• చందమామ వంటి మొహం కళ్ళు నవ్వే పెదవులతో కాజల్ టాలీవుడ్ చందమామే. ఆమె మాటల్లో ఎంతో వినయమ ఉట్టిపడుతూ ఉంటుంది. క్యారెక్టర్ల ఎంపిక ఎలా చేసుకుంటారు అని అడిగితే మొదటిసారి కధ వినగానే మంచి కధ అని అర్ధమైపోతుంది. ఖచ్చితంగా సక్సెస్ అని అనిపిస్తుంది ఇప్పుడ్ఫు ఖైదీ నెంబర్ 150 కూడా అంతే. ఈ సినిమాలో అవకాశం రావటమే ఓ అదృష్టం. నేను చేసిన సినిమాలన్నీ వసూళ్ల పరంగా ఆలా ఉంచితే నా పాత్రలన్నీ విమర్శకుల మెప్పు పొందినవే. అంటుంది కాజల్. ప్రతి కథనీ ప్రతి పాత్రనీ ఛాలెంజింగ్ గా తీసుకుని హార్డ్ వర్క్ చేస్తాను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనీ వుంది. యాక్షన్ మూవీ అయితే మాత్రం నాకు పండగే. కాకపోతే డైరెక్టర్ ను ఫాలో అవటం నాకు అలవాటు. మంచి ఐడియా లు వస్తే ఆయనతో చెప్పటం వరకే నా పని. అంతే గాని నా పాత్ర గురించి ఫలానా రకంగానే వుండాలనే పట్టింపులు ఎప్పుడూ లేదు. పైగా సినిమాల్లో నటించటం రన్నింగ్ రేస్ కాదు. వెనకా ముందు అవటానికి. నా దగ్గరకు వచ్చిన అవకాశాన్ని నేను మిస్ అవను . నా శక్తీ మేరకు నేను నటించగలను . ఛాలెంజింగ్ తీసుకుని హోమ్ వర్క్ చేసి మరీ పర్ఫెక్షన్ సాధించాలనుకుంటాను. ఇప్పుడు వస్తున్నా ఖైదీ నెంబర్ 150 పైన నాకెంతో నమ్మకం చిరంజీవి గారితో అవకాశం రావటం. ముఖ్యంగా ఓ పాటలో నా కాస్ట్యూమ్ అయితే ఇంతవరకు నేనెప్పుడూ అంత డిఫెరెంట్ గా లేనంటోంది.

    ఆ అవకాశం రావటమే అదృష్టం

    చందమామ వంటి మొహం కళ్ళు నవ్వే పెదవులతో కాజల్ టాలీవుడ్ చందమామే. ఆమె మాటల్లో ఎంతో వినయమ ఉట్టిపడుతూ ఉంటుంది. క్యారెక్టర్ల ఎంపిక ఎలా చేసుకుంటారు అని…

  • టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన చిట్కాలతో ఈ మొటిమలు తగ్గించవచ్చు. సమపాళ్లలో తేనే నిమ్మరసం మొటిమల పైన రాస్తే ఫలితం ఉంటుంది. నువ్వులు నీళ్లలో నాననిచ్చి నూరిముద్దగా చేసి మొటిమల పై రాసి కడిగేస్తే చాలు. ముఖానికి బంగాళా దుంప రాస్తే ఇవి మొటిమలు తగ్గించటం కాక మెరిసేలా చేస్తుంది. మొటిమలు ఎక్కువగా ఉన్న చోట లవంగాలు నీళ్లు లేదా పాలతో కలిపి మెత్తగా నూరి అప్లయ్ చేసి పదినిమిషాలు పాటు ఆరనిచ్చి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. పూదీనా ఆకులు నూరి ఆ పేస్ట్ ను మొటిమల పై రాసినా మార్పు కనిపిస్తుంది. పుదీనా తో చర్మానికి చల్లదనాన్ని పాక్ లాగా అప్లయ్ చేసినా మంచిదే. ఎండా బెట్టిన తులసి ఆకులు షాపుల్లో దొరుకుతాయి. దాన్ని నీళ్లలో కలిపి పేస్ట్ లాగ చేసిన రాసినా మొటిమలు తగ్గుతాయి. బజార్లో దొరికే ఖరీదైన మందుల కంటే ఈ సహజమైన పద్ధతులే ఫలితాలు ఇస్తాయి.

    మొటిమలు ఈ పూతలతో తగ్గుతాయి

    టీనేజర్ల పెద్ద సమస్య మొటిమలు జిడ్డు చర్మ తత్త్వం ఉంటే చాలు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వేప తులసి లవంగాలు పుదీనా వంటి వాటిలో చాలా సహజమైన…

  • నీహారికా ,మా అమ్మ తనని తాను ట్రీట్ చేసుకోదు. తన జీవితం తనది కానట్లుంటుంది. నేనెలా వుండాలా అని భయమేస్తోంది అన్నావు. నీ మనసులోకి సరైన సందేహం వచ్చింది. నువ్వు 16 ఏళ్ళ అమ్మాయిని ఇప్పుడే తెలుసుకో చాలా మంది ఆడవాళ్లు చేసే పొరపాటు ఇది. అందరి అవసరాలు చూస్తారు. అందరికీ కావలిసినవి అమరుస్తారు. వ్యక్తిగత అవసరాలు మరచి పోతారు. చివరికి భోజనం కూడా ఇంట్లో అందరి భోజనాలు స్థిరపెట్టటం సరే. కానీ ఇల్లాలు తన భోజన సమయాన్ని ప్రత్యేకంగా చూసుకోకపోతే నష్టం ఎవరికి ? హడావుడి లేకుండా తాపీగా తినాలి. తినేది ఆస్వాదించాలి. మంచి నీళ్ళైనా ఇతర పానీయాలైన కొద్దిగా విశ్రాంతిగా తీసుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువు అందరికీ షేర్ చేయాలి. చివరకి తన మనుషులతో ఆలోచనలకు కూడా జీవితం ఎవరికైనా ఒకటే నీహారికా. దాన్ని ఆసాంతం అనుభవించాలి. త్యాగాలతో వ్యక్తిగతాన్ని విస్మరించవద్దు. ఇది మీ అమ్మ గురించే కాదు. ఈ ప్రపంచంలోని ఇళ్ల వాళ్లందరికీ వర్తిస్తుంది. వాళ్ళ శరీరం అందంగా ఉంచుకోవాలి. ఎన్నేళ్లొచ్చినా సౌందర్యం ఆరోగ్యం ఆలోచనలు అన్నీ ఫ్రెష్ గా ఉంచుకోవాలి. సమయం మిగుల్చుకోవాలి. మనసు నిండేంత బాగా చదువుకోవాలి. ప్రతి ఉదయాన్నే ప్రేమగా ఆహ్వానించేంత ఆనందంగా ఉండాలి. మనకి దొరికిన జీవితం సూర్యోదయం సూర్యాస్తమయం మధ్యని గడిచే మాములు గంటలే. కానీ దాన్ని అలంకరించుకునే బాధ్యత ఎవరిది చెప్పు. ఎవరికివాళ్ళే ప్రతి నిమిషాన్నీ చేతుల్లో పదిలంగా పట్టుకుని పిసినారి లాగా ఆ నిమిషాన్ని ఖర్చు చేయాలి. ఒక్క క్షణం గుప్పెట్లోనుంచి జారినా తిరిగొస్తుందా ?

    ప్రతి క్షణమూ విలువైందీ

    నీహారికా , మా అమ్మ తనని తాను ట్రీట్ చేసుకోదు. తన జీవితం తనది కానట్లుంటుంది. నేనెలా వుండాలా అని భయమేస్తోంది అన్నావు. నీ మనసులోకి సరైన…

  • అనుపమా పరమేశ్వరన్ శర్వానంద్ తో కలిసి నటించిన శతమానం భవతి విడుదలవుతోంది. రెండు స్టార్ హీరోస్ నటిస్తున్న సినిమాల మధ్యన వున్నా ఈ సినిమాకు మంచిటాక్ ముందే వచ్చేసింది. అఆ లో సమంత హీరోయిన్ గా ఉండగా సెకండ్ హీరోయిన్ గా ఉన్న అనుపమ కొద్దిపాటి డైలాగ్స్ తోనే ఆమె పాప్యులర్ అయింది. మలయాళంలో అనుపమ హీరోయిన్ గా చేసిన ప్రేమమ్ గొప్పహిట్ . ఆ చిత్రం రీమేక్ లో కూడా నాఉపమా మాతృక తో చేసిన పాత్రనే నటించింది. అదీ హిట్. ఫ్రెష్ గా తాజా పువ్వులాగా ఉన్న అనుపమా కొత్త మంచి ఆఫర్ దక్కించుకుంది. రామ్ చరణ్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్నా సినిమాలో అనుపమ హీరోయిన్ గా వస్తోందని సమాచారం. ఇదే నిజమైతే అనుపమ స్టార్ హీరోయిన్ల జాబితాలో లోకి చేరిపోయినట్లే. ఈ కేరళ అమ్మాయికి తెలుగు పరిశ్రమ నుంచి ఆహ్వానం పలికినట్లే.

    స్టార్ హీరోయిన్ల జాబితాలో అనుపమా పరమేశ్వరన్

    అనుపమా పరమేశ్వరన్ శర్వానంద్ తో కలిసి నటించిన శతమానం భవతి విడుదలవుతోంది. రెండు స్టార్ హీరోస్ నటిస్తున్న సినిమాల మధ్యన వున్నా ఈ సినిమాకు మంచిటాక్ ముందే…

  • జుట్టు చివర్ల చిట్లిపోవటం చాలా మంది సమస్య. జుట్టు కుదుళ్ళు సహజమైన తేమ తగ్గిపోతే వెంట్రుక చివర చిట్లిపోతూ ఉంటుంది. తరచుగా హేయిర్ స్ప్రే లు జెల్స్ హేయిర్ కలర్ వాడటం వల్ల వచ్చే సమస్య ఇది. రెగ్యులర్ గా వాడే నూనెలో ఆముదం ఆలివ్ లేదా బాదం నూనె కలిపి మాడు నుంచి కోణాలకు అంటేలాగా రాయాలి. ఈ నూనెని వెచ్చ జేసి మస్సాజ్ చేసి హేయిర్ కాప్ పెట్టుకుని పడుకుని తెల్లరాక మైల్డ్ షాంపూ తో జుట్టు శుభ్రం చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ తేనె పెరుగు కలిపి కూడా హెయిర్ మాస్క్ వేసుకున్నా ఫలితం ఉంటుంది. పండిన బొప్పాయి గుజ్జుతో పెరుగు కలిపి జుట్టుకు వత్తుగా పట్టించి అరగంటాగి స్నానం చేసేయచ్చు.అరకప్పు మినపప్పు టేబుల్ స్పూన్ మెంతులు పొడి చేసి పెరుగు కలిపి తలకు పట్టించి ఆరనిచ్చి తలస్నానం చేయచ్చు. ప్రతిదానికి పెరుగు బేస్ గా ఉంచుకోవాలి. పెరుగుతో మిగతావి కలిపి హేయిర్ కి బాగా పట్టించి వాష్ చేయాలి . సాధారణంగా జుట్టు ఈ చిట్కాల తోనే చక్కగా పెరుగు తోంది. చివర్లు చిట్లటం పోతుంది. ఇవన్నీ ఇంట్లో దొరికే వస్తువులే కనుక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏదీ వుండదు.

    జుట్టు చివర్లు చిట్లుతున్నాయా

    జుట్టు చివర్ల చిట్లిపోవటం చాలా మంది సమస్య. జుట్టు కుదుళ్ళు సహజమైన తేమ తగ్గిపోతే వెంట్రుక చివర చిట్లిపోతూ ఉంటుంది. తరచుగా హేయిర్ స్ప్రే లు జెల్స్…

  • ఎంతో ఇష్టంగా కొనుకున్న దుస్తుల పైన మరకలు పడితే కష్టంగా ఉంటుంది. ఒక్కసారి చిన్న మరకకే అందమైన డ్రెస్ వేసుకోవాలనిపించదు. ఇప్పుడు వాటిని వదిలించే మార్గాలుకోనున్నాయి. దుస్తుల పైన గ్రీజు మరకలు పడితే సూడ నీళ్లలో నాన్ననిచ్చి ఉతికితే మరకలు మాయం అవుతాయి. అదే నూనె మరకైతే దానిపైన పౌడర్ చల్లటమో సుద్ద ముక్కతో రుద్దటమో చేయాలి. ఆరిన తర్వాత గోరు వెచ్చని నీళ్లతో నానబెట్టి ఉతికితే నూనె మరకలుండవు. అలాగే కాఫీ తాగాక మరక పడితే ఆమరకలను బేకింగ్ షోడా వేసిన నీళ్లలో నానబెట్టి ఉతకాలి. చెమట మరకలకు నిమ్మరసం మంచిగా పనిచేస్తుంది.లేదా నిమ్మచెక్కను చెమట వాసన వచ్చే సాక్స్ పైన లేదా దుస్తుల పైన రుద్ది కాసేపాగి ఉతికేస్తే పోతాయి. ఇంకో మరకలు పాలతో రుద్దితే పోతాయి. మేకప్ చేసుకుంటునప్పుడు ఫౌండేషన్ లు ఒలకటం పౌడర్లు పడటం వల్ల ఏర్పడిన మారకాలని షేవింగ్ క్రీం తో రుద్దేస్తే పోతాయి. రక్తం మరకలు పడితే హైడ్రోజన్ పెరాక్సిడ్ వేసి రుద్దితే పోతాయి.

    మరకలు ఇలా వదిలించచ్చు

    ఎంతో ఇష్టంగా కొనుకున్న దుస్తుల పైన మరకలు పడితే కష్టంగా ఉంటుంది. ఒక్కసారి చిన్న మరకకే అందమైన డ్రెస్ వేసుకోవాలనిపించదు. ఇప్పుడు వాటిని వదిలించే మార్గాలుకోనున్నాయి. దుస్తుల…

  • 74 వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ ఏంజెల్స్ లో వేడుకగా జరిగాయి. ఆ వేదిక పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంగారు వర్గపు గౌనుతో ఎంతో అందంగా మెరిసిపోయింది. గోల్డెన్ గ్లోబ్స్ 2017 అవార్డుల ఫంక్షన్ కు టీవీ కేటగిరీ లో అవార్డులు అందజేసేందుకు గానూ ప్రియాంకను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎమ్మా స్టోన్ నటాలీ ఫోర్ట్ మన్ వంటి స్టార్స్ తో సమానంగా ఈమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించింది. డి వాకింగ్ రెడ్ స్టార్ చిత్రంలో నటించిన జెఫ్రీ డీన్ మోర్గాన్ తో కలిసి బెస్ట్ టీవీ యాక్టర్ గా ఎంపికైన బిల్లీ జాజ్ థార్న టన్ కు అవార్డు అందజేసింది. హెడ్ లైన్ స్టార్ ఆఫ్ అమెరికన్ నెట్ వర్క్ షో క్వాంటికో హోరీ లో ప్రియాంక ఈ అరుదైన గౌరవం పొందింది. గత సంవత్సరం ఆస్కార్ ఎమ్మీ అవార్డుల ప్రధానం కోసం ఆహ్వానం అందుకున్న ప్రియాంక తాజాగా ఇంటెర్నేషనల్ అవార్డుకు హాజరవటం ఇది మూడోసారి. గోల్డెన్ గ్లోబ్ లో ఇది మొదటిసారి. ఈమె నటించిన బే వాచ్ హాలీవుడ్ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది. .

    గోల్డెన్ గ్లోబ్స్ ఫంక్షన్ లో ప్రియాంక

    74 వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు లాస్ ఏంజెల్స్ లో వేడుకగా జరిగాయి. ఆ వేదిక పైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంగారు వర్గపు గౌనుతో…

  • చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి . నేరుగా సూర్యకిరణాలు తగలకుండా శ్రద్ద తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మేకప్ తొలగించుకోకుండా నిద్రపోకూడదు. కనీసం రెండు సార్లు ముఖం అతిచల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. చర్మం ఊపిరితలం ఎప్పుడూ జిడ్డు లేకుండా వుండాలి. క్లార్ ఫోక్స్ ఇన్ఫలమేటరీ ప్రక్రియల లేకుండా చూసుకోవటం అవసరం. వారంలో రెండు సార్లు స్క్రబ్ చేస్తే మృత కణాలు పోతాయి. టేబుల్ స్పూన్ పంచదార లేదా ఓట్ మీల్ తో స్క్రబ్ చేయచ్చు. క్లే మాస్క్ తో మృత కణాలు పోతాయి. మొటిమలు డ్రై అవుతాయి. బ్లాక్ హెడ్స్ సులువుగా తీసేయచ్చు. చర్మంలోని అదనపు నూనెను జిడ్డును ఈ మాస్క్ లు పీల్చేస్తాయి. పోర్స్ ష్రింక్ అయి చర్మం టెక్చర్ మెరుగుపడుతుంది. పెరుగు అవకాడో విటమిన్ సి వంటివి చర్మం కొలెజాన్ రూపొందించటానికి సహకరించి చర్మం టెక్చర్ ను మెరుగుపరుస్తాయి . తేలికైన బేబీ ఆయిల్ ను చేతిలోకి తీసుకుని మెల్లగా మసాజ్ చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.

    చర్మం కాంతి మెరుగుపరిచేందుకు ఇవన్నీ

    చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు…

  • మ్యానిక్యూర్ చేయించుకున్నాక ఆ ప్రభావం ఎక్కువ రోజులు ఉండటం లేదని చాలా మంది అంటుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలతో వేళ్ళ గోళ్లు అందంగా ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ లో మించిన కాటన్ బాల్స్ తో గోళ్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. గోళ్లకు కలర్ లేకపోయినా ఇలాగె శుభ్రం చేయచ్చు. నెయిల్ పాలిష్ రెండు కోట్స్ వేయాలి. బేస్ కోట్ సాఫ్ట్ టెక్చర్ తో ఉంటే టాప్ కోట్ బాగా అమరుతుంది. టాప్ కోట్ షైనీ గా ఉండాలి. షిమ్మరీ ఫినిష్ గల పాలిష్ లు ఎక్కువ రోజులు ఉంటాయి. పియర్ లేసేంట్ ఫార్ములాలు నాణ్యమైన మైకా పార్టికల్స్ కలవి మ్యాటిష్ ఫినిష్ తో పోల్చితే వేర్ అండ్ టేర్ తక్కువగా ఉంటాయి. నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు ఉండాలంటే త్వరగా డ్రై అయ్యేవి తీసుకోకూడదు. ఇవి సౌకర్యంగా ఉంటాయి కానీ ఎక్కువ రోజులు వుండవు. గోళ్లకు రెగ్యులర్ ఆయిల్ చేస్తే నెయిల్ పాలిష్ పీలప్ కాకుండా వుంటుంది. తేలికైన బేబీ ఆయిల్ తో వేళ్ళ గోళ్లు చేతులు మస్సాజ్ చేస్తే అప్పటికే మ్యానిక్యూర్ తో ఫ్రెష్ గా కనిపించే చేతులు ఈ బేబీ ఆయిల్ తో మెరుస్తూ ఉంటాయి. జిడ్డు ఉండదు కనుక అసౌకర్యంగా ఉండదు.

    మ్యానిక్యూర్ ప్రభావం వుండాలంటే

    మ్యానిక్యూర్ చేయించుకున్నాక ఆ ప్రభావం ఎక్కువ రోజులు ఉండటం లేదని చాలా మంది అంటుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలతో వేళ్ళ గోళ్లు అందంగా ఉంటాయి. నెయిల్ పాలిష్ రిమూవర్…

  • ఉద్యోగినుల సమస్యలు ఈ రెండే

    ఉద్యోగినుల సాధారణంగా ఎదుర్కునే సమస్యలు రెండే రెండు. ఒకటి నిద్ర సరిగా లేకపోవుటం  రెండవది మూత్ర సంబంధించిన ఇబ్బంది. ఇంటి పనుల ఆఫీస్ పనులతో నిరంతరం పరుగులు…

  • సౌత్ ఇండియా లో సమంతకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేనట్లే అందమైన కళ్ళు అలాల్లాంటి మెత్తని జుట్టు ఆమె అందం రహస్యాలు. ఈమె జుట్టు తో హేయిర్ స్టయిలిస్ట్ ప్రతి సినిమాకి ఒక కొత్త ప్రయోగం చేస్తూ వుంటారు. డీప్ బ్రౌనిష్ కలర్ జుట్టు ఆమె స్కిన్ టోన్ కు బాగా సూటవుతోంది. ఏ మాయ చేసావే లో కనిపించిన హేయిర్ స్టయిలే ఆమె సిగ్నేచర్ స్టయిల్. పెద్ద మార్పులు లేవు. కానీ జుట్టుతో చేసే చిన్ని చిన్ని మార్పులు ఆమె వేసుకున్న డ్రెస్ కే అందం తెస్తాయి. ఫిష్ టైల్ మోడల్ జడ అల్లకంతో అనీష్ జైన్ సృష్టించిన సన్ ఫ్లవర్ డిజైన్ కుర్తా యోగీష్ చౌదరి డిజైన్ చేసిన ఆమ్రపాలి ఇయర్ రింగ్స్ లో సమంత చాలా బావుంది. ఆమె పొడవాటి మెడ అందం అంతా కనిపిస్తుంది. అత్తారింటికి దారేది లో పొడవాటి స్ట్రెయిట్ హేయిర్ స్టయిల్ నిన్ను చూడగానే పాటలో ఆమె అద్భుతంగా వుంది. వై బస్ స్టయిల్ లో పైకి వేసిన చక్కని ముడితో సమంత ఏ డ్రెస్ లో అయినా చాలా చక్కగా వుంది . ఇవన్నీ హీరోయిన్స్ జుట్టు చీరకట్టు మేకప్ తో తెర వెనుక స్టయిలిస్ట్ లు చేసే మాయాజాలం. అమ్మాయిల కూడా వాళ్ళ మొహం తీరుకు తగ్గ హేయిర్ స్టయిల్ ఎంచుకోవాలి. సమంత వేసుకుంది కాదు.

    సమంత అందాన్ని పెంచిన హేయిర్ స్టయిల్స్

    సౌత్ ఇండియా లో సమంతకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేనట్లే అందమైన కళ్ళు అలాల్లాంటి మెత్తని జుట్టు ఆమె అందం రహస్యాలు. ఈమె జుట్టు తో హేయిర్…

  • మన పిల్లలు ,మనకెప్పుడూ ప్రత్యేకమే. అంత మాత్రం చేత వారికి ఎవ్వళ్లతో కలవనీయకుండా బంధు మిత్రులతో కూడా సత్సంబంధాలు పెరగనీయకుండా వాళ్లకు ప్రత్యేక లోకం సృష్టించి ఇవ్వటం చాలా తప్పంటున్నారు సైకాలజిస్టులు. ఇలా చేయటం వల్లనే వాళ్లకు పదిమందిలో ఎలా మెలగాలో తెలియకుండా పోతుంది. ఎంతసేపు పిలల్లను నాలుగు గోడలకే పరిమితం చేయటం సరికాదు. వాళ్ళు తోటి పిల్లలతో సరాదాగా ఆటలాడాలి. గెలుపు ఓటముల సవాళ్లు తెలియాలి. అందరితో కలిసిపోవడం నేర్చుకోవాలి. నెలకొకసారైనా పిల్లల స్నేహితులను ఇళ్లకు పిలిచి వాళ్ళతో వాళ్ళ తల్లి తండ్రులతో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోవాలి. పిల్లలతో వాళ్ళ స్నేహితులు ముచ్చట్లు తెలుసుకోవాలి. వాళ్ళ స్నేహితుల కోసం స్నాక్స్ చేసి ఇవ్వాలి. పిల్లల స్నేహితులతో ఆస్తులు అంతస్థుల గురించి అడగద్దు. సామాజికంగా అధికంగా వాళ్ళ కుటుంబం ఏ స్థితి లో ఉన్న వాళ్ళు మన పిలల్లకు స్నేహితులని ఎప్పుడూ మరచిపోవద్దు. అలాగే మన పిలల్ల మనసులో కూడా స్నేహాల మధ్య బాంధవ్యం మాత్రమే నిలిచివుండాలి కాని వాళ్ళ స్థితిగతులు కాదు. ఆ వైపుగా పిలల్లకు చక్కగా అర్ధమయేలా వివరించాలి. నీ స్నేహితుడు నాకు విలువైన వాడుగానీ అతని కుటుంబ విషయాలు కానేకాదని పిలల్లతో గట్టిగ చెప్పాలి.

    పిల్లల్ని ప్రత్యేకంగా పెంచటం కూడా పొరపాటే

    మన పిల్లలు ,మనకెప్పుడూ ప్రత్యేకమే. అంత మాత్రం చేత వారికి ఎవ్వళ్లతో కలవనీయకుండా బంధు మిత్రులతో కూడా సత్సంబంధాలు పెరగనీయకుండా వాళ్లకు ప్రత్యేక లోకం సృష్టించి ఇవ్వటం…

  • నీహారికా , నేను పెరుగుతున్నప్పుడు నేనడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం అమ్మా నాన్నల దగ్గర నేను తెలుసుకోలేదు. నాలాంటి అమ్మాయిలంతా నాలాగే శరీరానికి సంబంధించిన విషయాల్లో అజ్ఞానంతో వుంటారు కనుకనే వాళ్ళు సులువుగా మోసపోతారని నువ్వన్నమాట మనసుని గాయం చేస్తోంది. నిజమే. పదేళ్ల వయసు వచ్చాక శరీరంలో చోటు చేసుకునే మార్పులు అకస్మాత్తుగా ఆడ మగ పిల్లల మధ్య కలిగే ఆకర్షణ పిల్లల మనసు అల్లకల్లోలం చేస్తాయి. సరైన లైంగిక ఒక్కటే వాళ్ళని ఆ స్థితి నుంచి బయట పడేస్తుంది భయాలు పోగొడుతుంది. లైంగిక విద్య గురించి అవగాహనా కల్పిస్తే ప్రయోగాలు చేస్తారనే మాట కేవలం అపోహ. మన సమాజం లోని విలువల్ని నేర్పేదే ఈ విద్య. మనం భోజనం చేయటానికీ రోడ్డు పై నడిచేందుకు కొన్ని విధులున్నాయి. శృంగారం కూడా ఇలాంటిదే ఇద్దరు వ్యక్తులు పెళ్లితో ఒక్కటై ప్రేమనే గోడల పై ఏకాంతంగా ఆస్వాదించే మాధుర్యమనీ పిల్లలు ఇంకో రకంగా ప్రవర్తించి జీవితం పాడు చేసుకోవద్దనీ తమ శరీరం విషయంలో శ్రద్ధగా ఉండమని చెడ్డ స్పర్శ ని దూరంగా వుంచమనీ ప్రేమకి ఆకర్షనికీ మధ్య వున్నతేడానీ పదే పదే పిలల్లకు చెప్పుకోవాలి. తల్లితండ్రులే పిల్లల గురువులుగా వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పి హెచ్చరించాలి. వాళ్ళు ప్రతిదశ లోనూ తల్లితండ్రుల దగ్గర తమ సమస్యలకు చెప్పుకునేంత స్వేచ్ఛ తల్లితండ్రులు ఇవ్వాలి. అలా పిల్లలకు కాపాడుకోకపోతే కష్టం ఎవరికీ చెప్పు.

    పిల్లలకి చెప్పకపోవటం తప్పే కదా

    నీహారికా , నేను పెరుగుతున్నప్పుడు నేనడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం అమ్మా నాన్నల దగ్గర నేను తెలుసుకోలేదు. నాలాంటి అమ్మాయిలంతా నాలాగే శరీరానికి సంబంధించిన  విషయాల్లో…

  • కొన్ని పదార్ధాలను పేర్లను బట్టి నమ్ముతారా ? దానిలోని కంటెంట్ ను బట్టి వాడతారా అర్ధం కాదు. ఈ మధ్య కాలంలో పెద్ద హోటల్స్ లో బ్రౌన్ షుగర్ తో చేసిన పదార్ధాల లిస్ట్ కనిపిస్తోంది అలాగే కేకులు పేస్ట్రీ లు డిజర్ట్ లు కాఫీ లు కూడా బ్రౌన్ షుగర్ వాడటం ఎక్కువై ఫ్యాషనై పోతుంది. ఇలా వాడేవారికి అసలు వైట్ షుగర్ కు బ్రౌన్ షుగర్ కు మధ్య తేడా ఏవిటో కనీసం ఏ గుగూల్ సెర్చో చేసి తెలుసుకుంటునారా ? తెల్లని పంచదార మొలాసిస్ ను తొలగించి తయారుచేస్తారు . మళ్ళీ చక్కెర మొలాసిస్ ను కలిపేసి బ్రౌన్ షుగర్ చేస్తారు. ఒక టీ స్పూన్ తెల్లని పంచదార లో 16 క్యాలరీలు ఉంటే అదే స్పూన్ బ్రౌన్ షుగర్ లో 17 క్యాలరీలున్నాయి. ఇక పోషక పరంగా చుస్తే రెండూ ఒకటే. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు. బ్రౌన్ రైస్ మంచిదన్నారు కనుక బ్రౌన్ షుగర్ కూడా మంచిదనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారో ఏమో.. నిజానికి అసలు ఏ పంచదార వద్దనీ పంచదార లీని జీవితాన్ని జీవించమనీ అధ్యయనాలు చెపుతున్నాయి.

    బ్రౌన్ షుగర్ ఎందుకు మంచిదంటారు ?

    కొన్ని పదార్ధాలను పేర్లను బట్టి నమ్ముతారా ? దానిలోని కంటెంట్ ను బట్టి వాడతారా  అర్ధం కాదు. ఈ మధ్య కాలంలో పెద్ద హోటల్స్ లో బ్రౌన్…

  • మేం ఇంటి పనులు చేసున్నాం. ఎంతో శక్తి ఖర్చవుతోంది. శరీరం ఎంతో శ్రమ కు గురవుతోంది. కనుక వ్యాయామాలు అక్కర్లేదనుకుంటారు. ఇలా చేస్తే కొవ్వు కరిగిపోతుందనే భ్రమ తోనే ఉంటారు. ఇల్లు దుమ్ము దులిపితేనూ వ్యాక్యూమ్ క్లీన్ చేస్తేనూ ఇంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతి కందిన వందలాది పనులు చేస్తుంటేనూ ఎక్సర్ సైజ్ చేసినట్టు కాదంటారు నిపుణులు . ఈ ఇంటి పనులన్నీ వారానికి 150 నిమిషాల తగు మాత్రం వ్యాయామం తో సాటిరావు. తాము చేసే ఈ పద్ధతి లేని పనుల వల్ల కొవ్వు కరిగి శరీరం స్లిమ్ గా అవుతోందని ఊహించటం. శరీరం యధాతధంగా ఎప్పటిలా స్పూను కొవ్వు కూడా కరగకుండా ఉండటం చూసి దిగులుపడటం మామూలే. సైక్లింగ్ వాకింగ్ రన్నింగ్ తదితర వ్యాయామాలు పోలిస్తే ఇంటిపని ఎక్సర్ సైజ్ కిందకి రానే రాదు . ఉదాహరణకు 30 నిమిషాల వ్యాక్యూమింగ్ వల్ల 130 క్యాలరీలు ఖర్చయితే 30 నిముషాల సైక్లింగ్ వల్ల 400 క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇంటి పనులు శారీరిక చురుకుదనం ఇస్తాయి. కానీ వ్యాయామాలకు సమానం రావు.

    ఇంటిపని వ్యాయామం కానే కాదు

    మేం ఇంటి పనులు చేసున్నాం. ఎంతో శక్తి  ఖర్చవుతోంది. శరీరం  ఎంతో శ్రమ కు గురవుతోంది. కనుక వ్యాయామాలు అక్కర్లేదనుకుంటారు. ఇలా చేస్తే కొవ్వు కరిగిపోతుందనే భ్రమ…

  • పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన ఎదుగుదల కోసం నెయిల్ ప్లేట్ ను కొంత మోతాదులో ఫ్లెక్సిబిలిటీ తేమ అవసరం. కఠినమైన రసాయనాలతో నెయిల్ ప్లేట్స్ చిట్టి గోళ్లు విరిగిపోతాయి. కాలి గోళ్లు ఎపుడూ ఓంపుగా కాకుండా స్ట్రయిట్ లైన్ లో కట్ చేయాలి. సరిగ్గా కట్ చేయకపోతే గాయపడటం లేదా షూ ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే కాలిగోళ్ళు మూలల్లో విరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల ఇన్ గ్రోన్ నెయిల్స్ వచ్చే అవకాశం వుంది గోళ్లు కొంచెం పెరగగానే కట్ చేసేస్తూ ఉండాలి.లేకపోతే దేనికోదాని తగిలి గాయపడతాయి. అలాగే చేతి గోళ్ళకైనా కాళీ గోళ్ళకైనా పెయింట్ వేసాక చిప్ అవుతుంటే పెయింట్ పొరపాటున కూడా స్క్రాప్ చేయద్దు. నెయిల్ పాలిష్ రిమూవర్ వాడాలి. డార్క్ నెయిల్ పాలిష్ ను పీల్ చేసినా చిప్ అయినా అసహ్యంగా కనపడతాయి. క్లియర్ టాప్ కోట్ పాలిష్ లేదా స్కిన్ కలర్ పాలిష్ వేసినా అందంగానే ఉంటాయి.

    స్ట్రెయిట్ లైన్ కట్ చేస్తేనే బావుంటాయి

    పాదాల అందాన్ని పెంచటంలో గోళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ పర్ ఫెక్ట్ గా ఉంచుకోవాలి. గోళ్లు  ప్రోటీన్ కెరాటిన్ తో తయారవుతాయి. ఆరోగ్యవంతమైన…

  • అందమైన చీరల్లోకి కనిపిస్తూ ఉంటుంది విద్యా బాలన్. కేన్స్ రెడ్ కార్పెట్ పైన విద్య తన సకల వస్త్ర కళలను ప్రదర్శించింది. సవ్య సాచి రూపొందించిన అందమైన చీరలకు అందం విద్యా బాలన్ వస్త్ర ధారణ లో యాక్సిసరీస్ లో తనదైన ప్రత్యేకత నిలుపుకునే విద్యా బాలన్. ఇష్టమైన డ్రెస్ చక్కని చీరలే. ఆమెకు గౌన్లు కుర్తీలు షార్ట్ కట్స్ అనార్కలీలు అస్సలు నప్ప వనే మనకే తెలిసిపోతుంది. కానీ చీరల్లోకి ఎందుకామే బావుంటుందీ అంటే అసలు చీరల క్వాలిటీ అంచులు పమిట కొంగులు కుచ్చిళ్ళు కట్టే తీరు ఇవన్నీ కలిసి అసలు ప్రపంచంలోనే అత్యంత క్లవర్ గార్మెంట్ చీర ఒక్కటే కనుక. అందుకే దీన్ని ఎంచుకొంటానంటోంది విద్యా. చీరల అంచులు రివర్స్ ఆఫ్ లైట్ లాగా పనిచేస్తాయి. ఇవి నాజూకు తనాన్ని ఎత్తునూ అందాన్ని తెలివిగా నిర్దేశిస్తాయి. ఒక్కసారి వీటికి జోడీగా వుండే యాక్సెసరీస్ కూడా చీరకి న్యూలుక్ ఇచ్చి మరింత అందాన్నిస్తాయి. విద్యాకయితే చిన్న రంగులు మరీ పెద్దవికాని నెక్లెస్ లు చుంకీ బ్యాంగిల్స్ బ్రేస్ లెట్స్ వదిలేసిన జుట్టు లేదా పాతకాలంలో లాగా చక్కని జడ అన్నీ కలిపి ఆమెను సంప్రదాయ సుందరిని చేసేస్తాయి. చీర చేసే మ్యాజిక్ ఇదే.

    విద్యాబాలన్ కిది పర్ఫెక్ట్ డ్రెస్

    అందమైన చీరల్లోకి కనిపిస్తూ ఉంటుంది విద్యా బాలన్. కేన్స్ రెడ్ కార్పెట్ పైన విద్య తన సకల వస్త్ర కళలను ప్రదర్శించింది. సవ్య సాచి రూపొందించిన అందమైన…

  • సహజమైన ముత్యాల గురించి కవుల కవితలల్లారు. అందమైన యువతి పళ్ళను ముత్యాలతో పోల్చారు. నవ్వులను ముత్యాల జల్లుతో పోల్చారు. ఈ అద్భుతమైన అత్యంత విలువైన ముత్యాలు నత్త గుల్లల్లోని మృదువైన టిష్యు లోపల ఉత్పత్తి అయ్యే గట్టి గింజల్లాంటివి. క్రిస్టలైన్ రూపంలో కాల్షియం కార్బోనేట్ తో రూపొందుతాయి. మిగతా జెమ్స్ కంటే ఇవి ఎందుకు విభిన్నమైనవీ అంటే వీటిని అమ్మకానికి ముందు మిగతా వాటిలాగా ఏ షాపింగ్ లు చికిత్సలూ అవసరం లేదు. సముద్రపు లోతుల్లో జీవరాసుల ద్వారా ఇవి పరిపూర్ణనత తో తయారవుతారు. మెరుపు లీనే ఈ గుండ్రని తెల్లని విలువైన స్వచ్ఛమని ముత్యాలను ధరించటం సోషల్ స్టేటస్ ఎన్నో వందల సంవత్సరాలుగా ముత్యాల అన్వేషణ సాగుతోంది. ముత్యాల ఆల్చిప్పలను టన్నుల కొద్దీ సేకరిస్తే అందులో ఏ మూడో నాలుగో ఆల్చిప్పల్లో సరైన ముత్యాలు సిద్ధంగా ఉంటాయి. అందుకే స్వచ్ఛమైన ముత్యాల ఖరీదు ఎక్కువ. కల్చర్ ముత్యాలు వచ్చేదాకా ఇదే ప్రక్రియ. సహజ పరిస్థితిలో ముత్యపు చిప్పల్లోకి ఇరిటెంట్ మార్గం చూసుకుంటే దానికి స్పందన ఆస్టర్ మృదువైన క్రిస్టలైన్ పదార్ధం నేకేడ్ ను విడుదల చేయటం ఆరంభిస్తుంది. కొద్దీ సమయంలో ఇది సరైన మెరుపు లీనే ముత్యం అవుతోంది. ఇదే విలువైన ముత్యం కల్చర్ ముత్యాల కధ ఇంకోసారి.

    మంచి ముత్యం ఇలా వస్తుంది

    సహజమైన ముత్యాల గురించి కవుల కవితలల్లారు. అందమైన యువతి పళ్ళను ముత్యాలతో పోల్చారు. నవ్వులను ముత్యాల జల్లుతో పోల్చారు. ఈ అద్భుతమైన అత్యంత విలువైన ముత్యాలు నత్త…

  • ద్రాక్ష పండ్లు రోజు తింటే వయస్సు వల్ల కలిగే లక్షణాలు దూరంగా ఉంచవచ్చునని పరిశోధనలు చెపుతున్నాయి. ద్రాక్ష లో ఐరన్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తేలిక రంగులో వున్న ద్రాక్ష మాత్రమే ఐరన్ స్థాయిని పెంచుతుంది. డార్క్ గ్రేప్స్ వల్ల ఈ ప్రయోజనం దక్కదు. ఇది ఇలా ఉంచితే ద్రాక్ష లో లెక్క లేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ద్రాక్ష రక్తలో నిట్రిక్ ఆక్సాయిడ స్థాయి ని పెంచుతుంది. బ్లడ్ క్లాట్స్ అరికట్టడంలో సహకరిస్తాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్స్ నివారించ వచ్చు. యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కనుక హానికరమైన కొలెస్ట్రాల్ ను తగ్గించ గలవు. లాక్సిటివ్ ఎక్కువగా వుండే ద్రాక్ష పండ్లు మలబద్దకాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. అజీర్ణం, ఉదరం ఇరిటేషన్ నుంచి రక్షిస్తాయి. పర్పుల్ గ్రేప్ జ్యూస్ బ్రెస్ట్ కాన్సర్ ను అరికట్టే గుణం వుందని పరిశోధనలు చెపుతున్నాయి. యాంటి ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్లు, ఖనిజాలు ఇంకెన్నో విటమిన్లు గల ద్రాక్ష రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయగలదు.

    ఆరోగ్య కారకం ద్రాక్ష

    ద్రాక్ష పండ్లు రోజు తింటే వయస్సు వల్ల కలిగే లక్షణాలు దూరంగా ఉంచవచ్చునని పరిశోధనలు చెపుతున్నాయి. ద్రాక్ష లో ఐరన్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే…

  • Donna Ferrato గృహ హింస పైన ఫోటో తీసిన మహిళా ఫోటో గ్రాఫర్ 1982 లో ఫోటో తీసింది. నాలుగు గోడలు మధ్య భర్త భార్య ఎలా వుంటారో ఎవ్వరికి తెలియదు. కానీ భర్తలు భార్యల పైన చేయిచెసుకుంటారు అన్నది జగమెరిగిన సత్యం. తన ఆధిపత్య ప్రదర్శనకు పురుషుడు స్త్రీ ని లొంగదీసు కుంటాడు. దాన్ని ఇప్పుడు గృహ హింస అంటున్నాం. ఆప్తులకు కూడా చెప్పుకోలేని గృహ హింసకు తోలి సాక్షి ఈ ఫోటో. ఆమె తనకు పరిచయం వున్న ఒక జంట ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ భర్త భార్య పైన స్నానాల గదిలో దాడి చేయడం చుసిన డోనా గబగబా హింసను క్లిక్ చేసింది. ఇదే గృహ హింస తోలి చిత్రీకరణ కానీ ఏ పత్రికల వాళ్ళు వేసుకోలేదు.1991 లో ఫోటో తీసిన 11 ఏళ్ళ తర్వాత తనే సొంతంగా తన ఫోటోలను పుస్తక రూపం లో తెచ్చింది డోనా. ఇక ఆ తర్వాత ఎన్ని వేల గృహ హింస సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయో లెక్కలు చెప్పలేము.

    గృహ హింస పై తోలి ఫోటో

    Donna Ferrato గృహ హింస పైన ఫోటో తీసిన మహిళా ఫోటో గ్రాఫర్ 1982 లో ఫోటో తీసింది. నాలుగు గోడలు మధ్య భర్త భార్య ఎలా…