయ ముహర్. ఆమె అత్తింటి వాళ్ళు భర్త, అత్త మామలు ఆమె ఆశయానికి మద్దత్తు పలికారు. పెళ్ళికి అయ్యే ఖర్చు తో 108 ఇల్లు నిర్మించి ఇవ్వాలనుకున్నారు. పెళ్లి నాటికి 90 ఇల్లు పూర్తయ్యాయి. ఆ పేద కుటుంబాల వారికి పెళ్ళికి ఆహ్వానించి కళ్యాణ మండపం లోనే ఇళ్ళకు సంబందించిన తాళాలు వాళ్ళకు అందజేసి అందరి ఆశీర్వాదాలు అందుకున్నారు. తన పెళ్లి తన జివితం లోనే కాకుండా మరెన్నో కుటుంబాలలో సంతోషం నింపాలని కోరుకుంది శ్రీయ ముహర్.

    పెళ్ళి ఖర్చు తో పేదలకు ఇళ్ళు

    ఒక కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో యువతి పెళ్లి గురించి చాలా కొత్తగా ఆలోచించారు. తన స్తాయికి తగట్టు విందులు, వినోదాలు ఆడంబరాలు అన్ని అవతల పెట్టి తన…

  • పలక్ ముచ్చల్ అన్న యువతీ ఒక చిన్న పాపని ఎత్తుకుని సామజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది . నేను కాపాడిన వెయ్యో ప్రాణం ఇది. ఈ పనికి నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ మేసాజ్ చేసింది. ఇండోర్లో పుట్టి పెరిగిన పలక్ శాస్త్రీయ గీతం నేర్చుకుంది. ఏడేళ్ళ వయసు నుంచి సంగీత విభావరుల్లో వేదికల్లో పాటలు పాడి సేకరించిన డబ్బులు చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేయిస్తుంది. ఎన్నో సినిమాల్లో చక్కని పాటలు పాడింది పలక్ . ప్రతి కార్యక్రమంలో ఆమె నలభై పాటలు పాడుతుంది. తెలుగు ,కన్నడ , గుజరాతీ ఒరియా ఇలా దాదాపు పదిహేడు బాషలలో పాడగలదు . పలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్ ప్రారంభించింది. బెంగుళూరు ,ఇండోర్ , ముంబై , ప్రముఖ హృద్రోగ ఆస్పత్రుల్లో వైద్యులు రాయితీ తో పిల్లలకు చికిత్సలు అందిస్తారు. ఆపరేషన్ థియేటర్ లోకి పలక్ ను రానిస్తారు. అక్కడ ఓ పక్కన నిలబడి భగవద్గీత చదువుతుంది. పలక్. తను సంపాదించిన కోట్ల రూపాయల డబ్బు పిల్లల ఆరోగ్యం కోసం ఖర్చుపెట్టిందామె. ప్రభుత్వ పురస్కారాలే కాదు. లిమ్కా, గిన్నీస్ బుక్స్ లో కూడా ఆమెకు స్థానం లభించింది. 24 ఏళ్ల వయసులో వెయ్యిమందికి ప్రాణం పోసిన పలక్ ముచ్చల్ కు శుభాకాంక్షలు.

    వెయ్యి మంది చిన్నారులకు ప్రాణం పోసింది

    పలక్ ముచ్చల్  అన్న యువతీ ఒక  చిన్న పాపని ఎత్తుకుని సామజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది . నేను కాపాడిన వెయ్యో ప్రాణం ఇది. ఈ…

  • నమో వెంకటేశాయ లో అనుష్క నాలుగు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుందని ఆమెది చిత్రంలో వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించే భక్తురాలి పాత్ర అని ఆమె టీజర్ విడుదల చేసారు. ఫ్యాషన్ డిజైనర్ ప్రశాంతి త్రిపుర దేవి ఆమె డ్రెస్ లు డిజైన్ చేసారు గోదా దేవి తరహాగెటప్ లో ఉన్న అనుష్క కోసం డిజైన్ చేసిన శారీ బ్లౌజ్ సెట్ 24కు మీటర్ల వస్త్రం వచ్చిందట. నిలబడ్డ అనుష్క కుచ్చుళ్ళు అర్ధచంద్రాకారంలో భూమిని తాకేలా చూపాలట ఆ కాస్ట్యూమ్స్ లో . ఇలాగే చెవులకు పెట్టుకునే ఆభరణం కూడా ప్రత్యేకంగా బరువుగా ఉండేలా డిజైన్ చేసారు. సైజ్ జీరోలో లావుగా కనిపించిన అనుష్క బాహుబలి నమోవెంకటేశాయ టీజర్ లలో మామూలుగానే కనిపిస్తోంది. ప్రతి సినిమాకు సరికొత్తగా కనిపించేందుకు కానూ హీరో హీరోయిన్స్ కోసం దుస్తులు జ్యూవెలరీ మేకప్ హెయిర్ డ్రెస్ సినిమా పాత్రలో ఆమె గాని అతను గానీ ఎలా కనిపించాబోతున్నారనేది టీజర్ విడుదల చేసే ముందు ఎంతో వర్క్ జరుగుతుంది. చాలా ఎక్స్పరిమెంట్స్ చేస్తారు. ఫస్ట్ లుక్ అంటే తర్వాత సినిమాలో ఎలా కనిపించబోతున్నారు ముందే డిజైన్ చేసి చూపించటం. ఇలా తీర్చిదిద్దిన అనుష్క ఫస్ట్ లుక్ నమో వెంకటేశాయ సినిమాలో ఎలా వుందో చూడండి. దేవుడిని ప్రేమించే భక్తురాలి పాత్రలో అనుష్క చాలాఅందంగా వుంది.

    ఈ రూపం వెనుక ఎంతో కష్టం ఉంటుంది

    నమో వెంకటేశాయ లో అనుష్క నాలుగు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుందని ఆమెది  చిత్రంలో వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించే భక్తురాలి పాత్ర అని ఆమె టీజర్ …

  • నాజుగ్గా వుండాలని కడుపు మాడ్చుకునే అమ్మాయిల కోసం ఈ న్యూస్ 120 కెజీల బరువున్న 24 సంవత్సరాల ఎస్తే ఫానియా, అర్జెంటినాలోని మెండాజాఫ్రాన్సిస్ లో జరిగిన అందాల పోటీల్లో సహచర పోటీ దారులను ఓడించిన విజేతగా నిలిచారు. ఈ పోటీలో గెలవడం ద్వారా అందాల పోటీ అంటే శరీరాకృతి నాజుకుతనం ఒక్కటే అర్హత కాదని ప్రపంచానికి ఒక సందేశం పంపుతానన్నది విజేత ఎస్తే ఫానియా

    ఈ అందాల సుందరి బరువు 120 కిలోలు

    నాజుగ్గా వుండాలని కడుపు మాడ్చుకునే అమ్మాయిల కోసం ఈ న్యూస్ 120 కెజీల బరువున్న 24 సంవత్సరాల ఎస్తే ఫానియా, అర్జెంటినాలోని మెండాజాఫ్రాన్సిస్ లో జరిగిన అందాల…

  • షెరిల్ శాండ్ బర్గ్ రాసిన లీన్ ఇన్ పుస్తకం ఇప్పుడో సంచలనం స్త్రీలు వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో సక్సెస్ సాధించటం గురించి పేస్ బుక్ సంస్థ సీఈఓ షెరిల్ శాండ్ బెర్గ్ ఈ పుస్తకం రాసారు. ఏ ఈపుస్తకం కార్పొరేట్ కార్యాలయాల్లో చర్చలేవనెత్తిందని చెప్పచు. అలాగే నవతరం ఉద్యోగినులకు ఒక కొత్త దృక్పధాన్ని చూపించారు. ఇప్పుడా పుస్తకానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఆదరణ లో అదే పేరుతో LEANIN.ORG అనే పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేసారు. జీవితంలో ఎదగాలనుకున్న అమ్మాయిలకు ఇది వేదిక అనుకోవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో నిపుణుల చర్చలు ప్రసంగాలు ప్రశ్నలు సమాధానాలు ఈ వెబ్సైట్ లో ఉంటాయి. లీన్ఇన్ సర్కిల్స్ పేరుతో ప్రత్యేక మైన బృందాలు ఏర్పడుతున్నాయి. హైద్రాబాద్ లోనే ఇలాంటి బృందాలు ఇరవై దాకా ఉన్నాయి. వీటిని ఇంకా వృద్ధి చేయాలనుకుంటున్నారు షెరిల్. ఇంతకు ముందు షెరిల్ భర్త గోల్డ్ బెర్గ్ చనిపోయిన నేపథ్యంలో భర్తను కోల్పోయిన అమ్మాయిలకు అతిదగ్గర వాళ్ళని కోల్పోయిన వాళ్లకు సాయం చేసేందుకు ఆప్షన్స్ బి అనే సంస్థకు ఇటు లీన్ ఇన్ సంస్థకు కలిపి 674 కోట్లు విరాళంగా ఇస్తానని చెప్పారు షెరిల్ శాండ్ బర్గ్.

    674 కోట్లు విరాళం ఇచ్చిన షెరిల్ శాండ్ బర్గ్

    షెరిల్ శాండ్ బర్గ్  రాసిన లీన్ ఇన్ పుస్తకం ఇప్పుడో సంచలనం స్త్రీలు వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో సక్సెస్ సాధించటం గురించి పేస్ బుక్ సంస్థ సీఈఓ…

  • పది వేలసంవత్సరాలకోక సారి జన్మిస్తుందీ సౌందర్యం అన్నారు. ఫ్యాన్స్ Hang he ని చూసి ఈ పదేళ్ళ అమ్మాయి 'ఎలైట్ మోడల్ లుక్' వెబ్ సైట్ అందాల పోటిలో 70 దేశాల నుంచి 3 లక్షల 50 వేల మంది తో పాటు పోటి పడి ఈ నవంబర్ లో ఫైనల్ కు చేరుకొంది.Giri Hadid, Karlie Kloss, Cara Delevingne వంటి సూపర్ మోడల్స్ అంతర్జాతీయ వేదికలపైన తళుక్కుమంటే ఇప్పుడీ చైనా అమ్మాయి తన సౌందర్యంతో మంచి శరీర సౌష్టవంతో ముందుకు దూసుకు వచ్చింది. ఈమెను అందాల దేవత అంటున్నారు. చైనా యూత్. ఈమె అందాన్ని నిర్వచించే మాటలు లేవు అనేసారట. ఫ్యాషన్ మార్కెట్ లోకి ఇంకో అందాల రాణి రంగ ప్రవేశం చేసింది.

    సౌందర్య దేవత టాన్ హే అనేసారు

    పది వేలసంవత్సరాలకోక సారి జన్మిస్తుందీ సౌందర్యం అన్నారు. ఫ్యాన్స్ Hang he ని చూసి ఈ పదేళ్ళ అమ్మాయి ‘ఎలైట్ మోడల్ లుక్’ వెబ్ సైట్ అందాల…

  • DAPHNE SELFE గురించి ప్రతివాళ్ళు తెలుసుకుని తీరాలి. ఇప్పుడు 88 సంవత్సరాలు . 1949 లో మొదలుపెట్టిన మోడలింగ్ కెరీర్ ను ఇంతవరకు ఆపలేదు. బ్రిటన్ లో వుండే డాఫ్నే సెల్ఫీ ఇంతవరకు ఎన్నో ప్రముఖ కంపెనీలకు మోడల్. వయసు పెరిగిపోతున్నా కళ తగ్గని మొహంతో ప్రజల్లో ఆమెకున్న ఆదరణ తగ్గనేలేదు. ఇప్పటికీ మొగలింగ్ ద్వారా రోజుకి ఆరేడు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. నివియా ,ఓలే వంటి సౌందర్య పోషకాల ప్రకటనల్లో కనిపించే ఈ అందమైన మోడల్ రహస్యం నీళ్లు పళ్ళు కూరగాయలు తినటం ,యోగా చేయటం ఈమె ఇచ్చే ఒక అపూర్వమైన ఉపదేశం ఏవిటంటే జీవితంలో వచ్చే ప్రతి స్టేజ్ బాల్యం యవ్వనం వార్ధక్యం ఇలా అన్ని మలుపులు మనలోని సౌందర్యాన్ని ఒక్కరకంగా పెంచేస్తూ ఉంటాయి. ప్రపంచం మొత్తం చుట్టిన అనుభవంతో చెపుతున్న నా మనసుని ప్రతి క్షణం నా కాన్ఫిడెన్స్ తో నింపేసుకుంటూ వుంటా. అని చెప్తోంది. నిజం కదా ఈ రంగు మారే ప్రకృతి ఎప్పుడైనా వృధాప్యంతో బాధపడిందా.. లేదు.. మనం కూడా ఇంతే కాలప్రవాహం తో నడుస్తూ కాలంలోకి జారిపోతాం. మన మనసుకి ముసలి తనం ఏమిటి ?

    88 ఏళ్ల యవ్వన గుళిక

    DAPHNE SELFE గురించి ప్రతివాళ్ళు తెలుసుకుని తీరాలి. ఇప్పుడు 88 సంవత్సరాలు . 1949 లో మొదలుపెట్టిన మోడలింగ్ కెరీర్ ను ఇంతవరకు ఆపలేదు. బ్రిటన్ లో …

  • తల్లిదండ్రులను తలుచుకోవడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పటం పిల్లల కనీస బాధ్యత. రియో ఒలంపిక్స్ లో మన దేశానికీ తోలి పతాకం అందుకుని మల్ల యోధురాలు సాక్షి మాలిక్. ఇక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన మధ్య ఎన్నో పాఠశాలలు కళాశాలల్లో అతిధిగా వెళ్ళిందిట. తాను మాట్లాడటం అయ్యాక ఎంతో మంది ఆడపిల్లలు మా తల్లితండ్రులు క్రీడల్లో మమ్మల్ని ప్రోత్సహించరు. పెళ్ళికే వాళ్ళ ప్రాధాన్యత అని చెపుతుంటే సాక్షికి కనీళ్ళు ఆగటం లేదట. నేను నా తల్లితండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థితికి వచ్చాను. చాలిచాలని స్థితిలో అమ్మ నన్ను కంటికి రెప్పలా కాపాడింది. తాహతుకు మించిన పోషకాహారం ఇచ్చింది. 2014 లో మోకాలు విరిగింది. నేను బరి లోకి వెళ్ళలేనను కొన్నా. కానీ నా తల్లితండ్రులు నన్ను నిలబెట్టారు. నాకు అన్ని విధాలా అండగా ఉన్నారు. నేను దేశానికీ గర్వకారణంగా ఉన్నానంటే న తల్లితండ్రుల త్యాగమే కారణం అన్నరామె. నా జీవితం ఆధారంగా వస్తున్నా దంగల్ చూస్తున్న తల్లితండ్రులు మారాలి అంటున్నారామె. సాక్షి మాలిక్ సాధించిన పతాకం చాలదా. తల్లి తండ్రులైనా తన బిడ్డ అంత స్థాయిలో నిలబడాలని కోరుకొనేందుకు?

    వాళ్ళ త్యాగం వల్లనే నేనింతదానయ్య

    తల్లిదండ్రులను తలుచుకోవడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పటం పిల్లల కనీస బాధ్యత. రియో ఒలంపిక్స్ లో మన దేశానికీ తోలి పతాకం  అందుకుని మల్ల యోధురాలు సాక్షి మాలిక్.…

  • మృదువుగా వుండే నాయికా పాత్రలో ఒదిగిన జయలలిత తనలోని నటిని వెనక్కి తోసి నాయకురాలయ్యారు. అలాగే రాజకీయ జీవితంలో తిరుగులేని స్థానం సంపాదించాక నాయకురాలి వెనక్కి తోసి విప్లవ నాయకి బిరుదుని వదిలేసి అమ్మగా ఆదరించే దేవతగా నిలబడ్డారు. రెండు చేతులా ఆమె అందించిన సంక్షేమ పథకాలతో ఆమెకు అన్ని వర్గాలు నీరాజనం పట్టాయి. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ద్రావిడ పార్టీలకు జయలలిత వంటి బ్రాహ్మణ స్త్రీ నాయకత్వం వహించిందీ అంటే రాజకీయాల్లో ఆమె ఎంత కఠినమైన నిర్దాక్షణ్యమైన నేతగా రూపం మార్చుకుందో తెలుస్తుంది. సొంత కుటుంబం అంటూ లేదు జయలలిత తమిళనాడు ప్రజలందరికీ అమ్మ అయిందని నిరూపించేందుకు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించికొనేందుకు ఆమెకు చివరివీడ్కోలు పలికేందుకు మెరీనా బీచ్ లో హాజరైన జన సందోహంమే నిదర్శనం. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆమెదో ప్రత్యేక అధ్యాయం. వెండి తేర నేలిన ఈ ఒకనాటి తార అఖండ జ్యోతిగా వెలిగేందుకు ఆకాశానికి చేరింది పది కోట్ల మంది తమిళ ప్రజల అమ్మ అన్న పిలుపుకి అందనంత దూరoవెళ్లిపోయింది

    అమ్మకు అక్షరాంజలి

    వంటరి నడకతో అలసిపోయిందేమో 60 ఏళ్ళకి ఆగిపోయింది ఎక్కడానికి శిఖరాలేమీ లేవేమో శిఖరాగ్రాన సెలవు తీసుకుంది కోట్లాది మంది కన్నీరు తోడుగా కోమల వల్లి వెళ్ళిపోయింది బడుగు…

  • మనం నడవలేరు అనుకుంటాం, వాళ్ళు పరుగెడతారు. కేరళకు చెందిన సోఫియా రెండేళ్ళ క్రితం బాధితుల కోసం జరిగిన మిస్ ఇండియా పోటిలలో మొదటి రన్నర్ అప్ గా, ఐరోపాలో జరిగిన మిస్ వరల్డ్ పోటిలలోను తలాపడింది. కేరళ లోని ప్రభుత్వ ఫ్యాషన్ షో లలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్, గ్లాస్ పెయిన్టింగ్ కళాకారిణి, నగల డిజైనర్ కూడా ఇంతేనా, స్కూటర్ నేర్చుకుని లైసెన్సు కోసం వెళితే అధికారులు చెవులు వినిపించవు మాటలు రావు ఇవ్వలేం అంటే హై కోర్ట్ కి ఎక్కి లైసెన్సు సంపాదించుకుంది. కేరళలో ఇలాంటి లైసెన్సు తీసుకున్న మొట్టమొదట అమ్మాయి సోఫియానే. ఇంతేనా షార్ట్ ఫుట్లో రాష్ట్ర స్థాయి క్రీడా కారిణిగా ఎనిమిది సార్లు జాతీయ విజేత, మూడు సార్లు నిలబడింది. ఈ అమ్మాయిని పోగిడెందుకు అక్షరాలు సరిపోవడం లేదు. సోఫియాను ఎంత మంది ఆదర్శంగా తీసుకోవచ్చు.

    వినిపించదు…. మాటాడదు…. ఇన్ని నైపుణ్యాలా?

    మనం నడవలేరు అనుకుంటాం, వాళ్ళు పరుగెడతారు. కేరళకు చెందిన సోఫియా రెండేళ్ళ క్రితం బాధితుల కోసం జరిగిన మిస్ ఇండియా పోటిలలో మొదటి రన్నర్ అప్ గా,…

  • నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆకాంక్షానందా ఎంతో మంది టాప్ డిజైనర్లకు, స్నేహితురాల్ల కు సలహాదారికూడా. డ్రెస్సింగ్ లో స్టీల్ లో సరికొత్త బ్రాండ్స్ ని ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమెను మించినవాళ్ళు లేరు అంటారు. ప్రపంచ ప్రసిద్ద ఫ్యాషన్ డిజైనర్లు మనీష్, అరోరా, గౌరవ గుప్తా. నమ్రతా జోషిపురా మొదలైన అందరికి ఫ్యాషన్ డిజైనింగ్ లో సలహాలు సూచనలు ఇస్తుందామె. ప్రతి రోజు డ్రెస్ అప్ డేనే అంటారామె. ప్రసిద్ధ మాగజైన్ సర్వే బెస్ట్ డ్రెస్ లిస్టులో చోటు దక్కించుకున్నారు ఆకాంక్షానందా మన దేశంలో పేరొందిన స్టైల్ ఐ కాన్ గా కీర్తిస్తారు ఫ్యాషన్ డిజైనర్లు. ప్రతి నిమిషం ఫ్యాషన్ ప్రపంచంలో ఎం జరుగుతుందో ఇలాంటి డిజైన్లు వస్తున్నాయో తలుసుకుని ఆమె కొన్ని డిజైన్లు సెలక్ట్ చేస్తే అవే బ్రాండ్స్ మార్కెట్ లో కి విడుదల అవుతాయి. ఆమె సెలబ్రిటీలకే సెలబ్రిటి.

    ఫ్యాషన్ ట్రెండ్స్ పరిచయం చేసే ఆకాంక్షానందా

    నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ఆకాంక్షానందా ఎంతో మంది టాప్ డిజైనర్లకు, స్నేహితురాల్ల కు సలహాదారికూడా. డ్రెస్సింగ్ లో స్టీల్ లో సరికొత్త బ్రాండ్స్ ని…

  • మోనికా యాదవ్. అహ్మదాబాద్ ఊబర్ క్యాబ్స్ లో తోలి మహిళా డ్రైవర్. ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేసి సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో పీజీ చేస్తోంది. ఆర్కిటెక్ట్ గా ఐదారు నెలలు పనిచేసి బోర్ కొట్టి వదిలేసి చాలా రోజులు ఆలోచించి క్యాబ్ డ్రైవర్ తనకు పర్ఫెక్ట్ జాబ్ అని నిర్ణయించుకొందిట. అహ్మదాబాద్ లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళింది. ఆడపిల్లకి ఇవ్వం అన్నారట. సరాసరి ఊబర్ క్యాబ్స్ ని అప్రోచ్ అయిందట. రెజ్యూమె చూసి ఈమె ఇంటరెస్ట్ చూసి హ్యాపీ అయిపోయి జాబ్ ఇచ్చేసారు. గుజరాత్ లో ఫస్ట్ ఫిమేల్ టాక్సీ డ్రైవర్ ఈమె. ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఎనిమిది వరకు టిప్స్ చూసుకుని సాయంత్రం కాలేజీ కి వెళ్ళిపోతోంది. హెక్టిక్ షెడ్యూలే కానీ ఎంజాయింగ్ జాబ్ అంటోంది. ఆర్కిటెక్ట్ చదివి లోక్లాస్ ఉద్యోగం ఏమిటని కామెంట్స్ వచ్చాయి. నాకు నచ్చాలి నన్ను నేను సమాధాన పరుచుకోవాలి. గానీ ఆడాళ్ళ ఉద్యోగం మగాళ్ల ఉద్యోగం చిన్నది పెద్దదీ లోక్లాస్ హైక్లాస్ అని వుంటుందా ? అంటోందీ అమ్మాయి మోనికా యాదవ్ కి సలహా ఇస్తారా ? కంగ్రాట్స్ చెపుతారా ?

    పీజీ చేస్తూ ఊబర్ కార్ డ్రైవర్ జాబ్ నచ్చిందంది

    మోనికా యాదవ్. అహ్మదాబాద్ ఊబర్ క్యాబ్స్ లో తోలి మహిళా డ్రైవర్. ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేసి సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో పీజీ …