• ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో, నిలబడితేనో ఫోటో అయిపోతుందా. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్లే అవసరం, సినిమా యాక్టర్ల్ ఫోటో షూట్ చుస్తే ఫోటోగ్రాఫి ఎంత క్రియేటివ్ గా ఉండాలో అర్ధం అవుతుంది. చైనా కు చెందిన మక్రిరుయి(Ma Qurai) అనే మహిళా ఫోటోగ్రాఫర్ పది లక్షల యెన్ లో ఖర్చు చేసి వాటర్ ఫొటో స్టూడియో ఏర్పాటు చేసింది. ఈ ఫోటోగ్రాఫీలో శిక్షణ తీసుకుని ప్రతి సంవత్సరం పోటీల్లో కూడా పాల్గొంటుంది క్విరుయి. అందంగా వెరైటీగా ఫోటోలు దిగాలని కస్టమర్లు వస్తే స్విమ్మింగ్ దుస్తులు ధరించి ప్రత్యేక పరికరాలు, కెమేరాల తో వాళ్ళని నీళ్ళల్లో స్టూడియోకు తీసుకుపోతుంది. నీటి లోపల ఆమె అద్భుతమైన ఫోటోలు తీయగలరు. ఆమె ప్రతిభను మెచ్చుకొంటు నెటిజన్లు మోస్ట్ బ్యూటిఫుల్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ గా ప్రేశంసలు కురిపిస్తున్నారు.ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో, నిలబడితేనో ఫోటో అయిపోతుందా. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్లే అవసరం, సినిమా యాక్టర్ల్ ఫోటో షూట్ చుస్తే ఫోటోగ్రాఫి ఎంత క్రియేటివ్ గా ఉండాలో అర్ధం అవుతుంది. చైనా కు చెందిన మక్రిరుయి(Ma Qurai) అనే మహిళా ఫోటోగ్రాఫర్ పది లక్షల యెన్ లో ఖర్చు చేసి వాటర్ ఫొటో స్టూడియో ఏర్పాటు చేసింది. ఈ ఫోటోగ్రాఫీలో శిక్షణ తీసుకుని ప్రతి సంవత్సరం పోటీల్లో కూడా పాల్గొంటుంది క్విరుయి. అందంగా వెరైటీగా ఫోటోలు దిగాలని కస్టమర్లు వస్తే స్విమ్మింగ్ దుస్తులు ధరించి ప్రత్యేక పరికరాలు, కెమేరాల తో వాళ్ళని నీళ్ళల్లో స్టూడియోకు తీసుకుపోతుంది. నీటి లోపల ఆమె అద్భుతమైన ఫోటోలు తీయగలరు. ఆమె ప్రతిభను మెచ్చుకొంటు నెటిజన్లు మోస్ట్ బ్యూటిఫుల్ అండర్ వాటర్ ఫోటోగ్రాఫర్ గా ప్రేశంసలు కురిపిస్తున్నారు.

    ఫోటో దిగాలంటే నీళ్ళలోకి వెళ్ళాలి

    ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో,…

  • శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట దగ్గర పలుచగా వుంటుంది. మాడు పైన జుట్టు అణిగినట్లుంటుంది. ఇలా వుంటే ఏ స్టైల్ కూడా సరిగ్గా నప్పదు. సాధారణంగా జుట్టును నుదుటి పై నుంచి వెనక్కి లాగినట్లు దువ్వుతాం కనుక స్ట్రెచ్ చేసే చోట పలుచ పడిపోతుంది. పైగా పాపిట తీస్తాం కనుక సమస్య మరింత ఎక్కువగా వుంటుంది. పాపిట పొడుగైన జుట్టు పలుచగా వున్న చోట ఆముదం అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రొజూ చేస్తే రెండు నెలల్లో ఫలితం కనిపిస్తుంది. చిన్న చిన్న వెంట్రుకలు పెరగడం మొదలవుతుంది. వారానికి ఒక్క సారి గోరు వెచ్చని కొబ్బరి నూనె మాడంతా అప్లై చేసి మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్ళకు అదనపు లూబ్రికేషన్, పోషకాలు లభిస్తున్నాయి. జుట్టును ముడి వేసుకుంటే కుదుళ్ళను కిందికి లాగ కుండా వుంటుంది. జుట్టు చిక్కులు పడకుండా సమంగా దువ్వుకుంటూ వెటినర్ ఆయిల్ రాసుకుంటే ఇందులో సన్ స్కన్ వుండి జుట్టుకు హాని చేసే కిరణాల నుంచి రక్షిస్తుంది.

    మాడు పై జుట్టు పల్చబడిందా?

    శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట దగ్గర పలుచగా వుంటుంది. మాడు పైన జుట్టు అణిగినట్లుంటుంది. ఇలా వుంటే ఏ…

  • మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో ఎక్కువసేపు ఏకాగ్రత తో కొనసాగించగలరని వారి జ్ఞాపకశక్తిని మెరుగ్గా వుంటుందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ అధ్యయనాలు గ్రూప్ కు మైండ్ ఫుల్ మెడిటేషన్ ఎనిమిదివారాల శిక్షణ రెండో గ్రూపు కు రిలాక్సేషన్ ట్రైనింగ్ లు ఎనిమిది వారాలు మూడో గ్రూప్ కు ఏ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తూ కొన్నాళ్లు పరిశోధనలు నిర్వహించారు. వాళ్లందరికీ ఎన్నో రకాల పనులు ఇచ్చారు. ఈ మల్టీ టాస్కింగ్ వేగాన్ని ఖచ్చితంగా చేసే తీరుని సమర్ధతని నిపుణులు అంచనా వేశారు. అందరికంటే ముందు మైండ్ ఫుల్ మెడిటేషన్ ట్రైనింగ్ తీసుకున్నవారున్నారు. ఈ గ్రూప్ సభ్యులు ఎక్కువ సేపు దేని పై ధ్యానం వుంచగలిగారు . బహుళ పనులు చేయగలిగారు. బహుళ పనులు చేస్తూ ఆ వృత్తిని జయించగలిగారు. ఎలాంటి శ్రమ వత్తిడీ లేకుండా ఎంతో సమర్ధవంతంగా పనులు చేశారట. ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ చాలా అవసరం. అంచేత ధ్యానం చేయటం వాళ్ళ కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధ్యాన ఫలాలు పోందండని చెపుతున్నారు పరిశోధకులు.

    ధ్యానంతో మల్టీ టాస్కింగ్ సులభం

    మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో  ఎక్కువసేపు ఏకాగ్రత తో కొనసాగించగలరని వారి జ్ఞాపకశక్తిని మెరుగ్గా వుంటుందని  తాజా అధ్యయనాలు చెపుతున్నాయి.  ఈ   అధ్యయనాలు…

  • కెరీర్ లో ఒక్కసరైన జాతీయ ఉత్తమ నటి అవార్డు సాదించాలనే కల అందరి హీరోయిన్స్ కు వుంటుంది. ఇప్పటి దాక 41 మంది హీరోయిన్స్ ఈ అవార్డు అందుకున్నారు కానీ కొందరే ఈ అవార్డు మళ్ళి మళ్ళి అందుకున్నారు. కనగనా రనౌత్ మూడు సార్లు జాతీయ అవార్డు తీసుకుంటే, ఊర్వశి శారద మూడు సార్లు, షర్మిలా టాగూర్, స్మితా పాటిల్, అర్చన, శోభన, టబు, కంగనా సేన్ శర్మ రెండు సార్లు తీసుకున్నారు. ఈ లిస్ట్ లో అందరి కంటే ఎక్కువ సార్లు ఏకంగా ఐదు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకున్నది షాబాన్ ఆజ్మి. వీళ్ళంతా ఆర్టిస్ట్లు . ఒక భావాన్ని మాట నియి౦ లేకుండా కళ్ళతోనో, పెదవి విరుపుల తో నో పలకరిస్తారు. పాత్రల్లో ఒదిగిపోతారు. రచయిత ఊహించిన రూపంలోకి మారిపోతారు. అవార్డులు తీసుకుంటారు.

    ఉత్తమ నటీమణులు

    కెరీర్ లో ఒక్కసరైన జాతీయ ఉత్తమ నటి అవార్డు సాదించాలనే కల అందరి హీరోయిన్స్ కు వుంటుంది. ఇప్పటి దాక 41 మంది హీరోయిన్స్ ఈ అవార్డు…

  • చావి రాజావత్ రాజస్థాన్ లోని సోడా గ్రామ సుర్పుంచ్. తగునీరు, మరుగు దొడ్లు, పవర్ లేని ఆ గ్రామం అభివృద్ధి కోసం, ఆ గ్రామస్తులు మేనేజ్ మెంట్ లో డిగ్రీ తీసుకున్న రాజావత్ ను సర్పంచ్ గా ఎంచుకున్నారు. నాలుగేళ్ళలో సోడా గ్రామ రూపురేఖలు మార్చింది చావి రాజావత్ ఎం.బి.ఎ డిగ్రీ తీసుకున్న ఫస్ట్ ఎంగెస్ట్ సర్పంచ్ ఈ అమ్మాయే ఇవ్వాల రోడ్లున్నాయి. తాగునీటి చెరువు బాగు చేసే ఖర్చును బరించేందుకు ముందుకు వచ్చిన ఓ సాఫ్ట్ డ్రింక్ కంపెనీ స్థాపించే ప్రయత్నం లో వుంది ఈ ౩౦ ఏళ్ల చావి రాజావత్ ముందుకు వచ్చిన సేవాశీలి.

    మారు మూల పల్లె ని మెరిపించిన రాజావత్

    చావి రాజావత్ రాజస్థాన్ లోని సోడా గ్రామ సుర్పుంచ్. తగునీరు, మరుగు దొడ్లు, పవర్ లేని ఆ గ్రామం అభివృద్ధి కోసం, ఆ గ్రామస్తులు మేనేజ్ మెంట్…

  • మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు. బచ్చల కూర లో ఇనుము నైట్రేట్ లు పుష్కలంగా వుంటాయి. ఈ కూరను వండాక మళ్ళి నేరుగా వేడి చేయకూడదు. వేడి నీళ్ళ గిన్నెలో వుంచి వేడెక్కేలా చేయాలి. అలాగే ఉడికించి లేదా కూర చేసిన గుడ్లు కూడా మళ్ళి వేడి చేస్తే అందులోని పోషకాలు పోతయి. చికెన్ కూడా అంతే, వండాక మళ్ళి మళ్ళి వేడి చేస్తే మాంసకృతులు పోతాయి సరి కదా జీర్ణ సంబందమైన సమస్యలు వస్తాయి. బంగాళా దుంప కూర కూడా వేడి చేసి తింటే విషపదార్ధాలు శరీరంలోకి చేరినట్లే. మాంసకృతులు పుష్కలంగా అందించే పుట్ట గొడుగు కూర కూడా ఫ్రిజ్ లో వుంచి, సాయంత్రం వేడి చేసి తినాలి అని చుస్తే అనారోగ్యాలు తధ్యం . సాధ్యమయినంత వండిన కూరలు మళ్ళి మళ్ళి వేడి చేసి తినడం వల్ల నష్టమే.

    వండినవి మళ్ళి వేడి చేస్తే నష్టం

    మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు.…

  • బాలీవుడ్ హీరోయిన్ ఎవ్లీన్ లక్ష్మి శర్మ బ్రిటిష్ చిత్రం టర్న్ లిఫ్ట్ తో కెరీర్ మొదలు పెట్టింది. ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ ఏ దివానీ హై జవానీ వంటి సినిమాల్లో నటించింది. ఈ అమ్మాయి ఒక స్పెషల్ సెలెబ్రెటీ. సోషల్ నెట్ వర్క్ తో బోలెడు మంది అభిమానులను పోగు చేసుకుంది. ముంబై మురికి వాడల్లో వుండే వాళ్ళ కోసం పాత కుర్తీలు జీన్స్ టీ షర్ట్లు సేకరించింది. ఫ్యాషన్ రంగం సినీ పరిశ్రమ రెండు దుస్తుల తోనే నడుస్తాయి. కనుక ఎంతో మంది సెలబ్రెటీలు ఖరీదైన కుటుంబీకులు లెక్కలేనన్ని దుస్తులు డొనేట్ చేసారు. మురికివాడల్లో పేదలకు మానవ అక్రమ రవాణా బాధితులైన ఆడపిల్లలకు ఈ సేకరించిన దుస్తులు చెప్పులు ఇస్తుంది. ఈ సేవకోసం కొన్ని సినిమాల్లో బికినీ లో కుడా కొన్ని సీన్లు చేశాను. నీకు దుస్తుల విలువ తెలుసా అని అందరూ అడుగుతారు. కానీ నాకు మనుషుల విలువ వాళ్ళ అవసరాలు తెలుసు . వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతాను అంటోంది లక్ష్మీ శర్మ. ఇలాంటి హీరోయిన్లను ఎంత మందిని చూసి వుంటారు?

    పేదలకు దుస్తులు దానం చేసే హీరోయిన్

    బాలీవుడ్ హీరోయిన్  ఎవ్లీన్ లక్ష్మి శర్మ బ్రిటిష్ చిత్రం టర్న్ లిఫ్ట్ తో కెరీర్ మొదలు పెట్టింది. ఫ్రమ్  సిడ్నీ విత్ లవ్ ఏ దివానీ హై…

  • తెల్లని ముత్యాల నగలు ఎప్పుడూ బావుంటాయి. సంప్రదాయ దుస్తుల పైన ఆధునిక వస్త్ర శ్రేణి లోనూ ముత్యాల నగలు అందంగా అమిరిపోతాయి. ముత్యాల నగలు సహజమైన మెరుపు పోకుండా వుండాలంటే వాటిని శ్రద్ధగా వాడాలి. అలంకరణ పూర్తయ్యాకే వాటిని ధరించాలి. మేకప్ క్రీముల్లో రసాయనాల ప్రభావం వాటిపైన పడితే మెరుపు పోతుంది. వీటిని నేరుగా ఆభరణాల పెట్టెలో పడేయకూడదు సిల్క్ లేదా వెల్వెట్ వస్త్రంలో భద్రంగా పెట్టాలి. వేడి సోకితే ముత్యం సహజత్వాన్ని పోగొట్టుకుంటుంది. మంచినీటితోనే శుభ్రం చేయాలి. బంగారం వెండి వస్తువుల్లో పొదిగిన ముత్యాలు క్లీన్ చేయాలంటే అమోనియా తో తయారు చేసిన క్లీనర్ ను ఉపయోగించకూడదు. ఇవి మెరుపు తగ్గిస్తాయి. ఎప్పుడు ముత్యాల నగలు వేసుకున్నా వాటిని శుభ్రంగా పొడి గుడ్డతో తుడిచి తడి లేకుండా చూసి సిల్క్ బట్టలో భద్రం చేయాలి. అవి మెరవాలంటే మెత్తని సిల్క్ బట్టతో శుభ్రంగా తుడిస్తే చాలు.

    ముత్యాల నగలు మెరిసిపోతాయ్

    తెల్లని ముత్యాల నగలు ఎప్పుడూ బావుంటాయి. సంప్రదాయ  దుస్తుల పైన ఆధునిక వస్త్ర శ్రేణి లోనూ  ముత్యాల నగలు అందంగా అమిరిపోతాయి. ముత్యాల నగలు సహజమైన మెరుపు…

  • ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే ఎన్నో పనులు చేస్తుంటాం. సరైన పోశ్చర్ లో కనుక కూర్చోకపోతే శరీరంలో అన్ని భాగాల పైన వత్తిడి ఏపీడీ ఇతర భాగాల్లో నొప్పులు వచ్చి శరీరం అలసిపోతుంది అని చెపుతున్నారు ఎక్సపర్ట్స్. కూర్చునే కుర్చీ లేదా డ్రైవింగ్ సీట్ లో నడుము వెనక రోల్ చేసిన టవల్ లేదా చిన్న దిండు పెట్టుకుంటే వెన్ను సమంగా ఆనుతుంది. అలాగే ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు నిఠారుగా నడుస్తూవుంటే మంచిది. హ్యాండ్ బ్యాగ్ లేదా లాప్ టాప్ బ్యాగ్ ఒకే భుజానికి తగిలించుకోకుండా రోజుకోవైపు మార్చి తగిలించుకోవాలి. అలసి పోతున్నామన్న కారణంగా వర్కవుట్స్ మానేయవద్దు. వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. ఎండార్ఫిన్లు విడుదలై మానసికమైన సంతోషం వస్తుంది. ఆరోగ్య వంతమైన అలవాట్లు మంచి నిద్ర పోషకాలు శరీరానికి తగినంత శక్తిని ఇస్తాయి. .

    సరైన పోశ్చర్ లో కూర్చుంటే సుఖం

    ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే ఎన్నో పనులు చేస్తుంటాం. సరైన పోశ్చర్ లో కనుక కూర్చోకపోతే  శరీరంలో అన్ని భాగాల పైన వత్తిడి ఏపీడీ ఇతర…

  • గ్రామీణ హస్తకళా కారులకు సరికొత్త ఐడియాలు ఇచ్చి కొత్త డిజైన్లు అందించి ఎన్నో కార్పొరేట్ ఆర్డర్స్ సంపాదించి ఈ కళకి అపూర్వ ఆదరణ సంపాదించి పెట్టింది నవ్యా అగర్వాల్. ప్రాజెక్ట్ డిజైనింగ్ లు డిగ్రీ పూర్తీ చేసిన నవ్య స్వగ్రామం సీతాపూర్. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నవ్యకి 90 కిలోమీటర్ల దూరంలోవుంది. ఆ వూర్లో అందరికీ హస్తకళల్లో ప్రవేశం వుంది. మార్కెటింగ్ లేదు. వారికీ ఈ ఊరి వారికీ గుర్తింపు తెచ్చేందుకు ఐ వాల్యూ ఎవ్రీ ఐడియా పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసింది నవ్య. పెన్ స్టాండ్స్ ,గోడ గడియారాలు .ట్రే లు ,కోస్టర్లు , పాత్రలు , చెక్కలతో తయారు చేయగలరు. ఆవూరి కళాకారులు. నవ్య సాయంతో వాళ్ళకి హైద్రాబాద్ ,చెన్నై ,ముంబై వినియోగదారులు దొరికారు. లెన్స్ కార్ట్ ,స్నాప్ డీల్ , అమెజాన్ వంటి సంస్థల ద్వారా కార్పొరేట్ సంస్థల ఆర్డర్స్ వచ్చాయి. ఇవ్వాళ ఆ వూర్లో ప్రతి కళాకారులూ గంటకో 60 రూపాయలు సంపాదిస్తున్నారు. కష్టం ఆలోచన , ఐడియా మార్కెటింగ్ అంతా నవ్య అగర్వాల్ దే. ఆవూరి కళే మారిపోయింది.

    వూరి రుణం తీర్చుకున్న నవ్య అగర్వాల్

    గ్రామీణ హస్తకళా కారులకు సరికొత్త ఐడియాలు ఇచ్చి కొత్త  డిజైన్లు అందించి ఎన్నో కార్పొరేట్ ఆర్డర్స్ సంపాదించి ఈ కళకి అపూర్వ ఆదరణ సంపాదించి పెట్టింది నవ్యా…