• ఫెడవుతూ ఫామ్ లో కొస్తాయి ఫ్యాషన్స్

    ఎత్నిక్ గానూ స్టయిల్ గానూ వుండే డ్రెస్సింగ్ ఎపుడూ కలర్ కాంబినేషన్ పైనే ఆధారపడి వుంటుంది. ఒకప్పుడు నిండు రంగు చీరల అందం అని ఉండేది. వెంకటగిరి…

  • చందమామ వంటి మొహం కళ్ళు నవ్వే పెదవులతో కాజల్ టాలీవుడ్ చందమామే. ఆమె మాటల్లో ఎంతో వినయమ ఉట్టిపడుతూ ఉంటుంది. క్యారెక్టర్ల ఎంపిక ఎలా చేసుకుంటారు అని అడిగితే మొదటిసారి కధ వినగానే మంచి కధ అని అర్ధమైపోతుంది. ఖచ్చితంగా సక్సెస్ అని అనిపిస్తుంది ఇప్పుడ్ఫు ఖైదీ నెంబర్ 150 కూడా అంతే. ఈ సినిమాలో అవకాశం రావటమే ఓ అదృష్టం. నేను చేసిన సినిమాలన్నీ వసూళ్ల పరంగా ఆలా ఉంచితే నా పాత్రలన్నీ విమర్శకుల మెప్పు పొందినవే. అంటుంది కాజల్. ప్రతి కథనీ ప్రతి పాత్రనీ ఛాలెంజింగ్ గా తీసుకుని హార్డ్ వర్క్ చేస్తాను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనీ వుంది. యాక్షన్ మూవీ అయితే మాత్రం నాకు పండగే. కాకపోతే డైరెక్టర్ ను ఫాలో అవటం నాకు అలవాటు. మంచి ఐడియా లు వస్తే ఆయనతో చెప్పటం వరకే నా పని. అంతే గాని నా పాత్ర గురించి ఫలానా రకంగానే వుండాలనే పట్టింపులు ఎప్పుడూ లేదు. పైగా సినిమాల్లో నటించటం రన్నింగ్ రేస్ కాదు. వెనకా ముందు అవటానికి. నా దగ్గరకు వచ్చిన అవకాశాన్ని నేను మిస్ అవను . నా శక్తీ మేరకు నేను నటించగలను . ఛాలెంజింగ్ తీసుకుని హోమ్ వర్క్ చేసి మరీ పర్ఫెక్షన్ సాధించాలనుకుంటాను. ఇప్పుడు వస్తున్నా ఖైదీ నెంబర్ 150 పైన నాకెంతో నమ్మకం చిరంజీవి గారితో అవకాశం రావటం. ముఖ్యంగా ఓ పాటలో నా కాస్ట్యూమ్ అయితే ఇంతవరకు నేనెప్పుడూ అంత డిఫెరెంట్ గా లేనంటోంది.

    ఆ అవకాశం రావటమే అదృష్టం

    చందమామ వంటి మొహం కళ్ళు నవ్వే పెదవులతో కాజల్ టాలీవుడ్ చందమామే. ఆమె మాటల్లో ఎంతో వినయమ ఉట్టిపడుతూ ఉంటుంది. క్యారెక్టర్ల ఎంపిక ఎలా చేసుకుంటారు అని…

  • అనుపమా పరమేశ్వరన్ శర్వానంద్ తో కలిసి నటించిన శతమానం భవతి విడుదలవుతోంది. రెండు స్టార్ హీరోస్ నటిస్తున్న సినిమాల మధ్యన వున్నా ఈ సినిమాకు మంచిటాక్ ముందే వచ్చేసింది. అఆ లో సమంత హీరోయిన్ గా ఉండగా సెకండ్ హీరోయిన్ గా ఉన్న అనుపమ కొద్దిపాటి డైలాగ్స్ తోనే ఆమె పాప్యులర్ అయింది. మలయాళంలో అనుపమ హీరోయిన్ గా చేసిన ప్రేమమ్ గొప్పహిట్ . ఆ చిత్రం రీమేక్ లో కూడా నాఉపమా మాతృక తో చేసిన పాత్రనే నటించింది. అదీ హిట్. ఫ్రెష్ గా తాజా పువ్వులాగా ఉన్న అనుపమా కొత్త మంచి ఆఫర్ దక్కించుకుంది. రామ్ చరణ్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్నా సినిమాలో అనుపమ హీరోయిన్ గా వస్తోందని సమాచారం. ఇదే నిజమైతే అనుపమ స్టార్ హీరోయిన్ల జాబితాలో లోకి చేరిపోయినట్లే. ఈ కేరళ అమ్మాయికి తెలుగు పరిశ్రమ నుంచి ఆహ్వానం పలికినట్లే.

    స్టార్ హీరోయిన్ల జాబితాలో అనుపమా పరమేశ్వరన్

    అనుపమా పరమేశ్వరన్ శర్వానంద్ తో కలిసి నటించిన శతమానం భవతి విడుదలవుతోంది. రెండు స్టార్ హీరోస్ నటిస్తున్న సినిమాల మధ్యన వున్నా ఈ సినిమాకు మంచిటాక్ ముందే…

  • 74 వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ ఏంజెల్స్ లో వేడుకగా జరిగాయి. ఆ వేదిక పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంగారు వర్గపు గౌనుతో ఎంతో అందంగా మెరిసిపోయింది. గోల్డెన్ గ్లోబ్స్ 2017 అవార్డుల ఫంక్షన్ కు టీవీ కేటగిరీ లో అవార్డులు అందజేసేందుకు గానూ ప్రియాంకను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎమ్మా స్టోన్ నటాలీ ఫోర్ట్ మన్ వంటి స్టార్స్ తో సమానంగా ఈమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించింది. డి వాకింగ్ రెడ్ స్టార్ చిత్రంలో నటించిన జెఫ్రీ డీన్ మోర్గాన్ తో కలిసి బెస్ట్ టీవీ యాక్టర్ గా ఎంపికైన బిల్లీ జాజ్ థార్న టన్ కు అవార్డు అందజేసింది. హెడ్ లైన్ స్టార్ ఆఫ్ అమెరికన్ నెట్ వర్క్ షో క్వాంటికో హోరీ లో ప్రియాంక ఈ అరుదైన గౌరవం పొందింది. గత సంవత్సరం ఆస్కార్ ఎమ్మీ అవార్డుల ప్రధానం కోసం ఆహ్వానం అందుకున్న ప్రియాంక తాజాగా ఇంటెర్నేషనల్ అవార్డుకు హాజరవటం ఇది మూడోసారి. గోల్డెన్ గ్లోబ్ లో ఇది మొదటిసారి. ఈమె నటించిన బే వాచ్ హాలీవుడ్ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. .

    గోల్డెన్ గ్లోబ్స్ ఫంక్షన్ లో ప్రియాంక

    74 వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ ఏంజెల్స్ లో వేడుకగా జరిగాయి. ఆ వేదిక పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంగారు వర్గపు గౌనుతో…

  • సౌత్ ఇండియా లో సమంతకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేనట్లే అందమైన కళ్ళు అలాల్లాంటి మెత్తని జుట్టు ఆమె అందం రహస్యాలు. ఈమె జుట్టు తో హేయిర్ స్టయిలిస్ట్ ప్రతి సినిమాకి ఒక కొత్త ప్రయోగం చేస్తూ వుంటారు. డీప్ బ్రౌనిష్ కలర్ జుట్టు ఆమె స్కిన్ టోన్ కు బాగా సూటవుతోంది. ఏ మాయ చేసావే లో కనిపించిన హేయిర్ స్టయిలే ఆమె సిగ్నేచర్ స్టయిల్. పెద్ద మార్పులు లేవు. కానీ జుట్టుతో చేసే చిన్ని చిన్ని మార్పులు ఆమె వేసుకున్న డ్రెస్ కే అందం తెస్తాయి. ఫిష్ టైల్ మోడల్ జడ అల్లకంతో అనీష్ జైన్ సృష్టించిన సన్ ఫ్లవర్ డిజైన్ కుర్తా యోగీష్ చౌదరి డిజైన్ చేసిన ఆమ్రపాలి ఇయర్ రింగ్స్ లో సమంత చాలా బావుంది. ఆమె పొడవాటి మెడ అందం అంతా కనిపిస్తుంది. అత్తారింటికి దారేది లో పొడవాటి స్ట్రెయిట్ హేయిర్ స్టయిల్ నిన్ను చూడగానే పాటలో ఆమె అద్భుతంగా వుంది. వై బస్ స్టయిల్ లో పైకి వేసిన చక్కని ముడితో సమంత ఏ డ్రెస్ లో అయినా చాలా చక్కగా వుంది . ఇవన్నీ హీరోయిన్స్ జుట్టు చీరకట్టు మేకప్ తో తెర వెనుక స్టయిలిస్ట్ లు చేసే మాయాజాలం. అమ్మాయిల కూడా వాళ్ళ మొహం తీరుకు తగ్గ హేయిర్ స్టయిల్ ఎంచుకోవాలి. సమంత వేసుకుంది కాదు.

    సమంత అందాన్ని పెంచిన హేయిర్ స్టయిల్స్

    సౌత్ ఇండియా లో సమంతకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేనట్లే అందమైన కళ్ళు అలాల్లాంటి మెత్తని జుట్టు ఆమె అందం రహస్యాలు. ఈమె జుట్టు తో హేయిర్…

  • అందమైన చీరల్లోకి కనిపిస్తూ ఉంటుంది విద్యా బాలన్. కేన్స్ రెడ్ కార్పెట్ పైన విద్య తన సకల వస్త్ర కళలను ప్రదర్శించింది. సవ్య సాచి రూపొందించిన అందమైన చీరలకు అందం విద్యా బాలన్ వస్త్ర ధారణ లో యాక్సిసరీస్ లో తనదైన ప్రత్యేకత నిలుపుకునే విద్యా బాలన్. ఇష్టమైన డ్రెస్ చక్కని చీరలే. ఆమెకు గౌన్లు కుర్తీలు షార్ట్ కట్స్ అనార్కలీలు అస్సలు నప్ప వనే మనకే తెలిసిపోతుంది. కానీ చీరల్లోకి ఎందుకామే బావుంటుందీ అంటే అసలు చీరల క్వాలిటీ అంచులు పమిట కొంగులు కుచ్చిళ్ళు కట్టే తీరు ఇవన్నీ కలిసి అసలు ప్రపంచంలోనే అత్యంత క్లవర్ గార్మెంట్ చీర ఒక్కటే కనుక. అందుకే దీన్ని ఎంచుకొంటానంటోంది విద్యా. చీరల అంచులు రివర్స్ ఆఫ్ లైట్ లాగా పనిచేస్తాయి. ఇవి నాజూకు తనాన్ని ఎత్తునూ అందాన్ని తెలివిగా నిర్దేశిస్తాయి. ఒక్కసారి వీటికి జోడీగా వుండే యాక్సెసరీస్ కూడా చీరకి న్యూలుక్ ఇచ్చి మరింత అందాన్నిస్తాయి. విద్యాకయితే చిన్న రంగులు మరీ పెద్దవికాని నెక్లెస్ లు చుంకీ బ్యాంగిల్స్ బ్రేస్ లెట్స్ వదిలేసిన జుట్టు లేదా పాతకాలంలో లాగా చక్కని జడ అన్నీ కలిపి ఆమెను సంప్రదాయ సుందరిని చేసేస్తాయి. చీర చేసే మ్యాజిక్ ఇదే.

    విద్యాబాలన్ కిది పర్ఫెక్ట్ డ్రెస్

    అందమైన చీరల్లోకి కనిపిస్తూ ఉంటుంది విద్యా బాలన్. కేన్స్ రెడ్ కార్పెట్ పైన విద్య తన సకల వస్త్ర కళలను ప్రదర్శించింది. సవ్య సాచి రూపొందించిన అందమైన…

  • Donna Ferrato గృహ హింస పైన ఫోటో తీసిన మహిళా ఫోటో గ్రాఫర్ 1982 లో ఫోటో తీసింది. నాలుగు గోడలు మధ్య భర్త భార్య ఎలా వుంటారో ఎవ్వరికి తెలియదు. కానీ భర్తలు భార్యల పైన చేయిచెసుకుంటారు అన్నది జగమెరిగిన సత్యం. తన ఆధిపత్య ప్రదర్శనకు పురుషుడు స్త్రీ ని లొంగదీసు కుంటాడు. దాన్ని ఇప్పుడు గృహ హింస అంటున్నాం. ఆప్తులకు కూడా చెప్పుకోలేని గృహ హింసకు తోలి సాక్షి ఈ ఫోటో. ఆమె తనకు పరిచయం వున్న ఒక జంట ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ భర్త భార్య పైన స్నానాల గదిలో దాడి చేయడం చుసిన డోనా గబగబా హింసను క్లిక్ చేసింది. ఇదే గృహ హింస తోలి చిత్రీకరణ కానీ ఏ పత్రికల వాళ్ళు వేసుకోలేదు.1991 లో ఫోటో తీసిన 11 ఏళ్ళ తర్వాత తనే సొంతంగా తన ఫోటోలను పుస్తక రూపం లో తెచ్చింది డోనా. ఇక ఆ తర్వాత ఎన్ని వేల గృహ హింస సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయో లెక్కలు చెప్పలేము.

    గృహ హింస పై తోలి ఫోటో

    Donna Ferrato గృహ హింస పైన ఫోటో తీసిన మహిళా ఫోటో గ్రాఫర్ 1982 లో ఫోటో తీసింది. నాలుగు గోడలు మధ్య భర్త భార్య ఎలా…

  • నా వయస్సు 30 అని చెప్పుకునేందుకు నేను గర్వపడతా. పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లా ఉండాలని నాకెప్పుడూ ఉండదు. ఉదయం లేస్తూనే బెడ్ పైన ఊడిన వెంట్రుకలు చూసి కళ్ళ కింద వలయాలు చూసుకుని నిట్టూర్పులు విడిచే మామూలు అమ్మాయిని అంటోంది. గోవా అమ్మాయి ఇలియానా. దక్షిణాది కోటి రూపాయల పారితోషకానికి శ్రీకారం చుట్టిన మొదటి తార గా క్రెడిట్ పొందిన ఇలియానా ఇప్పటికీ ఇన్ని సినిమాలు చేసినప్పటికీ టాలీవుడ్ లోనో బాలీవుడ్ లోనో సెటిలయ్యాననుకొను అనిశ్చితి కుదురు లేకపోవటాన్నే కోరుకుంటాను. అప్పుడే సరైన డ్రైవ్ ఉంటుంది. సినిమా అంటే మాత్రం చచ్చేంత ప్రేమ. కానీ దానిలో అతిగా మునిగి పోవద్దని నాకు నేనే సజెషన్స్ ఇచ్చుకుంటాను. ఎందుకంటే అనేకమందిని అదెలా ప్రభావం చేసిందో నేను కళ్లారా చూసాను అంటోంది. ఇలియానా. నేను చిన్నగా కనపడతాను. వయస్సు 30 ఏళ్ళు మెటాబాలిజమ్ నెమ్మదిస్తుంది. బరువు పెరుగుతాను. నా అందం చెదరనందుకు నాకు నేను థాంక్స్ చెప్పుకుంటా కానీ వాస్తవం లో ఉంటా నంటోంది ఇలియానా.

    పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లాగా ఉండాలనుకోను

    నా వయస్సు 30 అని చెప్పుకునేందుకు నేను గర్వపడతా. పర్ ఫెక్ట్ బార్బీ డాల్ లా ఉండాలని నాకెప్పుడూ ఉండదు. ఉదయం లేస్తూనే బెడ్ పైన ఊడిన…

  • తెర వెనుక తారలుంటారు.తెర పైని స్టార్స్ అందం అంతా డిజైనర్ల కష్టమే . గౌతమీ పుత్ర శాతకర్ణి లో ప్రతి పాత్రకు ఆభరణాలు దుస్తులు వైవిధ్యంలో రూపొందించింది ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. ఇప్పటిదాకా ఏడు భాషల్లో 375 చిత్రాలకు పనిచేసిందామె. రజినీ కాంత్ విక్రమాదిత్య బాలీవుడ్ భాషల్లో మొహంజేదారో రుద్రమదేవి ఇవన్నీ ఆమె సృష్టించిన మాయాజాలమే. గౌతమీ పుత్రలో హేమ మాలినీ శ్రేయ ల కోసం ఆరుకంటే ఎక్కువ గజాల చీరలు నేయించారట నీతూ... కూరగాయల రంగులు వాడి బ్రాకెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్లు చేయించారు. బంగారం రంగు రాళ్ళూ ఆన్ కట్ డైమండ్స్ కలిపి అద్భుతమైన అలనాటి నగలు సృష్టించారు. శాతవాహనుల కాలం నాటి చరిత్రను దుస్తుల తీరులో ఆభరణల్లో చూపించేందుకు నెలల తరబడి రీసెర్చ్ చేశానంటారీమె. అనుష్క ఏనుగు పైకి ఎక్కినా గుర్రపు స్వారీ చేసినా కత్తి యుద్ధం లో రౌడీ రసం ఒలికించినా ఆమె కోసం సౌకర్యంగా అద్భుతంగా ఉండే దుస్తులు సృష్టించగలిగానంటారు ఫ్యాషన్ డిజైనర్ నీతూ లుల్లా. వీళ్ళందరినీ అధ్యయనం చేస్తే అమ్మాయిలకు ఎన్ని రంగాల్లో ఎన్ని అవకాశాలున్నాయో తెలుస్తాయి.

    ఈ చేతుల్లోంచే తెర పైని సౌందర్యం

    తెర వెనుక తారలుంటారు.తెర పైని స్టార్స్ అందం అంతా డిజైనర్ల  కష్టమే . గౌతమీ పుత్ర శాతకర్ణి లో ప్రతి పాత్రకు ఆభరణాలు దుస్తులు వైవిధ్యంలో రూపొందించింది…

  • ప్రపంచంలోని అన్ని రంగాల కంటే సినిమా రంగానిదే హవా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక కంపెనీ సీఈఓ అయినా ఆ కంపెనీ వరకే పరిమితం. ఈ సినిమా దేవతలు ప్రపంచం మొత్తం పరిచయం. ఉత్తరాది దక్షిణాది మధ్యనే సరిహద్దు గీతాలు ఏనాడో చెరిచేసి ఇప్పుడు హాలీవుడ్ కు పరుగులు పెట్టిన దీపికా పడుకునే వెండితెర సంచలనం. 2017 లో విడుదలవుతున్న ది రిటర్న్ ఆఫ్ క్యాండర్ కేజ్ లో దీపికా పోషించిన పాత్ర పెద్దదే. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నుంచి ఫ్యాషన్ మోడల్ దాకా ఆ తర్వాత జాతీయ స్థాయి నటిగా అంతర్జాతీయ తారగా అంచెలంచెలుగా ప్రయాణం సాగించిన దీపికా తనకంటూ ఓ ప్రత్యేకత పొందగలిగింది. ఏడేళ్ల కెరీర్ లో ఎన్నో బాలీవుడ్ హిట్స్ ఉన్నాయి. కాక్ టెయిల్ ఓం శాంతి ఓం ,బాజీరావ్ మస్తానీ , యే జవానీ హై దివానీ , చెన్నయ్ ఎక్సప్రెస్ వంటి హిట్స్ ఇప్పటికే ఆమె ఖాతా లో ఉన్నాయి. ఉమెన్స్ హెల్త్ అండ్ ఫిట్ నెస్ మ్యాగజైన్స్ కాలమిస్ట్ గా కూడా వుంది. చారిటబుల్ సంస్థలకు మద్దతు ఇచ్చే దాన గుణం ఉంది. ఆమె తీరైన ఆకారం కాంతులు చిమ్మే సౌందర్యం ఆమెను అంతర్జాతీయ వేదికలపైన ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.

    హాలీవుడ్ చేరిన బాలీవుడ్ బ్యూటీ

    ప్రపంచంలోని అన్ని రంగాల కంటే సినిమా రంగానిదే హవా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక కంపెనీ సీఈఓ అయినా ఆ కంపెనీ వరకే పరిమితం. ఈ సినిమా…

  • ఒక చక్కని హిట్ సినిమాలో రీమేక్ లో నటించబోతోంది తమన్నా. విజయ్ దేవరకొండ రీతూ వర్మ నటించిన పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించనున్నారు, చాలా అందమైన చక్కని సినిమాగా తెలుగులో మార్మోగిన పెళ్లి చూపులు తమన్నా స్టార్ డమ్ తోడైతే బావుంటుందంటున్నారు గౌతమ్ మీనన్. తమన్నా కూడా ఈ సినిమా తోనే గానూ అసలు సినిమాల్లో కథానాయికల కిచ్చిన స్థానంలోనే తన సంతోషం అంటోంది. స్టార్ కిరీటాలు సెట్లో సకల సౌకర్యాలు కల్పించిన ఈ సినీ రంగంలో నాకెప్పుడూ లోటు లేదన్నది తమన్నా . సెట్లో దర్శకుడు చెప్పినట్టు విని ఆ పాత్రలో చాలా కాలం ప్రయాణం ఉంటుంది కాబట్టి అనుకోకుండానే తెలియకుండానే ఆ పాత్ర పై ఇష్టం వస్తుంది అందుకే న పాత్రలన్నీ హిట్. ఇలాంటి మంచి వాతావరణం ఉంటుంది కనుక సెట్టు కూడా ఇల్లు లాగే ఉంటుందంటోంది తమన్నా. తెలుగు ప్రేక్షకులు మెచ్చిన పెళ్లిచూపులు తమిళ ప్రేక్షకులనీ అలరించబోతోంది.

    పెళ్లి చూపులు రీమేక్ లో తమన్నా

    ఒక చక్కని హిట్ సినిమాలో రీమేక్ లో నటించబోతోంది తమన్నా. విజయ్ దేవరకొండ రీతూ వర్మ నటించిన పెళ్లి చూపులు తమిళ రీమేక్ లో తమన్నా హీరోయిన్…

  • ప్రతిభ అనేది ప్రాంతాలకు భాషలకు పరిమితం కాదనీ సినీ నటులు రుజువు చేస్తూనే వున్నారు. ఇప్పుడు భారత దేశ సరిహద్దులు చెదిరిపోయి అంతర్జాతీయ పరుగులు మొదలయ్యాయి. ఉదాహరణకు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ సౌందర్యవతిగా ఐశ్వర్య రాయ్ కు తిరుగేలేదు. బహుశ ఈ ట్యాగ్ దక్కించుకున్న ఏకైక భారతీయురాలు కూడా ఐశ్వర్యానే. 1994 లో విశ్వసుందరి కిరీటం ధరించాక ఇరువది చిత్రం ఇదే తెలుగులో ఇద్దరుగా వచ్చిన సినిమాల్లో మెరిసిపోయాక జార్ ప్యాక్ హోగయా తో హిందీ చిత్రసీమకు వెళ్లిపోయి అన్నీ బ్లాక్ బస్టర్లే సాధించి అవార్డులు తీసుకుంది . అందంతో అభినయంతో బ్రహ్మాండమైన కీర్తితో పాటు పద్మశ్రీ అవార్డు తీసుకుంది బ్రేడ్ అండ్ ప్రెజుడీస్ ది మిసెస్ ఆఫ్ మ్రిసెస్ ,ప్రహాక్ట్ లాఫ్ట్ లెజియన్ పింక్ ఫాందర్ 2 వంటి అద్భుతమైన చిత్రాలున్నాయి. పెళ్లియినా పాపాయికి తల్లయినా ఆమె అంతర్జాతీయ ఖ్యాతిని ఎవళ్ళూ అందుకోలేదు. అంతర్జాతీయ మేకప్ బ్రాండ్ లోరియల్ లో ఆమెను చుస్తే లోరియల్ కొనాల్సిందే. ఇక క్వీన్స్ చిత్రోత్సవాలు ఆమె అందం గురించి మాటల్లో చెప్పలేనంత ప్రశంసలు. ప్రపంచ సినిమాలో భాగం అయిన ఐశ్వర్య అందం చెక్కు చెదరలేదంటే ఆ రహస్యం ఏమిటోమరి .

    ప్రపంచ సినిమా లో భాగం ఐశ్వర్య

    ప్రతిభ అనేది ప్రాంతాలకు భాషలకు పరిమితం  కాదనీ సినీ నటులు రుజువు చేస్తూనే వున్నారు. ఇప్పుడు భారత దేశ  సరిహద్దులు చెదిరిపోయి అంతర్జాతీయ పరుగులు మొదలయ్యాయి. ఉదాహరణకు…

  • ఈనాటి కూతుళ్లు ఎంతోమంది తండ్రి వ్యాపారంలో బాధ్యత తీసుకుంటున్నారు. ముఖేష్ అంబానీ పేరు వినని వాళ్లుండరు. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత ఆయన కూతురు ఇషా అంబానీ చిన్నప్పటినుంచే చదువుల్లో దిట్ట. సైకాలజీ లో డిగ్రీ పూర్తీ చేసింది. అతి చిన్న వయసులో తండ్రి నడిపే సంస్థలకు బోర్డు డైరెక్టర్ గా ఎన్నికైంది. ఫోర్బ్స్ గ్లోబల్ యంగెస్ట్ బిలీనియర్ గా ద్వితీయ స్థానం లో వుంది. పవర్ బిజినెస్ ఉమెన్ గా ఎన్నికైంది. వ్యాపార మెళకువలు కోసం న్యూయార్క్ బిజినెస్ అనాలజిస్ట్ ఎమ్ .సీ కీన్ సేన్ తో కలిపి పనిచేసింది. ప్రత్యేక శిక్షణ తీసుకున్నాకే వ్యాపార బాధ్యతల్లోకి వచ్చింది. చదువు అయ్యి అంతర్జాతీయ వ్యవహారాలపై ఇషా కు అవగాహనా వుంది. తండ్రి పేరు ఉపయోగించకుండా ఇషా సొంత గుర్తింపు తెచ్చుకుందని తల్లి నీతూ అంబానీ ఎంతో సంతోషంతో వుంటుంది. ఎలాంటి సమస్య నైనా వెంటనే పరిష్కరిస్తుందనీ ఏ పనైనా చేసేందుకు ఆమె వెనకాడదని రిలయన్స్ కంపెనీ ఉద్యోగులు చెప్తారు.

    సొంత గుర్తింపు కోసం నిరంతర శ్రమ

    ఈనాటి కూతుళ్లు ఎంతోమంది తండ్రి వ్యాపారంలో బాధ్యత తీసుకుంటున్నారు. ముఖేష్ అంబానీ పేరు వినని వాళ్లుండరు. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత ఆయన కూతురు ఇషా…

  • మీకు ఇంత కష్టం అవసరమా అంటున్న రకుల్

    శరీర లావణ్యం విషయంలో అమ్మాయిల రోల్ మోడల్స్ సినీ తారలే. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం హీరోయిన్లను చూసి డైటింగ్ లు ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయద్దంటోంది.…

  • నిన్ననే పుట్టిన రోజు జరుపుకుంది విద్యా బాలన్. కకోని 2 చిత్రం విజయం సాధించి ఆమె కొత్త సంవత్సరపు కానుక ను అందజేసింది. విద్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే ఎక్కువ నటించింది. ఇష్టపడుతుంది కూడా. ముంబై విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్స్ చేసిన విద్యకు నటనాసక్తి చిన్నపటినుంచి ఎక్కువే. మలయాళ నటుడు మోహన్ లాల్ తో చక్రం సినిమాలో నటించాక ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక పరిణీత లగే రహా మున్నాభాయ్ తో బాలీవుడ్ లో ఆమె పేరు మోగిపోయింది. విద్య అవసరం ఉన్న మహిళలలకు సాయం చేయటంలో ముందుండే విద్యకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా ఇచ్చింది. జనవరి 1 న పుట్టిన రోజు జరుపుకుంటున్న విద్యా బాలన్ కు శుభాకాంక్షలు చెప్పేసి 2017 లో ఇంకెన్నో సినిమా అవకాశాలు రావాలని కోరుకుందాం.

    పుట్టిన రోజు శుభాకాంక్షలు

    నిన్ననే పుట్టిన రోజు జరుపుకుంది విద్యా బాలన్. కహాని-2 చిత్రం విజయం సాధించి ఆమె కొత్త సంవత్సరపు కానుక  ను అందజేసింది. విద్య ఎక్కువగా మహిళా ప్రాధాన్యం…

  • సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ గానీ మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లి కబుర్లు ప్రేమ ఇష్టమైన పనులు అన్నీ పంచుకుంటూ ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం కూడా తన మనసులో మాటలు చెపుతూ ఈ సంవత్సరం ఐదారు సినిమాలు చేయాలనుకుంటున్నా. లక్ తో పాటు హార్డ్ వర్క్ నన్ను ఈ స్థాయికి తెచ్చింది. నిజమైన సంతోషం నా అనుభవం లోకి వచ్చింది. సహనం బాగా పెరిగిందీ. ఈ ఏడాది సినీ ప్రపంచం బయట పనులు కొన్ని పూర్తి చేస్తానని చెపుతోంది హీరోయిన్ సమంత. తనకు ఫిట్ నెస్ అంటే జీవితంలో ఒక భాగం అంటుంది. హెల్తీ డైట్ ప్రాపర్ వర్కవుట్స్ ఇవే ఫిట్ నెస్ సీక్రెట్స్. ఈ సంవత్సరం నేను ఆరడుగుల ఏతయ్యానాని చిలిపిగా చెప్పింది. ఎలా అంటే 'అఆ ' 'తెరి ' సినిమాల విజయం కొన్ని రోజుల పాటు తను ఎంతో ఎత్తుగా ఉన్నట్లు ఫీలయ్యేట్లు చేశాయన్నది సమంత. ఎంతోమంది ఎంత సాధించినా మన ఇంట్లో మామూలు ఆడపిల్లలాగే సరదాగా సందడి చేస్తూ వుంటారు. ఆలా వుండే వాళ్లలో సమంత కూడా ఉంటుంది.

    నేను ఆరడుగుల ఎత్తయ్యా తెలుసా

    సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో బోల్డ్ గానీ మాట్లాడుతూ ఉంటుంది. పెళ్లి కబుర్లు ప్రేమ ఇష్టమైన పనులు అన్నీ పంచుకుంటూ ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం కూడా…

  • రకుల్ ప్రీత్ సింగ్ సొంత వ్యాపారం లోకి ప్రవేశించాక కొత్త కొత్త పరిచయాలు ఫిట్ నెస్ పట్ల యూత్ లో పెరిగిన శ్రద్ధ చూసాక ఇప్పుడు అందరికీ మంచి సలహాలు ఇస్తోంది. ఎప్పుడైతే మార్పు అవసరం అని భావిస్తారో అప్పుడప్పుడే ఆచరించాలి. కానీ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడనే వద్దు. నేనైతే డిసిప్లిన్ గర్ల్. అలవాట్లు ఖచ్చితంగా మార్పులు చేసుకుంటూ టైం విషయంలో పంక్చువల్ గా వుంటా. ఫిట్ నెస్ పైన మమకారం కొద్దీ విపరార్థేమైన వర్కవుట్స్ చేస్తా. మంచి పర్సనాలిటీ కోసం ఆరోగ్యం కోసం వ్యాయామం జీవితంలో భాగంగా ఉండవలిసిందే. లక్ ఉండాలి కానీ మన తలరాత ను మార్చేది మాత్రం మన కష్టమే. వృత్తి పట్ల అంకిత భావంతో నిజాయితీగా వంద శాతం కష్టపడితే మన తలరాత జీవితం అన్నీ మారిపోతాయి. వృత్తి పరంగా నాకు ఈ ఏడాది చాలా గొప్పగా ఉంటుంది. మహేష్ బాబు సాయి ధరమ్ తేజ్ బెల్లంకొండ శ్రీనివాస్ అక్కినేని నాగార్జున నాగ చైతన్య కళ్యాణ్ కృష్ణ తో నటించే సినిమాలన్నీ ఈ సంవత్సరం రిలీజ్ అవుతాయి. ఈ జీవితంలో నేను ఫుల్ హ్యాపీ అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

    తలరాత మార్చుకోవచ్చంటున్న రకుల్

    రకుల్ ప్రీత్ సింగ్ సొంత వ్యాపారం లోకి ప్రవేశించాక కొత్త కొత్త పరిచయాలు ఫిట్ నెస్ పట్ల యూత్ లో పెరిగిన శ్రద్ధ  చూసాక ఇప్పుడు అందరికీ…

  • నయన తార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఇప్పటికే దూర ఇమై క్కనొడిగల్ ,అరమ్ కొలై ఉదిర్ కాలమ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది నయన. అలాగే ఈరోజు ఇంటెర్నేష్నల్ సంస్థ నిర్మిస్తున్న రియలిస్టిక్ థ్రిల్లర్ లోనూ నయన కధానాయిక. ఇక తాజాగా ఆమె ఒప్పుకున్నా సినిమాకు భరత కృష్ణమా చారి దర్శకుడు. ఇందులో తన కుటుంబ మూలాలు వెతుక్కుంటూ వెళ్లే జర్నలిస్ట్ పాత్రను నయన చేయనుంది. ఈ సినిమా చిత్రీకరణ అంతా మాంగోలియా లోని మంచు ప్రాంతాల్లో తీస్తున్నారు. పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లో షూటింగ్ చేస్తున్నారు. సౌత్ లో ఈ సినిమా నయనా తార కు గొప్ప హిట్టవుతుంది. రిస్కీ వాతావరణం లో రిస్కీ ఫైట్స్ ఆమె చేయగలరు. అంటున్నారు దర్శకుడు భరత్. ఇవన్నీ చూస్తుంటే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు నయన మాత్రమే చేయగలదనే భావన అందరికీ వస్తోంది.

    లేడీ ఓరియెంటెడ్ లన్నీ నయన కే

    నయన తార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఇప్పటికే దూర ఇమై క్కనొడిగల్ ,అరమ్ కొలై ఉదిర్  కాలమ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది…

  • సీనియర్ తార ఖుష్బూ తొమ్మిదేళ్ల విరామం అనంతరం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. అలనాటి స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ కధానాయకుడిగా నటిస్తున్న సినిమాలో నటించనున్నారు. త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. స్టోరీ చాలా బావుంది. తన రోల్ ఇంకా బావుండటంతో ఓకే చేసానని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడి చేసారు. చిరంజీవితో స్టాలిన్ మోహన్ బాబు తో యమ దొంగ చిత్రాల్లో నటించిన ఖుష్బూ శక్తిమంతమైన పాత్రలో మళ్ళీ సినిమాల్లోకి రానున్నది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాననీ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాలో తనూ భాగంగా ఉండటం సంతోషంగా ఉందంటోంది ఖుష్బూ.

    మళ్ళీ సినిమాల్లోకి ఖుష్బూ

    సీనియర్ తార ఖుష్బూ తొమ్మిదేళ్ల విరామం అనంతరం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. అలనాటి స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ కధానాయకుడిగా నటిస్తున్న సినిమాలో నటించనున్నారు. త్రివిక్రమ్…

  • పంజాబీ యువతి పరిణీతి చోప్రా తన నటనతో కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టక ముందర 86 కిలోల బరువున్న ఈ అమ్మాయి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ద్వారా కఠినమైన నియమాలతో చూడ చక్కని రూపాన్ని ఎలా సాధించుకుందో సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి ఎంతో మంది యువతులు స్పందించారు. తాను చేసిన వర్కవుట్స్ గురించి పరిణీతి చోప్రా మాట్లాడుతూ ఫుడ్ లవర్ గా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాం తనకి కఠిన పరీక్షేనన్నది. ఫాస్ట్ ఫుడ్ ఎంత ఇష్టమైనా నూరు కట్టేసుకున్నాననీ పాలు బ్రౌన్ బ్రెడ్ బటర్ ఎగ్ వైట్ జ్యూస్ గ్రీన్ సలాడ్ బ్రౌన్ రైస్ వెజిటబుల్స్ అదీ చాలా తక్కువ పరిమాణంలో తీసుకున్నానంటోంది. నూనె లేని ఆహారం, తీపి లేని గ్లాసు పాలు చాకొలేట్ షేక్ తోనే సరిపెట్టుకొన్నా నంది. తర్వాత రొటీన్ గా వెళ్లే జిమ్ తో పాటు కేరళ మార్షల్ ఆర్ట్స్ కలరియా పట్టు కూడా నేర్చుకున్నానంది. ఇది నన్ను మరింత సామర్ధ్యంగా శక్తిమంతంగా తీర్చిదిద్దింది. అంటూ చెప్పుకొచ్చింది పరిణీతి. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసిన వీడియోలకు సందర్సకులు వెల్లువెత్తారు.

    పరిణీతి వెయిట్ లాస్ వీడియోస్ ఒక సంచలనం

    పంజాబీ యువతి  పరిణీతి చోప్రా తన నటనతో కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టక ముందర 86 కిలోల బరువున్న ఈ అమ్మాయి…