• అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతాం అనుకుంటాం గాని బరువు పెరిగేది కార్భోహైడ్రెట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పెరుకుపోయే క్యాలరీల వల్ల శక్తినిచ్చేది పిండిపదార్థాలే.మెదడు,కండరాలు,కణాలు ఆరోగ్యం బావుండాలంటే అది పిండిపదార్థాల వల్లే సాధ్యం. చైనా,జపాన్,ఫిలిప్పీన్స్ దేశాల ప్రధాన ఆహరం అన్నమే. కాని ప్రపంచ సూచీ ప్రకారం వారిలో ఉబక కాయులు తక్కువే. అన్నంలో ఉండే గంజి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నిరోదిస్తుంది. పాలీష్ పట్టని బియ్యం లో పీచు పదార్దములు అధికంగా ఉండి మలబద్దకాన్ని నిరోదిస్తాయి. వంద గ్రాముల అన్నంలో 345 క్యాలరీలు ,78.2 గ్రాముల పిండిపదర్ధాలు, 6.5 గ్రాముల మాంస కృత్తులు, 0.2 పీచు ,0.5 పాస్పరస్ 160 గ్రాముల ఐరన్ 0.7 10 క్యాల్షియం ఉంటాయి. ఈ ప్రపంచంలో బలవర్ధకమైన ఆహారం అన్నమే.

    ఆరోగ్యానికి అన్నమే మిన్న…

    అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతాం అనుకుంటాం గాని బరువు పెరిగేది కార్భోహైడ్రెట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పెరుకుపోయే క్యాలరీల వల్ల శక్తినిచ్చేది…

  • స్కర్ట్ బెడ్డింగ్ కంపెనీ వాళ్ళు పిల్లల కోసం రకరకాల డిజైన్ ల దుప్పట్లు తయారుచేసారు. పిల్లలకి ఓ పట్టున ఏవీ నచ్చవు. వాళ్ళ కళ్ళలో అది ప్రత్యేకంగా తోచాలి. ఇదిగో ఈ కాన్సెప్ట్ తో వాళ్ళు ఫెమింగో డాన్సర్ అనే దుప్పటి తయారు చేసారు. దుప్పటి పైన చక్కని డైన్ బూట్లతో ఓ పాపాయి పడుకున్నట్లు డిజైన్ చేసారు. ఐదారేళ్ళ పాపాయి ఇందులో దూరి పడుకుంటే ఎంతో చక్కని ఫ్రిల్స్ ఉన్న చుక్కల గౌను అందంగా ఉన్న బూట్లు ధరించి వున్నటుంటుంది. ఇంతే కదా పిల్లల కోసం పోలాన్ డ్రస్ ల అంతరిక్షంలో ధరించే డ్రస్ లు ఇవన్నీ దుప్పటి పైన డిజైన్ చేసారు. చూసుకునేందుకు భిన్నంగా వుండే డిజైన్ల దుప్పట్లు ఈ కంపెనీ స్పెషల్. పిల్లలు దుప్పటి చూడగానే నిద్రపోతామంటారు. ఓసారి ఆన్ లైన్లో చూడండి.

    పిల్లల కోసం గౌను దుప్పటి

    స్కర్ట్ బెడ్డింగ్ కంపెనీ వాళ్ళు పిల్లల కోసం రకరకాల డిజైన్ ల దుప్పట్లు తయారుచేసారు. పిల్లలకి ఓ పట్టున ఏవీ నచ్చవు. వాళ్ళ కళ్ళలో అది ప్రత్యేకంగా…

  • ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత అందంగా వుంది. ఆమె ఎప్పుడూ ప్రత్యేకమే. పెప్సీ కి కోక్ కి నటించిన ఏకైక మహిళా మోడల్ ఐశ్వర్యనే. ఆమెకు ఆభరణాలంటే అస్సలు ఇష్టం ఉండదట. ఐశ్వర్య లాంటి బార్బీ డాల్స్ ను 2005 లో విడుదల చేస్తే మార్కెట్ లోకి వచ్చిన నిమిషాల్లో అమ్ముడైపోయాయట. కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినా వద్దందిట ఐశ్వర్య. ఐశ్వర్య జార్జ్ బుష్ తో పాటు విందుకు రమ్మని అమీర్ ఖాన్ తో పాటు ఐశ్వర్య కి ఆహ్వానం అందినా ఎదో షూటింగ్ కోసం ఆ అవకాశం వదులుకొందిట. ఓప్రా విన్ ఫ్రె షో లో పాల్గొన్న తోలి భారతీయ ప్రముఖురాలు ఐశ్వర్య. మేడమ్ టుస్సాట్స్ మ్యూజియం లో స్థానం సంపాదించినా తొలిభారతీయ నటి ఐశ్వర్య ఇంత అందాల బొమ్మ నటిస్తే ఏ దిల్ హై ముష్కిల్ బాక్సాఫీస్ బద్దలు కొడితే ఆశ్చర్యం ఏముంది?

    అందం పేరు ఐశ్వర్య

    ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత…

  • ఈ ఫోటో లోని విదేశీయులు సింగపూర్ పార్లమెంట్ సభ్యులు దీపావళి సందర్భంగా ఆ దేశానికి చెందిన 16 మంది మహిళా ఎంపీలు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరెలు కట్టుకుని ఫోటోకి ఫోజు ఇచ్చారు కనెక్ట్ విత్ ది ఇండియన్ కమ్యునిటీ అనే కాంపెయిన్ కోసం వేరు ఇలా చీరెలు కట్టుకొన్నారు వీరిలో సీనియర్ మంత్రులు కొత్త ఎంపీలు ఉన్నారు.

    రైట్ అప్

    ఈ ఫోటో లోని విదేశీయులు సింగపూర్ పార్లమెంట్ సభ్యులు దీపావళి సందర్భంగా ఆ దేశానికి చెందిన 16 మంది మహిళా ఎంపీలు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరెలు…

  • బెంగుళూరుకు చెందిన మోడల్ టి.వి నటి ఐశ్వర్య పేమ్సే, అంతర్జాతీయ మోటార్ ర్యాలీలో పాల్గొన్న తోలి మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే భారత్ తరపున పాల్గొన్న తోలి మహిళ గా రికార్డుల కెక్కిన ఐశ్వర్య తైవాన్ లో జరిగిన అంతర్జాతీయ మోటార్ ర్యాలీ లో పాల్గొంది. గతంలో ఈమె జాతీయ స్థాయి పురుషుల విభాగంలో కూడా ఆమె పాల్గొంది. ఆ పోటిలలో తొమ్మిది మంది మహిళలు పాల్గొంటే ఐశ్వర్య వారిలో తోలి స్థానం సాదించింది. ఆసియా కప్ రోర్ రేస్ లో పాల్గొన్న ఐశ్వర్య 125 సి.సి స్కూటర్ ను చెన్నైకి చెందిన శృతి నాగా రాజన్ తో కలిపి నడిపింది. టి.వి సిరియల్స్ తో పాటు కొన్ని ఉత్పత్తులకు ఐశ్వర్య పిస్తే మోడల్ గా కొనసాగుతుంది.

    బైక్ రేసింగ్ లో బెంగుళూరు మోడల్

    బెంగుళూరుకు చెందిన మోడల్ టి.వి నటి ఐశ్వర్య పేమ్సే, అంతర్జాతీయ మోటార్ ర్యాలీలో పాల్గొన్న తోలి మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే భారత్ తరపున పాల్గొన్న తోలి…

  • కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న, లేదా ఉన్న ఇంటిని రేమోడల్ చేయాలనుకున్నా అసలు ఇంటికి పండుగ వస్తే బాగుంటుంది. ఒక్కో రంగు ఒక్కో ఎనర్జీ ఇస్తుంది. ఆకుపచ్చ రంగు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, ప్రేశాంతతను తాజాదనాన్ని ఇస్తుంది. పసుపు రంగు ఎక్కువ వెలుతురు ఇస్తుంది, గది వాతావరణం వెచ్చగా వున్న ఫీలింగ్ కలుగుతుంది. నిలం కొత్త ధనం, ఆత్మవిశ్వాసం ప్రేశాంతత అందిస్తుంది. ఎరుపు ఉద్వేగానికి కారణం అవుతుంది. నారింజ రంగు ఎక్కువ వెలుగు, సంతోషం ఇస్తుంది. నలుపు స్టైల్ లే కానీ ఈ రంగు ఎవ్వరు వేసినట్లు కనపడదు. ఇక తెలుపు ఎవ్వర్ గ్రీన్, ఉత్సాహం, ఉత్తేజం ఇస్తుంది. ఈ రంగు వేస్తె గది విశాలంగా వున్న ఫీలింగ్ కలుగుతుంది.

    ఒక్కో రంగులో ఒక్కో మూడ్

    కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న, లేదా ఉన్న ఇంటిని రేమోడల్ చేయాలనుకున్నా అసలు ఇంటికి పండుగ వస్తే బాగుంటుంది. ఒక్కో రంగు ఒక్కో ఎనర్జీ ఇస్తుంది. ఆకుపచ్చ రంగు…

  • చిన్న వయసు నుంచే ఆహారం విషయంలో కాస్త అప్రమత్తత తో ఉంటే గుండెకు పదిలంగా కాపాడుకోవచ్చు. చేపలు. ఓట్ మీల్ .స్ట్రా బెర్రీలు ,నిమ్మజాతి పండ్లు ,సొయా ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుండే చేపలు వారానికి రెండు సార్లయినా తీసుకోవాలి. ఓట్ మీల్ ఉదయపు అల్పాహారంగా తీసుకుంటే గుండె పనితీరు మెరుగవుతుంది. స్ట్రా బెర్రీ రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తాయి. సి విటమిన్ పుష్కలంగా వుంటే సిట్రస్ పండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్లు ఖనిజాలు అధికంగా వుండే సొయా హుద్రోగాలను దూరంగా ఉంచుతోంది.

    ఈ ఐదు గుండెకు మంచివి

    చిన్న వయసు నుంచే  ఆహారం విషయంలో కాస్త అప్రమత్తత తో ఉంటే గుండెకు పదిలంగా కాపాడుకోవచ్చు. చేపలు. ఓట్ మీల్ .స్ట్రా బెర్రీలు ,నిమ్మజాతి పండ్లు ,సొయా …

  • ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ మాత్రం జీన్స్. ఎన్నో రకాల జీన్స్ చిరుగులు జీన్స్ టోర్న ,హై వెయిస్టిడ్ ,స్ట్రెచ్ బూట్ కట్, ఫేర్డ్ , బాయ్ ఫ్రెండ్ బ్యాగీ స్కిన్స్ యాంగిల్ కట్ వగైరా వగైరా . డెనిమ్ క్లాత్ తో చేసిన జెగ్గింగ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్. జీన్స్ కి తగట్టు టీ షర్ట్ ,కుర్తీ , కుర్తాలే కాదు. పొడుగ్గా చీలికలుండే మ్యాక్సి టాప్ లు బావుంటాయి. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో అనుష్క శర్మ వేసుకున్న డ్రెస్ ఇదే. నీలం నలుపే కాకుండా ఎరుపు. గులాబీ ,పసుపు , రంగుల జీన్స్ కూడా వాడచ్చు. వాటి మెడకు సాదా ప్రింటెడ్ టాప్స్ బావుంటాయి. ఏదైనా పార్టీ కి వెళ్లాలనుకుంటే లేత రంగులు వున్న జీన్స్ ప్యాంట్ పైకి మెరుపులున్న టాప్స్ ట్రై చేస్తే పార్టీ లుక్ వచ్చేస్తుంది.

    ఎప్పటికీ మారని ఫ్యాషన్ జీన్స్

    ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ మాత్రం జీన్స్. ఎన్నో రకాల జీన్స్ చిరుగులు జీన్స్ టోర్న ,హై వెయిస్టిడ్  ,స్ట్రెచ్ బూట్ కట్,…

  • సిమ్రన్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న కంగనా రనౌత్ రాణీ లక్ష్మీ బాయ్ పాత్రలో నటించబోతోంది. అందుకోసం జర్మనీ వెళ్లి గుర్రపు స్వారీ ప్రత్యేక శిక్షణ తీసుకోబోతోందిట. సాధారణంగా సినిమాల్లో మచ్చిక చేసిన గుర్రాలు వాడతారు. కానీ కంగనా అన్ని రకాల గుర్రాలపైనా స్వారీ చేసి బరువు సాధించాలనుకుంటుందిట. వివిధ జాతుల గుర్రాలు వాటిని మచ్చిక చేసుకునే విధానం గాయాలైతే ప్రధమ చికిత్స ఇవన్నీ జర్మనీ లో నేర్పిస్తారు. ఝాన్సీ రాణి వేషం వేయాలంటే ఈ మాత్రం కష్టపడకపోతే ఈ పాత్ర కు ఎలా న్యాయం చేస్తానంటోంది. కంగనా. తగిన బరువు పెరుగుతోందిట. ఆ అపాత్రకు కావలిసిన దుస్తుల విషయంలో కూడా చాల శ్రద్ధ తీసుకుంటోందిట. మనం తేర పైన నిజమైన వీరనారిని చూస్తామన్నమాట.

    ఆ పాత్ర కోసం ఆ మాత్రం రిస్క్ వద్దా ?

    సిమ్రన్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న కంగనా రనౌత్ రాణీ లక్ష్మీ బాయ్  పాత్రలో నటించబోతోంది. అందుకోసం జర్మనీ వెళ్లి గుర్రపు స్వారీ ప్రత్యేక శిక్షణ తీసుకోబోతోందిట. సాధారణంగా…

  • రాజస్థాన్ లోని బికనీర్ లో పుట్టింది మాల్వికా అయ్యర్ 13సంవత్సరాల వయసులో తన ఇంటి సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో రెండు చేతులు పోగొట్టుకుంది. కాళ్ళు ముక్కలయ్యాయి. ఎన్నో సర్జరీల తర్వాత కాళ్ళు కాపాడగలిగారు డాక్టర్లు. రెండు చేతులు కృత్రిమ ప్రొస్థెటిక్ హాండ్స్ పెట్టుకుని కాలేజీలో చదివి పి.జి చేసింది. అలా మొదలైన ఆమె జీవిత ప్రస్థానం ఆమెను దేశవిదేశాల్లో ప్రధాన మోటివేషన్ స్పీకర్ దాకా సాగింది. సోషల్ వర్క్ లో పి. జి చేసి యాక్సిడెంట్ సర్వైవర్ గా మొదలైన మాల్వికా యాక్టివిస్ట్ గా మారింది. వికలాంగుల కోసం ఆమె సాగిస్తున్న కృషికి గానూ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఎమర్జింగ్ లీడర్ అవార్డు ఇచ్చారు. జీవితం మొత్తం మోటివేషన్ స్పీకర్ గానే కొనసాగాలంటోంది మాల్వికా. ఈమె పూర్తి కథను your story. com లో చదవచ్చు.

    చైతన్య దీపిక మాల్వికా అయ్యర్

    రాజస్థాన్ లోని బికనీర్ లో పుట్టింది మాల్వికా అయ్యర్ 13సంవత్సరాల వయసులో తన ఇంటి సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో రెండు చేతులు పోగొట్టుకుంది. కాళ్ళు…