• ఒక కళాకారుడి చేతిలో బండరాయి కూడా అపురూపమైన శిల్పం అయిపోతుంది. ఆ స్కిల్ వుంటే దేన్నెయినా ఏ రూపంలోకైనా తీసుకోవచ్చు. కళాకారుడి సృజనకు పరిశోధనలు ఉంటాయా? ఇప్పుడు ఎండల్లో పుచ్చకాయలు గుట్టలు గుట్టలుగా కాస్తాయి. రోడ్డు పక్కన ఎక్కడ చూసినా ఆ పుచ్చకాయలు అమ్మే టెంట్లే. కళ తెలిసిన వారి చేతిలో ఒక చాకుంటే పుచ్చకాయ ఎంతటి కళా కండంగా అయిపోతుందో వాటర్ మిలాన్ ఫుడ్ కార్వింగ్ ఇమగెస్ లో చూడండి. పుచ్చకాయ నవ్వుతుంది. పువ్వుల గుట్ట అయిపోతుంది. విషెస్ చెప్పుతుంది, రకరకాల జంతువుల రూపంలోకి మారిపోతుంది. పైన హెద్దింగ్ లేకుండా చూస్తే అది పుచ్చకాయను చెక్కి తాయారు చేసారంటే నమ్మడం కష్టం. వాటర్ మిలాన్ కార్వింగ్ కోసం కళాకారులు సన్నని చాకులు, ఇతర కార్వింగ్ టూల్స్ తో పుచ్చకాయను కొద్ది కొద్దిగా చెక్కుతూ అనుకున్న రూపంలోకి తెస్తారు. కొస్తే నీళ్ళు కారిపోయే పుచ్చకాయ గొప్ప కళాకండంగా కనిపిస్తుంది ఇమేజస్ చూడండి. పుచ్చకాయ నాకొద్దని మారాం చేసే పిల్లలకి ఇలాంటి రూపాల్లో ఇవ్వగలరేమో ట్రై చేయండి.

    దాహం తీర్చే కాయకొ సుందర రూపం

    ఒక కళాకారుడి చేతిలో బండరాయి కూడా అపురూపమైన శిల్పం అయిపోతుంది. ఆ స్కిల్ వుంటే దేన్నెయినా ఏ రూపంలోకైనా తీసుకోవచ్చు. కళాకారుడి సృజనకు పరిశోధనలు ఉంటాయా? ఇప్పుడు…

  • ఫోన్ లేకుండా నిమిషం నడవదు. దీన్ని వాడుతున్నంత సేపు తల దించు కుని వుంటాం. మెడ, బుజాలు నొప్పి పెడతాయి. ఫోన్ న్ని సమాంతరంగా ఉంచుకుని ట్రై చేస్తే ఇలాంటి నొప్పులు రాకుండా వుంటాయి. అల్లాగే కాలేజీ అమ్మాయిలు, జాబ్ కు వెళ్ళే వాళ్ళు బరువైన బ్యాగ్ని బుజానికి తగిలించూ కుంటారు. క్రమంగా బుజం, వెన్ను, మెడ నొప్పులు మొదలవ్వుతాయి. అందుకే టిఫిన్ బాక్స్, ఇతర బాక్స్ లు పెట్టుకునే బ్యాగులు రెండు బుజాలకు వేసుకోవాలి. అలాగే తలకింది దిండు మరీ పలుచగా లేదా మరీ ఎత్తుగా వేసుకుంటారు. దీని వల్ల వెన్ను ముక్కకి ఇబ్బంది. మెడ పై కూడా భారం పడుతుంది. అలాగే ఇంట్లో ఎదో ఒక బరువు ఎత్తి పైన పెడతాం, మాములుగా వంగి అమాంతం యట్టడం వల్ల నడుం పట్టేస్తుంది. మోకాళ్ళ పైన కుర్చుని నిదానంగా అరను చూసి యట్టుకోవాలి. అలాగే కంప్యూటర్ తెర ముందు కూడా మరీ వంగి, లేదా మరీ వెనక్కి జరాగిల బడి కూర్చోకూడదు తెరకు సరిగ్గా ఎదురుగా కూర్చోవాలి.

    బ్యాగ్ బరువుతోనే నొప్పులన్నీ

    ఫోన్ లేకుండా నిమిషం నడవదు. దీన్ని వాడుతున్నంత సేపు తల దించు కుని వుంటాం. మెడ, బుజాలు నొప్పి పెడతాయి. ఫోన్ న్ని సమాంతరంగా ఉంచుకుని ట్రై…

  • స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్ పోర్టల్ లో భాగస్వామ్యులుగా వుంది. నిర్మాణంలో వున్న ఇళ్ళను గ్రూప్ గా కొంటె తక్కువ ధరలకు ఇస్తాననే ఒక సంస్థ ఇది. అలాగే శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర్రా, అక్షయ్ కుమార్లు కలిసి సెలబ్రెటీ షాపింగ్ షాపింగ్ ఛానల్ లో బెస్ట్ డీల్ టీ.వి ప్రారంభించారు. అలాగే పిల్లలకి సంబందించిన ఉత్పత్తులని అమ్మె బేబీఓయ్ డాట్ కామ్ లో కరిష్మాకపూర్ భాగస్వామిగా వున్నారు. ఫస్ట్ క్రై డాట్ కామ్ లోనూ ఈమె వాటా వుంది. వ్యాపారం ప్రారంబించాలనుకుంటే వాళ్ళకి ఈ సెలబ్రెటీలు ఇప్పటికే ఓ అడుగు ముందే వునారని చెప్పేందుకు ఈ కబురు మంచి ఆలోచన వుంటే ఇలాంటి స్టార్టప్ ని అతి వేగంగా మొదలు పెట్టోచ్చు. ఇలాంటి వ్యాపారాలకు ఆలోచనే పెట్టుబడి.

    ఇప్పటికే హీరోయిన్స్ మొదలెట్టేసారు

    స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్…

  • ఎండలు అప్పుడే ప్రతాపం చూపెడుతున్నాయి. మారిన వాతావరణంలో ముందుగా మన జీవన శైలి మార్చుకోకపొతే చాలా కష్టం. వాతావరణం వేడిగా వుంటే నీరు చమట రూపంలో బయటకు పోతుంది. అదే డిహైడ్రేషన్ కు కారణం అందుకే బార్లీ, సబ్జా నీళ్ళు తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు, చెక్కర కలపని పండ్ల రసాలు, మజ్జిగా తాగాలి. వీలైనంత వరకు మసాలాలు, బయటి ఆహారం వద్దు. ఉదయము, సాయంత్రము అరగంట పాటు నాననిచ్చి తీరాలి. యోగా కూడా మంచిదే. అప్పుడే జీర్ణక్రియ పనితీరు బాగుంటుంది. అధిక బరువు అదుపులో వుంటుంది. ఇంట్లో వున్న బయటకి వెళ్ళినా తెలుపు తో పాటు రంగు దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. చేనేత రకాలైన నులు, భారీ లెనిన్ వస్త్రాలే చాలా మంచివి. చెప్పులు కూడా పాదాలకు గాలి తగిలే విధంగా వుండాలి. సూర్య కాంతి నేరుగా కళ్ళకు తగలకుండా కళ్ళద్దాలు వేసుకోవాలి.

    బార్లీ, సబ్జా నీళ్ళు మరువకండి

    ఎండలు అప్పుడే ప్రతాపం చూపెడుతున్నాయి. మారిన వాతావరణంలో ముందుగా మన జీవన శైలి మార్చుకోకపొతే చాలా కష్టం. వాతావరణం  వేడిగా వుంటే నీరు చమట రూపంలో బయటకు…

  • నీహారికా, కరుణా, జాలి, దయా, పుట్టుకతో వచ్చే గుణాలే? అవి అందరికి ఉండవా? అన్నావు కానీ పిల్లలకు వీటిని అలవాటు చేస్తే అలవరచుకునే అంశాలే అని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. చిన్న తనంలో తమకు అవసరం లేని దుస్తులను, బొమ్మలను ఇతరులకు ఇవ్వడం, తమ చేతుల్లో వున్న ఎంత ఇష్టమైన చాక్లెట్ అయినా తోటి పిల్లల తో పంచుకునే విధంగా ప్రోత్సహించడం తల్లిదండ్రుల కర్తవ్యం. అసలు కరుణ జాలి గుణాలు యంటి డిప్రసెంట్ లాంటి వని మానసిక శస్త్ర వేత్తలు విశ్వసిస్తారు. కరుణతో చేసే పనుల వల్ల సెరటోనిన్ అనే రాసాయినం ఉత్పత్తి అవ్వుతుంది. ఈ కెమికల్ నుంచి మంచి జ్ఞాపక శక్తి, నిద్ర, మూడ్, ఆరోగ్యం అన్ని పిల్లలకు లభిస్తాయి. కరుణ అనేది అలవాటైతే అనుకూల ప్రభావం పెద్ద అయినా చూపెడుతుంది. పెరిగే పిల్లల్లో ఆ స్వభావం వారిలో ఆరోగ్య పురితమైన ఆత్మస్థయిర్యం, తోటి వారి పట్ల స్నేహ పూరితమైన ధోరణి పెరుగుతాయి. పిల్లలకు తోటి వారి తో, జంతువులతో స్నేహంగా ప్రేమగా వ్యావహరింహడం పెద్ద వాళ్ళు నేర్పాలి. అస్సలు పెద్దలకు ఈ మూడు గుణాలు వుంటే వాళ్ళు ఇతరులతో అన్నీ పంచుకునే స్నేహపూరితమైన దృక్పదం కలవారైతే అవన్నీ చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఏ స్వభాన్ని అయినా వాళ్ళకు అలవాటుగా నేర్పొచ్చు.

    ఈ సుగుణాలు నేర్చుకుంటే వచ్చేవే!

    నీహారికా, కరుణా, జాలి, దయా, పుట్టుకతో వచ్చే గుణాలే? అవి అందరికి ఉండవా? అన్నావు కానీ పిల్లలకు వీటిని అలవాటు చేస్తే అలవరచుకునే అంశాలే అని ఎక్స్…

  • అల్లం టీ ఎంతో బాగుంటుంది. తలుచుకుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. ప్రతి వంటకానికి తనదైన ప్రత్యేక రుచిని అందించే ఆహార పదార్దమే గాక, ఒక అద్భుతమైన ఔషదం కూడా. ఎన్నో రుగ్మతులు నయం చేసేందుకు వైద్యులు అల్లాన్ని వాడుతున్నారు. అల్లం వేళ్ళలో బాగా పెద్ద స్థాయి లో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి కాన్సర్ కరకమైన ప్రీరాడికల్స్ తో పోరాడతాయి. కొన్ని రకాల పోషకాల ఉత్పత్తి జరగకుండా గట్టిగా ఆపుతాయి. స్త్రీలు గర్భం ధరించిన సమయంలో వంతులు వికారం రెండింటి తోనూ బాధపడుతుంటారు. కడుపులో వాయుప్రకోపాన్ని ఆపడంలో అల్లం ఉపయోగ పడుతుంది. కనుక వేవిళ్ళు దీని వల్ల ఆగుతాయి. ప్రతి రోజు తాజా అల్లం రసం నాలుగైదు చుక్కలు తాగితే మంచిది. జీర్ణ రసాలని ఊరేట్టు చేస్తుంది. నెల సారి కడుపు నొప్పి తగ్గిస్తుంది. మైగ్రేన్, తలనొప్పికి మంచి ఉపసమనం. కీళ్ళ నొప్పుల నుండి ఉపసమనం . ఈ ఘాటైన మసాలా దినుసు ఎన్నో వ్యర్ధాలను తగ్గించే మంచి మందు. అల్లం రసం, తేనె, నిమ్మరసం మంచి కాంబినేషన్.

    ఈ మసాలా దినుసు మహిమ అద్భుతం

    అల్లం టీ ఎంతో బాగుంటుంది. తలుచుకుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. ప్రతి వంటకానికి తనదైన ప్రత్యేక రుచిని అందించే ఆహార పదార్దమే గాక, ఒక అద్భుతమైన ఔషదం కూడా.…

  • మహిళలు ప్రతి నిత్యం చేసే పనులకు ఒక అంతు దరీ వుండదు. కుటుంబం ఉద్యోగం తో పాటు నిరంతం నిమగ్నమై వుండే మహిళలు సొంత ఆరోగ్యం విషయమై శ్రద్ధ తీసుకోరు. ఇటీవల ఒక్క పరిశోదన ఉద్యోగం చేసే మహిళల్లో చాలా మంది నీళ్ళు ఎక్కువ తాగరని, అస్థామానం ఆఫీసులో అందరి ముందు బాత్ రూమ్ వెళ్ళడం సమస్యని, లేదా సరైన బాత్ రూమ్ సౌకర్యం లేకపోవడం వల్ల మంచి నీళ్ళు తాగేందుకు ఇచ్చింది రిపోర్టు చెప్పుతుంది. మహిళల్లో ఈ నిబంధన సదలించుకోండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంటున్నారు. అలాగే ఉదయం తినాల్సిన పలహారం సమయం లేక ఎగ్గొట్టి, లంచ్ లో డిన్నర్ లో బాగా తినేసినా నష్టమే. శారీరక జీవక్రియ మందగించేది ఇక్కడే. ప్రోటీన్స్ తీసుకోక పోవడం వల్ల అధిక బరువు పెరుగుతారు. ప్రోటీన్స్ కు ఆధారమైన శాఖాహారం మాంసాహార పదార్ధాలు తినకపొతే వారి స్థానం లో కార్బోహైడ్రేడ్స్ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. రోజంతా ఆకలి తో వుంటే సమయానికి తినక ఎదో ఒక్కటి నోట్లో వీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అందుకే డైట్ లో కాల్షియం తప్పని సరిగా ఉంచుకోండి అంటున్నాయి పరిశోధనలు.

    ఇవన్నీ మహిళల పొరపాట్లే

    మహిళలు ప్రతి నిత్యం చేసే పనులకు ఒక అంతు దరీ వుండదు. కుటుంబం ఉద్యోగం తో పాటు నిరంతం నిమగ్నమై వుండే మహిళలు సొంత ఆరోగ్యం విషయమై…

  • ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్ చేయక పొతే చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. బొప్పాయిలో వుండే ఎంజైమ్స్ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. రెండు చెంచాల గుజ్జు లో కొద్దిగా ఆలివ్ నూనె, చెక్కర కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోని కడిగేస్తే ముఖం పై పేరుకున్న మురికి పోతాయి చెక్కని మెరుపు వస్తుంది. కొబ్బరి నూనెలో కొంచ చెక్కర , అర చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి, మెడకి మర్దనా చేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. పావు కప్పు ఓట్స్ పొడిలో పెరుగు, పసుపు, గులాబీ నీళ్ళు కలిపి ఈ మిశ్రమంతో మొహం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. రెండు చెంచాల కాఫీ పొడి లో బాదాం నూనె, కొబ్బరి నూనె కలిపి పూతలా వెయ్యాలి. తడి చేతుల్లో మర్దనా చేస్తే చల్లని నీళ్ళతో మొహం కడిగేసుకోవాలి. కాఫీ పొడి నిర్జీవంగా మారిన చర్మానికి జీవం ఇస్తే బాదాం నూనె తెమ అందిస్తుంది. బియ్యం పిండి, తేనె కలిపిన మిశ్రమంతో మాస్క్ వేసుకుని కడిగేసాక, మాయిశ్చురైజర్ రాస్తే చర్మం చాలా మృదువుగా కనిపిస్తుంది.

    ఇవన్నీ మంచి ఫేస్ ప్యాక్ లు

    ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్…

  • డెస్క్ ఉద్యోగాల్లో కుర్చుని పని చేసే సమయంలో సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయాలని చెప్పుతూనే వుంటారు. బుజాలు, వెన్ను, మెడ సరైన పోజిషన్ లో వుంచుకున్నంత మాత్రాన సరిపోదు. కాళ్ళు, పాదాలు కుడా పోశ్చర్ లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఫ్లోర్ పైన పాదాలు ఫ్లాట్ గా వుంచాలి. చాలా మంది కుర్చీ ముందరకు వంచినట్లు పెడతారు. అది సరికాదు. ఫిట్ రెస్ట్ వుంటే పాదాలు కరెక్ట్ గా దాని పైన వాలతాయి. అదీ సరిగా సౌకర్యమైన లెవెల్ లో వుండాలి. ఒక కాలానికి ఇంకో మోకాలి పైనవేస్తారు. దీని వల్ల రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఎక్కువ సేపు ఒకే పోజిషన్ లో కూర్చో కూడదు. వేలైనప్పుడల్లా పోశ్చర్ మార్చాలి. తరచూ లేచి బ్రేక్స్ తీసుకోవాలి. దీని వల్ల శారీరక పని సామధ్యం పెరుగుతుంది. బ్రేక్ తీసుకుంటున్నప్పుడు చిన్న పాటి వాకింగ్, శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. అప్పుడే కండరాళ్ళు రిలాక్స్ అవ్వుతాయి కూర్చొని నిలబడి, పడుకునే పోజిషన్స్ సరిగ్గా ఉంటేనే పోశ్చర్ చెక్కగా కనపడుతుంది.

    పాదాల పోశ్చర్ కూడా చాలా ముఖ్యం

    డెస్క్ ఉద్యోగాల్లో కుర్చుని పని చేసే సమయంలో సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయాలని చెప్పుతూనే వుంటారు. బుజాలు, వెన్ను, మెడ సరైన పోజిషన్ లో వుంచుకున్నంత…

  • ఎప్పుడూ పెద్దవాల్లకు ఫ్యాషన్ గురించే చర్చ వస్తుంది. కానీ చిన్న పిల్లల ఫ్యాషన్ మార్కెట్ అంత ఎత్తున వుంది. పెద్ద వాళ్ళ కోసం రూపొందించే స్కర్టులు, లేహంగా, అనార్కలి దుస్తులు అన్నీ పిల్లల కోసం డిజైన్ చేస్తున్నారు. గౌను తరహా లో, మంచి ఎంబ్రాయిడరీ, బ్రోకేడ్ మెరుపులతో తయ్యారయ్యె డ్రెస్ విలువ దాదాపు అమ్మాయిల డ్రెస్ ల ఖరీదు లోనే వుంది. లేహంగా, దుపట్టాలు కూడా అంతే. మెడ చుట్టూ నగలు అవసరం లేని లేస్ మెరుపుల ఎంబ్రాయిడరీ, సిల్క్, పట్టు, వస్త్ర శ్రేణుల తో లేహంగా, దుపట్టా మాచింగ్ ఇస్తున్నారు. పూర్తి ఎంబ్రాయిడరీతో ఫ్యాన్సీ సిల్క్ అనార్కలి డ్రెస్ అయితే పిల్లలకు కేవలం గౌన్లు, పట్టు లంగాల రోజులు ఇప్పుడో పోయాయి. ఇప్పుడు అన్ని రకాల ఫ్యాషన్స్ పిల్లల కోసం కూడా అందుబాటులో వున్నాయి.

    పాపాయిల కోసం ఫ్యాన్సీ డ్రెస్సులు

    ఎప్పుడూ పెద్దవాల్లకు ఫ్యాషన్ గురించే చర్చ వస్తుంది. కానీ చిన్న పిల్లల ఫ్యాషన్ మార్కెట్ అంత ఎత్తున వుంది. పెద్ద వాళ్ళ కోసం రూపొందించే స్కర్టులు, లేహంగా,…

  • కండరాల్ల నొప్పులతో చాలా మంది స్త్రీలు బాధపడుతూ వుంటారు. బుజం, మోకాళ్ళ కింద వుండే కండరాళ్ళు, తోడ భాగంలో వుండే కండరాళ్ళు నొప్పులకు అవి బలహీనంగా వునతమే కారణం అంటున్నారు డాక్టర్లు. బలం కోసం మాంసాహారమే అక్కర్లేదంటారు. కండరాల్ల పెరుగుదలకు, నిర్వహణకు కావాల్సింది ప్రధానంగా ప్రోటీన్లే. అవి మాంసాహారం వల్లనో శాఖాహారం వల్లనో కావొచ్చు. సోయాబీన్స్, బటానీలు, పప్పు ధాన్యాలు వంటి వాటి నుంచిలభించే ప్రోటీన్లకు మాంసాహారం నుంచి లభించే ప్రోటీన్లు ఏమి వుండదు. ఏ ప్రోటీన్లు అయినా మేలే చేస్తాయి. కాకపొతే ఏ ఆహారం నుంచి అయినా సరే ప్రోటీన్లు అంటే ఆహారం తీసుకుంటే చాలు కండరాళ్ళ నొప్పులే సరిగ్గా నడవనీయకపొతే, శరీరం బరువు పెరగడానికి కారణం అవుతుంది. అలాగే కండరాళ్ళు బలహీనంగా వుంటే ఇక శరీరం ఫిట్ నెస్ గా వుండటం అసాధ్యమే.

    శరీరానికి ఏ రకంగా అందినా మంచిదే

    కండరాల్ల నొప్పులతో చాలా మంది స్త్రీలు బాధపడుతూ వుంటారు. బుజం, మోకాళ్ళ కింద వుండే కండరాళ్ళు, తోడ భాగంలో వుండే కండరాళ్ళు నొప్పులకు అవి బలహీనంగా వునతమే…

  • కొబ్బరి నీళ్ళు తాగి బొంద ఇచ్చేసి, అడ్డంగా కొట్టేసి లేత కొబ్బరి ఇస్తారు దుకాణ దారులు. ఆ లేలేత కొబ్బరి ఎంతో ఆరోగ్యం. కప్పు లేత కొబ్బరి లో ఏడు గ్రాముల డైటరీ పిచు వుంటుంది. అలాగే 283 క్యాలరీలు, పిండి పదార్ధాలు, చెక్కర, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీన్ని గర్భినిలు హ్యాప్పీ గా సందేహం లేకుండా తినొచ్చు. నీళ్ళు లాగే ఈ కొబ్బరి డి-హైడ్రేషన్ దూరం చేస్తుంది. పాలు కారే కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్లు కరిగే కొవ్వు ఉంటాయి. ఇవి త్వరగా శరీరంలో కలిసి మంచి పోషకాలు విడుదల చేస్తాయి. అవసరమైన శక్తిని అందజేస్తాయి. పోటాషియం, సోడియం కుడా లేత కొబ్బరి తో లభిస్తాయి. ఇవి శరీరానికి అందటం వల్ల రక్త పోతూ అదుపులో వుంటుంది. రక్తంలో పోటాషియం శాతం కూడా సమంగా వుంటుంది. ఇందులో విటమిన్-బి, ఫోలెట్లు తక్కువ. నీరసంగా వుంటే ఈ లేలేత కొబ్బరి తింటే వెంటనే ఉత్సాహం వస్తుంది. ప్రతి రోజు తిన్నా సమస్య వుండదు. సరిపడా పిచు కుడా లభిస్తుంది.

    లేత కొబ్బరితో పుష్కలంగా ఖనిజాలు

    కొబ్బరి నీళ్ళు తాగి బొంద ఇచ్చేసి, అడ్డంగా కొట్టేసి లేత కొబ్బరి ఇస్తారు దుకాణ దారులు. ఆ లేలేత కొబ్బరి ఎంతో ఆరోగ్యం. కప్పు లేత కొబ్బరి…

  • క్యారెట్ తినడం వల్ల ద్రుష్టి మేరుగవ్వుతుందనే మాట మాత్రం నిజం అంటున్నారు ఎక్ష్ పర్ట్స్ ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ లో రెండు స్పూన్ల తేనె కలుపుకుని తాగుతుంటే కంటి దృష్టి మేరుగు అవ్వుతుంది. అంతే కాక గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు పని చేసే వల్లకి కలిగే అలసటకు కూడా క్యారెట్ జ్యూస్ మంచి మందు. ప్రతి రోజు ఉదయం లేస్తూనే, వాష్ చేసిన ముందు నిలబడి ఐదు నిముషాలు కళ్ళ పై చిలకరించాలి. కళ్ళు ఇలా వాష చేయడానికి వేడి నీళ్ళను ఉపయోగించకూడదు. అలా చేస్తే కళ్ళు అలస్సి పోయి, నిద్ర నుంచి తేరుకుని తేటగా అవ్వుతాయి. రెండు అర చేతుల్ని ఆర నిమిషం పాటు రాపిడి చేసి ఆ వెచ్చ దనాన్ని కళ్ళపై వుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళకు మంచి పరిరక్షణ లభిస్తుంది. ఒక గ్లాసు నీళ్ళల్లో ఓ టీ స్పూన్ త్రిఫల పొడి వేసి రాత్రంతా అలా వుంచి ఉదయాన్నె వడకట్టి ఆ నీళ్ళతో కళ్ళు శుబ్రం చేసుకంటే మంచిది.

    కంటి ద్రుష్టి మెరుగు పడుతుంది.

    క్యారెట్ తినడం వల్ల ద్రుష్టి మేరుగవ్వుతుందనే మాట మాత్రం నిజం అంటున్నారు ఎక్ష్ పర్ట్స్ ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ లో రెండు స్పూన్ల తేనె కలుపుకుని…

  • పెద్దగా రకరకాల షాపుల్లో వుండే కళ్ళద్దాలు కంటికి రాక్షనే కాదు, స్టయిల్ అంతకుమించి ఫ్యాషన్ కూడా కళ్ళద్దాలు లేకపోతే ఫ్యాషన్ ని ఎలా ప్రొడ్యూస్ చెయ్యాలి అనుకునేంతగా ఇది మహిళల జీవితం లో అంతర్భాగంగా అయిపోతున్నాయి. ఇప్పుడు వేసవిలో కళ్ళకు రక్షణగా నిలిచే కళ్ళద్దాలు శీతాకాలం చిరు ఎండల్లో కూడా కళ్ళకి అందం స్టైల్ ఇస్తాయి. పాత తరం తారలు ఈ ఈ సన్గ్లాస్ అందాలని ప్రజల్లోకి తీసుకువస్తే ఇప్పటి తరం అమ్మాయిలు మచ్చలు కమ్మిన రోజున కూడా కళ్ళ జోళ్ళు తీస్తే ఎలా అని దిగులు పడిపోతారు. ఎందుకంటే ఇవి ఇవ్వాల్టి ఫ్యాషన్ స్టైల్ యాక్ససరీ. స్క్వేర్ ముఖాకృతి వుంటే నలుచదరపు ఫ్రేమ్స్ బాగుంటాయి. పొడవాటి మొహం కలవారికి క్వాట్స్ఐ బాగుంటుంది. మొత్తానికి కళ్ళజోళ్ళు సౌందర్య పోకడలో ఒక ముఖ్యమైన భాగం.

    ఇవి ఎప్పుడూ ఫ్యాషన్ సిగ్నేచర్లే

    పెద్దగా రకరకాల షాపుల్లో వుండే కళ్ళద్దాలు కంటికి రాక్షనే కాదు, స్టయిల్ అంతకుమించి ఫ్యాషన్ కూడా కళ్ళద్దాలు లేకపోతే ఫ్యాషన్ ని ఎలా ప్రొడ్యూస్ చెయ్యాలి అనుకునేంతగా…

  • నీహారిక, యూత్ మనస్సులో ఏముందో తలుసా అన్నావు. తెలుసు ఇవాల్టి తరం అమ్మాయిల కల స్టార్టప్. కళాశాల చదువు అయ్యి అవ్వడం తోనే ఒక చెక్కని బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి. సక్సెస్ అవ్వాలి. కానీ ఆ స్టార్టప్స్ విజయవంతంగా నడిపించే లక్షణాలు డెవలప్ చేసుకో మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫస్ట్ స్టార్టప్ మొదలు పెట్టాలి అంటే అస్సలు మనలో వుండే సమర్ధతలేమిటి? మనమేంటి, ప్రత్యేకత లేమిటి తేల్చుకుంటే మనం తాయారు చేసే ఉత్పత్తిని మనదైన పద్దతిలో మార్కెట్ చేయడం సాధ్యం అవుతుంది. అలాగే పెద్ద సభల్లో ప్రేసంగాలు చేయక పోయినా పర్లేదు. మనతో కలిసి మాట్లాడే వాళ్ళతో ప్రతిబావంతంగా మాట్లాడగలగాలి. ఎప్పుడూ సానుకూలంగానే మాట్లాడాలి. ఎప్పుడూ నెగటివ్ సిగ్నల్స్ ఇవ్వకూడదు. అలాగే ఓటమిని తట్టుకోగల సమాధ్యం వుండాలి. ప్రతీదీ ప్రారంభంలోనే రెండో వారంలో రిజల్ట్ చూడాలి అనుకుంటే కష్టం. వంద సార్లు నష్టం వచ్చినా నేనా నష్టాన్ని భరించి లాభాల బాటలో పట్టించగలను అనే నమ్మకం వ్యాపారంలో సక్సెస్ కు పునాది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అమ్మాయిల కళలు నిజాం కావాలి అంటే కొన్ని నైపుణ్యాలు అలవర్చు కోవడమే. ఇప్పుడు చెప్పు, యూత్ మనస్సులో కోరిక గెలవడం అంకుర పరిశ్రమలకు ఎంటో ప్రోత్సాహం వుంది. రెండు చేతులతో వాటిని అందుకోవాలి.

    అమ్మాయిల మనస్సులో కోరిక ఇదే

    నీహారిక, యూత్ మనస్సులో ఏముందో తలుసా అన్నావు. తెలుసు ఇవాల్టి తరం అమ్మాయిల కల స్టార్టప్. కళాశాల చదువు అయ్యి అవ్వడం తోనే ఒక చెక్కని బిజినెస్…

  • ఒక్కసారి ఏది నిజమో తలుసుకోలేక పోతాం. కానీ తేల్చుకునే ముందు వినాలి కదా చాలా మంది జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు చెపుతారు. జుట్టు కత్తిరించుకుంటే వెంట్రుకలు పెరుగుతాయంటారు. అదేం కాదు, కత్తిరించినా కొత్తగా జుట్టు ఎక్కువేమీ రాదు. ఉన్నదే పెరుగుతుంది అంటారు ఎక్ష్ పర్ట్స్. అలాగే జుట్టు మసాజ్ చేసినా వేగంగా ఎం పెరగదట. పైగా మాడుకు ఎక్కువ సేపు మస్సాజ్ చేస్తే జుట్టు దెబ్బతింటుందట, చుండ్రు వల్ల జుట్టు ఊడిపోతుంది అంటారు కొందరు. కానీ చుండ్రుకి జుట్టు రాలిపోవడాకి శాస్త్రీయ సంబందం ఏవీ లేదు. ఇది కేవలం షాంపూలు అమ్ముకోవడానికి చేసే మార్కెటింగ్ ప్రచారం అంటున్నారు డాక్టర్లు. మాడు పోడి బారితే మాత్రం వెంట్రుకలు చిట్లి రాలిపోతాయట. తరచూ షాంపూ మార్చినా జుట్టు వూడదు. ఒత్తిడికి జుట్టు రాలడానికి ఏ సంబంధం లేదు. చల్లని నిల్లతో స్నానం చేసినా వుదిపోదు. పైగా రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు బాగా పెరుగుతుందిట కూడా. ఇవి నిపుణుల సలహాలే. అవసరం అయ్యినంత వరకు మనశ్శాంతి కోసం, అమ్మాయి జుట్టు రాలదు అనడం కోసం చదువుకోవాలి అంతే.

    ఇందులో ఎంత నిజాం?

    ఒక్కసారి ఏది నిజమో తలుసుకోలేక పోతాం. కానీ తేల్చుకునే ముందు వినాలి కదా చాలా మంది జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు చెపుతారు. జుట్టు కత్తిరించుకుంటే వెంట్రుకలు…

  • పిచు పదార్ధం తప్పకుండా భోజనంలో వుండాలని రెగ్యులర్ గా తీసుకోవాలని అంటారు. ఈ పిచులో రెండు రకాలు. ఒకటి కరిగే రకం ఓట్స్, దంపుడు బియ్యం, బార్లీ, రాగులు, వీటిలో నీటితో త్వరగా కరిగే పీచు వుంటుంది. ఇది ఇతర పోషకాలను త్వరగా గ్రహించి శరీరానికి అందిస్తుంది. అలాగే మరొక రకం పిచు తాజా పండ్లు, కురగాయాల్లో వుంటుంది. ఇది త్వరగా కరగదు కానీ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపే డిటాక్స్ ఫియర్ గా పని చేస్తుంది. అధిక రక్త పోటు వుంటే పిచు పదార్ధాలు ఎంత తీసుకుంటే అంత మంచిది. పీచు వల్ల బరువు తగ్గడం చాలా సులువు. ఇవి పుష్కలంగా వున్న పదార్ధాలు కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీనితో సన్నబడటం చాలా తేలిక. జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది. అరుగుదల సమస్యలు తలెత్తవు మధుమేహం వున్నవారు పిచు పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే చెక్కర స్తాయి అదుపులో వుంటాయి.

    ఈ రెండు రకాలూ తినాలి

    పిచు పదార్ధం తప్పకుండా భోజనంలో వుండాలని రెగ్యులర్ గా తీసుకోవాలని అంటారు. ఈ పిచులో రెండు రకాలు. ఒకటి కరిగే రకం ఓట్స్, దంపుడు బియ్యం, బార్లీ,…

  • ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే సహజంగా ఎప్పుడూ యుర్ధాలు నడుస్తాయి కొట్టుకుంటారు. ఒకే వస్తువు కోసం పోటీ పడతారు. మాములే కానీ అమ్మ మాత్రం మాత్రం ఇదరి విషయంలో ముఖ్యమైన ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరినో ఎప్పుడూ గరం చేయొద్దు. వెనకేసుకు రావద్దు చిన్న పిల్ల అనో, పోన్లే పాపం అన్నేకదా అనో ఇద్దరికీ సర్ది చెప్పరాదు. ఇలా చేస్తే అవతలి వాళ్ళు అంటే అమ్మకి ఇష్టం అని ఫిక్స్ అయ్యిపోయి రెండో వాళ్ళని శత్రువర్గంలో చేర్చేస్తారు. కాబట్టి ఇద్దరు సమానం అనే ఉద్దేశాన్ని వాళ్ళల్లో కలుగనివ్వాలి. ఆట వస్తువులు ఎవ్వరికి ఇష్టం అయినవి వాళ్ళకు కొనివ్వాలి. రెండో వాళ్ళ దగ్గరనుంచి బలవంతంగా ఇంకొకళ్ళ కోసం ఏ వశువు బలవంతంగా లాక్కోవద్దు. పిల్లలు ఇద్దరు పసివాల్లే. బలహీనమైన వాళ్ళే. కారణం తలుసుకుని అప్పుడు ఎవరి తప్పు అయితే న్యాయం గా వాళ్ళనే కారణం చూపించి మరీ కోప్పడాలి. సరైన జుడ్జిమెంట్ ఇవ్వాలి. ఒకళ్ళ ఫిర్యాదు తో ఇంకొక్కల్లను దండిస్తే పిల్లలు బాధపడతారు.తప్పు ఎవరిదో నిర్ధారించి చెప్పి మరీ కోప్పడాలి.

    పిల్లలు ఎంతో సెన్సిటివ్

    ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే సహజంగా ఎప్పుడూ యుర్ధాలు నడుస్తాయి కొట్టుకుంటారు. ఒకే వస్తువు కోసం పోటీ పడతారు. మాములే కానీ అమ్మ మాత్రం మాత్రం ఇదరి విషయంలో…

  • బట్టలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్లో వేయడం లేదా బండ కేసి బాడి వుతికేయడం రెండే పద్దతులు. కానీ ఒక్క రకం దుస్తులకు ఒక్కో రకం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపొతే రంగు వెలసి పోవడం నాణ్యత తగ్గడం తప్పదు. నీలిరంగు, ముదురు రంగు వెలసిపోవడం, డెనిమ్ ప్యాంట్లు అయితే చల్లని నీళ్ళల్లో ఉతకాలి. ఆవే ఇతర రంగుల దుస్తులైతే గోరు వెచ్చని నీళ్ళు వాడాలి. వీటిని నీడపట్టునే ఆరేయాలి ముదురు రంగు నీలి దుస్తులకు చల్లని నీళ్ళు వాడాలి. లేత రంగులో తెలుపు రంగు వెచ్చని నీళ్ళే ఉత్తమం. కొన్ని దుస్తుల్ని కొంత సేపు ధరించి ఎండలో ఆరేసి మడతేసి ఇంకోసారి వాడతారు. మిగతావాటి సంగతి ఎలా వన్నా లెనిన్ తరహ వస్త్రాలు మాత్రం వదిన వెంటనే ఉతికేయాలి. లేదంటే చమట కారణంగా వాటిలో ఫంగస్ పేరు కొంటుంది. రేయాన్ దుస్తుల్ని బ్లీచింగ్ లో వేయకూడదు. మెలితిప్పి పిండకూడదు. పాలిస్టర్ చల్లని నీటితో ఉతికి అలాగే ఆరేయాలి. పట్టు సిల్క్ రకాలు చల్లని నీటి లో ఉతికి అలాగే ఆరేయాలి, పిండకూడదు. ప్రతి దుస్తులను ఉతికేందుకు దానికి ప్రత్యేక పద్దతులు వుంటాయి.

    ఒక్కో దుస్తులు ఒక్కో రకంగా

    బట్టలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్లో వేయడం లేదా బండ కేసి బాడి వుతికేయడం రెండే పద్దతులు. కానీ ఒక్క రకం దుస్తులకు ఒక్కో రకం జాగ్రత్తలు…

  • పింక్ సౌండ్స్ అంటే ఉదాహరణకు నెమ్మదిగా జలపాతం ప్రవహిస్తున్న శబ్దం, నీరు మెల్లగా శబ్దం చేస్తూ ప్రవహిస్తున్న శబ్దం, నెమ్మదిగా తూగే గాలి శబ్దం, చెక్కని మెల్లని ఆలాపన తో జోల పాట హుమ్మింగ్, ఎవన్నింటినీ పింక్ సౌండ్స్ అంటారు. ఇవన్నీ విశ్రాంతినిస్తాయి. నిశ్శబ్దంగా వున్న చొట ఇవే చెవుల దగ్గర హాయిగా వినిపిస్తాయి. ఈ శబ్దాలు వింటూ హాయిగా నిద్ర పోవొచ్చు. అని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. ఇది చాలా వినూత్నమైన పద్దతి. ఎటువంటి మందులు పరికరాల సాయం లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. ఘాడంగా నిద్ర పోవడానికి జ్ఞాపక శక్తికి సంబంధం వుందనిపరిశోధకులు ఏ నాడో గుర్తించారు. మధ్య వయస్సు వచ్చేసరికి నిద్ర తగ్గుతూ వస్తుంది. ఒక వ్యక్తి పడుకునే సమయంలో అతని మెదడు లోని న్యురాన్లు పంపే సంకేతాలని శస్త్రవేత్తలు రికార్డు చేసారు. న్యురాన్లు సంకేతాలు వచ్చే సమయంలో పింక్ సౌండ్ వినిపిస్తేనే ఆ వ్యక్తి గాఢమైన నిద్ర పోగాలడట. ఇది నిద్ర లేమికి సరైన పరిష్కారమే అనిపిస్తుంది.

    ఇలాంటి శబ్దాలు వింటే నిద్రొస్తుంది.

    పింక్ సౌండ్స్ అంటే ఉదాహరణకు నెమ్మదిగా జలపాతం ప్రవహిస్తున్న శబ్దం, నీరు మెల్లగా శబ్దం చేస్తూ ప్రవహిస్తున్న శబ్దం, నెమ్మదిగా తూగే గాలి శబ్దం, చెక్కని మెల్లని…