• సీజన్ తో టైమ్ తో సంబంధం లేకుండా పల్లీలు ఎప్పుడైనా తిన బుద్దేసే స్నాక్ లాంటివి. కానీ పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదనే వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుందనే అనుమానాలు చాలా మందికి వుంటుంది. ఇవి కేవలం అపోహేనని ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్నారు పరిశోధనలు. మధ్యాహ్నం భోజనంలో పాటు కొన్నిపల్లీలు నేరుగా కానీ షేక్ రూపంలో గానీ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా వుందని పరిశోధనల్లో వెల్లడైంది. పల్లిలు తింటే ట్రైగ్లిజరైడ్స్ తగ్గిన విషయం తెలిసిందట మాములుగా భోజనం అనంతరం రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో వీటి స్థాయి పెరిగితే గుండె సంబందిత అనారోగ్యాలు వస్తాయట. ఈ పల్లిల వల్ల ఈ సమస్య ఉండదని, హాయిగా వస్తాయిట. ఈ పల్లిల వల్ల ఈ సమస్య ఉండదని, హాయిగా పూటకో గుప్పెడు తినండి అంటున్నారు పరిశోధకులు.

    పల్లీలు తింటే గుండెకి సమస్యే రాదు

    సీజన్ తో టైమ్ తో సంబంధం లేకుండా పల్లీలు ఎప్పుడైనా తిన బుద్దేసే స్నాక్ లాంటివి. కానీ పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదనే వాటిని తీసుకుంటే కొవ్వు…

  • రాగి వంటి తృణ ధాన్యానికి వందల కోట్ల రూపాయిలు మార్కెట్ ఉందిట. ఓట్ మీల్ వంటి విదేశీ హెల్త్ ఫుడ్ తో పోలిస్తే మన ప్రాంతంలో పాండే రాగులు చాలా చవక కూడా. పాలిష్ చేసిన బియ్యం, గోధుమల వల్ల ఒరిగింది ఏమి లేదని తేలాక అందరి దృష్టి రగుల్లాంటి తృణ ధాన్యాల వైపు మళ్ళింది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పళ్ళెంలో ముందుగా చోటు కల్పించ వలసింది రాగులకే అంటారు న్యుట్రీషనిష్టులు. రాగుల్లోని ట్రెపోఫాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. రాగుల్లో కాల్షియం ఎక్కువ కనుక ఎదిగే పిల్లలకు రాగులు ఎదో ఒక రూపంలో ఇవ్వాలి. గర్భిణులకు ఇది మంచిదే మహానగరాల్లో రాగులకు ఆదరణ పెరుగుతుంది. స్టాక్ రెస్టారెంట్స్ లో రాగి ముద్ద, రాగి పుట్టు, రాగి దోస, రాగి కుకీస్, రాగి కేకు కనిపిస్తాయి. రెడీ టు కుక్ రాగి దోస, రెడీ టు కుక్ రాగి రవ్వ ఇడ్లి మిక్స్ లు అందుబాటులో కొచ్చాయి. బ్రిటానియా రాగి బిస్కెట్ లు వచ్చాయి. గత ఎడేళ్ళల్లో రాగుల ధరలు 270 శాతం పెరిగాయట. ఇంత మంచి రాగులను ఆహారం లో చేర్చుకుని హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా! పోషకాహర లోపం సరిదిద్దేది రాగి ఒక్కటేనని అంతర్జాతీయ ఆహార సంస్థ తెలుపుతుంది మరి!

    ఈ రారజుకు మీ ఇంట్లో చోటుందా?

    రాగి వంటి తృణ ధాన్యానికి వందల కోట్ల రూపాయిలు మార్కెట్ ఉందిట. ఓట్ మీల్ వంటి విదేశీ హెల్త్ ఫుడ్ తో పోలిస్తే మన ప్రాంతంలో పాండే…

  • కంటికి నచ్చేలా ఉంటేనే మనసు మెచ్చుతుంది. అలా తిన్నాడే శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అనేది పాత సామెత లాంటిదే అయినా ఇప్పుడు అదే కరెక్ట్ అంటారు షెఫ్స్. తాజా కాయగూరలు, పండ్ల తోనే రకరకాల డిజర్ట్స్, సలాడ్స్ చేసే షెఫ్స్ నిండైన రంగుల్లో ఉండే కాయగూరలతో కనువిందుగా చేసే ఆహార పదార్ధాల్లో ఎన్నో ఆంతోసైనిన్లు, ఫైటో న్యూట్రియంట్లు అన్ని కలిపి యాంటి ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయని చెపుతున్నారు. పండ్లు, డ్రై ఫ్రూట్లు, తేనే కలిపి అందమైన అమరికతో స్టఫ్ చేసినవి అందమైన జార్స్ లో పారదర్శకం గా కనిపించేలా చేసి సర్వ్ చేస్తారు. లేయరింగ్ ఫ్లేవర్ పద్ధతి ఇదే. వెన్న లేదా నూనెలో వేయించిన ఉల్లిపాయలు, తాజా క్యాబేజీ ఆకులూ, కొత్తిమీర, పుదీనా, మిరియాల పొడి, జాజికాయ పొడి అన్నీ లేయర్లుగా అలంకరిస్తారు. వంటకాన్ని బట్టి నిమ్మరసం, వెనిగర్లు వాడతారు. సంప్రదాయ వంటలు కూడా కనువిందుగా అలంకరించడం ఈ లేయరింగ్ ఫ్లేవర్ పద్ధతి. ఉదాహరణకు పుదినా రైస్, టొమాటో రైస్, జీరా రైస్ కలిపి మూడు రంగుల లేయర్ లాగా అమర్చి వాటికి మిగతా డ్రెస్సింగ్ చేసి వడ్డిస్తే చూసేందుకు, తినేందుకు అద్భుతమే!

    ఆహారాన్ని అలంకరించినా ఆరోగ్యమే

    కంటికి నచ్చేలా ఉంటేనే మనసు మెచ్చుతుంది. అలా తిన్నాడే శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అనేది పాత సామెత లాంటిదే అయినా ఇప్పుడు అదే కరెక్ట్ అంటారు షెఫ్స్.…

  • మీనియేచర్ క్యాబేజీల్లాగా కనిపించే బ్రన్సెల్ స్ప్రౌట్లలో విటమైన్లు, ఖనిజాలు, పీచూ, యాంటీ ఆక్సిడెంట్లుపుష్కలంగా వుంటాయి. వీటిని బెంగుళూరు క్యాబేజీ అని కూడా పిలుస్తారు. ఈ బుల్లి క్యాబేజీల్లో గ్లైనెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వంద గ్రాముల బెస్సెల్ స్ప్రౌత్స్ అద్భుతమైన యాంటిఆక్సిడెంట్ల నిల్వలు కూడా. వీటిల్లోని డై ఇండాలిన్- మిథెల్ అనే పదార్ధం రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఎన్నో విటమిన్స్ తో నిండి వున్న ఈ బుల్లి క్యాబేజీలు చర్మం, కంటి సమస్యలు రానివ్వవు. జీవక్రియకు తోడ్పడే నియాసిన్ పైరిడాక్సిన్ ధైమిన్, ఫాంటో ధెనిక్ ఆమ్లం వంటి మంచి విటమిన్లు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇవన్నీ సంమృద్దికర నిల్వలున్న ఈ బుల్లి క్యాబేజీ ఇప్పుడు ఇక్కడ దొరుకుతున్నాయి. వీటిని కేరట్స్ ని ఆలివ్ ఆయిల్, ఉప్పు, ఇంకా మిగితా కొత్తిమీర, కరివేపాకు వంటివి వేసవిలో మంచి అల్పాహారం చేసుకోవచ్చు. ఓ సారి అవన్నీ శ్రద్దగా చూసి ఈ క్యాబేజీలు వెతుక్కుని కొనుక్కుని ఇందులో వుండే పోషకాలతో ఆరోగ్యంగా వుండండి.

    గోలీలంత క్యాబేజీలలో బోలెడంత శక్తి

    మీనియేచర్ క్యాబేజీల్లాగా కనిపించే బ్రన్సెల్ స్ప్రౌట్లలో విటమైన్లు, ఖనిజాలు, పీచూ, యాంటీ ఆక్సిడెంట్లుపుష్కలంగా వుంటాయి. వీటిని బెంగుళూరు క్యాబేజీ అని కూడా పిలుస్తారు.  ఈ బుల్లి క్యాబేజీల్లో…

  • గతంలో ఎప్పుడూ భోజనం చేయడం అంటే కింద కుర్చుని అరిటాకులో వేడి వేడి గా అన్నీ వడ్డిస్తే తినడమే. తర్వాత నెమ్మదిగా డైనింగ్ టేబుల్స్ వెండి స్టీల్ కంచాలోచ్చి అరిటాకు పక్కన పారేసారు కానీ ఆరోగ్య రిత్యా అరిటాకు భోజనం ఎంతో మంచిదంటారు. అరిటాకులో వుండే మెడికల్ వాల్యూస్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయిట. పచ్చని అరిటాకులో భోజనం చేస్తే ఆహారం త్వరగా జీర్ణం అవ్వుతుంది. అలాగే మోదుగ ఆకుతో కుట్టిన విస్తరి లో భోజనం చేసినా పిల్లల తెలివితేటలు వృద్ది అయ్యే అవకాశం వుంది. అరిటాకులో భోజనం కడుపులో క్రిములు చంపేస్తుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పంపే శక్తి అరిటాకులో వుందని ఆయుర్వేద వైద్యులు చెపుతారు. అన్నం వేడిగా వందగానే అరిటాకులో వడ్డిస్తే అరిటాకులో వుండే ఔషద విలువలు భోజనంలో కలుస్తాయి. రక్తం శుద్ధి అవ్వుతుంది. శరీరంలో కొత్త శక్తి వస్తుందని చెపుతున్నారు. చర్మ కాంతి మెరుగు పడుతుందని వైద్యుల సూచన. కొన్ని హోటల్స్ లో సర్వ్ చేసినట్లు ఇంట్లో కూడా ఆకు కట్ చేసి భోజనం పళ్ళెం లో వేసుకున్నా మంచిదే.

    అరిటాకు భోజనం చాలా మంచిది

    గతంలో ఎప్పుడూ భోజనం చేయడం అంటే కింద కుర్చుని అరిటాకులో వేడి వేడి గా అన్నీ వడ్డిస్తే తినడమే. తర్వాత నెమ్మదిగా డైనింగ్ టేబుల్స్ వెండి స్టీల్…

  • వేసవి తాపం తీర్చడం మాత్రమే పుచ్చకాయ పని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పుచ్చకాయలో బహుళ ప్రయోజనాలున్నాయి. దాహం తీర్చడంలో, బరువు తగ్గించడంలో, రక్త ప్రసరణ మెరుగు పరచడంలో, రక్త పోటు తగ్గించడంలో సహకరిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన విశేషం ఇది సహజమైన వయాగ్రా. పుచ్చకాయలోని సిట్రల్లినో ఎమినో యాసిడ్ బ్లడ్ ఫ్లోను మెరుగు పరుస్తుంది. సిట్రల్లినోను మన శరీరం ఉపయోగించుకుని ఆర్గినైన్ అనే మరో ఎమినో యాసిడ్ రూపొందించటానికి పుచ్చకాయ సహకరిస్తుంది. దీనికి వయగ్రా ప్రభావం వుంది. రక్త నాళాలను రిలాక్స్ చేస్తుంది. వయాగ్రాకు ఇదే ప్రాధమిక స్వభావం వుంటుంది. 90 శాతం నీరుండే ఈ జ్యూసీ పండులో ఎనిమిది శాతం చక్కెర వుంటుంది. విటమిన్-c అధికంగా వుంటుంది. ఒక్క సెర్వింగ్ కు 71 క్యాలరీలు మాత్రం ఉంటాయి.

    పుచ్చకాయలో ఈ సీక్రెట్ వుంది

    వేసవి తాపం తీర్చడం మాత్రమే పుచ్చకాయ పని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. పుచ్చకాయలో బహుళ ప్రయోజనాలున్నాయి. దాహం తీర్చడంలో, బరువు తగ్గించడంలో, రక్త ప్రసరణ మెరుగు పరచడంలో,…

  • నిమ్మకాయలు వాడుతూనే వున్నాం. ఎప్పుడూ కోశాక ఒక్క అరముక్క మిగిలిపోతూ వుంటుంది. దాన్ని అలా వదిలేయకుండా బూట్లలో పడేయండి. దుర్వాసన రాకుండా వుంటుంది. బీట్ రూట్, స్ట్రాబెర్రీలు, నేరేడు వంటివి చేతులకి మరకలు అంటే లా చేస్తాయి. ఈ మరకలు పోయేందుకు నిమ్మచాక్క రుద్దాలి. ఒక బంగాళ దుంప పేస్టులా చేసి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం సహజంగా బ్లీచ్ అవుతుంది. టేబుల్ స్పూన్ పసుపు, కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ పాదాలకు రాసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు పగుళ్ళు తగ్గుతాయి. ఆర చెక్క నిమ్మరసం పెరుగు మొఖానికి రాసి 20 నిమిషాలు ఆగి కడిగేస్తే మొటిమలు రాకుండా ఉంటాయి. ఎక్స్ ట్రావర్జిన్ ఆయిల్. ఈ తరహా ఆలివ్ ఆయిల్ లో వున్న మోనో అసాచ్యురేటెడ్ కొవ్వులో హానికరమైన కొలెస్ట్రోల్ తగ్గిస్తాయి. రైస్ బ్రాడ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ కూడా మంచివే.

    వాళ్ళ ఆరోగ్యానికి మూలం ఇదే

    నిమ్మకాయలు వాడుతూనే వున్నాం. ఎప్పుడూ కోశాక ఒక్క అరముక్క మిగిలిపోతూ వుంటుంది. దాన్ని అలా వదిలేయకుండా బూట్లలో పడేయండి. దుర్వాసన రాకుండా వుంటుంది. బీట్ రూట్, స్ట్రాబెర్రీలు,…

  • ఇప్పుడు రోడ్లన్నీ మామిడి పండ్ల రసాలతో, నిండిపోయి ఉంటాయి ఎన్నో రకాలు. ఏది కావాలి. అల్ఫోంసో అని పిలిచే మామిడి రుచులు అద్భుతం. ఇది మహారాష్ట్రాలోని రత్నగిరి ప్రాంతానిది. ఆమ్రపాలి అనే ఎరుపు రంగు పండు ఉత్తర్ ప్రదేశ్ ది. బంగిన పల్లి ఆంధ్రప్రదేశ్ సైజు, తీపిలో దీన్ని దాటే పాండే లేదు. చిన్న సైజులో వుండే చేసా ముల్సన్ ప్రాంతానిది. వాసన రుచి కలిగిన రసం పండు ఇది. టెంకె చిన్నదిగా వుండే దుస్సేహ్రీ మంచి రంగు, వాసనతో పీచు తక్కువగా వుంటుంది. పంచదార వంటి తియ్యదనంతో పలుచని పై చర్మం వున్న హిమసాగర్ బెంగాలీ మామిడి. నీలం అనే హైదరాబాద్ మామిడి. మల్లోవా అనే తమిళనాడు పండు పసుపు రంగు పీచుతో కండ బావుంటుంది. తోతాపూరి అనేది చిలక ముక్కు మామిడి ఇది ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో దొరుకుతుంది. దీన్నే చిత్తూరు మామిడిలో ప్రతేకం. ఈ రసం పండు రుచి అద్భుతం. ఇంకా కొత్త కొత్త వెరైటీస్ సృష్టిస్తూనే ఉన్నారు.

    ఎన్ని రకాలా? దేని రుచి దానిదే

    ఇప్పుడు రోడ్లన్నీ మామిడి పండ్ల రసాలతో, నిండిపోయి ఉంటాయి ఎన్నో రకాలు. ఏది కావాలి. అల్ఫోంసో అని పిలిచే మామిడి రుచులు అద్భుతం. ఇది మహారాష్ట్రాలోని రత్నగిరి…

  • వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత మాత్రం కోల్పోతాయి అయితే వండటం వల్ల బీటాకెరోటిన్, లికోపెన్ వంటి కాన్సర్ తో పోరాడగల వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండాలంటే వండే సమయాన్ని తగ్గించాలి. మైక్రోవేవ్ లో కూరగాయలు వుడికే వాసన వచ్చేదాకా అంటే ఏడు నుంచి పది నిముషాలు. క్యారెట్స్, బంగాళ దుంపలు వంటివి ఐడు నిముషాలు ఉడికిస్తే సరిపోతుంది. కూరగాయల్ని పల్చని స్లైసులుగా కట్ చేస్తే త్వరగా వుడుకుతాయి. ముక్కలు వుడికించే ముందే బాగా వేడి చేస్తే త్వరగా కూర ముక్కలు వేడిగా అయిపోతాయి. ఎక్కువ పోషకాలు పోవక్కరలేదు. తరచూ కలియబెడుతూ వుండాలి. ఒకటి రెండు నిమిషాలకు రుచి చూడాలి. ప్యాన్ అడుగున ఏదైనా లిక్విడ్ మిగిలిపోతే మళ్ళి కలియబెట్టాలి. కూరగాయలు ఉడికించిన నీటిని ఎప్పుడు వృధా చేయకూడదని. ఆ నీటితో చారు వంటివి చేసుకున్న ప్రయోజనమే.

    వండే సమయం తగ్గిస్తే చాలు

    వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత…

  • చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే రసాయినాలు కలుపుతారు. ఇందులో చక్కెర ఎక్కువే. అలా దాహం తీరేలా చలువ చేసేలా కావాలంటే ఫ్రెష్ గా కొట్టిన కొబ్బరి నీళ్ళు తాగచ్చు. ఇంట్లో అయితే ఉప్పు జీలకర్ర వేసిన పచ్చి మామిడి రసం కుడా వాడదెబ్బకు ప్రత్యామ్నాయమె అవ్వుతుంది. ఎక్కువ చమట పోస్తుంది కనుక చమట తో పాటు కీలకమైన కొన్ని పోషకాలు పోతాయి. సోడియం పొటాషియం వంటివి శరీరం కోల్పోతుంది. వీటి పని శరీరంలో జీవక్రియలు తిన్నగా జరిగేలా చూడటం. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకుంటే నిస్సత్తువ లేకుండా వుంటుంది. అన్నం, చపాతిలు తేలికగా అరిగే ఆకుకూరలు, తాజాగా వుండే మాంసాహార పదార్ధాలు మంచివే. పళ్ళ రసం, చెరుకు రసం ఇవి కూడా తీయగానే తగేయడం ఉత్తమం.

    ఎండల్లో వాడిపోకుండా ఇవే రక్షణ

    చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే…

  • కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ ప్రియులకు కూడా అద్భుతం అనిపిస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ తినరు. పిల్లలు తింటే తిడతారు. ఇవన్నీ అర్ధం లేని భయాలు అని కొట్టి పరేస్తుందో రిపోర్ట్. ఎంతో మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కేవలం ఐస్ క్రీమ్ మాత్రం ఇచ్చారట. ఆ అంతమందికి అద్భుతమైన జ్ఞాపక శక్తి, మెదడు తెలివి తేటలు పెరిగిపోయాయట. అంతేనా కఠినమైన ఫజిల్స్ ఇట్టే పూర్తి చేసారంటున్నారు. పరిశోధకులు. ఇది కొట్టి పారేసే విషయం మాత్రం కాదు. ఎందుకంటే అసలే ఎండలు. అందులో ఐస్ క్రీమ్ ఈ రిపోర్టును ఏదయితే అది అయ్యిందిలే అని నమ్మి ఐస్ క్రీం హాయిగా తినేయమని చెప్పడం బెస్ట్ అనిపిస్తుంది. నోట: పళ్ళ డాక్టర్ ని ఓసారి కలసి మాట్లాడి మరీ తినండి.

    ఐస్ క్రీం తో ఎంతో చురుకుతనం

    కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో…

  • ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత మంది ఎప్పుడూ చాలా సన్నగా ఓపిక లేనట్లు ఉంటారు. బరువు పెరగాలి అనుకుంటారు. అయితే వాళ్ళు తినే పదార్ధాలు ఎంపిక చేసుకోవాలి. బరువు పెరగాలి అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా తీసుకోవాలి. పండ్లు, నట్స్, బీన్స్, అనేక కురగాయాల్లో మంసాల్లో ఇవి లభిస్తాయి. తగినంత ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అవసరం. చేపలు, అవిసెగింజలు చాలా మంచివి. తప్పకుండా తినాలి కుడా. కాల్షియం కావాలి. అంటే ఓ అరలీటర్ పాలు లేదా రెండు కప్పుల పెరుగు తీసుకోవాలి. క్యాలరీల మోతాదు ఎక్కువ వుంటే బరువు పెరగడం సాధ్యం అవుతుంది. ఆహారం తీసుకుంటేనే శరీరం పుష్టిగా ఆరోగ్యవంతంగా తయ్యారవ్వుటుంది. ఈ తీసుకునే ఆహారం వల్ల చర్మం మెరుపు వస్తుంది. వార్దక్య భయాలు కుడా దూరంగా పోతాయి.

    బరువు పెరగాలి అనుకుంటే

    ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత…

  • తాజా పండ్ల రసాలు అలసిన శరీరం సేద తీరడానికి కొత్త శక్తిని ఇచ్చేందుకు పనికి వస్తాయి. అవి పండ్లే కానక్కరలేదు. కాయిగురల రసాల్లోనూ ఆ శక్తే వుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువే వుంది. మనిషికి ఆరోగ్యానిచ్చే ఎన్నో పోషకాలు విటమిన్లు పుష్కలంగా వున్న క్యారెట్లును ముక్కలుగా తినడమే కాదు జ్యూస్ గానూ బావుంటుంది. కప్పు క్యారెట్ రసంలో 94 కాలరీల శక్తి వుంటుంది. ప్రకృతి సిద్ధమైన చక్కెర లభిస్తుంది. రొజువారీ అవసరమైన సి-విటమిన్ లో నాలుగోవ వంతు ఇ- విటమిన్ లో సగం లభిస్తాయి. క్యా రెట్ రసంలో బి-6 విటమిన్ లో 39 శతం ధేయామిన్ లో 20 శాతం రిబో ఫ్లోవిన్ లో 12 శాతం వుంటుంది. నరాలు, ఎముకల వ్యవస్థ ఆరోగ్యంగా వుంటుంది. కండరాళ్ళ సంక్షోబానికి పనికి వచ్చే మెగ్నీషియమ్ లో 10వ వంతు క్యారేట్ రసం ద్వారా లభిస్తుంది. శరీరం మరింతగా విటమిన్లు ఖనిజాలను పోషణం చేసుకో గలుగుతుంది. శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. టమాటాలు, అనాసలు, బత్తాయిలో, కమలాలు, ఎర్ర ద్రాక్షలు, నిమ్మకాయలు వంటివి శరీరానికి అవసరమైన సి-విటమిన్ ను అధిక స్తాయిలో అందిస్తాయి.

    తినడం కంటే జ్యూస్ లా తాగడం బెస్ట్

    తాజా పండ్ల రసాలు అలసిన శరీరం సేద తీరడానికి కొత్త శక్తిని ఇచ్చేందుకు పనికి వస్తాయి. అవి పండ్లే కానక్కరలేదు. కాయిగురల రసాల్లోనూ ఆ శక్తే వుంది.…

  • ఉసిరిని ఆమ్లా, ధాత్రీఫలం అని పిలుస్తారు. ఇది గబగబా కొరికి తినేసే పండు కాదు. పులుపుగా వుంటుంది కదా, కానీ కమలా తో పోలిస్తే విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. ఇతర పండ్ల కన్నా యంటి ఆక్సిడెంట్లు ఎక్కువే అన్ని అవయవాలు సమన్మయం తో పని చేసేలా చేస్తుంది. వేసవిలో ఈ ఉసిరి జ్యూస్ చాలా మంచిది. ఎన్నో పోషకాలున్న ప్రక్రుతి ప్రసాదం ఉసిరిని మురబ్బాల గానూ, నిల్వ పచ్చడిలాగో ఎలా తిన్నా పర్వాలేదు. వేరు నుంచి చిగురు వరకు ప్రతీది ఔషదమే. ఈ ఉసిరి పొడి క్యాండీలు రసం రూపంలో విక్రయిస్తున్నారు. ఇందులో వుండే క్రోమియం ఇవ్వాల్సిన స్రావాల్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా రక్తంలో చెక్కర నిల్వల్ని తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక భావాల్ని, ఔషద గుణాన్ని పోషకాలను ఏకకాలంలో అందరికి ఈ ఉసిరిని రసం రూపంలో దొరికినా రోజురెండు స్పూన్లు తాగడం మంచిదే.

    పోషకఫలం ఉసిరి

    ఉసిరిని ఆమ్లా, ధాత్రీఫలం అని పిలుస్తారు. ఇది గబగబా కొరికి తినేసే పండు కాదు. పులుపుగా వుంటుంది కదా, కానీ కమలా తో పోలిస్తే విటమిన్-సి 20…

  • చూసేందుకు చక్కగా మంచి రంగుతో కనబడేకమలాపండు రుచి లోనే కాదు. పోషకాల్లోనూ తిరుగులేనిది ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రాంతంలో ఒక్క రుచితో వుంటుంది. నెల వాతావరణం ఈ రుచిని ప్రభావితం చేస్తాయి. ఎ,సి,బి విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు పిచు పండుతో పుష్కలంగా దొరుకుతాయి. రాతిరోజు ఒక కమలాపండు వుంటే అల్సర్లు, గుండె సంబందిత వ్యాధులు క్యాన్సర్ లకు దూరంగా ఉండొచ్చు. రక్త పోటు ఎక్కువగా వుంటే ఈ పండ్లు తినడం వల్ల నియంత్రణలో వుంటుంది. విటమిన్-సి ఇన్ ఫెక్షన్ ల పై పోరాడటంలో సహకరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం నిగారింపుతో వుంటుంది. రుమటాయిడ్ అర్ధరైటిస్ రాకుండా కాపాడుతుంది. మెదడుకు చురుదనం, జ్ఞాపకశక్తికి పదును కలుగుతాయి. అమ్మాయిల టిఫెన్ బాక్స్ లో తప్పని సరిగా తీసుకుపోగలిగితే ఆహారం ఇది. చర్మసౌందర్యం కోసమైన తప్పాక తిని తీరాలి.

    రోజుకొక్కటి చాలు

    https://scamquestra.com/sozdateli/9-stanislav-kravcov-39.html

  • తాటి గెలల నుంచి వూరే రసాన్ని నీరా అంటారు. మంచి వాసన రంగుతో తియ్యగా వుంటుంది. పులిస్తే కల్లు అంటారు. ఈ నీరా మంచి తాటి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 7686, రెడ్యుసింగ్ చక్కర 1.66, కొవ్వు 0.19, మంసాకృతులు 1.04, కాల్షియం 0.86, ఖనిజాలవనాలు, ఇనుము వంటి పోషక విలువలుంటాయి. స్త్రీల లో, పిల్లల్లో రక్తహీనత తగ్గిస్తుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది. తక్కువ పొటాషియం, ఎక్కువ చక్కర ఉంటాయి. ఔషధాల తయారీ లో వాడుతారు. పటిక బెల్లం, పంచదార మాములు బెల్లం బదులుగా ఈ తాటిబెల్లం చాక్లెట్ల నుంచి వివిధ తీపి పదార్ధాల తయ్యారీలో వాడుకోవచ్చు. పంచదారకు బదులు ఈ తాటి బెల్లం పొడిని వాడుకోవచ్చు.

    ఇదెంతో ఆరోగ్యం, ఉపయోగం

    తాటి గెలల నుంచి వూరే రసాన్ని నీరా అంటారు. మంచి వాసన రంగుతో తియ్యగా వుంటుంది. పులిస్తే కల్లు అంటారు. ఈ నీరా మంచి తాటి బెల్లం…

  • అల్లం ముక్కలు, జీడి పప్పు, నెయ్యి కలిపి ఉప్మా వందేసి, నిమిషాల పైన అతిధులకు వడ్డించి, ఇలా తిరిగే సరికి అల్లం పొడితో అన్ని రకాల వైద్యులు చేయండి అని లిస్ట్ వేస్తె ఎలా వుంటుంది. వెల్లుల్లి అల్లం దంచి వంకాయ కూర వండాలా? ఎండబెట్టి పొడి చేసి ఆ చరణంతో వంటింటి వైద్యం చేయాలి అంటే ముందు తెలుసుకోవాలి. అల్లం పొడి రోజుకు మూడుగ్రాములు తింటే చెడు కోలెస్ట్రోల్ తగ్గిపోతుంది. బరువు తగ్గేందుకు ఉపయోగ పడుతుంది. ఇందులో జంజిరాల్, బీటాకెరోటిన్, కాపైస్సిన్, కెఫీక్ ఆమ్లం, కురుక్యుమిన్, శాలిసిలేట్, తదితర యాంటి ఇన్ ఫ్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా వుండటం వల్ల అల్లం కండరాల్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. 60 దాటిన మహిళలు రోజు కాస్త అల్లం రసం తీసుకుంటే జ్ఞాపక శక్తి అధికం అవుతుందని జార్జియా నిపుణులు చెపుతున్నారు. చల్లని వాతావరణంలో అల్లం టీ శారీరక ఉష్ణోగ్రతను పెంచుతుంది. అల్లం పొడి వరుసగా మూడు రోజుల పాటు ఇస్తే నొప్పి తగ్గిపోయినట్లు తేలింది. అల్లంలోని జంజిరాల్ వల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా రావని తేలుతుంది.

    కాస్త అల్లంపొడి చాలు

    అల్లం ముక్కలు, జీడి పప్పు, నెయ్యి కలిపి ఉప్మా వందేసి, నిమిషాల పైన అతిధులకు వడ్డించి, ఇలా తిరిగే సరికి అల్లం పొడితో అన్ని రకాల వైద్యులు…

  • మంచి కూరలు, సంబార్లు, పులిహోరలు, దేన్లో అయినా ఉప్పు వేయకుండా ఊహించండి. అస్సలు తిండే వద్దు బాబు ఏవో కంద మూలాలు తిని బతికేయచ్చు అనిపిస్తుంది. మరి డాక్టర్లేమో ఉప్పు అనారోగ్యం, బీ.పి పెరుగుతుంది, పక్షవాతం గుండె పోటు వగైరాలు పరుగెత్తుకుంటూ వచ్చేస్తాయి అంటారు కదా. ఒక అద్భుతమైన రిపోర్టు వచ్చింది. ఉప్పు ఎక్కువ తినడం వల్ల రక్తపోటు లో నమోదయ్యే తగ్గుదల చాలా నామ మాత్రం. ఉప్పు వల్ల రక్త పోటు స్వల్పంగా పెరుగుతుందని మాత్రమే శాస్త్రీయమైన ఆధారాలున్నాయి. కనుక డాక్టర్లు బీ.పి ఎక్కువైతే ఉప్పు తగ్గించమంటారు. అంతే కానీ ఉప్పుతో గుండెపోటు పక్షవాతం ఇలాంటి వేమీ వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఒక రిపోర్టు తేల్చింది. అంచేత మరీ హడలి పోయి చప్పిడి తిండి తో జిహ్వను చంపేసుకోవలసిన పనిలేదు. హాయిగా రుచిగా ఉప్పేసుకొండి అనేసాయి అధ్యాయినాలు. ఇప్పటికిది బెస్ట్ అధ్యాయినం.

    ఉప్పేసుకొండి పర్లేదు

    మంచి కూరలు, సంబార్లు, పులిహోరలు, దేన్లో అయినా ఉప్పు వేయకుండా ఊహించండి. అస్సలు తిండే వద్దు బాబు ఏవో కంద మూలాలు తిని బతికేయచ్చు అనిపిస్తుంది. మరి…

  • ఇప్పటి వరకు ఆలూచిప్స్, అరటికాయ, కాకరకాయ తో సహా ఇంకెన్నో కురగాయల్ని కలుపుకుని నోరు వురిస్తుంటే ఇప్పుడు పండ్ల రుచులతో తాయారవ్వుతున్నాయి ఫ్రూట్ చిప్స్. మామీడి, పైనాపిల్, కివి, బొప్పాయి, పనస ఇలా అన్ని రకాల పండ్లు ఓవెన్ బేక్డ్, ఆయిల్ ఫ్రైడ్, ఎయిర్ ఫ్రైడ్, వాక్యుం ఫ్రైయ్యర్స్ తో తక్కువ నూనె తో ఈ పండ్ల చిప్స్ రంగు రుచి పోగొట్టుకోకుండా బోలుగా కరకరలాడతాయి. పండ్ల తో పాటు అన్ని రకాల కూరగాయలు చిప్స్ కూడా క్యారెట్, బీట్ రూట్, చమదుంప, కీరదోస, వంకాయ,బెండకాయ, దొండకాయ, ముళంగి, చిలకడదుంపతో సహా అన్ని కూరగాయలు చిప్స్ గా తాయారు అవుతున్నాయి. ఇవన్నీ ఏఫ్లేవర్ జతచేయకుండా ఆన్ లైన్ కాయగురాలు, పండ్లు యధాతదంగా ఫ్రైయర్లు పైన అధిక పిఇదనం తో వేగుతాయి కనుక ముక్కల్లోని నీరు ఆవిరై పోయి బోలుగా బావుంటాయి. ఫలానా కూరంటే, ఫలానా పండంటే నాకొద్దనే పిల్లలు ఈ చిప్స్ ను మాత్రం వద్దనడం లేదట!

    ఇక పండ్లు, దుంపల చిప్స్

    ఇప్పటి వరకు ఆలూచిప్స్, అరటికాయ, కాకరకాయ తో సహా ఇంకెన్నో కురగాయల్ని కలుపుకుని నోరు వురిస్తుంటే ఇప్పుడు పండ్ల రుచులతో తాయారవ్వుతున్నాయి ఫ్రూట్ చిప్స్. మామీడి, పైనాపిల్,…

  • గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల ముక్కలు తినేస్తే మంచి రంగును కొంటున్నారేమో పొరపాటు అంటున్నాయి అధ్యయనాలు. రాత్రి హాయిగా భోజనం చేసి నిద్ర పోయి పొట్ట తేలికగా అయిపోయి నిద్రలేచాక పండ్ల కంటే చిరు ధాన్యాల ఉపహరాలే మంచివి అంటున్నాయి రిపోర్టులు. పిండి పదార్దాలతో నిండి వున్న చిరు ధాన్యాలు తక్షణమే శక్తినిస్తాయి. ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్ లోకి చిరు ధాన్యాలు, ప్రోటిన్లు, పిచు పదార్ధాలు వుండాలి. అంటే చిరు ధాన్యాలతో తాయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ తో పాటు పాలు, పండ్లు కలిపి తీసుకోవాలి. పరగడుపునే కేవలం పండ్లు తిని సారి పెట్టుకుంటే శరీరానికి కావాల్సిన పోషణ, శక్తి రెండు అందుతాయి. జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయి. ఉదయపు వేల శక్తి నిచ్చే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

    వట్టి పండ్లతో కడుపు నింపితే కష్టం

    గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల…