• రోజంతా కొన్ని అత్యవసరాలు పాటిస్తే ఏ వయసులో అయినా అందంగా ఉంటారని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు క్లీన్సింగ్ మిల్క్ లేదా బేబీ ఆయిల్ ఉపయోగించి మురికి మేకప్ లను తొలగించుకోవాలి. ముఖం పైన పడే మచ్చలు ఫ్యాబీ గా మారటం పిగ్మెంటేషన్ వంటివి ప్రభావవంతంగా తొలగించుకోవటానికి విటమిన్ A ,C,E లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ క్రీమ్స్ వాడాలి. నిస్సారంగా మారటం ,నల్లబడటం, సూర్యరశ్మికి ఫోకస్ వాటం వంటివి నిరంతరం సన్ స్క్రీన్ తో అధిగమించవచ్చు. శిరోజాల తీరుకు సరిపోయే షాంపూను ఎంచుకుని కనీసం వారానికి మూడు సార్లైనా తలా స్నానం చేయాలి. మీరు హెయిర్ ఆయిల్ కండిషనర్లు వాడటం వల్ల జుట్టుకు చిక్కులు పడకుండా ఉంటుంది. ఊడే జుట్టు డెడ్ హెయిర్ గా గమనించుకోవాలి. వ్యాయామంతో శరీరాన్ని ఫిట్ నెస్ గా వుంచుకుంటేనే శరీరానికి చర్మానికి గ్లో వస్తుంది. ఇక హీల్తీ డైట్ టోన్ కాంతివంతమైన చర్మం శిరోజాలు సొంతమవుతాయి.

    ఏ వయసులోనైనా అందంగా……. !

    రోజంతా కొన్ని అత్యవసరాలు పాటిస్తే ఏ వయసులో అయినా అందంగా ఉంటారని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. ప్రతిరోజూ పడుకునే ముందు క్లీన్సింగ్ మిల్క్ లేదా బేబీ ఆయిల్…

  • ఈ మధ్య కాలంలో అమెరికాకు నెయ్యి ఎగుమతులు ఎక్కువై పోయిందిట. మనం నెయ్యి అన్నం ,ఉప్పు ,గుడ్లు , చివరకు నీళ్ళు కూడా తగ్గించేసాము. పళ్ళ బిగువున నోరు కట్టేసుకుంటున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. అంటున్నారు నిపుణులు. నెయ్యి తగిన పాళ్ళలో వాడుకుంటే నష్టం లేదు. క్రీడా కారులు చురుగ్గా ఉండేందుకు శక్తి సోమ నెయ్యి ఉపయోగిస్తున్నారు. ఇందులోని మీడియం చెయిన్ ఫ్యాటీ ఆమ్లాలకు ఇతర కొవ్వులను కరిగించే శక్తి వుంది. అలాగే మనం కూరల్లో వేసుకునే ఉప్పు కన్నా ఇన్స్టెంట్ సూప్ లు, సొయా సాస్ , ఊరగాయల్లో వుండే ఉప్పే ఎక్కువ. అలాగే అన్నం మాంసాహారం కలిపి తినటం వల్ల కండర పుష్టికి కావలిసిన సంపూర్ణ పోషకాలు అందుతాయి. మధుమేహం ఉన్నవాళ్లు తప్పించి అన్నం నెయ్యి ఉప్పు మితంగా తినచ్చు. ముఖ్యంగా నెయ్యిలో బ్యుటైరిక్ యాసిడ్ వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. యాంటీ వైరల్ గుణాలు అధికం కూడా. నెయ్యిని మరీ తీసిపారేయకండి.

    నెయ్యి వాడకం మంచిదే

    ఈ మధ్య కాలంలో అమెరికాకు నెయ్యి ఎగుమతులు ఎక్కువై పోయిందిట. మనం నెయ్యి అన్నం ,ఉప్పు ,గుడ్లు , చివరకు నీళ్ళు  కూడా తగ్గించేసాము. పళ్ళ బిగువున…

  • కొన్ని మంచి పనులకు అన్నీ కలిసొస్తాయి. వివాహిత స్త్రీలు ముసుగు ధరించి సంప్రదాయం వుంది. అయితే మీర్జాపూర్ గ్రామానికి చెందినా అంజూ యాదవ్ ఈ సంప్రదాయం ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తున్నాయని ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని స్వానుభవం తో తెలుసుకుంది. ముసుగు ధరించనని పెద్దవాళ్ళ అనుమతి కోసం ఇంట్లోనే మూడేళ్లు పోరాడాల్సి వచ్చింది. ఆమె చెల్లి మంజూ యాదవ్ కూడా అక్కతో చేయి కలిపింది. వీళ్లకు పొరుగు గ్రామ సర్పంచ్ సజ్మా ఖాన్ తోడైంది. ధీజ్ గ్రామా సర్పంచ్ గా ఈ ముసుగు ఆమెకి ప్రాబ్లమే. ఈ ముగ్గురు కలిసి డిప్యుటీ కమిషనర్ ని కలిశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ముసుగుకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టి అవగాహనా కార్యక్రమాలు చేపట్టి దాదాపు 116 గ్రామాల మహిళలను చైతన్యవంతం చేసారు. ఈ మీర్జాపూర్ యువతులు ముసుగు పద్ధతికి శాశ్వతంగా చెక్ పెట్టేసారు.

    ముసుగుకు వ్యతిరేకంగా పోరాటం

    కొన్ని మంచి పనులకు అన్నీ కలిసొస్తాయి. వివాహిత స్త్రీలు ముసుగు ధరించి సంప్రదాయం వుంది. అయితే మీర్జాపూర్ గ్రామానికి చెందినా అంజూ యాదవ్ ఈ సంప్రదాయం  ఉద్యోగ…

  • జీవితంలో ఎప్పుడూ సంతోషాలే వుండవు. ఎన్నో సవాళ్లు అనుభవాలు అనుభూతుల సంగమం జీవితం. సినీ నటి త్రిష ఈ మధ్య కాలంలో హండ్రెడ్ హ్యాపీ డేస్ ఛాలెంజ్ తీసుకుందిట. ఈ ఛాలెంజ్ కు వప్పుకునే వంద రోజుల పాటు ఎలాంటి విషయానికీ బాధ పడకుండా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి. ప్రతి ఒక్కరితో సంతోషాన్ని ఆత్మ విశ్వాసాన్ని సానుకూల దృక్పధాన్ని పెంచే దృష్టితో హండ్రెడ్ హ్యాపీ డేస్ సంస్థ ఈ పోటీ ని నిర్వహిస్తోంది. అందరితో ప్రేమగా ఉత్సాహంగా ఉండాలని తీర్మానించుకుని ఈ ఛాలెంజ్ తీసుకున్నా అన్నారు త్రిష. గతంలో ఈమె నో మేకప్ ఛాలెంజ్ తీసుకుని చాలా రోజులపాటు మేకప్ లేకుండానే బయట కార్యక్రమాల్లో పాల్గొన్నారట. ఇలాంటి ఛాలెంజ్ లు వప్పుకుంటే జీవితంలో నిరాశ అన్న పదం కాస్త దూరం జరుగుతుందేమో !

    వంద రోజులు సంతోషంగా ఉంటా

    జీవితంలో ఎప్పుడూ సంతోషాలే  వుండవు. ఎన్నో సవాళ్లు అనుభవాలు అనుభూతుల సంగమం జీవితం. సినీ నటి త్రిష ఈ మధ్య కాలంలో హండ్రెడ్ హ్యాపీ డేస్ ఛాలెంజ్…

  • పిల్లల్ని సరదాగా ముద్దు పేర్లతో పిలుస్తాం. ఒక్కసారి ఆ ముద్దు పేర్లే అసలు పేర్లను డామినేట్ చేసి జీవితాంతం నిలబడిపోతాయి కూడా. మనందరికీ ఏవో ముద్దు పేర్లు వుండే ఉంటాయి.అలాగే మనం ఇష్టపడే సెలబ్రెటీస్ కూడా ముద్దు పేర్లున్నాయి. సమంతను ఏమాయచేసావే సిఎంమాలో నటించాక అందులో హీరోయిన్ పేరుతోనే జెస్సీ అని సామ్ అని పిలుస్తారట ఫ్రెండ్స్. హన్సిక కు తమిళ్ లో చిన్న ఖుష్భు అని పిలుస్తారు. అమలాపాల్ ని ఆమ్స్ ,ఆము , బ్రాట్ అని స్నేహితులంటారు. కాజల్ ని ఇంట్లో అందరూ కాజు అంటే త్రిష నయితే హానీ అంటారు. తమన్నా ని తమ్ము అనేస్తారు. ఇక అనుష్క అసలు పేరే స్వీటీ శెట్టి . తనను స్వీటీ అనే పిలుస్తారు. నయన తార ను కుటుంబ సభ్యులు మణీ అని స్నేహితులు నయన్ అని ఇలియానా ను ఇలూ అయింది. శ్రద్ధ దాస్ ని వాళ్ళ బామ్మ మాకడ్ అంటే కోతి ని ట్రిమ్ చేసి మాకూ అని పిలుస్తుందిట. సోనమ్ కపూర్ ని వాళ్ళ నాన్న జిరాఫీ అంటారట. ఐశ్వర్య రాయి ని ఇషూ , గోల్లు, ఐస్ అంటారట. కరీనా కపూర్ ని బెబో , ప్రియాంక చోప్రా ని మీమీ అంటారు. ఇంకెన్నో ఎందరో పేర్లు సరదాగా వినబడుతూనే ఉంటాయి.

    మీ ముద్దు పేరేమిటి

    పిల్లల్ని సరదాగా ముద్దు పేర్లతో పిలుస్తాం. ఒక్కసారి ఆ ముద్దు పేర్లే అసలు పేర్లను డామినేట్ చేసి జీవితాంతం నిలబడిపోతాయి కూడా. మనందరికీ ఏవో ముద్దు  పేర్లు…

  • అరటి ,సీతాఫలం, పనస ,సపోటా పై తోలు ఎలాగున్నా లోపల దాదాపు తెల్లగా గోధుమ రంగులతో ఉంటాయి కదా. కానీ ఇప్పుడు గజ్జి ప్రకాశవంతమైన రంగులో ఉంటే పోషకాలు పంట పండినట్లేనని లోపల మంచి రంగు ఉండే పండ్ల పెంపకం పై దృష్టిపెట్టారు రైతులు. మౌంటెన్ రోజ్ యాపిల్ కొరికి చుస్తే గులాబీ రంగులోనో ఎర్రగానో ఉంటుంది. క్యారెట్ ,బననా అయితే నారింజ రంగు గుజ్జు ఉంటుంది.ఇందులో బీటా కెరోటిన్లు వంద రెట్లు ఎక్కువ. అలాగే అనోనా రెటిక్యూ లేటా ,సీతా ఫలం మొత్తం పండు గుజ్జు రెండు ఎరుపే. మామే సపోటా లో కూడా ఎరుపు రంగు గుజ్జె.చెంబరాతి చెక్క లేదా చంద్ర హలసు పేరుతొ వుండే బ్లడ్ ఆరంజస్ ,ఆరెంజ్ గ్లో పేరుతో నారింజ పసుపు రంగుగల పుచ్చ ఇలా పండ్లే కాదు రకరకాల వాల్ నట్స్ కూడా రంగు మారిపోతున్నాయి. మరి రంగుల్లో పోషకాలుంటాయని డాక్టర్లు చెప్పేసారు కదా .

    పేర్లు సేమ్ రంగే రెడ్

    అరటి ,సీతాఫలం, పనస ,సపోటా పై తోలు ఎలాగున్నా లోపల దాదాపు తెల్లగా గోధుమ రంగులతో ఉంటాయి కదా. కానీ ఇప్పుడు గజ్జి ప్రకాశవంతమైన రంగులో ఉంటే…

  • ఎప్పుడూ ఆడవాళ్ళలో ఒక ఆందోళన ..... ఎవరేమనుకుంటారో ? అర్ధం చేసుకుంటారో లేదో ......... ఎలా నచ్చ జెప్పాలో ఏమో ? ఇవే ప్రశ్నలు. సమాధానం లేనివి. ఇలాంటి ఆందోళనలు ఉంటె ఒంటరిగా ప్రయాణాలు చేయండి. కొద్దీ రోజులే. పర్యటనలు మనకు ఆలోచించే సమయం ఇవ్వవు . రైలో ,బస్సో ,విమానమో, దాని టైం ప్రకారం మనం పట్టుకోవాలి. కొత్త చోట మన గురించి మనం బాధ్యత తీసుకోవాలి. అలాంటప్పుడే ధైర్యం వస్తుంది. మనం కొత్త ప్రదేశంలో ఎవ్వరికీ ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వక్కరలేదు. భయపడక్కర్లేదు. ఇలాగే ఒకటి రెండు ఒంటరి ప్రయాణాలు చేయండి. అసలు మనసులో వచ్చే అనేకానేక ఆందోళనలకు, సమస్యలకు, భయాలకు జవాబులు దొరుకుతాయి అంటునాన్రు నిపుణులు. ఒక కొత్త చోటు ,కొత్త మనుషులు, కొత్త నిర్మాణాలు ప్రపంచంలో అందమైన ప్రదేశాలు ,ఇష్టమైతే గుళ్ళు ,గోపురాలు ఏవైనా సరే వివిధ జీవనశైలులు భాషలు ఆ సమయంలో ఎదురయ్యే చిన్న ఇబ్బందులు మనల్ని దృఢంగా చేస్తాయి నిజం. ఆందోళనలు మాయం కావాలంటే స్థిరంగా ఆలోచించే ధైర్యం కావాలంటే ఒంటరి ప్రయాణాలు చేయండి.

    ఒంటరి ప్రయాణాలలో ఆందోళన మాయం

    ఎప్పుడూ  ఆడవాళ్ళలో ఒక ఆందోళన ….. ఎవరేమనుకుంటారో ? అర్ధం చేసుకుంటారో లేదో  ………  ఎలా నచ్చ జెప్పాలో ఏమో ? ఇవే ప్రశ్నలు. సమాధానం లేనివి.…

  • మేకప్ ట్రెండ్ మారిపోతూ వుంటుంది. ఫ్యాషన్ నిలకడగా నిలబడేది కాదు. ప్రతి నిమిషం ఒక కొత్త పోకడ ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యేకత నిలుపుకోవాలి అంటే కొత్తదనం కోసం పరుగులు తీస్తూనే ఉండాలి. అందుకు తగ్గట్లే దుస్తులు అలంకరణ వస్తువులు క్షణికో ఫ్యాషన్ ట్రెండ్ లో ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. డ్రెస్ కి మ్యాచయ్యే గోళ రంగు వేసుకోవాలి అనుకుంటారు అమ్మాయిలు. ఇప్పుడు ఆ మ్యాచింగ్ కలరే పెదవుల పైకి రావాలంటే ! ఇదిగో క్షణాల్లో దిగుమతి అయిపోయింది. మ్యాచింగ్ వెతుక్కునే పని లేకుండా ఒకే షేడ్ లో వుండే లిప్ స్టిక్ ,నెయిల్ పాలిష్ తయారు చేసారు కొన్ని సంస్థలు. ఇక అమ్మాయిలు సంతోషించరా ? డ్రెస్ కి యాక్సెసరీస్ మ్యాచింగ్ అలాగే లిప్ స్టిక్ కి నెయిల్ పాలిష్ కి మ్యాచింగ్. మొత్తంగా ఫుల్ మ్యాచింగ్!

    అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్

    మేకప్ ట్రెండ్ మారిపోతూ వుంటుంది. ఫ్యాషన్ నిలకడగా నిలబడేది కాదు. ప్రతి నిమిషం ఒక కొత్త పోకడ ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యేకత నిలుపుకోవాలి అంటే కొత్తదనం…

  • ఏదైనా రంగంలో తమదైన ముద్ర వేసిన వాళ్ళ పేర్లను నాసా కొత్తగా కనిపెట్టే గ్రహాలకు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ గౌరవం పొందిన వాళ్లలో ఇద్దరు భారతీయ యువతలున్నారు. పూణే కు చెందిన హంస పద్మనాభన్ పేరుతో పైన ఓ చిన్న గ్రహం పేరు హంస 21575. హంస అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో జరిగిన సైన్స్ ఫెయిర్ లో ఫిజిక్స్ లో అయస్కాంత శక్తికి సంబంధించిన కొన్ని అంశాల గురించి చెప్పిన విషయాలు అక్కడ మహా మహా శాస్త్ర వెతల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆ ప్రతిభ కు గుర్తింపుగా అంతరిక్షంలోని చిన్న గ్రహానికి ఆమె పేరు పెట్టారు. ఇక హీతల్ వైష్ణవ్ అనే అమ్మాయి రీసైకిల్ చేసేందుకు కూడా పనికిరాని కవర్లను ప్రయోగాలుచేసి కొన్ని రసాయనాలతో కలిపి మళ్ళీ ప్యాకింగ్ కు ఉపయోగపడేలా చేసింది. ఆమె పేరు ఫ్రేహం 25636 వైష్ణవ్.

    మన అమ్మాయిల పేర్లతో గ్రహాలు

    ఏదైనా రంగంలో తమదైన ముద్ర వేసిన వాళ్ళ పేర్లను నాసా కొత్తగా కనిపెట్టే గ్రహాలకు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆ గౌరవం పొందిన వాళ్లలో ఇద్దరు భారతీయ…

  • అన్ని విషయాల్లో స్వేచ్చ కావాలి అమ్మాయిలకు. అలాగే డ్రెస్ విషయంలో కూడా. స్టేట్ మెంట్స్ ఇలా ఉంచితే నిజంగానే రెక్కలోచ్చినట్టు ఆ రెక్కలతో హాయి గా విహరిస్తున్నట్లు కనిపించే బటర్ ఫ్లై స్లీవ్స్ టాప్ లు వచ్చాయి మార్కెట్లోకి. ఏ కుర్తినో కమీజ్ వేసుకుంటే వంటికి చెక్కగా వచ్చేయాలి అంటారీ అమ్మాయిలు లేదా మోడ్రన్ టాప్స్ లో వేస్తే వదులుగా ఈజీ గా వుండాలి అంటారు. అందుకే డిజైనర్లు ఈజీగా కనిపెట్టేసారు. స్లీవ్స్ టాప్స్ ని పొడవు చేతుల కుర్తిలు, అనార్కలి ఫ్యాషన్ తో విసిగిపోయిన అమ్మాయిలకు రెక్కల డిజైన్ తో పెద్ద ప్రింట్ల తో ఈ టాప్ లు తెగ నచ్చేస్తున్నాయిట.

    అచ్చం సీతాకోకచిలుకల్లాగే

    అన్ని విషయాల్లో స్వేచ్చ కావాలి అమ్మాయిలకు. అలాగే డ్రెస్ విషయంలో కూడా. స్టేట్ మెంట్స్ ఇలా ఉంచితే నిజంగానే రెక్కలోచ్చినట్టు ఆ రెక్కలతో హాయి గా విహరిస్తున్నట్లు…