• ఈమె పేరు పూనమ్ శ్రోతీ . ఊరు భూపాల్. వయసు 31 సంవత్సరాలు. ఎత్తు రెండడుగుల ఎనిమిది అంగుళాలు. ఈ అమ్మాయికి ఆస్టియో జెనెసిస్ ఇంఫెర్టికా అని ఒక వ్యాధి. ఎముకలు ఫట ఫటా విరిగి పోతాయి. ఎన్నోసార్లు ఆపరేషన్లు చేసారు. ఇంతకంటే ఎత్తు పెరగదన్నారు. అప్పుడా అమ్మాయి ఏంచేసిందంటే ఫైనాన్స్ తో ఎంబీఏ చేసింది. ఒక కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగింది. తర్వాత ఉద్యోగం వదిలేసి 2014 లో దివ్యంగుల కోసం ఉద్దీప్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసింది. వాళ్ళ సాధికారత కోసం కెన్ డూ అనే ప్రోగ్రాం నిర్వహిస్తోంది. వాళ్లకు తగిన శిక్షణ అవగాహనా తరగతులు తర్వాత ఉద్యోగాలు ఇప్పించటం పూనా శ్రోతి సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సేవలకు వందమంది ప్రముఖ మహిళల్లో ఒకరుగా రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు కూడా వచ్చింది. ఈ వార్త ఎందుకంటే ఇలాంటి అనారోగ్యం ఉన్న యువతికి జీవితం ఎంత కష్టం కానీ ఈమె ప్రముఖ వ్యక్తిగా ఎదిగింది.

    ఎంతో మందికి ఈమె ఆశా జ్యోతి

    ఈమె పేరు పూనమ్ శ్రోతీ . ఊరు భూపాల్. వయసు 31 సంవత్సరాలు. ఎత్తు రెండడుగుల ఎనిమిది అంగుళాలు. ఈ అమ్మాయికి ఆస్టియో జెనెసిస్ ఇంఫెర్టికా అని…

  • ఎంత అందమైన ఇల్లయినా సరే ఎక్కడి వస్తువు అక్కడ వుంచక పోతే సవ్యంగా కనిపించదు. చివరకు స్టోర్ రూమ్ అయినా సరే. సాధారణంగా స్టోరేజీల్లో 30,40 శాతం వాడినవే వుంటాయి. పాత కూలర్లు ఫ్యాన్లు మెషీన్ టూల్స్ ,పాత ఫర్నీచర్స్ ,పుస్తకాలు , బొమ్మలు, దుస్తులు ఏవైనా కావచ్చు. ఏ పండగకో ప్రత్యేక సందర్భానికో సర్దుతాం. ఇలా ఎడతెరిపి లేకుండా పేరుకుపోయే పనికిరాని వస్తువులు సర్దటం తప్ప తీసేద్దామనుకోరు. తీసేసి ఎవరికైనా ఇవ్వటం ప్రతీదాన్ని ఒక్కసారి సరిగ్గా చూసి అవసరం వుందా ఆ అవసరం ఎన్నాళ్ళకు వస్తుందో తేల్చుకుని ఆమేరకు దాన్ని వుంచుకోవటమో ,ఇచ్చేయటమో నిర్ణయించాలి. అలాగే దుస్తులు దొంతరలు కూడా ఇంతే. వార్డ్రోబ్ లు నిండిపోతున్నాయి. వద్దనుకుని డొనేట్ చేయటం బెస్ట్. పాత ఫర్నీచర్ ఎలెక్ట్రికల్ వస్తువులు ఏ ఆక్షన్ హల్లోనో పెట్టేస్తే సరి. ఎంతో కొంత డబ్బొస్తుంది. లేక ఇష్టంలేకపోతే ఎవరికన్నా ఇచ్చేయటం కూడా బేటరే. అంతే గానీ అనవసరమైన పనికిరాని వస్తువులతో మంచి వస్తువులకు చోటు ఇరుకై పోతుంది.

    అవసరం లేకుంటే ఇచ్చేయండి

    ఎంత అందమైన ఇల్లయినా సరే ఎక్కడి వస్తువు అక్కడ వుంచక పోతే సవ్యంగా కనిపించదు. చివరకు స్టోర్ రూమ్ అయినా సరే. సాధారణంగా స్టోరేజీల్లో 30,40 శాతం…

  • ఇదివరకు ఇల్లు కట్టుకోవటం అంటే ఇంటి చుట్టూ చెట్ల కోసం జాగా వదిలేసి చుట్టూ అందమైన పూల తోట పండ్ల మొక్కలు పెంచేవాళ్ళు. ఇప్పుడు అంగుళం స్థలం ఊరికే వదలరు. కానీ పచ్చ దనం కోసం మనసు కొట్టుకుపోతూ ఉంటుంది. అప్పుడు ఇస్పాలియర్ పద్దతి కేసి చుడండి అంటున్నారు నిపుణులు. ఏదైనా మొక్కను గోడకు దగ్గరగా వేసి ఎప్పటికప్పుడు అది గోడను అతుక్కునేలా ఉంచేసి ఇవతలకు పెరిగే మొక్కలు కొట్టేయటం. పూలు పండ్లు అలంకరణకు ఉపయోగించే అన్ని రకాల మొక్కలు ఈ పద్దతి లో పెంచవచ్చు. ఇంటి గోడైనా ప్రహరీ గోడైనా మొక్కను నాటటం దాన్ని తీరుగా పెంచటం ఎస్పాలియర్ పద్దతి ముఖ్యమైన విషయం మొక్క పెరగక ముందే ఆ చివరా ఈ చివరా మేకులు కొట్టి తీగలు కట్టాలి. మొక్క పెరుగుతునప్పుడు కొమ్మల్ని ఈ తీగ లోకి దూర్చుతూ అదనంగా బయటకి వచ్చే కొమ్మల్ని కత్తిరించాలి. ఎంత పెద్దయినా గోడకి ఆనుకుని పెరుగుతాయి తప్ప విస్తరించవు. మందారం మల్లె గులాబీ గన్నేరు లతో పాటు నిమ్మ దానిమ్మ సీతాఫలం లాంటి పండ్ల మొక్కలను పెంచచ్చు. పెరటి గోడలు ఇంటి గోడలు కూడా అందమైన కాన్వాస్ లాగా మారిపోతాయి.

    గోడకు అతుక్కుని పెరిగే చెట్లు

    ఇదివరకు ఇల్లు కట్టుకోవటం అంటే ఇంటి చుట్టూ చెట్ల కోసం జాగా వదిలేసి చుట్టూ అందమైన పూల తోట పండ్ల మొక్కలు పెంచేవాళ్ళు. ఇప్పుడు అంగుళం స్థలం…

  • శుభ్రత విషయంలో నూటికి నూరు మార్కులూ మనకి మనం వేసుకుంటాం. తప్పులేదు. కానీ వంటింట్లో మనకి తరచూ వాడే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు కావాలి. పళ్ళ రసం తీస్తాం. బ్లయిండర్ లో నీళ్లు పోసి డిష్ సోప్ వేసి మళ్ళీ ఓసారి గిర్రున తిరిగేలా చేయాలి. మైక్రోవేవ్ వాసన పోవాలంటే ఒక కప్పు నీళ్లలో నిమ్మరసం ఓ అరకప్పు పోసి మైక్రో వేవ్ లో పెట్టి వేడి చేయాలి. ఆ పొగలు కక్కే నీటిని మైక్రో వేవ్ వాసనాలని దూరం చేస్తుంది. గ్లాస్ జార్ల పై కాఫీ లాంటివి పోస్తాం. బ్రౌన్ మచ్చలు పడతాయి. వాటిని పోగొట్టాలంటే ఐస్ ఉప్పు నిమ్మరసం టీయూస్కుని జార్ లో వేసి గిలకొడితే గ్లాస్ జార్ ఆ మిశ్రమం నీళ్లు తగిలి తెల్లగా తయారవుతోంది. కాఫీ కప్పుల లోపల ఎర్రని కాఫీ మరకలు ఏర్పడతాయి. ఉప్పు వెనిగర్ మిశ్రమం తో ఈ కప్పు తో తోమితే కొత్త వాటిలా అయిపోతాయి.

    గాఢమైన వాసన తో ఇలా పోతాయి

    శుభ్రత విషయంలో నూటికి నూరు మార్కులూ మనకి మనం వేసుకుంటాం. తప్పులేదు. కానీ వంటింట్లో మనకి తరచూ వాడే వస్తువుల విషయంలో కొన్ని జాగ్రత్తలు కావాలి. పళ్ళ…

  • ఈ సెలబ్రెటీ సీజన్ ఎదురుగ్గా క్రిస్మస్ న్యూఇయర్ వచ్చేస్తూ ఉండగా ఫ్యాషన్ ప్రపంచం అన్ని రకాల వస్తువులకూ ప్రత్యేక రూపం ఇచ్చి షోకేస్ లో పెట్టేస్తోంది. అన్ని రకాల దుస్తులు చెప్పులూ ఉండగా క్లచ్ తో మాత్రం తీసిపోయాయా. కన్నుల కింపుగా వుండే క్లచ్ లు ఫ్యాషన్ పోకడ లో ముందే వున్నాయి. ఒక యాడ్ లో గోల్డెన్ టచ్ ఉన్న చిక్ మెటాలిక్ బ్యాగ్ చూడండి. కింగ్ మైకాన్ కూడా ఈర్ష్య పడతాడు అంటారు. అలాగే డే క్లచ్ చుస్తే మిగతా షాపింగ్ చేసిన వస్తువులు అలా వదిలేసి ఈ బాగ్ పట్టుకు పోతారు అంటారు. ఇంకో క్లచ్ ఖరీదు ఐదు వెలట. అనవసరంగా వజ్రాలే మెరుస్తాయి అనుకుంటారు/నిజానికి మా బ్యాగే ఒక వజ్రం అంటారు. ఒక డిజైన్ ఊహించటం దాన్ని అనుకున్నంత అందంగా తయారు చేయటం మార్కెట్ చేయటం మాటల్లో పనికాదు. ఒక కంపెనీ వాడు చెప్పుకొంటునట్లు బ్యాగ్స్ ని కొనటం అంటే ఒక ఆర్ట్ ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవడం లాగా అన్నమాట. ఇంటికి అందం అద్భుతమైన పెయింటింగ్. అలాగే అనామికా కన్నా డిజైన్ చేసిన డ్రెస్ వేసుకున్న జమ్మి శాండల్స్ వేసుకున్న చేతిలో పర్ ఫెక్ట్ క్లచ్ లేకపోతే ఫ్యాషన్ రూపం రానట్లే. ఉమెన్స్ క్లచ్ బ్యాగ్స్ ఇమగెస్ చుస్తే ఎన్నెన్ని డిజైనర్ బ్యాగ్స్ ఉన్నాయో తేలిపోతుంది.

    క్లచ్ చేతిలోవుంటేనే అసలైన అందం

    ఈ సెలబ్రెటీ సీజన్ ఎదురుగ్గా క్రిస్మస్ న్యూఇయర్ వచ్చేస్తూ ఉండగా ఫ్యాషన్ ప్రపంచం అన్ని రకాల వస్తువులకూ ప్రత్యేక రూపం ఇచ్చి షోకేస్ లో పెట్టేస్తోంది. అన్ని…

  • మనకి 20 మంది స్నేహితులంటే 19 మంది మనల్ని కలిసినప్పుడు తప్పనిసరిగా మాటల్లో వచ్చే విషయం డైట్. బరువు తగ్గటం కొన్నాళ్ల పాటు తగ్గాను ఇప్పుడేం చేసినా ఇక తగ్గటం లేదంటూ వుంటారు. డాక్టర్ ఎంత తగ్గించినా బరువు తగ్గటం లేదంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి . థైరాయిడ్ ఫంక్షన్ విటమిన్ మినరల్ తో పాటు ఉన్నాయేమో చూడాలి . క్రమశిక్షణా పూరితమైన డైట్ నిరంతర వ్యాయామం జీవన శైలి గమనించుకోవాలి . శరీరం డైట్ విషయంలో వ్యాయామాల విషయంలో రొటీన్ గా అయిపోతుంది . అన్నీ మార్చాలి . అలాగే పోషకాలు తగ్గించేస్తే దీర్ఘ కాలంలో దాని ప్రభావం శరీరం పైన చూపెడుతుంది. మంచి బ్రేక్ ఫాస్ట్ తేలిగ్గా లంచ్ ఓ మోస్తరు గా డిన్నర్ మధ్యలో చాలా తక్కువ పరిమాణంలో స్నాక్స్ తినాలి. ఒకేసారి పొట్ట నిండుగా కాదు మంచి నీళ్లు బాగా తాగాలి. ఎర్లీ మార్నింగ్ వ్యాయామాలు నడక అస్సలు మానరాదు. ఆ సమయంలో శరీరం రెస్ట్ లో ఉంది మెటబాలిక్ రేట్ శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇప్పుడు వర్కవుట్లు మానకూడదు. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి కొత్తవీ జీవన శైలిలోకి తీసుకు రాకూడదు.

    డాక్టర్ చేతికి వదిలేయటం బెస్ట్

    మనకి 20 మంది స్నేహితులంటే 19 మంది మనల్ని కలిసినప్పుడు తప్పనిసరిగా మాటల్లో  వచ్చే విషయం డైట్. బరువు తగ్గటం కొన్నాళ్ల పాటు తగ్గాను ఇప్పుడేం చేసినా…

  • ఈ మధ్య శాన్ ప్రాన్సిస్కోకి చెందిన వెలెరిసగుల్ తను యోగ చేస్తున్న దృశ్యాన్ని యుట్యూబ్ లోను, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లోను పెడితే లక్షల మంది చూసారు. లైక్స్ వర్షం కురిసింది. వలిటీ ప్రత్యేకత అంటే ఆమె చదువు. అంత లావు మనిషి ఈజీగా అతి కష్టమైన శీర్షననం కూడా వేస్తె మరి చూడరా? లావుగా వున్న వాళ్ళు యోగా వైపు తొంగి చూడరు. శరీరం ఎటు వాడితే అటు వంగదానీ పైగా చూసే వాళ్ళు నవ్వుతారనే భయం. అలాంటి వాళ్ళు నవ్వుతారనే భయం. అలాంటి వాళ్ళు వెలెరిసగుల్ యోగా సనాలు చుస్తే ఫిదా అయిపోతారు. ఆమె ఏమంటుందంటే మనిషి లావుగా ఉన్న మిమ్మల్ని మీరు ఇష్టపదండి. ఇది మావల్ల కాదు అని ఒక నిర్ణయానికి వచ్చెయ కుండా సానుకూలంగా ఆలోచిస్తే బరువు ఒక సమస్య కాదు. మన శరీరం మాన మాట వుంటుంది. అది వినేలాగా మనం వాళ్ళు వంచాలి అంటుంది యువత. వెలెరి సగుల్ ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు చూసి ఎంత లావుగా ఉన్న సరే శరీరాన్ని కంట్రోల్ లో కి తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు.

    లావుగా వుంటేనేం

    ఈ మధ్య శాన్ ప్రాన్సిస్కోకి చెందిన వెలెరిసగుల్ తను యోగ చేస్తున్న దృశ్యాన్ని యుట్యూబ్ లోను, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లోను పెడితే లక్షల మంది చూసారు.…

  • నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అని ప్రతి నిమిషం ఎక్కడో చోట వినబడుతూ కనబడుతూ వుంటుంది. ఆరోగ్యనికి అవి మంచివే కానీ ఎన్ని తినాలి. మితి మీరి తింటే ఏమవుతుంది. ఈ సందేహాలకు డాక్టర్లు మంచి సమాధానం ఇచ్చారు. పిస్తా, వాల్ నట్, బాదాం, జీడి పప్పుల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. రకరాకాల సమస్యల్ని ఇవి దూరం చేస్తాయి. వాల్ నట్స్ కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పాతాయి. కాన్సర్ రానీయకుండా కాపాడతాయి. అయితే ఇవి రోజుకు పది గ్రాములు అంటే ఐదు వాల్ నట్లు తినాలి. వేరు సెనగ పది పన్నెండు పప్పులు, బాదం తొమ్మిది, జీడి పప్పులు గుప్పెట నిండుగా అన్నమాట. ఇలా రోజుతీసుకుంటే దాదాపు 23 అనారోగ్యాలకు శాశ్వతంగా దూరంగా వుండ వచ్చు. అతి గా తింటే బరువు పెరగడం ఖాయం.

    ఇలా కొన్ని తింటేనే ఆరోగ్యం

    నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అని ప్రతి నిమిషం ఎక్కడో చోట వినబడుతూ కనబడుతూ వుంటుంది. ఆరోగ్యనికి అవి మంచివే కానీ ఎన్ని తినాలి. మితి మీరి తింటే…

  • పరిమళాల నగలు ఇమగెస్ చూస్తుంటే ఆశ్చర్యంగా వుంటుంది. మాములుగా నగల్లో అందంగా చెక్కని సువాసనలు వెదజల్లుతూ మనస్సుకి ఆహ్లాదం ఇచ్చే సెంటెడ్ జ్యూవెలరీ, పెర్ఫ్యూమ్ జ్యూవెలరీ, లేదా వేర్ యువర్ పెర్ ప్యుమ్ తరహ నగలుగా పిలిచే ఈ నగల్లో గొలుసు, లాకెట్ లోపల పెర్ ప్యుమ్ పోసుకునే అవకాసం వుంటుంది మనకి ఇష్టమైన సువాసనల సెంట్ పోసి మూల పెడితే అందులో వుండే సన్నని రంద్రం ద్వారా నెమ్మదిగా సువాసన బయటకి వస్తు వుంటుంది. కొన్నింటిని ఏళ్ల పాటు సువాసనలు వేద జల్లేలా తాయారు చేస్తున్నారు. ఈ పరిమళాల నగల్లో గొలుసులు, బ్రాస్ లెట్లు, జుంకిలు, వాచీలు, ఉంగరాలు, రకరకాలవి వున్నాయి. ఇవి మోడరన్ డ్రెస్ పైకి సారిపోయే డిజైన్ చేసిన నగలు. బంగారం తో కుడా ఈ పెర్ ప్యుమ్ జ్యూవెలరీ వస్తుంది.

    పరిమళాల నగలు

    పరిమళాల నగలు ఇమగెస్ చూస్తుంటే ఆశ్చర్యంగా వుంటుంది. మాములుగా నగల్లో అందంగా చెక్కని సువాసనలు వెదజల్లుతూ మనస్సుకి ఆహ్లాదం ఇచ్చే సెంటెడ్ జ్యూవెలరీ, పెర్ఫ్యూమ్ జ్యూవెలరీ, లేదా…

  • సౌందర్య పోషణలో టొమాటోని మించినది లేదు అంటున్నారు. పూర్తి యంటి ఆక్సిడెంట్స్ తో నిండిన టొమాటో ఏ రకం చర్మానికైనా పర్ ఫెక్ట్ గా ఉపయోగా పడతాయి. చర్మం ముడతలు పడకుండా, గీతలు పడకుండా ఈ సీజన్ లో కాపాడుతుంది. చర్మ తత్వాన్ని బట్టి టొమాటో కాంబి నేషన్లు కలుపుకోవాలి. జిడ్డు చర్మం అయితే టొమాటో రసం కీరా పేస్టు, తేనె కలుపు కుని మొహానికి మాస్క్ లా వేసుకో వచ్చు. అదే పొడి చర్మం అయితే టొమాటో రసానికి ఆలివ్ ఆయిల్ కలిపి అప్లై చేయాలి. ఇక కాంబినేషన్ స్కిన్ అయితే టొమాటో రసం అవకడో పేస్ట్ కలిపి రాయాలి. ఇది మొటిమలకు మంచి మందు నార్మల్ స్కిన్ అయితే ఒక టొమాటో రసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మొహానికి పట్టించి పది నిమిషాల్లో కడిగేస్తే బావుంటుంది. ఓట్ మీల్ కూడా ఈ కాంబినేషన్ కు జత చేయొచ్చు.

    సౌందర్యాన్ని పెంచే టొమాటో

    సౌందర్య పోషణలో టొమాటోని మించినది లేదు అంటున్నారు. పూర్తి యంటి ఆక్సిడెంట్స్ తో నిండిన టొమాటో ఏ రకం చర్మానికైనా పర్ ఫెక్ట్ గా ఉపయోగా పడతాయి.…

  • పెళ్లి చేరాల్లో ఒక్కటైన మైసూర్ సిల్క్ చీర వుంటుంది. నాజూకు తనం ఉట్టిపడే ఈ సిల్క్ చీరలు అన్ని షేడ్స్ లోనూ దొరుకుతాయి. ఇప్పుడు సాంప్రదాయ సిల్క్ పై బంధిని స్టైల్, కసుటి ఎంబ్రాయిడరీ డిజైన్లలో సారి కొత్త చీరలు వస్తున్నాయి. ఒకప్పుడు సాదాగా చిన్న అంచు తో మామిడి పిందెల డిజైన్లు చిన్న చిన్న బుటీలు ఉండేవి. ఇప్పుడు డబుల్ లైన్ చెక్స్ హెవీ పట్లు రాకాలు పది వేల నుంచి లక్ష పైన ధర పలుకుతున్నాయి. పెళ్లి చీరలైతే ఒక్క దాన్లో 700 గ్రాముల పైన బంగారం 500 గ్రాముల ప్యూర్ క్రేప్ సిల్క్ వాడ తారు.బంగారం పుత పూసిన వెండి జరీ వుంటుంది. ఇప్పుడిక మైసూర్ సిల్క్ సల్వార్ కామీజ్ లు రోజు దొరుకుతున్నాయి. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సాయం తో కొత్త డిజైన్లు రుపొందిస్తు ఎలక్ట్రానిక్ లూమ్స్ ద్వారా నేసే ఈ సిల్క్ తరాలు మారినా ఎప్పటికి మారని ఫ్యాషన్.

    నాజుకు అందాల మైసూర్ సిల్క్ శారీస్

    పెళ్లి చేరాల్లో ఒక్కటైన మైసూర్ సిల్క్ చీర వుంటుంది. నాజూకు తనం ఉట్టిపడే ఈ సిల్క్ చీరలు అన్ని షేడ్స్ లోనూ దొరుకుతాయి. ఇప్పుడు సాంప్రదాయ సిల్క్…

  • నిశిధి కి అందం వెలుగే. అందుకే చీకటిలో మెరిసే తారలు ఎప్పుడు ఎన్ని సార్లు చూసినా కొత్తగా అందంగా అద్భుతంగా ఉంటాయి. మరి పార్టీలకు చేసుకునే అలంకరణ కూడా అలా వుంటే అలా వుండేందుకు వచ్చినవే గ్లో ఇన్న ది డార్క్ టెంపరరీ టాటు లు పగలు మాములుగా వుండి రాత్రి వేళల్లో మెరుస్తూ ఉంటాయి. చీకటి వేళల్లో మిలమిలా మెరిసిపోయే ఈ టాటులు మెటాలిక్ గ్లో ఇన్ ది డార్క్ అని కూడా పిలుస్తాయి. చాలా చెక్కగా అందరి ద్రుష్టి ఆకర్షించేలా వుండే ఈ టాటులు ఒక్క సారి చుస్తే ఎవరో చిత్రకారుడు తీర్చి దిద్దిన అద్భుతమైన పెయింటింగ్ లా వున్నాయి.

    మిల మిల మెరిసే టాటు

    నిశిధి కి అందం వెలుగే. అందుకే చీకటిలో మెరిసే తారలు ఎప్పుడు ఎన్ని సార్లు చూసినా కొత్తగా అందంగా అద్భుతంగా ఉంటాయి. మరి పార్టీలకు చేసుకునే అలంకరణ…

  • ఈ నెలంతా క్రిస్మస్ వేడుకలే. పార్టీ వేడుకలు పండగ సంబరం ప్రపంచమంతా ఉన్నదే. ఈ పండగ కోసం తెలుపు ఎరుపు కలగలిసిన దుస్తులు ఎంచుకోమంటారు డిజైనర్లు. విస్కోస్ శాటిన్ తరహా వస్త్రాలతో అనార్కలీలు మ్యాక్సీ గౌన్లు బావుంటాయి. ఎంబ్రాయిడరీ పనితనం చేసిన చిన్న చిన్న ప్రింట్లు డిజైన్లు ఉన్న తెల్లని దుస్తులు బావుంటాయి. అలాగే క్రిస్మస్ పార్టీలకు లేస్ నెట్టెడ్ షిఫాన్ జార్జెట్ రకాలు కూడా అందమే. ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యూవెలరీ లేదా ముత్యాల నగలు వేసుకుంటే క్రిస్మస్ కళ వచ్చేసినట్టే. పూర్తిగా తెల్లని డ్రెస్ అయితే సేమ్ మ్యాచింగ్. తెల్లని ముత్యాలు తెల్లని చెప్పులు వగైరా లేదా మన ఫ్యాషన్ డిజైనర్లు సలహా ఇచ్చినట్లు తెలుపు ఎరువుల మేళనింపుల అందమైన దుస్తులకు ఏ డిజైనర్ సైట్ చూసినా వందలాది రకాలున్నాయి. చక్కని డ్రస్ ఎంచుకోవటం ఆలస్యం కొంచెం ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా.

    తెలుపు ఎరుపుల సమ్మేళనంగా క్రిస్మస్ ఫ్యాషన్

    ఈ నెలంతా క్రిస్మస్ వేడుకలే. పార్టీ వేడుకలు పండగ సంబరం ప్రపంచమంతా ఉన్నదే. ఈ పండగ కోసం తెలుపు ఎరుపు కలగలిసిన దుస్తులు ఎంచుకోమంటారు డిజైనర్లు. విస్కోస్…

  • భూమి గుండ్రంగా వుంది. ఇది మార్చలేని విషయం అలాగే ప్రపంచమంతా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చులకనగా వుండే అభిప్రాయముతోనే ఉన్నారు. ఎందుకు పనికి రాని ఆవారా అవచ్చు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ మాజీ మేయర్ మరిషియా మెక్రీ కావచ్చు. ఆయన ఇప్పటి ఆదేశ అధ్యక్షుడు కావచ్చు. అభిప్రాయం మాత్రం సేమ్ ఆయనో వ్యాఖ్య వినిపించాడు. అబ్బాయిలు చేసిన వ్యాఖ్యలు ఎంత అసభ్యంగా ఉన్నా సరే వాటిని ఇష్టపడని అబ్బాయిలంటూ ఉండరు . వాళ్లకవి నచ్చవంటే నేను నమ్మలేను. అనేసారు. ఆయనే ఇంత ఆలోచనారహితంగా మాట్లాడితే అమ్మాయిల రక్షణ ఏకంగా ఆ నగర పరిస్థితిని మేయర్ వ్యాఖ్యలకి ఎలా ఊహించాలి. అడుగడుగునా వేధింపులే. వెంబడించటాలు. చివరికి మేయర్ వ్యాఖ్యలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నగరం ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. అమ్మాయిల పై వేధింపులే కాదు. వాళ్లకి నచ్చని మాట విసిరినా చాలు 3600 రూపాయల జరిమానా. వాళ్ళ భాషలో వెయ్యి పెసోలు. ఇందుకు కారణం అక్కడ మొదలైన ఒక ఉద్యమం IVI UIVA MENOS అంటే ఇంకొక్కరికి ఇలా కాకూడదు అని ఉద్యమ ఫలితమే ఇప్పటి చట్టం.

    చిన్నమాటన్నా సరే జరిమానా

    భూమి గుండ్రంగా వుంది. ఇది మార్చలేని విషయం అలాగే ప్రపంచమంతా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చులకనగా వుండే అభిప్రాయముతోనే ఉన్నారు. ఎందుకు పనికి రాని…

  • 116 మంది ప్రత్యర్థులను జోడించి ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న స్టీఫనీ డెల్ వ్యులే మనసు కూడా ఎంతో అందమైనది డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధ పడుతున్న పిలల్ల కోసం ఒక ప్రాజెక్ట్ వర్క్ ప్లాన్ చేస్తోందిట. ఎకోయర్ ఆఫ్ ఏంజెల్స్ అనే మ్యూజిక్ థెరపీ ద్వారా ఆ వ్యాధితో పుట్టిన పిలల్లకు చికిత్స అందించటం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. స్టీఫనీ ప్రపంచ సుందరి కిరీటం గెలవటానికి ముందు తన స్వదేశం వ్యూర్టోరికో జాతీయ అందాల పోటీ మిస్ మాండో డెల్ ప్యూర్టోరికో 2016 నెగ్గింది. ఈ అందమైన అమ్మాయి సింగర్ మ్యుజీషియన్ మోడల్ కూడా న్యూయార్క్ లోని పేస్ యూనివర్సిటీ లో అండ్ కమ్యూనికేషన్ లో డబుల్ మేజర్. 8 సంవత్సరాల వయసులో తన దేశం తరఫున అంబాసిడర్ గా బ్రెజిల్ వెళ్లి ప్రతిష్టాత్మక సాన్ జవాన్ చిల్డ్రన్ కోయర్ తో తన తోటి పిలల్లతో కలిసి పాడిందిట. మిస్ వరల్డ్ అవ్వాలంటే కేవలం అందం మాత్రమే కాదు మంచితనం మానవత్వం విద్య విజ్ఞానం అన్నీ ఉండాలి.

    ఈ మనసెంతో సౌందర్య మయం

    116 మంది ప్రత్యర్థులను ఓడించి ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న స్టీఫనీ డెల్ వ్యులే మనసు కూడా ఎంతో అందమైనది డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధ పడుతున్న…

  • మనం నిలబడే తీరు మాట్లాడే పద్దతి కూర్చునే పొజిషన్ మొత్తంగా మన బాడీ లాంగ్వేజ్ మన గురించి అవతల మాయిషీకి చెప్పేస్తాయి. అంటున్నారు నిపుణులు. మనం కాస్త ప్రయత్నం చేస్తే ఎవరి ముందరైనా మనం ధీమాగా వుంటుందంటున్నారు. ఎప్పుడు తలెత్తు కొనే ఠీవీగా ఉండాలి. నేను దేన్నీ ఆషామాషీగా తీసుకోను . ప్రతీదీ నా కంట్రోల్ లో ఉంచుకోగలను అని చెప్పేలా ఉండాలి మన శరీర భాష. లేదా తలొంచుకుని సిగ్గు పడుతున్నట్లు దిక్కులు చుస్తే కార్పొరేట్ ఉద్యోగాల్లో నెగ్గటమూ అసలు పది మంది ముందు వాళ్ళతో సూచనగా నిలబడటమూ కష్టమే. వెంట్రుకలు సర్దుకోవటం ముఖం పదేపదే తుడుచుకోవటం చేతిలో పడే పడే టక్ టక్ మని నొక్కటం మన మనసులో ఆందళోనని ఎదుటి వాళ్ళకి చేరేస్తుంది. చేతులు చక్కగా స్థిరంగా పెట్టుకోవాలి. ఎవరి ముందు వినయంగా వంగి పోతూ సమాధానం చెప్పటం తప్పే. ఏదైనా ఇంటర్వ్యూ సమయంలో ఇది మరీ ప్రమాదం. స్థిరంగా నిలబడటం చూడటం మాట్లాడటం ఆత్మ విశ్వాసాన్ని చాటుతుంది. మనసు ఎంత తేటగా వుందో చెపుతోంది. అందుకే ఎప్పుడు మన మనసు బయటపడేలా ప్రవర్తించకూడదంటున్నారు నిపుణులు .

    శరీర భాష చెప్పేస్తుంది

    మనం నిలబడే తీరు మాట్లాడే పద్దతి కూర్చునే పొజిషన్ మొత్తంగా మన బాడీ లాంగ్వేజ్ మన గురించి అవతల మాయిషీకి చెప్పేస్తాయి. అంటున్నారు నిపుణులు. మనం కాస్త…

  • చూడగానే బంగారం అనిపించే లా వుంటుంది ఇత్తడి. అందమైన నగలు భారీ గంగాళాలు, ఇత్తడి సామాన్లు గుర్తొస్తాయి. ఇప్పుడు అవన్నింటి తో పాటు యాంటిక్ బ్రాస్ ఫర్నిచర్ వస్తుంది. సాంప్రదాయ ఇత్తడి ని కొమ్మలు, రెమ్మలతో అందంగా చేక్కలతో అమర్చిన కళాత్మక తరకాషి ఫర్నిచర్ వాడకం ఎక్కువయింది. క్యాండిల్ హోల్డర్లు, ఫ్లవర్ వెజ్లు, టేబుల్ ల్యంప్ లు, అద్దాల ఫోటో ఫ్రేమ్ లు లాంటి కళాత్మకమైన ఎన్నో వస్తువులు వస్తున్నయి. ఇత్తడి కళాకండాల తయారీ లో మొదటి స్థానం మన దేశానికే. ఇత్తడి ముడి లోహం కాదు. రాగి, జింక్ కలిపితే ఇత్తడి తాయారు అవుతుంది. 75 శాతం జంక్ కలిపితే ఇత్తడి బంగారంలా మెరుస్తుందిట. దీన్ని గిల్ట్ నగల్లో వాడే ప్రిన్సెస్ మెటల్ అంటారు. తరాలు గడిచి పోతున్న ఇత్తడి వస్తువులు అలాగే పడిపోకుండా ఉంటాయి.

    పుత్తడి మెరుపుల ఇత్తడి

    చూడగానే బంగారం అనిపించే లా వుంటుంది ఇత్తడి. అందమైన నగలు భారీ గంగాళాలు, ఇత్తడి సామాన్లు గుర్తొస్తాయి. ఇప్పుడు అవన్నింటి తో పాటు యాంటిక్ బ్రాస్ ఫర్నిచర్…

  • కళాకారుల గుండెల్లో తప్పకుండా తడి వుంటుంది. మంచి నటి గా, మల్లె పువ్వు వంటి నవ్వుతో హీరోయిన్ సుహాసిని మనందరికీ పరిచయమే. ఆమె విలక్షణమైన నటి, దర్శకురాలు, నిర్మాత మాత్రమే కాదు, మానవతావాది కూడా అందుకే ఒంటరి మహిలల కోసం ఆమె చెన్నాయి లో 'నామ్' అని ఫౌండేషన్ ప్రరంబిచారు. నామ్ అంటే తమిళం లో 'మనం' అని అర్ధం. జీవన శైలికి సంబందించిన నేనో కొర్స్ చేశాను. అందులో భాగంగా మహిళా సాధికారత పైన ఒక వ్యాసం నదుర్రించవలసి వచ్చింది. ఆ వ్యాసం రాస్తున్నప్పుడే ఒంటరి మహిళల సాధికారత కోసం ఏదైనా చేయాలి అనే తపన మొదలైంది అన్నారు సుహాసిని 'నామ్' ఫౌండేషన్ గురించి చెప్పుతాయి. చెన్నాయి లోని రోటరీ క్లబ్ సహకారం తో నామ్ మహిళా సాధికారత దిశగా కృషి చేస్తుంది. ఈ స్వచ్చంధ సంస్థ ద్వారా వృత్తి శిక్షణ తీసుకున్న వందలాది మంది వివిధ వృత్తుల్లో స్థిర పరిచారు.

    సుహాసిని ఔదార్యం

    కళాకారుల గుండెల్లో తప్పకుండా తడి వుంటుంది. మంచి నటి గా, మల్లె పువ్వు వంటి నవ్వుతో హీరోయిన్ సుహాసిని మనందరికీ పరిచయమే. ఆమె విలక్షణమైన నటి, దర్శకురాలు,…

  • పిల్లలు, పిల్లల దాకా ఎందులో యూత్ నోట్లో ఎప్పుడు నలిగేది చూయింగ్ గమ్. వాళ్ళు నమిలేటప్పుడు దాని రుచి సంగతి ఎలా వున్నా అది ఏ డ్రెస్ కైనా అంటితే మాత్రం ఒక పట్టాన వదలదు. ఏ వాషింగ్ కు ఇస్తామన్న దాన్ని చూడ కుండా ఇస్త్రీ చేస్తారేమో అనిపిస్తుంది. కొన్ని చిట్కాలున్నాయి. ఇలా చేస్తే చూయింగ్ గమ్ వుడి వచ్చేస్తుంది. చూయింగ్ గమ్ అంటుకున్న డ్రెస్ ని జిప్ బాగ్ లో పెట్టి డి ఫ్రిజ్ లో ఉంచితే దాన్ని బట్టు ఐస్ గడ్డ కడుతుంది. చూయింగ్ గమ్ అప్పుడు పొడిగా అయిపోతుంది. ఐస్ ముక్క తో కలిపి గట్టిగ లాగితే వుడి వస్తుంది. బాగా మరిగించిన వెనిగర్ లో ఈ గమ్ అంటుకున్నా వస్త్రాన్ని ముంచితే గం వుడి వస్తుంది. గమ్ అంటుకున్న వస్త్రం కింద ఒక పాత వస్త్రం పెట్టి ఇస్త్రీ చేస్తే ఆ గమ్ కింద వున్న పాత బట్ట కి అతుక్కు పోతుంది. హెయిర్ డ్రయ్యర్ తో గమ్ వున్న ప్రాంతం లో వేడి గాలి పెట్టి, అది వేడెక్క గానే చాకు తో తీసేస్తే గమ్ వుడి వస్తుంది.

    ఇలా చేస్తే గమ్ వుడి పోతుంది

    పిల్లలు, పిల్లల దాకా ఎందులో యూత్ నోట్లో ఎప్పుడు నలిగేది చూయింగ్ గమ్. వాళ్ళు నమిలేటప్పుడు దాని రుచి సంగతి ఎలా వున్నా అది ఏ డ్రెస్…

  • ప్రపంచంలో అతి చిన్న యోగ టీచర్ పేరు శృతి పాండే. వయస్సు 8 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్ లోని జుసి పట్టణంలో వుంటుందీ అమ్మాయి. 18 సంవత్సరాల వయస్సు నుంచి 90 ఏళ్ళ తాతల దాక ఈ పాప స్టూడెంట్ గా వున్నారు. యోగా కు ప్రముఖ కేంద్రమైన గంగ నది వడ్డున వుంది జుని పట్టణం. యోగా, వాకింగ్లు , ఉదయాన్నే నిద్ర లేవటానికి సహజంగా బద్దకిస్తు వుంటాం. అందరికి ఇన్స్పిరేషన్ కోసం శరీరంకూడా మనం చెప్పినట్లు మనం గీసిన గీత పై నిలబడదు. చివరకు మన శరీరం కూడా మనం చెప్పినట్లు వినక పొతే ఎట్లా? అందుకే యోగా. ఈ పాపను ఓ సారి చూసేసి రేపటి నుంచి ఎదో ఒక శరీర వయామం చేసి శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటామని కొత్త సంవత్సరం రాబోయే ముందే సపదం తీసుకోండి.ప్రపంచంలో అతి చిన్న యోగ టీచర్ పేరు శృతి పాండే. వయస్సు 8 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్ లోని జుసి పట్టణంలో వుంటుందీ అమ్మాయి. 18 సంవత్సరాల వయస్సు నుంచి 90 ఏళ్ళ తాతల దాక ఈ పాప స్టూడెంట్ గా వున్నారు. యోగా కు ప్రముఖ కేంద్రమైన గంగ నది వడ్డున వుంది జుని పట్టణం. యోగా, వాకింగ్లు , ఉదయాన్నే నిద్ర లేవటానికి సహజంగా బద్దకిస్తు వుంటాం. అందరికి ఇన్స్పిరేషన్ కోసం శరీరంకూడా మనం చెప్పినట్లు మనం గీసిన గీత పై నిలబడదు. చివరకు మన శరీరం కూడా మనం చెప్పినట్లు వినక పొతే ఎట్లా? అందుకే యోగా. ఈ పాపను ఓ సారి చూసేసి రేపటి నుంచి ఎదో ఒక శరీర వయామం చేసి శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటామని కొత్త సంవత్సరం రాబోయే ముందే సపదం తీసుకోండి.

    చిన్నారి యోగా టీచర్

    ప్రపంచంలో అతి చిన్న యోగ టీచర్ పేరు శృతి  పాండే. వయస్సు 8 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్ లోని జుసి పట్టణంలో వుంటుందీ అమ్మాయి. 18 సంవత్సరాల…