• మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ మొటిమలు రాకుండా కాపాడుతాయి అంటున్నారు. బాగా పండిన బొప్పాయిలో చెక్కెర, పెరుగు కలిపి ముఖానికి రాసి మర్దనా చేస్తే మొటిమలు తగ్గుతాయి. నారింజ తొక్కల పొడి లో పలు కలిపి ముద్దలా చేసి ముఖానికి రాసి ఆరె దాకా వుంచి కడిగేస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొహం కొత్త మెరుపు తో వుంటుంది. రెండు చెంచాల తేనె, ససిన్ని పాలు, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి దీన్నీ ఫేస్ మాస్క్ లా వేసి ఆరాక కడిగేయాలి. ఈ మాస్క్ రోజు మర్చి రోజు వేసుకుంటే మొటిమలు తగ్గడమే కాదు మచ్చలు పోతాయి. అరటి పండు పై తొక్కలలో ల్యుటిన్ అనే ఎంజైమ్ వుంటుంది. ఇది కొత్త కణాల అభివృద్ధి కి సహాయపడుతుంది. ముఖం పైన వలయాకారంలో అరటి తొక్కతో రుద్దితే ఫలితం వుంటుంది. చర్మం కూడా తాజాగా వుంటుంది.

    ఇంటి చిట్కాల తో ఈ సమస్యలు మాయం

    మొటిమలు చుస్తే అమ్మాయిలకు కంగారే. అవి ఒక్క పట్టాన తగ్గవు. తగ్గినా మచ్చలు కనిపిస్తాయి. ఇందుకు రాసాయినాలు వుండే క్రిములు రాయొద్దు. ఇంట్లో వుండే వస్తువులే ఈ…

  • చాలా నెలలు గా వర్క్ ఔట్స్ చేస్తున్నా సరైన దేహ స్తితి రావడం లేదని చాలా మంది మహిళల కంప్లైంట్. ఇది సరైన మాటే. మహిళల్లో లోయర్ మజిల్ డెసినిషన్ వుంటుంది. ఇదో డిస్ అడ్వాన్ టేజ్. పురుషుల కంటే ఎక్కువ ఫ్యాట్ వుంటుంది కనుక అంత త్వరగా రిజల్ట్స్ కనిపించవు. పైగా మహిళలకు తెస్తోస్టిరాన్ చాలా తక్కువ స్థాయి లో వుంటాయి. ఈ హార్మోన్ పురుషులలో ఈకువ స్థాయి లో వుండి వాళ్ళు చాలా తేలికగా సిక్స్ పాక్స్ వరకు వెళ్ళిపోగలుగుతారు. స్త్రీలు ఆరోగ్యవంతమైన మజిల్ మాస్ మెయిన్టైన్ చేయాలి. హర్మోనల్ వ్యవస్థ సరిగా పని చేయడానికి ఆరోగ్యవంతమైన ఫ్యాట్ చాలా అవసరం. సరైన మజిల్ మాస్ వుందో లేదో జిమ్లో పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్గా వర్క్ఔత్స్ చేస్తే సరైన ప్రొటిన్లు తీసుకోవాలి. ఎటువంటి హర్మోనల్ సుప్ప్లిమెంట్లు వద్దు. వారంలో 6 రోజులు 45 నుంచి 60 నిమిషాల వరకు కర్డియో చేయాలి. వ్యయామాలు సరైన రీతి లో వుండాలంటే పర్యవేక్షకుల శిక్షణ చాలా అవసరం.

    అంత తొందరగా రిజల్ట్స్ కనపడదు

    చాలా నెలలు గా వర్క్ ఔట్స్ చేస్తున్నా సరైన దేహ స్తితి రావడం లేదని చాలా మంది మహిళల కంప్లైంట్. ఇది సరైన మాటే. మహిళల్లో లోయర్…

  • ఐలైనర్ ను కళ్ళ ఇన్నర్ రిమ్స్ లో అప్లై చేస్తేనే కళ్ళు అందంగా వుంటాయి. ఈ ప్రోడక్ట్ ను ప్రోమోట్ చేసే సినీ తారలు ఇదే మాదిరి అప్లై చేస్తారు. ఇలా ఐ లైనర్ ను వాడటం కరక్టేనా, కళ్ళకేం ప్రాబ్లం కాదు కదా అని చాల మంది సందేహంలో పడుతుంటారు. ఎక్స్ పర్ట్స్ ఏం చెపుతారంటే పేరు పొందిన కంపెనీలు కళ్ళ పరిసర ప్రాంతాలకు సురక్షితమైన పరిక్షలు జరిపాకే, ఆ పదార్ధాల నాణ్యమైన బ్రాండ్ ఎంచుకోవాలి. ఆ ప్రోడక్ట్స్ కళ్ళ ఇన్నర్ రిమ్ వాడకానికి అనుమతించి వుందో లేదో చెక్ చేసుకోవాలి. కంటి ప్రాంతం చాలా సున్నితంగా వుండి ఇరిటేషన్ కు ఎర్రబాడటానికి లేదా ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు. ముఖ్యంగా ప్రొడక్ట్స్ లో ఉపయోగించిన పదార్ధం సూట్ అవ్వక పోయినా ఇలా జరుగుతుంది. వాడటానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. తేదీ దాటిన వాటిని పొరపాటున కూడా వదవద్దు.

    నాణ్యమైన బ్రాండ్ ఎంచుకోవాలి

    ఐలైనర్ ను కళ్ళ ఇన్నర్ రిమ్స్ లో అప్లై చేస్తేనే కళ్ళు అందంగా వుంటాయి. ఈ ప్రోడక్ట్ ను ప్రోమోట్ చేసే సినీ తారలు ఇదే మాదిరి…

  • కొన్ని అలవాట్లు మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే కొన్నింటిని అలవాటుగా మార్చుకుంటే శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలు రాకుండా పోతాయి. యోగా, ప్రాణాయామం చేసే అలవాటు ఉంటే ఎలాంటి వత్తిడినైనా ఇట్టే అధిగమించ వచ్చు. ఆలోచనలు అదుపు చేయవచ్చు. ఉద్వేగాలని అపవచ్చు, ఒత్తిడి అనిపిస్తే రెండు నిమిషాల ప్రాణాయామం చాలు. బ్లాక్ టీ తాగితే ఇది వత్తిడిని పెంచే కర్టసాల్ హార్మోన్ పైన ప్రభావం చూపెడుతుందిట. బ్లాక్ టీ రోజుకు ఒక్క సరైనా తాగాలి. అలంటి నవ్వుకి ఏర్పడే ఎండార్ఫిన్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. నవ్వుకోసం నవోచ్చే పుస్తకాలు చుసినా సినిమా చూసినా, ఫ్రెండ్స్ తో నవ్వులలో మునిగి తేలిన ఎలాగైనా నవ్వాలి. అలాగే ఒక ఆత్మీయి స్పర్శే ఎంతో సేద తీరుస్తుంది. ఒక్క కౌగిలింత రక్త పోతూ ను తగ్గిస్తుంది, హార్మోన్ల హెచ్చు తగ్గులను అదుపు చేస్తుంది. కార్టిసాల్ ని నియంత్రిస్తుంది.

    ఆత్మీయి స్పర్శే మంచి మెడిసిన్

    కొన్ని అలవాట్లు మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే కొన్నింటిని అలవాటుగా మార్చుకుంటే శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలు రాకుండా పోతాయి. యోగా, ప్రాణాయామం చేసే అలవాటు…

  • నీహారికా, ఎల్లవేళలా చెదరని చిరునవ్వుతో వుండాలంటే ఏం చేయాలి అన్నావు. సరిగ్గా చెప్పాలంటే నవ్వు అనేది కేవలం ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ మాత్రమే.ఇది హృదయానికి కిటికీ లాంటిది. మనం నవ్వినప్పుడు ఎండార్ఫిన్లుగా పిలవబడే న్యురోట్రాన్స్ మీటర్స్ విడుదలై సంతోషాన్ని ఇస్తాయి. ఒత్తిడి స్థాయిల్ని తగ్గిస్తాయి. సరదాగా వుండే అన్నింటి వైపు దృష్టి సారించడమే. మనం చుసేవే మన మనసు-ని ప్రభావితం చేస్తాయి. కామెడీ షోలు,ఫన్నీ వీడియోలు, కామిక్ స్ట్రిప్స్ వంటి తక్షణ సరదాలు జీవితం లోకి తెచ్చుకోవాలి. ఇష్టపడే వారితో కలిసి గడపటం వల్ల పూర్తి స్థాయి ఆరోగ్యం, సంతోషం దక్కుతాయని అనేక పరిశోధనలు పేర్కొంటున్నాయి. అలాగే పెంపుడు జంతువులు కూడా సంతోషాన్ని అందిస్తాయి. వీటివల్ల ఆటోమేటిక్ గా మంచి మూడ్ వస్తుంది. అలాగే ఒక మంచి పని చేయడం వల్ల కూడా తక్షణ ఆనందం దక్కుతుంది. ఇతరుల కోసం చేసే ప్రతి పనిలోనూ మన సహాయం అందుకొన్న వారి మొహంలో కనిపించే ఒక మంచి చిరునవ్వు మన మూడ్ ని సంతోషంగా మార్చేస్తాయి. మనం సంతోషంగా వుండటం అంటే చుట్టూ సంతోషాన్ని సృష్టించుకోవడం అన్నమాట. సంతోషం చాక్లెట్ లాగా దొరకదు. మన మనసు చేసే అద్భుతం సంతోషం. దాన్ని ఎప్పుడూ ఇతరులకు అందిస్తూపోవడం మనం పొందే సంతోషం. అప్పుడే మనం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాం.

    సంతోషం మనం సృష్టించే అద్భుతమే

    నీహారికా, ఎల్లవేళలా చెదరని చిరునవ్వుతో వుండాలంటే ఏం చేయాలి అన్నావు. సరిగ్గా చెప్పాలంటే నవ్వు అనేది కేవలం ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ మాత్రమే.ఇది హృదయానికి కిటికీ లాంటిది.…

  • సోయా ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు ఖాయం చేశాక ఇందులో ఎన్నో వెరైటీలు మార్కెట్ లో వెలిశాయి. ఈ సోయాలో వుండే ఓ పోషక పదార్ధం గుండెకు ఎంతో మేలు చేస్తుందని నిపుణుల తాజా పరిశోధనల్లో తేలింది. ఇందులోని ఐసో ఫ్లెవోనిన్లు అనే పోషకాలు గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీన్ని ఆహారంలో భాగంగా తీసుకొంటే ఇందులో ఈక్వల్ అనే పదార్ధం ఉత్పత్తి అవుతుంది. దీని కారణం గానే హృద్రోగ సమస్యలు రావు. ఈ పదార్ధం కారణంగానే రక్తనాళాల్లో కాల్షియo పేరుకోదని గుర్తించారు. జపాన్, చైనాల్లో వాడే సోయా ఉత్పత్తులలో ఈ ఐసో ఫ్లెవోనిన్ల శాతం మిగిలిన దేశాల్లో కంటే ఎక్కువనీ అందుకే వాళ్ళకు గుండె జబ్బులు తక్కువనీ పరిశోధనల్లో తేలింది. అంతేగాక ఈ పోషక పదార్ధం వల్ల మతిమరుపు, ఆస్టియోపోరోసిస్, రొమ్ము ప్రోస్టేట్ కాన్సర్ రాకుండా ఉంటాయట. కాబట్టి ప్రతిరోజు తినే ఆహారంలో సోయా, సోయా ఉత్పత్తులు, కొంచెం మోతాదులో అయినా భాగంగా చేసుకోండి అని చెప్తున్నారు డాక్టర్లు.

    సోయా వల్ల గుండెకు మేలు

    సోయా ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు ఖాయం చేశాక ఇందులో ఎన్నో వెరైటీలు మార్కెట్ లో వెలిశాయి. ఈ సోయాలో వుండే ఓ పోషక పదార్ధం గుండెకు ఎంతో…

  • ఇంటి ముందు పువ్వుల తోట బాగుంటుంది. అదే కూరగాయాల్ని పువ్వులుగా పండిస్తే........... ఇలాంటివే క్యాబేజి పువ్వులు. అర్నమెంటల్ క్యాబేజిలుగా పిలిచే ఇవి తోట ఒక ప్రత్యేకమైన అందం. క్యాబేజిని తెలుపు, ఆకుపచ్చ, వంగపండు, గోధుమ, ఎన్ని రకాల వర్ణాలు వుంటాయి. క్యాబేజి మొక్కలో చుట్టూ ఆకులుండి మధ్యలో బంతి పువ్వు విచ్చుకున్నట్లు కనిపిస్తుంది. అలా విచ్చుకునే రేఖలో మనం నాటిన రకాన్ని బట్టి వివిధ రంగుల్లో వస్తాయి. విచ్చుకున్నాక వరం రోజుల పాటు చెక్కగా ఉంటాయి. తోటలో వరుసలో నాటితే వాటి చుట్టూ ఆకుపచ్చని ఆకుల మొక్కలుంటే తోట ఆకర్షనియంగా వుంటుంది. కొన్ని ముద్దుగా బంతి పువ్వులో కొన్నింటి కోణలు వంకర టింకరగా చూసేందుకు చెక్కగా వున్నాయి అర్నమెంటల్ క్యాబేజిలు.

    ఇవి నిజంగా క్యాబేజి పువ్వులు

    ఇంటి ముందు పువ్వుల తోట బాగుంటుంది. అదే కూరగాయాల్ని పువ్వులుగా పండిస్తే……….. ఇలాంటివే క్యాబేజి పువ్వులు. అర్నమెంటల్ క్యాబేజిలుగా పిలిచే ఇవి తోట ఒక ప్రత్యేకమైన అందం.…

  • బిడ్డ కోసం తల్లి పాడే లాలి పాట పైన మియామి యూనివర్సిటీ పరిశోధనలు చేసారు. ఈ పాట వల్ల ఎన్నో లాభాలున్నాయట. పసి పిల్లలకు పది రకాల గొంతులతో పాటలు, మాటలు వినిపించారట. అందులో తల్లి పాడే పాటకే బిడ్డ మెదడు స్పందించిందట. ఆ పాట వింటున్న పసి బిడ్డలో ఆ సమయం లో మెదడు చురుకుగా ఉంటుందిట. అలంటి లాలిపాట తల్లి లో కూడా ఆరోగ్యం అంటున్నారు. బిడ్డను తీరికగా లాలిస్తూ తన చేతుల్లోకి ప్రేమగా తీసుకుని తన స్పర్స ని బిడ్డ శరీరానికి తాకిస్తూ పాట పాడుతుంటే తల్లికి స్వాంతన రావడం గుర్తించారు పరిశోధకులు. అలాగే బిడ్డ చాలా బద్రంగా ఫీల్ అవుతూ తల్లి గొంతును, స్పర్శ ద్వారా దొరికే బాధ్రతను అందుకుంటూ, తల్లిని హత్తుకుని నిశబ్ధంగా పాట వినడం ఆ పాటని ప్రేమకు పరవసులై నిద్రపోవడం గమనించారు. తల్లి గొంతులో మాధుర్యం వుందా, ఆమె అద్భుతంగా పడుతుందా అన్న ప్రేస్నే లేదు. తల్లి గొంతు లోంచి వచ్చే ఆ అలవాటైన గొంతు పలికే పాటకి పిల్లలు స్పందిస్తారంతే.

    లాలీ పాట తల్లి బిడ్డలకు ఆరోగ్యం

    బిడ్డ కోసం తల్లి పాడే లాలి పాట పైన మియామి యూనివర్సిటీ పరిశోధనలు చేసారు. ఈ పాట వల్ల ఎన్నో లాభాలున్నాయట. పసి పిల్లలకు పది రకాల…

  • లక్షల విలువైన అందమైన నగలను ఆమె తాయారు చేస్తుంది. ఆమె తాయారు చేసిన నగలకు బ్రిటన్ లోనే కాదు దేశ విదేశాల్లో మంచి డైమెండ్ వుంది. చాలా మంది డిజైనర్లు వుండగా అన్నెట్టి గబేడే గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఆమె చేతులకు వెళ్ళే లేవు.ఈ వైకల్యం ఆమె లోని సృజనకు అడ్డకట్ట వేయలేక పోయింది. వెడ్డింగ్ రింగ్స్, ఎంగేజ్మెంట్ రింగ్స్. సిల్వర్, గోల్డ్, డైమెండ్స్, ఎమరాల్డ్స్ వంటి ఎంతో ఖరీదైన స్టోన్స్ ఉపయోగించి ఆమె అద్భుత సృష్టి చేస్తుంది. నెక్లెస్ లు, ఇయర్ రింగ్స్, బ్రేస్ లెట్స్, బాంగిల్స్, బ్రూచ్ లు, కఫ్ లింక్స్ ఆమె ప్రత్యేకతే అనొచ్చు. చేతులకు వెళ్ళు లేకుండా ఇవన్నీ ఎలా సాధ్యం అంటే, పట్టుదలతో ఇలా వున్నాను కనుక నాకిది లోపం అనిపించదు. వేళ్ళు లేకపోయినా నాపనులు చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత డిజైనర్ గా నగల్ని తాయారు చేయడం నాకు కష్టం అనిపించ లేదు అంటుంది అన్నెట్టి.

    ఈ అద్భుత సృజన ఎలా సాధ్యం

    లక్షల విలువైన అందమైన నగలను ఆమె తాయారు చేస్తుంది. ఆమె తాయారు చేసిన నగలకు బ్రిటన్ లోనే కాదు దేశ విదేశాల్లో మంచి డైమెండ్ వుంది. చాలా…

  • ద్రాక్ష పండు మీద తెల్లని పూత చూసి అదేదో క్రిమి సంహారక మందు అనుకోవద్దు. ఇది సహజమైంది. దిన్ని బ్లూమ్ అంటారు. పండ్లలోని తేమ పాడవకుండా ఫంగస్ చేరకుండా ఈ బ్లూమ్ తోర్పడుతుంది. ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యం కోసం ద్రాక్ష ఎంతో మేలు. రోజు అందరిలో ద్రాక్ష తింటే చర్మం నిగారింపు తో ఎప్పటికి వృద్దాప్య ఛాయల్ని రానీయకుండా అడ్డుకుంటుందని సౌందర్య నిప్పునులు చెప్పారు. ద్రాక్ష గుజ్జు మొహం పైన రాస్తే, 20 నిమిషాల పాటు దాన్ని మర్దన చేస్తే ముడతలు, నల్లమచ్చలు తగ్గుతాయి. ద్రాక్ష గింజల నూనె అద్భుతమైన మాయిస్చురైజర్. పచ్చ ద్రాక్ష జీవక్రియను మెరుగు పరచి చర్మాన్ని కాంతివంతంగా వంచేందుకు సయం చేస్తుంది. రంగు ఎంత ఘాడంగా వుంటే అంత మంచివి, తెలుపు, లేతాకు పచ్చ ద్రక్షలో కెటబిన్స్ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇది మంచి ఆరోగ్య ఔషద ఫలం. పడుకునే ముందు ద్రాక్ష రసం తాగితే పగలంతా పడిన ఒత్తిడి పోయి హాయి గా నిద్రపడుతుంది.

    ఇది ఆరోగ్య సౌందర్య ఫలం

    ద్రాక్ష పండు మీద తెల్లని పూత చూసి అదేదో క్రిమి సంహారక మందు అనుకోవద్దు. ఇది సహజమైంది. దిన్ని బ్లూమ్ అంటారు. పండ్లలోని తేమ పాడవకుండా ఫంగస్…

  • బ్యూటీ విషయం లో యూత్ ఎప్పుడు రాజి పాడారు. చివరికి హెయిర్ కట్టింగ్ విషయం లోను కొత్త ట్రెండ్ వుండాల్సిందే. బాబ్ కటింగ్ నచ్చాలే కానీ స్టైల్ , సౌకర్యం, అందం, అన్ని దక్కుతాయి. లాంగ్ గా అయితే పొడవ్వైన కురులని కట్ చేసి అలా దువ్వి వదిలేయడం ఇవాల్టి ట్రెండ్. లాంగ్ అంటే లగ్జరి కొంచం వంపు తిప్పి ఎలాగైనా వదిలేసే వీలుంది. పొడవాటి జుట్టు ఫేవ్ కట్ స్టైల్ స్టేట్మెంట్. అలాగే ప్రింజెన్ చెక్కగా ఒత్తుగా బోల్డ్ గా కనిపించే కట్. నుదుటి పైన షార్ట్ గా కనిపిస్తూ ఈ రకం తక్షణ మేకప్ కు అనువైన స్టైల్. ఇక షార్ట్ అయితే చిట్టి పొట్టి కట్ వెరైటీ గా అందంగా వుంటుంది. ఈ స్కర్ట్స్ షార్ట్ కట్ చెక్కని రూపాన్ని ఇస్తుంది. మిడికట్ అయితే పొడవుగా పెంచుకోకుండా ఒత్తుగా వంకీలు తిప్పి మెడ చుట్టు పరుచుకునే వీలున్న మిడి కట్ చటుక్కున కళ్ళల్లో పడే అందాల కట్ ఇది. లేయర్స్ అయితే పొడవైన జుట్టు పొరలు పొరలుగా పరుచుకుంటే ముచ్చటగా ముంగురులు కురులు వుంటాయి. ఈ కటింగ్ కు లేయర్లు జత చేస్తే సిరోజాలంకరణకు తిరుగే లేదు.బ్యూటీ విషయం లో యూత్ ఎప్పుడు రాజి పాడారు. చివరికి హెయిర్ కట్టింగ్ విషయం లోను కొత్త ట్రెండ్ వుండాల్సిందే. బాబ్ కటింగ్ నచ్చాలే కానీ స్టైల్ , సౌకర్యం, అందం, అన్ని దక్కుతాయి. లాంగ్ గా అయితే పొడవ్వైన కురులని కట్ చేసి అలా దువ్వి వదిలేయడం ఇవాల్టి ట్రెండ్. లాంగ్ అంటే లగ్జరి కొంచం వంపు తిప్పి ఎలాగైనా వదిలేసే వీలుంది. పొడవాటి జుట్టు ఫేవ్ కట్ స్టైల్ స్టేట్మెంట్. అలాగే ప్రింజెన్ చెక్కగా ఒత్తుగా బోల్డ్ గా కనిపించే కట్. నుదుటి పైన షార్ట్ గా కనిపిస్తూ ఈ రకం తక్షణ మేకప్ కు అనువైన స్టైల్. ఇక షార్ట్ అయితే చిట్టి పొట్టి కట్ వెరైటీ గా అందంగా వుంటుంది. ఈ స్కర్ట్స్ షార్ట్ కట్ చెక్కని రూపాన్ని ఇస్తుంది. మిడికట్ అయితే పొడవుగా పెంచుకోకుండా ఒత్తుగా వంకీలు తిప్పి మెడ చుట్టు పరుచుకునే వీలున్న మిడి కట్ చటుక్కున కళ్ళల్లో పడే అందాల కట్ ఇది. లేయర్స్ అయితే పొడవైన జుట్టు పొరలు పొరలుగా పరుచుకుంటే ముచ్చటగా ముంగురులు కురులు వుంటాయి. ఈ కటింగ్ కు లేయర్లు జత చేస్తే సిరోజాలంకరణకు తిరుగే లేదు.

    రూపాన్ని మార్చేసే హెయిర్ కట్స్

    బ్యూటీ విషయం లో యూత్ ఎప్పుడు రాజి పాడారు. చివరికి హెయిర్ కట్టింగ్ విషయం లోను కొత్త ట్రెండ్ వుండాల్సిందే. బాబ్ కటింగ్ నచ్చాలే కానీ స్టైల్…

  • జీన్స్ ఎప్పుడు బాగుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు కాస్త సన్నగా వుండే జీన్స్ కంటే బెస్ట్ డ్రెస్ ఇంకొకటి లేదు. స్కిన్ని జీన్స్ బాగుంటాయి. బ్రైట్ కలర్స్ ఏవైనా సరే. అయితే నలుపు, డార్క్ ఇండిగో వేసుకుంటే కళ్ళు మరీ సన్నగా కనిపిస్తాయి. లైటర్ టోన్స్ చెక్కగా నప్పుతాయి. మోకాళ్ళ వద్ద ఫేడెడ్ గా, కాళ్ళ దగ్గర క్లావర్ గా వుండే జీన్స్ రకాలు అదనపు కర్వలు ఇవ్వడం తో ట్రెండో ఎఫెక్ట్ ఇస్తాయి. ప్లాప్ పాకెట్స్ ఏమ్బలిష్మేంట్ వాల్యూం పెంచుతుంది. కాంట్రాస్ట్ బెల్త్స్ నాజూకు హిప్స్ ను చూపెడతాయి. జీన్స్ పాప్యులర్ ఫ్యశిఒన్ ఐటెం, స్లిమ్ స్ట్రెయిట్ బూట్ కట్, యాంటి ఫిట్ బోలెడన్ని రకాలున్నాయి. ఈ అమెరికన్ కల్చర్ మన దగ్గరకు వచ్చేసి , పూర్తిగా క్యాజువల్ వేర్ అయ్యీ కూర్చుంది. జీన్స్ అన్ని రంగులు వుంటే వాటి పైన టీ షర్ట్స్ దగ్గర నుంచి అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ గా వేసుకో వచ్చు.

    జీన్స్ కి తిరుగే లేదు

    జీన్స్ ఎప్పుడు బాగుంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు కాస్త సన్నగా వుండే జీన్స్ కంటే బెస్ట్ డ్రెస్ ఇంకొకటి లేదు. స్కిన్ని  జీన్స్ బాగుంటాయి. బ్రైట్ కలర్స్ ఏవైనా…

  • ఏ మందులకు జలుబు తగ్గదు. అది ఏ వాతావరణ ప్రభావంతో ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు. కానీ జలుబుకు విటమిన్-డి అన్ని మందుల కన్నా బాగా పని చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జలుబు సాధారణ సమస్యగా పైకి కనపడుతుంది. కొన్ని సందర్భాలలో ప్రనంతకంగా మారే అవకాసం వుంది. జలుబు నుంచి విముక్తి కి విటమిన్-డి వాడండి అంటున్నారు. క్వీన్ యూనివర్సిటీ పరిశోధకులు 14 దేశాలల్లో 11 వేల మంది పైన ఈ పరిశోధన జరిగింది. తీవ్రమైన జలుబు తో బాధ పడే వారికి క్రమం తప్పకుండా విటమిన్-డి సప్లిమెంట్స్ ఇచ్చారు. క్రమేపి జలుబు తగ్గిపోతుంది. కొంతసేపు ఎండలో తిరిగితే విటమిన్-డి అందుతుంది అంటారు. కానీ దాని వల్ల లాభం లేదని విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పుతున్నారు. సో జలుబు వస్తే ఈ విటమిన్ గురించి గుర్తు చేసుకోవాలి.

    జలుబుకు విటమిన్-డి

    ఏ మందులకు జలుబు తగ్గదు. అది ఏ వాతావరణ ప్రభావంతో ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు. కానీ జలుబుకు విటమిన్-డి అన్ని మందుల కన్నా బాగా…

  • టీన్ ఏజ్ పిల్లలకు నెలసరి ఎప్పుడూ సమస్యే. సానిటరీ ప్యాక్స్ ఎన్నో కంపెనీలవి వుంటాయి. ఏవి మేలైనవి అంటూ వుండవు. నెలసరి ఋతుస్రావం పిల్చేయడానికి వుద్దేసించినవే కనుక ప్రత్యేకమైన బ్రాండు బాగుంటుంది అని చెప్పడం కష్టం. ఏది సౌకర్యంగా వుంటుంది అని, ఎవరికి వాళ్ళు కొన్ని రకాలు వాడి తలిసుకోవాలి. ఏ సానిటరీ ప్యాక్ మంచిదో, వాళ్ళ పీరియడ్ తీరు తెన్నులు బట్టి వుంటుంది. ఋతుస్రావం కొందరికి భారీగా కొందరికి తేలికగా వుంటుంది. కొందరికి తక్కువ రోజులు కొందరికి వరం రోజులు సాగుతుంది. ప్యాడ్ ఎలాంటిది అన్నది ఈ విషయం పై ఆధారపది వుంటుంది. భారీగా రుతుస్రావానికి, తక్కువకు, రాత్రులు ఇబ్బంది లేకుండా రకరాకలున్నాయి. కొన్నింటికి వింగ్స్ వుంటాయి. తక్కువ బ్లిడింగ్ కు వీలైన మినీ పాడ్స్ వుంటాయి. ఇవి తరచూ మార్చాలి అవసరాన్ని సౌకర్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.

    బ్రాండ్ కంటే సౌకర్యం బట్టి ఎంచుకోవడం బెస్ట్

    టీన్ ఏజ్ పిల్లలకు నెలసరి ఎప్పుడూ సమస్యే. సానిటరీ ప్యాక్స్  ఎన్నో కంపెనీలవి వుంటాయి. ఏవి మేలైనవి అంటూ వుండవు. నెలసరి ఋతుస్రావం పిల్చేయడానికి వుద్దేసించినవే కనుక…

  • నీహారికా, మహిళా దినోత్సవం రోజున నాకేం చెప్తావు. ఏదో కొత్తదై వుండాలి. నీ జీవితం గుర్తు పెట్టుకొనేదై వుండాలి అన్నావు. సరే విను, ఇవాల్టి ఆధునిక మహిళ మూడు ప్రపంచాల పౌరురాలు. గడప దాటేదాక భర్త, ఇల్లు, పిల్లలు దాటాకా ఆఫీస్ కెరీర్ పోటీ ఇన్ని పాత్రలకు ఎంతో కష్టంతో న్యాయం చేస్తోంది. ఎక్కడ తేడా వచ్చినా అది వైఫల్యమే. ఇన్ని బాధ్యతల మధ్య చిరునవ్వుతో తనకు తాను నిరూపించుకోవాలంటే ముందస్తుగా ఆరోగ్యంగా ఉండాలి. అoదుకే వేళకు సరిగ్గా తినమని చెప్పాలనిపిస్తుంది. శరీరానికి వ్యాయామం, కంటినిండా నిద్ర, మెదడుకు విశ్రాంతి కావాలి.నువ్వు ప్రపంచం గెలవలే కానీ కెరీర్ మహిళవు కావచ్చు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళని తపించే మామూలు అమ్మవీ కావచ్చు. ఏం సాధించాలన్నా ఆరోగ్యంగా వుండాలి. ఆర్ధరైటీస్ తో నీ ఉద్యోగమూ చేయలేవు, నీరసంతో సేవలూ చేయలేవు, అనారోగ్యంతో ఏ సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించలేవు. పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే గ్రామాల్లో స్త్రీలు 80 శాతం రక్తహీనతతో వున్నారు. సగంమంది భారతీయ మహిళలకు ఎయిడ్స్ అంటేనే తెలియదు. లక్ష ప్రసవాలకు ఐదు వందల మరణాలున్నాయి. ఏటా లక్ష రొమ్ము కాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. సగానికి సగం మహిళలకు హైపర్ టెన్షన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఈ లెక్కలకు సమాధానం చెప్పమ్మా. పురుషాధిక్య సమాజానికి సమాంతరంగా స్త్రీల ప్రాధాన్యతా క్రమాలు మారాయి. నిజమే నువ్వెంతో సాధించాలి. ఇంకా సాధిస్తావు కనుక నీ ఆరోగ్యం గురించి కాస్త ప్రాధాన్యం ఇచ్చుకో. నీ స్వభావం మార్చుకో. సున్నితం గానే ఉండు. కానీ ఆరోగ్యంగా ఉండు. తమ ఆకలి పట్టించుకోని, ఆరోగ్యం పట్టించుకోని, ఎప్పుడూ కుటుంబ శ్రేయస్సే ఆలోచించే మహిళా లోకం అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. నీహారికా ఇది నువ్వు గుర్తుంచుకోదగిన కానుకే అనుకొంటాను.

    ఆరోగ్యo జాగ్రత్తమ్మా – నిన్ను నువ్వయినా పట్టించుకో

    నీహారికా, మహిళా దినోత్సవం రోజున నాకేం చెప్తావు. ఏదో కొత్తదై వుండాలి. నీ జీవితం గుర్తు పెట్టుకొనేదై వుండాలి అన్నావు. సరే విను, ఇవాల్టి ఆధునిక మహిళ…

  • 2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు, భారత దేశపు బయోటిక్ రంగంలో తిరుగు లేని ప్రతిభ చూపించారు. కిరణ్ మంజుదాస్ షా, ఫోబ్స్ ప్రకటించిన 2016 జాబితా లో ఈమె పేరు శక్తి వంతమైన మహిళల జాబితాలో వుంది. బయోకాన్ స్థాపించి నాదిపిస్తున్నారు కిరణ్ మంజు దాస్. డయాబెటిక్ రోగాలుని ప్రణాలు కాపాడే ఇన్సులిన్ ని తాయారు చేసే అతి పెద్ద కంపనీ అమెది. బయోకాన్ పరిశోధన విభాగం నుంచి 950 పేటెంట్స్ కి వెళ్ళారంటే ఆ పరిశ్రమ ఎంత గొప్ప స్థానం లో వుందో తేలింది. దేశ ఆరోగ్యం పెంపొందించడంలో తన వంతు కర్తవ్యం నిర్వహించిన కిరణ్ స్ఫూర్తి నిచ్చే మహిళల్లో ముందుంటారు.

    దేశ ఆరోగ్యం కోసం బయోకాన్

    2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు, భారత దేశపు బయోటిక్ రంగంలో తిరుగు…

  • ట్రాక్టర్స్ రాణి అంటారు మల్లికా శ్రీనివాసన్ ను . సాంప్రదాయ తమిళ కుటుంబంలో పుట్టిన మల్లికా టాఫే పరిశ్రమ చైర్ పర్సన్ గా , సిఇఓ గా వ్యవరహిస్తూ దాన్ని లాభాల బాట లో నడిపిస్తున్నారు. అమెరికాలోని విజిసిఓ సంస్థ బోర్డులో ఆమె సభ్యురాలు. టాటాస్టీల్ , టాటా గ్లోబల్ బెవరేజస్ లో మల్లికా డైరెక్టర్. అమెరికాలో బిజినెస్ స్కూల్ లో ఎం.బి.ఏ చేసిన మల్లిక పర్యవేక్షణ లో టుఫే అంటే ట్రాక్టర్ అండ్ ఫర్మా ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఇప్పుడు లక్షకు పైగా ట్రాక్టర్లు తయారు చేస్తుంది. పద్మశ్రీ అవార్డు గ్రహిత. ఫస్ట్ బిజినెస్ విమెన్ అవార్డుని బిబిసి నుంచి అందుకొన్న ఆమె 2016 ప్రపంచ ప్రభావిత మహిళ అయ్యారు. ఆమె అందుకొని అవార్డులు లేవు. సామాజిక సేవలో భాగంగా శంకర్ నేత్రలయం మద్రాస్ కాన్సర్ ఇన్ స్టిట్యుట్ కి అండగా నిలబడుతుంది.

    ట్రాక్టర్స్ రాణి మల్లికా

    ట్రాక్టర్స్ రాణి  అంటారు  మల్లికా  శ్రీనివాసన్ ను . సాంప్రదాయ  తమిళ  కుటుంబంలో  పుట్టిన  మల్లికా టాఫే పరిశ్రమ చైర్ పర్సన్ గా  , సిఇఓ గా…

  • ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసే వంద మందిలో ఒక్కరుగా సునీతా నారాయణన్ పేరుని టైమ్స్ పత్రిక గుర్తించింది. స్వచ్చంధ సేవా సంస్థ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ల ను నడిపిస్తున్న పర్యావరణ వేత్త సునీతా నారాయణన్. బహుళ జాతి సంస్థలు ఉత్పత్తి చేసే సాఫ్ట్ డ్రింక్స్ లో విషపూరిత పదార్ధాలు వున్నాయి అని లేబరేటరీ రిపోర్ట్స్ ద్వారా నిరూపించి కొక్, పెప్సీ, కోలా కంపెనీలకు హడలెత్తించారు సునీత. పండ్లు ముగ్గపెట్టడం లో వాడుతున్న రసాయినాలు నిషేదపు ఉత్పత్తులు ప్రభుత్వం ఇబ్బందన్నా, ఢిల్లీ విధుల్లో డిజిటల్ ఆటో లో వాహనాలు పోయి సి.ఎన్.జి వాడకం వచ్చిందన్న నీడలా దాని వెనక వున్నది సునీత జల కాలుష్యం వచ్చిందన్న, వాయు కాలుష్యం , కాలుష్య కారణాలు డాక్యుమెంటేషన్ చేస్తారు సునీత. పద్మశ్రీ అవార్డు తో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థల అవార్డులు, ఎన్నో గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు సునీత.

    పర్యావరణ పరిరక్షణ లక్ష్యం.

    ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసే వంద మందిలో ఒక్కరుగా సునీతా నారియన్ పేరుని టైమ్స్ పత్రిక గుర్తించింది. స్వచ్చంధ సేవా సంస్థ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్…

  • హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానికి ప్రోచాన్సులర్ కూడా వున్నారామే. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్. ఎండెవర్ ఇండియాకి ఆమె ప్రస్తుత చైర్మన్. ఆమె తండ్రి కె.కె బిర్లా తాత జి.జి బిర్లా, శక్తి వంతమైన వ్యాపార కుటుంబంలో పుట్టిన శోభన పత్రికా రంగంలో అతి చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏనాడో ఆమెను గ్లోబల్ లీడర్ ఆఫ్ టుమారో గా కీర్తించింది. ఔట్ స్టాండింగ్ బిజినెస్ విమెన్ అవార్డు, కార్పోరేటే ఎక్స్ లెన్స్ అవార్డు, జర్నలిజం రంగంలో పద్మశ్రీ , ఆమెను వరించాయి. మింట్ పత్రిక, ఫీవర్ 104, ఎఫ్ ఎమ్ రేడియో ఛానల్ ఆమె రూపం పోసినవే మీడియా రంగం లో తిరుగు లేని మహిళ శోభనా భార్తియా.

    మీడియాలో తిరుగులేని శోభనా

    హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్టాత్మక…

  • ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ గా ఆపైన ఏడేళ్ళ పాటు సిస్కో కి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేసారు. ‘నెక్ట్స్ఇవి’ అనే చైనా కు చెందిన ఎలక్ట్రికల్ కార్ల కంపనీకి అమెరికా విభాగంలో సి.ఇ.ఓ గా పద్మశ్రీ బాధ్యతలు తీసుకున్నారు. ఐ.టి రంగంలో తిరుగులేని రాణిగా పేరు పొందిన పద్మశ్రీ భూగోళం పైన మొబైల్ ఫోన్ గురించి ఆలోచించిన అత్యున్నత సంకేతిక నిపుణురాలు పద్మశ్రీ ఒకరని ఆమె కితాబులు అందుకున్నారు. స్వయం బోదిత వాహనాల రూప కల్పన, ఎలక్ట్రిక్ కారు రూపకల్పనలో ఆమె పోషించిన పాత్రకు ఫోబ్స్ మేగజైన్ ఆమెకు ఆమెకు క్వీన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్ బిజ్ అని పేర్కొన్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే మహిళల జాబితాలో పద్మశ్రీ ఒక్కరు.

    ఐటీ లో తిరుగు లేని పద్మశ్రీవారియర్

    ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ…