ఎరేజర్స్ నాప్కిన్స్ తో గిన్నీస్ లో చోటు

ఎరేజర్స్ నాప్కిన్స్ తో గిన్నీస్ లో చోటు

ఎరేజర్స్ నాప్కిన్స్ తో గిన్నీస్ లో చోటు

నాలుగు రోజులు ఖాళీ దొరికితే తోచదంటారు.  వయసు  పెరిగితే డిప్రెషన్ అంటారు.  ఇంకా జీవితం  చుట్టూ ఎన్నో  కంప్లైంట్స్. కానీ మంచి హాబీ డెవెలప్ చేసుకుంటే జీవితానికో ధ్యేయం  ఉంచుకుంటే కాదు ఎదో ఒకటి  మన మనసు సంతోషపడే కార్యక్రమం  ఎంచుకోవాలి. జర్మన్ మహిళ  పెట్రా ఏంజిల్స్  చిన్నప్పటి నుంచి ఎరేజర్స్ కలక్షన్ మొదలుపెట్టింది. పెన్సిల్ తో పిల్లలు రాసే  అక్షరాలు  చెరిపేసి ఎరేజర్. ఎన్నో రకాల్లో  రంగుల్లో  ఆకారాల్లో వస్తున్న   ఎరేజర్స్ ని 112  దేశాలకు సంబంధించి 19571 కలెక్ట్ చేసింది. ఒక్కరోజులో ఇది సాధ్యమా ? ఒక సరదా . అలా సంపాదించినందుకు ఆమెకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదైంది. ఆలోచించండి. అన్ని ఎరేజర్స్ సంపాదించటం అంత తేలికా.. ఆ గౌరవం దక్కటమూ అంత తేలిక కాదు. ఇంకో ఆమె జర్మనీకి చెందినదే. పేరు మార్చినా షెల్లేన్ బెర్గ్. నాప్కిన్స్ కలెక్ట్ చేసింది. రకరకాల చేతులు తుడుచుకునే  నాప్ కీన్స్  లక్షా ఇరవై ఐదు వేలకు పైగా సేకరించి గిన్నీస్  లోచోటు సంపాదించింది. జీవితం నిండుగా ఉండాలంటే మనం ఇతరులకి భారమై బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎదో ఒక హాబీ అలవర్చుకోవాలి.