ముఖమల్ పేరుతో పిలిచే ఈ వెల్వెట్ డ్రెస్ లకు వింటర్ సీజన్ చాలా స్పెషల్. ఎంబ్రాయిడరీ తో మెరిసిపోయే ఈ వెల్వెట్ శీతాకాలపు పండుగల వేడుకల్లో రారాజుల వెలిగిపోతుంది. పచ్చ,ఆకుపచ్చ,నెమలి కంఠం రంగు, బ్లాక్ వంటి షేడ్స్ సెలెబ్రెటీ వార్డ్ రోబ్స్ లో రిచ్ గా మెరుస్తున్నాయి.ఈ మధ్యకాలంలో ఒక ఫోటో షూట్ లో డిజైనర్ నూరి తయారు చేసిన వెల్వెట్ కఫ్తాన్ లో శోభిత దూళిపాళ మెరిసిపోయారు. అతి తక్కువ ఆభరణాలు తక్కువ మేకప్ తో ఆమె స్టైలింగ్ ఫ్యాబ్రిక్ అందాన్ని పట్టి చూపెట్టింది. తగ్గట్టుగా మేకప్ హెయిర్ స్టైల్ వెల్వెట్ అందాల్ని సరిగ్గా ప్రదర్శించాయి.













