ఆమె అడవి కే అమ్మమ్మ

ఆమె అడవి కే అమ్మమ్మ

ఆమె అడవి కే అమ్మమ్మ

కాణి తెగకు చెందిన లక్ష్మి కుట్టి కేరళ జానపద అకాడమీలో ఉపాధ్యాయురాలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. వితుర లోని కల్లార్ అడవి ప్రాంతానికి చెందిన ఈ గిరిజన టీచర్ గారు 500 రకాల ఔషధ చికిత్సలు చేయగలరు.అడవిలో ఏ ఔషధ మొక్క ఎక్కడ ఉందో ఆమెకు కొట్టిన పిండి అందుకే లక్ష్మి కుట్టి ని వన ముతస్సి అంటే అడవికే అమ్మమ్మ అంటారు.50 ఏళ్లుగా సంప్రదాయ వైద్యం చేస్తున్న ఈమెకు 1985లో కేరళ ప్రభుత్వం నాటు వైద్య రత్న అవార్డు ఇచ్చారు. పాము కాటు దగ్గర నుంచి అన్ని అనారోగ్యాలకు మందులు ఇస్తారు. మంచి ఆహార నియమాలు పాటించండి, ఎక్కువగా కదలండి, నడవండి అంటారామె.