• అతి చిన్న సందేహం కలిగినా, ఏదైనా ప్రత్యేక మైన వంటకం చేయాలన్నా సౌందర్య పోషణకైనా అంతర్జాలంలోకి తొంగి చూడటం ఈ రోజుల్లో అందరికీ సహజమైన ఆలవాటై పోయింది. ఇది మంచిదే కానీ రోజులో ఎంతో సమయం ఈ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఖర్చు పెట్టడం కూడా డబ్బు వృధా చేసినట్లే. కాలక్షేపం కోసం కావొచ్చునెట్ ని గంటల కొద్దీ ఉపయోగించడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ప్రయోజనం పొందుతాం సరే, ఖర్చు పెట్టే సమయం మాటేమిటి? ఆఫీస్ పని గంటలు అవ్వటం ఆలస్యం. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ కంప్యుటర్కు అతుక్కుపోతుంటారు. దీని వల్ల కుటుంబ సంబందాలు దెబ్బతింటాయి. వత్తిడి పెరుగుతుంది అందుకే వీలైనంత సమయం సంకేతికతకు చోటివ్వకపోవడం మంచిది. ఖచ్చితమైన సమయం, ఓ గంటో, రెండు గంటలో అంతే. ముఖ్యంగా పడక గదికి ఈ స్మార్ట్ ఫోన్ లు తీసుకు వెళ్ళక పోవడమే క్షేమం. అలసిన మెదడుకి విశ్రాంతి ఇవ్వాలి.

    దీనికీ కొంత పరిమితి వుండాలి

    అతి చిన్న సందేహం కలిగినా, ఏదైనా ప్రత్యేక మైన వంటకం చేయాలన్నా సౌందర్య పోషణకైనా అంతర్జాలంలోకి తొంగి చూడటం ఈ రోజుల్లో అందరికీ సహజమైన ఆలవాటై పోయింది.…

  • వేసవి ఎండలు మాడ్చేస్తుంటే శరీరం చల్లదనంతో ఉండాలని కోరుకొంటుంది. వీలైతే వస్త్ర ధారణలో పువ్వులకు ప్రాధాన్యత ఇచ్చి చూడండి అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. పులరంగు టాప్ లు, పైజామాలు, పలజోలు ఏవైనా సరే చెక్కని పూల ప్రింట్ల టాప్లు వేసుకుని అడుగున వదులుగా ఎలాంటి డిజైన్లు లేకుండా సాదా ప్యాంట్లో స్కర్టులు వేసుకోవచ్చు. లేదా పూల ప్రింట్ల కుర్తీలకు చెక్కని జీన్స్ జత చేస్తే చాలు, ఈ వేసవిలో ట్రెండో లుక్ వచ్చేస్తుంది. చక్కని పూల స్కార్ఫులు, దుపట్టా వుంటే అటు టాప్ ల పైకి, ఇటు కుర్తిలకు సరిపోతాయి. లేదా మేడలో వేసుకునే హారాలు, హెయిర్ క్లిప్స్, బ్యాగులు, బ్రేస్ లెట్స్, టోపీలు, చెప్పులు పూల డిజైన్ లో ఎంపిక చేసుకుని చూడండి. ఏదైనా పార్టీలుంటే పూల ప్రింట్ల మాక్సీలు, గౌన్లు, పూల ప్రింట్ తో వున్న జార్జట్ చీరలు కట్టుకున్నా సరే. ఆన్ లైన్ సమ్మర్ ఫ్యాషన్ లుక్ సొంతమవుతుంది. అసలా ఫీలింగ్ తప్పకుండా వస్తుంది.

    పువ్వుల ప్రింట్లు వేసవి ఫ్యాషన్

    వేసవి ఎండలు మాడ్చేస్తుంటే శరీరం చల్లదనంతో ఉండాలని కోరుకొంటుంది. వీలైతే వస్త్ర ధారణలో పువ్వులకు ప్రాధాన్యత ఇచ్చి చూడండి అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. పులరంగు టాప్ లు,…

  • సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 11 ఏళ్ళు పూర్తయ్యాయి, ఇప్పటి వరకు నటన పైన తప్ప ఇతర క్రాప్ట్ పైన ద్రుష్టి పెట్టలేదు. నటనంటే ఇష్టం నన్ను చుస్తే నికార్తెసన భారతీయ వనితా వుంటాను, మనకున్న చరిత్ర సంస్కృతి విలువలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు నేను భారతీయురాలినని చెప్పుకొందికే నేను గర్వ పడతా నంటోంది నటీమని విద్యాబాలన్. నిజ జీవితంలో కూడా బలమైన వ్యక్తిత్వం గల మహిలనే ఇష్టపడతాను. అడ్డంకులు అధిగమించి సవాళ్ళను ఎదుర్కొని పోరాడే మహిళలను చుస్తే స్ఫూర్తి కలుగుతుంది. సామాజిక నియమాలను తిరగరాసే వారి కధలు సినిమాలుగా తీయాల్సిన అవసరం వుంది అంటుందామె. త్వరలో బేగం జాన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది విద్య. 1947 లో భారత దేశ విభజన సమయంలో పంజాబ్ లో బ్రోతల్ నరిసిన ఓ మహిళ పాత్ర బేగంజావ్.

    భరతీయురాలిని కావడమే నాకు గర్వం

    సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 11 ఏళ్ళు పూర్తయ్యాయి, ఇప్పటి వరకు నటన పైన తప్ప ఇతర క్రాప్ట్ పైన ద్రుష్టి పెట్టలేదు. నటనంటే ఇష్టం నన్ను…

  • ఉదయం నుంచి ఎడ తెరగని పనులు, ఇల్లు, ఆఫీస్, పిల్లలు, వంట పని వేయి చేతులతో పని చేసిన తరగని అంతు లేని శ్రమ, ఈ ఒత్తిడితో బి.పీ హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది. ఇలాంటి సమస్య వేధిస్తుంటే చెర్రి పండ్ల జ్యూస్ తీసుకుంటే మంచిదని చెపుతున్నారు పోషక నిపుణులు. ఈ స్టడీలో భాగంగా బిపీ, టెన్షన్లతో బాధ పడుతున్న వారికి 60 మిల్లీ లీటర్ల చెర్రీ జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ తీసుకున్న తర్వాత బిపి తో ఉత్సాహం స్పష్టంగా నమోదైనదని పరిశోధకులు చెప్పుతున్నారు. జ్యూస్ తీసుకున్న మూడు గంటల తర్వాత కూడా బి.పి కంట్రోల్ లో ఉన్నట్లు ఈ పరిశోధన రుజువు చేసింది. అధిక రక్త పోటు, గుండెకు సంబందించిన రుగ్మతకు కారణం అవుతుంది. అందువల్ల టెన్షన్ తగ్గించు కునే సాధనాల్లో ఈ చెర్రీ జ్యూస్ చేర్చుకోమని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

    టెన్షనా? చెర్రీ జ్యూస్ తాగి చూడండి

    ఉదయం నుంచి ఎడ తెరగని పనులు, ఇల్లు, ఆఫీస్, పిల్లలు, వంట పని వేయి చేతులతో పని చేసిన తరగని అంతు లేని శ్రమ, ఈ ఒత్తిడితో…

  • చర్మం ఎండకి కమిలిపోవడం మొటిమలు రావడం ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలు చందన గంధంతో ఈ సమస్యను అదుపులో ఉండ వచ్చు.చందనంలో కాస్త గులాబీ నీరు కలిపి ముఖానికి పూతలా వేసుకుంటే ముఖానికి చల్లదనం అందుతుంది. నలుపు కూడా తగ్గుతుంది. పొడి, జిడ్డు చర్మ తత్వం వుంటే పెరుగు, చందనం పొడి కలిపి ముఖానికి పూతలా వేస్తె ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. జిడ్డు, పొడి చర్మం తేమగా, తేటగా కనిపిస్తుంది. ముల్తానీ మట్టి, అరటి పండు గుజ్జు, చందనం కలిపిన ఫేస్ ప్యాక్ ఎంతో మేలైనది. సహజ సిద్దమైన ఫేస్ ప్యాక్. దీని వల్ల మొటిమలు రాకుండా వుంటుంది. ఎండకు కమిలిన చర్మం పూర్వపు రంగును పొందుతుంది. చమట కాయలు ఇబ్బంది పెట్టినా చందనపు పుతే మంచి మందు.

    మేలు చేసే చందన గంధం

    చర్మం ఎండకి కమిలిపోవడం మొటిమలు రావడం ఈ కాలంలో ఎదురయ్యే సమస్యలు చందన గంధంతో ఈ సమస్యను అదుపులో ఉండ వచ్చు.చందనంలో కాస్త గులాబీ నీరు కలిపి…

  • అవనూనె రొజువారీ వాడకంలోకి ఎక్కువగా తీసుకోరు కానీ ఈ నూనెలో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ నూనెల్లో మోనో సాచ్యురేటెడ్ పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అధికంగా వున్నాయి. ఇవి రెండు చెడు కొలెస్ట్రోల్ శాతం తగ్గించి మేలు చేసే కోలెస్ట్రోల్ స్థాయిని పెంచుతాయి. ఈ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్ల విటమిన్-ఇ లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి ఎన్నో రకాల నొప్పుల్ని సమస్యల్ని తగ్గిస్తాయి. అవనూనెతో చేసిన పదార్ధాలు తక్కువ మోతాదులో తీసుకున్న త్వరగా పొట్ట నిండుతుంది. ఇందులో యాంటీ బాక్టిరియల్ గుణాలుంటాయి. జీర్ణ వ్యవస్థని శుభ్రం చేసి ఆ పని తీరు మెరుగు పరుస్తాయి. వారానికో సారైనా ఈ అవనూనెను కూరల్లో వాడిటే దాని వల్ల కలిగే ప్రయోజనాలు పొంద వచ్చు.

    అప్పుడప్పుడూ అవనూనె వాడాలి

    అవనూనె రొజువారీ వాడకంలోకి ఎక్కువగా తీసుకోరు కానీ ఈ నూనెలో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ నూనెల్లో మోనో సాచ్యురేటెడ్ పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అధికంగా వున్నాయి.…

  • లండన్ లోని యుద్ద విద్యల శిక్షణా కేంద్రంలో ఇప్పుడు శృతి హసన్ కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటుంది. 150 కోట్ల వ్యయం తో సుందర్ సి తెరకెక్కించనున్న త్రిభాషా చిత్రం సంఘ మిత్రలో శృతి యువరాణి పాత్రలో నటించింది. ఇందులో భాగంగా వీర వనితలా కనిపించేందుకు శ్రుతి కృషి చేస్తుంది. శారీరక కసరత్తులతో పాటు ఫోకస్ పెరగడానికి మైండ్ మ్యాపింగ్ విధానంలోనూ తీసుకుంటుంది. అమాయకపు ఆడపిల్లగా నటించిన, అల్ట్రామోడ్రన్ గా నటించిన ఆ పాత్రలో ఒదిగిపోయే శ్రుతి ఇప్పుడు సేరవేగంగా కత్తి తిప్పే పాత్ర కోసం సిద్దం అవుతుంది.

    కత్తి తిప్పుతున్న శ్రుతి

    లండన్ లోని యుద్ద విద్యల శిక్షణా కేంద్రంలో ఇప్పుడు శృతి హసన్ కత్తి యుద్ధంలో శిక్షణ తీసుకుంటుంది. 150 కోట్ల వ్యయం తో సుందర్ సి తెరకెక్కించనున్న…

  • నీహారికా, ఇతరులని ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉండాలా? మన మనస్సులో ఎలా అనుకుంటున్నామో అలా ఉండకుడదా? అన్నారు. అవసరం లేదనిపిస్తుంది, ప్రతి సారి ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేస్తూ పొతే మన వ్యక్తి గత ఆస్థిత్వం మాయం అయిపోతుంది. అనవసరమైన సోషల్ మాస్కులతో వస్తావికతాను పోగొట్టుకోకుదడదు. వున్నది ఉన్నట్లు మాట్లాడాలి. యదార్ధమైన వారైనా సరే,లేదా గొప్పవాడికైనా ఎంతటి వాళ్ళయినా అనవసర హంగామాతో ఇంప్రెస్ చేస్తూ పోవడం సరైన దృక్పదం కానేకాదు. సరైన క్లారిటీతో, చక్కని కంమునికేషన్ తో పరస్పర గౌరవాలతో ఉన్నప్పుడే ఒఅరి పట్ల ఒకరికి మంచి ఇంప్రెషన్ వుంటుంది. ఇలాంటి దృక్పదం వల్లనే మంచి ఫలితాలు ఉంటాయి. ఎదుటి మనిషిని పొగడ్తలతోనే ఆకట్టుకోవాలి, వాళ్ళపట్ల మనకుండే సాఫ్ట్ కార్నర్ ను కేవలం ఇంప్రెస్ చేసే తెలియజేయాలి అనుకోవడం సరైన ఆలోచన కనే కాదు.

    పరస్పర గౌరవంతో ఉంటేనే మంచి అనుభందం

    నీహారికా, ఇతరులని ఎప్పుడూ ఇంప్రెస్ చేస్తూనే ఉండాలా? మన మనస్సులో ఎలా అనుకుంటున్నామో అలా ఉండకుడదా? అన్నారు. అవసరం లేదనిపిస్తుంది, ప్రతి సారి ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్…

  • చదువు, ఉద్యోగం కోసం ఎండ వేళ అయినా సరే బయటికి వెళ్ళాల్సిందే సాధారణంగా అమ్మాయిలకు వచ్చే సమస్య ఎండపడే చర్మం రంగు కాస్త నల్లగా సూర్యకాంతి పాడనీ చోట ఫెయిర్ గా వుంటుంది కనుక సూర్యుడికి ఎక్స్ పోజ్ అయ్యే చోట చర్మం మాములుగా వుండటం ఎలా అవి. మన శరీరంలోని అతి పెద్ద భాగం చర్మం. దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనదే సూర్య కాంతికి ఎక్స్ పోజ్ అయ్యే చర్మానికి షియా బట్టర్, అలోవీర , గ్లోజరిన్ వుండే మంచి మాయిశ్చురైజర్ రాసుకోవాలి ముఖం, మెడ, వీపు పైభాగం మోచేతుల నుంచి వేళ్ళ వరకు 50 spf వుండే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ రాసుకోవాలి. గ్లైకోలిక్ యాసిడ్ ఆరుశాతం అర్బ్యుతిన్, కోజిక్ యాసిడ్ వున్న క్రిములు రాసుకోవాలి. అలాగే ఈ సూర్యకాంతి తాకి వచ్చే పిగ్మెంటేషన్ కు కూడా 50spf కంటే ఎక్కువగా వుండే సన్ స్క్రీన్ లోషన్స్ రాయాలి. అన్నింటికంటే ముందు ఆకు కూరలు, కూరగాయలు, తాజా పండ్లు, ఎక్కువ ప్రోటిన్లు వుండే ఆహారం తీసుకుంటే, ఎక్కువగా నీళ్ళు తాగుతూ వ్యాయామం చేస్తూ కంటి నిండా నిద్ర పోతూ వుండాలి. సమస్య ఎక్కువగా వుంటే దేర్మతాలజిస్ట్ ను సంప్రదించాలి. సొంత వైధ్యాలు నష్టం కలిగిస్తాయి.

    చర్మ సంరక్షణ మన చేతుల్లోనే వుంది

    చదువు, ఉద్యోగం కోసం ఎండ వేళ అయినా సరే బయటికి వెళ్ళాల్సిందే సాధారణంగా అమ్మాయిలకు వచ్చే సమస్య ఎండపడే చర్మం రంగు కాస్త  నల్లగా సూర్యకాంతి పాడనీ…

  • సమ్మర్ లో బెస్ట్ ఫిట్నెస్ అడ్వయిజ్ అడిగితె వెంటనే స్విమ్మింగ్ అనే చెప్పుతారు ఎక్స్ పోర్ట్స్. మండిపోతున్న ఈ తరుణంలో మనకు తెలియకుండానే శరీరం అలసిపోతుంది. అలాంటప్పుడు వేసవిలో ప్రతి ఉదయం స్విమ్మింగ్ చేస్తే చాలు. ఒంట్లో పేరుకున్న కొవ్వు కరిగి మెరుగైన ఫిట్నెస్ సొంతమవుతుంది అంటున్నారు. గుండె జబ్బులున్నా, మధుమేహ వ్యాధి గ్రస్తులైనా, రెగ్యులర్ గా స్విమ్మింగ్ చేస్తే మంచిది. స్విమ్మింగ్ తో శరీరంలోని ప్రతి కండరము కరుగుతుంది. దానితో కండరాళ్ళు బలంగా తయ్యారవ్వుతాయి. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. ప్రధాన శరీర భాగాలన్నీ సామాన్మాయం అవ్వడం ద్వారా అందమైన శరీరాకృతి లభిస్తుంది. ఈదే ముందర ఏమీ తినక పోవడమే మంచిది. ఏదైనా తింటే అరగంట తర్వాతే ఈత కొట్టాలి. స్విమ్ తర్వాత ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అనారోగ్యకారకంగా భారీ వ్యాయామాలు చేయలేక పొతే వారికి ఈతకు మించిన వ్యాయామం లేదు. పిల్లలకు పెద్దలకు ఇది తగిన వ్యాయామమే.

    అందమైన శరీరాకృతి కోసం ఈ వ్యయామం

    సమ్మర్ లో బెస్ట్ ఫిట్నెస్ అడ్వయిజ్ అడిగితె వెంటనే స్విమ్మింగ్ అనే చెప్పుతారు ఎక్స్ పోర్ట్స్. మండిపోతున్న ఈ తరుణంలో మనకు తెలియకుండానే శరీరం అలసిపోతుంది. అలాంటప్పుడు…

  • ఒక్క డిపార్ట్ మెంట్ లో కొన్ని వందల మంది ఉద్యోగులు పని చేస్తూ వుంటారు. కానీ కొందరికే వారి నిబద్దత, కర్తవ్య నిర్వహణలో వాళ్ళు చూపించే శ్రద్ధ వల్ల పేరు మార్మోగుతుంది. ఇప్పుడీమె పేరు అలాగే నలుగురికీ ఆదర్శం రేఖామిశ్రా వుండేది ముంబాయిలో రైల్వే ప్రోటెక్షన్ ఫోర్సులో సబ్ ఇన్స్ పెక్టర్. ఇల్లు విడిచి వచ్చిన, తప్పిపోయిన పిల్లల పాలిట ఈమె దేవత. గత ఏడాది ఈమె 434 మంది పిల్లల్ని రక్షించారు. 2014లో రేఖా మిశ్రా విధుల్లో చేరారు. అలహాబాద్ కు చెందిన ఆర్మీ కుటుంబం నుంచి వచ్చారు రేఖా. ముంబాయి అంటే రంగుల లోకం సినిమాలకు కేరాఫ్. అడుగడునా తోడేళ్ళ వంటి మన్యుషులు. ఏ సినిమా పిచ్చి తోనో,పరీక్ష తప్పో , ఇల్లు వదలి వచ్చేసిన పిల్లల పాలిట ఈమె కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. మూడేళ్ళ సర్వీస్ లో డ్యుటీలో వున్నా లేకపోయినా పిల్లల్ని బాధ్యతగా తీసుకుంటుంది రేఖామిశ్రా వృద్దులకు, పిల్లలకు చేయూతనివ్వాలన్నదే ఆమె కోరిక.

    తప్పి పోయిన పిల్లల పాలిట దేవత ఈమె

    ఒక్క డిపార్ట్ మెంట్ లో కొన్ని వందల మంది ఉద్యోగులు పని చేస్తూ వుంటారు. కానీ కొందరికే వారి నిబద్దత, కర్తవ్య నిర్వహణలో వాళ్ళు చూపించే శ్రద్ధ…

  • మనుష్యుల పేదరికమే చాలా చిన్న వయస్సు లోనే వాళ్ళ మరణానికి దారి తీస్తోందని ఒక అధ్యాయినం చెప్పుతుంది. పేదరికంలో వున్న వారి ఆయువు ప్రమాణం 24 సంవత్సరాలు పడిపోతుందని చెప్పుతున్నారు యు.కె, ఫ్రాన్స్, స్విట్జర్ ల్యాండ్, పోర్చుగీస్, ఇటలీ, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని 17 లక్షల మందిపై లండన్ ఇంపేరియల్ కాలేజీ శస్త్ర వేత్తలు ఒక సర్వే నిర్వహించారు. ధూమపానం చేసే వారు, శారీరక శ్రమ పెద్దగ చేయని వాళ్ళు ఇలాంటి అనారోగ్యాల పలవ్వుతారు అటువంటి ప్రభావమే సామాజికంగా ఆర్ధికంగా వెనుకబడిన వారిలోనూ కనిపిస్తుందని శాస్త్రవేత్తల చెప్పుతున్నారు. పేదరికం , చదువు లేకపోవడం, సరైన ఉపాధి, పౌష్టికమైన ఆహారం ఎమీ లేకపోవడం అన్ని ఆరోగ్యాలకీ, మరణాలకు సంబంధం ఉండదని అధ్యాయినంలో తేలింది. ధనికులతో పోలిస్తే సామాజికంగా ఆర్ధికంగా చదువులో వెనకబడినవారు 46 శాతం ముందుగా మరనిస్తున్నట్లు వెల్లడైంది. అనేక రకాలైన అనారోగ్యాలకు కారణం పేదరికమే.

    ఈ కారణంతోనే అల్పాయుద్దాయం

    మనుష్యుల పేదరికమే చాలా చిన్న వయస్సు లోనే వాళ్ళ మరణానికి దారి తీస్తోందని ఒక అధ్యాయినం చెప్పుతుంది. పేదరికంలో వున్న వారి ఆయువు ప్రమాణం 24 సంవత్సరాలు…

  • బేబీ ఆయిల్ వురికే పిల్లల కోసం అని వదిలేస్తాం కానీ ఆ తేలికైన, పసి బిడ్డ చర్మం కోసం సున్నితమైన మర్దనా కోసం ఉపయోగ పడే బేబీ ఆయిల్ మన చర్మనికే చాలా మంచిది. కాలం ఏదైనా చర్మం తేమగా ఉండాలంటే స్నానం చేయగానే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే ఈ ఆయిల్ రాసుకోవాలి. అలంకరణ తొలిగించు కొనేందుకు బేబీ ఆయిల్ శ్రేయస్కరం. చేతులు, కాళ్ళపై అవాంచిత రోమాలు తొలగించాక మంట పెట్టకుండా చర్మం బారకగా అయిపోకుండా బేబీ ఆయిల్ వాడాలి. కళ్ళ చుట్టూ నల్లని వలయాల కోసం, పగిలే పెదవులకోసం ఈ ఆయిల్ వాడకం మంచిది. జుట్టు ఎండిపోయి జుట్టు కుదుళ్ళు బలహీనమై వెంట్రుకలు రాలిపోతున్నాయి అనిపిస్తే బేబీ ఆయిల్ పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచిది. గోళ్ళు పగినట్లుగా ఈ బేబీ ఆయిల్ లో ముంచి చిన్నగా మర్దనా చేస్తే ఎంతో మంచిది. ఈ తెలికైన నూనె చేసే మేలు అంతా ఇంతా కాదు.

    అస్సలు బేబీ ఆయిల్ వాడి చూడండి

    బేబీ ఆయిల్ వురికే పిల్లల కోసం అని వదిలేస్తాం కానీ ఆ తేలికైన, పసి బిడ్డ చర్మం కోసం సున్నితమైన మర్దనా కోసం ఉపయోగ పడే బేబీ…

  • పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా పెద్దగా పశాకల విలువలు మారని కూరల్లో మొట్ట మొదటిగా చెప్పుకోవలసింది పాలకూర. ఇందులో చాలా పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్, లుటిన్, విటమిన్-కె, ఫోలెట్ ఇంకా ఎన్నో లవణాలు పుష్కలంగా దొరుకుతాయి. పీచు ఎక్కువే ఉడికిస్తే కెరోటినాయిడ్స్ కొంత తగ్గుతుంది. మిగతా పోషకాలు, విటమిన్లు తేడాలేవు. అయితే ఒకే ఒక్క నిమిషం పలకూరని ఉడకనిచ్చి అందులో నీళ్ళను పరబోయాలి. అలా చేస్తే నీటి లోని అక్సాలిక్ యాసిడ్ బయటకి పోతుంది. శరీరానికి కాల్షియం అందకుండా చేసేది ఇది. దాన్ని బయటకి పంపించాక ఇక ఆకు కురలోని కాల్షియం పూర్తి స్థాయిలో శరీరానికి పడుతుంది. అప్పుడిక ఎలా ఇష్టం అయితే అలా తినొచ్చు. ఇన్ఫెక్షన్లు రానీయదు, మలబద్దకం నియంత్రిస్తుంది, రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. జీవక్రియలు సాఫీగా జరిగేందుకు ఉపయోగ పడే ఈ పలకూర ఆహారంలో తప్పని సరిగా చేర్చాలి.

    ఎలా తిన్నా పోషకాల విలువలు పోవు

    పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా పెద్దగా పశాకల విలువలు మారని కూరల్లో మొట్ట మొదటిగా చెప్పుకోవలసింది పాలకూర. ఇందులో చాలా పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్, లుటిన్, విటమిన్-కె,…

  • నాలుగు మొక్కలుంటే చుట్టూ పచ్చదనం వుంటే ఎంతో బావుంటుంది. అలా కుండీల్లో మొక్కలు పెంచుకునే సౌకర్యం లేకపోతె ఏకంగా గోడలకే మొక్కలు అతికించి పెంచే అవకాశం వచ్చింది. మట్టి లేని చోట అపార్ట్ మెంట్స్ లో మొక్కలు పెంచాలంటే అదీ బాల్కనీ పిట్ట గోడలకు మొత్తం ఇంటి చుట్టూరా పచ్చదనం ఉండాలనుకుంటే వర్టికల్ గార్డెన్ మంచి ఆప్షన్. ఇంట్లో కార్బన్ డయాక్సడ్ తొలగించి స్వచ్చమైన ఆక్సిజన్ అందించటానికి గ్రీన్ వాల్ ఉపయోగ పడుతుంది. ఈ వర్టికల్ గార్డెన్స్ కోసం మట్టి అవసరం లేదు. షీట్ లో కొబ్బరి పొడి నింపుతారు. ఇందులోనే మొక్కలు పెరుగుతాయి. మొక్కలకు కావాల్సిన ఎరువును కాయర్ పిచ్ లో కలుపుతారు. మట్టి అంటే కాయిర్ పిట్ లోనే మొక్కలు ఏపుగా బలంగా పెరుగుతాయి. ఇంట్లో చల్లదనం వుంటుంది. నగరం మొత్తంగా నిండి ఉన్న కాలుష్యం నుంచి బయటపాడేందుకు ఈ మొక్కలే ఆధారం. గ్రీన్ వాల్ కు డ్రాప్ ఇరిగేషన్ పద్దతిలో నీటి సరఫరా చేసుకోవచ్చు. కాబట్టి నీటి వృధా వుండదు.

    గోడ మొక్కలు పెంచితే చల్లదనం

    నాలుగు మొక్కలుంటే చుట్టూ పచ్చదనం వుంటే ఎంతో బావుంటుంది. అలా కుండీల్లో మొక్కలు పెంచుకునే సౌకర్యం లేకపోతె ఏకంగా గోడలకే మొక్కలు అతికించి పెంచే అవకాశం వచ్చింది.…

  • వేసవిలో ఎక్కువగా వచ్చే పాళ్ళల్లో తియ్యని కర్భూజా పండ్లు కూడా తింటే ఎన్నో విధాలా శరీరానికి మేలు చేకూర్చేవే. నీటి శాతం ఎక్కువ కాబట్టి చల్లగా హాయిగా వుంటుంది. పండ్లలో వుండే పొటాషియం హైపర్ టెన్షన్ ను దూరంగా ఉంచుతుంది. విటమిన్-ఎ, బీటా కెరోటిన్ ద్రుష్టిని మెరుగు పరచి శుక్లాలు రానివ్వదు. కర్భూజాలోని చక్కెరను శరీరం చాలా ఈజీగా జీర్ణం చేసుకుంటుంది. దానిలో వుండే ప్రత్యేకమైన పీచు వల్ల బరువు తగ్గే అవకాశము వుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు సిద్ధంగా ఉంటాయి. దీని లోని విటమిన్-సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల కణాల సంఖ్య పెంచే వ్యాధికారక బాక్టిరియా వైరస్ ల నుంచి రక్షణ కల్పిస్తుంది. కండరాళ్ళు, నరాలు రిలాక్స్ అయి మంచి నిద్ర పడుతుంది. నెలసరి నొప్పులు తగ్గుతాయి.

    బెస్ట్ సమ్మర్ ఫ్రూట్ కర్భూజా

    వేసవిలో ఎక్కువగా వచ్చే పాళ్ళల్లో తియ్యని కర్భూజా పండ్లు కూడా తింటే ఎన్నో విధాలా శరీరానికి మేలు చేకూర్చేవే. నీటి శాతం ఎక్కువ కాబట్టి చల్లగా హాయిగా…

  • సీజన్ తో టైమ్ తో సంబంధం లేకుండా పల్లీలు ఎప్పుడైనా తిన బుద్దేసే స్నాక్ లాంటివి. కానీ పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదనే వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుందనే అనుమానాలు చాలా మందికి వుంటుంది. ఇవి కేవలం అపోహేనని ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్నారు పరిశోధనలు. మధ్యాహ్నం భోజనంలో పాటు కొన్నిపల్లీలు నేరుగా కానీ షేక్ రూపంలో గానీ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా వుందని పరిశోధనల్లో వెల్లడైంది. పల్లిలు తింటే ట్రైగ్లిజరైడ్స్ తగ్గిన విషయం తెలిసిందట మాములుగా భోజనం అనంతరం రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో వీటి స్థాయి పెరిగితే గుండె సంబందిత అనారోగ్యాలు వస్తాయట. ఈ పల్లిల వల్ల ఈ సమస్య ఉండదని, హాయిగా వస్తాయిట. ఈ పల్లిల వల్ల ఈ సమస్య ఉండదని, హాయిగా పూటకో గుప్పెడు తినండి అంటున్నారు పరిశోధకులు.

    పల్లీలు తింటే గుండెకి సమస్యే రాదు

    సీజన్ తో టైమ్ తో సంబంధం లేకుండా పల్లీలు ఎప్పుడైనా తిన బుద్దేసే స్నాక్ లాంటివి. కానీ పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదనే వాటిని తీసుకుంటే కొవ్వు…

  • నీహారికా, నా స్నేహితులు నా చుట్టూ ఉన్నప్పుడే నేను భద్రంగా, సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నావు, చాలా కరెక్ట్. స్నేహితులు లేకుండా మనసుని పంచుకోనేవాళ్ళు లేకుండా జీవితం సమగ్రంగా ఉండదు. మన బాధలు, సంతోషాలు వాళ్ళతో పంచుకొంటేనే మనం పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తాం. అందుకే ఎంత పని ఒత్తిడి వున్నా గంటో, అరగంటో వాళ్ళ కోసం కేటాయించి తీరాలి. స్నేహితులు చెప్పేది శ్రద్ధగా వినాలి. మొత్తం మనమే మాట్లాడాలని కూడా అనుకోకూడదు. వాళ్ళ మాటలకీ ప్రాధన్యం ఇవ్వాలి. మరి స్నేహితులను కోరుకుంటే వాళ్లకు ప్రత్యేకత ఇవ్వాల్సిందే కదా. అలాగే ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకునేందుకు ముందుండాలి. వాళ్ళకు వచ్చిన కష్టం ఏదో తెలుసుకుని ధైర్యం చెప్పాలి. వాళ్ళా ఆపదలోంచి బయటకు వచ్చేదాకా ఫోన్ లో టచ్ లో ఉండాలి. మనతో అయ్యే ఎలాంటి సాయం అయినా చేయాలి. ఒక్కోసారి ఫ్రెండ్స్ కు నచ్చింది మనకు నచ్చకపోవచ్చు, వెంటనే నాకు నచ్చలేదు అనక్కర్లేదు. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకు విలువిస్తేనే స్నేహం నిలబడేది. అలాగే కొన్ని పొరపాట్లు జరగచ్చు.అప్పుడూ ఆ పొరపాటు గురించి చక్కగా మాట్లాడుకొని, చర్చించుకొని పరిష్కరించుకోవాలే గానీ స్నేహాలు పోగొట్టుకోకూడదు.

    చెప్పడం కాదు కాసేపు వినాలి కూడా

    నీహారికా, నా స్నేహితులు నా చుట్టూ ఉన్నప్పుడే నేను భద్రంగా, సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నావు, చాలా కరెక్ట్. స్నేహితులు లేకుండా మనసుని పంచుకోనేవాళ్ళు లేకుండా జీవితం…

  • ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ చందా కొచ్చార్, తన కుమార్తె ఆర్తి కొచ్చర్ కు రాసిన లేఖ ఇప్పుడో సంచలనం సుధామీనన్ రాసిన లెగసీ లెటర్స్ ఫ్రొం ఎమినెంట్ పేరెంట్స్ టు దెయిర్ డాటర్స్ అన్న పుస్తకంలో ఈ లేఖ అచ్చయిది 13వ ఏటనే తండ్రిని పోగొట్టుకొన్న చందా కొబ్బరి తన తల్లి ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఈదడం నేర్చుకున్నారు. ఈ ఉత్తరంలో కొబ్బరి తన కూతురు ఆర్తికి కేవలం వర్కింగ్ ఉమెన్ గా వుంటే సరిపోదు కుటుంబ బాధ్యతల్ని కూడా నిర్లక్ష్యం చేయొద్దని చెపుతారు. 'నీ కుటుంబానికి ఏం కావలో మవు సమకూరుస్తు పొతే నీకేం కావాలో నీ కుటుంబం సమకూరుస్తు వస్తారంటారు. "నేను నాకెరీర్ లో తలమునకలుగా వున్నా. మీ నాన్న నా పైన చిన్ని ఫిర్యాదు కూడా లేకుండా చేశానన్నారు. నువ్వు కుడా నాలాగే జీవితంలో అన్ని క్లిష్టమైన సమయాల్లోనూ జీవిత భాగస్వామి తో సర్వమైన బంధాల్ని కొనసాగించాలి అంటే వృత్తిని కుటుంబాన్ని సమర్ధంగా నడిపిస్తానని నమ్ముతున్నానన్నారు. మన జీవితాలను నిలబెట్టడంలో కఠోర శ్రమ పాత్ర కీలకం, మనం నిర్ణయించుకునే దారిని మనమే ఏర్పరుచుకోవాలి. జీవితం మనపదీ ఇవ్వదు. మనం కష్ట పది నిర్మించుకున్నదే అన్నారామె. ఒక తెలివైన సమర్దురాలైన తల్లి రాసే లేఖ ఇంకోలావుండే అవకాశమే లేదు. ఈ లేఖ ఇవ్వాల్టి అమ్మాయిల కోసమే కదా.

    కుటుంబానికి నువ్వేదిస్తే అదే దొరుకుతుంది

    ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ చందా కొచ్చార్, తన కుమార్తె ఆర్తి కొచ్చర్ కు రాసిన లేఖ ఇప్పుడో సంచలనం సుధామీనన్ రాసిన లెగసీ లెటర్స్ ఫ్రొం ఎమినెంట్…

  • అంత ఎండకి ఈ మాత్రం జాగ్రత్త కావాలి

    మండే ఎండల్లో చర్మ సంరక్షణ చాలా అత్యవసరం ఇందుకు గానూ కొంత ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకోవాలి. ఎంత తొందర పని వున్నా. ముందుగా సన్ స్క్రీన్…