• కర్ణాటక లో ఇల్కాల్ ఎక్కడఅంటే చెప్పలేరేమో కానీ ఇల్కాల్ చీరలంటే మాత్రం చాలా పాప్యులర్. ఇల్కాల్ గ్రామం మొత్తం ఈ నేత వేయటంలో నిమగ్నమై వుంటారు. పేల్ స్టైపెడ్ పల్లు అంచుల దాకా సాగే బోర్డర్ తో కలిసిపోవడం ఇల్కాల్ చీరల స్పెషాలిటీ. ఇవి చాలా భాగం మగ్గాల పైనే నేస్తారు. సాధారణంగా చీర పమిటి కొంగు విడిగా తయారు చేసి జాయింటుచేస్తారు. ఐదు వేల పోగులతో చేత్తో ముడులు వేస్తూ కూల్ బ్రైట్ కలర్స్ తో నేశాక చీరలు కొత్త రంగు చేత్తో అద్ది ట్విస్ట్ చేస్తారు. నిండు నూలు దారాలతో రంగుల సిల్క్ లేదా రేయాన్ అంటే ఆర్ట్ సిల్క్ పోగుల్ని ఓ రోజులో అల్లిక పూర్తి చేస్తారు. కసూటి ఎంబ్రాయిడరీ అదనపు హంగుగా ఉంటుంది. శంఖు పూలు ,కలువ పూలు రధాలు ఏనుగులు దీపాలు వంటి డిజైన్స్ వేస్తారు. చీర చాలా అందంగా ఉంటుంది.

    అందానికే అందం ఇల్కాల్ శారీస్

    కర్ణాటక లో ఇల్కాల్ ఎక్కడఅంటే చెప్పలేరేమో కానీ  ఇల్కాల్ చీరలంటే మాత్రం చాలా పాప్యులర్. ఇల్కాల్ గ్రామం మొత్తం ఈ నేత వేయటంలో నిమగ్నమై వుంటారు. పేల్…

  • మంచి ఆరోగ్యం కావాలంటే ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు చెపుతూనే ఉంటారు. సోడియం నరాల ఇంపల్స్ ని ట్రాన్స్మిట్ చేయటానికీ మజిల్ ఫైబర్ తో కాంట్రాక్ట్ రావటానికి సాయ పడుతుంది. ఇందుకు కొద్దిపాటి ఉప్పు చాలు. అంటే రోజుకు సగం కంటే ఎక్కువ టీ స్పూన్ పరిమాణం చాలు. ఉప్పును అధికంగా వాడితే కార్డియో వాస్క్యుల్లర్ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. దైనందిన ఆహారంలో ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించి సహజ రుచిని ఇచ్చే వాటిని ప్రత్యామ్నాయం చేసుకోవాలి. స్పైస్ లు డ్రై లేదా తాజా హెర్బ్స్ వాడుతుండాలి. మిరియాలు దాల్చిన చెక్క పసుపు ఆవాలు యాలకులు తులసి ఆకులు కసూరీమేతి వంటి వాటిని వాడాలి. క్వాన్ట్ ట్రిన్స్ట్ లేదా ప్రాసెస్ ఉత్పత్తులు తగ్గించాలి. కూరగాయల్ని గ్రిల్ చేయటం రోస్ట్ చేయటం ద్వారా వాటిలోని సహజమైన తీపిని వెలికి తీయాలి. వీటికి కొద్దిపాటి ఉప్పు జతచేస్తే రుచి దక్కుతుంది. ఏ పదార్ధాలు కొని ఉడికించినా తక్కువ స్థాయిలో ఉప్పు అన్న సూత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

    కాస్తంత తక్కువ స్థాయిలో

    మంచి ఆరోగ్యం కావాలంటే ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించాలని నిపుణులు చెపుతూనే ఉంటారు. సోడియం నరాల ఇంపల్స్ ని ట్రాన్స్మిట్ చేయటానికీ మజిల్ ఫైబర్ తో కాంట్రాక్ట్…

  • నీహారికా కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చావడులోనే పరిష్కారం ఎందుకు వెతుకుతున్నారు? అని సమాధానం తనను తానూ ప్రేమించే వ్యక్తి తనను తానూ ఎలా చంపుకుంటాడు ? అంటాడు జాషో. నిజమే. సకల సమస్యలకు మూలం భయం. నిరుద్యోగం ఆర్థిక సమస్య ప్రేమ వైఫల్యం విడాకులు ఆత్మీయుల మరణాలు నమ్మక ద్రోహాలు ఏదైనా కానీ. సమస్య తీవ్రత ఒక శాతం. మిగతా అంతా భయం. ఏ సమస్య పరిష్కించలేనంత క్లిష్టతరం కాదు. భయంతోనే మనిషిలో తెలివి తేటలు శక్తి సామర్ధ్యాలు మట్టికొట్టుకుపోతాయి. అప్పుడే పరిష్కారం ఒక్క బావే అన్న నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు చెప్పు ఏదీ సాధించకుండా ఏ ఒక్క మంచి పనీ చేయకుండా ఏ ఒక్క జీవితాన్ని మార్చకుండా జీవితం వద్దనుకోవటం ఎంత వరకు న్యాయం. కఠిన పరీక్షలు పెట్టినప్పుడు వైమీ అనుకోకూడదు. ట్రై మీ .... అని సవాలు స్వీకరించాలి. సర్వస్వం కోల్పోయినా భవిష్యత్తు ఒకటుంటుంది. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో నెగ్గుకొస్తేనే సమర్ధుడైన నావికుడవుతాడు. ఎత్తు పల్లాలు ఎదుర్కుంటేనే మనిషి రాటుదేలుతారు. సమస్యల్లోనే సమర్ధత బయటపడుతుంది. ఇప్పుడు చెప్పు ప్రతి మనుషులు సమస్యల్ని ఎదుర్కునే ఇన్స్టింట్ సామర్ధ్యాలు ఉంటాయి. వాటని సమర్ధవంతంగా వాడుకుంటే చావు ఆలోచనలను చావు దెబ్బ తీయచ్చు. ఏమంటారు.

    ఎంత అందమైందీ జీవితం

    నీహారికా కొత్త సంవత్సరం రాబోతోంది. ఇంకా నాలుగు అడుగులే. ఇప్పుడు నీ ప్రశ్న జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ చావడులోనే పరిష్కారం ఎందుకు వెతుకుతున్నారు? అని సమాధానం…

  • ఫ్యాషన్ స్టయిలిస్ట్ లు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎర్రని రంగు ఎపుడూ ఫ్యాషన్ ఐకాన్ గా వుంటుందిట. ఆకర్షణీయమైన ఈ రెడ్ కలర్ ఎలాంటి డిజైన్ నయినా అద్భుతంగా ఆవిష్కరిస్తుందిట. రెడ్ కార్పెట్ సెలబ్రెటీలు ఏ రంగుల్లోనే డివైన్ లుక్ లో కనిపిస్తారట. వాళ్ళ దృష్టిలో ఇదో శక్తిమంతమైన రంగు. ఇటీవలే ఒక పరిశోధనలో కూడా ఎర్రని రంగు దృఢమైన ఆల్చనాలు సామర్ధ్యంతో కూడిన సున్నితమైన మనస్సుకు సూచన అంటున్నారు. చైనాలో ఎర్రని రంగును లక్కీ కలర్ గా పరిగణిస్తారు. ఇది ఆధిక్యతను సూచించే కలర్ కూడా . ఎరుపు హార్ట్ రేట్ ను శ్వాసకు ఉద్దీప్తం చేస్తుంది. ఒత్తిడి ఫ్రేస్తేషన్ కోపం కూడా ఎక్కువ చేస్తుందీ రంగు. తమాషా ఏమిటంటే రాయబారుల్లో ఇలాంటి రంగు దుస్తులు ధరిస్తే ఇక అంతే సంగతులు. ఈ తీవ్రమైన రంగు ప్రశాంతమైన వాతావరణం ఇవ్వదంటున్నారు. సో ఇది అద్భుతమైన అందమైన రంగు. ఎర్రనీదుస్తులు ఎవరికైనా అందాన్ని ఇస్తాయి. అలాగే మనల్ని సీరియస్ గా ఉండేట్టు చేస్తాయి.

    ఎంత అందమో అంత డేంజర్

    ఫ్యాషన్ స్టయిలిస్ట్ లు ఒక బ్యూటిఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. ఎర్రని రంగు ఎపుడూ ఫ్యాషన్ ఐకాన్ గా వుంటుందిట. ఆకర్షణీయమైన ఈ రెడ్ కలర్ ఎలాంటి డిజైన్…

  • ఒక వూరి సమస్యను గ్రంధాలయం తీర్చింది. కేవలం పుస్తకాలూ చదవటం వార్త పత్రికలు చదవటం మనుషుల అలవాట్లనే మార్చేసింది. రాజస్థాన్ లోని బిల్వాల జిల్లాలోని మారుమూల గ్రామం ధిఫరా. ఆ వూర్లో పెద్దలు పిల్లలు కూడా మద్యం తాగుతారు. S. F. D ద్వారా కమ్యూనిస్ట్ లైబ్రరీ ప్రోగ్రాం ద్వారా ఊర్లో గ్రంధాలయం వెలిసింది. ఈ S. F. D వర్క్ షాప్ ల పుణ్యమా అని పుస్తక కదా పఠనాలు నిర్వహించారు. S. F. D కార్యకర్త అతిధి ఏమంటారంటే నెమ్మదిగా గ్రామంలో చాలా మంది తీరిక సమయాన్ని గ్రంధాలయంలో గడుపుతున్నారు.దీన్ని ప్రభావంతో గ్రామస్థుల ప్రవర్తనా అలవాట్లకు సంభంధించిన మార్పు వస్తుంది. ప్రతి వాళ్ళు దృష్టిలో వుంచుకోవాలిసిన విషయం ఏమిటంటే ఒకటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎవరి శక్తి యుక్తులు వాళ్ళు తెలుసుకుని ఆ దిశగా కొత్త దారిలో పయనించటం. ముందుగా మనకు మన శరీరానికి హాని చేసే ఎలాంటి అలవాట్ల దగ్గరకు రానీయకపోవటం. ఈ ధిఫరా గ్రామం లో నడుస్తున్న S. F. D వర్క్ షాప్ ల గురించి మాట్లాడుకోవటం ఒక చిన్న ఆలోచన వూరు వూరంతటి లో మార్పు తేవటం గురించి.

    చిన్ని ఆలోచన గ్రామాన్ని మార్చేసింది

    ఒక వూరి సమస్యను గ్రంధాలయం  తీర్చింది. కేవలం పుస్తకాలూ చదవటం వార్త పత్రికలు చదవటం మనుషుల అలవాట్లనే మార్చేసింది. రాజస్థాన్ లోని బిల్వాల జిల్లాలోని మారుమూల గ్రామం…

  • ఇంటి ముందు కాస్తంత చోటున్నా సరే నాలుగు కుండీలు పెట్టి తులసి మొక్కలు నాటండి. దోమల్ని పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చిన్న రిపోర్ట్ వచ్చింది. ఇరుగ్గా వుండే మూలల్లో వుండే సామాన్లు క్లియర్ చేసి నీళ్లు నిలవకుండా చేసి ఆరోగ్యానికి హాని చేయకుండా వుండే దోమల మందు వాడి ముందు అనారోగ్యాలు రాకుండా చూసుకోమంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. గత ఐదు దశాబ్దాలలో దోమల సంఖ్యా పెరగవలిసిన దానికంటే పదిరెట్లు అధికంగా పెరిగాయట. ఇటీవల అమెరికాలో డెంగ్యూ ఎల్లో ఫీవర్ , చికన్ గున్యా వంటి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా విపరీతంగా పెరగటానికి గల కారణాలు అన్వేషిస్తూ అడవులు నరికేయటంలో ఆకుపచ్చ వనాల్లో తమ జీవన చక్రాన్ని కొనసాగించే అడ్వై దోమలు నగరాలకు వలస వచేస్తున్నాయని తేలింది. దోమలు రానీయకుండా చేసే కొన్ని రకాల మొక్కలుంటాయి. అవన్నీ వెతికి పట్టుకుని ఇంటి చుట్టూ నాటుకోండి అంటున్నారు పరిశోధకులు.

    అడవులు తగ్గటం వల్లే ఈ ప్రమాదం

    ఇంటి ముందు కాస్తంత చోటున్నా సరే నాలుగు కుండీలు పెట్టి తులసి మొక్కలు నాటండి. దోమల్ని పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చిన్న రిపోర్ట్ వచ్చింది. ఇరుగ్గా…

  • పెదవుల తడి ఆరిపోయి పగిలిపోయి ఇబ్బందిపెడితే లిప్ బామ్ లు కొంటూ ఉంటాం. కాస్త ఓపిక చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని లిప్ బామ్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె బాదం నూనె రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ పావుకప్పు తాజావి లేదా డ్రై గులాబీ రేకలు ఓ ప్యాన్ లో వేసి సన్నటి సెగతో వేడి చేస్తే మిశ్రమం మౌల్డ్ అవుతుంది. దీన్ని శానిటైజ్డ్ కంటైనర్ లో పోసి ఓ గంట ఆరనిచ్చి పూరేకులు వడగట్టి బామ్ మిక్స్డ్ గా వాడుకోవచ్చు. సిట్రస్ లిప్ గ్లాస్ తయారీకైతే రెండు టేబుల్ స్పూన్ల తేనె వేడి చేసి వాక్స్ కరిగాక బౌల్ లో పోనీ ఐస్ నింపిన ట్రే లో ఉంచాలి. 10,15 చుక్కలు నిమ్మరసం వేస్తె లిప్ గ్లాస్ సిద్ధం అయిపోతుంది. దీనికి పొడిగా ఉన్న కంటైనర్ లో పోసి భద్రం చేసుకోవచ్చు.

    సొంతంగా లిప్ బామ్స్

    పెదవుల తడి ఆరిపోయి పగిలిపోయి ఇబ్బందిపెడితే లిప్ బామ్ లు కొంటూ ఉంటాం. కాస్త ఓపిక చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని లిప్ బామ్ ని…

  • సంక్రాంతి నెల రోజులూ పల్లెటూర్లలో హరిదాసులు ప్రత్యక్షం అయ్యేవారు. తల పైన గుమ్మడి కాయ ఆకారపు గిన్నె దాని అంచులో పువ్వులదండ నుదుట తిరునామం చేతిలో శృతి వీణ కళ్ళకి గజ్జెలు ధ్వనికి సరిపడే విధంగా ఓ చిన్న నృత్యం గానం చేస్తూ మధ్యలో గుండ్రంగా తిరుగుతుండే విధానం. ఇది హరి దాసు వేషం. తలపైన కనిపించే గుండ్రని గిన్నె భూమికి సంకేతం. దాన్ని తలపైన ధరించి కనిపించటం అనేది ఆ పాత్రలో దానంగా బియ్యం సమర్పించటం అనేక రాబోయే పంట నిమిత్తం ధాన్యాన్ని భూమిలో విత్తనాలుగా వేస్తున్నామన్న సంకేతం. కృషార్పణం అంటూ బియ్యం సమర్పిస్తే శ్రీమద్రమణ గోవిందా అంటూ హరిదాసు స్వీకరించటం ఓ శ్రీహరి ఈ గృహిణి కృతజ్ఞతా భావంతో నీ ప్రతి నిధిగా వచ్చిన నాకు బియ్యాన్ని కానుకగా ఇచ్చిందని చెప్పేందుకు సంకేతం. ఈ భూమి డయాటహో మనకిచ్చిన పంటను ఇతరులకు పంచటం అనే సామజిక విశేషాన్ని తెలియజేస్తుంది హరిదాసు రూపం. హరిదాసు పాడే ప్రభాత భక్తి గీతం ఆరోజంతా ఆ ప్రభావాన్ని మనిషిపైన ఉంచి ఎన్నో సంతోషాలు ఇచ్చి ఈ ప్రకృతి రుణాన్ని ప్రకృతి ఇచ్చిన పంటను అందరికీ పంచి ఆనందిస్తునాన్ని చెప్పటం అంటే అందరం అన్నీ పంచుకోవాలని ఏ మతమైన బోధించే ఆధ్యాత్మిక సత్యం.

    అందరం అన్నీ పంచుకొమ్మని చెప్పే ధర్మ సూక్ష్మం

    సంక్రాంతి నెల రోజులూ పల్లెటూర్లలో హరిదాసులు ప్రత్యక్షం అయ్యేవారు. తల పైన గుమ్మడి కాయ ఆకారపు గిన్నె దాని అంచులో పువ్వులదండ నుదుట తిరునామం చేతిలో శృతి…

  • బెంగుళూరుకు చెందిన 21 సంవత్సరాల ఐశ్వర్య స్సె కూడా ఈ సంవత్సరం గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచివేర్స్ అవార్డుకు ఎంపికైంది. తన ధైర్యం, పట్టుదల, కృషికి గానో ఈ అవార్డు లభించింది. ఈమెకు లక్ష రూపాయిల ప్రైజ్ మనీ వుంటుందీ అవార్డుకు. ఐశ్వర్యకు బైక్ రేజింగ్ ఇష్టం. రేజింగ్ కెరీర్ ప్రారంబించిన నాలుగేళ్ళలోనే పేరు మోగే రికార్డులను సొంతం చేసుకుంది. 2014లో సియట్ ఎంటీవి ది చేజ్ సిజన్ లో పాల్గొని గుజరాత్ లోని రాణి ఆఫ్ కట్ నుంచి మేఘాలయ లోని చిరపుంజి వరకు 24 రోజుల్లో దాదాపు 8500 కిలో మిటర్లు ప్రయాణం చేసి రికార్డు సృష్టించింది. 2016 లో రైడ్ ది హిమాలయలో పాల్గొన్న మొదటి యువతి ఐశ్వర్యనే. 2016 మే లో జూనియర్ రేసింగ్ సిరీస్ లో రేస్-1, రేస్-2 లో మొదటి స్థానంలో నిలిచింది.

    సహస క్రీడలకు అవార్డు పొందిన ఐశ్వర్య

    బెంగుళూరుకు చెందిన 21 సంవత్సరాల ఐశ్వర్య పిస్సే కూడా ఈ సంవత్సరం గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచివేర్స్ అవార్డుకు ఎంపికైంది. తన ధైర్యం, పట్టుదల, కృషికి…

  • ఈ ఏడాది ఐదవ అంతర్జాతీయ కూచిపూడి డాన్స్ కన్వేన్షన్ లో భాగంగా 6117 మంది కుచిపూడి నాట్య కళాకారులు ఒకే సారి 'జయము జయము' గీతానికి నెలకొల్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం గిన్నీస్ రికార్డ్స్ ప్రతి నిధి రిషినాద్ ఏ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి గిన్నీస్ రికార్డు అందజేసారు.

    కూచిపూడి నృత్యానికి గిన్నీస్ రికార్డు

    ఈ ఏడాది ఐదవ అంతర్జాతీయ కూచిపూడి డాన్స్ కన్వేన్షన్ లో భాగంగా 6117 మంది కుచిపూడి నాట్య కళాకారులు ఒకే సారి ‘జయము జయము’ గీతానికి నెలకొల్పారు.…

  • అంటార్కిటికా మహా సముద్రం ఈదిన భక్తి శర్మ గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచీవర్స్ అవార్డు పొందిన మూడో అమ్మాయి. మొత్తం ముగ్గురు శ్వేతా కట్టి, ఐశ్వర్యా, భక్తీ శర్మ తీసుకున్న ధర వనితలు రోజు నిరంతరాయంగా ఐదు గంటల పాటు స్విమ్మింగ్ ప్రాక్టిస్ చేసిన భక్తి, తల్లి లీనా శర్మ తో పాటు ఇంగ్లీష్ ఛానల్ ఈది ప్రపంచ రికార్డు నమోదు చేసారు. 2015లో అంటార్కిటికా సముద్రం ఈదిన తోలి ఆసియా మహిళ గా ప్రపంచ రికార్డు సృష్టించారు. స్విమ్మింగ్స్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన భక్తి 2016 యంగ్ అచీవర్స్ అవార్డు కు ఎంపికైన ఈ సంవత్సరం కెరీర్ లో ఇంకా ముందు అడుగు వేసింది. భక్తి శర్మ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు. యంగ్ యచీవర్స్ ముగ్గురికి అభినందనలు.

    సముద్రాల్ని ఈదేసిన భక్తి శర్మ కు అవార్డు

    అంటార్కిటికా మహా సముద్రం ఈదిన భక్తి శర్మ గ్లోబల్ సమ్మిట్ 2016 యంగ్ అచీవర్స్ అవార్డు పొందిన మూడో అమ్మాయి. మొత్తం ముగ్గురు శ్వేతా కట్టి, ఐశ్వర్యా,…

  • విసిరి పడేసిన మొలుచుకొచ్చి అద్భుతమైన గంజిల్లాంటి అమ్మాయిలు. వీళ్ళకు ఎవళ్ళతో పోలిక లేదు. వీళ్ళకు వీళ్ళు సాటి. ముంబాయి నగరంలో కామాఠీప్పర లోని చీకటి వీధిలో పుట్టి పెరిగింది శ్వేతా కట్టి. తన లాంటి వాళ్ళ జీవితాలకు చదువే వెలుగనుకుంది. స్వచ్చంద సంస్థ అప్నేఆప్ పాఠశాలలోచదువుకుంది. క్రాంతి అనే ఇంకో సంస్థ అమెరికా వెళ్ళి చదువుకుంటుంది. ఉన్నత చదువులు చదివి తిరిగి వచ్చి కామాఠీపుర లో కౌన్సెలింగ్ సంస్థ ఏర్పాటు చేసింది. అక్కడి అమ్మాయిలు వృత్తి వైపు వెళ్ళకుండా మార్పు తీసుకు రావడం ఆమె లక్ష్యం పేరు, అవార్డు వెతుక్కుంటూ వస్తున్నాయి. ది ఇండస్ ఎంట్రప్రెన్యుర్స్ నిర్వహించిన టై గ్లోబల్ సమ్మిట్ 2016 లో యంగ్ యభీవర్సి అవార్డుకు ఎంపిక అయింది.

    చీకటి విరిసిన వెన్నెల శ్వేత కట్టి

    విసిరి పడేసిన మొలుచుకొచ్చి అద్భుతమైన గంజిల్లాంటి అమ్మాయిలు. వీళ్ళకు ఎవళ్ళతో పోలిక లేదు. వీళ్ళకు వీళ్ళు సాటి. ముంబాయి నగరంలో కామాఠీప్పర లోని చీకటి వీధిలో పుట్టి…

  • రేపే క్రిష్టమస్ పాపం చేసిన వారికి సిక్షించడమే కాదు. పాపమే మరణించాలి. అలా జరిగితే పాపం లేని మనిషి పాప రహితుడై ఏసుక్రీస్తు లా మారతాడని దేవుని నమ్మకం. అందుకే నశించిన దాన్ని వెదికి రక్షించే నిమిత్తం ఆయన తన ద్వితీయ కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి పాప పరిహారార్ధం దేవుడు నరుడిగా జన్మించిన పవిత్రమైన రోజే క్రిస్టమస్. మనుషులందరూ ఒకరి పట్ల ప్ర్రేమనురాగాలు కలిగి వుండటం ద్వేషాన్ని విడనాడటం క్రిస్మస్ పర్వదిన ప్రాముఖ్యం. నిన్ను వాలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇదే క్రిస్మస్ నాడు సమస్త మానవాలికి క్రీస్తు అందించిన శుభ సందేశం.

    క్రిస్మస్ శుభాకాంక్షలు

    రేపే క్రిష్టమస్ పాపం చేసిన వారికి సిక్షించడమే కాదు. పాపమే మరణించాలి. అలా జరిగితే పాపం లేని మనిషి పాప రహితుడై ఏసుక్రీస్తు లా మారతాడని దేవుని…

  • స్వరాన్ని అధ్యయినం చేసి, లోపాలుంటే కనిపెట్టి స్వరాన్ని ఎలా నియంత్రించుకొవచ్చో సర్వే విద్యాని వాక్సాలజీ అంటారు. ఇలాంటి అరుదైన అమూల్యమైన నేర్చుకున్నారు చెన్నాయి కి చెందిన డా.శ్యామలా వినోద్ కుమార్. ఇది క్లినికల్ ట్రీట్మెంట్. స్వర ఆధారిత సాధన, స్వర యోగా, స్వర రక్షణకు అవసరమైన సూచనలు, సలహాలు, సహకారాలు ఇస్తారు. డా శ్యామల వినోద్ కుమార్ ఈ వోక్సాలజీ కొర్స్ చేసిన తోలి భరతీయిరాలు. భావోద్వేగాలు స్వరం పైన ప్రభావం చూపెడతాయి. మన గొంతులో వాటిని వినిపిస్తాం. కోపం, ఆవేశం, ఇష్టం, సంతోషం ఇవన్నీ గొంతుతో పలికే భావాలు. పాటనేర్చుకోవడం కోసం ఇలాంటి ఉద్వేగాలు నియంత్రించుకుని చెక్కని స్వరం తో పాడటం కోసం ఈ వోక్సాలజీ క్లాసెస్ ఉపయోగ పడతాయి. ఈ స్వరాని సంరక్షించే విద్య నేర్చుకున్న శ్యామల గారికి శుభాకాంక్షలు.

    స్వర వైద్యం చేసే శ్యామల

    స్వరాన్ని అధ్యయినం చేసి, లోపాలుంటే కనిపెట్టి స్వరాన్ని ఎలా నియంత్రించుకొవచ్చో సర్వే విద్యాని వాక్సాలజీ అంటారు. ఇలాంటి అరుదైన అమూల్యమైన నేర్చుకున్నారు చెన్నాయి కి చెందిన డా.శ్యామలా…

  • అదిరేటి డ్రెస్సు మేమేస్తే...... అని పాత సినిమా పాట పాడుకుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా వుంటే బోరేస్తుంది కూడా. వున్న పాత దాన్నే కొత్తగా చూడాలి, చూపించాలి. డెనిమ్ ప్యాంట్లు ఎప్పుడూ ఒకే రకంగా ఫ్యాషన్ ఐకాన్ గా ఉంటాయి. అవి వేసుకోవాలి అంటే విసుగ్గా వుండదు. చాలా నలుపుగా వాటికి కొత్త హంగులు తెచ్చారు. రకరకాల రంగులద్దేసి రకరకాల మోడల్స్ తో తీర్చి దిద్దే న్యూ లుక్ తో వాటిని చూపించారు. ప్యాంటు పైన అచ స్టాక్ట్ పెయింట్ గా రకరకాల రంగులద్దేసి ప్యాంట్ మొత్తం అడవి అందాల్ని తెచ్చి పెట్టేసి, మంచి మంచి పైంట్లు డిజైన్లు గీసి, రంగ వల్లులు గీసేసి మొత్తానికి కాజువల్ గా కనిపించే వీటిని ఫ్యాషన్ మోడల్స్ పక్కన నిలబెట్టెసారు. ఇప్పుడు ప్యాంట్ పైన పెయింట్ ఒక స్పెషల్ అందం, సాదా సీదా ప్యాంట్ అదిరిపోయింది.

    సాదా సీదా కి చూడ చెక్కని రంగులు వేస్తె

    అదిరేటి డ్రెస్సు మేమేస్తే…… అని పాత సినిమా పాట పాడుకుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా వుంటే బోరేస్తుంది కూడా. వున్న పాత దాన్నే కొత్తగా చూడాలి, చూపించాలి.…

  • జానపద చిత్రాల్లో మహారాణులు, యువరాణులు బ్రహ్మాండమైన డిజైనర్ జాకెట్లు వేసుకుంటారు. ఆ జాకెట్ తరహాని కోర్ సెట్ అంటారు. ఇప్పుడా కోర్ సెట్ బ్లవుజ్ ని చెక్కని రంగుల్లో వున్న సాదా సిల్క్ సారీకి జోడిస్తే మొత్తంగా రాజకుమారి లుక్ వచ్చేస్తుంది. చెక్కని చీర పైకి ఈ కోర్ సెట్ అధ్యాద్మికంగా కనిపిస్తుంది. చెక్కని ఎంబ్రాయిడరీ కోర్ సెట్ బ్లవుజ్ ని శారీ గౌన్ కు కూడా జత చేయోచ్చు. పార్టీ లుక్ కోసం ప్రత్యేకంగా కనిపించడం కోసం ఇప్పటికే వార్టరోబ్ లో వున్న ఏ చీరకైన ఈ కోర్ సెట్ ను సెట్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది సినీతారలు ఈ ఫ్యాషన్ ఫాలో అయ్యారు చూడండి.

    కొత్త స్టైల్ కోసం కోర్ సెట్

    జానపద చిత్రాల్లో మహారాణులు, యువరాణులు బ్రహ్మాండమైన డిజైనర్ జాకెట్లు వేసుకుంటారు. ఆ జాకెట్ తరహాని కోర్ సెట్ అంటారు. ఇప్పుడా కోర్ సెట్  బ్లవుజ్ ని చెక్కని…

  • ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు బంగారం ఒక్క అడుగు వెనక్కి ఉన్నాట్లు అప్పుడెప్పుడో సన్నటి గొలుసు చేతికి వాచీ అని నవలా నాయికలను వర్ణిస్తున్నారు. ఇప్పుడైతే ఆ రోజులు వెనక్కిపోయి డ్రెస్ కి జ్యూవెలరీ మ్యాచ్ అయితేనే ఫ్యాషన్ అన్న రోజులు వచ్చాయి. కాబట్టి ఫంకీ జ్యూవెలరీ మార్కెట్లో కొత్తగా మెరుస్తూ అమ్మాయిలను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆలా తళుకు లీనుతూ అందంగా కనిపించే మురానో గ్లాస్ పెండెంట్స్ ఇటలీలోని వెనిస్ ఓ ప్రత్యేక మైన పద్దతి లో తయారు చేసే ఈ గ్లాసు లాకెట్లు యూత్ కి తెగనచ్చేసాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలందరూ ఇష్టపడే పెండెంట్స్. తమ ఇష్టాన్ని బట్టి ఇవి నైలాన్ కాటన్ మెటల్ చేయిస్తూ లేదా తాళ్లకు తగిలించుకొని వేసేసుకుంటున్నారు. ఒక సూర్య కిరణమో రాత్రివేళ లైటు వెలుగు పడితే ఇవి వర్ణాలతో జిగేల్ మంటున్నాయి.

    తళుకు లేసే గాజు లాకెట్

    ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు బంగారం ఒక్క అడుగు వెనక్కి ఉన్నాట్లు అప్పుడెప్పుడో సన్నటి గొలుసు చేతికి వాచీ అని నవలా నాయికలను వర్ణిస్తున్నారు. ఇప్పుడైతే ఆ రోజులు…

  • క్యాబేజీని ప్రపంచం మొత్తం వాడతారు. మెడిటేర్నియన్ కోస్ట్ కు చెందిన క్యాబేజీ ఏడాది మొత్తం దొరికినా ఈ శీతాకాలంలో ఎక్కువగా ఎదిగే పంట ఇది. పచ్చిగా సలాడ్స్ తో దీన్ని తినచ్చు. విభిన్న ప్రాంతాల్లో విభిన్న రంగుల్లో లభిస్తుంది క్యాబేజీ. ఇందులో ఫిట్ న్యూట్రియాంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా దొరుకుతాయి. అన్ని రకాల థెరప్టిక్ డైట్స్ లో తప్పనిసరిగా ఉండాల్సినది. క్యాలరీలో చాలా తక్కువ. ఫ్యాట్ కూడా నామ మాత్రం . వంద గ్రాముల క్యాబేజీ లో 27 క్యాలరీల 0.1 గ్రాముల కొవ్వు ఉంటాయి. చైనీస్ క్యాబేజీని సలాడ్స్ లో వాడతారు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది సరైన ఛాయిస్. వీటిలో ఉన్న పోషకాల దృష్ట్యా బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రిస్తుంది. పీచు చాలా ఎక్కువగా వుంటుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో లభించే విటమిన్ కె గర్భవతులకు పుట్టిన పసిబిడ్డలకు చాలా ముఖ్యమైనవి.

    తప్పనిసరి ఆహారం క్యాబేజీ

    క్యాబేజీని ప్రపంచం మొత్తం వాడతారు. మెడిటేర్నియన్  కోస్ట్ కు చెందిన క్యాబేజీ ఏడాది మొత్తం దొరికినా ఈ శీతాకాలంలో ఎక్కువగా ఎదిగే పంట ఇది. పచ్చిగా సలాడ్స్…

  • లేసు ఒక ఫ్యాషనబుల్ ఆర్ట్. ఏ దుస్తులపైనా లేసు అల్లికల్ని జోడించినా సాదాసీదాగా అన్ ఫినిష్డ్ గా ఉన్న ఆ దుస్తుల రూపం మారిపోతుంది. మన దేశంలో లేసుల తయారీ మొఘలాయీల కాలం నుంచి కనిపిస్తోంది. భారతీయ రాచరికపు కుటుంబీకులకు లేసులతో గల అనుభవం పాశ్చాత్య సంస్కృతులతో వారికీ గల సాన్నిహిత్యాన్ని ప్రతిబింబిస్తుందని నేటి ఫ్యాషన్ డిజైనర్లు చెపుతారు.అలనాటి లేసులు కళని భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ అందిపుచ్చుకుని సరికొత్త పోకడలు అద్ది కొత్తదనాన్ని రూపొందించింది సోనమ్ కపూర్. కత్రీనా కైఫ్ ,శిల్పా శెట్టి, కరీనా కపూర్ వంటి సెలబ్రెటీలు లేస్ చీరలు అనేక ఈవెంట్లు పార్టీలలో ధరించి దానికి బోలెడంత మార్కెట్ సృష్టించారు. సవ్య సాటి ముఖర్జీ జె.జె వాలయ వంటి ప్రముఖ డిజైనర్లు ఫ్యాబ్రిక్ ను క్లాసిక్ గా మార్చారు . ఏ రకం వస్త్రాలకైనా లేసులు జోడించి స్వరోస్కీ నెక్లెస్ లు బీడ్స్ ముత్యాలు వంటి అలంకరణ తో ఫ్యాషన్ లేస్ ను ముందువరసలో నిలబెట్టారు.

    లేసుతో గ్రేస్ ఫుల్ లుక్

    లేసు ఒక ఫ్యాషనబుల్ ఆర్ట్. ఏ దుస్తులపైనా లేసు అల్లికల్ని జోడించినా సాదాసీదాగా అన్ ఫినిష్డ్ గా ఉన్న ఆ దుస్తుల రూపం మారిపోతుంది. మన దేశంలో…

  • చిన్నతనంలో ప్రతి రోజూ పాలు తాగే పిల్లలకు వయసు ఎదిగేకొద్దీ ఆరోగ్యంగా వుంటారు. చిన్న వయసులో తాగిన పాలు తర్వాత సంవత్సరాల్లో అనేక లాభదాయకమైన ఫలితాలు ఇస్తుంటాయి. వయసు మీదపడినా వేగంగా నడవగలుగుతారు. ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోగలరు. ఫ్యాక్చర్ల అవకాశం తగ్గుతుంది. ఇవన్నీ బాగానే వుంటాయి మరి పాలు చూస్తేనే పరుగెత్తి పారిపోయే పిల్లల సంగతి ఏమిటి? పాలను ఏదైనా ఫ్లేవర్ లతో కలిపి అయినా తాగించగలగాలి. ఉదయం సాయంత్రం తాగితే చాలు. రోజుకు రెండు కప్పుల పాలు చాలంటారు డాక్టర్లు. ఆ మాత్రం పాలు పిలల్లకు కావలిసిన విటమిన్ డి ఐరన్ అందజేస్తాయి. ఈ రెండూ వారై ఆరోగ్యానికి అత్యంత కీలకమైన ఇరాన్ న్యూరాలజికల్;అభివృద్ధికి దోహదపడితే విటమిన్ డి శ్వాసకు సంబంధించిన అనారోగ్యాన్ని దగ్గరకు రానీయదు. కనుక పిలల్ల చేత ఒక రెండు కప్పుల పాలు తాగించగలిగితే చాలు. వాళ్ళ మేలుకల రక్షణకు ఎదుగుదలకు పాలు చాలా అవసరం .

    రెండు కప్పులు తాగిస్తే చాలు

    చిన్నతనంలో ప్రతి రోజూ పాలు తాగే పిల్లలకు వయసు ఎదిగేకొద్దీ ఆరోగ్యంగా వుంటారు. చిన్న వయసులో తాగిన  పాలు తర్వాత సంవత్సరాల్లో అనేక లాభదాయకమైన ఫలితాలు ఇస్తుంటాయి.…