జిలింగ్‌సెరెంగ్ పశ్చిమబెంగాల్ లోని ఒక గిరిజన గ్రామం.12వ తరగతి చదువుకున్న మాలతి ముర్మ ఆ గ్రామంలో గిరిజన బాల బాలికల కోసం తన ఇంటిని బడి గా మార్చింది.ఆమె నివసించే మట్టి గదుల ఇంట్లో మాలతి బాల స్కూల్ పేరుతో ఉచిత విద్య బోధన చేస్తోంది. ఇంగ్లీష్,గణితం,సైన్స్ లో ప్రాథమిక పాఠాలు బోధిస్తోంది.ఆమెకు ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ లేదు అయినా గిరిజన బాలలను విద్యావంతుల్ని చేయడం ఆమె లక్ష్యం.45 మంది పిల్లలతో ఆమె పాఠశాల విజయవంతంగా నడుస్తోంది.













