• ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు. నట్స్ లో పీచు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువే. కానీ వీటిని తీపి పదార్ధాలతో కలిపి తీసుకోకూడదు. పండ్లతో కలిపి, ఓట్స్ తో కలిపి తినాలి. పండ్లు జీవ క్రియల వేగాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వీటిని ఉదయం వేళ అల్పాహారంతోనో, మధ్యాహ్నం భోజనం అయ్యాక తినాలి. భోజనానికి ముందు తినకూడదు. నెయ్యి భోజనానికి రుచి ఇస్తుంది.కానీ నేతితో బ్రెడ్, పరోటాలు కాల్చకూడదు. అప్పుడు దానిలోని పోషక విలువలు పోతాయి. చపాతీలు, పరోటాలు కాల్చాక వాటిపై రాస్తే రుచి, ఆరోగ్యం. సాంబారు, పప్పు తాలింపుగా నెయ్యి వాడితే వాటికి అదనపు రుచి వస్తుంది.

    కొన్నింటిని అన్నింటితో కలపద్దు

    ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు.…

  • మిచిగాన్ యూనివర్సిటీ వాళ్ళు 1982 నుంచి 2015 వరకు గుండెకు, గుడ్డుకు వున్న సంబంధంగురించి పరిశోధన చేశారు. మూడు లక్షల ఎనిమిది వేల మందిని పరీక్షించారు. మొత్తానికి పరిశోధన సారాంశం ఏమిటంటే గుడ్డు తినడం గుండెకు మంచిదే అంటున్నారు పరిశోధకులు. అధిక క్వాలిటీ ప్రోటీన్లున్న గుడ్డు తినడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య తగ్గుతుందంటున్నారు. ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్లుంటాయి. విటమిన్ A, D, E లతో పాటు యాంటి ఆక్సిడెంట్లు వుంటాయి. వీటిలోని ప్రోటీన్లు బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు అవిశలు, గ్రీన్ టీ, గుడ్డు, పెరుగు, పాలు నిత్యం తీసుకోమంటున్నారు.

    గుండెకు మేలు చేసే గుడ్డు

    మిచిగాన్ యూనివర్సిటీ వాళ్ళు 1982 నుంచి 2015 వరకు గుండెకు, గుడ్డుకు వున్న సంబంధంగురించి పరిశోధన చేశారు. మూడు లక్షల ఎనిమిది వేల మందిని పరీక్షించారు. మొత్తానికి…

  • రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు 10 గ్రాములు తీసుకొంటున్నారని తేలింది. ఇలా ఉప్పు పైన నియంత్రణ లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. భారతీయ వంటకాల్లో ఎన్నో దినుసులు, పులుపులు, కారాలు ఎక్కువే. వండే కూరల్లో, పులుసుల్లో టమాటాలు, చింతపండు, ఉల్లిపాయలు వీటికి తోడుగా ఉప్పు వాడటం తప్పదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఆహారం వండే సమయంలో ఉప్పు వేయకండి. సహజంగా అన్నీ ఉడికాక రుచి చూసుకొని కావలసినంత ఉప్పు జోడించమంటున్నారు. సహజంగా కూరగాయల్లో వుండే ఉప్పు సరిపోతుందంటారు. ఉడికించకుండా, ఆవిరిపైన ఉడకబెట్టి గ్రిల్లింగ్, మైక్రోవేవ్ చేయటం బెస్ట్ అంటారు. రోజుకి ఐదు గ్రాములకు మించి ఉప్పు వాడద్దని WHO హెచ్చరిస్తుంది.

    ఉప్పు వాడటం తగ్గిస్తే బెటర్

    రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు…

  • కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా టేస్టి గా అనిపించదు. కానీ ఇందులో వుండే పోషకాలు మాత్రం ఎక్కువే ప్రతి కూరలో నూ ప్రతి కాంబినేషన్ లోనూ ముల్లంగిని తీసుకుంటేమూత్రపిండాలు పని తీరు శుభ్ర పడుతుందంటారు డాక్టర్లు ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రావని చెపుతున్నారు. ముల్లంగిలో విటమిన్-సి, ఫాస్పరస్ బి-కాంప్లెక్స్ అధికంగా వుంది చెర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి తేమ అందుతుంది. ముల్లంగి రసం శరీరంలో ఇన్ ఫెక్షన్లు పోగొట్టి అలసట దూరం చేస్తుంది. శ్వాస సంబందమైన సమస్యలున్న, అలర్జీలు చేధిస్తున్న ముల్లంగిలోని పోషకాలు తగ్గిస్తాయి.

    ముల్లంగి తో ఎంతో మేలు

    కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా టేస్టి గా అనిపించదు. కానీ ఇందులో వుండే పోషకాలు మాత్రం ఎక్కువే ప్రతి…

  • ఈ సీజన్ లో చలి గాలుల వల్ల జ్వరాలు ఇతర ఇన్ఫెక్షన్లు ఎక్కువే. ద్రవ పదార్ధాలు ముఖ్యంగా సూప్ లు, టీ, కాఫీ వంటి వెచ్చని ద్రవాలు తాగడం వల్లనే ఇన్ఫెక్షన్ లను దూరంగా ఉంచొచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, వీలైనన్ని సార్లు తినాలి. పెరుగు, ఓట్స్, బార్లీ, వెల్లుల్లి, చికెన్ సూప్, గ్రీన్ టీ, చిలకడ దుంపలు, లవంగాలు, అల్లం, మిరియాలు, పాసుపు, క్యాప్సికం, పాల కూర, బాదాం పప్పులు, పసుపు రోగ' నిరోధక శక్తిని పెంచుతాయి. చలిగా వున్నా సరే పావు గంట సేపు బ్రిస్క్ వాకింగ్ లేదా ఇతర ఏరోబిక్ వ్యాయామాలు ఏవి చేసినా రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వీలైనంత సేపు శరీరానికి సూర్య రశ్మి సోకే లాగా జాగ్రత్త పడాలి. బాగా నిద్రపోవాలి. ఆహారంలో ఐరన్ కి కీలక పాత్ర. విటమిన్-సి వుండే పదార్ధాలు తినడం వాల్ల శరీరం ఐరన్ ను బాగా గ్రహించగలుగుతుంది.

    ఈ సీజన్ లో ఇవి చాలా అవసరం

    ఈ సీజన్ లో చలి గాలుల వల్ల జ్వరాలు ఇతర ఇన్ఫెక్షన్లు ఎక్కువే. ద్రవ పదార్ధాలు ముఖ్యంగా సూప్ లు, టీ, కాఫీ వంటి వెచ్చని ద్రవాలు…

  • తెలిసో తెలియకో బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేస్తుంటారు చాలా మంది ఆడవాళ్లు అడిగితే తీరిక లేదంటారు. కానీ ఉదయాన్నే చేయవలిసిన బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హార్వర్డ్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సుమారు 27 వేల మందిపైన సుదీర్ఘ కాలం పరిశోధనలు నిర్వహించారు. రెండు గ్రూపులుగా వీరిని విభజించి ఒక గ్రూపుకి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వకుండా రెండవ గ్రూపుకి ఇచ్చి కనీసం ఒక సంవత్సరం పరిశోధన చేస్తే అల్పాహారం తీసుకొనేవారు అధిక బరువు పెరిగినట్లు వారిలో ఒత్తిడి గమనించారని ఈ రెండు సమస్యలే గుండెకి సంబంధించిన ఎన్నో సమస్యలని తీరుస్తాయని పరిశోధకులు రిపోర్ట్ ఇచ్చారు ఉదయం తీసుకునే అల్పాహారానికి ,గుండె పని తీరుకీ మధ్య సంబంధం ఉందని వీరు కనిపెట్టారు. పొద్దుటే పనివేళ అని పది చేతులతో పని చేస్తున్నా తరగటం లేదని ఏ కాఫీ తోనో సరిపెట్టుకునే ఇల్లాళ్లకు ఇది హెచ్చరిక.

    బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేస్తే హార్ట్ ప్రాబ్లమ్

    తెలిసో తెలియకో బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ చేస్తుంటారు చాలా మంది ఆడవాళ్లు అడిగితే  తీరిక లేదంటారు. కానీ ఉదయాన్నే చేయవలిసిన బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే గుండెపోటు వచ్చే…

  • ఈ మధ్య కాలంలో అమెరికాకు నెయ్యి ఎగుమతులు ఎక్కువై పోయిందిట. మనం నెయ్యి అన్నం ,ఉప్పు ,గుడ్లు , చివరకు నీళ్ళు కూడా తగ్గించేసాము. పళ్ళ బిగువున నోరు కట్టేసుకుంటున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. అంటున్నారు నిపుణులు. నెయ్యి తగిన పాళ్ళలో వాడుకుంటే నష్టం లేదు. క్రీడా కారులు చురుగ్గా ఉండేందుకు శక్తి సోమ నెయ్యి ఉపయోగిస్తున్నారు. ఇందులోని మీడియం చెయిన్ ఫ్యాటీ ఆమ్లాలకు ఇతర కొవ్వులను కరిగించే శక్తి వుంది. అలాగే మనం కూరల్లో వేసుకునే ఉప్పు కన్నా ఇన్స్టెంట్ సూప్ లు, సొయా సాస్ , ఊరగాయల్లో వుండే ఉప్పే ఎక్కువ. అలాగే అన్నం మాంసాహారం కలిపి తినటం వల్ల కండర పుష్టికి కావలిసిన సంపూర్ణ పోషకాలు అందుతాయి. మధుమేహం ఉన్నవాళ్లు తప్పించి అన్నం నెయ్యి ఉప్పు మితంగా తినచ్చు. ముఖ్యంగా నెయ్యిలో బ్యుటైరిక్ యాసిడ్ వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. యాంటీ వైరల్ గుణాలు అధికం కూడా. నెయ్యిని మరీ తీసిపారేయకండి.

    నెయ్యి వాడకం మంచిదే

    ఈ మధ్య కాలంలో అమెరికాకు నెయ్యి ఎగుమతులు ఎక్కువై పోయిందిట. మనం నెయ్యి అన్నం ,ఉప్పు ,గుడ్లు , చివరకు నీళ్ళు  కూడా తగ్గించేసాము. పళ్ళ బిగువున…

  • అరటి ,సీతాఫలం, పనస ,సపోటా పై తోలు ఎలాగున్నా లోపల దాదాపు తెల్లగా గోధుమ రంగులతో ఉంటాయి కదా. కానీ ఇప్పుడు గజ్జి ప్రకాశవంతమైన రంగులో ఉంటే పోషకాలు పంట పండినట్లేనని లోపల మంచి రంగు ఉండే పండ్ల పెంపకం పై దృష్టిపెట్టారు రైతులు. మౌంటెన్ రోజ్ యాపిల్ కొరికి చుస్తే గులాబీ రంగులోనో ఎర్రగానో ఉంటుంది. క్యారెట్ ,బననా అయితే నారింజ రంగు గుజ్జు ఉంటుంది.ఇందులో బీటా కెరోటిన్లు వంద రెట్లు ఎక్కువ. అలాగే అనోనా రెటిక్యూ లేటా ,సీతా ఫలం మొత్తం పండు గుజ్జు రెండు ఎరుపే. మామే సపోటా లో కూడా ఎరుపు రంగు గుజ్జె.చెంబరాతి చెక్క లేదా చంద్ర హలసు పేరుతొ వుండే బ్లడ్ ఆరంజస్ ,ఆరెంజ్ గ్లో పేరుతో నారింజ పసుపు రంగుగల పుచ్చ ఇలా పండ్లే కాదు రకరకాల వాల్ నట్స్ కూడా రంగు మారిపోతున్నాయి. మరి రంగుల్లో పోషకాలుంటాయని డాక్టర్లు చెప్పేసారు కదా .

    పేర్లు సేమ్ రంగే రెడ్

    అరటి ,సీతాఫలం, పనస ,సపోటా పై తోలు ఎలాగున్నా లోపల దాదాపు తెల్లగా గోధుమ రంగులతో ఉంటాయి కదా. కానీ ఇప్పుడు గజ్జి ప్రకాశవంతమైన రంగులో ఉంటే…

  • ప్రాచీన సంప్రదాయ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె ,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం ఇలాంటి ఔషధ గుణాలున్న అనేక పదార్ధాలు మూలికా ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆ క్రమంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ముందు నిలబడింది. మేలు జాతి సైడర్ ఆపిల్స్ రసాన్ని పులిసేలా చేసి ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేస్తారు. ఈ వెనిగర్ లో బీటా కెరోటిన్ ,విటమిన్స్ , మినరల్ ఎంజైమ్స్ కావలిసినన్ని పోషకాలు దొరుకుతాయి. దీన్ని అనేక కాంబినేషన్స్ లో తీసుకోవచ్చు. తేనె నిమ్మరసం ,వెల్లులిరసం , అల్లం రసం ,సలాడ్స్ ,కూరలు ,ఫ్రైలు ,మాంసాహార వంటకాల్లో వాడుతుంటారు. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ సర్వరోగ నివారిణి అంటుంటారు. ఎన్నో ఔషధ విలువలున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ వెనిగర్ గురించి మీ డాక్టర్ గారితో మాట్లాడండి. ఎందుకంటే బరువు తగ్గేందుకు ఈ వెనిగర్ బ్రహ్మాండంగా పని చేస్తుందని ఇటీవల పరిశోధనలు చెప్తున్నాయి.

    బరువు తగ్గించే దివ్యౌషధం

    ప్రాచీన సంప్రదాయ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె ,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం…

  • రాగులుని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. ఈ చిన్ని గింజల్లో కాల్షియం ఐరెన్, ప్రోటీన్, ఇతర అనేక ఖనిజాలు లభిస్తాయి. కొవ్వు పదార్ధాలు వుండవు కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఆహారం. రాగుల లోని ఫాలి ఫెనాల్స్, ఫైబర్ డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుతాయి. పిచు జీర్ణ వ్యవస్థకు దోహద పడుతుంది. రాగుల్లో వుండే ఐరన్ రక్తహీనతను తగ్గించి హీమోగ్లోబిన్ పెంచుతుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు వాటికి బదులు రాగుల మొలకల వాల్ల సి-విటమిన్ కూడా శరీరానికి అందుతుంది.రాగుల్లో ప్రోటీన్లు పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఈ రాగుల్ని జావలాగా కానీ దోసెల్లో కానీ ఏ రూపంలో తీసుకొన్నా ప్రయోజనకరమే!

    రాగులు ఎంతో మంచి ఆహారం

    రాగులుని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. ఈ చిన్ని గింజల్లో కాల్షియం ఐరెన్, ప్రోటీన్, ఇతర అనేక ఖనిజాలు లభిస్తాయి. కొవ్వు పదార్ధాలు వుండవు కాబట్టి…

  • ఏ పెళ్లి కయినా వెళితే భోజనాలు అయినాక కిళ్ళీలు లేదా మౌత్ ఫ్రెషనర్ల మిశ్రమం కనిపిస్తుంది. సోంపు గింజలతో పాటు కొబ్బరి తురుమూ దోస గింజలు ,సౌర పప్పు ,మెత్తటి వక్క పలుకు ,కుంకుమ పువ్వు ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలు కలిపి ఇచ్చే ఆ మిశ్రమంలో ప్రధాన పాత్ర సోంపు గింజలకే. జీలకర్ర లాగే వుండే ఈ సోంపును డెజర్ట్లు ,స్వీట్లతో వాడతారు. బెంగాలీలయితే వాళ్ల కూరల్లో బేకరీ ఉత్పత్తులు సోంపు గింజల్ని వేస్తారు. ఇది మంచి ఔషధమే కాదు అద్భుతమైన పోషకాలు కూడా ఉన్నాయిట. కాపర్ ,ఐరన్ , కాల్షియం వంటి ఖనిజాలు A ,B,C,E విటమిన్లు సోంపు గింజల్లో పుష్కలంగా దొరుకుతాయి. సోంపు గింజల్ని నమిలితే లాలాజలంతో నైట్రేట్ల శాతం పెరిగి బీ.పీ నియంత్రణలో వుంటుంది. ఇందులో ఎక్కువగా వుండే పొటాషియం బీ.పీ కి గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. నోటి సువాసన కోసం కాకుండా సోంపు అలవాటుగా రోజూ తిన్నా మంచిదే.

    మంచి వాసనే కాదు ఆరోగ్యం కూడా

    https://scamquestra.com/21-finansovye-afery-questra-world-i-atlantic-global-asset-management-agam-questraworldes-atlanticgames-31.html

  • మిరపకాయ కొరికి చూస్తే కారం మండుతుంది. కానీ ఈ బుల్లి బఠానీ లాంటి మిరపకాయలు తింటే కంటే కొంటె దిమ్మ తిరిగిపోతుంది. అజిచరపితా గా పిలిచే ఈ బుల్లి మిరపకాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. ఎంత అంటే కిలో 17 లక్షల నుంచి 23 లక్షల వరకు ధర పలుకుతాయి. ఉత్తర పేరు అడవుల్లో దొరికే వీటిని ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా రైతులు వ్యాపార పంటగా పండించడం మొదలు పెట్టారు. తింటే తట్టుకోలేనంత కరంగా వుంటాయి కానీ వంటలకు గొప్ప రుచి ఇస్తాయట. కాస్త చల్లగా వుండే వాతావరణం మాత్రమే వీటిని సాగుచేసేందుకు అనుకూలంగా ఉంటుందిట.

    ఈ మిరపకాయ ఖరీదు కేజి 17 లక్షల పైనే

    మిరపకాయ కొరికి చూస్తే కారం మండుతుంది. కానీ ఈ బుల్లి బఠానీ లాంటి మిరపకాయలు తింటే కంటే కొంటె దిమ్మ తిరిగిపోతుంది. అజిచరపితా గా పిలిచే ఈ…

  • మనకి వంట బాగా వచ్చినా సరే అనుభవం ఉన్నవాళ్ళు చెప్పిన కిటుకులు పాటిస్తే వండే వంట మరింత టేస్టీ గా వుంటుంది. కాఫీ ఫిల్టర్ లో పంచదార వేసి ఆ తరువాత కాఫీ పొడి, వేడి నీళ్ళు పోస్తే కాఫీ టేస్టీ గా వుంటుందట. ఇలా ట్రై చేసి వుందం కదా. ఇంకోటి కోడి గుడ్డు సొనలో కొన్ని పాలు లేదా టేబుల్ స్పూన్ నీళ్ళు కలిపి ఆమ్లెట్ వేస్తే రుచిగా వుంటుంది, చూసేందుకు కూడా బావుంటుంది. కాలీఫ్లవర్ వండేప్పుడు ఓ టేబుల్ స్పూన్ పాలు పోస్తే కాలీఫ్లవర్ రంగు మారదు. బెండ కాయలు వేయించేప్పుడు పెరుగు ఓ స్పూన్ కలిపితే వేపుడు కరకరలాడుతుంది. ముక్కలు అతుక్కోవు. మిక్సీ లో ఇడ్లీ పిండి రుబ్బితే ఇడ్లీలు గట్టిగా వస్తుంటే ఇడ్లీ రవ్వ వేడి నీళ్ళలో నాననివ్వాలి. వెల్లుల్లి, అల్లo పేస్టు ఎక్కువగా మిగిలిపోతే అందులో కాస్త వేడి నూనె పోసి కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. పకోడీ పిండి కలిపాక అందులో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే పకోడీలు కరకరలాడతాయి.

    ఈ టిప్స్ తో వంట అదుర్స్

    మనకి వంట బాగా వచ్చినా సరే అనుభవం ఉన్నవాళ్ళు చెప్పిన కిటుకులు పాటిస్తే వండే వంట మరింత టేస్టీ గా వుంటుంది. కాఫీ ఫిల్టర్ లో పంచదార…

  • ఈ రోజుల్లో మంచి జామ పళ్ళు వస్తున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జామ పండ్ల అన్ని వయసులవాళ్ళు షుగర్ కంప్లయింట్ వున్నవాళ్లు కూడా హాయిగా తినచ్చు. వీటిలో గ్లేసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి. A ,C విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ,కెరోటిన్లు ,జామపండులో అధికం. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వృధాప్య ఛాయల్ని దూరం చేస్తాయి. ప్రతిరోజు ఒక పండు తినచ్చు. జామ పండులో వుండే సోడియం ,పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో వుండే విటమిన్ A కారణంగా కంటి చూపు బావుంటుంది. ఫోలిక్ యాసిడ్ ,విటమిన్ B9 అధికంగా ఉండటం వల్ల గర్భిణులు తింటే గర్భ శిశువు ఎదుగుదల బావుంటుంది. జామలో వుండే మెగ్నేషియం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు నొప్పులు బాధించవు.

    పోషకాలున్న జామపండ్లు

    ఈ రోజుల్లో మంచి జామ పళ్ళు వస్తున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జామ పండ్ల అన్ని వయసులవాళ్ళు షుగర్ కంప్లయింట్  వున్నవాళ్లు కూడా హాయిగా…

  • గుమ్మడి కాయలతో తియ్యని కూర,పులుసు సూప్ చేస్తుంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు ఇస్తుంది. గుమ్మడి గుండె కి ఎంతో మేలు చేస్తుంది. దినిలో పీచు పదార్దాలు,విటమిన్ సి గుండె కు రక్త సరఫరా సవ్యంగా జరిగెలా చూస్తుంది. అధిక రక్తపోటు నివారిస్తుంది. గుమ్మడి కాయలో ఉండే విటమిన్ ఇ,బిటాకెరోటిన్లు కంటికి ఏంతొ మేలు చేస్తుంది. చదువుకునే పిల్లలకు గుమ్మడి తో చేసిన వంటలు తినిపించాలి. ఇందులో ఉండే ఐరన్ సంతాన సాఫల్యత ను పెంచుతుంది. వ్యాది నిరోధక శక్తి పెంచి ఇన్ ఫెక్షన్లను దూరం చేస్తుంది. నిద్ర లేమి తో బాధ పడే వారు గుమ్మడి గిజలు తినవచ్చు.

    గుమ్మడి తో గుండె కెంతో మేలు….

    గుమ్మడి కాయలతో తియ్యని కూర,పులుసు సూప్ చేస్తుంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు ఇస్తుంది. గుమ్మడి గుండె కి ఎంతో మేలు చేస్తుంది.…

  • అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతాం అనుకుంటాం గాని బరువు పెరిగేది కార్భోహైడ్రెట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పెరుకుపోయే క్యాలరీల వల్ల శక్తినిచ్చేది పిండిపదార్థాలే.మెదడు,కండరాలు,కణాలు ఆరోగ్యం బావుండాలంటే అది పిండిపదార్థాల వల్లే సాధ్యం. చైనా,జపాన్,ఫిలిప్పీన్స్ దేశాల ప్రధాన ఆహరం అన్నమే. కాని ప్రపంచ సూచీ ప్రకారం వారిలో ఉబక కాయులు తక్కువే. అన్నంలో ఉండే గంజి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నిరోదిస్తుంది. పాలీష్ పట్టని బియ్యం లో పీచు పదార్దములు అధికంగా ఉండి మలబద్దకాన్ని నిరోదిస్తాయి. వంద గ్రాముల అన్నంలో 345 క్యాలరీలు ,78.2 గ్రాముల పిండిపదర్ధాలు, 6.5 గ్రాముల మాంస కృత్తులు, 0.2 పీచు ,0.5 పాస్పరస్ 160 గ్రాముల ఐరన్ 0.7 10 క్యాల్షియం ఉంటాయి. ఈ ప్రపంచంలో బలవర్ధకమైన ఆహారం అన్నమే.

    ఆరోగ్యానికి అన్నమే మిన్న…

    అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతాం అనుకుంటాం గాని బరువు పెరిగేది కార్భోహైడ్రెట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పెరుకుపోయే క్యాలరీల వల్ల శక్తినిచ్చేది…

  • చిన్న వయసు నుంచే ఆహారం విషయంలో కాస్త అప్రమత్తత తో ఉంటే గుండెకు పదిలంగా కాపాడుకోవచ్చు. చేపలు. ఓట్ మీల్ .స్ట్రా బెర్రీలు ,నిమ్మజాతి పండ్లు ,సొయా ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుండే చేపలు వారానికి రెండు సార్లయినా తీసుకోవాలి. ఓట్ మీల్ ఉదయపు అల్పాహారంగా తీసుకుంటే గుండె పనితీరు మెరుగవుతుంది. స్ట్రా బెర్రీ రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తాయి. సి విటమిన్ పుష్కలంగా వుంటే సిట్రస్ పండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్లు ఖనిజాలు అధికంగా వుండే సొయా హుద్రోగాలను దూరంగా ఉంచుతోంది.

    ఈ ఐదు గుండెకు మంచివి

    చిన్న వయసు నుంచే  ఆహారం విషయంలో కాస్త అప్రమత్తత తో ఉంటే గుండెకు పదిలంగా కాపాడుకోవచ్చు. చేపలు. ఓట్ మీల్ .స్ట్రా బెర్రీలు ,నిమ్మజాతి పండ్లు ,సొయా …

  • గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు. ఇవన్నీ వింటూపోతే చివరకు తినేందుకు ఏవీ మిగలవు. గర్భం ధరించాక ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి. అలాగే మీట్ ,చేపలు ,సాల్ట్ , స్పైసెస్ కూడా తినకూడదంటారు. వేటికీ శాస్త్రీయమైన ఆధారాలు లేవు కనుక బాక్టీరియా ఎక్కువగా చేరని పదార్ధాలు అన్నీ తినవచ్చు. తాజా పండ్లు ఆహారం నుంచి తొలగించవద్దు. డాక్టర్ సలహా తీసుకుని అదీ ఎందుకంటే శరీర తత్త్వం గురించి వాళ్లకు తెలుస్తుంది కనుక అటు తర్వాత మంచి పోషకాలున్న ఆహారం తీసుకుంటే చాలు.

    తాజా పండ్లు తినకపోవటమే నష్టం

    గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు. ఇవన్నీ  వింటూపోతే చివరకు తినేందుకు ఏవీ మిగలవు. గర్భం ధరించాక ఆరోగ్యవంతమైన ఆహారం…

  • టేబుల్‌ పైన ఉద్యానవనం

    టేబుల్‌ పైన పూలబొకే  పెట్టుకున్నట్లు ఒక ఉద్యానవనం  సృష్టంచి ఇస్తున్న గార్డెనింగ్‌ నిపుణులు  గాజు చెక్క ప్లాస్టిక్‌ ,వెనుక పాలరాయి మనకు నచ్చిన  కుండీల్లో ఎడారి అందాలు…

  • ధన త్రయోదశి వెళ్తూనే దీపావళి వచ్చేసింది. ఇంట్లో పిండివంటల సందడి వుంటుంది. పైగా గిఫ్ట్ లుగా స్వీట్స్ వస్తాయి. పండగ కోసం స్వీట్లు చేసేటప్పుడు మర్చిపోవద్దు. చక్కెర తో కాకుండా బెల్లంతో స్వీట్లు తయారు చేసుకోండి గోధుమపిండి పాలు బెల్లంతో చేసిన పన్నీర్ మిఠాయి లాంటి శ్వీట్లు మంచివే. ఒకసారి వాడిన నూనెలో మళ్ళీ శ్వీట్లను వేయించవద్దు. బయట పార్టీలకు వెళ్ళినప్పుడు రోజూ అలవాటుగా తినే తిండి తినే బయలుదేరాలి. ఆకలితో వుంటే ఏ స్వీట్లో వేపుల్లో ఎక్కువ తినేసే ప్రమాదం వుంది. పండగ వేళలో ఎక్కువ క్యాలరీల తీసుకుంటారు కనుక నీళ్లు ఎక్కువ తాగాలి. తిండి వేళలో తేడా వస్తుంది. నీళ్లు మరిన్ని తాగక పొతే డీహైడ్రేషన్ వచ్చే అవకాశం వుంది. పండగైనా మామూలు రోజులైనా ఎంత ఇష్టపడ్డా పరిమితంగా తినాలనే రూల్ దాటాకపోతే డైటింగ్ గురించిన ఆలోచనే వద్దు.

    పండగ స్వీట్స్ జాగ్రత్త

    ధన త్రయోదశి వెళ్తూనే దీపావళి వచ్చేసింది. ఇంట్లో పిండివంటల సందడి వుంటుంది. పైగా గిఫ్ట్ లుగా స్వీట్స్ వస్తాయి. పండగ కోసం స్వీట్లు చేసేటప్పుడు మర్చిపోవద్దు. చక్కెర…