• ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ నీళ్లు తేనె కలిపి పెదాలను రాసుకుని గంట తర్వాత దూదితో తుడిచేస్తూ ఉంటే ఈ పగుళ్లు పోతాయి . రాత్రి వేళ పడుకునే ముందర తేనె రాసుకున్న ప్రయోజనం ఉంటుంది. పొడి బారిన పెదవులకు ఇది మంచి మందు. అలాగే నెయ్యి రాసుకున్న ఫలితం ఉంటుంది. వేడి నీళ్లల్లో గ్రీన్ టీ బ్యాగ్ పడేసి తీసి దానితో పగుళ్లు వచ్చిన పెదవుల పైన రాసుకున్న నొక్కిపెట్టి ఆ రసం పగుళ్ళకు తగిలేలా చేసినా మంచిది. ఈ టీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ పగిలిన పెదవులకు మేలు చేస్తాయి. కీరా దోస ముక్కల్ని గుజ్జుగా చేసి రసం తీసి అందులో దూది ముంచి పెదాలపై వుంచినా మంచి ఫలితం ఉంటుంది. పెదవుల పై చర్మ పొలుసులుగా ఎండిపోతే బేబీ బ్రెష్ తో సున్నితంగా రుద్దేసి ఆలివ్ నూనె తో చక్కెర కలిపి ఐదు నిమిషాల పాటు పెదవులపై మర్దనా చేసి తర్వాత లిప్ బామ్ రాసుకుంటే పెదవులు చక్కగా ఉంటాయి. గులాబీ రేకుల్ని పాలల్లో నానబెట్టి మెత్తగా నూరి పెదవులకు రాసుకున్న పెట్రోలియం జెల్లీ రాసిన పగుళ్లు చాలా వేగంగా తగ్గిపోతాయి.

    ఇలా చేస్తే పెదవులు గులాబీ రేకుల్లావుంటాయి

    ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ…

  • నీహారికా , నువ్వు అన్నది నూరుపాళ్లు నిజం. నన్ను స్వేచ్ఛగా పనిచేయిస్తే ఆ పని ఖచ్జితంగా చేస్తాను. నీ వల్ల అవుతుందా అని ఎవరైనా ఆన్నారనుకో ఇక నా పైన నాకే డౌట్ వస్తుంది అన్నావు నిజం స్వేచ్ఛ ఉన్న చోట సృజన ఉంటుంది. ఊగిసలాట కు ఆస్కారం వుండదు కాబట్టి లక్ష్యం పైన గురిపెడతాం. నువ్వు గమనించు పెద్ద పెద్ద సంస్థలన్నీ అద్దాల గనుల్లో పుట్టలేదు.వ్యవస్థాపకుల్లో మేనేజ్మెంట్ దిగ్గజాలు లేరు. వాళ్ళ పెయిన్ ఎవరికీ ఏ భారీ అంచనాలు లేవు. వాళ్లకు తోచిన ఆలోచనతో ఒక వ్యాపారమో సినేమానో ఎదో ఒక ప్రాజెక్టో మొదలుపెట్టి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇది అవార్డు కోసం తీసే సినిమా అంటూ ఎవళ్ళూ తీయలేదు.నిర్మాణం పైన శ్రద్ధ తో తన చేతిలో ఉన్న కధ పైన నమ్మకంతో నటించే వాళ్ళ పట్ల కూడా నమ్మకంతో సినిమా తీస్తే ఆ సినిమాకు అవార్డులు కలెక్షన్లు వచ్చి తీరతాయి. దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలు తలసరి ఉత్పత్తిలో భారత దేశాన్ని మించిపోతున్నారు. ఆ దేశాల్లోని పని సంస్కృతే అంటే వాళ్ళు పనిని ప్రేమించే జీవిత విధానమే పనిని దైవంగా భావించి దీక్షగా చేయటమే వాళ్లకు ఫలితం ఇస్తోంది/ ఆ స్వేచ్చ వాళ్ళకువుంది. నువ్వు పనిచేయాలగలవా అని ముందే సందేహ పడితే రిసల్ట్స్ ఎక్కడ నుంచి వస్తాయి? నువ్వు నీలాగే వుండు నీహారికా . నువ్వు చేస్తున్న పని నువ్వు చదువుతున్న చదువు పట్ల నీకున్న స్వేచ్ఛ నీ టార్గెట్ ని రీచ్ అయ్యేలా చేస్తుంది. నువ్వు కలెక్టర్ ని అవుతాననుకుంటావు. అయిపో. నువ్వు అవుతావా లేదా అని నిన్ను అనుమానించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వొద్దు. నువ్వు ముందు సందేహపడద్దు. కష్టపడి చదువు మహా నైపుణ్యంగా చదువు అదే ప్రపంచం అన్నట్లు చదువు. ఫలితం నీ చేతిలో పడుతుంది.

    నిన్ను నువ్వు సందేహించుకోకు

    నీహారికా , నువ్వు అన్నది నూరుపాళ్లు నిజం. నన్ను స్వేచ్ఛగా పనిచేయిస్తే ఆ పని ఖచ్జితంగా చేస్తాను. నీ వల్ల అవుతుందా అని ఎవరైనా ఆన్నారనుకో ఇక…

  • ఎంగేజ్మెంట్ పెళ్లి లేదా గ్రాండ్ అకేషన్లకు అన్నింటికీ ఇప్పుడు అమ్మయిలు సెలెక్ట్ చేసుకునేది లెహెంగానే. చివరకు పెళ్లికూతుళ్ల డ్రెస్ లో మెహేందీ ఫంక్షన్స్ లో కూడా ఏ డిజైనర్ లెహెంగాలే ఫ్యాషన్ అయిపోయాయి. నెటెడ్ సిల్క్ లెహెంగా అయితే ఫ్యాబ్రిక్ దుపట్టా మ్యాచ్ అవుతాయి. లంగా కంటే విశాలమైన కుచ్చిళ్ళతో పాదాల కింద దాకా వచ్చే లెహెంగా డబుల్ కల్చర్ తో అంచు పూర్తిగా కాంట్రాస్ట్ గా కానీ లేదా మల్టీ కలర్ తో గానీ ఉంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఇక పూర్తి ఎంబ్రాయిడరీ తో గాఢమైన రంగులతో లెహెంగా ఉంటె అందమే అందం. నెట్ ఫంక్షన్స్ లో చందమామ కనిపించాలంటే తెల్లని లెహెంగా కు వెండి రంగు అంచు అదే కలర్ బ్లౌజ్ దుపట్టా అయితే రిచ్ లుక్ లో మెరిసిపోవటం ఖాయం. ఏదైనా ప్రత్యేకంగా కనిపించాలంటే డిజైనర్లు కూడా లెహెంగా వైపే చూపిస్తున్నారు.

    గ్రాండ్ ఫంక్షన్లకు లెహెంగా అందం

    ఎంగేజ్మెంట్ పెళ్లి లేదా గ్రాండ్ అకేషన్లకు అన్నింటికీ ఇప్పుడు అమ్మయిలు సెలెక్ట్ చేసుకునేది లెహెంగానే. చివరకు పెళ్లికూతుళ్ల డ్రెస్ లో మెహేందీ  ఫంక్షన్స్ లో కూడా ఏ…

  • ఆమ్మో మిరపకాయ అంటాం కానీ కారం లేని వంటను ఊహించలేం. ఆహార పదార్ధాల్లో కాస్త కారం ఎక్కువ తినే అలవాటు చాలా మందిది . ఈ అలవాటే లాంగ్ లైఫ్ ఇస్తుందనటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనలో కారం ఎక్కువ తినటం వల్ల అధిక బరువు సమస్య నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చని రుజువైంది. పండు మిరపకాయను ఎదో రకంగా ఆహారంలో చేర్చుకోవటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చని స్పష్టమైంది. వీటిలో ఎ విటమిన్ బికాంప్లెక్ గ్రూప్ సి విటమిన్ లభిస్తాయి. పొటాషియం మెగ్నీషియం ఐరన్ మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. అంతేగాని రక్తంలో షుగర్ లెవల్ తగ్గిస్తుంది. మిరప పండు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి స్ట్రోక్స్ రిస్క్ తగ్గిస్తుంది. మొత్తం మీద మిరపకాయలు శరీరంపై థెరప్టిక్ ప్రభావాన్ని చూపిస్తాయి. కారం తినటం వల్ల దీర్ఘయషు సాధ్యమన్నా విషయాన్నీ స్పష్టం చేస్తూ హాట్ సాస్ తో డ్రై ఫ్లేక్స్ తో పోలిస్తే మిరపకాయల్లో ఎక్కువ ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు పరిశోధకులు.

    విటమిన్ల లోనూ ఘాటే

    ఆమ్మో మిరపకాయ అంటాం కానీ కారం లేని వంటను ఊహించలేం. ఆహార పదార్ధాల్లో కాస్త కారం ఎక్కువ తినే అలవాటు చాలా మందిది . ఈ అలవాటే…

  • మనకు కొంత రిలీఫ్ ఇచ్చే ఒక అధ్యయనం రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కాస్తంత తిండి తిని అది శరీరం లోంచి ఆవిరైపోయేదాకా వ్యాయామం చేస్తే బరువు తగ్గిపోతాం అనే భ్రమలో ఉంటాం కదా. కొత్త పరిశోధన ఇదంతా మీ ఆశే గానీ బరువు తగ్గటం అన్నది జన్యువుల పైన ఆధారపడి ఉంటుందని డి. ఎన్. ఎ టెస్టుల ద్వారా తేల్చారు. 35 నుంచి 65 సంవత్సరాల లోపు స్త్రీ పురుషులపైన ఈ పరిశోధన చేసారు. వీరికి మంచి డైట్ ఫుడ్ కొందరికి మంచి పుష్టికరమైన ఆహారం ఆ తరువాత రెండు గంటల వర్కవుట్స్ చేయించారు. బరువు తగ్గటంలో ఎన్నో అసమానతలు కనిపించాయి. ఇందుకు జన్యుకణాలు కారణమని తేల్చుకున్నారు. అంచేత బరువు పెరిగే గుణం మన జన్యువుల్లో ఉంటే తిండి మానేసినా గంటలకొద్దీ చెమటలు చిందించి వ్యాయామం చేసినా పైసా ఉపయోగం లేదని తేలింది . చాలా మందికి ఇది మంచివార్తే. ఎంత చేసినా తగ్గం లెద్దూ అని మంచి భోజనానికి రెడీ అవ్వచ్చు.

    బరువును పెంచే జన్యువులు

    మనకు కొంత రిలీఫ్ ఇచ్చే ఒక అధ్యయనం రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కాస్తంత తిండి తిని అది శరీరం లోంచి ఆవిరైపోయేదాకా వ్యాయామం చేస్తే బరువు తగ్గిపోతాం…

  • ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఎక్కడో ఒక చోట బ్యాక్తీరియా వుండి పోతుందనీ వంటగది గట్టు కూరగాయలు కట్ చేసే బోర్డులు . ఇలా చాలా వస్తువుల వల్ల బ్యాక్తీరియా ఆహార పదార్ధాల్లోకి వెళ్లి ఆరోగ్య హానికి కారణం అవుతుందనీ అంతకుముందు ఎన్నో పరిశోధనలు తేల్చాయి. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ క్రీములు కిచెన్ టవల్స్ లోనే చేరుతున్నాయని వీటివల్లే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని పరిశోధనలు చెపుతున్నారు. ఎన్నో కిచెన్ లో వంట చేసేవాళ్ల పై వీడియోలు తీసి ఈ పరిశోధనలు చేసారు. అన్నింటికన్నా టీ టవల్స్ పైన కాలుష్యం వుందని తేలింది. ఇంకో ముఖమైన విషయం మనం ఎప్పుడూ శుభ్రం చేయని చేసేందుకు అవకాశం లేని సెల్ ఫోన్స్ లో ఎన్నెన్నో సూక్ష్మజీవులు ఉంటున్నాయని మనతో పాటు ఎంతో కాలుష్యంతో ప్రయాణం చేసే ఈ ఫోన్ లని యధాతధంగా వంటింట్లోకి తీసుకుపోతాం కిచెన్ టవల్స్ తో పనిచేస్తూ ఫోన్ లు మాట్లాడుతూ ఉంటాం ఇలా కూడా ఎంతో బాక్టీరియా వంటింట్లోకి చేరుతుందంటున్నారు. కొన్నింటిని మన జీవితం లోంచి ఎవాయిడ్ చేయటం కుదరదు కనుక ఈ సందర్భాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎవరికివాళ్లు ఆలోచించుకోవాలి.

    కిచెన్ టవల్స్ తో బ్యాక్తీరియా

    ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఎక్కడో ఒక చోట బ్యాక్తీరియా వుండి  పోతుందనీ వంటగది గట్టు కూరగాయలు కట్ చేసే బోర్డులు . ఇలా చాలా వస్తువుల…

  • స్పినాక్ అనేది ఒక ఆకుకూర. చుక్క కూర ఆకులను పోలివుండే స్పినాక్ లో పూర్తిగా పోషకాల పదార్ధాలే. ఇందులో కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణముంది. పైగా పలురకాల కాన్సర్ కారకాలను నిరోధించే రసాయనాలున్నాయి. స్పినాక్ శిరోజాలకు చర్మానికి మేలు చేస్తుంది.దీనిలో బీటా కెరోటిన్ విటమిన్ ఎ లు కళ్లకు మేలుచేస్తుంది. వయసులో మందగించే చూపును స్పినాక్ మెరుగుపరుస్తుంది. దీనిలో పీచు పదార్ధం వల్ల మలబద్దక సమస్యలు తలెత్తవు. స్పినాక్ ఆకులు ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. రోటీ పరోటాలతో పప్పు సలాడ్ గా ఈ స్పినాక్ ను తీసుకుంటే మేలు. లేతగా ఉండే స్పినాక్ ఆకులను తొమ్మిది రోజుల పాటు ఫ్రిజ్ లో జాగ్రత్తగా స్టోర్ చేసి ఇందులో వుండే పోషక విలువలు ఏవీ నశించవు. న్యూట్రీషన్స్ పుష్కలంగా వుండే ప్రపంచపు ఆరోగ్యకరమైన కూరగాయల్లో స్పినాక్ టాప్ ర్యాంకింగ్ లో ఉందంటారు. న్యూట్రీషనిస్టులు. ఒక్క నిమిషం పాటు ఉడికించి ఇందులో వున్న పోషకాలు రుచీ పోకుండా తినమంటున్నారు. వారంలో రెండుసార్లు కుటుంబమొత్తం తీసుకునే భాగంగా ఈ ఆకు కూరను ఎంచుకోమని కనీసం ఒక కప్పు తక్కువ కాకుండా ఈ కూర తినమనీ డైటీషియన్లు సలహా.

    పోషకాలున్న స్పినాక్

    స్పినాక్ అనేది ఒక ఆకుకూర. చుక్క కూర ఆకులను పోలివుండే స్పినాక్ లో పూర్తిగా పోషకాల పదార్ధాలే. ఇందులో కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణముంది. పైగా పలురకాల…

  • అలసట అనిపిస్తే కప్పు టీ తాగితే ఎక్కడలేని శక్తి వస్తుంది. ఒత్తిడి మాయమై గొప్ప రిలీఫ్ వస్తుంది. ఈ ప్రయోజనాలను మించిన ఉపయోగం మరొకటుంది. కప్పు టీ తో మెదడు అరగంటకు పైగా చురుగ్గా పనిచేస్తుందని కొన్ని పరిశోధనల ఫలితం చెపుతోంది. గ్రీన్ బ్లాక్ టీ లు తగిన అనంతరం మెదడు పనితీరు చాలా చైతన్యవంతంగా ఉందిట. ముందుకన్నా చురుగ్గా ఆలోచించటం త్వరత్వరగా నిర్ణయాలు తీసుకోవటం పరిశోధకులు గమనించారు. టీ తాగటం వల్ల మెదడులోని మూడు రకాల బ్రెయిన్ వేవ్స్ చాలా చురుగ్గా పనిచేస్తాయి. అలాగే లైట్ టీ తో ఊబకాయ సమస్య మాయమైపోతుంది. లైట్ టీ కొత్తగా ఏర్పడే ఫ్యాట్ సెల్స్ ని అడ్డుకుంటుందని ఇది యాంటీ ఆక్సిడెంట్లు కనుక చర్మం చాలా అందంగా అయిపోతుందనీ వృధాప్య ఛాయలు పూర్తిగా పోతాయని చెపుతున్నారు. అల్ట్రా వయొలెట్ కిరణాలతో నల్లబడిన చర్మం వెంటనే యాధస్థితికి వస్తుంది. ప్రాసెస్ చేసి టీ బ్యాగ్స్ లో భద్రపరిచిన లైట్ టీ లీవ్స్ కంటే విడిగా వుండే ఆకులతోనే మంచి ఔషధ విలువలున్న టీ తయారు చేసుకోవచ్చు. ఈ వైట్ టీ ని ప్రతిరోజు తీఉస్కోవటం వల్ల ఎన్నో ప్రత్యక్ష పరోక్ష లాభాలుంటాయంటున్నారు

    లైట్ టీ తో ఎన్నో ప్రయోజనాలు

    అలసట అనిపిస్తే కప్పు టీ తాగితే ఎక్కడలేని శక్తి వస్తుంది. ఒత్తిడి మాయమై గొప్ప రిలీఫ్ వస్తుంది. ఈ  ప్రయోజనాలను మించిన ఉపయోగం మరొకటుంది. కప్పు  టీ…

  • ఇప్పుడు సిల్క్ దారాలతో వస్తున్నా గాజులు చెవి రింగులు హారాలు పెద్ద ఫ్యాషన్. అసలివి ఇళ్లల్లో చేసుకునే విధంగా పెరల్స్ తో చేసిన చెయిన్లు స్టోన్ చెయిన్లు మీటర్ల లెక్కన దొరుకుతాయి. అలాగే ఫ్లవర్ బీడ్స్ మల్టీ కలర్ పట్టు దారాలు దొరుకుతున్నాయి. సంప్రదాయ వస్త్రాలంకరణ లో భాగంగా ఇప్పుడు సిల్క్ గాజులు ఫ్యాషన్. అందమైన గాజులు కర్ణాభరణాలు హారాలు పూర్తి మ్యాచింగ్ కిట్స్ లో కూడా దొరుకుతున్నాయి. ప్లాస్టిక్ మెటల్ వెడల్పాటి గాజుకు సిల్క్ దారాన్ని నైపుణ్యంతో చుట్టేసి ఆ దారం చుట్టిన గాజుకు అందమైన పూసలు స్టోన్ పీసెస్ అంటించటం అయితే ఇవి నైపుణ్యం వున్న చేతుల్లోనే తయారైతేనే బావుంటాయి. సంప్రదాయ ఫంక్షన్లు కోలాటం లాంటి ఆటలు సంక్రాంతి బతుకమ్మ పండుగల సందర్భంలో ఆడపిల్లలు రంగుల దుస్తులు ధరించి ఈ పట్టు గాజులు నగలు వేసుకుంటే వేసుకున్న దుస్తులకు సరైన మ్యాచింగ్ గా ఉంటాయి. ముత్యాలు మెరిసే పూసలు పట్టు దారాల అల్లికతో సిల్క్ గాజులు కొన్ని వాండ్ల రకాలు ఆన్ లైన్ లో కనువిందుగా చూడచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలు కూడా వున్నాయి. ముత్యాల వరసలు స్టోన్ టెయిన్లు తెచ్చుకుని మనమే గాజులకు అతికించుకోవచ్చు.

    పట్టు దారాలతో ఆభరణాలు

    ఇప్పుడు సిల్క్ దారాలతో వస్తున్నా గాజులు చెవి రింగులు హారాలు పెద్ద ఫ్యాషన్. అసలివి ఇళ్లల్లో చేసుకునే విధంగా పెరల్స్ తో చేసిన చెయిన్లు స్టోన్ చెయిన్లు…

  • పాపాయిలు కొంచెం పెరిగి పెద్దయి నడిచే వరకు వాళ్ళతో చాలా కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు తోడు ఇంట్లో ప్రతి చిన్న విషయం లోనూ వాళ్లకు ఒక ప్రత్యేకమైన వన్నీ ఉండాలి. పిల్లలకు వాడే సబ్బులు ఎవ్వళ్ళనీ వాడనివ్వకూడదు. పిల్లలకు వ్యాధి నిరోధిక శక్తీ చాలా తక్కువ. పెద్దవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా అది వెంటనే పిల్లలకు వ్యాపిస్తుంది. పిల్లలకు అస్తమానం డైపర్లు వేస్తుంటారు. అది పెద్దవాళ్లకు సౌకర్యమే. కానీ అదే పనిగా వేయటం వల్ల న్యాపీ రాష్ వస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు వేయకపోవడం ఉత్తమం. ఒక సమయానికి కాలకృత్యాలు తీర్చుకునే అలవాటు చేస్తే పిలల్లు పెద్దవాళ్ళు ఎవ్వళ్లు ఇబ్బంది పడరు.పిల్లలను కాస్సేపైన ఎండలోకి తీసుకుపోవాలి. ఆలా వెళ్లేముందు ఎస్ సి ఎఫ్ 14 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ రాయాలి . పిల్లలకు కనీసం పది నిముషాలు ఉదయపు ఎండ తగలాలి. వాళ్లకు తగినంత డి విటమిన్ అందుతుంది. ఫలితంగా ఎముకలు బలంగా పెరుగుతాయి.

    వాళ్లకు ఉదయపు ఎండ చాలా మంచిద

    పాపాయిలు కొంచెం పెరిగి పెద్దయి నడిచే వరకు వాళ్ళతో చాలా కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు తోడు ఇంట్లో…

  • బరువు తగ్గాలన్నా, చక్కర వ్యాధి అదుపులో ఉండాలన్నా, రక్తపోటు రాకుండా ఉండాలన్నా మెడిటరేనియన్ డైట్ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ మెడిటరేనియన్ డైట్ లో ఆలివ్ ఆయిల్, పాలిష్ చేయని తృణధాన్యాలు, పళ్ళు, చేపలు ఉంటాయి. వెన్న బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్, సాల్ట్ బదులుగా భోజనంలో రుచికోసం హెర్బ్స్ వాడటం, నెలల తరబడి రెడ్ మీట్ మాత్రమే తినడం వారానికి రెండు సార్లు ఫిష్, బ్రెడ్ తప్పనిసరిగా భోజనంలో భాగంగా ఉండటం, తేనెలో నానబెట్టినవి, సాల్ట్స్ వాడనవి ఒరిజినల్ నట్స్ తినడం ఈ మెడిటరేనియన్ డైట్ లో భాగంగా ఉన్నాయి. ఈ డైట్ ఆరోగ్యాన్ని కాపాడుతుందనీ, మెదడు వృద్ధాప్యంలో కూడా అద్భుతంగా పనిచేస్తుందనీ, ఇక ఆ వయసులో వచ్చే మతిమరుపు భయాలకు కూడా దారని ఒక పరిశోధనలో స్పష్టమైంది. మెడిటరేనియన్ డైట్ కోసం మంచి సైట్స్ వున్నాయి వెతికి చూడండి. ఇది చాలా ప్రయోజనకారి.

    మెడిటరేనియన్ డైటే మంచిది

    బరువు తగ్గాలన్నా, చక్కర వ్యాధి అదుపులో ఉండాలన్నా, రక్తపోటు రాకుండా ఉండాలన్నా మెడిటరేనియన్ డైట్ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ మెడిటరేనియన్ డైట్ లో ఆలివ్ ఆయిల్, పాలిష్…

  • నీహారికా, నేనందరిలా పర్ఫెక్ట్ గా ఉన్నానా? నా ఆలోచనలు సరైనవా కాదా అనే సందేహం అన్నావు, అసలు నువ్వు ఇతరులతో ఎందుకు పోల్చుకొంటావు. ప్రతివారికీ ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ఇంకోళ్ళలా వుండటం ఎందుకు? మన చుట్టూ ఉన్న సక్సెస్ ఫుల్ పీపుల్స్ లో మనం కూడా ఖచ్చితంగా ఉంటాం. ఇప్పుడెలా ఉండాలి అప్ డేట్ గా, సమకాలీన పరిస్థితులు, తాజా ఆర్ధిక సాంఘిక రాజకీయ విషయాలు తెలుసుకోవడం కోసం న్యూస్ పేపర్లు, మేగజైన్లు ఎంచుకో. మన చుట్టూ వున్నా వాళ్ళతో కలిసిమెలిసి వుండాలి. అప్పుడు చుట్టూ స్నేహ సౌరభo వుంటుంది. ఒక లక్ష్యం ఉంచుకో, అది రోజు, వారం, నెల లేదా జీవిత కాలపు లక్ష్యం కూడా కావచ్చు. ఆ లక్ష్యం ఎదురుగా నడువు, ఏం సాధించావు, ఇంకా ఏం చేయాలి? ఈ ఆలోచనలతో బిజీ గా వుంటే నెగిటివ్ ఆలోచనలే వుండవు. కొత్తగా ఆలోచించు సమ్ థింగ్ న్యూ. అది అందరూ ఆదరించేది, మనసుని రంజిపజేసేది అయి వుండాలి. ఆ ఆత్మ సంతృప్తి , ధైర్యం జీవితంలో నువ్వు ఎక్కే ఎన్నో మెట్లకు పునాది అవుతుంది. మంచి ఆలోచనలతో, మంచి ఆరోగ్యంతో, మంచి అలవాట్లతో సంతోషంగా వుండు. ఎప్పుడు ఏ కొంచెం సాయం పొందినా దాన్ని మరచిపోకు, నువ్వు పర్ఫెక్ట్ గా ఉండటం అంటే ఇదే. ఒక చిన్న మొక్క రెండాకులతో గింజ నుంచి బయటపడి, చక్కని వెలుగుతో, గాలి, ప్రకృతితో సంతోషంగా ఎదిగి వృక్షం అవుతుంది. మనుషులు అంతే ఆరోగ్యవంతమైన ఆలోచనలతో ఎదగాతమే జీవిత విధానం.

    గింజ వృక్షం అయినట్లు ఎదగాలి

    నీహారికా, నేనందరిలా పర్ఫెక్ట్ గా ఉన్నానా? నా ఆలోచనలు సరైనవా కాదా అనే సందేహం అన్నావు, అసలు నువ్వు ఇతరులతో ఎందుకు పోల్చుకొంటావు. ప్రతివారికీ ఎవరి ప్రత్యేకత…

  • ఎన్నో రకాల పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎలా వుంటే ఫ్యాషన్, ఎలా తింటే ఆరోగ్యం, ఎలా ప్రవర్తిస్తే మర్యాద ఇవన్నీ జీవనశైలితో పాటు మారిపోతున్నాయి కదా. ఇప్పుడు చదువుకీ, వ్యక్తి ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి ఆస్ట్రేలియా పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. సుమారు 3 లక్షల మంది విద్యాధికుల పైగా మిగతా డిగ్రీ లోపే ఆపేసిన వారిపైన ఈ అధ్యయనం కొనసాగింది. డిగ్రీ చదివిన వారి కన్నా ఇంటర్ తో ఆపేసిన వాళ్ళే ఎంతో అనారోగ్యాల బారిన పడి ఉన్నారని, ఒత్తిడితో గుండెపోటు తెచ్చుకునే వారి శాతం అధికంగా ఉందని తేలింది. అధ్యయనాన్ని విశ్లేషిస్తే చదువుకొన్నవారు మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడితే, ఇంటర్ లో ఆపేసిన వారిలో అభద్రతా భావం ఎక్కువగా ఉండటం, మంచి ఆహారం తీసుకునే అవకాశం లేకపోవడం, ఇక వైద్య భద్రత, కుటుంబ సంక్షేమం ఏదీ లేని కారణం గా ప్రతి చిన్న విషయానికీ ఒత్తిడి కి లోనయ్యారని తేలింది. తక్కువ చదువు, తక్కువ సంపాదన జీవితంలో అభద్రతకు దారి తీశాయని అధ్యయనాలు తేల్చాయి. అంటే చదువుకోవడం అన్ని విధాలా లాభదాయకం అని తేలింది. సో.. పిల్లల చదువు విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలో అర్ధం చేసుకోవచ్చు.

    చదువు తోనే ఆరోగ్యం

    ఎన్నో రకాల పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఎలా వుంటే ఫ్యాషన్, ఎలా తింటే ఆరోగ్యం, ఎలా ప్రవర్తిస్తే మర్యాద ఇవన్నీ జీవనశైలితో పాటు మారిపోతున్నాయి కదా.…

  • షరార డ్రెస్ పాత సినిమాల ట్రెండ్. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే డ్రెస్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. పెళ్లి కూతుళ్ళు, యువతులు ఈ ఫ్యాషన్ అవుట్ ఫిట్ వైపు ఇష్టంగా చూస్తున్నారు. స్పెషల్ గా, ట్రెండీగా ఈవెంట్స్ లో ధరిస్తే స్పెషల్ ఎట్రాక్షన్ గా వుండటంలో ఇది పాతకాలపు డ్రెస్ అన్న పదం పక్కన పెట్టి ఇందులో వస్త్ర శ్రేణిని మాత్రం మార్చిపారేసి కొత్త లుక్ తీసుకొస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. చూసేందుకు ట్రౌజర్ ల కనిపిస్తుంది బాటమ్ డిఫరెంట్ గా పరికిణీలా లూజుగా బావుంటుంది. ప్రెట్టీ లుక్ తో స్లిమ్ గా కనిపించటం ఖాయం. ఇవి చోళీ, కుర్తాలతో కలపీ బావుంటాయి. బ్లవుజ్, బాటమ్ కలిపినా ఫ్యాషన్. ఎక్కువ ఎంబ్రాయిడరీ పనితనం లేకుండా, లేత రంగుల్లో చక్కని గ్రాండ్ లుక్ తో పెళ్లి వేడుకలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో అమ్మాయిలు ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. అందుకే ఏనాడో పాత కాలపు ఫ్యాషన్ మళ్ళీ ఇవాల్టి యూత్ ఫ్యాషన్ అయింది.

    మళ్ళీ ఫ్యాషన్ ట్రెండ్ షరారే !

    షరార డ్రెస్ పాత సినిమాల ట్రెండ్. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే డ్రెస్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. పెళ్లి కూతుళ్ళు, యువతులు ఈ ఫ్యాషన్ అవుట్…

  • ఇవ్వాళ చీర అందం మొత్తం బ్లవుజ్ డిజైన్ పై ఆధారపడి వుందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ డిజైనర్స్ అది ఎంత అందమైన బ్లవుజ్ అయినా మెడ ఆకృతిని బట్టి డిజైన్ ఎంపిక చేసుకోవాలంటున్నారు. మెడ సన్నగా పొడవుగా ఉంటే రౌండ్ నెక్. మెడ పొట్టిగా, లావుగా ఉంటే డీప్ నెక్, బ్రాడ్ నెక్, ఫాట్ నెక్, బ్యాక్ ఓపన్ డోరీ డిజైన్స్, భుజాలు వెడల్పుగా వుంటే కాలర్, హై, రౌండ్, బోట్ నెక్ ఆకారాల్లో బావుంటాయని సూచిస్తున్నారు. కానీ మనo వెళ్ళే వేడుకను బట్టి కూడా బ్లవుజ్ డిజైన్స్ ఎంపిక చేసుకోవలంటారు. సంగీత్ వంటి వేడుకల కయితే హై నెక్, ఇన్ లైన్ కబ్ బ్లవుజులు బావుంటాయని చెపుతున్నారు. గెట్ టు గెదర్ కార్యక్రమాలకయితే రౌండ్ నెక్ లేదా అధికారిక కార్యక్రమాలు, ఆఫీస్ ప్రోగ్రామ్స్ కు కాలర్ నెక్ లు, ఇక పెళ్ళిళ్ళు, సంప్రదాయ వేడుకలకయితే క్లోజ్డ్ నెక్, రౌండ్ నెక్ ఎంచుకోమంటున్నారు. ఇక లేహంగాల పైకి చైనీస్ కాలర్ నెక్, పాట్లీ బటన్, కీ హాల్ డిజైన్స్ తో అతుకినట్లు కుట్టించుకొంటే ఇక లెహంగా అందమంతా కనిపిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.

    మెడ ఆకృతిని బట్టే డిజైన్స్

    ఇవ్వాళ చీర అందం మొత్తం బ్లవుజ్ డిజైన్ పై ఆధారపడి వుందంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ డిజైనర్స్ అది ఎంత అందమైన బ్లవుజ్ అయినా మెడ…

  • జీరో సైజులు, సన్నగా ఉండటం ఫ్యాషన్ స్టేట్మెంట్ అయ్యాక ఇప్పుడు ఏం తిన్నా కాలరీలు లెక్కెట్టుకోవడం పెద్ద అలవాటయిపోయింది. పాప్ కార్న్ అందరికి ఇష్టం. ఒకటి రుచిగా ఉంటుంది, రెండోది అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు. పైగా కాలరీలు వుండవు. ఫ్యాట్ తక్కువ ఎంత తిన్నా ప్రమాదం లేదని అంటున్నాం కదా కానీ నిపుణులు మాత్రం మీ అభిప్రాయం తప్పు అంటున్నారు. సూపర్ మారేట్స్, సినిమా హాళ్ళలో దొరికే ఈ పాప్ కార్న్ లో బోలెడన్ని ఆరోగ్య సమస్యలున్నాయని ఖచ్చితంగా బరువు పెరుగుతారని నిపుణుల హెచ్చరిక. పెద్ద ప్యాకెట్ పాప్ కార్న్ లో 1200 కాలరీలు, 980 మిల్లి గ్రాముల సోడియం, 60 గ్రాముల శాచురేటేడ్ ఫ్యాట్ ఉంటాయి. ఇది మూడు రోజుల పాటు తీసుకొనే ఆహారంతో సమానం అంటున్నారు. బయట దొరికే ఉప్పు, కారం, నూనె జత చేసిన ఈ ప్యాకెట్ ఫుడ్ లో ఎన్నో కాలరీలు శరీరంలో జేరిపోయి బరువు పెంచుతాయట. వీటిని ఎప్పటిలా ఇంట్లో బాండీలో పడేసి వేయించి జొన్న పేలాలలాగే తింటే అందులో నూనె, ఉప్పు ఉండవు కనుక పారలేదని సమాచారం.

    పాప్ కార్న్ లో బోలెడన్ని కాలరీలు

    జీరో సైజులు, సన్నగా ఉండటం ఫ్యాషన్ స్టేట్మెంట్ అయ్యాక ఇప్పుడు ఏం తిన్నా కాలరీలు లెక్కెట్టుకోవడం పెద్ద అలవాటయిపోయింది. పాప్ కార్న్ అందరికి ఇష్టం. ఒకటి రుచిగా…

  • మానసిక సంతోషం కోసం విహార యాత్రలు చేయండి అంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంలో కలిగే జడత్వాన్ని ఈ ప్రయాణాలు వదిలించి జీవితంనిస్సారంగా అనిపించకుండా చేస్తాయట ప్రయాణాలు. కొత్త ప్రదేశాలు చూస్తూ వుంటే ప్రాంతం, భాష, మనుషులు, ఆహారం, మన ఆహార్యం కూడా మారుతుంది. ఈ కాస్త ఆటవిడుపు ప్రయాణం మనకు కొత్త రుచుల్ని, కొత్త అనుభవాలని ఇస్తుంది. మన పూర్వీకులు కూడా తీర్ధ యాత్రలకు వెళ్ళేవారు. అమీబా లాగా కదలకుండా వుంటే మన మెదడు లో నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. అవి శరీరం పై తీవ్ర ప్రభావం చూపుతాయి. మనకున్న చిరాకులు, విసుగులు మరచిపోవాలంటే డైలీ రొటీన్ జీవితం నుంచి కాస్త విముక్తి కావాలంటే ఉన్న పరిస్తితుల నుంచి కాస్త దూరంగా వెళ్ళాలి. మనసుకు ఒక ఉపశమనం కలుగుతుంది. ప్రయాణం కోసం ఎన్నో సులభమైన మార్గాలున్నాయి. అద్భుతమైన సౌకర్యాలున్నాయి. విలాసవంతమైన ప్రయాణాలే విహార యాత్రలు కావు. చిన్న పల్లెటూర్లో కాస్త మార్పుగా రెండు రోజులు గడిపినా చాలు అదీ గొప్ప అనుభవమే. ఏ వయసులో ఉన్నా ఈ ప్రయాణాలు ఆనందాన్నే ఇస్తాయి.

    ప్రశాంతత కోసం ఓ ప్రయాణం

    మానసిక సంతోషం కోసం విహార యాత్రలు చేయండి అంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంలో కలిగే జడత్వాన్ని ఈ ప్రయాణాలు వదిలించి జీవితంనిస్సారంగా అనిపించకుండా చేస్తాయట ప్రయాణాలు. కొత్త…

  • నిజానికి బాలీవుడ్ హీరోయిన్లందరూ దక్షినాది తెరపైన మెరిసిన వారే. పెద్దయి పోయినా వాళ్ళ దృష్టి ఇటే ఉండటంలో ఆశ్చర్యం ఏదీ లేదు. ఇదివరకు ఎప్పుడో శ్రీదేవి తమిళ సినిమాలో రాణీ వేషం వేస్తే డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమీపుత్ర శాతకర్ణి లో రాజమాతగా బ్రహ్మాండంగా నటించేసింది. ఇప్పుడిక కాజోల్ వంతోచ్చింది. ధనుష్ సినిమాలో లేడీ విలన్ గా నటించబోతుంది. 18 సంవత్సరాల తర్వాత అనంతరం కాజోల్ హటాత్తుగా తెలుగు సినిమాలో విలన్ పాత్రలో అనే సరికి అందరికీ ఆశ్చర్యమే. ఇదంతా చూసి బాలీవుడ్ జనం ఆశ్చర్యపోతుంటే ఇటు దక్షిణాదిన మన సినీ కళాభిమానులు మాత్రం బోలెడంత కోపం తెచ్చేసుకొంటున్నారు. హీరోయిన్లు సరే వస్తున్నారు, కారక్టర్ పాత్రలు కూడా వాళ్ళే వేస్తే మరి మన వాళ్ళ సంగతేమిటని వీళ్ళ ప్రశ్న. ఈ మనోభావాలతో నిమిత్తం లేకుండా కాజోల్ మాత్రం విలన్ గా రాబోతుందని సమాచారం.

    లేడీ విలన్ గా కాజోల్

    నిజానికి బాలీవుడ్ హీరోయిన్లందరూ దక్షినాది తెరపైన మెరిసిన వారే. పెద్దయి పోయినా వాళ్ళ దృష్టి ఇటే ఉండటంలో ఆశ్చర్యం ఏదీ లేదు. ఇదివరకు ఎప్పుడో శ్రీదేవి తమిళ…

  • తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వివిధ రంగాల్లో సేవలందించిన మొత్తం 89 మందిని ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించనుంది. విజయవాడ కేంద్రంగా విద్యా సంస్థ స్థాపించి ఆ సంస్థల పేరునే ఇంటి పేరుగా మార్చుకొన్న వేగి కోటేశ్వరమ్మ గారు ఆరు దశాబ్దాలుగా విద్యావనం లోనే అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా గోసాల గ్రామంలో 1925 లో జన్మించారు. కాకినాడ, గుంటూరు లలో కళాశాల చదువును పూర్తిచేసి ఉపాధ్యాయ వృత్తి లోకి రావడానికి శిక్షణ తీసుకొన్నారు. నెల్లూరు, విజయవాడల్లో కొంతకాలం పనిచేశారు. చదువు విషయంలో లింగ వివక్షను చూసి చలించిపోయి 1955 లో పది మంది పిల్లలతో మాంటిస్సొరి పేరుతో పాఠశాల ను స్థాపించారు. విద్యారంగం లో ఆమె చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది.

    చదువుల తల్లి కోటేశ్వరమ్మ గారు

    తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వివిధ రంగాల్లో సేవలందించిన మొత్తం 89 మందిని ప్రభుత్వం ఈ పురస్కారాలతో సత్కరించనుంది. విజయవాడ కేంద్రంగా…

  • విశ్వ సుందరిగా ఎంపికైన వేదిక నుంచి ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళటం అపురూపమైన విషయమో. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ 1994లో ఫిలిప్ఫిన్స్ లోని మనీలాలో జరిగిన అందాల పోటీలో విశ్వ సుందరిగా ఎంపికయ్యారు. 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వేదికపైన జనవరి 30వ తేదీన జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీలకు జడ్జిలలో ఒకరిగా హాజరవుతున్నారు. ఈ విషయం గురించి చెపుతూఇది అపురూపమైన విషయం మాత్రమే కాదు పరిపూర్ణం కూడా. నా లైఫ్ ఇప్పుడు ఫుల్ సర్కిల్ తిరిగినట్లుగా ఉంది అంటోంది సుస్మితా సేన్. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కూతురు అలీషా సేన్ ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు సుస్మితా. ఈ తల్లీకూతుళ్ళిద్దరితో పాటు మిస్ యూనివర్స్ కిరీటం కోసం మన దేశం నుంచి పోటీపడుతున్న రోష్మితా హరిమూర్తి భారతీయతకు నిండుదనం తేబోతున్నారు. ఆ రోజు రోష్మితకు టైటిల్ వస్తే మళ్ళీ అదో గొప్ప రికార్డు.

    అపురూపం కాదు పరిపూర్ణం

    విశ్వ సుందరిగా ఎంపికైన వేదిక నుంచి ఆ పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళటం అపురూపమైన విషయమో. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ 1994లో ఫిలిప్ఫిన్స్ లోని…