• ఉడికిస్తే పోషకాలు పోతాయని గ్రిల్ చేస్తే నూనె నెయ్యివాడకం తగ్గుతుందని నిపుణులు చెపితే విన్నాం, కానీ కొత్త పరిశోధనలు ఆహార పదార్ధాలు వుదికించడమే మేలని, వాటిలో కాలరీలు వుడికిస్తేనే శరీరానికి అందుతాయని అంటున్నారు. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉందంటున్నాయి. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉంటుందన్నాయి పరిశోధనలు. నిప్పుల పైన వండటం, వుడికించడం ఇవన్నీ మంచివే. మాంసాహారం కానీ శాఖాహారం గానీ గోల్డ్ పద్దతి తో వుడికించినందు వల్ల గొప్ప ప్రయోజనం లేదు. కొన్ని రకాల ఆహార పద్దతుల్లో షుగర్ నిల్వల తో పాటు ఫ్యాటీ ప్రోటీన్ AGE నిల్వలు మరీ ఎక్కువవుతాయి సన్నని సెగ పైన వివిధ రకాలుగా ఇటు కాస్త పచ్చిగా కొంత మరీ ఉడికించి మాములు వంటకం మాదిరిగా చూస్తేనే లాభం అంటున్నాయి. అలాగే తినే భోజనంలో ముందుగా కూర, పులుసు, పచ్చడి, పెరుగు ఇలా ఒక ఆరోగ్యవంతమైన వరుసలోనే ఆహారం తింటే మేలని, భారతీయ వంటలు, భోజన పద్దతులు అన్ని ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకునే రూపొందించారని అధ్యాయినాలు చెప్పుతున్నాయి.

    భారతీయ ఆహార విధానం బెస్ట్

    ఉడికిస్తే పోషకాలు పోతాయని గ్రిల్ చేస్తే నూనె నెయ్యివాడకం తగ్గుతుందని నిపుణులు చెపితే విన్నాం, కానీ కొత్త పరిశోధనలు ఆహార పదార్ధాలు వుదికించడమే మేలని, వాటిలో కాలరీలు…

  • ఇంటీరియర్స్ చలా ఖరీదు. ఒక సారి కొన్ని వస్తువులు కొన్నాక, ఇక మాటి మాటికీ మార్చాలంటే కుదరదు. కానీ రోజు ఇల్లు ఒకేలా వుంటే బోర్ గా వుంటుంది. మరి కస్త మార్పు తేవాలంటే బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, సోఫా కవర్స్ ఇలాంటివి మార్చుతూ వుండాలి. పడక గది నీట్ గా వుండాలంటే పిల్లో కవర్స్ కొత్త కొత్త డిజైన్ల తో రంగులతో ఉండేలా తీసుకుంటే అవి ఎప్పుడు మార్చేస్తూ వుంటే ఫ్రెష్ లుక్ వస్తుంది. మంచి రంగులు ఎంపిక చేసుకోవాలి. పిల్లో కవర్స్ రంగు, డిజైన్, ఫ్యాబ్రిక్ పరిగణలోకి తీసుకోవాలి. గది ధీమ్ ను బట్టి బెడ్ రూమ్ దుప్పట్లు, పిల్లో కవర్స్ ఎంపిక చేయాలి. గది అందం పెంచడం లో కుషాన్ కవర్స్ బాగా ఉపకరిస్తాయి. డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్ లో కుషన్స్, కవర్స్ అమర్చు కుంటే ఆకర్షనియంగా వుంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్ మోడల్స్ లైవ్ లీ ప్రింట్స్ వేసిన కవేర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉంటున్నాయి. ఇంటీరియర్ ఫర్న్ బార్ ను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన ఆ కట్టు కొనే పిల్లో కవర్స్ బెడ్ షీట్స్ కుషన్ కవర్స్ ఎంపిక చేయడం మంచిది. ఇంటికి గ్రాండ్ లుక్ వస్తుంది.

    ఇవి మరిస్తేనే గ్రాండ్ లుక్

    ఇంటీరియర్స్ చలా ఖరీదు. ఒక సారి కొన్ని వస్తువులు కొన్నాక, ఇక మాటి మాటికీ మార్చాలంటే కుదరదు. కానీ రోజు ఇల్లు ఒకేలా వుంటే బోర్ గా…

  • ఇల్లు సర్దుకునే టప్పుడు, వార్డ్ రోబ్ కోసం ఎక్కువ సమయం కేటాయించ వలసి వస్తుంది. పిల్లలకి, పెద్దలకీ,కొత్తవీ, పాతవీ, స్కూల్ డ్రెస్, నైట్ డ్రెస్ ఇంకెన్నో బట్టల తో ఎన్నీ బీరువాలైన సరిగా సర్ధకపోతే చాలవనిపిస్తాయి. పిల్లలు వేసుకునే బట్టలు విడగొట్టి స్కూల్ డ్రెస్, రేగ్యులర్, కొత్తవి వరుసగా రెండు మూడు అరల్లో సర్దితే వాళ్ళయినా ఈజీగా తీసుకోగలుగుతారు. ఇక చీరలు, బ్లౌజులు ఒక దాన్లో ఒకటి తిరుమారుగా కాకుండా ఇస్త్రీ నుంచి రాగానే అన్ని సెట్ గా సర్దుకోవాలి. జ్యూవెలరీ ఇతర ఐటమ్స్ ఒక సెక్షన్ లో అమర్చుకోవాలి. రోజు ఉపయోగించు కునేవి ఒక దాన్లో వుంచి. ఫంక్షన్స్ ఇతర పార్టీల్లో వేసుకునేవి లాకర్ లో బద్రం చేసుకోవాలి. ఫార్మల్స్ ఎక్కువగా వాడతాం కనుక వాటిని సులువుగా తీసుకునేలాగా వుండాలి. అడ్రస్ కు తగ్గ యాక్సిసరీస్ కూడా పక్కనే ఫిల్ఫ్ ల్లోనే అమర్చుకోవాలి. నెలకొ సారైనా వార్డ్ రోబ్ నీటిగా సర్దుకుంటే ముఖ్యంగా పిల్లలు స్కూల్కు వెళ్ళే ఉదయం వేళ ప్రతీది వెతుక్కునే పని లేకుండా ఎక్కడ వస్తువులు అక్కడ వుంటే టైమ్ కలసి వచ్చేలాగా వుంటుంది.

    వార్డ్ రోబ్ సర్దటం చాలా ముఖ్యమైన పని

    ఇల్లు సర్దుకునే టప్పుడు,  వార్డ్ రోబ్ కోసం ఎక్కువ సమయం కేటాయించ వలసి వస్తుంది. పిల్లలకి, పెద్దలకీ,కొత్తవీ, పాతవీ, స్కూల్ డ్రెస్, నైట్ డ్రెస్ ఇంకెన్నో బట్టల…

  • పచ్చడి, మురబ్బా, క్యాండీ పలు రూపాల్లో తీసుకున్నా ఉసిరి చేసే మేలు ఇంకే పండు చేయదు అనుకోవచ్చు. విటమిన్-సి నిల్వలు పుష్కలంగా వున్న ఉసిరి కాయ నేరుగా తినేసినా మంచిదే. డై ఆమ్లా క్యాండీలు వున్నాయి. గొంతు మంట జలుబు వుంటే రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి, 2 టీ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది. పరగడుపున ఉసిరి రసం పుక్కిలి పడితే నోట్లోనుంచి వచ్చే పండ్ల నుంచి ఉపసమనం. ఆర్రైటిస్ వంటి కీళ్ళనొప్పుల నివారణకు ఉసిరి మంచిదే. బరువు తగ్గడం, జీర్ణ శక్తి పెంచడం ఉసిరి వల్ల సాధ్యం. దీని లో వుండే ఔషద గుణాల వల్ల ఇది సహజ స్థిరమైన కండీషనర్. ఉసిరి నూనె రెగ్యులర్ గా వాడితే జుట్టు తెల్ల బడటం తగ్గిస్తుంది. ఆరోగ్యవంతమైన కేశ సంపదను అందిస్తుంది. జుట్టు కుదుళ్ళకు బలాన్ని ఇస్తుంది. ఉసిరిని ఆహారంలో తీసుకుంటే చర్మానికి మంచి రంగోస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. బ్లడ్ షుగర్ అదుపులో వుంటుంది.

    కేశ రక్షణకు ఉసిరి

    పచ్చడి, మురబ్బా, క్యాండీ పలు రూపాల్లో తీసుకున్నా ఉసిరి చేసే మేలు ఇంకే పండు చేయదు అనుకోవచ్చు. విటమిన్-సి నిల్వలు పుష్కలంగా వున్న ఉసిరి కాయ నేరుగా…

  • నీహారికా, నీ సమస్య అందరి సమస్యే తెలుసా. పనిలో ఎప్పుడూ పర్ఫెక్ట్ గా వుందామని, ఇంకెవ్వరూ మనలా వుండరనీ నిర్ణయించుకోవడమే అసలు సమస్య. ప్రతిపని మనమే చేయాలని పెట్టుకొంటే ఇంక సమయం ఏమి మిగులుతుంది. కొన్ని పనులు మొదలు పెడతాం ఒక్కోసారి పర్ఫెక్ట్ గా వుంటుంది ఒక్కోసారి ఫెయిల్ అవుతాం. అది సహజం. సాంకేతిక విజ్ఞానం మన పని త్వరగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. చాలా వేగంగా ఫోన్లు, లాప్ టాప్ లు, పి.సి లు చూస్తాం. కానీ సైడ్ ఎఫెక్ట్ గా, గంటల తరబదిఫోనే సంభాషణలూ, ఈ మెయిళ్ళు, ఫేస్ బుక్ లు సమయం తినేస్తాయి. క్షణం తీరిక లేకుండా పని చేస్తేనే పూర్తవుతుంది అనుకొని అస్తమానం రెస్ట్ లేకుండా పని చేస్తూనే వున్దతమింకో తప్పు. అంచేత కెరీర్ లో గానీ, చదువు లో గానీ కొన్ని రూల్స్ వుండాలి. ఏ పని పర్ఫెక్ట్ గా, కాస్తయినా తేడా లేకుండా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. ఓసారి ఫెయిల్ అయితే ఇక మన వల్ల కాదు అని చేతులు ఎత్తేయకూడదు. సాంకేతిక విజ్ఞానాన్ని తెలివిగా వాడుకోవాలి. ఉన్న సమయం వృధా చేయకుండా బాగా వాడుకోవాలి. చదువు లేక ఉద్యోగం మాత్రమే జీవితం కాదు. ఇంకా ఎన్నో యాక్టివిటీస్ కోసం సమయాన్ని ఫ్రేమ్ చేసుకొని ప్రతి క్షణాన్ని ఆస్వాదించుకోవాలి. రోజూ చేసే పని అయినా సరే దాన్ని మనం ప్రతిసారి శ్రద్దగానే చూసి మంచి ఫలితం సాధించేలా వుండాలి. మొత్తానికి పనిభారంతో కుంగిపోయేపరిస్థితి తెచ్చుకోవద్దు.

    పనులకీ ప్రణాళిక కావాలి

    నీహారికా, నీ సమస్య అందరి సమస్యే తెలుసా. పనిలో ఎప్పుడూ పర్ఫెక్ట్ గా వుందామని, ఇంకెవ్వరూ మనలా వుండరనీ నిర్ణయించుకోవడమే అసలు సమస్య. ప్రతిపని మనమే చేయాలని…

  • వేసవి వస్తే కర్బూజా పండ్లు వస్తాయి. తియ్యని మామిడి పండ్లు ఇష్టపడ్డట్లు ఈ దోసపండు రుచితో వుండే కర్బూజా ను పెద్దగా ఇష్టపడరు. కానీ ఇది ఎంతో మంచి పోషకాహారం. ఇందులో చాలా రకాలున్నాయి. నిమ్మ ఫ్లేవర్ లో వుండే లెమన్ డ్రాప్, షుగర్ మెలన్, వైట్ హనీడ్యూ, ఆకుపచ్చని గాలియా, పసుపు రంగు పర్షియన్, కోలగా వుండే శాంటా క్లోజ్, చారలతో వుండే టస్కన్ ఇలా చాలానే వున్నాయి. ఇవి వేసవిలోనే కాదు మిగతా కాలాల్లోనూ వుంటాయి. లంక దోసకాయాలని పిలిచే గోదావరి జిల్లాల లంకల్లో పండే పండ్లు చాలా రుచిగా వుంటాయి. నీటి శాతం ఎక్కువ. పుష్కలంగా కెరోటినాయిడ్లు, కుకుర్చిటాసిన్లు, శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేస్తూ ఎన్నో రకాల కాన్సర్స్ ను, నరాల జబ్బులని తగ్గిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులో వుండే ప్రోటీన్లు, కొల్లాజెన్ పదార్ధాలు కణాల పునర్నిర్మాణానికి తోడ్పడి చర్మం వడలిపోకుండా నిగనిగలాడేలా చేస్తాయి. ఈ అద్భుతమైన వేసవి ఆహారాన్ని మిస్ అవ్వొద్దు.ఆరోగ్యం, అందం కోసం కుడా..

    అందం, ఆరోగ్యం కోసం కర్బూజా

    వేసవి వస్తే కర్బూజా పండ్లు వస్తాయి. తియ్యని మామిడి పండ్లు ఇష్టపడ్డట్లు ఈ దోసపండు రుచితో వుండే కర్బూజా ను పెద్దగా ఇష్టపడరు. కానీ ఇది ఎంతో…

  • ఎంతో అందమైన కార్పెట్స్ మార్కెట్ లో కనిపిస్తాయి. కాళ్ళ కింద మెత్తగా అందమైన రంగులు చెక్కని పువ్వులు డిజైన్లు, హాల్ లో వేస్తె హాలుకే కొత్త అందం. మెత్తని ఊలు పైన నడవడం మనకీ సౌకర్యం. కానీ దీన్ని శుబ్రం చేయక పొతే మాత్రం ఎంతో నష్టం అనారోగ్యం. ఎప్పుడూ, ప్రతి రోజు, వ్యాక్యూమ్ క్లీనర్ తో దాన్ని శుబ్రం చేయాలి. మరకలు పడితే ఎప్పటికప్పుడు శుబ్రం చేయాలి. అలా వదిలేస్తే మరకలతో పూర్తిగా పడిపోతుంది. మరకల్ని క్లీన్ చేసే యాసిడ్ ని ముందుగా పరీక్షా చేయాలి. కొన్ని యాసిడ్స్ రంగుల్ని పోగొట్టేస్తాయి. డిటర్జెంట్లు, షాంపూలు ఉపయోగించకూడదు. పౌడర్ నలకలుగా కార్పెట్ లో కనిపిస్తూ వుంటుంది.పడక గదిలో కార్పెట్ లోపలగా వుంటుంది కనుక దుమ్ము రోజు పట్టదు. కానీ హల్లో కార్పెట్లు నెలకొ సారి మొత్తం చుట్టేసి క్లీన్ చేసేలా వుంచాలి. స్ట్రీమ్ క్లీనింగ్ మంచి ఐడియా. కార్పెట్ తడిగా లేకుండా చూసుకోవాలి. స్ట్రీమ్ క్లీన్ చేసే ముందు బ్రష్ చేయాలి. ఇల్లు అందంగా ఉంచుకోవడం మంచిదే కానీ శుబ్రం చేయడం పనుల్లో భాగంగా అయిపోవాలి.

    మరి అందంగా వుండాలంటే కష్టపడాలి

    ఎంతో అందమైన కార్పెట్స్ మార్కెట్ లో కనిపిస్తాయి. కాళ్ళ కింద మెత్తగా అందమైన రంగులు చెక్కని పువ్వులు డిజైన్లు, హాల్ లో వేస్తె హాలుకే కొత్త అందం.…

  • ఎన్నో పెళ్ళిళ్ళకు హాజరవుతాం. వందల రకాల భోజన పదార్ధాలు. ఏది తినాలో అర్ధం కానన్ని వెరైటీస్, ఎంతో వ్యర్ధం. కామార్స్ లో పీ.జీ తీసుకున్న శ్యామలా సురేష్ ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ విభాగంలో పని చేస్తున్నారు. ఆమె కూడా అద్భుతమైన పెళ్ళిళ్ళు, అందులో వృధా అయ్యె పదార్ధాలు ప్లాస్టిక్ ఉత్పత్తుల గురించి బాధ పడి ఎకో ఫ్రెండ్లీ మారేజస్ కి శ్రీకారం చుట్టారు. ఇవి అన్ని పెళ్ళిళ్ళ మాదిరిగానే వుంటాయి. ఈ గ్రీన్ మ్యారేజ్ కళ్యాణ మండపం లో ప్లాస్టిక్ గ్లాసులు వుండవు. గాజు గ్లాసులు, తళ తళా మెరిసే స్టీలు కంచాలు, పచ్చని అరటి ఆకులు. అంతా క్లీన్ అండ్ గ్రీన్. పోస్టర్లు అంటించి ఆహారం వృధా చేయొద్దని చెపుతారు. చిన్నా చితకా వ్యర్ధాలు కనిపిస్తే తడి పొడి పద్దతి లో వేరు చేస్తారు. కంపోస్ట్ బావుల నిర్వాహకులే చేస్తారు. కుదరక పొతే బయో గ్రీన్ ప్లాంట్లకు తరలిస్తారు. పచ్చని పందిరిలో ముచ్చటైన ఎకో ఫ్రెండ్లీ మ్యారేజస్ అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. పర్యావరణ హితం కోరె శ్యామలా రమేష్ బెంగుళూరు వాసి.

    పచ్చని పందిట్లో ముచ్చటైన పెళ్ళి

    ఎన్నో పెళ్ళిళ్ళకు హాజరవుతాం. వందల రకాల భోజన పదార్ధాలు. ఏది తినాలో అర్ధం కానన్ని వెరైటీస్, ఎంతో వ్యర్ధం. కామార్స్ లో పీ.జీ తీసుకున్న శ్యామలా సురేష్…

  • కొత్త సినిమా చూడగా నే హీరోయిన్ హెయిర్ స్టైల్ నచ్చి పోతుంది. విండో షాపింగ్ చేస్తుంటే వర్క్ బ్లవుజ్ భలే అనిపిస్తుంది. కానీ మన శరీరానికి అది నప్పుతుందా లేదా ఆలోచించాలి కదా. ఫలానా బ్రాండ్ ఖరిదైనది కానీ ఆ బ్రాండ్ ప్యాంట్ వేసుకోగలమా? ఖరీదైన అలంకరణ వస్తువులు, నగలు కలిపి తీసుకున్న డ్రెస్సులుబావుంటాయి. లేక పొతే బ్రాండెడ్ కొని లాభం ఏముంటుంది? పైగా వీటిని మైంటైన్ చేయాలి. మంచిగా ఉతకాలి, ఇస్త్రీ చేయాలి, కొన్ని రకాల వస్త్రాలు కొంత వేడి వద్దనే ఇస్త్రీ చేయాలి. షాపింగ్ విషయంలో కొన్ని జ్యగ్రత్తలు తీసుకోవాలి. ఖరీదైన స్కర్టులు, దుపట్టాలు, వర్క్ బ్లౌజులు కొన్ని వుంటే చాలు. ఇక వాటికి మ్యాచ్ అయ్యే ఇంకో రకం దుస్తులు కొనుక్కుంటు పోవాలి. వర్డ్ రోబ్ లో పేరుకొన్న అన్ని పాత మోడల్స్ అనిపిస్తాయి. ఎప్పటికి ఫ్యాషన్ మారని డెనిమ్ ప్యాంట్లు, తెల్లని కుర్తాలు, లాంటివి సరదాగా కొనుక్కున్నా పర్లేదు. అవి ఎప్పటికి ఫ్యాషనే.

    ఫ్యాషన్లు మారుతుంటాయి జాగ్రత్త

    కొత్త సినిమా చూడగా నే హీరోయిన్ హెయిర్ స్టైల్ నచ్చి పోతుంది. విండో షాపింగ్ చేస్తుంటే వర్క్ బ్లవుజ్ భలే అనిపిస్తుంది. కానీ మన శరీరానికి అది…

  • పిల్లల పెంపకానికి కూడా ఎంతో శిక్షణ కావాలి ఒక్క చిన్న మొక్క కుదురుగా పెరగలంటేనే దాన్ని ఎంత వరకు ఎలా పెంచాలో తలుసుకోవాలి, ఇక పిల్లల విషయం మాటలా? పెరిగే పిల్లల మెదడు ఎంతో చురుకుగా వుంటుంది. దాదాపు వంద బిలియన్లు న్యురాన్లు చురుకుగా ఉంటాయట. ఎన్నో తలుసుకోవాలనే కుతూహలం వందల ప్రశ్నలు, ఎన్నో పరిశోధనలు, ఆ వయస్సులో వాళ్ళకు 'నో' అన్న పదం వినిపించ కూడదు అంటారు పేరెంటింగ్ ఎక్స్ పర్ట్స్. తల్లి దండ్రులు బిజీగా వుండి. ఇప్పుడు కాదు పో, విసిగించకు పో, ఆడుకో పో అంటూ వుంటారు. అలాగే, పరుపులెక్కి తొక్కొద్దు, కుర్చీ లో నుంచి దూకొద్దు, కిటికీ లో నుంచి చూడొద్దు, అలా ఎగరోద్దు, పరుగెత్తోద్దు, ఇక ఇలా అన్ని ఆంక్షలే. ఇక స్మార్ట్ ఫోనో, టీ.వి నో అలవాటు చేస్తారు. తీరాదానికి అలవాటు పడి అదే పనిగా చూస్తుంటే అదీ తప్పంటారు. మరి పిల్లల సంగతి ఏమిటి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వాళ్ళతో కబుర్లు చెప్పండి, ఆడండీ, వాళ్ళకు ఎం కావాలో తెలుసుకోండి, సందేహాలు తీర్చండి. బయటకు తీసుకు పోయి ఆడించండి. డబ్బు కాదు వాళ్ళకోసం ఇవ్వాల్సింది సమయం అంటున్నారు. తల్లి దండ్రులు ఆలోచించాలి మరి.

    ‘నో’ అని చెప్పడం చాలా తప్పు

    పిల్లల పెంపకానికి కూడా ఎంతో శిక్షణ కావాలి ఒక్క చిన్న మొక్క కుదురుగా పెరగలంటేనే దాన్ని ఎంత వరకు ఎలా పెంచాలో తలుసుకోవాలి, ఇక పిల్లల విషయం…

  • ఒత్తిడిని అదుపు చేసే మార్గాల్లో మొట్ట మొదటిడి స్నానం అంటారు. మెదడు తో పాటు శరీరం లో కూడా తేలిక పడి ఒత్తిడి పోతుంది. శారీరకమైన అలసట తగ్గాలంటే మొదట ఒంటికి నూనె మర్దన చేసుకోవాలి. ఆలివ్, కొబ్బరినూనె తో కలిపి గోరు వెచ్చగా చేసి తలకు శరీరానికి పట్టించాలి. ఆ తర్వాత ఆవిరి పెట్టాలి. ఈ మర్దనతో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అలసట పోయేందుకు వేడి నీళ్ళతో స్నానం చేస్తేనే పోతుంది అనుకుంటారు. గోరు వెచ్చని నీరే వడాలి. అందులో మంచి సువాసన వచ్చే లవెందర్ నూనె ను కలిపి తలారా స్నానం చేస్తే ఆ చక్కటి సువాసనకే మెదడు తేలిక పడి మనస్సుకు హాయి గా అనిపిస్తుంది. బాదాం యుకలిప్టటాస్ నూనెల్ని సమానంగా కలిపి కాస్త వేడి చేసి తలకు పట్టించాలి. గోరు వెచ్చని నిలల్లో తలస్నానం చేయాలి. అలాగే కలబంద గుజ్జు, గులాబీ రేకుల గుజ్జు, తేనె, లవెందర్ నూనె కలిపి వంటికి పట్టిస్తే, ఆ తర్వాత చేసే స్నానం వంటికి, మనస్సుకి మెదడుకి స్వాంతన ఇస్తుంది.

    శారీరక అలసట ఈ స్నానం తో మాయం

    https://scamquestra.com/sozdateli/7-fanis-dzhuraev-37.html

  • అంకితా కుమారి, పదో తరగతి పరీక్ష రాస్తోంది. ఏముంది? ఎంతో మంది రాస్తున్నారు అనొచ్చు. కానీ అంకిత పరీక్ష రాస్తుంది కాలి బొటన వేళ్ళ మధ్య పెన్ను తో, అంటే కాలి తో రాస్తోంది పరీక్ష బీహార్ లోని నరన జిల్లాకి చెందిన బనియా పూర్ జిల్లాలోని పదో తరగతి అమ్మాయి అంకితా కుమారి.ఐదేళ్ళ వయస్సులో పోలియో వచ్చింది. చేతులు చచ్చుపడి పోయాయి. మాటలు సరిగ్గా రావు. ఇప్పుడు ఆ పాప అమ్మమ్మ తోడుగా పరీక్ష సెంటర్ కి వస్తుంది. కార్పెట్ పైన కూర్చొని పరిక్షలు రాస్తోంది. ఆమెకి ఎంతో మానసిక ధైర్యం వుంది. తప్పకుండా మంచి జాబ్ సంపాదించే ప్రతిభ వుంది అంటున్నారు ఆమె క్లాస్ టీచర్లు. జీవితం ఏదిచ్చినా సరే దాన్ని మనసారా స్వీకరించి దాన్ని గెలవాలనే అంకిత ఇవ్వాల సోషల్ మీడియా అభినందనలు పొందుతుంది.

    అద్భుతమైన గొప్ప కధ అంకితా కుమారి.

    అంకితా కుమారి, పదో తరగతి పరీక్ష రాస్తోంది. ఏముంది? ఎంతో మంది రాస్తున్నారు అనొచ్చు. కానీ అంకిత పరీక్ష రాస్తుంది కాలి బొటన వేళ్ళ మధ్య పెన్ను…

  • చిన్న అల్లం ముక్క, ఒక్క మిరపకాయ, నెయ్యి తో వున్న ఉప్మా అదిరిపోతుంది. అల్లం లో వున్న శక్తి అంతా ఇంతా కాదు. రెండు చెంచాల అల్లం రసం తీసి కొంచం తేనె కలిపి రెండు పూటలా తాగితే ఆస్తమ, జలుబు, దగ్గు తగ్గుతాయి. అల్లం రసంలో పిప్పిల్ల చూర్ణం, సైంధవ లవణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తాగితే అస్తమా చాలా వేగంగా తగ్గిపోతుంది. పన్ను నొప్పి పుడితే అల్లం ముక్క నమలాలి. అల్లం రసం, నిలువ వున్న నెయ్యి, కర్పూరం కలిపి చాతీ పై రాస్తే నిమోనియా ప్రభావం తగ్గుతుంది. అల్లం శరీరం లో వేడి నింపుతుంది. నదులు బలపడతాయి. జీరణ శక్తి పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు పోతాయి. రక్తం శుభ్ర పది శరీరం ఆరోగ్యవంతంగా వుంటుంది. అల్లంతో ఇన్ని ఉపాసమనాలున్నప్పుడు. దీన్నీ ఆహారంలో వీరివీరి గా వాడుకునే దారి వెతకాలి.

    అల్లం శక్తి అపరిమితం

    చిన్న అల్లం ముక్క, ఒక్క మిరపకాయ, నెయ్యి తో వున్న ఉప్మా అదిరిపోతుంది. అల్లం లో వున్న శక్తి అంతా ఇంతా కాదు. రెండు చెంచాల అల్లం…

  • ఎప్పుడు ఒకేలా వుంటే పిల్లలు ఎప్పుడు మెచ్చారు. నోటికి రుచిగా ఉంటుందని వాళ్ళకు తెలనెంత అనుభవం లేదు కనుక కళ్ళకు బావుంటే అది మెచ్చుతారు. సాధారణంగా మనకు మైదా,గుడ్ల వున్న దిబ్బ రొట్టె లాగా కనిపించే కేక్స్ తెలుసు. సాధారణంగా గుండ్రంగా ఐసీగా అలాగే కదా వుండేది. కానీ ఇప్పుడు జెల్లీ కేక్స్, షుగర్ ఫ్లేవర్ కేక్స్, గ్రావిటీ కేక్స్, ఫాండెంట్ కేక్, ఒక్క సారి ఇలాంటి కేక్స్ కోసం ఆన్లైన్ లో చుస్తే అబ్బో ఎన్ని రకాలో. గాల్లో తేలిపోయే గులాబీ పువ్వు, వేలాడే ఆకులతో, మల్లె పువ్వులు, మొగ్గలు విచ్చుకున్న గులాబీ రెండు ఆకులు ఇవన్నీ షుగర్ ఫ్లవర్ కేక్స్ అందాలు. ఇవి తయారు చేసే విధానం, వాటి కోసం ఉపయోగించే జెల్లీలు, పరికరాలు అన్ని వివరంగా వుంటాయి. వీడియోలు కూడా వున్నాయి.

    పువ్వల్లెవాలి, ముచ్చటగా విచ్చుకునే కేక్స్

    ఎప్పుడు ఒకేలా వుంటే పిల్లలు ఎప్పుడు మెచ్చారు. నోటికి రుచిగా ఉంటుందని వాళ్ళకు తెలనెంత అనుభవం లేదు కనుక కళ్ళకు బావుంటే అది మెచ్చుతారు. సాధారణంగా మనకు…

  • నీహారికా, మనం శరీరానికి పనికి వచ్చే ఎన్నో విటమిన్స్ గురించి తెలుసుకొన్నాం. మరి విటమిన్ M గురించి తెలుసా. ఇది లేకపోతే జీవితo ఒక్క అడుగు కూడా కదలదు. ఆరోగ్యం, ఆనందం, అందం ఏదైనా సరే M వుంటేనే. చదువుకోవాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే, మంచి జీవితం కావాలంటే విటమిన్ M. ఇది కొంతమంది దగ్గరే పదిలంగా ఉంది. వాళ్ళని కోటీశ్వరులు అంటారు. మిగతా వాళ్ళు వాళ్ళని చూసి అసూయ పడతారు. కానీ నువ్వు ఈ విటమిన్ విలువ తెలుసుకో చాలు. దుబారా అన్న పదం దగ్గరగా ఈ విటమిన్ M వుండదు. డబ్బు సంపాదించాలి. కూడబెట్టి తర్వాత తరాలకు ఇవ్వడం కోసం కాదు. తర్వాత తరాలకు ఎలా సంపాదించుకోవాలో, జీవితం ఎలా వుంటుందో చెప్పాలి. అంటే పిల్లలకు డబ్బు విలువ నేర్పి, వాళ్ళు దాన్ని సక్రమంగా వాడుకొనేలా దారి చూపాలి. 15 సంవత్సరాలు నిండకుండానే సెల్ ఫోన్స్, టూవీలర్స్ వీలయితే కార్లు, పర్సు నిండా డబ్బు ఇచ్చి వాళ్ళను పనికిమాలిన వాళ్ళుగా తయారు చేయకూడదు. డబ్బు చాలా ముఖ్యం, అవసరం కానీ అదే జీవితం ఎప్పుడూ కాదు. ఒక పిల్లవాడు కష్టపడి ఒక క్లిష్టమైన లెక్కను రెండు గంటలు బుర్రకు పదును పెట్టి సాల్వ్ చేయగలిగితే కలిగే సంతోషం వంటిది వాడి చేతికి కష్టం లేకుండా వచ్చిపడిన పాకెట్ మనీ ఇవ్వరు. వాడు పెరిగి పెద్దవాడై, వాడి కాళ్ళపైన వాడు నిలబడి వాడి ఉపాధి వాడు సంపాదించుకోవాలి. వాడికి విటమిన్ M అలా అందాలి. అప్పుడే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

    ఆ విటమిన్ గురించి తెలుసా!

    నీహారికా, మనం శరీరానికి పనికి వచ్చే ఎన్నో విటమిన్స్ గురించి తెలుసుకొన్నాం. మరి విటమిన్ M గురించి తెలుసా. ఇది లేకపోతే జీవితo ఒక్క అడుగు కూడా…

  • ఇది ఇవాల్టి న్యూస్ కాకపోయినా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉంది. ఒక రోజు రాత్రి తెల్లారే సరికి రంగు రంగుల బొమ్మలతో తెరచిన పుస్తకాల్లా కనిపించే బెంచీలు వీధుల్లో వెలిసే సరికి లండన్ వాసులు ఆశ్చర్యపోయారట. అసలు ఇలాంటి బెంచీలు ఎందుకు పుట్టుకొచ్చాయి అంటే లండన్ నగర సాహిత్య వారసత్వ సంపద గురించి ప్రజలకు తెలియజేసి వాళ్ళలో పుస్తక పఠనం పైణ ఆసక్తి పెంచటానికేనట. అందులో భాగంగానే పబ్లిక్ ఆర్ట్ ప్రాజెక్ట్ పేరుతో పిల్లలకు, పెద్దలకు సబంధించిన మంచి పుస్తకాలు పేరుపొందిన పుస్తకాల, సంకలనాల నమూనాలతో బెంచీలు తయారు చేయించి నగరంలో అక్కడక్కడా ఏర్పాటు చేయించిందట. స్థానిక నేషనల్ లిటరరీ సంస్థ. ఫోటోల్లోచూడండి పేజీలు  తెరిచిన పుస్తకాలు అచ్చు కూర్చునే బెంచీల్లా తయారుచేసి వాటి పైన పుస్తకాల పేర్లు అందులో పాత్రలూ, రచయితల బొమ్మలూ పెట్టేశారు. ఇలా మన దేశంలో కూడా తెస్తే బావుండు. కనీసం వాటిని చూసయినా ఒక మంచి పుస్తకం చదవాలని అనిపిస్తుందేమో....

    ఇవి కూర్చునే పుస్తకాలు

    ఇది ఇవాల్టి న్యూస్ కాకపోయినా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉంది. ఒక రోజు రాత్రి తెల్లారే సరికి రంగు రంగుల బొమ్మలతో తెరచిన పుస్తకాల్లా…

  • కొన్నింటిని ఆనందించాలంటే వెతుక్కుంటూ వెళ్ళాలి. పురాతనమైనవి. ఎంతో ప్రత్యేకమైనవి, అరుదైనవి మ్యుజియంలో పెడతారు. ఎప్పటి దాకా, చరిత్ర, జీవన విధానం తెలుసుకోవడానికి ఉపయోగ పడతాయి. ఈ మ్యుజియం ఎంత ఉపయోగ పడతాయి. కెమేరా మ్యుజియం, ఐస్ క్రీం మ్యుజియం, రాళ్ళ మ్యుజియం, ఇప్పుడు ఇంకో ప్రత్యేక మైన ఎంతో సరదా వేసే మ్యుజియం వెంట్ హీవెన్ మ్యుజియం. కెంటకిలో వుందీ మ్యుజియం. ఇది మాట్లాడే బొమ్మల కొలువు. వెంట్రిలాక్విజం తో మాట్లాడే బొమ్మలతో వినోదం పంచె కళ. వెంట్రిలాక్విస్ట్ లు బొమ్మల్ని చేత్తో పట్టుకుని, పేదలు కదలకుండా మాట్లాడుతూ బొమ్మే మాట్లాడినట్లు, నవ్వినట్లు బ్రమ కలిగిస్తారు. విలియం షెక్స్ పియర్ చెర్గర్ అన్న వ్యక్తి 1973 లో వెంట్ హెవెన్ మ్యుజియం ప్రారంభించాడు. 60 ఏళ్ళ పాటు సేకరించిన వేలాది ఫోటోలు, పుస్తకాలు, బొమ్మలు ఇతర వివరాలు ఇక్కడ చూడొచ్చు. రకరకాల వేషధారనలు, అలంకరణలతో ఈ బొమ్మలు ఆకర్షిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాలకు సంబందించిన బొమ్మలివి.

    కొలువు తీరిన మాట్లాడే బొమ్మలు

    కొన్నింటిని ఆనందించాలంటే వెతుక్కుంటూ వెళ్ళాలి. పురాతనమైనవి. ఎంతో ప్రత్యేకమైనవి, అరుదైనవి మ్యుజియంలో పెడతారు. ఎప్పటి దాకా, చరిత్ర, జీవన విధానం తెలుసుకోవడానికి  ఉపయోగ పడతాయి. ఈ మ్యుజియం…

  • వేసవి వచ్చిందంటే కాటన్స్ కోసం చుస్తారందరూ. శరీరానికి సౌఖ్యం గా వుండాలి. ఫ్యాషన్ గా వుండాలి. వర్క్ ప్లేస్ కు అనుకూలం గావుండాలి. ఈ విషయంలో ఫ్యాషన్ డిజైనర్లు ఏమంటారంటే వట్టి నూలురకాలే అక్కర్లేదు, లెనిన్, ఖాది, మల్ మల్ వంటి రకాలు ఎంచుకొవచ్చు అంటారు. వస్త్రం ఏదైనా డిజైన్స్ కూడా అందం తేవాలి. క్రాప్ టాప్ లు టీ షర్టులు, పలాజో, అనార్కలి మంచి పూల డిజైన్ ల తో వేసవి అనుకూలంగానే వుంటాయి. టాప్స్ అయిన, లేయర్స్ తరహ అయిన పలుచగా పొదలు పొదలు కుట్టేసినవె తీసుకోవాలి. అలాగే క్రేప్ టాప్, అనార్కలి, లాంగ్ గౌన్ ఎలాంటిదైన ఒక ఆర్గేంజా క్రేప్ టప్ను ఎంచుకొండి. ఆఫీస్ కు లేదా ఏదైనా ప్రోఫెషనల్ లుక్ కోసం బ్లేజరే వేసుకోవాలి. ఈ కాలంలో లెదర్ కష్టం కనుక కాలం కూడా ఇకత్ వంటి చేనేత రకాల తో రూపొందించిన జాకెట్లు, బ్లిజర్లు ప్రత్యామ్నాయంగా ఎంచుకోండి. ముదురు రంగులు కాస్త పక్కన పెట్టి తెలుపు, గులబీ, పసుపు, ఉదా, లేత నిలం లేదా నీలి రంగు వస్త్ర శ్రేణి ఎండ వేళల చెక్కగా అనిపిస్తాయి.

    వేసవి కి ఇలా ఎంచుకోవచ్చు

    వేసవి వచ్చిందంటే కాటన్స్ కోసం చుస్తారందరూ. శరీరానికి సౌఖ్యం గా వుండాలి. ఫ్యాషన్ గా వుండాలి. వర్క్ ప్లేస్ కు అనుకూలం గావుండాలి. ఈ విషయంలో ఫ్యాషన్…

  • ఆపిల్ పియర్ ఇవి ఆపిల్ మాదిరిగా కొరికి తినే పండ్ల ఆపిల్స్ లా గుండ్రంగా పసుపు పచ్చగా వుంటాయి. దక్షిణ ఆసియా దేశమంతా విరివిరిగా కాస్తాయి. ఈ పండ్లతో జామ్ లు జెల్లీలతో పాటు సలాడ్స్ లోను వాడతారు. ఇతర పియర్ జాతి పండ్ల తో పోలిస్తే పిచు ఎక్కువ క్యాలరీలు తక్కువ. గుండె ఆరోగ్యానికి ఎముకలు బలంగా వుండేందుకు అవసరమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. నీటి శాతం చాలా ఎక్కువ శరీరంలోని కణాలు, కణజాల పనితీరుకు దోహద పడే సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైత్స్ ఇందులో పుష్కలంగా వుంటాయి. ఇందులో వుండే పొటాషియం,సోడియం ఎక్కువ గా వుండే ఆహార పదార్ధాలు తిన్నప్పటికీ పెద్ద సమస్యలు లేకుండా విరుగుడుగా పని చేస్తుంది. కంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. మొత్తం ABCDEK విటమిన్ల తో పాటు ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటి ఆమ్లాలు, కాల్షియం, మెగ్నీషియం, ఖనిజాలు దొరుకుతాయి. అందుకే ఈ పండ్లను అనేక వ్యాధుల నివారణ కోసం వాడతారు. చెర్మానికి నిగారింపు తో పాటు కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడకుండా వీటిని తింటుంటారు.

    ఆపిల్ పియర్ చాలా మంచిది

    ఆపిల్ పియర్ ఇవి ఆపిల్ మాదిరిగా కొరికి తినే పండ్ల ఆపిల్స్ లా గుండ్రంగా పసుపు పచ్చగా వుంటాయి. దక్షిణ ఆసియా దేశమంతా విరివిరిగా కాస్తాయి. ఈ…

  • చుండ్రు బాధ పెడుతుంటే తులసి నూనె లోకి లావెండర్, రోజ్ మేరి ఆయిల్ కలుపుకుని మాడుకు మసాజ్ చేయాలి. అప్పుడు తలపైన రక్త ప్రసరణ సరిగా జరిగి చుండ్రు తగ్గిపోతుంది. టీ ట్రీ ఆయిల్ ను రాత్రి పడుకునే ముందర మాడుకు రాస్తే చుండ్రు సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ నూనెలో జోజోబా ఆయిల్ కలిపి రాసుకున్న చెక్కని ఫలితం వుంటుంది. కొబ్బరి నూనెను కాస్త వెచ్చ చేసి అందులో నిమ్మరసం కలిపి తలకు పట్టించుకోవాలి. ఇలా వారంలో మూడు రోజులు చేస్తే చుండ్రు బెడద పోతుంది. మెంతుల్లో ప్రోటీన్లు, ఎమినో ఆసిడ్స్ అధికంగా వుంటాయి. కానీ మెంతులు నానానిచ్చి మెత్తగా రుబ్బి తలకు పెట్టుకున్న ఫలితం వుంటుంది. నిమ్మ ఆకులు, నీళ్ళు లో నాన నిచ్చి ఆ నీళ్ళతో సహా మెత్తగా గ్రఇండ్ చేసి, ఆ పేస్టు తలకు పట్టించిన చుండ్రు పోయింది. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కాసేపు ఎండలో నిలబడితే ఆ సూర్య కిరణాల వేడి కూడా జుట్టుకు మేలు చేస్తుంది. తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటూ వుంటే ఈ పోషకాలు కూడా జుట్టుకు మేలు చేస్తాయి.

    ఇలా చుండ్రు వదిలించుకోవచ్చు

    చుండ్రు బాధ పెడుతుంటే తులసి నూనె లోకి లావెండర్, రోజ్ మేరి ఆయిల్ కలుపుకుని మాడుకు మసాజ్ చేయాలి. అప్పుడు తలపైన రక్త ప్రసరణ సరిగా జరిగి…