• టీనేజ్ లో వుండే ఆహారపు అలవాట్ల ప్రభావం ౩౦ ఏళ్ళు వచ్చేసరికి తలిసిపోతుంది. ఆ వయస్సులో సరిగా పోషకాలతో కూడిన భోజనం చేయక, డైటింగ్ పేరుతో కడుపు మద్చుకోవడం, వాతన్నింటి ప్రభావం ముందుగా చర్మం పైనే పడుతుంది. పోషకాల లేమితో చర్మం కంటి లేకుండా అయిపోవడం మొటిమలు రావడం కళ్ళకింద నల్లని వలయాలు ఏర్పడటం జరుగుతుంది. ఇక ౩౦ల్లో అయినా సరైన వ్యాయామం చేయండి. మంచి పోషకాలు తీసుకోండి అంటున్నారు డాక్టర్స్. స్విమ్మింగ్,సైకిలింగ్, ఎరోబిక్స్ లాంటి వ్యాయామాలు చర్మ గ్రంధులను ఉత్తేజితం చేస్తాయి. తర్వాత చర్మం కంటి వంతంగా ఆరోగ్యంగా తయ్యారు అవుతుంది. కంటి నిండా నిద్ర పొతే అలసట వల్ల కళ్ళ చుట్టూ ఏర్పడే వలయాలు పోతాయి. చర్మం మెరుపుతో వుండటం కోసం ఎ,సి,ఇ విటమిన్లు వుండే పండ్లు కూరగాయాలు తీసుకోవాలి. పాల ఉత్పత్తులలో, నట్స్ లో విటమిన్లు సమృద్ది గా లభ్యం అవుతాయి. అలాగే మంచి నీళ్ళు కూడా చర్మం మెరిసేందుకు ఉపయోగ పడతాయి.

    టీనేజ్ లో తిరగక పొతే ౩౦ల్లో కష్టం

    టీనేజ్ లో వుండే ఆహారపు అలవాట్ల ప్రభావం ౩౦ ఏళ్ళు వచ్చేసరికి తలిసిపోతుంది. ఆ వయస్సులో సరిగా పోషకాలతో కూడిన భోజనం చేయక, డైటింగ్ పేరుతో కడుపు…

  • మంచి కాఫి తాగితే మనకెంతో ఉత్సాహం వస్తుంది సరే. మరి వాడిన కాఫి పొడి మొక్కలకు వేస్తె అవి ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలకు తాయారు చేసే సహజ ఎరువులో కాఫి పొడి కలిపితే వాటికి నత్రజని లోపం రాకుండా వుంటుంది. అంటే కానీ నత్తలు, చిన్ని చిన్ని పురుగులు చేరవు మొక్క మొదట్లో కాఫి పొడి వేస్తె ఆ వాసనకి పిల్లులు మట్టిని తవ్వకుండా వుంటాయి. గులాబీ మొక్కలు చేక్కగా ఎదగాలంటే మట్టిలో ఆమ్ల స్వభావం వుండాలి. కాఫి పొడి మట్టికి ఆ గుణాన్ని ఇస్తుంది. దీన్ని మొక్క కుదురులో చల్లాలి. రెండు కప్పుల వాడేసిన కాఫి పొడిని ఒక బకేట్ నీళ్ళల్లో కలిపి రాత్రంతా అలా వదిలేసి ఆ నీటిని తెల్లారి మొక్కల పై జల్లితే క్రిమి నాసనిగా ఉపయోగ పడతాయి. మట్టిలో కాఫి పొడిని బాగా కలిపి మొక్కలకు వేస్తె కలుపు మొక్కలు రావు. ఎండాకాలంలో తేమ పోగోట్టుకుని మొక్కలు వాడిపోకుండా కూడా కాఫి పొడి కాపాడుతుంది.

    మట్టి లో ఆమ్ల స్వభావం పెంచే కాఫి పొడి

    మంచి కాఫి తాగితే మనకెంతో ఉత్సాహం వస్తుంది సరే. మరి వాడిన కాఫి పొడి మొక్కలకు వేస్తె అవి ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలకు తాయారు చేసే…

  • పువ్వుల తోటలో పూసిన, దుస్తులపైన చెక్కగా అమిరిన, వాటిని సెలబ్రెటీలు వేసుకుంటే చాలు ఎక్కడ లేని అందం తో కనిపిస్తారు. అలాంటప్పుడే ఆ డ్రెస్ పైన అమ్మాయిల కళ్ళు వాలిపోతాయి. అందమైన శ్రీదేవి సాదా స్కర్టులు వేసుకుని పువ్వుల ప్రింట్ల ప్యాంటు వేసుకున్న, ప్రాక్ మొత్తం పువ్వులతో నింపివేసి పువ్వు కంటే అందమైన చిరునవ్వుతో తమన్నా మెరిసినా, టాప్ టు బాటమ్ పువ్వుల డ్రేస్ లు ఐశ్వర్యారాయ్ చిరునవ్వులు చిందించినా, ఇంకా ఆ డ్రెస్సు అమ్మాయిల లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోతుంది. పువ్వుల లతలు ఎప్పుడు అందంగానే వుంటాయి. అవి పట్టు చీరపై అల్లుకున్న, షిఫాన్ చీర పై విరిసినా, చక్కని కాటన్ చీర నిండా పరుచుకున్నా అందమే అందం. ఇప్పుడు విసిగించే వేసవిలో రిలాక్స్ గా కనిపించడం కోసం లేత వర్ణాల దుస్తుల పై పువ్వుల ప్రింట్స్ కోసం షాపింగ్ చేయడం బెస్ట్.

    ఇది పువ్వుల దుస్తుల కాలం

    పువ్వుల తోటలో పూసిన, దుస్తులపైన చెక్కగా అమిరిన, వాటిని సెలబ్రెటీలు వేసుకుంటే చాలు ఎక్కడ లేని అందం తో కనిపిస్తారు. అలాంటప్పుడే ఆ డ్రెస్ పైన అమ్మాయిల…

  • నిను చూడక నేనుండలేను తో మొదలు పెట్టి, నాగ, ఒక్కడు, విజయం, సింహాద్రి, 7/G బృందావనం కాలనీ వంటి ఎన్నో సినిమాల్లో శ్రేయా ఘోషల్ పాడిన అద్భుతమైన పాటలు తెలుగు ప్రేక్షకులు వున్నారు. తన గానం తో భారతీయులకు వీనల విందు చేసిన శ్రేయ కు అరుదైన గౌరవం దక్కనుంది. మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీలో నెలకొల్పనున్న మ్యుజియంలో ఆమె మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తోలి సింగర్ కూడా శ్రేయా ఘోషలే. గీతా లావన స్టైల్ లో ఆమె విగ్రహాన్ని తాయారు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. 2002 లో పడటం మొదలు పెట్టిన 15 సంవత్సరాలుగా ఎన్నో పాటలు పాడారు. ఈ మ్యుజియం లో ప్రధాని మోడీ తో పాటు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లతో పాటు ఇతర ప్రముఖుల విగ్రహాలు కూడా పెడతారు.

    ఢిల్లీ టుస్సాడ్స్ లో శ్రేయా ఘోషల్ విగ్రహం

    నిను చూడక నేనుండలేను తో మొదలు పెట్టి, నాగ, ఒక్కడు, విజయం, సింహాద్రి, 7/G బృందావనం కాలనీ వంటి ఎన్నో సినిమాల్లో శ్రేయా ఘోషల్  పాడిన అద్భుతమైన…

  • సౌదామినీ, మనింట్లో మనకు అక్కో చెల్లెలో వుంటే ఎంత బాగుంటుంది. స్నేహితులను మించి సంతోషంగా వుందా వచ్చు అన్నావు. నిజం ఇద్దరూ ఒక ఇంట్లో పుట్టి పెరుగుతారు కనుక వాళ్ళ బలాలు, బలహీనతలు ఒకళ్ళకి ఒకళ్ళవి తలుస్తాయి. ఆలోచన ప్రవర్తన ఒకటి కాకపోయినా రక్తసంబంధం వల్ల అరమరికలు లేకుండా వుంటారు. జీవితంలో గడ్డు సమయంలో ఒకళ్ళకి ఒకళ్ళు అండగా వుంటారు. ఇద్దరూ ఒకే విలువలతో పెరుగుతారు. జన్యు పరమైన లక్షణాలు కామన్ గా వుంటాయి. ఒక్కోసారి కొన్ని సందర్భాలలో చుట్టూ వున్న విషయాలు అర్ధం చేసుకోవడంలో వున్న ఇబ్బందులు, అక్కచెల్లెళ్ళుగా వున్నవాళ్ళు పంచుకుని విశ్లేషించుకొంటారు. హాయిగా అరమరికలు లేకుండా కలిసి వుంటారు. సోదరి స్నేహితురాలైతే అంత కంటే లాభం, సంతోషం ఇంకేముంటుంది. ఎవరి ప్రపంచం వారిడిగా, ఎవరి చదువు,స్నేహితులు వేరువేరుగా పబ్లిక్ లైఫ్ ఉండొచ్చు. కానీ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళ పర్స్ నల్ లైఫ్ ఇంట్లో వుంటుంది. ఇద్దరు ఎంతో సంతోషంగా తల్లిదండ్రుల ముద్దు బిడ్డలుగా ఆనందంగా వుండవచ్చు. పెద్దవుతూ ఉంటే అమ్మా స్థానం లోకి అక్క వచ్చి చేరుతుంటే ఇక వంటరి తనం ఏముంటుంది? ఇంట్లో ఇద్దరు తో బుట్టువులు వుంటే ఆనందమే ఆనందం!

    ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళుంటే!

    సౌదామినీ, మనింట్లో మనకు అక్కో చెల్లెలో వుంటే ఎంత బాగుంటుంది. స్నేహితులను మించి సంతోషంగా వుందా వచ్చు అన్నావు. నిజం ఇద్దరూ ఒక ఇంట్లో పుట్టి పెరుగుతారు…

  • లంఖణం పరమౌషదం అంటారు ఆయుర్వేద నిపుణులు. అలాగే చాలా మందికి ఎంతో మంది దేవుళ్ళ పేరిట ఒక్కపూట ఉపవాస నియమం వుంటుంది. ఇక పూజల్లో భాగంగా చేసే ఉపవాసాలు సరేసరి. భారతీయ జీవన విధానం లో ఉపవాసం నియమం గా ఉంది. ఇప్పుడు కొత్త పరిశోధనలు ఇది నియమంగా చేసిన, ఆరోగ్యం కోసం చేసిన మంచి ఫలితాలే వున్నాయంటున్నాయి. తక్కువ మొత్తంలో ఆహారం, ఉపవాసం దీక్ష లో తీసుకునే పళ్ళు పాలు శరీరానికి ఉపయోగం అంటున్నారు. వరం లో కనీసం ఒక్క రోజైనా పూర్తిగా ఏమీ తినక పొతే శరీరం కాస్త తనను, తన వ్యావస్థను వాగు చేసుకుంటుంది అని, నిజానికి ఉపవాసం వున్నా ఉదయం తేలికగా వుండటం, నీరసంగా వుండటం గమనిన్చుకోమని చెప్పుతున్నాయి. ఇలా ఉపవాస కారణంగా, ఆరోగ్యంగా యవ్వనం తో కూడా ఉంటారని వాళ్ళ రిపోర్టు. ఒక్క పూట తినకపోతే ఆ సమయం శరీరం ఉపయోగించుకుంటుందని , కేవలం నీళ్ళు మాత్రం తాగటం వల్ల చెర్మం తేటగా ఉంటుందని చెపుతున్నారు. ఏ విధంగా చుసినా,ఇటు భక్తి తో చేసినా, ఆరోగ్యం కోసం చేసినా ఉపవాసం వల్ల లాభమే.

    ఉపవాసం తో యవ్వనం

    లంఖణం పరమౌషదం అంటారు ఆయుర్వేద నిపుణులు. అలాగే చాలా మందికి ఎంతో మంది దేవుళ్ళ పేరిట ఒక్కపూట ఉపవాస నియమం వుంటుంది. ఇక పూజల్లో భాగంగా చేసే…

  • ఎప్పుడూ పువ్వులూ, ఎంబ్రాయిడరీలు, కట్ వర్క్ డిజైన్స్ వైపే చూస్తారు కానీ పూర్తిగా ప్లెయిన్ డ్రెస్సుల్లో ఎంత అందంగా వుండోచ్చో కొంత మంది హీరోయిన్స్ ని చుస్తే అర్ధం అవుతుంది. కాకపొతే అంచులలో చిన్న డిజైన్లు, కనిపించని బుటీలు, బ్లాక్ ప్రింట్ కలిపి సాదా చీరలకు గొప్ప అందం వస్తుంది. దానికి జతగా మెడ ప్రేత్యేకంగా కుట్టించుకున్న బ్లవుజు కూడా చీర అందానికి మాచ్ అవుతుంది. అలాగే చీరకు తగ్గట్టు ఇతర వస్తువులు డిజైనర్ తరహగా వుండాలి. ఎంబ్రాయిడరీ చేసిన అందమైన బ్యాగులు, క్లచ్ పర్సులు, మెటాలిక్ యాక్ససరీలు, తేలికైన నగలు వేసుకోవాలి. ఇలాగె సాదా చీరలు సాంప్రదాయ వర్ణాలతో వుండే లాగా చూసుకోవాలి. పౌడర్ బ్లూ, పసుపు, ఐస్ బ్లూ, పీచ్, సముద్ర నీలం వంటి లేలేత ఛాయలు ఎంచుకుని, సిల్క్, శాటిన్, కాటన్, సిల్క్,జార్జెట్, వంటి వస్త్ర శ్రేణిలో చీరలుంటే సంప్రదాయకంగా, అటు మోడ్రెన్ గా వుంటాయి. ఇలాంటి హంగులు లేకుండా కేవలం ఒక్క రంగుతో నే ఎంతో అందంగా కనిపిస్తారు. అయితే దుస్తుల ఎంపిక, దానికి జతగా బ్లవుజ్ నగల మేళవింపు వుంటే చాలు. ఏ పార్టి, అకేషన్ లో అయినా మెరిసిపోవచ్చు. ఇమేజస్ చుస్తే కొంత మంది హీరోయిన్ ఎంచుకున్న కాంబినేషన్స్ నగల పద్దతి అర్ధం అవుతుంది. పైగా వేసవికి లేత రంగుల సాదా చీరలు ఎంతో అందం.

    సాదా చేరాల్లోనే అంద అంతా

    ఎప్పుడూ పువ్వులూ, ఎంబ్రాయిడరీలు, కట్ వర్క్ డిజైన్స్ వైపే చూస్తారు కానీ పూర్తిగా ప్లెయిన్ డ్రెస్సుల్లో ఎంత అందంగా వుండోచ్చో కొంత మంది హీరోయిన్స్ ని చుస్తే…

  • రోజుకు పది వేల అడుగులు నడిస్తే ఆరోగ్యం అని పరిశోధనలు ఏ నాడో చెప్పాయి. ఇప్పటికి ఎందరో ఆచరణ లో పెట్టారు కూడా. కానీ కొత్త పరిశోధనలు ఇన్ని వేల అడుగుల నడక వల్ల కాలోరిలు కర్చుఅవ్వుతాయి కానీ ప్రయోజనం ఇకేముంటుంది అంటున్నారు. వుబకయం వుంటే కాస్త తగ్గుతారు, బరువు పెరగ కుండా వుంటారు. కానీ మరి సాధారణ బరువు ఆరోగ్యం వున్నవాళ్ళ కి ఇంత కష్టమైన ఎక్స్ సైజులు వద్దంటున్నారు. రెండు నుంచి మూడు వేల అడుగులు చాలు అది సాధారణమైన మన్యుషులకు కరెక్ట్ వ్యాయామం. అంటే కానీ నడక తో అంతంత సేపు శరీరాన్ని కష్ట పెడితే కిళ్ళ నొప్పులు తప్పవంతున్నారు. 50 ఏళ్ళు దాటితే, ఇంక ఆ వయస్సులో కిళ్ళ నొప్పుల తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. తీసుకునే ఆహారం చాలా తక్కువైపోతుంది. ఆరోగ్య స్పృహ వల్ల ఒక్క పూటే అన్నం, చపాతీలు, ఇంకా కొన్ని పళ్ళు తిని సారి పెట్టుకుంటారు. లేదా వృద్దాప్య దశ లో అంత కంటే ఎక్కువ అరగదు కనుక ఆ తినే ఆహారానికి సరిపడా నడకే ఎంచుకోమంటున్నారు. ఇంకా ఎక్కువ నడవాలంటే వైద్యుల సలహా పైన మాత్రమే అంటున్నారు.

    అంత నడక వద్దే వద్దు

    రోజుకు పది వేల అడుగులు నడిస్తే ఆరోగ్యం అని పరిశోధనలు ఏ నాడో చెప్పాయి. ఇప్పటికి ఎందరో ఆచరణ లో పెట్టారు కూడా. కానీ కొత్త పరిశోధనలు…

  • ఈ ప్రపంచం లో ఎవరెక్కడ వున్నా కొన్ని మంచి అలవాట్లు మనం అదుపు చేసుకోవచ్చు. ఇప్పటికి మనం ప్రపంచం మొత్తం తినే రకరకాల ఆహారాలు తలుసుకుని మరీ తిని సంతోషిస్తున్నాం. ఇప్పుడు జపనీయుల ఆహారపు అలవాట్ల వల్లనే వాల్లు నాజుకుగా ఉంటారని తలుస్తుంది. అన్ని వెరైటీలు వుంది తినేందుకు రుచిగా వుంటుంది వాళ్ళ ఆహారం. ఒక కప్పు అన్నం , మీసా సూప్ , మూడు సైడ్ డిష్లు, ఆ మూడింటి లో ఒక చేప, మాంసం, టోపు తో చేసిన వంటకం వుంటాయి. లేదా కూరగాయలు, ఆకు కూరలతో చేసిన వంటకాలు. వుంటాయి. రకరకాల ఫాస్ట్ ఫుడ్లు ఈ ఆహార పదార్ధాల తోనే చేస్తారు. చిన్ని ప్లేట్ లో తక్కువ పదార్ధాలు తింటారు. వాళ్ళకి వ్యక్తి గత వాహన వినియోగం తక్కువ. పబ్లిక్ ట్రాస్పోర్ట్, నడక, సైకిలింగ్ ఇవే దైనందన జీవితం లో ఉండేవి. ఇదే వ్యాయామం వాళ్ళకి. ముడి బియ్యం, నూనె తక్కువగా చేసే ఆహారం అన్ని రకాల పోషకాలు వుండేలా ఏర్పాటు చేసుకున్న ఆహారపు అలవాట్లు. వీటి గురుంచి అలోచించి ఆహారపు అలవాట్లు కొన్ని మార్చుకో గలమేమో?

    ఇందుకే జపాన్ వాళ్ళు చాలా స్లిమ్

    ఈ ప్రపంచం లో ఎవరెక్కడ వున్నా కొన్ని మంచి అలవాట్లు మనం అదుపు చేసుకోవచ్చు. ఇప్పటికి మనం ప్రపంచం మొత్తం తినే రకరకాల ఆహారాలు తలుసుకుని మరీ…

  • వేసవి ఎండకు ముందుగా ఎఫెక్ట్ అయ్యేది జుట్టే ఎండలో పిచు లాగా అయిపోతుంది. లేదా చెమటకి తడిసి తలస్నానం చేసినా సరే కాసేపటికే జిడ్డుగా అత్తుక్కుపోతుంది. రెండు చిరాకే ఇలాంటప్పుడు రసాయినాల జోలికి పోవడం కంటే హోం మేడ్ చిట్కాల వైపు వెళ్ళడం బెటర్ ఒక పెద్ద చెంచా ఆపిల్ సైడర్ వేనిగర్ తీసుకుని దానికి తగినన్ని నీళ్ళు కలిపి, తలకు రాసి పావుగంట ఆగి కడిగేస్తే చాలు. ఇంక తలస్నానం ఏ షాంపూ తో చేయనక్కరలేదు. గుడ్డులో తెల్ల సోన కుదుళ్ళ నుంచి పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేసినా జుట్టు చెక్కగా వుంటుంది. బాగా పండిన అరటి పండు గుజ్జు లాగా చేసి దానికి కాస్త ఓట్స్ పొడి కలిపి తలకు రాసుకుని అరగంట పాటు ఆరనిచ్చి తలస్నానం చేస్తే జుట్టు పట్టు లాగా మెరుస్తుంది. ఒక విటమిన్-ఇ మాత్రను బాదాం నూనెలో కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కాసేపాగి కడిగేస్తే పొడిపొడిగా సిల్క్ లాగా మెరుస్తుంది. మైల్డ్ షాంపూ ఎంచుకుంటే మేలు. ఘాడత వున్న షాంపూలు జుట్టును పొడి చేస్తాయి.

    వేసవికి ఈ జాగ్రత్తలు తప్పని సరి

    వేసవి ఎండకు ముందుగా ఎఫెక్ట్ అయ్యేది జుట్టే ఎండలో పిచు లాగా అయిపోతుంది. లేదా చెమటకి తడిసి  తలస్నానం చేసినా సరే కాసేపటికే జిడ్డుగా అత్తుక్కుపోతుంది. రెండు…

  • సినిమాలు చేయడం ఆపేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ప్రేక్షకుల ముందు ప్రత్యేకమైన నటిగా స్థాయి నిరూపించుకుంది శ్రీదేవి. తమిళ చిత్రం పులి లో మహారాణిగా రిచ్ లుక్ లో మళ్ళి శ్రీదేవి అందంగా మెరిసిపాయింది. ఫిప్టీ ప్లస్ లోనూ ఆమె తిరుగు లేని అందం తో స్టున్నింగ్ పర్ఫోమెన్స్ తో ఇప్పుడు 'మామ్' గా టైటిల్ రోల్ లో ప్రేక్షకులకు తన గ్లమమౌర్ ఏ మాత్రం తగ్గలేదంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసింది శ్రీదేవి. ట్విట్టర్ లో మామ్ ఫస్ట్ లుక్ పోస్ట్ చేసి 'ఒక స్త్రీకి సవాలు ఎదుర్కునేటప్పుడు మామ్ పోస్టర్ ను అవిష్కరిస్తున్నా' అని పోస్ట్ పెట్టింది. నీలి రంగు దుస్తుల్లో సీరియస్గా చూస్తునట్లు పోస్టర్ లో వివిధ భాషల్లో అమ్మను ఏమంటారో రాసి వుంది తన సవతి కుమార్తె కు న్యాయం చేయడానికి మామ్ ఏంచేసింది. అన్న కధంసం తో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీ దేవి భర్త భోనికపూర్ నిర్మిస్తున్నారు. అదే దేశానికి చెందిన బాలనటి సాజల్ అలీ కూతురిగా చేస్తుంది.

    మామ్ సినిమాలో మళ్ళి శ్రీ దేవి

    సినిమాలు చేయడం ఆపేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ప్రేక్షకుల ముందు ప్రత్యేకమైన నటిగా స్థాయి నిరూపించుకుంది శ్రీదేవి. తమిళ చిత్రం పులి లో మహారాణిగా…

  • చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని పదార్ధాల వాడకంతో చర్మం ఎప్పుడు తాజాగా కాంతి వంతంగా వుంటుంది. పిండి, తేనె, పెరుగు వంటి మిశ్రమం వంటికి పట్టించి నలుగు పెట్టుకుంటే చాలు చర్మం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే జుట్టు నిర్జీవంగా అనిపిస్తే కోడి గుడ్డు తెల్ల సోన, పుల్లటి పెరుగు, మందారకుల గుజ్జు కలిపి తలకు పట్టించి తల స్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులా అయిపోతుంది. అలాగే చేతులు కాళ్ళు మెత్తగా మెరిసిపోవాలంటే ముందుగా ఆర బకేట్ నీళ్ళల్లో రెండు చెంచాల షాంపూ వేసి పదాలు అందులో వుంచాలి. ఆ తర్వాత ఫ్యుమిక్ రాయి తో రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు పోతాయి. అదయ్యాక చెక్కర, సెనగ పిండి, పాలు, తేనె మిశ్రమాన్ని పాదాలకు పట్టించి ఆరాక కడిగేస్తే పదాలు మృదువుగా మెరిసిపోతూ కనిపిస్తాయి. చేతులకు కూడా ఇదే పూత పుయచ్చు.

    జీవిత కాలపు శ్రద్ధ కావాలి

    చర్మ సౌందర్యం విషయంలో ఎదో ఒక రోజు శ్రద్ధ తీసుకుని ఒక రోజు ఫేషియల్ చేయించేసుకుంటే సరిపోదు. శ్రద్ధ జీవిత కాలం వుండాలి. సహజమైన, రసాయినాలు లేని…

  • పండగలకి, పార్టీలకీ, పుట్టిన రోజులకి అన్నింటికీ అలంకరణ లో కొత్త ధీమ్స్ వస్తున్నాయి.. అన్నింటిలోనూ కాస్త తక్కువ కర్చుతో పోయేది బెలూన్ల థీమే. రంగు రంగుల బెలూన్ల తో ఎన్నో డిజైన్ల తో చేయడం, దాంతో ఫంక్షన్ కు మంచి అట్రాక్షన్ రావడం చూస్తూనే వున్నాం. అంత వరకు పర్లేదు పార్టీ అయ్యాక వాటిని పిన్నుల తో గుచ్చి పగుల గొట్టడం ఇంకో సరదా. కానీ వాటి నుంచి వచ్చే శబ్దం షాట్ గన్ పేలుల్ల కన్నా ఎక్కువని, ఇది వినికిడి సమాధ్యాన్ని దెబ్బ తీస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి. పిన్ను తో గుచ్చడం, పగిలే వరకు వుదటం, గట్టిగా నొక్కడం ఇలా మూడు రకాలుగా బెలూన్లు పగలుగొట్టినప్పుడు 168 డెసిబల్స్ శబ్దం వేలువాడుతుందని, ఇది 12 గాజ్ షాట్ గన్ శబ్దం కన్నా ఎక్కువని వాళ్ళు చెపుతున్నారు. సాధారణం గా 140 డెసిబల్స్ దాటిన ఏ శబ్ధమైనా చెవికి ప్రమాదమే కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది.

    బెలూన్ లు పగలగోడితే చెవికి ముప్పు

    పండగలకి, పార్టీలకీ, పుట్టిన రోజులకి అన్నింటికీ అలంకరణ లో కొత్త ధీమ్స్ వస్తున్నాయి.. అన్నింటిలోనూ కాస్త తక్కువ కర్చుతో పోయేది బెలూన్ల థీమే. రంగు రంగుల బెలూన్ల…

  • ఎండా కాలం వచ్చేసింది. బయటకి పొతే చాలు గొంతు తడి పోతుంది. ఎదో ఒకటి చల్లగా తగేయాలనిపిస్తుంది. అప్పుడు ఎదో ఒక్క కూల్ డ్రింక్ వైపు మనస్సు లగేస్తుంది. కానీ ఈ కూల్ డ్రింక్స్ వల్ల రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి అంటున్నాయి అధ్యాయినాలు. చల్లగా తాగే కూల్ డ్రింక్స్ అప్పటికప్పుడు దాహం తీరుస్తాయి కానీ ముందు ముందు ప్రమాదాలు తప్పవు. వీటిలో అధికంగా వుండే చెక్కర, ప్రిజర్వేటివ్ లు ఇతర రసాయినాలు బరువును పెంచడం తో పాటు ఇతరాత్రా రోగాలకు దారి తీస్తాయని కాలిఫోర్నియా విశ్వ విద్యాలయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుక్త వయస్సులో మహిళలు దీర్ఘకాలం కడుపు మంట, అల్సర్ల తో బాధపడితే రొమ్ము కాన్సర్ తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్లనే ఆహారపు అలవాట్లలో శ్రద్దగా వుండాలని సహజంగా దొరికే ఏ కొబ్బరి నీల్లో, లేదా మంచి నీల్ల తో తీరే దాహం సీతాల పానీయాల వరకు వెళ్ళనివ్వోదని హెచ్చరిస్తున్నారు.

    సీతల పానీయాల తో కేన్సర్

    ఎండా కాలం వచ్చేసింది. బయటకి పొతే చాలు గొంతు తడి పోతుంది. ఎదో ఒకటి చల్లగా తగేయాలనిపిస్తుంది. అప్పుడు ఎదో ఒక్క కూల్ డ్రింక్ వైపు మనస్సు…

  • నీహారికా, పొదుపు అన్న పదం విన్నా, దాని గురించి ఉపన్యాసాలు విన్నా బోర్ కొట్టేస్తుంది అంటావు నిజమే. మరి చేతికి అందిన ఆదాయం నిమిషాల్లో ఖర్చు చేయడం ఈజీనే నిహారికా. మరి పొదుపు గురించి తెలిసి వుండాలిగా. ఆర్ధిక ఇబ్బందులు ఎదురయితే పొదుపే కదా కాపాడేది. చిన్నప్పటి నుండి పొదుపు పాఠాలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే పెద్దయ్యాక సంపాదించే మొత్తంలో ఇంత పొదుపు కోసం అని పక్కన పెట్టడం చేతనవుతుంది. నెల జీతం అందుకోగానే ఖర్చుల వివరాలు పక్కన రాసుకోవాలి. వాడిన ప్రతి రూపాయి ఎందుకోసం ఉపయోగిస్తున్నామో o చోట రాసుకొంటే నెల తిరిగే సరికి ఖర్చుల పైన, వృధా పైన ఒక అవగాహన వస్తుంది. అప్పుడే ఎక్కడ పొదుపు చేయాలో అర్ధం అవుతుంది. తీరికుంటే, చేతిలో డబ్బుంటే స్నేహితులతో కలిసి షాపింగ్ కోసం వెళ్లేముందే అసలు బడ్జెట్ ఎంతో ముందే అనుకోవాలి. సరైన వస్తువు కొనుక్కోవాలంటే క్రెడిట్ కార్డు వాయిదా పద్ధతి బాగానే ఉంటుంది. కానీ దానికి ముందే ఆ వస్తువు కొనే డబ్బు పొదుపు చేసి అప్పుడు కొనాలి. అప్పుడే అదనపు భారం, వడ్డీ రేట్ల బాధ తప్పుతాయి. ఖర్చు అదుపు తప్పకుండా వుంటుంది. అందుకే జీవితంలో మొదటి అడుగులు వేసేప్పుడే అంటే చిన్నప్పుడే పిల్లలకు పొదుపుగా అంటే దుబారా లేకుండా ఎలా జీవించాలో నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అనుకొంటాను. కష్టపడి తెలివితేటలతో సంపాదించే డబ్బుని అప్పుడే ఎంజాయ్ చేయడం చేతనవుతుంది లేకపోతే డబ్బు దుబారా కావడం ఖాయం.

    పొదుపు నేర్చుకుంటేనే దుబారాకు కళ్ళెం

    నీహారికా, పొదుపు అన్న పదం విన్నా, దాని గురించి ఉపన్యాసాలు విన్నా బోర్ కొట్టేస్తుంది అంటావు నిజమే. మరి చేతికి అందిన ఆదాయం నిమిషాల్లో ఖర్చు చేయడం…

  • శరీరానికి అందే ఉప్పు చాలావరకు సహజంగా ఆహారపదార్ధాల ద్వారానే అయినా రుచికోసం మనం కలుపుకొనే ఉప్పే అధిక ఉప్పుగా అనారోగ్యానికి కారణం అవుతుందంటున్నారు నిపుణులు. ముందుగా మనం తినే అయోడిన్ కలపిన ఉప్పు స్థానంలో సైంధవ లవణం రాక్ సాల్ట్ తినమంటున్నారు లేదా రాళ్ళ ఉప్పు పర్లేదంటున్నారు. వంటకాల్లోనే ఉప్పు సాధ్యమైనంత తగ్గించి, వెల్లుల్లి, నిమ్మ, ఉల్లి, ఆకుకూరలు, మసాలా దినుసులతో వండమంటున్నారు. ఆకుకూరల్ని బాగా కడిగి అందులోని లవణాలు పోయేలా చూడాలి. ఆహారంలో భాగంగా పొటాషియం అధికంగా గల బంగాళాదుంపలు, చిలకడదుంపలు, టొమాటోలు, ఆకుకూరలు తినాలి. పొటాషియం శరీరంలోకి వచ్చే సోడియంకు విరుగుడుగా ఉంటుంది. పదార్ధాలు వండే తీరుమార్చాలి. ఉప్పు వేయనవసరం లేని విధంగా కారగాయలు ఉడికించాలి. కూరల్లో ఉప్పుకు బదులుగా ఆ రుచి ఇచ్చే వస్తువులు వాడాలి. ఉప్పు ఎక్కువగా తీసుకొంటున్నారు అనే భావన వస్తే సాధ్యమైనన్ని మంచినీళ్ళు తాగాలి. ఉప్పు మంచిదే. ఆకలని కలిగించడం, ఆహారం గ్రహించడం, శరీరంలో మలినాలు తొలగించడం విషపూరితమైన పదార్ధాలు ప్రభావం తగ్గించడంలో ఇది మేలైనదే కానీ అధికంగా వాడితే ఇబ్బందులు తప్పవు.

    మంచిదే కాని తగిన మోతాదులో వాడాలి

    శరీరానికి అందే ఉప్పు చాలావరకు సహజంగా ఆహారపదార్ధాల ద్వారానే అయినా రుచికోసం మనం కలుపుకొనే ఉప్పే అధిక ఉప్పుగా అనారోగ్యానికి కారణం అవుతుందంటున్నారు నిపుణులు. ముందుగా మనం…

  • డైట్ రూల్ పాటిస్తారు కనుకనే హీరో హీరోయిన్ లు ఎంత వయస్సు వచ్చినా చెక్కని వన్నెతో, అందం తో సరైన ఫిజిక్ తో బావుంటారు. ఏదైనా సరే తగు మోతాదులో తినడం అనేది ఆహార పానీయాల్లో పాటించ వలసిన ప్రధమ సూత్రం, ఇక్కడ 80-20 శాతం అన్ని నిబంధనలు పాటించాలి. అంటే ఆరోగ్య వంతమైన ఆహారం 80 శాతంగా మిగతా మరీ నోరు కట్టేసుకోలేని 20 శాతంగా వుండాలి. సరైన ఆహారం సరైన సమయం లో తినాలి. 20 శాతం అనేఅది వారానికో సారి లేదా ఏ పది రోజులకో సారి ఇచ్చుకోవలసిన రిలాక్షేషన్ అంటే తప్పని సరిగా హాజరయ్యే పెళ్ళిళ్ళు, తప్పించుకోలేని ఫంక్షన్లు, విందుభోజనాలు. ఇతరాత్ర ఏవయినా తినాల్సి వచ్చేవాన్ని 20 శాతం తోనే ముగించాలి. ఎప్పుడెలా రిలాక్షేషన్ ఇవన్నీ ఎలా వున్నా ఏ సూత్రం వర్తించానిది ఒక్క వ్యాయామానికి దీనికి సడలింపు రూల్స్ వుండవు ఎక్కువ తిన్నా, నియమం బ్రేక్ చేసినా, రిలాక్సేషన్ అన్న వ్యాయామం మాత్రం వాయిదా పడకూడదు. రోజుకు కనీసం అరగంట ఆ కార్యక్రమం కోన సాగించాలి. వారానికి ప్రతి రోజు 40,50 నిముషాలు వ్యాయామం చేసి 80 శాతం తగు మోతాదులో తింటే శరీరపు స్థితి మన కంట్రోల్ లో వుంటుంది.

    ఈ డైట్ రూల్ పాటిస్తేనే శరీరం మాట వింటుంది

    డైట్ రూల్ పాటిస్తారు కనుకనే హీరో హీరోయిన్ లు ఎంత వయస్సు వచ్చినా చెక్కని వన్నెతో, అందం తో సరైన ఫిజిక్ తో బావుంటారు. ఏదైనా సరే…

  • సెల్ఫీ సరదా వరకే వుంచుకుంటే పర్లేదు, అది ఇతరుల గౌరవానికి భంగం వచ్చేలా వుంటే మాత్రం సమస్యే. ఈ మధ్య కాలంలో విద్యాబాలన్ బీగమ్ జాన్ సినిమా పని గురించి నిర్మాత ముకేష్ భచ, దర్శకుడు శ్రాజిల్ ముఖర్జీ తో పాటు, కలకత్తా ఎయిర్ పోర్టు నడుస్తూ వస్తుంది. ఒక్క వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి సెల్ఫీ తిసుకొబోయాడు. విధ్యాబాలన్ సరేనంది. అతను చొరవగా ఆమె భుజం పైన చెయ్యి వేసి సెల్ఫీ తీసుకోబోయాడు. అతని చెయ్యి అసభ్యంగా తన విపు పైన కదులుతుంటే విద్య షాక్ తిని చేయి తిసేయమంది. ఆటను విననట్లే చేయి తీయకుండా సెల్ఫీ తిస్తునట్లే వున్నాడు. విద్య సహనం పోయి ఏమనుకుంటున్నావ్, నువ్వేం చేస్తున్నావో తెలుసా, ఇది తప్పు అని కేకలు పెట్టింది. అతని ప్రవర్తన తనను ఎంతో బాధ పెట్టిందని ఒక అపరిచుతుడు చొరవగా చెయ్యి వేస్తె ఎలా వుంటుంది. మేం పబ్లిక్ ఫిగార్లమే కానీ, పుబ్లిక్ ప్రోపర్టి కాదు అని చాలా బాధ పాడింది విద్యా. అభిమానం వుంటే సంతోషం, అరాదించినా సంతోషమే, కానీ అవమానించడం ఎంత వరకు సభ్యత? విద్యాబాలన్ కష్టపెట్టుకున్నట్లు ఆడవాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా?

    మేం పబ్లిక్ ప్రోపర్టిలు కాదు

    సెల్ఫీ సరదా వరకే వుంచుకుంటే పర్లేదు, అది ఇతరుల గౌరవానికి భంగం వచ్చేలా వుంటే మాత్రం సమస్యే. ఈ మధ్య కాలంలో విద్యాబాలన్ బీగమ్ జాన్ సినిమా…

  • స్క్రీన్ పైన దేవకన్యల్లా వుండే హీరోయిన్సే అంత అందంగా వుండేందుకు ఏం తింటారు? అందం కోసం ఏ జ్యగ్రత్తలు తీసుకుంటారో అందరికి కుతూహలమే. ఇవన్నీ మాములు అమ్మాయిలు కూడా చేయొచ్చు ఓపిక ఉంటే. బాలీవుడ్ స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ ప్రతి రోజు ఫేషి యల్, అలాగే ప్రతి రాత్రి క్లెంసింగ్, టోనింగ్, మాయిశ్చురైజింగ్ వంటికి తప్పకుండా చేయించుకుంటుంది. నెలకో సారి జుట్టుకు స్విట్ ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె, షికాయా కలిపి పట్టించి శిరోజాలు ఆరోగ్యంగా వుండేలా చూసుకుంటుంది. సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్ళదు. కెమికల్స్ కలిసిన ఉత్పత్తులు, ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కు దూరంగా వుంటుంది. పాలను యాస్ట్రీంజెంట్ గా వాడుతుంది. సున్ని పిండి పెరుగు ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. ప్రతి రోజు రెండు గంటలకొ సారి కొబ్బరి నీళ్ళు తాగుతుంది. ఐడు సార్లు లైట్ మీల్స్, బ్రేక్ ఫాస్ట్ లో మూడు ఎగ్గ్ వైట్స్, తృణ ధాన్యాలతో చేసే ఫారిద్జ్ లంచ్ లో బ్రౌన్ రైస్, కూరగాయాలు, పప్పు, పెరుగు తో భోజనం చేస్తుంది. చికెన్,ఎగ్స్ చేపలు, వెజిటేబుల్స్, చపాతీ భోజనం లో ఉండేలా చూస్తుంది. ఎప్పడు వీలైతే అప్పుడు నట్స్ తింటుంది.

    అందాల రహస్యం వీటి తోనే

    స్క్రీన్ పైన దేవకన్యల్లా వుండే హీరోయిన్సే అంత అందంగా వుండేందుకు ఏం తింటారు? అందం కోసం ఏ జ్యగ్రత్తలు తీసుకుంటారో అందరికి కుతూహలమే. ఇవన్నీ మాములు అమ్మాయిలు…

  • బిర్యానీ ఆకుల్లో వుండే పోషకాలకు లెక్కే లేదు అంటున్నారు నిపుణులు. పులావు బిర్యానీల్లో సువాసన కోసం వాడి పారేసే ఈ ఆకులో విటమిన్- సి, ఎ, మాంగనీస్, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలున్నాయి. వీటిని టీ ఆకుల లాగే మరిగించి టీ చేసుకో వచ్చు. తాజా ఆకులు చిన్న ముక్కలుగా చేసి నలుగు కప్పుల నీళ్ళు వేసి కప్పు నీళ్ళు అయ్యేదాకా మరగించి, ఆ నీళ్ళను చల్లార్చి రాత్రి పూట తీసుకుంటే కోలెస్ట్రోల్, మధుమేహం తగ్గుతాయి. ఈ నీటిని వుబకయం తగ్గించు కునేందుకు మంచి ఔషదంలా తీసుకో వచ్చు. ఇవే నీళ్ళు బి.పి ని అద్భుతంగా తగ్గిస్తాయి. ఆకులు వేసి మరిగించిన నీళ్ళను ఏ రోజువారోజు వాడుకోవాలి. ఈ ఆకుల నీళ్ళు మరగించి పంచదార వేసి వేడిగా తాగితే అన్ని రకాల అల్సర్లు పోతాయి. ఈ ఆకుల్ని కమలాఫలం తొక్కల్ని కలిపి ఎండ బెట్టి పొడి చేసి, ఆ పొడితో పళ్ళు తోముకుంటే గార పట్టిన పళ్ళు తెల్లగా మీరిసిపోతాయి. రోజుకొసారి బిర్యానీ ఆకుల టీ తాగొచ్చు.

    సువాసన తో పాటు పోషకాలు ఎక్కువే

    బిర్యానీ ఆకుల్లో వుండే పోషకాలకు లెక్కే లేదు అంటున్నారు నిపుణులు. పులావు బిర్యానీల్లో సువాసన కోసం వాడి పారేసే ఈ ఆకులో విటమిన్- సి, ఎ, మాంగనీస్,…