• మన హీరోయిన్స్ ని చూసి కొన్ని మొహమాటాలు ఎవరేమనుకుంటారో నని సిగ్గుపడి పోవటాలు మానేయాలి. ఈ ఆమధ్య రాధికా ఇప్పడి వెల్లుమ్ అనే సినిమాలో బస్ డ్రైవర్ పాత్రలో నటిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ మంజిమా మోహన్ జంటగా నటించే ఈ చిత్రం గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రాధికా గిరగిరా బస్ నడిపారు. ఊరికే సినిమా నడపటాలు కాదు. నిజంగానే నిపుణుల సమక్షంలో సినిమా ప్రారంభానికి ముందే నిజంగానే నడపడంలో శిక్షణ తీసుకున్నారు రాధికా. ఎంతో పట్టుదలతో ఈజీగా వారంలో నేర్చుకున్నారు. తక్కువ టైం లో అంత ఈజీగా బస్ నడిపేయటం చూసి యూనిట్ ఆశ్చర్యపడి పోయారట. ఆడవాళ్లు టూ వీలర్ నడిపినా కారు నడిపినా ఇప్పటికీ కొంత ఆశ్చర్యం ఉంటుంది కదా , ఏకంగా రాధికా బస్ నడిపేసింది. హెవీ వెహికల్స్ కూడా మన బలం పైన కాక బుద్ధి బలం పైనే ఆధారపడి నడుస్తాయి. కానీ ఎందుకు మనం చాలా పనులు కష్టం అనుకుంటాం .

    బస్ నడపటం నేర్చుకున్న రాధికా

    మన హీరోయిన్స్ ని చూసి కొన్ని మొహమాటాలు ఎవరేమనుకుంటారో నని  సిగ్గుపడి పోవటాలు మానేయాలి. ఈ ఆమధ్య రాధికా ఇప్పడి వెల్లుమ్  అనే సినిమాలో బస్ డ్రైవర్…

  • దక్షిణాది తో పాటు హిందీ లో కూడా నటిస్తూ అన్ని చోట్లా గుర్తింపు తెచ్చుకుంటోంది శృతి హాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తన కెరీర్ ను తీర్చిదిద్దుకుంటోంది. మనం చేసే పనుల్లో మార్పు కనిపించాలి నిన్న కంటే ఈ రోజు ఇవాళ్టి కంటే రేపు కొత్తదనం చూపించాలి ఇది సినిమాల ముచ్చట. వ్యక్తిగత జీవితం నేను మార్పు కోరుకొను. డబ్బు పేరు విజయం నన్ను మార్చలేవు. కేవలం నేను శృతి హాసన్ నే . నన్ను ఏవీ ప్రభవితం చేయవు. అంటోంది శృతి. కెరీర్ ఆరంభంలో పోలిస్తే ఏమైనా మార్పు లొచ్చాయా అన్న ప్రశ్నకు శ్రుతీ ఏవీ లేదండి. నేనంటే నేనొక్కదాన్నే కాదు. నాలో ఇద్దరున్నారు. ఒకరు కధానాయిక శృతి హాసన్ నేను చేసే శ్రమ గుర్తింపు ఆదరణ అన్నీ సెట్ లోంచి నేను ఇంటికెళ్ళేదాకే. ఇంటికెళితే ఇంకో శృతి . బయట విషయాలతో సంభంధం లేని శృతి. బయట కూడా ఇంట్లో గురించి మాట్లాడాను. చిన్నపటినుంచి సిఎంమా వాతావరణం లో పెరగటం వల్ల వృత్తిని వ్యక్తిగత జీవితాన్ని నేరుగా వంచుకోవటం అలవాటైంది. ఈ రెండిటినీ వేరు వేరుగానే చూస్తానంటోంది శృతి హాసన్. ఇంటికి వెళుతూ ఆఫీస్ లో బర్డెన్నంత ఇంట్లో వాళ్ళ పైన మోపే ఎంతో మందికి శృతి హాసన్ ఆదర్శం కావాలి.

    నాలో ఇంకో శృతి హాసన్

    దక్షిణాది తో  పాటు హిందీ లో కూడా నటిస్తూ అన్ని చోట్లా గుర్తింపు తెచ్చుకుంటోంది శృతి హాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తన కెరీర్ ను…

  • ఏదైనా సక్సెస్ వస్తే ఊరు వారి ఏకం చేయటం లేదా నష్టం వస్తే అదేదో పర్వతం మీద పడ్డట్టు బావులకు సిద్దపడటం సాధారణం మానవుల లక్షణం . కానీ ఓటమి అనేది నాకు నచ్చదు. అంటోంది ప్రియాంక చోప్రా. ఫిల్మ్ ఇండస్ట్రీ లో సక్సెస్ లు ఫెయిల్యూర్ లు ఎంత కామనో మనుషుల భావోద్వేగాలు అంతే కామన్. సినిమా ఫ్లాప్ అయితే ఒక్కళ్ళు ఒక్క రకంగా బాధపడతారు. మరి ప్రియాంక ఏం చేస్తుందో తెలుసా ఫుల్లుగా తిని పడుకుంటుందట. ఐ డోంట్ లైక్ టు ఫెయిల్ కానీ తప్పదు. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ విలువ తెలియదు. నా సినిమా ఫెయిలయితే నేను ఫెయిల్ అయ్యినట్లే. ఇంక ఏం చేయటం ఒక ఐస్ క్రీమ్ ఫుల్ గా తినేసి దుప్పటి కప్పుకుని పడుకుంటా అన్నది ప్రియాంక. ఒక్కోసారి నమ్మకం తో చేసిన సినిమా ఫ్లాప్ అవుతుంది. ప్రతి సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ నన్నీ స్థితికి తెచ్చాయి. ఒక్కో అడుగు వేస్తూ నేనింత దూరం వచ్చాను. నా నిర్ణయాల పట్ల ఎప్పుడూ బాధపడను. అన్నారు ప్రియాంక. ఇది అందరికీ వర్తించదా ??

    ఫుల్ గా తినేసి దుప్పటి కప్పుకుంటా

    ఏదైనా సక్సెస్ వస్తే ఊరు వారి ఏకం చేయటం లేదా నష్టం వస్తే అదేదో పర్వతం మీద పడ్డట్టు బావులకు సిద్దపడటం  సాధారణం మానవుల లక్షణం .…

  • పిల్లల గురించి మాట్లాడాలంటే జీవితం సరిపోదు. ప్రపంచంలోని పిల్లలందరకు ఎన్నో లేవు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇప్పుడు బాలల దుస్థితి పైన ప్రపంచం దృష్టి సాధించాలని పిలుపు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కష్టాల్లో వున్నా పిల్లల ఘోష వినిపించుకోమని కోరుతూ ఐ నీడ్ యు అనే వీడియో ను రూపొందించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన అభిమానులు ఫాలోవర్లు యూనిసెఫ్ హ్యుమానిటేరియన్ యాక్షన్ ప్లాన్ ఫుడ్ చిల్డ్రన్ ఫర్ 2017 లింక్ ను సందర్శించి పిల్లలకు తమ వంతు సాయం చేయమని విజ్ఞప్తి చేశారు. బాలల హక్కులకు మద్దతు ఇమ్మని కోరారు.

    బాలల హక్కులకు మద్దతు ఇవ్వండి

    పిల్లల గురించి మాట్లాడాలంటే జీవితం సరిపోదు. ప్రపంచంలోని పిల్లలందరకు  ఎన్నో లేవు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇప్పుడు బాలల దుస్థితి పైన ప్రపంచం దృష్టి సాధించాలని…

  • నన్ను క్షమించి వదిలేస్తున్నారేమో అంటోంది అనుష్క. లోకంలో గాసిప్స్ కు కొదవలేదు. అలాగే క్రికెటర్లు రాజకీయాలు అందరిపైనా గాసిప్స్ ఆలా గాల్లో తెలివస్తూ ఉంటాయి. ఇదివరకటి తో పోలిస్తే నాపై కాస్త తక్కువగానే గాసిప్స్ వస్తున్నాయి. నా మనసు అర్ధం చేసుకుని ఓ అంచనాకు వచ్చారా లేదా నన్ను క్షమించి వదిలేశారో నాకు తెలియటం లేదంటోంది అనుష్క. అనుష్క నటించిన యముడు -3 ఓం నమో వెంకటేశాయ ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.బాహుబలి డి కంక్లూజన్ ఈ వేసవికి విడుదల కాబోతోంది. ఈ సినిమా గ్గానూ రాజమౌళి ఊహించనమేరకు అనుష్క బరువు తగ్గకపోతే గ్రాఫిక్స్ లోనే ఆమెను అందంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఇంకో గాసిప్ చక్కర్లు కొడుతున్న అనుష్క అవేం పట్టించుకోనని మిగతా కథానాయికలకు కూడా మీమీద మీకు నమ్మకం ఉంచుకోండి కానీ ఎవళ్ళకీ మీరు సమాధానం చెప్పుకోనక్కర్లేదు. మీ కుటుంబ సభ్యులకు తప్ప అని సలహా ఇచ్చేసిందీ స్వీటీ అనబడే అనుష్క

    బహుశ నన్ను క్షమించేసాను

    నన్ను క్షమించి వదిలేస్తున్నారేమో  అంటోంది అనుష్క. లోకంలో గాసిప్స్ కు కొదవలేదు. అలాగే క్రికెటర్లు రాజకీయాలు అందరిపైనా గాసిప్స్ ఆలా గాల్లో తెలివస్తూ ఉంటాయి. ఇదివరకటి తో…

  • తమన్నా బాహుబలి విజయం ఇచ్చిన ధైర్యం తర్వాత ఇప్పుడిక హిందీ సినిమా కధలు వింటున్నానంటోంది. అవంతిక పాత్ర బాహుబలి ది కంక్లూజన్ లో ఇంకా బావుంటుంది అని చెపుతుందామె. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను తన పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎంతో టెన్షన్ పడిందట. ఇప్పుడిక బాలీవుడ్ లో సత్తా చాటాలనుకుంటోందిట. అక్కడ హిమ్మత్ వాలా లో నటించి హమ్ షకల్స్ ఎంటర్టైన్మెంట్ టుక్ టుక్ టుటియాల్లో మెరిపించినా అక్కడ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదీ పాల తెలుపు అందాల తమన్నా . ఒక గుర్తింపంటూ వచ్చాక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనిపించి అభినేత్రి చేసేసా. పెరఫార్మెన్స్ కు స్కోప్ వున్న లేడీ ఓరియెంటెడ్ లో చేయడం మంచిదేననిపించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ విషయంలో సినిమా ఆలోచనల్లో మార్పురాలేదు కానీ బాలీవుడ్ లో సూపర్ స్టార్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు . మన వల్ల సినిమాకు అదనపు ఆకర్షణ వుంటే మంచిదే కదా. పైగా రెమ్యునెరేషన్ బ్రహ్మాండంగా వుంటే హ్యాపీ కదా అంటోంది తమన్నా.

    హిందీ లో చేయాలని వుంది

    తమన్నా బాహుబలి విజయం ఇచ్చిన ధైర్యం తర్వాత ఇప్పుడిక హిందీ సినిమా కధలు వింటున్నానంటోంది. అవంతిక పాత్ర బాహుబలి ది కంక్లూజన్ లో ఇంకా బావుంటుంది  అని…

  • పవర్ సినిమా తర్వాత హన్సిక తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. మా చిన్న కుష్భు అని తమిళులు ముద్దుగా పిలిచే హన్సిక కుష్భు లాగా బొద్దు గానే ఉండేది కానీ ఇప్పుడు స్క్వాష్ లు యోగాలతో ఏకంగా పదమూడు కిలోల బరువు తగ్గిపోయి చాలా స్లిమ్ గా అయిపోయింది. ఇంత పేరు తెచుకున్నాక లేజీ ఓరియెంటెడ్ సినిమాలు చేయచ్చు కదా అని అడిగితే అబ్బే నేనింకా చాలా పెద్దయి ఎంతో అనుభవం సంపాదించుకోవాలి. తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి నాకింకా ఐదేళ్లే . ఇప్పుడు నాకున్న కమర్షియల్ హీరోయిన్ అన్న ఇమేజ్ ను నేను చాలా ఇష్టపడుతున్నా. నేనింకా చాలా చిన్నదాన్నే కదా. ఇప్పట్లో అలంటి పాత్రల జోలికి పోను. తమిళంలో ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలున్నాయి. 31 మంది దత్తత తీసుకున్న పిల్లలున్నారు. వాళ్ళకోసం పెద్ద హోమ్ కట్టాలి. వాళ్ళ బాగోగులు చూడాలి. ఇవన్నీ కష్టమైనా పనులు నా కోసం వుంచి ఇప్పుడు ప్రయోగాలు చేయును. కమర్షియల్ సినిమాలే ఇప్పుడు నా ధ్యేయం అంటోంది హన్సిక.

    నేనింకా ఎంతో యంగ్

    పవర్ సినిమా తర్వాత హన్సిక తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. మా చిన్న కుష్భు అని తమిళులు ముద్దుగా పిలిచే హన్సిక కుష్భు లాగా…

  • తెలంగాణ హ్యాండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్ సమంత తనవంతు సేవలు అందించేందుకు అంగీకరించింది. మెట్రో రైల్ భవన్ పై మినిష్టర్ కేటీఆర్ ను కలిసిన సమంత చేనేత పరిశ్రమ పట్ల తనకున్న ఇష్టాన్ని గురించి అయిన తో మాట్లాడింది. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ని ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగా ఉంటానని వివిధ రకాల చేనేత చీరల గురించి తానూ అధ్యయనం చేశానని చెప్పింది సమంత. గద్వాల్ పోచంపల్లి వంటి నేత రకాల చీరలతో వస్తున్న మోడ్రన్ ట్రెండ్స్ గురించి ఆమె మంత్రితో చర్చించారు. చీరల అమ్మకాలు పెంచేందుకు గానూ తీసుకు రావలిసిన కొత్త ఆలోచనలు తనకు ఉన్నాయని వీవర్స్ తో కలిసి తానూ ఆ పద్దతులను ఆచరణ లోకి తెస్తానని చెప్పింది సమంత. తెలంగాణ హ్యాండ్లూమ్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా వ్యవహరించాల్సిందిగా మంత్రి కేటీర్ కోరటంతో తన అంగీకారం చెప్పింది సమంత మంత్రి కేటీర్ ఆమెకు అందమైన పోచంపల్లి చీరను కానుకగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమంత తో పాటు టి. ఎస్. సి. డైరెక్టర్ శైలజ రామయ్యర్ ఇండస్ట్రీస్ ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

    తెలంగాణ హ్యండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా సమంత

    తెలంగాణ హ్యాండ్ లూమ్స్ బ్రాండ్ ఎంబాసిడర్ గా ప్రముఖ హీరోయిన్  సమంత తనవంతు సేవలు అందించేందుకు అంగీకరించింది. మెట్రో రైల్ భవన్ పై మినిష్టర్ కేటీఆర్ ను…

  • సాధారణంగా యుక్త వయసు రాగానే అమ్మాయి లందరూ ఎదుర్కునే ప్రశ్న పెళ్ళెప్పుడు అమ్మాయిలు కూడా చదువులివ్వాలి . ఉద్యోగం రావాలి . ఆ తర్వాతే అనేస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రశ్న కాజోల్ కీ ఎదురవుతుంది. అయితే కాజోల్ మాత్రం పెళ్ళికీ కెరీర్ కు కొనసాగిస్తున్న కథానాయికల చాలా మందే కనిపిస్తారు. మేం కూడా అంతే. కధానాయిక కెరీర్ కూడా ఓ ఉద్యోగం లాంటిదే. పెళ్లి తర్వాత కూడా ఎంతోమంది అమ్మాయిలు ఉద్యోగం చేస్తున్నట్లు నేను అలాగే అంటోంది. పైగా పెళ్లి ఇప్పుడేమిటి ? కథానాయికగా చాలా దూరం ప్రయాణం వుంది. నాకిష్టమైనన్ని మంచి పత్రాలు ధరించాలి. అటు తర్వాత మనసుకి నచ్చిన అబ్బాయి దొరకాలి. ఇక అప్పుడే పెళ్లి. అనేసింది. ఇప్పుడామె రానాతో కలిసి నేనే రాజు నేనే మంత్రి , తమిళంలో ఇంకో రెండు సినిమాల్లో బిజీగా వుంది. జూనియర్ ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్ చేసాక ఇప్పుడు ఐటెం సాంగ్స్ కూడా పర్లేదు చేయటం నాకు సరదానే అంటోందీ అమ్మాయి. వ్యాపార దృక్పధంతో ఆలోచించటం లో హీరో హీరోయిన్స్ అని తేడా ఏముంటుంది?

    పెళ్ళికీ కెరీర్ కు సంబంధం లేదు

    సాధారణంగా యుక్త వయసు రాగానే అమ్మాయి లందరూ  ఎదుర్కునే ప్రశ్న పెళ్ళెప్పుడు అమ్మాయిలు కూడా చదువులివ్వాలి . ఉద్యోగం రావాలి . ఆ తర్వాతే అనేస్తుంటారు. ఇప్పుడు…

  • పుస్తకం హస్త భూషణం అంటుంటారు కానీ చేతిలో పుస్తకం ఉంటె విజ్ఞాన ప్రపంచం మన ముందున్నట్లే. అందుకే నా సహవాసం పుస్తకాలతోనే అంటోంది నిత్యా మీనన్. తెలుగు సినీ ప్రపంచంలో సౌందర్య తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది నిత్యా . ప్రతి సినిమాలో ఆచి తూచి ఎంచుకుంటుంది . ఏదైనా పొరపాట్లు జరిగితే ఒకవేళ తప్పు తనదైతే హాయిగా వప్పుకుంటుంది. ఎంత బోల్డ్ గా మాట్లాడే నిత్యా త్వరలో దర్శకత్వం చేస్తానంటోంది . నేనో పుస్తకాల పురుగుని. ప్రతి రోజు ఎదో ఒక పుస్తకం చదవాల్సిందే. లేదంటే నిద్రపట్టదు. అన్ని రకాల పుస్తకాలు చదువుతా. ఫిక్షన్ అంటే ఎంతో ఇష్టం ఆటోబయోగ్రఫీ అస్సలు వదలను . అందులో ఎదో స్ఫూర్తి నిచ్ఛే అంశాలుంటాయి. ఈ మధ్య ఒక జీవిత కధ చదివా. అది ఓ గ్రామానికి సంబంధించిన కధ. చదువుతున్నంతసేపు ఇంకో ప్రపంచంలో ఉన్నట్లుంది. ఆ కధ ని తెరపై చూపించాలని ఆలోచిస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కళ్లముందుంది. ఎప్పుడైన దర్శకత్వం వహిస్తే ముందు ఈ కథే తీస్తానంటోంది నిత్య. అంటే బహుశా తొందరలో డైరెక్టర్ గా మన ముందుకు రాబోతోంది నిత్య.

    ఆ జీవిత కధని తెరకెక్కించాలని ఉంది.

    పుస్తకం హస్త భూషణం అంటుంటారు కానీ చేతిలో పుస్తకం ఉంటె విజ్ఞాన ప్రపంచం మన ముందున్నట్లే. అందుకే నా సహవాసం పుస్తకాలతోనే అంటోంది నిత్యా మీనన్. తెలుగు…

  • చాలా మందికి చాలా సార్లు వృత్తీ ప్రవృత్తీ ఒకటే అయిపోతుంది. అసలు అదే సిసలైన జీవన విధానం కూడా ఫ్యాషన్ మేరీకోమ్ చిత్రాల్లో ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించగలనని ప్రియాంక చోప్రా తన పాత్రల ద్వారా చూపించింది. అలా సాహసం తో నిలబడటం మహిళలకు కీలకం అని పాత్రల్లో చెప్పిన ప్రియాంక నిజ జీవితంలో మహిళా సాధికారత గురించి బోధిస్తోంది. మగవాళ్ల కంటే ఆడవాళ్ళూ ఏ విషయంలో తక్కువ కానే కాదు. ఈ ప్రపంచంలో మనకెంతో విలువుంది. అన్న ప్రసంగాలతో అందరిలోనూ స్ఫూర్తి నిలుపుతోంది. ఒక టెలివిజన్ షో కోసం బోస్టన్ వెళ్లిన ప్రియాంక విద్యతో మహిళల అభివృద్ధి అన్న కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించింది. ఈ వేదికపైన ఆమె చేసిన ప్రసంగం అందరి ప్రశంసలు అందుకుంది . అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ బ్రిటన్ మాజీ ప్రధాని జోర్డాన్ బ్రౌన్ వంటి వారితో ఆ వేదిక పంచుకున్న ప్రియాంక గొప్ప వ్యక్తుల సరసన నచ్చిన ప్రసంగం చేయగలిగినందుకు ఎంతో సంతోషపడింది. ఆమె ఇప్పుడు అన్నింటా విజేతే. అంతర్జాతీయ స్థాయి నటిగా హాలీవుడ్ లో ఆమె నటించిన చిత్రంలో తనకంటూ ఓ ప్రత్యేకత కూడా తెచ్చుకుంది. ప్రియాంక చోప్రా.

    ఆడవాళ్లు తక్కువేం కాదు

    చాలా మందికి చాలా సార్లు వృత్తీ ప్రవృత్తీ  ఒకటే అయిపోతుంది. అసలు అదే సిసలైన జీవన విధానం కూడా ఫ్యాషన్ మేరీకోమ్ చిత్రాల్లో ఆత్మవిశ్వాసంతో ఎలాంటి పరిస్థితులనైనా…

  • ధైర్యంగా సవాళ్ళని స్వీకరిస్తున్నా

    మనలో మనక్కూడా తెలియని కళలుంటాయి . అవి సమయం వస్తే తప్ప బయటకు రావు అంటోంది రాసి ఖన్నా. మన ప్రతిభ పైన మనకో అవగాహన ఉంటుంది.…

  • నిర్మొహమాటంగా మాట్లాడటం ఒక విధంగా చాలా కష్టం. కానీ బాలీవుడ్ అగ్రతార మటుకు ఇలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా హాయిగా మనసులో ఉన్న మాట అనేసేంత ధైర్య శాలి. చాలా మంది తారలు హాలీవుడ్ సినిమాల్లో పనిచేయటం గర్వంగా ఫీలవుతుంటే కంగనా రనౌత్ మాత్రం అంత దండగ పని మరొకటి లేదండి డిజిటల్ మీడియా కారణం అక్కడి థియేటర్ బిజినెస్ చాలా దెబ్బతింది. 15 ఏళ్ల క్రితం హాలీవుడ్ బాగానే వుంది. కానీ ఇప్పుడు మన ఎంటర్ టైన్మెంట్ రంగమే లాభదాయకంగా ఉంది. మన చిత్ర సీమకే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని కుండ బద్దలు కొట్టేసిందీ అమ్మాయి. జంగిల్ బుక్ లాంటి అమెరికన్ చిత్రం మన దేశంలో వంద కోట్ల రూపాయల వ్యాపారం చేసింది మన సినిమాలకు సరైన స్థాయిలు సినిమా హాళ్లు ఉంటే ఆ స్థాయి వసూళ్లు సాధించటం పెద్ద కష్టం కాదు. ప్రపంచ సినిమా బాగు పడాలని కోరుకుంటాం. కానీ మన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందితేనే కదా ఇక్కడి వాళ్లకు ఉపాధి. అని అభిప్రాయ పడింది. అలాగే నేనయితే హాలీవుడ్ కు వెళ్లకే వెళ్లనంది కంగనా .

    హాలీవుడ్ కు వెళ్లటమా ? నెవర్ !

    నిర్మొహమాటంగా మాట్లాడటం ఒక విధంగా చాలా కష్టం. కానీ బాలీవుడ్ అగ్రతార మటుకు ఇలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా హాయిగా మనసులో ఉన్న మాట అనేసేంత ధైర్య శాలి.…

  • సమంత పెళ్లి నిశ్చితార్ధం పేపర్లలో టీవీ ల్లో వచ్చాక ఎక్కువగా చెప్పుకొంది. ఆమె నిశ్చితార్ధం సమయంలో కట్టుకున్న చీర గురించే. తన ఎంగేజ్మెంట్ చీర పైన సమంత ఏమాయ చేసావే షూటింగ్ రోజుల్లో నుంచే అక్కినేని కుటుంబం గ్రూప్ ఫోటోల బొమ్మలు సమంత చైతూ ఇద్దరు బైక్ పైన వెళుతున్న ఫోటోలు బొమ్మలుగా ఎంబ్రాయిడరీ చేయించుకుంది ఈ చీర డిజైన్ చేసిన క్రెడిట్ ఫ్యాషన్ డిజైనర్ క్రెషా బజాజ్ కు ఎప్పుడో వెళ్లపోయింది. క్రెషా తన పెళ్లి దుస్తుల కోసం పది లక్షల రూపాయల ఖర్చుతో తన భర్త తో పరిచయం అయినప్పటినుంచి నిశ్చితార్ధం వరకు తీయించుకున్న ఎన్నో ఫోటోలను పసిడిపువ్వుల్లా ఎంబ్రాయిడరీ ద్వారా చీరపై డిజైన్ చేయించుకుంది . నెల రోజుల పాటు ఈ డిజైన్ లెహెంగా ను వంద మంది డిజైనర్లు కొట్టారు. క్రెషా వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. విదేశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదివి ముంబై లో ఒక బ్రాండ్ ప్రారంభించింది. పెళ్లి కూతుళ్ళకు ప్రత్యేక డిజైనింగ్ చేయరు. 233 దేశాలకు పంపుతోంది.ఇప్పుడు తాజా సమంత నిశ్చితార్ధపు చీరలో క్రెషా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రెటీ అయిపోతుంది.

    నిశ్చితార్ధపు స్పెషల్స్

    సమంత పెళ్లి నిశ్చితార్ధం పేపర్లలో టీవీ ల్లో వచ్చాక ఎక్కువగా చెప్పుకొంది. ఆమె నిశ్చితార్ధం సమయంలో కట్టుకున్న చీర గురించే. తన ఎంగేజ్మెంట్ చీర పైన సమంత…

  • కోట్లాది మంది టెలివిజన్ లో చూస్తుండగా కన్నుల పండుగలా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో మిస్ ఫ్రాన్స్ పోటీ రాదు. ఇరిస్ మిట్ట నదే . విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది. పోటీల ఫెనాల్స్ లో టాప్ త్రీ లో మిస్ ఫ్రాన్స్ మిన్ హైతీ మిస్ కొలంబియా మిగిలారు. మనాలీ లో జరిగిన మిస్ యూనివర్సిటీ 2016 పోటీల చివరి దశలో జడ్జిలో ఏ ఈముగ్గురిలో ఎవరు విజేతన్న విషయాన్నీ తేల్చుకోలేక అనేక పరిశీలనల తర్వాత ఇరీస్ మిట్టనరే ను ఎంపిక చేశారు. మిస్ హైతీ రాక్వెల్ పెలిస్పియర్ రెండో స్థానంలో మిస్ కొలంబియా ఆండ్రా టోవేర్ మూడో స్థానంలో నిలిచారు. ఈ పోటీలకు హాజరైన బెంగుళూరు అమ్మాయి రొష్మిత హరిమూర్తి టాప్ - 13 కు కూడా చేరుకోలేదు. ఇక విశ్వసుందరి గా నిలిచినా ఇరిస్ మిట్టనరే డెంటిల్ సర్జరీ తో డిగ్రీ చేస్తోంది. తనకు కిరీటం సాధించటం వల్ల వచ్చిన పేరును ఖ్యాతిని ప్రపంచంలో పంటి ఆరోగ్యం పట్ల చైతన్యానికి నోటి శుభ్రత పట్ల శ్రద్ధ కు అవసరమైన ప్రచారానికి ఉపయోగిస్తానని చెపుతోంది ఇరీస్

    విశ్వ సుందరి ఇరిస్

    కోట్లాది మంది టెలివిజన్ లో చూస్తుండగా కన్నుల పండుగలా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో మిస్ ఫ్రాన్స్ పోటీ రాదు. ఇరిస్  మిట్ట నదే . విశ్వ…

  • నిజానికి బాలీవుడ్ హీరోయిన్లందరూ దక్షినాది తెరపైన మెరిసిన వారే. పెద్దయి పోయినా వాళ్ళ దృష్టి ఇటే ఉండటంలో ఆశ్చర్యం ఏదీ లేదు. ఇదివరకు ఎప్పుడో శ్రీదేవి తమిళ సినిమాలో రాణీ వేషం వేస్తే డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమీపుత్ర శాతకర్ణి లో రాజమాతగా బ్రహ్మాండంగా నటించేసింది. ఇప్పుడిక కాజోల్ వంతోచ్చింది. ధనుష్ సినిమాలో లేడీ విలన్ గా నటించబోతుంది. 18 సంవత్సరాల తర్వాత అనంతరం కాజోల్ హటాత్తుగా తెలుగు సినిమాలో విలన్ పాత్రలో అనే సరికి అందరికీ ఆశ్చర్యమే. ఇదంతా చూసి బాలీవుడ్ జనం ఆశ్చర్యపోతుంటే ఇటు దక్షిణాదిన మన సినీ కళాభిమానులు మాత్రం బోలెడంత కోపం తెచ్చేసుకొంటున్నారు. హీరోయిన్లు సరే వస్తున్నారు, కారక్టర్ పాత్రలు కూడా వాళ్ళే వేస్తే మరి మన వాళ్ళ సంగతేమిటని వీళ్ళ ప్రశ్న. ఈ మనోభావాలతో నిమిత్తం లేకుండా కాజోల్ మాత్రం విలన్ గా రాబోతుందని సమాచారం.

    లేడీ విలన్ గా కాజోల్

    నిజానికి బాలీవుడ్ హీరోయిన్లందరూ దక్షినాది తెరపైన మెరిసిన వారే. పెద్దయి పోయినా వాళ్ళ దృష్టి ఇటే ఉండటంలో ఆశ్చర్యం ఏదీ లేదు. ఇదివరకు ఎప్పుడో శ్రీదేవి తమిళ…

  • తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వివిధ రంగాల్లో సేవలందించిన మొత్తం 89 మందిని ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించనుంది. విజయవాడ కేంద్రంగా విద్యా సంస్థ స్థాపించి ఆ సంస్థల పేరునే ఇంటి పేరుగా మార్చుకొన్న వేగి కోటేశ్వరమ్మ గారు ఆరు దశాబ్దాలుగా విద్యావనం లోనే అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా గోసాల గ్రామంలో 1925 లో జన్మించారు. కాకినాడ, గుంటూరు లలో కళాశాల చదువును పూర్తిచేసి ఉపాధ్యాయ వృత్తి లోకి రావడానికి శిక్షణ తీసుకొన్నారు. నెల్లూరు, విజయవాడల్లో కొంతకాలం పనిచేశారు. చదువు విషయంలో లింగ వివక్షను చూసి చలించిపోయి 1955 లో పది మంది పిల్లలతో మాంటిస్సొరి పేరుతో పాఠశాల ను స్థాపించారు. విద్యారంగం లో ఆమె చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది.

    చదువుల తల్లి కోటేశ్వరమ్మ గారు

    తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వివిధ రంగాల్లో సేవలందించిన మొత్తం 89 మందిని ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించనుంది. విజయవాడ కేంద్రంగా…

  • విశ్వ సుందరిగా ఎంపికైన వేదిక నుంచి ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళటం అపురూపమైన విషయమో. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ 1994లో ఫిలిప్ఫిన్స్ లోని మనీలాలో జరిగిన అందాల పోటీలో విశ్వ సుందరిగా ఎంపికయ్యారు. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వేదికపైన జనవరి 30వ తేదీన జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీలకు జడ్జిలలో ఒకరిగా హాజరవుతున్నారు. ఈ విషయం గురించి చెపుతూఇది అపురూపమైన విషయం మాత్రమే కాదు పరిపూర్ణం కూడా. నా లైఫ్ ఇప్పుడు ఫుల్ సర్కిల్ తిరిగినట్లుగా ఉంది అంటోంది సుస్మితా సేన్. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కూతురు అలీషా సేన్ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు సుస్మితా. ఈ తల్లీకూతుళ్ళిద్దరితో పాటు మిస్ యూనివర్స్ కిరీటం కోసం మన దేశం నుంచి పోటీపడుతున్న రోష్మితా హరిమూర్తి భారతీయతకు నిండుదనం తేబోతున్నారు. ఆ రోజు రోష్మితకు టైటిల్ వస్తే మళ్ళీ అదో గొప్ప రికార్డు.

    అపురూపం కాదు పరిపూర్ణం

    విశ్వ సుందరిగా ఎంపికైన వేదిక నుంచి ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళటం అపురూపమైన విషయమో. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ 1994లో ఫిలిప్ఫిన్స్ లోని…

  • మదర్ ధెరిసా స్ఫూర్తి తో సేవా దిశగా అడుగులు వేసిన అనురాధ కొయిరాలా నటి మనీషా కొయిరాలా మేనత్త 1993 లో మైటీ నేపాల్ పేరుతో స్వచ్చంధ సంస్థ స్థాపించి భారత సరిహద్దు నేపాల్ లో వేశ్య వృత్తి లో వున్న మహిళల్ని అక్రమ రవాణాకు గురవుతున్న వారిని కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇరవైనాలుగేళ్ళుగా 12 వేల మంది అమ్మాయిలను కాపాడి కొత్త జీవితాలను ప్రసాదించారు. ఆమె కృషిని గుర్తించిన నేపాల్ ప్రభుత్వం సెప్టెంబర్ 5,వ తేదీని అక్రమ రవాణా వ్యతిరేక దినం గా ప్రకటించింది.

    సేవా దిశలో అనురాధా కొయిరాలా

    మదర్ ధెరిసా స్ఫూర్తి తో సేవా దిశగా అడుగులు వేసిన అనురాధ కొయిరాలా నటి మనీషా కొయిరాలా మేనత్త 1993 లో మైటీ నేపాల్ పేరుతో స్వచ్చంధ…

  • 2016 పారా ఒలంపిక్ క్రీడల్లో షార్ట్ ఫుట్ విభాగంలో రాజిత పతకాన్ని అందుకున్న మొదటి క్రీడాకారిణి దీపామాలిక్. అనుకోని ప్రమాదంలో వెన్ను పూస దెబ్బ తిన్నా, చెక్రాల కుర్చీకే పరిమితం అయినా, బ్యూటీ క్వీన్ గా సామాజిక కార్యకర్త గా తనను తాను మలుచుకుని పారా ఒలంపిక్ పతకానికి ముందే ఎన్నో సహస క్రీడల్లో పతకాలు అందుకుంది దీపా మాలిక్. హిమాలయాలకు కార్ రేస్ లో పరుగులు తీసిన పరా ప్లీజిన్ దీపా.

    సడలని సమరోత్సాహం దీపామాలిక్

    2016 పారా ఒలంపిక్ క్రీడల్లో షార్ట్ ఫుట్ విభాగంలో రాజిత పతకాన్ని అందుకున్న మొదటి క్రీడాకారిణి దీపామాలిక్. అనుకోని ప్రమాదంలో వెన్ను పూస దెబ్బ తిన్నా, చెక్రాల…