• పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా చేతులు, మొహం, కాళ్ళు కడుక్కొంటాం. నిపుణులు ఏం చెబుతున్నారంటే ముందస్తుగా చేతులు కడుక్కోండి. చేతులు శుభ్రంగా లేకపోతే ఆ చేతులకున్న బాక్టీరియా, ఇతర క్రిములు చర్మం లోకి వెళ్ళిపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. మేకప్ వేసుకొని వుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోన్నకే ముఖం కడుక్కోవాలి. మేకప్ ను క్లెన్సర్ తో తొలగించుకొని ఫేస్ వాష్ తో కడగాలి. ముఖం కడుక్కోనేందుకు వేడి నీళ్ళు వాడకూడదు. చర్మం పొడిబారిపోతుంది. ముఖానికి చన్నీళ్ళు వాడాలి. చలికాలంలో చర్మం అతిగా రుద్ది కడిగేయోద్దు. పొడిబారిన చర్మాన్ని స్క్రబ్ లు ఇబ్బంది పెడతాయి. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ వాడవచ్చు. పొడిచర్మం ఉన్నవాళ్ళు మొహానికి కడుక్కున్న వెంటనే మాయిశ్చరైజర్ కాస్త కొబ్బరినూనె అప్లయ్ చేయాలి లేదంటే మొహం ఇంకా పొడిగా అయిపొయింది.

    మొహం అస్తమానం కడిగినా నష్టమే

    పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా…

  • నీహారికా, ఏది సాధించాలన్నా ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేయాలి. కాస్త తేలిగ్గా ఏదైనా వుంటే అన్నావు. చెప్పు నీ ప్రశ్నలో సమాధానం వుందమ్మాయీ.. ‘ సాధించాలంటే .... కృషి’ అంతే కదా. ఇప్పుడు చూడు రెజ్లింగ్ ఛాంపియన్ గీతా ఫోగట్ ఎంత కృషి చేసి వుంటుందో, దంగల్ సినిమాలో ప్రత్యక్షంగా చూశావు. ఒక సముద్రం ఈదాలంటే ఎంత కష్టపడాలో, ఒక క్రికెట్ లో గెలవాలంటే ఎన్ని త్యాగాలు చేయాలో వాళ్ళ వాళ్ళ ఆత్మ కథలన్నీ పుస్తకాల రూపంలో వచ్చాయి. నీ దగ్గర ఉన్నాయి కూడా. బహుశా ఇవన్నీ చూసి ఇలా అన్నావు మనం పెద్ద టార్గెట్స్ కోసం ప్రయత్నించకపోతే పరిమితుల్లోనే బతకాల్సి వస్తుంది. పెద్ద కలలతో జీవితాన్ని ఆవిష్కరించుకోవాలి నీ దృష్టి కోణం మారాలి. బద్దకస్తులదే సులభ మార్గ అన్వేషణ. మనం ఎంత వరకూ ఆలోచిస్తామో అంత ఎత్తే ఉంటాం. మన లోలోపలి ఆలోచనలు మన ఎదుగుదలని నిరోధం చేస్తాయి. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి నీ ఆలోచనల్లో ఉన్న పరిమితి దాటితే, ఎన్నేళ్ళ పాటు... అన్న నిరాశను పక్కన పెడితే.... నువ్వు ఒక చక్కని భవిష్యత్తుని నిర్మిన్చుకోగలవు. ఒక్క రోజు సౌకర్యవంతంగా వుండకపోతేనే భరించలేవు నువ్వు జీవితం మొత్తం సుఖంగా ఉండాలంటే, దాన్ని ఎంత బాగా నిర్మించుకోవాలి. నువ్వు ఓభవనంలో నివసించాలంటే అది కట్టుకోవలసింది నువ్వే.

    నీ జీవితం నిర్మించుకొనేది నువ్వే

    నీహారికా, ఏది సాధించాలన్నా ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేయాలి. కాస్త తేలిగ్గా ఏదైనా వుంటే అన్నావు. చెప్పు నీ ప్రశ్నలో సమాధానం వుందమ్మాయీ.. ‘ సాధించాలంటే…

  • మదర్ ధెరిసా స్ఫూర్తి తో సేవా దిశగా అడుగులు వేసిన అనురాధ కొయిరాలా నటి మనీషా కొయిరాలా మేనత్త 1993 లో మైటీ నేపాల్ పేరుతో స్వచ్చంధ సంస్థ స్థాపించి భారత సరిహద్దు నేపాల్ లో వేశ్య వృత్తి లో వున్న మహిళల్ని అక్రమ రవాణాకు గురవుతున్న వారిని కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇరవైనాలుగేళ్ళుగా 12 వేల మంది అమ్మాయిలను కాపాడి కొత్త జీవితాలను ప్రసాదించారు. ఆమె కృషిని గుర్తించిన నేపాల్ ప్రభుత్వం సెప్టెంబర్ 5,వ తేదీని అక్రమ రవాణా వ్యతిరేక దినం గా ప్రకటించింది.

    సేవా దిశలో అనురాధా కొయిరాలా

    మదర్ ధెరిసా స్ఫూర్తి తో సేవా దిశగా అడుగులు వేసిన అనురాధ కొయిరాలా నటి మనీషా కొయిరాలా మేనత్త 1993 లో మైటీ నేపాల్ పేరుతో స్వచ్చంధ…

  • 2016 పారా ఒలంపిక్ క్రీడల్లో షార్ట్ ఫుట్ విభాగంలో రాజిత పతకాన్ని అందుకున్న మొదటి క్రీడాకారిణి దీపామాలిక్. అనుకోని ప్రమాదంలో వెన్ను పూస దెబ్బ తిన్నా, చెక్రాల కుర్చీకే పరిమితం అయినా, బ్యూటీ క్వీన్ గా సామాజిక కార్యకర్త గా తనను తాను మలుచుకుని పారా ఒలంపిక్ పతకానికి ముందే ఎన్నో సహస క్రీడల్లో పతకాలు అందుకుంది దీపా మాలిక్. హిమాలయాలకు కార్ రేస్ లో పరుగులు తీసిన పరా ప్లీజిన్ దీపా.

    సడలని సమరోత్సాహం దీపామాలిక్

    2016 పారా ఒలంపిక్ క్రీడల్లో షార్ట్ ఫుట్ విభాగంలో రాజిత పతకాన్ని అందుకున్న మొదటి క్రీడాకారిణి దీపామాలిక్. అనుకోని ప్రమాదంలో వెన్ను పూస దెబ్బ తిన్నా, చెక్రాల…

  • క్రిందటి సంవత్సరం రియో ఒలింపిక్స్ కి ఎంపికైన క్రీడాకారిణి దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ లో మన దేశానికి పతకం తేలేక పాయినా ప్రోడనోవా విన్యాసం చేసి అందరిని ఆశర్యం లో ముంచెత్తారు. ప్రస్తుతం దీపా త్రిపుర విశ్వ విద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో పీ.జీ చేస్తుంది. 2014లో గ్లాస్కో కన్వీనల్స్ లో రాజితం అందుకుని ఈ ఘనత సాధించిన తోలి భారతియురాలిగా రికార్డుకెక్కారు. గత ఏడాది దీప అర్జున్ అవార్డు అందుకున్నారు.

    సాహసానికి నిర్వచనం దీపా కర్మాకర్

    క్రిందటి సంవత్సరం రియో ఒలింపిక్స్ కి ఎంపికైన క్రీడాకారిణి దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ లో మన దేశానికి పతకం తేలేక పాయినా ప్రోడనోవా విన్యాసం…

  • 1960- 80 ల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన స్టార్ నాయిక భారతీ విష్ణు వర్ధన్ ను పద్మ పురస్కారం వరించింది. 1975లో కన్నడ నటుడు విష్ణు వర్ధన్ ను వివాహం చ్సుకున్నారు. నటిగానే కాకుండా గాయని గానూ పేరు తెచ్చుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గానూ ఆమె ఈ పురస్కారం లభించింది.

    విలక్షణ నటి బారతి కి పురస్కారం

    1960- 80 ల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన స్టార్ నాయిక భారతీ విష్ణు వర్ధన్ ను పద్మ పురస్కారం వరించింది. 1975లో…

  • నలభై ఏళ్లకు పైగా తన గానం తో అందరిని అలరించిన అనురాధ పౌడ్వాల్ కు పద్మశ్రీ లభించింది. 16 భాషల్లో వేల గీతాల తో పాటలకు పట్టం కట్టిన అనురాధ ఒక్క హిందీలోనే 5296 పాటలు పాడారు. ఫిలిం ఫేర్ పురస్కారాలు గౌరవ డిలిట్ డిగ్రీ ని పొందారు.

    పాటకు పట్టం కట్టిన అనురాధ కు పురస్కారం

    నలభై ఏళ్లకు పైగా తన గానం తో అందరిని అలరించిన అనురాధ పౌడ్వాల్ కు పద్మశ్రీ  లభించింది. 16 భాషల్లో వేల గీతాల తో పాటలకు పట్టం…

  • 2016 రియో ఒలంపిక్స్ లో భరత్ కు తోలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పద్మశ్రీ పురస్కారానికి ఎన్నికయ్యారు. సంప్రదాయాలకు ఆయువుపట్టు అయిన హరియాణా రాష్ట్రంలోని మోక్రా గ్రామంలో పుట్టిన సాక్షి మల్ల యుర్ధంలో అరి తేరిన తాతగారి స్ఫూర్తి తో రెజ్లర్ అయ్యారు. ఇప్పుడామె ఆ గ్రామానికే కాదు దేశానికే స్ఫూర్తి.

    అభిననదనలు సాక్షి మాలిక్

    2016 రియో ఒలంపిక్స్ లో భరత్ కు తోలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పద్మశ్రీ పురస్కారానికి ఎన్నికయ్యారు. సంప్రదాయాలకు ఆయువుపట్టు అయిన హరియాణా రాష్ట్రంలోని మోక్రా…

  • డెబ్బయ్ సంవత్సరాల మీనాక్షి రాఘవన్ ను కత్తి భామ్మ గారు అని పిలుస్తారు. తండ్రి రాఘవన్ నుంచి ఈ యుద్ద విద్యను సాధన చేసారు మీనాక్షి రాఘవన్. ఈ విద్య తన తో నే అంతరించిపోవడం ఇష్టం లేక యుక్త వయస్సులో వున్నా ఆడపిల్లలకు కాలకియపట్టు విద్యను నేర్పుతూన్నారామె ఈ విద్యలో ఆమెకు తిరుగే లేదు.

    కత్తి భామ్మ కు వందనం

    డెబ్బయ్ సంవత్సరాల మీనాక్షి రాఘవన్ ను కత్తి భామ్మ గారు అని పిలుస్తారు. తండ్రి రాఘవన్ నుంచి ఈ యుద్ద విద్యను సాధన చేసారు మీనాక్షి రాఘవన్.…

  • డాక్టర్ సునీతి సాత్మన్ ను ఎయిడ్స్ డాక్టర్స్ అఫ్ చెన్నై అంటారు. మన దేశంలో మొట్ట మొదటి హెచ్.ఐ.వి రోగి ని గుర్తించింది సునీత. ఎయిడ్స్ పేరు చెపితేనే వణికి పోయే రోజుల్లో ఆ వ్యాధి పై వగాహన కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయ హెచ్.ఐ.వి వాక్సిన్స్ తయారీ సంఘం సభ్యురాలిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె మన మధ్య లేరు.

    ఎయిడ్స్ పై పోరాటం

    డాక్టర్ సునీతి సాత్మన్ ను ఎయిడ్స్ డాక్టర్స్ అఫ్ చెన్నై అంటారు. మన దేశంలో మొట్ట మొదటి  హెచ్.ఐ.వి రోగి ని గుర్తించింది సునీత. ఎయిడ్స్ పేరు…

  • భక్తి యాదవ్ వైద్య రంగంలో నిష్ణాతరాలు 1948 లో వైద్యురాలిగా జీవితం ప్రారంభించారు. ఇండోర్ లో మొదటి ప్రసూతి నిపుణురాలు గా రికార్డు సొంతం చేసుకున్నారు. సహజ ప్రసవం చేయడం లోప్రసిద్ధురాలు. పాతికేళ్ళ క్రితం ప్రభుత్వ వైద్యురాలిగా పదవీ విరమణ చేసాక కూడా సొంతం గా క్లినిక్ ఏర్పాటు చేసి ఇప్పటికీ తొంభై నిండిన వయస్సులోను వైద్యం చేస్తూ కనిపిస్తారు.

    ఉచిత వైద్యానికీ గుర్తింపు

    భక్తి యాదవ్ వైద్య రంగంలో నిష్ణాతరాలు 1948 లో వైద్యురాలిగా జీవితం ప్రారంభించారు. ఇండోర్ లో మొదటి ప్రసూతి నిపుణురాలు గా రికార్డు సొంతం చేసుకున్నారు. సహజ…

  • నీహారికా ,నీకు విసుగొచ్చిన ఈ శకునాలు నమ్మకాలూ చాలా మందికి ఉన్నాయనుకో. కానీ ఇవెలా అర్ధం చేసుకోవాలంటే వేమన పద్యం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ముక్కు వంక చూసి ముక్కురంబు రుదుట విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని నిందించటం సరైన పనేనా అని . ఏదైనా ఒక పని మొదలు పెట్టినపుడు మన ప్రయత్నలోపం లేకుండా ఉండాలి. ఫలితం సరిగ్గా లేకపోతే మనం చేసిన పొరపాటేక్కడో వెతకాలి. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఆలా ఎన్ని సార్లు ప్రయత్నం చేసి సక్సెస్ అందుకోకపోయినా పరాజయం పొందినట్లు కాదు . ఎప్పుడైతే ఆ పరాజయానికి ఇతరుల శకునాలనీ దురదృష్టాన్ని నిందిస్తారు అప్పుడు ఓడిపోయినట్లు శకునాలు ముహుర్తాలనీ నమ్మేవాళ్ళు తమ ప్రయత్న లోపాల్ని ఎలా గుర్తిస్తారు చెప్పు. శని దశ బాగోక కష్టాలొస్తాయని ఎవరైనా అంటే నవ్వొస్తుందా ? రాదా ? మన జీవితంలో కష్టాలకు కారణం మన గమ్యం సరిగ్గా నిర్ణయించుకోకపోవటం కావచ్చు. మన ఉద్యోగం పోవటానికి కారణం మనం ఆ పని సరిగ్గా చేయకపోవటం కావచ్చు. ఏదైనా మన నిర్లక్ష్యం కావచ్చు. మనం కష్టపడకపోవటం కావచ్చు . అంతేగానీ స్వప్నాలు ప్రశ్నలు శకునాలు ముహుర్తాలు కారణం అవుతాయా చెప్పు.

    ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని తిట్టినట్లు

    నీహారికా , నీకు విసుగొచ్చిన  ఈ శకునాలు నమ్మకాలూ చాలా మందికి ఉన్నాయనుకో. కానీ ఇవెలా అర్ధం చేసుకోవాలంటే వేమన పద్యం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ముక్కు…

  • తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని వైద్యులు చెపుతూ వుంటారు. ఇది పూర్వీకుల నుంచి వింటున్నదే. తల్లి తీసుకునే ఆహారంపైనే కడుపులో బిడ్డ జీవితం పర్యంతం ఆరోగ్యాంగా వుంటాడని ఇటీవల పరిశోధన చెపుతోంది. గర్భవతి తగినంత మోతాదులో ఆహారం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు గుండె సంబంధిత సమస్యలు బిడ్డ అకాల వృధాప్యనికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. తల్లి తీసుకునే ఆహారం ద్వారానే బిడ్డకు ఆక్సిజన్ అందుతోంది. తల్లి సరైన ఆహారాం తీసుకోకపోతే బిడ్డకు శ్వాసకోశాలు గుండె పనితీరు స్వయంగా వుండవనీ వీటిని సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొంటారని చెపుతున్నారు. తల్లి ఆహారం పైన బిడ్డ భవిష్యత్తు ఆధార పడి వుంటుందంటున్నారు. బిడ్డ కడుపులో వుండగానే రూపం దిద్దుకునే అవయవాలు ఉంటుందని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.

    బిడ్డ ఆరోగ్యానికి గర్భంలోనే బీజాలు

    తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని వైద్యులు చెపుతూ  వుంటారు. ఇది పూర్వీకుల నుంచి వింటున్నదే. తల్లి తీసుకునే ఆహారంపైనే కడుపులో బిడ్డ జీవితం పర్యంతం…

  • ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఏ పనైనా తేలికే. ఒక్కసారి ఎలాంటి అవసరం ఉన్నా అంతర్జాలం లోకి తొంగిచూస్తే చాలు . వెంటనే సమాధానం దొరికిపోతుంది. నెలనెలా జిమ్ కి వెళితే తీరైన శరీరం సాధించవచ్చు. నిజమే. మరి ఉన్న బడ్జెట్ లో అన్నీ సాధ్యమౌతాయా ? కష్టమే . ఇప్పుడు చాలా చౌకగా దొరికే కొన్ని వస్తువులతో వ్యాయామం జిమ్ కంటే బాగా చేయచ్చు. జంప్ రోప్. ఇది తాడాట. భుజాలు తొడలు కాలికండరాలకు సరైన వ్యాయామం అందుతుంది. అలాగే రెసిస్టెంట్ బ్యాండ్స్ కొన్ని రకాల వ్యాయామాలకు శరీరం అంత తేలికగా ఎటు పడితే వంగి సహకరించదు. అలాంటప్పుడు రెసిస్టెంట్ బ్యాండ్లు ఉపయోగపడతాయి. ఒక తాడు దాన్ని పట్టుకునే పరికరం ఉంటుంది. దీని సాయంతో కష్టమైన స్ట్రెచెస్ ని వ్యాయామాలనీ చాలా సులభంగా చేసుకోవచ్చు. అలాగే డంబెల్స్. మహిళలు ఒక్క కేజీ బరువున్న డంబెల్స్ ఎంచుకుంటే చాలాతేలికగా ఉంటుంది. వీటితో జిమ్ మాదిరి వ్యాయామం ఇంట్లోంచే చేయవచ్చు.

    వీటితో అచ్ఛం జిమ్ కి వెళ్లనట్లే

    ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఏ పనైనా తేలికే. ఒక్కసారి ఎలాంటి అవసరం ఉన్నా అంతర్జాలం లోకి తొంగిచూస్తే చాలు . వెంటనే సమాధానం దొరికిపోతుంది. నెలనెలా జిమ్…

  • జుట్టు వుంటే ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ వుండాలే కానీ సంప్రదాయ పద్ధతుల్లో ఇంట్లోనే కురుల అందాలకు మెరుగులు దిద్దుకోవచ్చు. ఒకవంతు నిమ్మరసం రెండు వంతుల కొబ్బరినూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు తెగిపోవటం రాలిపోవడం తగ్గిపోతాయి. మెంతులు నానబెట్టి తెల్లరాక మెత్తగా రుబ్బి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు దురద సమస్యలు కూడా పోయి జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది. గుడ్డు తెల్ల సొనలు తగినంత పెరుగు కలిపి కుదుళ్లకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యాంగా ఉంటుంది. వేపాకులు నీళ్లలో మరిగించి ఆ నీళ్లతో స్నానం చేయటం మంచిదే. వారంలో మూడు రోజులు కొబ్బరి ఆలివ్ నూనెలతో తలకు మస్సాజ్ చేసుకుని తలస్నానం చేస్తే పట్టులాంటి జుట్టు సొంతం చేసుకోవచ్చు .

    కురుల అందం కోసం

    జుట్టు వుంటే  ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ  వుండాలే కానీ సంప్రదాయ…

  • ఇప్పడూ ఇవి మన దేశపు పండ్లు. హైద్రాబాద్ అనాబ్ షావీలు , నూజివీడు మామిడికాయలు అంటూ మురిసిపోవటానికి ఏవీ లేదు. దేశ విదేశాల పండ్లు మ్మన పండ్ల మార్కెట్ లో ప్రత్యక్షమై అవే మన పండ్లనీ అంత రుచికరమైనవి తినకపోతే జన్మ సార్ధకంకాదనీ అనిపించేస్తూన్నాయి. ఒకప్పుడు న్యూజిలాండ్ లో మాత్రమే పండే కివి పండు ఇప్పుడు మార్కెట్ లో ఎటు చూసినా కనిపిస్తాయి. కమలాలకు రెట్టింపుగా విటమిన్ సి ఆపిల్ లో కన్నా ఐదు రెట్లు ఎక్కువ పోషకాలు దీని సొంతం పీచు పదార్ధం విటమిన్ ఇ పొటాషియం కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం ఈ కివీ పండు. కొవ్వులా సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులు మధుమేహం వ్యాధి వున్నవాళ్లు దేన్నీ హాయిగా తినవచ్చని వైద్యుల సలహా . బరువు తగ్గించుకోవాలంటే ఇది మంచి నేస్తం. దేనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల బీపీ కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు నోరూరించే రుచితో కివి పండు పై చేయిగానే ఉంటుంది.

    ఇప్పుడది మన పండే

    ఇప్పడూ ఇవి మన దేశపు పండ్లు. హైద్రాబాద్ అనాబ్ షావీలు , నూజివీడు మామిడికాయలు అంటూ మురిసిపోవటానికి ఏవీ లేదు. దేశ విదేశాల పండ్లు మన పండ్ల…

  • సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు పుష్కలంగా ఉన్న ఇవాల్టి అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి కూడా అంత సెన్సేషన్. ఎంతో బాగా మాట్లాడుతుంది కూడా. సినిమాల్లో ఎంత సంపాదించావు ఎంత వెనకేశవు అని చాలా మంది అడుగుతారు. దానికి నేను వెలకట్టలేను. అంటోందీ అమ్మాయి. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమా రంగం నాకు సుఖవంతమైన జీవితాన్ని అంతులేనంత ఆత్మ విశ్వాసాన్ని నాపిల్ నాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఇలాంటి సౌకర్యవంతమైన జీవితాన్ని కనుక ఇచ్చిన ఈ సినిమాలు నేను మానేయ వచ్చు. ఈ రంగానికి దూరంగా కూడా వుండచ్చు. అప్పుడు కూడా ఇంతే ఆనందంగా ఉంటాను అది కూడా నాకు సినిమానే నేర్పించింది. నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది . నేను ఎన్నో నేర్చుకున్నాను. నా చేతి కందిన జీవితాన్ని ఎంజాయ్ చేయగలను అని చెప్పుకొచ్చింది ఒక ఇంటర్వ్యూ లో. నిజమే సమంత చెప్పినట్లు ఇది విలువైన జీవితం అని తెలుసుకోవటమే ఎవరికి వాళ్ళు చేయవలసిన పని.

    సినిమా నాకన్నీ ఇచ్చిందన్న సమంత

    సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు  పుష్కలంగా ఉన్న ఇవాల్టి  అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి…

  • పెళ్లి ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తే డ్రెస్ లు డిజైన్ చేయించుకోవటం దానికి జ్యూవెలరీ ఏం బావుంటుందో చూసుకోవటం ఇవన్నీ అమ్మాయిలు ఒక్కటీ వదలరు . ప్రత్యేకంగా అన్నీ ఉండాలి. ప్రత్యేకంగా కనిపించాలి. మరిన్ని స్పెషల్ గా ఉంటె చెప్పులు మాత్రం ప్రత్యేకంగా ఉండద్దా !! అందుకే ఈ వెడ్డింగ్ షూస్ ఐడియాస్ యాప్. ఇందులో ఎన్నో చెప్పుల వరసలు డిసప్లే వుంది. కానీ ఇందులో ఓ ప్రత్యేకత వుంది. ఏ ముచ్చటైన డిజైన్లతో రౌండ్ టో వెడ్డింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్ బాలే పంప్స్ ఇలా బోలెడన్ని రకాలున్నాయి కదా. అయితే వీటిలో ఎదో ఒకటి ఎంచుకునే పనిలేదు. అందమైన రంగుల్లో అందుమీద మెరిసే రాళ్లు జర్దోసీలు లేస్ లు ఇవన్నింటిలో డిజైన్ చేసిన చెప్పుల్ని హీల్ ఇంకాస్త పెద్దదిగా ఉండాలంటే ఫలానా డిజైనర్ చెప్పులు ఫ్లాట్ గా వుండాలనో లేదా ఫలానా రకం రాళ్ళుఉంటే చీరకు మ్యాచవుతుందనో మన ఇష్టాలు చెపితే అలా తయారై వస్తాయి. వున్నవాటి గురించిన సమాచారం ఇచ్చారు.ఏవీ నచ్చకపోతే మన సొంత డిజైన్ చెప్పేస్తే సరి!!

    వాళ్ళ ఫ్యాషన్ కు అణా ఐడియా జోడిస్తారు

    పెళ్లి ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తే డ్రెస్ లు డిజైన్ చేయించుకోవటం దానికి జ్యూవెలరీ ఏం బావుంటుందో చూసుకోవటం ఇవన్నీ  అమ్మాయిలు ఒక్కటీ వదలరు . ప్రత్యేకంగా…

  • గుడి కట్టి పూజించేంతమంది అభిమానులను దక్కించుకోవటం కొంత మంది హీరోయిన్లకే దక్కింది. ఆ కొద్దీ మందిలో హన్సిక పేరు కూడా ఉంటుంది. ఒకప్పుడు కోలీవుడ్ లోఒకేసారి ఐదారు సినిమాలు చేసిన హన్సిక ఇప్పడూ ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఈ విషయం అడిగితే హన్సిక ఈ హవాలు జోరు అన్న పదాలు నేను నమ్మను. ఐదారు స్క్రిప్టులు చేస్తూ బిజీ గా ఉన్నా ఇప్పుడు ఒక్క సినిమా చేస్తున్నా అవన్నీ అప్పటికప్పుడు ఒప్పుకున్నవేవీ కాదు. ఎప్పుడో ఒప్పుకుని ఎప్పుడో చేసేవి. అంతే తప్ప ఏ హీరోయినూ ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయరు. కొంత కాలం క్రితం ఒప్పుకున్న తెలుగు సినిమాలు ఇప్పుడు మొదలయ్యాయి. పైగా స్టార్ హీరోలు చిన్న హీరోలు యువ కధానాయకులా అని నేనెప్పుడూ ఆలోచించలేదు. కధ నచ్చితేనే సినిమా. నా అభిమానులు నొచ్చుకోకుండా ఉండేటట్లు కథలుంటే బావుండనుకుంటా. ఇప్పుడు నాకు ఫేస్ బుక్ అభిమానులే 60 లక్షల మంది ఉన్నారు. ఇంతమంది మనసులో నాకు స్థానం ఉండటం కంటే ఇంతకంటే కోరుకునేది ఏముంటుంది? నేనెప్పుడూ సక్సెసే అనుకుంటానంటోంది హన్సిక. చిన్న వారులో సినిమాలోకొచ్చాను. ఇది పూర్తిగా నా లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. సినిమాలేని రోజుని నేనెప్పటికీ ఊహించలేనంటోంది హన్సిక.

    ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలిప్పుడు మొదలయ్యాయి

    గుడి కట్టి పూజించేంతమంది అభిమానులను దక్కించుకోవటం కొంత మంది హీరోయిన్లకే దక్కింది. ఆ కొద్దీ మందిలో హన్సిక పేరు కూడా ఉంటుంది. ఒకప్పుడు కోలీవుడ్ లోఒకేసారి ఐదారు…

  • నాలుగు రోజులు ఖాళీ దొరికితే తోచదంటారు. వయసు పెరిగితే డిప్రెషన్ అంటారు. ఇంకా జీవితం చుట్టూ ఎన్నో కంప్లైంట్స్. కానీ మంచి హాబీ డెవెలప్ చేసుకుంటే జీవితానికో ధ్యేయం ఉంచుకుంటే కాదు ఎదో ఒకటి మన మనసు సంతోషపడే కార్యక్రమం ఎంచుకోవాలి. జర్మన్ మహిళ పెట్రా ఏంజిల్స్ చిన్నప్పటి నుంచి ఎరేజర్స్ కలక్షన్ మొదలుపెట్టింది. పెన్సిల్ తో పిల్లలు రాసే అక్షరాలు చెరిపేసి ఎరేజర్. ఎన్నో రకాల్లో రంగుల్లో ఆకారాల్లో వస్తున్న ఎరేజర్స్ ని 112 దేశాలకు సంబంధించి 19571 కలెక్ట్ చేసింది. ఒక్కరోజులో ఇది సాధ్యమా ? ఒక సరదా . అలా సంపాదించినందుకు ఆమెకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదైంది. ఆలోచించండి. అన్ని ఎరేజర్స్ సంపాదించటం అంత తేలికా.. ఆ గౌరవం దక్కటమూ అంత తేలిక కాదు. ఇంకో ఆమె జర్మనీకి చెందినదే. పేరు మార్చినా షెల్లేన్ బెర్గ్. నాప్కిన్స్ కలెక్ట్ చేసింది. రకరకాల చేతులు తుడుచుకునే నాప్ కీన్స్ లక్షా ఇరవై ఐదు వేలకు పైగా సేకరించి గిన్నీస్ లోచోటు సంపాదించింది. జీవితం నిండుగా ఉండాలంటే మనం ఇతరులకి భారమై బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎదో ఒక హాబీ అలవర్చుకోవాలి.

    ఎరేజర్స్ నాప్కిన్స్ తో గిన్నీస్ లో చోటు

    నాలుగు రోజులు ఖాళీ దొరికితే తోచదంటారు.  వయసు  పెరిగితే డిప్రెషన్ అంటారు.  ఇంకా జీవితం  చుట్టూ ఎన్నో  కంప్లైంట్స్. కానీ మంచి హాబీ డెవెలప్ చేసుకుంటే జీవితానికో…