• ఒక అపూర్వమైన అనుభవం స్త్రీకి గర్భవతి కావడం కవుల కల్పనల్లో, బొమ్మల్లో తల్లి గా వుండటాన్ని అద్భుతంగా వర్ణించారు కానీ నిజంగా కడుపులో బిడ్డను మోయడం అంత సులభం ఎవీ వుండదు గర్భం దాల్చాక ఎదుర్కొనే తోలి ఇబ్బంది వేవిళ్ళు. ఉదయం వేళ వికారంగా, నీరసం గా వుండటం, వాంతులు నోరు అరుచిగా వుండటం, అయితే ఈ మార్నింగ్ సిక్ నెస్ మంచిదే అంటున్నాయి పరిశోధనలు. ఆరోగ్యవంతమైన గర్భానికి ఇదో సూచన అని పరిశోధకుల అభిప్రాయం. ఇలా వేవిళ్ళు వుండని గర్భావతుల్లో గర్భ విచ్చిత్తి అవకాశాలు ఎన్నో వున్నాయి. కాబట్టి ఈ ఉదయపు వేల విసిగించే వికారం, వాంతులు గురించి చిరాకు పడకుండా పుట్టే బిడ్డ గురించి ఆలోచిస్తూ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఆలోచిస్తూ, కడుపులో పాపాయి తో కబుర్లు చెప్పండి అంటున్నారు పరిశోధకులు.

    మార్నింగ్ సిక్ నెస్ మంచిదే

    ఒక అపూర్వమైన అనుభవం స్త్రీకి గర్భవతి కావడం కవుల కల్పనల్లో, బొమ్మల్లో తల్లి గా వుండటాన్ని అద్భుతంగా వర్ణించారు కానీ నిజంగా కడుపులో బిడ్డను మోయడం అంత…

  • ఒక ప్రత్యేక సందర్భం అది క్రిస్ట్ మస్ కావొచ్చు, న్యూ ఇయర్ కావొచ్చు, పుట్టిన రోజు కావొచ్చు దానికి అందమైన రంగులద్దేది మాత్రం కంటి ఇంపైన ప్యూర్ హెవీ సిల్క్ బ్రోకేర్ చీరలు మాత్రమే చేనేత పట్టు బ్రూకేర్ మెరుపుల తో కనికట్టు చెస్తుంటాయి. మెటాలిక్ గోల్డ్, సిల్వర్ దారాలతోనే ఈ నేత కూడా ఎప్పటిదో ప్రాచీన కాలం నుంచి వస్తున్న పట్టు, సిల్క్, కాటన్, బ్రుకేర్ సారీస్ అన్ని విలువైన వెండి జరి తో నేసినవే ఈ సిల్క్ చీరలన్ని మన్నికగా మెత్తగా చూసేందుకు చాల చెక్కగా వుంటాయి. ఇక రాసిల్క్ చీర లన్ని ఈ మోటిఫ్ డిజైన్లు కలుపుకుని ఒక పండుగ ప్రత్యేకత ను తీసుకు వస్తాయి.

    ఫ్యాషన్ మెరుపుల మోటిఫ్

    ఒక ప్రత్యేక సందర్భం అది క్రిస్ట్ మస్ కావొచ్చు, న్యూ ఇయర్ కావొచ్చు, పుట్టిన రోజు కావొచ్చు దానికి అందమైన రంగులద్దేది మాత్రం కంటి ఇంపైన ప్యూర్…

  • ఎప్పుడో పండగో ప్రత్యేక సందర్భమో వస్తే పరికిణీలు ఓణీలు బంగారు నగలకు ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి రోజువారీ డ్రెస్ ల విషయానికొస్తే ఆధునిక స్కర్టులకే ఓటేస్తారు. పోనీ ఇదేమైనా హాటెస్ట్ ఫ్యాషన్ కాదు. పరికిణీ కాస్త పొట్టి చేస్తే స్కర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మార్కెట్ లో లేస్ నెట్టెడ్ వస్త్ర శ్రేణి తోకుట్టిన ప్లేయిన్ తరహావి. పువ్వుల ప్రింట్లు ఎక్కువ కుచ్చులతో వున్నవీ అమ్మాయిలు ఎంపిక చేసుకుంటున్నారు. ఎత్తుగా కనిపించాలనుకున్న కళ్ళు కనిపిస్తేనే బావుంటుందనుకున్న స్కర్ట్ సరైన ఎంపిక. ఈ ఆధునిక పరికిణీల వెరైటీలు ఒకసారి చూసేయండి

    స్కర్ట్ అయిపోయిన పరికిణీ

    ఎప్పుడో పండగో ప్రత్యేక సందర్భమో వస్తే పరికిణీలు ఓణీలు బంగారు నగలకు ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి రోజువారీ డ్రెస్ ల విషయానికొస్తే ఆధునిక స్కర్టులకే ఓటేస్తారు. పోనీ…

  • కొన్ని మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రియులు వెంటనే పసి గట్టేస్తారు కూడా. మరి కొడాస్ ఈ సంవత్సరపు బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఆమె రాసిన 'ది లైఫ్ చేంజింగ్ మాజిక్ ఆఫ్ టైడింగ్ అఫ్' ఇప్పటికే 35 బాషలలో 30 లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. బహుషా కొత్త సంవత్సరంలో కూడా ఈ అమ్మకాలు ఇలాగే కొనసాగ వచ్చు అని జీవితం మొత్తం ఒత్తిడి లేకుండా జీవించ గలిగే స్ట్రాటజీ ఈ పుస్తకం. పెర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలకు ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతుంది. మనం తెలుగు అనువాదాలు చదవాల్సిందే.

    ఈ ఏటి బెస్ట్ సెల్లర్ ‘ది లైఫ్ చేంజింగ్’

    కొన్ని మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రియులు వెంటనే పసి గట్టేస్తారు కూడా. మరి కొడాస్ ఈ సంవత్సరపు బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఆమె రాసిన…

  • అడ్వార్టైజ్మెంట్స్ చూసో అలవాటుగానో సౌందర్య ఉత్పత్తులను కొంటారు. వాటిని ఎంత మోతాదు లో వాడాలో రాసివుండదు కనుక తోచినంత రాస్తూ వుంటారు. ఈ ఉత్పత్తి ఈ మోతాదులో రాసుకుంటే ఫలితం ఉంటుందో ఎలా ఉపయోగించాలి. అప్పుడే సరైన ఫలితమ్ కనిపిస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసే క్లీన్సర్ ని రెండు బఠాణీ గింజల పరిమాణంలో తీసుకోవాలి. అందులో దూది ముంచి రాస్తే ముఖం పైన తేలికగా పరుచుకునేంతగా సరిపోతుంది. మిలిగిలినది మీద భాఫానికి సరిపోతుంది. సీరమ్ లేదా చర్మ చికిత్స కు వాడే క్రీములు వేలిపైకి తీసుకుని ముఖానికి ఎక్కడ అవసరమో అక్కడే రాయాలి. తక్కువే రాస్తే మంచిది. మొహం మొత్తం పరుచుకోకుండా చూడాలి. మృతకణాలను తొలగించే పూతైతే అందులో రసాయనాలు ఉంటాయి కనుక వేలితో చాలా తక్కువ పరిమాణంలో తీసుకుని వారానికి ఒక్కసారి మాత్రమే రాయాలి. అదే సహజమైన పదార్ధాలతో చేసిన దైతే వారానికి మూడు సార్లు రాసినా నష్టం లేదు. దేనినెంత వాడాలో తెలుసుకుంటే ఉపయోగం.

    అవసరాన్ని మించి వాడితే నష్టం

    అడ్వార్టైజ్మెంట్స్ చూసో  అలవాటుగానో సౌందర్య ఉత్పత్తులను కొంటారు. వాటిని ఎంత మోతాదు లో వాడాలో రాసివుండదు కనుక తోచినంత రాస్తూ వుంటారు. ఈ ఉత్పత్తి ఈ మోతాదులో…

  • గురుదేవోభవ అన్నారు పెద్దలు. దీన్ని ప్రపంచ సుందరి కూడా మనసారా తీసుకుంది. బచ్చన్ ల కోడలు ఐశ్వర్యా రాయి తన గురువు లతా సురేంద్ర కనిపించగానే కృతజ్ఞతతో చేతులు జోడించి పాదాలకు నమస్కారం చేసి తన వినయాన్ని చాటుకుంది. వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ డాన్స్ ముంబై లోని సహారా స్టార్ లో జరిగింది. లతా సురేంద్ర ప్రఖ్యాత నాట్యగురువు. ఆమె శిష్యులు ఎంతో మంది దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు పొందినవాళ్లు ఐశ్వర్య తాను రెండో తరగతి నుంచి ఏడో తరగతి చదివే వరకు లత దగ్గర డాన్స్ నేర్చుకుంది. వేదిక పైన గురువు లతా కనిపించగానే ఐశ్వర్య పట్టలేని సంతోషంతో పొంగిపోయింది. గురువు పాదాలకు నమస్కారం పెట్టగానే ఆహ్వానితులందరూ ఒక్కసారి లేచి నిలబడి తమ గౌరవం ప్రకటించారు. అందనంత ఎత్తులో వుండేది గురుస్థానం ఐశ్వర్య వంటి సెలబ్రెటీ గురువు కనిపించాగానే ఆమెను కౌగలించుకుని నమస్కరించటం అది ఐశ్వర్య సంస్కారం లతా అదృష్టం.

    ఇది కళాకారుల అపూర్వ సమ్మేళనం

    గురుదేవోభవ అన్నారు పెద్దలు. దీన్ని ప్రపంచ సుందరి కూడా మనసారా తీసుకుంది. బచ్చన్ ల కోడలు ఐశ్వర్యా రాయి తన గురువు లతా సురేంద్ర కనిపించగానే కృతజ్ఞతతో …

  • సాధారణంగా మనింట్లో మనకి పనికి రాని వస్తువులుంటే ఇంట్లో అడ్డంగా ఎందుకు అనుకుని పారేస్తాం. కానీ అలాంటి పనికి రాని చెత్తను కూడా పనికొచ్చే కళాఖండాలను చేస్తారు ఇంకొందరు. అవి పర్యాటక ప్రదేశాలైతే ఎలా వుంటుందీ ? ఎల్మార్ లాంగ్ అనే వ్యక్తికి పనికి రాని వస్తువులు సేకరించే అలవాటుంది, వాళ్ళ నాన్న కూడా ఇతనితో కలిసి ఎన్నో వస్తువులు సేకరించార. తండ్రి చనిపోయాడు . ఎల్మార్ చుట్టూ ఎన్నో పనికిరాని ఇనుప వస్తువులు సీసాలు బోలెడన్ని పోగుపడి వున్నాయి. బాగా ఆలోచించి ఒక కడ్డీ కి ఎన్నో సీసాలు అతికించి చూసాడు. ఎండలో ఎన్నో రంగులతో ఆ సీసాల చెట్టు మెరుస్తోంది. ఇంకంతే సేకరించిన సీసాలకు వందలాది సీసాల చెట్లు తయారు చేసాడు. వాటికీ బాటిల్ ట్రీరంచ్ అని పేరు పెట్టాడు. ఈ చెట్ల అందం చూడాలంటే కాలిఫోర్నియా లోని మోజావే కౌంటీ కి వెళ్ళాలి. ఈ ఇమేజెస్ అన్నీ సరదాగా చూడండి. అన్నిట్లో ఈ సీసాచెట్లని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారట.

    అందమైన సీసాల చెట్లు

    సాధారణంగా మనింట్లో మనకి పనికి రాని వస్తువులుంటే ఇంట్లో అడ్డంగా ఎందుకు అనుకుని పారేస్తాం. కానీ అలాంటి పనికి రాని చెత్తను కూడా పనికొచ్చే కళాఖండాలను చేస్తారు…

  • ఉద్యోగ జీవితం ఎప్పుడూ సవాళ్ల మయమే. ఎంతోమంది సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి మన కెరీర్ పైన కూడా ప్రభావం చూపెడతాయి. కానీ కొంత జాగ్రత్తతో తెలివిగా మెలిగితే ఉద్యోగ సోపానాలు తేలికగా ఎక్కేయచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలిసి వచ్చినప్పుడు కొత్త పని చేయవలిసివచ్చినప్పుడు ఎప్పుడు సహోద్యోగ సలహాలు తీసుకోకూడదు. మన ఉద్యోగం పట్ల మన బాధ్యత పట్ల మనకే ఒక స్పష్టత ఉండాలి. ఉద్యోగంలో చేరగానే అక్కడ నియమ నిబంధనలు తెలియకపోవచ్చు. సంస్థ పెద్దవో చిన్నదో దానికి పరిధులు నియమాలు ఉంటాయి వాటిని తెలుసుకుని అర్ధం చేసుకుని ఉద్యోగంలో ఇమిడిపోయే ప్రయత్నం చేయాలి. అన్నింటికంటే ముఖ్య విషయం ధైర్యం. చాలా మంది అమ్మాయిలు స్కూల్ లాగా ఆఫీసుల్లో కూడా వెనక ఉండేందుకు సీనియర్లు ఉన్నతాధికారుల ముందు నోరు విప్పకుండా ఉండేందుకే ప్రయత్నిస్తారు. కానీ ఉద్యోగ జీవితం ఒక భవిష్యత్తు. తెలివి తేటలు నిరూపించుకుని ముందుకువెళ్ళే రాజమార్గం. ఎప్పుడూ ముందే ఉండాలి. మిమల్ని మీరే ఆవిష్కారించుకోవాలి. అప్పుడే అద్భుతమైన కెరీర్ దక్కుతుంది.

    ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉండాలి

    ఉద్యోగ జీవితం  ఎప్పుడూ  సవాళ్ల మయమే. ఎంతోమంది సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి మన కెరీర్ పైన కూడా ప్రభావం చూపెడతాయి.…

  • ఏడడుగులబంధం కోసం ఆచితూచి అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక మ్యారేజ్ వెబ్సైట్ సర్వేలో తేలింది. ఇందులో 6000 మంది వినియోగదారులు అభిప్రాయాలూ తీసుకున్నారు. ఆడపిల్లల అభిప్రాయాలను తీసుకుంటే ప్రతి ఇద్దరు ఆడపిల్లల్లో ఒకళ్ళు ఉమ్మడి కుటుంబాలకు చెందిన మగవాళ్ళని పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారు. 60 శాతం మంది అమ్మాయిలకు కులం గురించి పట్టింపే లేదు. ప్రతి పదిమంది ఆడపిల్లల్లో ఆరుగురు యువతులు చూడచక్కని వాళ్ళని ఎంచుకోకుండా వాళ్లే ప్రొఫైల్స్ చూస్తున్నారు. 40 శాతం మంది అమ్మాయిలు వాళ్ళ జీవిత భాగస్వాములను వాళ్లే ఎన్నుకుంటున్నారు. తమ గురించి చెప్పటంలో ఎదుటివాళ్ళ గురించి తెలుసుకోవడంలో అమ్మాయిలే మాట కలుపుతున్నారు. ముఖ్యమైన మాట 85 శాతం మహిళలు కనీసం బ్యాచిలర్ డిగ్రీ అన్నా ఉంటే తప్ప డబ్బు రూపం వున్నా వద్దులే అంటున్నారు.

    విద్యావంతులైతేనే సరే అంటున్నారు

    ఏడడుగులబంధం కోసం ఆచితూచి  అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక…

  • కోడి గుడ్డును డాక్టర్ల నడిగితే పోషకాల మాయం అంటున్నారు. అదే ఫరా సయిడ్స్ ని అడిగితే అందమైన కళారూపం అంటుంది. అమెరికాలోని స్థిరపడ్డ భరతీయిరాలు ఈమె. ప్రముఖ ఎగ్గ్ ఆర్టిస్ట్. ఆమె ఈ గుడ్డు తో కళాకృతులు తాయారు చేస్తుంది. ఆమెకు గుడ్డును చుస్తే చాలట మంచి ఐడియాలు వచ్చేస్తాయి. రకరకాల గుడ్లు సేకరించి వాటి లోపల భాగాన్ని తీసేసి డొల్ల గా మారిన గుడ్డు తో అందమైన కళాకృతులు చేసేస్తుంది. అతి సున్నితం గా వుండే గుడ్డు పెంకు పైన చిత్రాలు వేయడం, వాటికి అలంకరణ చేయడం చాలా కష్టమైన పని. కానీ ఫరా సయిద్ ఈ పనులన్నీ చాలా తేలికగా చేయగలదు. ఈ అందమైన గుడ్డు బొమ్మల డెకోరేషన్ పీసెస్ గా చాలా బాగుంటాయి. ఆమె ఎగ్గ్ కలక్షన్స్ అన్ని చూడాలంటే ఆమె పెర్స్ నల్ వెబ్ సైట్ www.eggdocs.com లో చూడోచ్చు. స్త్రీల కోసం ఆమె ఎన్నో చారిటి ఈవెంట్స్ క్రియేట్ చేస్తుంది.

    ఈ బొమ్మలన్నీ వెరీ ‘గుడ్డు’

    కోడి గుడ్డును డాక్టర్ల నడిగితే పోషకాల మాయం అంటున్నారు. అదే ఫరా  సయిడ్స్ ని అడిగితే అందమైన కళారూపం అంటుంది. అమెరికాలోని స్థిరపడ్డ భరతీయిరాలు ఈమె. ప్రముఖ…

  • కళాకారులు నుతనత్వాన్ని ప్రవేస పెట్టాలని చూస్తారు. అందరు పాడిన పాటే మనం పాడితే తప్పేం ఉంది. ఆస్ట్రియన్ మ్యుసికల్ గ్రూప్ వెజిటబుల్ అర్కిస్త్రా తో సంగీత ప్రియులను అలరించేందుకు ముందుకొచ్చారు. పది మంది గాయకులు, ఒక కుక్, ఒక సౌండ్ టేక్నీషియన్ ఉంటారీ గ్రూప్ లో, క్యారెట్, ముల్లంగి పిల్లన గ్రోవి, బీరకాయ, క్యాప్సికమ్ తో ట్రంపెట్ ఇలాగే కూరగాయలతో సంగీత పరికరాలు అప్పటికి అప్పుడు తాయారు చేస్తారు. తమ అనుభవం తో ఒక అద్భుతమైన సంగీత కచేరి ఇస్తారు. కేవలం వినుల విందైన సంగీతాన్ని ఆస్వాదించడమే కాదు సంగీత వాయిద్యాలను తాయారు చేసే క్రమంలో మిగిలిన కురగాయలతో షో కు వచ్చిన వాళ్ళకు మంచి విందు కూడా ఇస్తారు. ఈ పసందైన వినుల విందు కార్యక్రమానికి ఎంతో ప్రోత్సాహం. ఎంతో మంది అభిమానులు ఇప్పటికే ఎన్నో రికార్డులు రిలీజ్ చేసారు కూడా.

    ఇది పసందైన పాటల విందు భోజనం

    కళాకారులు నుతనత్వాన్ని ప్రవేస పెట్టాలని చూస్తారు. అందరు పాడిన పాటే మనం పాడితే తప్పేం ఉంది. ఆస్ట్రియన్ మ్యుసికల్ గ్రూప్ వెజిటబుల్ అర్కిస్త్రా తో సంగీత ప్రియులను…

  • Christian Dior కలక్షన్స్ లో ఒక తెల్లటి టీ షర్టుల పైన వేసిన నినాదం ఇవ్వాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. We should all be fiminists. ఈ నినాదం ఎంతో మంది స్త్రీలను ఆకట్టు కుని ట్రెండ్ సెట్టర్ అయింది. ఇవాల్టి ఫ్యాషన్ ప్రపంచపు బెస్ట్ టీ షర్టు ఇది. అమ్మాయిల మనస్సు దోచుకుంటుంది అని వేరే చెప్పాలా? ఇదే పేరు తో నైజీరియన్ రైటర్ Chimamanda Ngozi Adichie లో రాసిన నవల కూడా బెస్ట్ సెల్లర్స్ లో ఒకటి. సొసైటీలో మార్పు వస్తేనే సమానత్వం సాధ్యం అంటుంది రచయిత్రి Adichie.

    ఫ్యాషన్ ప్రపంచపు బెస్ట్ నినాదం

    Christian Dior కలక్షన్స్ లో ఒక తెల్లటి టీ షర్టుల పైన వేసిన నినాదం ఇవ్వాళ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. We should all be fiminists. ఈ…

  • ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు కలిపి ఎండుఫలాలు వాల్నట్స్ బాదం పలుకులు కలిపి తింటే రోజంతా ఉత్సాహమే. ఓట్స్ ఎంతో మంచివి. బరువు తగ్గటమే కాదు ఆరోగ్యానికీ మంచివే. వెన్న లేని పాలతో తింటే కేలరీలు తగ్గుతాయి. అరటి పండ్లు ముక్కలు. ఎండు ద్రాక్ష పండ్లు నానబెట్టి పొట్టు తీసిన బాదం గింజలు తింటే బలానికి బలం. ఆరోగ్యం రాగి జావ ఎంతో మంచిది. ఇనుము కాల్షియం ఎక్కువ. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తహీనత దూరం అవుతుంది. బెల్లం యాలకులు వెన్న లేని పాలు బాగా మగ్గిన పండ్లు కలిపి తీసుకుంటూ త్వరగా ఆకలివేయకుండా పైగా ఎంతో బలం కూడా.

    బరువు తగ్గించి శక్తి నిచ్చే అల్పాహారం

    ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు…

  • అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లు ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య చాలా తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు వైవాహిక జీవితంలో చాలా సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

    విడాకుల సంఖ్యా తగ్గాలంటే ………!

    అన్నదమ్ములూ  అక్కాచెల్లెళ్లు  ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య …

  • టూ బెడిరూమ్ అపార్ట్మెంట్ ఇల్లు తీసుకున్న వంటిల్లు చిన్నది గానే ఉంటుంది. గిన్నెలు చెంబులు కత్తులు కప్పులు గిన్నెలు డబ్బాలు అనేకం సామాన్లుంటాయి. ఇన్ని సామాన్లు పట్టించాలంటే సరేవాళ్లకు ఎంత యాతన. ఈ పట్టణపు వంటింటి సమస్య ను తీర్చేందుకు వచ్చాయి. మాగ్నటిక్ కిచెన్ గాడ్జెట్స్. వంటింటి సామానంతా పెట్టుకునే స్థలమో అల్మరానో లేకుండా ఖాళీగా వుండే గోడకు క్యాబినెట్లకు అతికించుకునేందుకు ఇవి అవకాశం కల్పిస్తాయి. గిన్నెలో నాన్ స్టిక్ సామాన్లు పెనాలు అన్న గోడకే అంటుకుపోతాయి. ఈ మ్యాజిక్ వాల్ పానెల్ ని ఇంట్లో ఈ గోడకైనా అతికించవచ్చు,. ఇందులో వుండే బలమైన అయస్కాంతం వల్ల బరువైనవి కూడా గోడకి అతుక్కుని పోతాయి . వంటింటి బాల్కనీ గోడలకు చక్కగా చిన్న చిన్న మొక్కలకు పెంచుకునేందుకు వీలుగా చేసిన అయస్కాంతపు ప్యాన్లు వున్నాయి. మాగ్నెటిక్ స్పైస్ రాక్స్ అయితే పోపుల డబ్బాలన్నీ దానికి అతికించవచ్చు. ఇదంతా మాగ్నెటిక్ పవర్ మాయాజాలం ఇంతెందుకు వంటింట్లో ఒక్క ఖాళీ గోడఉంటే అయస్కాంత అరలూ స్ట్రెస్ రాక్స్ పెట్టేస్తే చాలు. ఎంత సామానైనా గోడెక్కిస్తుంది.

    సామాన్లన్నీ అతుక్కుపోతాయి

    టూ బెడిరూమ్  అపార్ట్మెంట్ ఇల్లు తీసుకున్న వంటిల్లు చిన్నది గానే ఉంటుంది. గిన్నెలు చెంబులు కత్తులు కప్పులు గిన్నెలు డబ్బాలు అనేకం సామాన్లుంటాయి. ఇన్ని సామాన్లు పట్టించాలంటే…

  • ఆమె ఒక భారీ కామెడీ క్వీన్. పొట్టిగా లావుగా వుండే యూఈమె పేరు భార్తీ సింగ్. ఈమెతో సల్మాన్ ఖాన్ ,ప్రభు దేవా స్టెప్పు లేస్తారు. మాధురీ దీక్షిత్ ,కరీనా కపూర్ లు యూఆర్ గ్రేట్ అనేసారు. ఈమె మన దేశపు ఏకైక సెలబ్రెటీ మహిళా కమెడియన్. పంజాబ్ లోని అమృతసర్ కు చెందిన భార్తీ స్టార్ వన్ లో ప్రసారమైన 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షో ' తో వెలుగులోకి వచ్చింది. భార్తీ తన మిమిక్రీ తో జోకులతో యువత టీవీ ప్రేక్షకులను నవ్వించింది. ఇండియా (హౌస్ ) గాట్ టాలెంట్ భార్తీ సింగ్ కు పేరు తెస్తే కామెడీ సర్కస్ మరింత పాప్యులర్ చేసింది. 'ఝలక్ దిల్ లాఓ ' డాన్స్ షోలో సన్నగా మెరుపు. తీగల్లా ఉన్న అమ్మాయిలతో సమానంగా డాన్స్ చేసి అందరి దృష్టి ఆకర్షించింది. సినిమాల్లో కామెడీ కన్నా ఈమె చేసే లైవ్ కామెడీలు చాలా కష్టం. దీనికెంతో తెలివితేటలు స్పాంటేనియస్ గా మాట్లాడటం సమయానికి తగ్గట్లు మాట్లాడటం ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా జోకులు పేల్చటం. అదొక పెద్ద ఆర్ట్ ఇప్పుడు భార్తీ బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.

    సెలబ్రెటీ మహిళా కమెడియన్ భార్తీ

    ఆమె ఒక భారీ కామెడీ క్వీన్. పొట్టిగా లావుగా వుండే యూఈమె పేరు భార్తీ సింగ్. ఈమెతో సల్మాన్ ఖాన్ ,ప్రభు దేవా స్టెప్పు లేస్తారు. మాధురీ…

  • కన్నబిడ్డ పై అనురాగం చూపించే విషయంలో అమ్మస్థానంలో ఉన్న ఎవ్వరైనా ఒకటే. బాలీవుడ్ నటి రాణీముఖర్జీ తన ముద్దుల కూతురు అదిరా తొలిపుట్టినరోజున తన ప్రేమనంతా నింపిన ఒక ఉత్తరం రాసింది. అదిరా నువ్వంటే నాకెంతో ప్రేమ కాసేపు కనిపించక పోతే శ్వాస ఆగిపోతుందా అనిపిస్తుంది. ప్రతి నిమిషం నీ ధ్యాసే. అందరూ నాలాగే ఉంటారా? తమ పిలల్ల కోసం అనుక్షణం ఆందళోన చెందే అమ్మలందరికీ పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది. నువ్వు పుట్టాక నాలో సహనం క్షమా గుణం పెరిగాయి. అంతరంగంలోకి చూసుకుంటే నేనెంతో మారిపోయాననిపిస్తోంది. ఇందుకు కారణం నువ్వే అదిరా. క్రమశిక్షణ తో ధైర్యంగా పెరగాలి. నిన్ను చూసి నారహో పాటు ఈ ప్రపంచం గర్వించాలి. నీ మనసుకి నచ్చిందే నువ్వు చేయి. అనుక్షణం ఆనందంగా జీవించు. ప్రేమతో మీ అమ్మ రాణీ ముఖర్జీ చోప్రా. ఇదీ ఉత్తరం. ఈ పాపాయిని కన్నతల్లైనా ఇంతకంటే తన బిడ్డను కోరేదీ ఆశీర్వదించేదీ ఉండదు.

    అదిరా ….. నువ్వు నన్ను మార్చేసావు

    కన్నబిడ్డ పై అనురాగం చూపించే విషయంలో అమ్మస్థానంలో ఉన్న ఎవ్వరైనా ఒకటే. బాలీవుడ్ నటి రాణీముఖర్జీ తన ముద్దుల కూతురు అదిరా  తొలిపుట్టినరోజున తన ప్రేమనంతా  నింపిన…

  • ఈ మధ్య అందరూ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులతో కొత్త నోట్ల కోసం బ్యాంకుల ఎటిఎం లకు వెళుతున్నారు. కార్డుల వినియోగంలో ఎటిఎం ల వాడకంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎటిఎం లకు వెళ్తుంటే మురికిపట్టి ఎన్నడూ వాడనట్లు అనిపిస్తున్న జోలికి వెళ్ళకూడదు. అవి బహుశా పనిచేయని ఎటిఎం లు కావచ్చు. లావాదేవీలు పూర్తీ కావాలంటే పిన్ నెంబర్ రెండు సార్లు ఎంటర్ చేయమని అడుగుతున్నా తేడా ఎదో ఉందని గమనించండి. సొంత బ్యాంక్ ఎటిఎం లు వాడటం మంచిది. మన అకౌంట్ ఉన్న బ్యాంకులైతే మోసాలకు తావుండదు. ఇక ఇ -షాపింగ్ కోసం సెక్యూర్ సాకెట్స్ లేయర్ S.S.L సర్టిఫైడ్ సైట్లనే వాడాలి. స్మార్ట్ ఫోన్ లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని వల్ల మాల్వేర్ అరికట్టటం ఈజీ అవుతుంది. పబ్లిక్ వైఫై నెటవర్క్ లైన్ డబ్బు లావాదేవీలు జరిపినా నష్టమే. పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చితే ఐడెంటిటీ థెఫ్ట్ కు అవకాశం పోతుంది.

    కార్డులో వాడుతుంటే జాగ్రత్త

    ఈ మధ్య అందరూ  క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులతో కొత్త నోట్ల కోసం బ్యాంకుల ఎటిఎం లకు వెళుతున్నారు. కార్డుల వినియోగంలో ఎటిఎం ల వాడకంలో కొన్ని…

  • ఈ సర్వే ఎప్పుడూ తారలు మరీనా మారని మహిళల జీవిత చిత్రంలా కనిపిస్తూవుంటాయి. నాలుగు దేశాల్లో చేసిన ఒక సర్వే లో మహిళలు 19 సంవత్సరాలలోపు నుంచే ఎన్నో రకాల వేధింపులకు లోనవుతున్నారని తేలింది. మన దేశంలో పదిమంది ఆడవాళ్ళలో నలుగురు ఇలాంటి హింసలకు గురవుతున్నారు. గత నెలలో 73 శాతం మంది మహిళలు ఎదో ఒక రూపంలో హింస లేదా వేధింపులు ఎదుర్కొన్నారు. గత నెలలో శరీరం పై తగలరాని చోట తమను తడిమారని ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు చెప్పారు మన దేశంలో ఆరు శాతం మంది ఆడపిల్లలు పది సంవత్సరాలు నిండకుండా వేధింపులు హింసకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంటున్న పదేళ్ల లోపు ఆడపిల్లలు బ్రెజిల్ లో 16 శాతం బ్రిటన్ లో 12 శాతం థాయిలాండ్ లో ఎనిమిది శాతంగా ఉన్నారు. వేధింపులకు గురికాకుండా తగిన రక్షణ చర్యలు అనుసరిస్తున్నట్లు ఇండియా లోని 82 శాతం స్త్రీలు చెప్పారు. 35 శాతం పార్కులు లైట్లు లేని చోట్లకు వెళ్ళటం తగ్గించారు. 36 శాతం నిత్యం తాము ప్రయాణించే రూట్ మార్చారు. రేప్ అలారం మిరియాల పొడి లాంటివి రక్షణగా వాడుతున్నారు.

    19 ఏళ్లకే వేధింపులు

    ఈ సర్వే  ఎప్పుడూ తారలు మరీనా మారని మహిళల జీవిత చిత్రంలా కనిపిస్తూవుంటాయి. నాలుగు దేశాల్లో చేసిన ఒక సర్వే లో మహిళలు 19 సంవత్సరాలలోపు నుంచే…

  • ప్రముఖ డిజైనర్లు నవ్యసాలి ముఖర్జీ, రిధిమెహ్రా, అనామిక ఖన్నా వంటి వాళ్ళు ప్రత్యేకమైన పని తనంతో పరిచయం చేసిన కేఫ్ ఇవ్వాల్టి యూత్ ట్రెండ్. చేతులు లేకుండా బుజాలను కప్పుతూ గౌన్లు, మాక్సిలు, క్రేప్ టాప్ లు పలజోల పైకి ఈ క్రేప్ తిరుగు లేని ఫ్యాషన్. ఫారిన్ కాంట్రాస్ లో పెళ్లి గౌన్లు సాయంత్రపు పర్తీల లో వేసుకునే దుస్తులకు జతగా ఫ్యాషన్ గా వేసుకునే కేప్ అక్కడ నుంచి ప్రయాణం చేసి వచ్చి మన దేశం లో వాలి పోయింది. చీరల పైకి నేట్టేడ్ తరహావి బాగుంటాయి. కంచి పట్టు పరికిణీలకు నెట్, ఎంబ్రాయిడరీ పని తనం వున్న రాసిల్క్ కంచి పట్టు రకాలకు బెనరస్ రకాలు బాగుంటాయి. జీన్స్ సాదా అనార్కలి డ్రేస్సులు కోల్డ్ షాల్డర్ కేప్ టాప్స్ వస్తున్నాయి. అటు మోడ్రన్ ఇటు సాంప్రదాయంగానూ చెక్కని రంగులు ఎంబ్రాయిడరీ, కట్ వర్క్ పనితనం వున్నా కేప్ లో చాలా బాగుంటాయి.

    ఏ రకం డ్రెస్ కైనా నిండుతనం కేప్

    ప్రముఖ డిజైనర్లు నవ్యసాలి ముఖర్జీ, రిధిమెహ్రా, అనామిక ఖన్నా వంటి వాళ్ళు ప్రత్యేకమైన పని తనంతో పరిచయం చేసిన కేఫ్ ఇవ్వాల్టి యూత్ ట్రెండ్. చేతులు లేకుండా…