Wednesday, 22 Jul, 2026

అన్ని ఎక్కువే

ఎదురుగుండా నిలువెత్తున కనిపిస్తున్నా మనం గుర్తించని పోషకాలున్నఆకు మునగాకు. పప్పులో కూరల్లో,పులుసుల్లో మిగతా ఆకు కూరల్లో కూడా వాడుకోవచ్చు. పొడిగా ఎండ బెట్టినా ఏ మాత్రం పోషక విలువలు పోవు. ఇదేంత అద్భుతమైందంటే క్యారెట్లలో కన్నా ఎక్కువ విటమిన్ ఏ , పాలల్లో కన్న ఎక్కువ కాల్షియం, పాలకూర కన్నా ఎక్కువ ఐరన్, నారింజ కన్న ఎక్కువ విటమిన్ సీ,అరటి పండ్ల కన్నా ఎక్కువ పొటాషియం వుంటుంది. దిన్నీ పెసరపప్పులో కలిపి వండితే ఇందులోని ఐరన్ శరీరానికి ఎక్కువ […]

ఈ నగలు కళాత్మకం

.కళాత్మకమైన నగలు చూడలనుకుంటే త్రీడీ పెండెట్లు చూడలి. లక్ష్మీపార్వతులు, వినాయకుడు, నెమలి పైన అమ్మాయి, వెండి నగకు వేలాడే అందమైన దృశ్యం. దీన్ని మెడలో పెండెంట్ గా ధరిస్తే ఇంక అందమంటే అందమే కాదంటారా. నిజంగానే ఒక చక్కని వస్తువు అక్కడ పెట్టినట్లుగా డిజైన్ చేసిన ఈ త్రీడి పెండెంట్లు అమ్మాయిల హాట్ ఫెవరెట్స్. ఇవి భారీ నగలు గాను సింపుల్ డిజైన్‌ గానూ ఉన్నాయి. ఇమేజెస్ లో వందలాది త్రీడీ పెండెంట్లు చూడోచ్చు.

దుంప కాదిది

క్యాబేజీ, కాలీ ఫ్లవర్ ,బ్రకోలి కుటుంబానికి చెందిన ముల్లంగిలో తక్కువ క్యాలరీలు నాణ్యమైన పీచు దుంపల కనబడే ముల్లంగి ప్రత్యేకత. బరువు నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎంతో ప్రయోజన కరంగా ఉంటుంది. ఉడికించకుండా సలాడ్ రూపంలో తీసుకుంటే విటమిన్ సీ అత్యధికంగా పొందవచ్చు. శరీర కణాల పైన ఒత్తిడి తగ్గించి వాటిని ఆరోగ్యవంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్స్ ముల్లంగిలో అధికం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించి మధుమేహం రానివ్వకుండా కాపాడుతుంది ముల్లంగి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ లు […]

చర్మం పొడిబారుతుందా

కొంచెం వయసు పెరగుతూ ఉన్నా గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులను వాడుతున్న చర్మం పై తేమ తగ్గిపోయి పొడిబారుతుంది. అలాంటప్పుడు చేయవలిసిన పని చర్మం తేమను కోల్పోకుండా చూడటం ముఖ్యం. పెట్రోలియం జెల్, మినరల్ ఆయిల్స్ వంటివి ఉపయిగించి చర్మం తేమగా ఉండేలా చూడోచ్చు. మరి వేడి నీటి స్నానం కాకుండా గొరు వెచ్చని నీటితో స్నానం ముగించాలి. వేడి నీళ్ళతో చర్మంలోని సహజసిద్దమైన నూనెల్ని కోల్పోతాం. ముఖ్యంగా సబ్బు వాడకం తగ్గించాలి. అలాగే చాలా తేలికైన […]

గతాన్ని తవ్వద్దు

అద్దం పై దొర్లిపడే ఆవగింజల్లా ఉండాలంటారు భార్య, భర్తల మధ్య వచ్చే తగువులు కాని అలా కాకుండా ప్రతి చిన్న గొడవలోనూ ఎవరికి వాళ్లు మనమే నెగ్గాలని చూస్తే సమస్యే కదా. చిన్నిచిన్ని తగువులు సహజం ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. సాధ్యమైనంత వరకు తగువల ప్రభావం రోజుల తరబడి కొనసాగకుండా చూడాలి. ఒకళ్ళ లోపాలు మరోకరు ఎత్తి చూపుకుని ఆ తగువులు మరింత పెంచేలా చూడకూడదు. తప్పు ఎవరి వైపు వుంటే వారు న్యాయంగా క్షమించమని అడగవచ్చు. […]

కాస్త దూరంగా

చాలా మంది సెల్ ఫోన్లు దిండు పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. వాటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్న ఎంతోకొంత రేడియోషన్ వెలువడుతుంది. ఇది డిఎన్ ఏ ని దెబ్బ తీస్తుందని చర్మ సంబంధ వ్యాధులు తెచ్చి పెడుతుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటే మూడు నిమిషాలకంటే తక్కువ సమయంలోనే ముగించాలి. లేకపోతే రేడియోషన్ ప్రాబ్లం తప్పదు. ఇయర్ ఫోన్స్ , బ్లూ టూత్ వంటివి కొంత నయం డెస్క్ టాప్, […]

తోమటం ఈజీ

అమెరికా తరలి వెళ్ళి అద్భుతమైన ఉద్యోగం చేస్తున్నా ఇళ్ళు క్ల్లినింగ్‌ గిన్నెలు తోమడం తప్పవు. అక్కడికి వెళ్ళకపోయినా గిన్నెలు తోమడం తప్పవు కదా స్పాంజ్‌ దగ్గర పెట్టుకుని సబ్బు, లిక్విడ్ అద్దుతూ గిన్నెల్ని తోముకోవాలి లేట్ అయిపోతూ ఉంటుంది. స్పాంజ్ లో నుంచి సోప్ వస్తూ ఉంటే ఈ తోమటం సులభం కదా. లిక్విడ్ సోప్‌, డిస్పెన్సింగ్ స్పాంజ్ వచ్చింది మార్కెట్లోకి ఈ స్పాంజ్ మధ్య లిక్విడ్ సో ప్ వేసేందుకు ఒక క్యాప్సుల్ ఉంటుంది. అందులో […]

మడి చేస్తే సరి

చిన్న ఇల్లయిన చక్కగా సర్దుకోవాలి. ఎప్పటికప్పుడు వాడిన వస్తువులు ఒక పక్కకు పెట్టేసి ఇల్లు స్పేషియస్‌ గా ఉండేలా చూసుకోవాలి. ఈ ఆలోచనలకు తగ్గట్లే మార్కెట్లోకి ఎన్నో వస్తువులు వస్తున్నాయి. డైనింగ్ టేబుల్ పైన వేడిగా అప్పుడే వండిన గిన్నెలు పెడితే ఆ వేడికి డెకోలం దెబ్బతింటుంది. గిన్నెల కింద ట్రివెట్ వేస్తారు. వాటిని అలా టేబుల్ మీద వదిలేయకుండా ఫోల్డబుల్ ట్రివేట్ లు మార్కెట్లోకి వచ్చాయి. నాలుగు ప్లాస్టిక్ కర్రల లాంటి ఈట్రివెట్ పైన వేడి […]

రసాయనాల సమస్య

మైక్రోవేవ్ ఉపయోగం అంత ఇంతకాదు. చాలా వేడిగా ఏదైన తినాలంటే మైక్రోవేవ్‌ ఒక వరం కని ప్లాస్టిక్ కంటైనర్ బాక్స్ ల్లో వేడి చెయ్యటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. వండిన పదార్ధం వేడి చేసేందుకు ఉపయోగించే ఈ కంటైనర్లలో ఉండే రసాయనాలు పదార్ధాల్లో కలిసిపోయి క్యాన్సర్,మధు మేహం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. పురుషుల్లో అయితే స్పెర్మ్ కంటెంట్ తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు కేవలం గాజుతో చేసిన పాత్రలతో ఈ సమస్య రాకుండా […]

రక్తాన్ని రక్షిస్తాయి

ఆరోగ్యం బావుండాలంటే రక్తం స్వచ్చంగా ఉండాలి. తినే ఆహారంలోనే స్వచ్చమైన రక్తం తయారవుతుంది. వెల్లూల్లి,ఉసిరి,బొప్పాయి,నేరేడు వంటి పదార్ధాలు రక్తంలో కొలెస్ట్రాల్, చెక్కర అధిక రక్తపోటును తగ్గిస్తాయి. వెల్లుల్లితో ఈ సమస్యలు అస్సలు రావు. రక్తం స్వచ్చంగా ఉంటుంది. బొప్పాయి కూడా కొలెస్ట్రాల్ రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు బొప్పాయి తినోచ్చు. అలాగే ఉసిరి,కాకర రెండు రక్తంలో చెక్కెరను అదుపులో ఉంచుతాయి. అలాగే నేరుడు పండు కూడా చెక్కరను అదుపు చేసేదే. రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఇలాంటి పదార్ధాలు నిత్యం […]

బహుళ ప్రయోజనాలు

తియ్యని మిఠాయిలు తినడం అందరికి ఇష్టమే. కాని ప్రతి నిమిషం పంచదార వాడకం నిలిపివేయమనే సలహాలు వింటాం. కాని తియ్యగా అంటే ఎలా మరి బెల్లంతో చేసిన పదార్ధాలు తినండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పైగా తీపి తినాలనే కోరికను కూడా బెల్లం తగ్గిస్తుంది అంటున్నారు పరిశోధకులు. పాలల్లో కొంచెం బెల్లం కలిపి తాగితే ఎముక పుష్టి పెరుగుతుంది. బెల్లంలో పొటాషియం, ఐరన్, ఫాలెట్ లు పుష్కలంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ది చేయగలదు. రక్తహీనత తగ్గిపోతుంది. […]

అప్పుడే డైటింగా

ప్రసవం అయిపోగానే పెరిగిన శరీరం చూసుకుని డైటింగ్ ప్రారంభిస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమే. ముందుగా తల్లులకు పాపాయి సంరక్షణ ఉంటుందు. బాలింతలకు మాంసకృత్తులు,విటమిన్లు,ఖనిజాలు అందితేనే తల్లి,బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. ఆహారంలో ఒమేగా 3 ఫ్యాట్ ఆమ్లాలు ఉండే సాల్మన్‌ ట్యూన్ చేపలు, చికెన్, బీన్స్, చిక్కుడు జాతి గింజలు,ఇనుము, క్యాల్షియం,పీచు సంక్లిష్ట పీచు పదార్ధాలు అందేలా చూసుకోవాలి. పాలిచ్చే తల్లికి విటమిన్ సీ అందేలా నిమ్మ,నారింజ,బత్తాయి వంటి పండ్లు తినాలి. గుడ్డు పచ్చ సొనలో విటమిన్ […]

అమృత తుల్యం కుసుమ

కుసుమ పువ్వును డూప్లికెట్ శాఫ్రాన్ అంటారు. దాని కాడలు, గింజలు అన్ని అద్భుతమే ఈ పూ రేకుల్ని ఫుడ్ కలర్ గా ఔషధాల తయారికి వాడతారు. మహారాష్ట్రకు చెందిన నికంబర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్‌ పొడి వాతావరణంలో పండేలా హైబ్రీడ్ వెరైటీలు రూపొందించింది. గింజలతో తయారు చేసే కుసుమ నూనెలు విటమిన్ ఇ సమృద్దిగా ఉండటంతో ఇది చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. జుట్టు కుదుళ్ళకు దీన్ని పట్టిస్తే ఆరోగ్యంగా పెరగడంతో పాటు జుట్టు మెరిసిపోతుంటుంది. […]

ఎంతో తేలిక

ఆన్ లైన్ లో లీఫ్ ఫాతర్ పేరుతో సర్చ్ చేస్తే ఎన్నో రకాల అలంకరణ వస్తువులు కనిపిస్తాయి. ఇవి క్లే తోనూ గ్లూ తోనూ తయారు చేసినవే వీటిని ఎలా తయారు చేయాలో వీడియోలు ఉన్నాయి. క్లే ను ఒక చపాతితో చేసుకుని దాని పైన వివిధ రకాల పెద్ద ఆకులు పెట్టి నొక్కితే క్లే పైన అచ్చు పడుతుంది. ఆకు చుట్టు కత్తితో తీసేస్తే అప్పుడు ఆకు రూపంలో క్లే కనిపిస్తుంది. ఆకు తీసేసి ఆరనిస్తే […]

వెరీ గుడ్

విటమిన్లు, మినరల్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్ లేకపోతే చర్మం నిర్జీవమై సాగిపోతుంది. అలగే కళ్ళ విషయంలో కూడా కెరోటినాయిడ్ వల్ల కలిగే మా క్యూలర్ డీ జనరేషన్ అడ్డుకోవాలంటే ఓ గుడ్డు కావాలి. చర్మం సాగకుండా దృఢంగా మృదువుగా ఉండాలంటే గడ్డు చాలా మంచిది. చర్మానికి మేలు చేసే ప్రోటీన్, బయోటిన్ దీనిలో సమృద్దిగా దొరుకుతాయి. ప్రతిరోజు ఒక గుడ్డు తింటే కేటరాక్ట్ రిస్క్ తగ్గిపోతుంది. హై క్వాలిటీ ప్రోటీన్ తొమ్మిది అత్యవసర ఎమినో యాసిడ్స్ ఉంటాయి. బ్లడ్ […]

బాక్టీరియా జాగ్రత్తా

ఎండకాలం ఫ్రీజ్ తో నిరంతరం పని ఉంటుంది. పదార్ధాలతో ఫ్రీజ్ కిక్కిరిసిపోతే బాక్టీరియా వస్తుంది. ముడి సరుకు ప్రాసెస్ చేసినవి, ఫ్యాకేజ్ ఫుడ్ లను విడివిడిగా పెట్టుకుంటే ఈ సమస్య రాదు. ఫ్రీజ్ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. తరిగిన కూరలు,తినే పళ్ళు, జ్యూస్ లు వెంట వెంటనే వాడేస్తూ ఉండాలి. వండిన పదార్ధాలను ఫ్రీజ్ పై అరలో ముడి పదార్ధాలను ఫ్రీజ్ కింది అరలో ఉంచుకోవాలి. మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు విడిగా 18 డిగ్రీల […]

డైల్యూట్ చేసి వాడాలి

పగిలిన చర్మం, ర్యాష్, ముడతలు మొటిమలు, ట్యాన్ సమస్యల నివారణలో ఎసెన్షియల్‌ అయిల్స్ బాగా పని చేస్తాయి. సౌందర్య పరిరక్షణ కోసం ఉపయోగించే ఈ ఆయిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రాబియాల్, యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఈ ఆయిల్స్ ను బాదం, ఆలివ్,నువ్వుల నూనెల్లో కలిపి డైల్యూట్ చేసి వాడుకోవాలి. గుడ్డుతో చేసే హెయిర్‌ ప్యాక్స్ లోనూ వీటిని కలుపుకోవచ్చు. చర్మ సౌందర్య రక్షణలో లవెండర్, మ్యారీ గోల్డ్,పెప్పర్ మెంట్ ,టిట్రీ, శాండిల్ వుడ్,రోజ్, […]

చూయింగ్ గమ్

చూయింగ్ గమ్‌ నమలటం వల్ల మొహానికి, బుగ్గలకు వ్యాయామం అంటారు సరే కాని కొత్త పరిశోధనలో చూయింగ్‌ గమ్ గుండెల్లో మంటను తగ్గిస్తుందంటున్నారు. భోజనం తర్వాత చూయింగ్ గమ్‌ నమిలితే సెలైవా తగినంత ఉద్దీపం అవుతుంది. చాలినంతగా నీరు తాగితే ఈ సమస్యే రాదు. కెఫినెటేడ్, వేడి పాణియలు కుడా వద్దు. ఉదరం ఒత్తిడికి గురైతే జీర్ణ అమ్లాలు ఇసో ఫాగస్ కు మరింత ఎక్కువగా చేరతాయి. దీని వల్లనే గుండెల్లో మంట వస్తుంది. ఈ వేసవిలో […]

కాలేయం సేఫ్

శరీరంలోని ముఖ్యమైన భాగాలకు ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు కాలేయం పని తీరుమెరుగ్గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం రోజువారి భోజనంలో బీటు కెరోటిన్లు  సమృద్ధిగా ఉండే బీటు రూట్ పాలకూర ,తోటకూర ,క్యారెట్లు ,క్యాబేజీ వంటివి తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలోని హానికారక రసాయనాలు వడపోసినట్లుగా తొలగిస్తాయి. అలాగే పసుపుని ఆహారంలో భాగంగా తీసుకొంటే ఎలాంటి వైరల్ ఇన్ ఫెక్షన్లు దగ్గరకు రాకుండా ఉంటాయి. ఈ ఆహారంతో కాలేయానికి ఎలాంటి వ్యాధులు రావు.

ఒత్తిడే కారణం

ఒత్తిడికి,జుట్టు రాలిపోవటానికి ,చర్మంపై ముడతలు రావటానికి ,వార్ధక్యా లక్షణాలు రావటానికి లింక్ ఉందంటున్నారు పరిశోధకులు. ఒత్తిడితో చర్మం తగినంత ఆక్సిజన్ అందుకోలేదు. చర్మంపై రాష్ వస్తుంది. ఇరిటేషన్ కలుగుతుంది. మానసికంగా రిలాక్స్ అవకపోతే కంటి చుట్టు నలుపు వార్ధాక్య లక్షణాలు వచ్చేస్తాయి. రక్త నాళాలు కుంచించుకుని జుట్టుకు ఆక్సిజన్ సప్లైయ్ జరగకుండా పోషకాలు అందక జుట్టు రాలిపోతుంది. ఈ సమస్య కు పరిష్కారం వ్యాయామం .దీనితో సంతోషం కలిగే హార్మోన్లు విడుదల అవుతాయి. మూడు బాగవుంటుంది. ప్రశాంతంగా […]